గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 12 November 2014

శివం కల్యాణం

"శివం కల్యాణం తద్యోగాద్వా " - శివ అనే పదమునకు అర్ధమేమి? శుభము, భద్రము, శోభనము, మంగళము, కల్యాణము , శ్రేయస్సు వీటిని " శివ " అని పిలుస్తారు. కొద్ది కొద్ది తేడాలతో అనీ పర్యాయ పదములు. మీకు ఏ శుభము కావాలన్నా అది శివానుగ్రహంగానే వస్తుంది. శివానుగ్రహం కలిగితే మీ ఇంట సర్వమంగళములు జరుగుతాయి. అందుకే శంకరభగవద్పాదులు శివానందలహరిలో ఒక మాట అంటారు. " శివా! నిన్ను చూసి ఏదేదో అనుకుంటూ ఉంటారు. నీ స్వరూపం ఒక్కసారి ఆలోచించు.

కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ
గృహస్తే స్వర్భూజామర సురభి చింతామణి గణే
శిరస్థే శీతాంశౌ చరణయుగళస్థే ఖిలశుభే
కిమర్ధః దాస్యేహం భవతు భవదర్ధం మమ మనః ఈఈ

( శివానంద లహరి -27)

శంకరా, నాకు శుభం ఇవ్వవలసినది అని నిన్ను అడగడానికి నేను నీకు ఏమి ఇవ్వగలను? ఒకచేతిలో నీవు బంగారుకొండను పట్టుకున్నావు. బంగారుకొండే నీ వద్దవుంది. ఇంక నేను ఏమి ఇవ్వను? నీ పక్కన నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు నిలబడి ఉన్నాడు. నీవు ఎప్పుడైనా ఏదాయినా అడుగుతావేమోనని ఎదురుచూస్తున్న ఆయన కోరికే తీరలేదు. నీ ఇంట కల్పవృక్షములు , కామధేనువులు, చింతామణులు రాశులుపోసి ఉన్నాయి. నీ ఇంట్లో చింతామణులతో గోడలు కటారు నీ శిరస్సు మీద చంద్రరేఖ ఉంది. మోక్షము ఇచ్చే అధికారం నీకు ఉంది. కాబట్టి ఇంక నీకు నేనేమి ఇవ్వను! కాని " నాది " అని నిన్ను అస్తమానూ ఈ బంధనంలో పడవేస్తున్నా నా మనస్సును నీకు ఇచ్చేస్తున్నా. తీసుకోవలసినది " అని ప్రార్థన చేశారు. ఏదోరకంగా పరమేశ్వరుని పాదములవద్దకు చేరడానికి శంకరాచార్యులవారు మనకోసమని చేసిన శ్లోకం ఇది. కాబట్టి శఅంకరుడికి మీరేమీ ఇవ్వనక్కర్లేదు, కాని ఒక్కసారి రెండు చేతులు జోడించి నమస్కరిస్తే చాలు. ఒక్కసారి " శివ" అంటే చాలు ఆయన పొంగిపోతాడు.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML