గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 12 November 2014

లలిత హారతి :

లలిత హారతి :
శ్రీ చక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిదె నీరాజనం
పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాశి ఆ సింహ మధ్యకు రత్న నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
చరణం: 1
బంగారు హారాలు సింగార మొలకించు అంబికా హృదయకూ నీరాజనం
శ్రీ గౌరి శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహసనేశ్వరికి నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
చరణం: 2
కల్పతరువై మమ్ము కాపాడు కరములకు, కనకంబు కాసులతో నీరాజనం
పాశంకుశా పుష్ప బాణ చాపధరికి , పరమ పావనమైన నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
చరణం : 3
కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే కల్యాణ సూత్రమునకు నీరాజనం
కలువ రేకులవంటి కన్నులా తల్లి శ్రీ రాజ రాజేశ్వరికి నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
చరణం: 4
చిరునవ్వులోలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం
కలువ రేకులవంటి కన్నులా తల్లి శ్రీ రాజరాజేశ్వరికి నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
చరణం: 5
ముదమార మోమున ముచ్చటగా ధరియించు కస్తూరి కుంకుమకు నీరాజనం
చంద్రవంకను శిరోమకుటముగా దాల్చు సౌందర్య లహరికిదే నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
చరణం: 6
శుక్రవారమునాడు శుభములొసగే తల్లి శ్రీ మహలక్ష్మికిదే నీరాజనం
శృంగేరి పీటమున సుందరాకారిణి శారదా మాయికిదే నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
చరణం: 7
ముగ్గురమ్మలకు మూలమగు పెద్దమ్మ ముత్యాలతో నిత్య నీరాజనం
జన్మ జన్మల తల్లి జగదీశ్వరీ నీకు భక్తి జనులిచ్చేటి నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
చరణం: 8
సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిదే నీరాజనం
ఆత్మార్పణతో నిత్యనీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం
జై శ్రీరాం.....!!


No comments:

Powered By Blogger | Template Created By Lord HTML