గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 11 November 2014

మహాదేవుని అగ్ని, స్థాణువు, మహేశ్వరుడు, ఏకాక్షుడు, త్రిలోచనుడు, విశ్వరూపుడు, శివుడు అని చెప్తారు.

మహాదేవుని అగ్ని, స్థాణువు, మహేశ్వరుడు, ఏకాక్షుడు, త్రిలోచనుడు, విశ్వరూపుడు, శివుడు అని చెప్తారు.
ఆ దేవునికి రెండు శరీరాలున్నట్లు చెప్తారు. ఒక శరీరం ఘోరమయినది. మరొక శరీరం శివం అయినది. అవి రెండూ కూడా మళ్ళీ అనేకంగా ఉంటాయి. ఉగ్రమై ఘోరమయిన ఆయన తనువు అగ్నిగా, విద్యుత్తుగా, భాస్కరునిగాను, ప్రకాశిస్తున్నది. ప్రసన్నమైన శివరూపమయిన తనువునకు ధర్మం, నీరు, చంద్రుడు అనే రూపాలున్నాయి. ఆయన శరీరంలో సగభాగం అగ్ని, మరొక సగభాగం చంద్రుడు. శివరూపమయిన ఈయన శరీరం బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంది. అలాగే ఘోర శరీరం జగత్ సంహారం చేస్తుంది. ప్రభువు కనుక, గొప్ప వాడు కనుక ఆయనను మహేశ్వరుడంటారు.
దహించటం, భయంకరంగా ఉండడం, వాడిగా ఉండడం, మాంస శోణిత మజ్జలను తినటం కారణంగా ఈయన రుద్రుడిగా చెప్పబడుతున్నాడు.
దేవతలలో ఎంతో గొప్పవాడు కావటం ఈయనకు సంబంధించి ఎన్నో గొప్ప విషయాలుండడం, విశాల విశ్వాన్ని పాలించటం కారణంగా ఈయన మహాదేవుడుగా చెప్పబడుతున్నాడు.
ఈయన కేశరూపం బూడిద రంగులో ఉండడం వల్ల దూర్జటిగా చెప్పబడ్డాడు.
అనేక రకాల కర్మల ద్వారా సర్వులకు ఉన్నతిని కల్పించటం, మనుష్యులకు శుభాన్ని ప్రసాదించటం, వల్ల శివుడయినాడు.
ఊర్ధ్వభాగమందుండి మనుష్యుల ప్రాణాలను హరిస్తాడు కనుక, స్థిరంగా ఉంటాడు కనుక, లింగ విగ్రహం మార్పు లేనిది కనుక ఈశ్వరుడు స్థాణువుగా చెప్పబడుతున్నాడు.
భూత భవిష్యద్వర్తమానాలలో ఈయనకు సంబంధించిన బహువిదాలయిన చరాచర రూపాలు ప్రకటితమవుతుంటాయి. కనుక బహురూపుడంటారు.
సమస్త దేవతలు ఆయన శరీరమందే ఉంటారు కనుక ఆయనను విశ్వరూపుడనీ అంటారు.
ఈయన నేత్రం నుండి తేజస్సు ప్రసరిస్తుంది. కనుక పరమేశ్వరుని సహస్రాక్షుడనీ, ఆయుతాక్షుడని, సర్వతోక్షిమయుడని అంటారు. నిజానికి ఈయన నేత్ర సంఖ్యకు అంతులేదు.
ప్రాణులనన్నివిధాల రక్షిస్తాడు. వాటితో క్రీడిస్తాడు. ప్రాణులందరికీ అధిపతి. ఇందువల్ల ఈశ్వరుడు పశుపతిగా పిలువబడుతున్నాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML