ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Friday, 21 November 2014

ఏ పూలతో పూజించాలి

ఏ పూలతో పూజించాలి
శివుని బిల్వ పత్రాలను, శీత పత్రాలను, శంఖ పుష్పాలతో అర్చించినా పాపాలు నశించును. శివుని ఉమ్మెత్త పువ్వుతో పూజిస్తే పుత్రులు, తులసీ దళాలతో పూజిస్తే భక్తి, ముక్తి, అవిశపూలతో పూజిస్తే కీర్తి తెల్ల జిల్లేడుతో శతృజయం, చిన్న కలువలతో శతృనాశనం, గన్నేరు పువ్వులతో రోగనిర్మూలన, జాజిపూలతో వాహన లాభం, శమీ పత్రాలతో పూజిస్తే ముక్తి, నాగమల్లెపూలతో ఉత్తమభార్య, మంకెన పూలతో అభరణ ప్రాప్తి, అడవి మల్లెలతో స్వగృహం, దుర్వారాలతో పూజిస్తే ఆయుష్షు, వావిలి పువ్వులతో మనశ్శాంతి, శివ ప్రీతికరమైన శ్వేతాక్షతలతో పూజిస్తే మోక్షం లభిస్తాయి. ఏకబిల్వ దళం, త్రిబిల్వములతో, పంచ బిల్వములతో పరమేశ్వర ఆరాధన వల్ల సకల వాంఛలు సిద్ధిస్తాయి. సంపెంగ, సుర పొన్న, నంది వర్ధనం, ఎఱ్ఱగన్నేరు, తుమ్మిపూలతో పూజిస్తే శీఘ్ర ఫలం లభిస్తుంది. చంపక, కేతకం, మొల్ల, మొగలి, జపాకుసుమ, దిరిసెన, మాలతీ, బండిగురువింద పువ్వులు ఇవి శివార్చనకు పనికిరావు.నేరేడు, దానిమ్మ, నిమ్మ, రేగు, ఉసిరి, పనస, మామిడి, అరటి ఫలాలు శివ ప్రీతియైన వానితో లింగ స్వరూపుడైన పరమేశ్వరునికి అర్పించిన మహాఫలం కలుగును.
„సృష్టిలో ఎన్ని పుష్పాలు గలవో వానితో శివుని అర్చించిన ఎంత ఫలితం కలుగునో దానికి కోటిరెట్లు శివునికి విభూతితో అభిషేకించిన కలుగును.శివాభిషేక పంచామృతాలైన ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఈ పదార్థాలన్నీ దేహానికి పుష్టి్టని, తుష్టిని అందిస్తాయి

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML