గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 23 November 2014

శ్రీకృష్ణుడు భగవద్గీతలో ????

వేదములలో సామవేదమును, రుద్రులలో   శంకరుడను, చందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షమాసాన్ని అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. మహాభారతకాలంలో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి. కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అట్లే ఈమాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రములయందు చెప్పబడినది.
శుక్లే మార్గశిరే పక్షే యోషిత్ భర్తురనుజ్ఞయా!
ఆరభేత వ్రతమిదం, సార్వకామిక మాదతః!!
వివాహిత యువతి క్రొత్తగా కాపురమునకు వచ్చిన పిమ్మట వచ్చు మొదటి మార్గశిరమాసమునందలి శుక్లపక్షమున పతియనుమతితో ’పుంసవన వ్రతము’ను ఆచరింపవలెను. అది సమస్త మనోరథములను తీర్చును అని భాగవతమునందు చెప్పబడినది. ఈమాసమునందే క్రొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదర్పణము కావింతురు. దీనినే ’అన్నయజ్ఞము’ అందురు. వాల్మీకి రామాయణమునందు ఈ మార్గశిర మాసము మాస శిరోభూషణముగాను, ఆ సంవత్సరమునకే అలంకార ప్రాయముగాను చెప్పబడినది.
అంతేకాక కలువపూలతో శివుని అర్చించిన అది మహాఫలమునొసగును. ఈమాసములో ఒకపూట భుజించి, తనశక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినవాడు వ్యాధులనుండి, పాపాలనుండి విముక్తినందగలడు. సర్వకళ్యాణ సంపూర్ణుడై, అన్నిరకాల ఓషధులను పొందగలడు. ఈమాసములో ఉపవసించినవాడు మరుసటి జన్మలో వ్యాధి రహితుడు, బలశాలి కాగలడు. వ్యవసాయంలో భాగస్వామియై బహుధనధాన్య సంపన్నుడు అవుతాడు. ఈమాసములో రోజంతా ఉపవాసముండి కేశవుని అర్చిస్తే అశ్వమేధయాగ ఫలితాన్ని పొందవచ్చు. ఆవ్రతశీలుని పాపం కూడా నశిస్తుంది. ఈవిధముగా ఇతరమాసములకంటె మార్గశిరమునందు అనేక వశిష్ట లక్షణములు గలవు. కనుక భగవానుడు దీనిని తన స్వరూపముగా తెల్పెను.
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML