శివభక్తులలో ప్రసిద్ధురాలైన బెజ్జమహాదేవి, ఆ శంకరుని శిశువుగా చేసి లాలించి, కైవల్యాన్ని పొందింది.
"శివునకు తల్లి లేకపోవడం చేతనే, పాపం! ఇన్ని అవస్థలు పడ్డాడు.తల్లిగానీ ఉన్నట్లయితే ఇన్ని ఇబ్బందులుండేనా!
తల్లి గల్గిన నెల తపసిగానిచ్చు
తల్లి గల్గిన నెల తల జడల్గట్టు?
తల్లియున్న విషంబు త్రావనేలిచ్చు?
తల్లియుండిన తోళ్ళు దాల్పనేలిచ్చు?
తల్లిపాముల నెల ధరియింపనిచ్చు?
....తల్లి పుచ్చునె సుతు వల్లకాటికిని" (పాల్కురికి సోమనాథుడు - బసవపురాణం)
- అని భావించిన ఆ అమాయక వనిత, పరమేశుని తనయునిగా కావించి, స్నానాలు చేయించి, లాలించి, పసిపిల్లవానిని కన్నతల్లిలా వాత్సల్యభావంతో ఆదరించింది.
"నాయన్న! నాకన్నా! నాపట్టి! ణా చిన్నవడుగ!" అని బాలశివుని ముద్దాడింది. ఆ పరమ వాత్సల్య భావానికి పరమానందపడి శివుడామెకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఏ విధాన భావించి ఆరాధించితే ఆ విధాన అనుగ్రహించే భావవేద్యుడు శివుడు.
భక్తిలోని వాత్సల్యాసక్తికి అనువైన బాల శివమూర్తిని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లలో ఆరాధించడం కనిపిస్తుంది. శయనించి ఉన్న బాల శివరూపం ఆ ప్రాంతాలలో ప్రసిద్ధంగా చిత్రపటాలలో దర్శనమిస్తుంది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment