గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 11 November 2014

(దీపదానం - మహా భారతం - అనుశాసనిక పర్వం)

(దీపదానం - మహా భారతం - అనుశాసనిక పర్వం)

దేవతల పూజలు చేసే సమయంలోతమోగుణం గల భూతాలు మొదలైన చెడు బుద్ధులతో ఉండే జాతులన్నీ దీపం దగ్గర నశించిపోతాయి. కాబట్టి దీపదానం ఎంతో ఎక్కువ ఫలం కలది అవుతుంది.

దేవతలు సత్త్వగుణ ప్రధానులు. రజస్తమోగుణాల విజ్రుంభణ గల రక్షః పిశాచాదులు వారికి ద్రోహం చేయడానికి సిద్ధపడుతూ ఉంటాయి. అవి వినాశనం పొందటానికి దీపం వెలిగిస్తాం. దీపం జ్ఞానానికి ప్రతీక. చీకటి అజ్ఞానానికి ప్రతీక.

దీపం ఇవ్వటమంటే వెలుగును ప్రసాదించటం అన్నమాట. ఆ మంచిపని చేసిన వ్యక్తికి హృదయం గొప్పవైన పరమాత్మ ధర్మాలను చూచే స్వభావం కలదవుతుంది.

నేయి తక్కువగా ఉంచటం, వత్తి బలం లేనిది కావటం, కొంచెం వెలిగించి పెట్టటం - దీపం పెట్టడంలో కూడని పనులు. వెలుగు గట్టి జ్వాల కలదై ఉండాలి.

ఇతరులు దేవుడికిచ్చిన దీపం దొంగిలించితే ఆ పాతకం వాళ్ళ నరుడు గ్రుడ్డివాడవుతాడు.

బాటలోని చావడిలో, దేవాలయం మీదా, కొండమీడా దీపం పెట్టిన వ్యక్తి ఐశ్వర్యానికి పాత్రుడౌతాడు.

దీపం హరించటం అంటే దొంగిలించడం, ఆర్పివేయడం అని రెండర్థాలు గ్రహించవచ్చును. వెలుగును తిరస్కరిస్తున్నాడన్న మాట. అది గ్రుడ్డి వాని చేష్ట. కాబట్టి అంధుడు అవుతాడని భావం. చావడి మొదలైన చోట్ల పెట్టిన దీపం ఎక్కువమందికి ఉపయోగపడుతుంది.

దీపం పెట్టటానికి ఆవునెయ్యి చాలా మంచిది. నువ్వుల నూనె రెండవ పధ్ధతి. క్రొవ్వు మొదలైన రసాలు పనికిమాలినవి. (క్రొవ్వొత్తులు దేవతార్చనలోవాడరాడని ఇది చెబుతున్నది).

దీపదానం జ్యోతిర్లోకాల సమానస్థితిని, కులం వెలుగొందటాన్ని, మహాజ్ఞానాన్నీ ప్రసాదిస్తుంది.

దీపదానం చేసిన వాడికి దేవతలు పూజించటం అనే సుఖం కలుగుతుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML