గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 27 November 2014

వీరపాండ్య కట్టబ్రహ్మన, ఆయన పూర్వీకుడైన దిగ్విజయదురై, వడమలైయప్పలనూ, ఉత్తరదేశానికి చెందిన ఒక అంధుణ్ణీ ఆదుకున్న సుబ్రహ్మణ్య స్వామి మహత్వం అపారం.

వీరపాండ్య కట్టబ్రహ్మన, ఆయన పూర్వీకుడైన దిగ్విజయదురై, వడమలైయప్పలనూ, ఉత్తరదేశానికి చెందిన ఒక అంధుణ్ణీ ఆదుకున్న సుబ్రహ్మణ్య స్వామి మహత్వం అపారం.
చూపు కోల్పోయిన ఒక ఉత్తరదేశీయుడు తిరుచందూర్ సుబ్రహ్మణ్యస్వామిని కంటిచూపు కోసం ప్రార్థించాడు. అతడి భక్తిపూర్వక ప్రార్థనను విన్న సుబ్రహ్మణ్యస్వామి అతడికి ఒక కంటికి మాత్రం చూపు ప్రసాదించాడు. ’రెండో కంటి చూపు పొందడానికి తన భక్తుడైన దిగ్విజయదురైను కలుసుకో’ అన్న స్వామి మాటలు అతనికి వినిపించాయి. తిరుచందూర్ ను సాదరంగా ఆహ్వానించి దిగ్విజయదురై మీకు నేను ఏం సాయం చేయగలను? అని అడిగాడు.
తిరుచందూర్: రాజా! రెండు కన్నుల చూపునూ కోల్పోయిన నేను సుబ్రహ్మణ్య స్వామిని వేడుకున్నాను. ఒక కంటికి చూపును ప్రసాదించిన స్కందుడు, రెండో కంటి చూపుకోసం మిమ్మల్ని కలుసుకోమని ఆదేశించాడు.
దిగ్విజయదురై: ఆహా! తిరుచందూర్ దేవా! ఈ అల్పుణ్ణి అధికుణ్ణిగా ఎంచి ఆజ్ఞాపించావే! అయ్యా! సుబ్రహ్మణ్య స్వామియే మీకు మరో కంటి చూపును కూడా ప్రసాదిస్తాడు. రేపు ఉదయం పూజ సమయానికి రండి.
మర్నాడు రాజు పూజ ముగించి ఒక చేత్తో కత్తిని మరో చేత్తో తీర్థప్రసాదాలను, తమలపాకుతో విభూతిని తీసుకువచ్చాడు.
తిరుచందూర్: రాజా! కత్తి ఎందుకు?
దిగ్విజయదురై: అయ్యా! ప్రసాదాన్ని స్వీకరించండి. సుబ్రహ్మణ్య స్వామి నిశ్చయంగా మీకు చూపు ప్రసాదిస్తాడు. ఒకవేళ నా భక్తి లోపం వలన అలా కాకపోతే, ఈ కత్తి నా ప్రాణాలను తీస్తుంది.
భక్తితో ఇచ్చిన ప్రసాదాన్నిఆరగించగానే ఆ అంధునికి చూపు వచ్చింది.
తిరుచందూర్! రాజా! మీ భక్తి ఎంత మహత్వపూర్ణమైనది
దిగ్విజయదురై: అంతా సుబ్రహ్మణ్య స్వామి దయ.
సుబ్రహ్మణ్య స్వామికి జయం! జయం!
17వ శతాబ్దం. తిరుమల నాయకుని పరిపాలనా కాలం. తమిళనాడులో పోర్చుగీసు వారికీ డచ్చి వారికీ మధ్య యుద్ధం జరిగింది. డచ్చి వారు తిరుచందూర్ ఆలయాన్ని తమ కార్యాలయంగా మార్చివేశారు.
1649వ సంవత్సరం, ఫిబ్రవరి 22. ఆలయాన్ని వదలి బయటకు వెళ్ళమని డచ్చివారితో తిరుమలనాయకుని ప్రతినిధి చెప్పాడు. వారు తిరస్కరించడంతో నాయకుని భటులు భక్తులు కలిసి డచ్చివారితో పోరాడారు. చివరికి డచ్చివారు సుబ్రహ్మణ్యస్వామివీ, నటరాజస్వామివీ, పంచలోహ విగ్రహాలను కొల్లగొట్టి నౌకలో తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు హఠాత్తుగా సముద్రంలో భయంకరమైన తుఫాను చెలరేగింది. నౌక తుఫానులో చిక్కుకుంది. ఇక మనం ఎలా వెళ్ళగలం? ఇంత భయంకరంగా సముద్ర ఉప్పొంగడం ఇంతవరకూ చూడలేదు. ఒకవేళ, దైవ విగ్రహాల శక్తి వల్లనే మనకు ఈ అగ్నిపరీక్షా? ఈ విగ్రహాల కారణంగానే వారు ఇలా అపాయకరమైన స్థితిలో చిక్కుకున్నాం అనుకొని వాటిని సముద్రంలో విసిరివేశారు. వెంటనే సముద్రం శాంతించింది. ఏం ఆశ్చర్యం! మర్నాడు ఆలయంలో అర్చకులు దైవ విగ్రహాలు కనపడకపోవడంతో కంగారుపడిపోయారు. విగ్రహాలు లభించనేలేదు.కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. దైవవిగ్రహాలు కనపడకపోవడంతో తల్లడిల్లిపోయిన ఉడమలైయప్ప అనే భక్తుడు తరువాత, తాను క్రొత్తగా తయారుచేసిన సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని తిరుచందూర్ కు తీసుకువచ్చాడు. అప్పుడు అతడికి కలలో సుబ్రహ్మణ్య స్వామి కనిపించి "భక్తా! దిగులు చెందకు. సముద్రం వద్దకు వెళ్ళు. నిమ్మపండ్ ఒకటి తేలుతున్నచోట నేను ఉన్నాను. పైన ఒక గరుడపక్షి ఎగురుతూ ఉంటుంది". అన్నాడు. వెంటనే నిద్రమేల్కొన్న ఉడమలైయప్ప కొంతమంది భక్తులతో సముద్రం వద్దకు వెళ్ళి విగ్రహాల కోసం వెతికాడు. వారికి అక్కడ నిమ్మపండు కనపడింది. అక్కడ మునిగిపోయిన దైవ విగ్రహాలను బయటకు తీసుకు వచ్చి మళ్ళీ ఆలయంలో ప్రతిష్ఠించారు.
ఉడమలైయప్ప తయారు చేసిన శిలావిగ్రహం పాలయంకొట్టై త్రిపురాంతీశ్వర ఆలయంలో నేటికీ వెలసి ఉంది.
వీరపాండ్య కట్టబ్రహ్మనకి సుబ్రహ్మణ్య స్వామి పట్ల అమితభక్తి. చందూర్ ఉత్తరం వైపు మాడ వీధిలో నిర్మించిన రాతి మండపంలో, మాఘమాసంలో సుబ్రహ్మణ్య స్వామికి విశిష్టసేవలు నిర్వర్తించాలి అని అనుకున్నాడు. అప్పుడు మంత్రి "రాజా! మన్నించాలి. ఆ రోజు వడమలైయప్ప తరువాత కట్టిన మండపంలోనే సుబ్రహ్మణ్యస్వామి ఎప్పుడూ కొలువుతీరి అనుగ్రహించడం సంప్రదాయం." అన్నాడు. సంప్రదాయాన్ని మార్చి విశిష్టసేవా దినోత్సవం నాడు తాను నిర్మిమ్చిన రాతి మండపంలోకి సుబ్రహ్మణ్యస్వామిని ఆహ్వానించడానికి తమలపాకులు, వక్కలు మొదలైన వాటితో కట్టబ్రహ్మన వేచి ఉన్నాడు. దేవుణ్ణి చిన్నరథం (చప్పరం)లో కూర్చోబెట్టడానికి భక్తులు ప్రయత్నించారు. కానీ ఆయన కించిత్తు కూడా కదలలేదు. వేరే దారిలేక కట్టబ్రహ్మన వడమలైయప్ప మండపంలో ఉంచడానికి అంగీకరించాడు. వెంటనే స్వామి కదిలి చిన్నరథం (చప్పరం)లో ఆసీనులైనాడు.
సుబ్రహ్మణ్య స్వామి ఊరేగింపుగా వస్తున్నప్పుడు కట్టబ్రహ్మన మనస్సు మార్చుకుని మళ్ళీ ఆయనను తన మండపంలో అమర్చాలనుకున్నాడు. ఆశ్చర్యం! మళ్ళీ రథంలోని విగ్రహాన్ని కదల్చలేకపోయారు. కట్టబ్రహ్మన తన పట్టుదల వదలలేదు. అప్పుడు హఠాత్తుగా కుంభవృష్టి ప్రారంభమయింది. వాన ఉద్ధృతమవుతోంది. విగ్రహాన్ని కదల్చడం కూడా సాధ్యం కావడం లేదు. అంతలో రాజు మనస్సు మారి "సుబ్రహ్మణ్య స్వామి సంకల్పాన్ని మార్చడానికి నేనెవరిని? దేవుణ్ణి ఉడమలైయప్పర్ మండపంలోనే దింపండి" అని ఆదేశించాడు.నా అహంకారాన్ని నిర్మూలించి ఆంతరిక నేత్రాన్ని తెరిపించడానికే భగవంతుడు ఇలా చేశాడు అనుకున్నాడు. నా అహన్ని నిర్మూలించిన ఓ స్వామీ! నీ పాదపద్మాలే నాకు శరణ్యం!No comments:

Powered By Blogger | Template Created By Lord HTML