గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 15 November 2014

శివపురాణం వినేవరకు మాత్రమే యమ కింకరుల భయం ఉంటుంది.

"తావత్కిల మహోత్పాతాః సంచరిష్యంతినిర్భయాః!
యావచ్ఛివపురాణం హినోదేష్యతి జగత్యహో!!
శివపురాణం వినేవరకు మాత్రమే యమ కింకరుల భయం ఉంటుంది. అది దొరికితే వాళ్ళ భయం అక్కరలేదు. ఇతర చిన్న చిన్న శాస్త్రములన్నీ ఎంతవరకూ గర్జిస్తాయి అంటేశివపురాణం అనే సింహం గర్జించేవరకూ. సర్వ తీర్థములు సేవించిన ఫలం, సర్వ దానఫలం, శివపురాణ శ్రవణం వల్ల లభిస్తుంది. సర్వ సిద్ధాంత సారము శివపురాణంలోఉన్నది.
తథాపి తస్య మహాత్మ్యం వక్ష్యే కించిత్తు వోనఘాః!
చిత్తమాధాయ శృణుత వ్యాసేనోక్తం పురామమ!!
ఆ దివ్యమైన మహాత్మ్యాన్ని, ఫలాన్ని చెప్పడం నావల్ల కూడా కాదు అన్నాడుసూతపౌరాణికులు. "ఫలం వక్తుం న శక్నోమి కార్త్ స్న్యేన మునిసత్తమాః" - దానియొక్క ఫలాన్ని నేను వర్ణించలేను.
ఏతచ్ఛివపురాణం హి శ్లోకం శ్లోకార్థమేవచ!
యః పఠేద్భక్తి సంయుక్తస్సపాపాన్ముచ్యతే క్షణాత్!!
శివపురాణంలో ఒక్క శ్లోకం గానీ, శ్లోకంలో సగం గానీ భక్తిగా చదివే వాని పాపం ఆ క్షణంలోనే నశిస్తుంది. భక్తి అనగా శ్రద్ధతో కూడినది. శ్రద్ధ అంటే ఇది సత్యము అనేవిశ్వాసమే శ్రద్ధ. అలా భక్తితో ఒక్క శ్లోకంగానీ, శ్లోకార్థం గానీ చదివ్తే పాపములు నశిస్తాయి.
ఏతచ్ఛివ పురాణం హియః ప్రత్యహమతంద్రితః
యథాశక్తి పఠేద్భక్త్యాస జీవన్ముక్త ఉచ్యతే!!
ఈ శివపురాణాన్ని ఎల్లవేళలా, భక్తితో, అతంద్రితః - కునుకుపాటు లేకుండా చదివితే జీవన్ముక్తులౌతారు. కునుకుపాటు అంటే ఏమరుపాటు, అజాగ్రత్త.
ఏతచ్ఛివపురాణం హి యో భక్త్యార్చయేత్ సదా!
దినే దినేశ్వమేధస్య ఫలం ప్రాప్నోత్య సంశయమ్!!
శివపురాణమును రోజూ అర్చించినా అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది.
ఏతచ్ఛివ పురాం యస్సాధారణ పదేచ్ఛయా!
అన్యతః శృణుయాత్సోపి మత్తో ముచ్యేత పాతకాత్!!
ఏదైనా ఒక లౌకికమైన ఉన్నతిని కోరి శివపురాణం చదివినట్లైతే అది కూడా తప్పక లభిస్తుంది. పాపనాశనం జరుగుతుంది.
ఏతచ్ఛివపురాణం యో నమస్కుర్యాద దూరతః!
సర్వదేవార్చన ఫలం ప్రాప్నోతి న సంశయః!!
పుస్తక సమీపానికి వచ్చి నమస్కరించిన వారికి దేవతలందరినీ పూజించిన ఫలం కలుగుతుంది. దీనిని రచించి యోగ్యులైన వానికి, శివభక్తులకు దానం చేస్తే సర్వవేదాధ్యయనం చేసిన ఫలితం లభిస్తుంది. దీనిని చతుర్దశినాడు శివభక్తుల సభలలోఅర్థం వివరిస్తూ చెప్పినట్లైతే చెప్పిన వారికి గాయత్రీ పునశ్చరణ ఫలం లభిస్తుంది. ఇందులో సర్వకోరికలూ తీర్చగలిగే సంహితలు చాలా ఉన్నాయి.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML