గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 8 November 2014

భక్తేశ్వరవ్రతం

కార్తీక పూర్ణిమ నాడు శంకరుని గురించి " భక్తేశ్వరవ్రతం" అనే వ్రతాన్ని కొన్ని ప్రాంతాలలో చేస్తారు. పూర్వం మధురప్రాంతరాజైన పాండ్యుడికి సంతానం లేకపోవడంతో, శివుడిని ప్రార్థించాడు. చివరకు శివుడు వారి మొరను ఆలకించి ప్రత్యక్షమై " మీకు అతిమేధావి అయిన అల్పాయుష్షు కల కుమారుడు కావలెనో! చిరంజీవే కాని విధవరాలు అయ్యే కూతురు కావలనో? కోరుకో" అనగా , చంద్రపాండ్యుడు, కుముద్వతి దంపతలు కొడుకునే కోరుకున్నారు. వారికి పుత్రుడు కలిగి , పెరిగి పదహారు సంవత్సారాల వయస్సు కావడం వల్ల చింతకు లోనైన వారు తమ కుమారుడిని మృత్యువునుంచి కాపాడేందుకు అనేక ఆలోచనలు చేసి, చివరకు అలకాపురి రాకుమార్తే నిచ్చి వివాహం చేశారు. ఆ యువరాణి మహా శివభక్తురాలు. భర్త అల్పాయుష్షును గురించి తెల్సుకుని శివుడిని ప్రార్థించి , వ్రతం చేసింది. ఆయుష్షు ముగిసి యమభటులు వచ్చిన సమయంలో ఆమే తన భర్తను కాపాడమని శివుడిని ప్రార్థించడంతో, శివుడు ప్రత్యక్షమై యమభటులను తరిమివేసి ఆ యువకుని ప్రాణాలు కాపాడాడు. భక్తురాలికోరికను తీర్చిన వ్రతం " భక్తేశ్వరవ్రతం"

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML