జైశ్రీరామ్ !!!
ఆంజనేయుని దివ్య చరితనుండి మనమెన్నో వ్యక్తిత్వ వికాసమునకు సంబంధించిన ఎన్నో వేల(లెక్కించుటకు సాధ్యంకాని)విషయాలను గ్రహించవచ్చు... వాటిలో కొన్ని::
ఆంజనేయునికి అమిత మైన బలసంపదలెన్ని ఉన్నా శాపవశాత్తూ గుర్తుండదు... కానీ అత్యవసర సమయంలో వాటి విలువను (బాల్యమున సూర్యుని పండులా భావించి మింగబోయి దేవతల శాపాన్ని పొందిన విషయం మనకు తెలిసిందే) గుర్తించి మిగిలిన వానర సైన్యం ఉత్తేజితం చేసినప్పుడు అవి వెలుగులోనికి వచ్చాయి..
ఈ విధంగా సీతాన్వేషణకై ధనుష్కోటి నుండి లంకా నగరానికి లంఘించిన సమయమున ఒకసారి...
బ్రహ్మాస్థ్ర ధాటికి మూర్చిల్లిన లక్ష్మణ సోదరుడిని మేల్కొల్పుటకై హిమవత్పర్వతమునకేగి సంజీవనిని తెచ్చినపుడు ఒకసారి అంతులేని అవధులను దాటగల సత్తా గురించి తెలుస్తుంది...
ఇలాగే మనలో ఉన్న సత్తా చాలా సార్లు మనకు తెలియదు.. వాటిని పూర్తి తదేక దీక్షతో మొక్కవోని పట్టుదలతో సాధిస్తే తలపెట్టిన పనిలో విజయం కలుగుతుంది... దక్షిణ(హిందూమహా)సముద్రాన్ని దాటేటపుడు అంచనా తప్పిపోతే సముద్రంలో దిగవలసి వచ్చేది... అందుకే చాలా మంది వెనుకడుగువేసిన ఆ కార్యాన్ని సాధించారు హనుమంతులవారు.. అలాగే ఎవరూ చేయలేని పనిని సాధించి చూపినపుడు మన పటిమ వెలుగులోకి వస్తుంది...
ఆంజనేయుల వారికి ఒక రకంగా ఇద్దరు యజమానులు(బాసులు).. ఒకరు సుగ్రీవుడైతే రెండవవారు శ్రీరాములవారు.. కానీ ఇద్దరి దగ్గర మంచి దాసునిగానే ఉన్నారు... ఈ విషయంలో మనం మన బాసుల దగ్గర ఎలా ప్రవర్తించాలో ఎలా నమ్మకంగా ఉండాలో తెలుపుతోంది...
ఇంకా మరెన్నో విషయాలతో మళ్ళీ కలుద్దాం!!
అందరికీ శ్రీ ఆంజనేయస్వామివారి అనుగ్రహ ప్రాప్తిరస్తుః !!

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment