గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 12 November 2014

సనాతనధర్మంసనాతనధర్మం
సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం, పురాతన ధర్మం అని అర్దం. ఈ ధర్మానికి మూలం వేదం. ప్రపంచంలో అత్యంత పురాతన కాలం నుంచి ఆచరిస్తున్న ధర్మం ఇదే. దీనికి ఒకప్పుడు పేరు లేదు, ఎందుకంటే ప్రపంచంలో ఇది తప్ప వేరే జీవనవిధానం లేదు. గత 197.5 కోట్ల సంవత్సరాల నుంచి గత 5000 ఏళ్ళ క్రితం వరకు ఇది ఒక్కటే ప్రపంచజనాభా ఆచరిస్తూ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉందనడానికి ఆధారం ఏంటి అంటారేమో?ఆ మధ్య అమెరిక ఖండంలోని ఒక దేశపు అడవిలో ఒక పెద్ద శిల బయటపడింది. దాని మీద ఏవో పురాతన లిపి ఉందని గమనించి, పరిశోధన చేశారు. చాలామంది నిపుణులు వచ్చి తేల్చిందేమంటే ఆ లిపి కొన్ని లక్షల ఏళ్ళ క్రితం లిఖించబడిందని. అంతా బాగానే ఉంది కానీ, ఆ గీతలలో అర్దం ఏమిటో అక్కడున్న సిబ్బందికి అంతుచిక్కలేదు. ఇంతలో అక్కడున్న పని చేస్తున్న భారతీయుడు వచ్చి అది శ్రీ చక్రం అని గుర్తించాడు. శ్రీ చక్రం ఆదిశక్తి స్వరూపం. భారతదేశానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో, సముద్రానికి అవతల దొరికిన ఒక ఆధారం ఇది.
ప్రపచనవ్యాప్తంగా జరిగిన పురాతనవస్తు తవ్వకాల్లో అనేక దేశాల్లో హోమగుండాలు, అగ్నిహోత్రాలు బయటపడ్డాయి. అగ్ని ఆరాధాన, హోమగుండం మొదలైనవన్నీ ఒక్క వైదిక సంప్రదాయంలో మాత్రమే ఉన్నాయి. ఇవి సనాతన ధర్మం అక్కడ కూడా ఉండేదని చెప్పకనే చెప్తున్నాయి. కానీ కాలక్రమంలో జరిగిన అనేక మార్పుల కారణంగా కొత్త మతాలు పుట్టుకొచ్చాయి.


ప్రాన్సు, స్పెయిన్ దేశపు సరిహద్దుల్లో ఫ్రెంచిపైరేనీస్ అనే ప్రదేశంలో అగ్నిహోత్ర దేవాలయాన్ని ప్రారభించారు. ఈ ప్రదేశంలో, భూగర్భశాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం దాదాపు 12,000 సంవత్సరాలు నిరంతరాయంగా అగ్నిహోత్రం జరిగిందని గుర్తించారు. ఈ ప్రదేశం సముద్రమట్టానికి 700 మీటర్ల ఎతులో ఉంది. చుట్టారా కానిగ్యు పర్వతాలు, ప్రదేశ్ లోయలో ఎంత మనోహరంగా ఉంటుంది. ఇది గుర్తించిన స్తీఫెన్‌జీన్ లాపైరేరి అని వ్యక్తి ఇక్కడ అగ్నిహోత్ర దేవాలయం ప్రారంభించి, తాను యోగేశ్వర్ ఆనంద్‌గా మారి క్రతువు నిర్వహిస్తున్నాడు.

ఇదిగాకా జెర్మనీలో 32,000 సంవత్సరాల క్రితం నాటి నరసింహుని విగ్రహం లభించింది. ఒక గుహలో 1.20 మీటర్ల లోతులో, పురావస్తు తవ్వకాల్లో దొరికింది. ఈ రోజు వాటికన్ నగరంగా చెప్తున్న ప్రదేశానికి ఒకనాటి పేరు శివ వాటికట. అక్కడ కూడా శివలింగాలు దొరికాయి. క్రీస్తు పూర్వం 9వ శతాబ్దం నాటిదిగా గుర్తించిన ఒక శివలింగాన్ని అక్కడి మ్యూజియంలో ప్రదర్శనలో ఉంచారు. ఈనాటి క్రైస్తువుల పవిత్ర ప్రదేశం వాటికన్ నగరం. అక్కడ కూడా ఒకప్పుడు వైదిక సంస్కృతి ఉందని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ. ఒకరకంగా చెప్పాలంటే, ఈనాటి యూరోపు మొత్తం ఒక్కప్పుడు మన ధర్మాన్ని పాటించిందని చెపుతున్నాయి ఈ ఆధారాలు.

అదేగాకా రష్యాలో మహాభారతకాలం నాటి పుషపక విమానం శకలాలు దొరికాయి. కానీ కమ్యూనిస్ట్ రష్యా, వీటిని బయటప్రపంచానికి తెలియకూండా తొక్కిపెట్టి, రహస్యంగా పరిశోధనలు సాగిస్తోందని మన భారతీయులు ఆధారాలు చూపించారు.
మీ...వల్లూరి రామకృష్ణాచార్యులు & బొక్కా సత్యశివబాలబాలాజీ.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML