ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Friday, 21 November 2014

మనకి వేదములు నాలుగయినా, సంప్రదాయంలో వాటిని మూడుగా వ్యవహరిస్తాము

మనకి వేదములు నాలుగయినా, సంప్రదాయంలో వాటిని మూడుగా వ్యవహరిస్తాము. అందుకే శంకరాచార్యుల వారు కూడ శివానందలహరిలో - 'త్రయీవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం' అన్నారు.
త్రయీవేద్యం అనడానికి ఒక కారణం ఉంది. ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, ఈ మూడు వేదములు నేర్చుకోవడానికి ఒక్కసారి ఉపనయనం చేసుకుంటే చాలు. ఒకసారి ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రీ ఉపదేశంతో ఈ మూడు వేదములు చదువవచ్చు. కానీ అధర్వవేదం చదవడానికి, ఈ మూడు వేదములు చదవడానికి కావలసిన ఉపనయనం సరిపోదు. అధర్వ వేదం చదవడానికి మరల ఉపనయనం చేసుకొని, ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి. అందుకని సాధారణంగా త్రయీవేద్యం అంటారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML