గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 8 November 2014

శ్రీ కీర పండరీపురం - చిలకలపుడి ( మచిలిపట్నం)

శ్రీ కీర పండరీపురం - చిలకలపుడి ( మచిలిపట్నం)

కార్తీక ఏకాదశి నాడే ఈ దేవాలయం లో కృష్ణపరమాత్మ " పాండురంగడుగా" “స్వయంభూ”గా వెలసినాడు.
శ్రీ పాండురంగ స్వామి దేవాలయం , మచిలీపట్ననానికి సుమారు 5 క్.ం. దూరంలో, చిలకలపూడిలో గల “ కీర పండరిపురం” ప్రాంతంలో “శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయం” గా పిలవబడుతున్న ప్రసిధ్ధ పుణ్యక్షేతం..!
ఈ దేవాలయం “భక్త నరసింహం” అనే పరమ పాండురంగ భక్తునిచే, 1929 లో మచిలీపట్నం , చిలకలపుడి ప్రాంతంలో నిర్మించబడింది. ఈయన బొబ్బిలి మండలం, విశాఖపట్నం జిల్లా కు చెందిన మహానుబావులు వారు. ఈ ఆలయం సుమారు 6 ఎకరాల స్థలం లో బహు సుందరంగా నిర్మిచబడింది. దీనిలోనే భక్త జ్ణానదేవ్, భక్త తుకారాంల మఠం లు కూడా వున్నాయి. ఈ ఆలయ నిర్మాణం 17th august 1927 న మొదలు పెట్టబడి 28th జూన్ 1928 న పూర్తి కావించబడింది.. ఈ ఆలయ సముదాయాలు అన్నీ పూర్తిగా కట్టటానికి సుమారు 8 సంవత్సరాలు పట్టి, 1935 లో పూర్తి అయ్యాయి.
ఈ ఆలయ నిర్మాణ పూర్తి అయి, గర్భ గుడిలోని మూల విగ్రహం ప్రతిష్టించే సమయంలో, ఒక అధ్బుతం జరిగి శ్రీ పాండురంగడే “స్వయం భూ”గా వెలసినట్లు స్థల పురాణం లో ఉన్నది.
ఈ దేవలయము లో స్వామి తన భక్తులచే నిరంతరం పూజలు అందుకుంటు , వాళ్ళని అనుగ్రహిస్తు ఉంటాడు.ముఖ్యంగా, సముద్ర స్నానానికి వచ్చే భక్తులతో అలాగే అన్ని పౌర్ణమి రోజులలో, అదీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు,అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినం లలో భక్తుల రద్దీ విపరీతంగా వుంటుంది. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు మహారాష్ట్రలోని పంఢరీపురం లోని ఆలయంలో ఆ రంగడు వెలిస్తే, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు చిలకలపుడి గ్రామం లో వెలిసారు స్వామి!

ఇప్పటికీ ఈ దేవాలయం శ్రీ భక్త నరసింహం గారి వంశం వారే నడుపుతున్నారు. పడమర దిశగా వున్న సింహా ద్వారం లోనికి ప్రవేశించిన భక్తులకు తూర్పు ముఖంగా వున్న గర్భగుడిలో స్వామి దర్శనం ఇస్తాడు. ఈ గుడిలోని మూల విగ్రహం 3 అడుగుల పొడవు వుండి, అచ్చు శ్రీ పండరిపురం లోని శ్రీ పాండురంగని పోలివుంటుంది.ఒక స్వయంభు విగ్రహ పాద స్పర్స చాలా అరుదు గా దొరుకుతుంది..అలాంటి అనుగ్రహం ఇక్కడ లభిస్తుంది భక్తులకు.
ఆయన్ని దర్శించే భక్తులందరికీ వారు నిజం గా పండరీపురం శ్రీ పాండురంగని దర్శిస్తున్నామనే అనుభూతిని కల్గిస్తుంది.
భక్తులు ఏ కులం వారైనా సరే , స్వయంగా వారే గర్భ గుడిలోని మూల విగ్రహానికి పూజలు చేసుకోవచ్చు. ఇదే ఈ దేవాలయానికి వున్న విశిష్ఠత!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML