గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 8 November 2014

క్షీరాబ్ది ద్వాదశిని " బృందావన ద్వాదశి" అంటారు

క్షీరాబ్ది ద్వాదశిని " బృందావన ద్వాదశి" అంటారు. ఈ రోజు ఉదయం ముందు రోజు ( ఏకాదశి) ఉపవాసానికి ఉపసమ్హరణగా, విష్ణువునకు నివేదించిన ఆహార పదార్ధాలను పారణగా స్వీకరించాలి.

కచ్చిత్తులసి! కల్యాణి! గోవింద చరణప్రియే!
ధాత్రిదేవి నమస్తేస్తు మాం పాలయ మనోరమే!

ఈ ద్వాదశి నాడు తులసీమంటపమున ఉసిరి కొమ్మును పెట్టుకొని, ( లేదా ఉసిరి చెట్లు తులసి ఉన్నచోట) , వివిధ దీపములతో అలంకరించుకుని విష్ణుపూజ చేయాలి. దీనిని "క్షీరాబ్ది ద్వాదశి వ్రతం" అంటారు. ఉసిరికను విష్ణువునకు నివేదించడం, 360 వత్తులతో మహాజ్యోతిని వెలిగించడం ఆచారం. హరిహరుల పరిపూర్ణానుగ్రహాన్ని పొందడానికి దివ్య సాధన ఇది.

ఉసిరిక ( అమలకం) ఈ మాసాన శ్రేష్టంగా చెప్పవచ్చు. ఉసిరిక దైవానికి నివేదించడం , దానం చేయడం, భుజించడం - దైవానుగ్రహ హేతువు. సంవత్సరం లో ఏ రోజైనా దీపారధన చేయని దోషం, ఈ రోజున 360 వత్తులతో వెలిగించే దీపం వల్ల తొలుగుతుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML