గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 8 November 2014

ఈ కార్తీక మాస విశిష్టతను గూర్చి " శ్రీ వేదవ్యాస మహర్షి" తన శిష్యుడైన సుతముని, శౌనకాది ఋషులతో ఇట్లు అనేను.

ఈ కార్తీక మాస విశిష్టతను గూర్చి " శ్రీ వేదవ్యాస మహర్షి" తన శిష్యుడైన సుతముని, శౌనకాది ఋషులతో ఇట్లు అనేను.

పూర్వము ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికవసరమైన ద్రవ్యానికి వశిష్ట మహర్షి జనక మహారాజును అర్ధించగా జనకమహారాజు అందుకు అంగీకరించి, సంవత్సరం లోని సర్వ మాసాలకంటే కార్తీకమాసమత్యంత మహిమాన్వితమైనది అని చెబుతూంటారు కదా? అయితే , ఆ సర్వపాపహరమైన ధర్మసూక్ష్మకమైన దానిని తెలియజేయమంటాడు.

అప్పుడు వశిష్టుడు, " రాజర్షీ! విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని, సూర్యుడు తులా సంక్రమణంలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాల యందు చేరుతుంది. ఇట్టి జలాశయాలలో విష్ణుమూర్తి వ్యాపించి ఉంటాడు.అతడు నారాయణుడు కదా! కనుక కార్తీక స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. వాపీ, కూప, తటకాది స్నానమాచరించిన నదీస్నానం ఫలితం పొందినంత పుణ్యప్రదం.జపాదులు ఆచరించేవారు అక్షయమైన అశ్వమేధ ఫలాన్ని పొందుతారని వివరిస్తాడు. ఇహలోకంలో లక్ష్మీకటాక్షం పొంది, తదుపరి నివాస శాశ్వత గోలోక సౌఖ్యం పొందుతారు అని చెప్పెను.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML