గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 8 November 2014

శివ మందిరంలో ప్రప్రథమంగా నందికి ప్రణమిల్లాలి.

శివ మందిరంలో ప్రప్రథమంగా నందికి ప్రణమిల్లాలి. నిజానికి ఎద్దుకు బుద్ధి తక్కువని మన అభిప్రాయం. కానీ నంది జ్ఞాన స్వరూపుడైన శివుణ్ణి మోయడం వాళ్ళ అందరి పూజలందుకొనే అర్హత పొందింది. అలాగే మనం కూడా భగవత్ జ్ఞానాన్ని మన మస్తిష్కంలో నిలుపుకోగలిగితే సర్వత్రా సన్మానింపబడతామన్నది దీని అంతరార్థం.
శివ నిర్మాల్యాన్ని దాటిన మానవుడు శక్తి హీనుడవుతాడు. పుష్పదంతుడనే గంధర్వుడు పుష్పాలను దొంగిలించే వేళలో అజ్ఞానవశుడై, శివ నిర్మాల్యాన్ని దాటాడు. ఫలితంగా అదృశ్యమయ్యే వాని శక్తి నాశనమవుతుంది. శక్తి హీనుడు కాగానే అతడు భగవన్మహిమను గానం చేశాడు. అదే ‘శివమహిమ్న స్తోత్రం’. దానితో పుష్పదంతునికి తిరిగి శక్తి లభిస్తుంది.
మనం కూడా నిర్మాల్యాన్ని దాటకూడదు. అందుకే శివాలయానికి సంపూర్ణ ప్రదక్షిణ చేయరు. ఈ రహస్యాన్ని గ్రహించాలి. భగవదంకితమైన కార్యం, లేదా జీవనం – ఈ శివ నిర్మాల్యంలోకి పరిగణనకు వస్తుంది. అలాంటి జీవన యాత్రలో చరించే మహాత్ముల, కార్యాల విషయంలో ఇష్టానుసారం భాషించడమంటే శివ నిర్మాల్యాన్ని లంఘించడంతో సమానమే అవుతుంది. అలాంటి పాపకార్యాలను ఆచరించే వాడు ఎంతటివాడైనా అల్పకాలంలోనే శక్తి హీనుడై పోతాడు. కనుక భగవదంకితమైన విత్త విషయంలో, భగవంతునికి సమర్పించిన కార్య విషయంలో, దేవాంకితమైన జీవనం విషయంలో మనం సావదానులమై సమ్మాన భావంతో వ్యవహరించాలి. అలాంటి కార్యాలనూ, వాటిని ఆచరించే వారినీ అవహేళన చేసే సమాజంలో అకాలమృత్యువు, కరువు కాటకాలు, భయాందోళనలు సామ్రాజ్యం చేస్తాయి. ఇది శాస్త్ర వచనం.
శివుడు బాలచంద్రుణ్ణి శిరస్సుపై ధరించాడు. బాల చంద్రుడు కర్మయోగానికి ప్రతీక. యథార్థమైన కర్మయోగిని మాత్రమె మహాదేవ భగవానుడు శిరస్సుపై ధరిస్తాడు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML