గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 17 November 2014

శ్రీ ఐశ్వర్యేశ్వర్యాయ నమః

శ్రీ ఐశ్వర్యేశ్వర్యాయ నమః

’ఈశ్వరుడు ఇవ్వాలి - ఇల్లు నిండాలి’ అని సామెత.
ఈశ్వరుడు అంటే పాలకుడు, శాసకుడు అనే అర్థాలు కాక, ’ఐశ్వర్యములు కలవాడు’ అని అర్థం. ఈ ప్రపంచమంతా ఐశ్వర్యమయం. అగ్ని, వాయువు, నీరు, భూమి, ఆకాశం, సూర్యచంద్రులు, పంటలు.....ఇలా మనల్ని పోషించి ఆనందం కలిగించి అభివృద్ధి పరచే ఐశ్వర్యాలన్నీ ఏ పరమాత్మునివో ఆయనే ఈశ్వరుడు. ఇన్ని ఐశ్వర్యాలతో ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాడు.
అందుకే మనకు ఏ ఐశ్వర్యమైనా ఆయనే ఇవ్వాలి. కుబేరుడు ఈశ్వరారాధనతో ధనములకు పతిగా, ఉత్తర దిక్పత్తిగా, యక్షులరాజుగా వరాలను పొందాడు. లక్ష్మి మొదలైన దేవతలు తమ సంపదల శక్తిని పరమేశ్వరుని మూలకంగా పొందారు. పురాణాలన్నీ ఈ వివరాలను చెప్పాయి. ’అన్నానాం పతయే నమః - పుష్టానాం పతయే నమః’ అంటూ ఈశ్వరుని వేదాలు కీర్తించాయి.
శివారాధనలోని అనేక విశేషాలను ఆగమశాస్త్రాల ననుసరించి పాటించే తమిళనాడువంటి ప్రాంతాలలో ’ఐశ్వర్యేశ్వర్యుని’గా శివుని ఆరాధించి సంపదలను పొందగలమని తెలియజేస్తారు.
"శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః" అని మంత్రంగా జపిస్తారు.
"రాజాధిరాజాయ" అంటూ "కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః" అని కొనసాగిస్తూ - "ఈశానః సర్వవిద్యానాం...సదాశివోం" అని మంత్రపుష్పంలోని వేదమంత్రాలు ఈభావాన్నే చెబుతున్నాయి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML