మా బాబుకి వివాహము తొందరగా అవక, అవాంతరములు ఏర్పడుతున్నపుడు. ధర్మ పత్ని లభించుట చాల కష్టముగా ఉంది ఏమయినా పరిహారం తెలియచేయకలరు - మేరి, విజయనగరం .
(పూర్వ జన్మ శాపాలు - పరిహారాలు )
పంచమ స్థానం పూర్వ పుణ్య స్థానం, వెనుక జన్మలో ఒక స్త్రీ శాపం పొంది ఈ జన్మలో పుట్టిన వారికి వివాహం తొందరగా అవక అవాన్తరములు ఏర్పడును. ధర్మ పత్ని లభించుట చాల కష్టము. శుక్రవారము కాని లేక మంగళ వారము కాని ఏదయినా అమ్మవారి గుడికి వెళ్లి, ముగ్గురు ముత్తైదువులకు తాంబూలము ఇచ్చి, వారికి పాద నమస్కారము చేసి, వారి చేత దీవించబడి, అనుగ్రహము పొంది. ఆ గుడిలోని అమ్మవారిని ప్రార్దించి రావాలి. ఇలా 5- వారాలు చేయాలి . తరువాత ఒక రోజు నది తీరమునకు వెళ్లి , ఆ నది తీరాన స్నానం చేసి, ఆ నది ఒడ్డున నెయ్యి దీపం వెలిగించి, ఆ గంగా మాతకు వదివాల సామగ్రి ( అంటే బియ్యం , బెల్లం ,గాజులు, పసుపు, కుంకం , రవిక, అన్ని చాటలో ఉంచి కాటుక, దువ్వెన, అన్ని చాటలో ఉంచి, వేరొక చతతో ముసి పసుపు దారముతో గట్టిగ కట్టి ఆ రెంటిని) , ఆ నది లో వదిలి వేయాలి . ఒక బ్రాహ్మణునికి 11- రూపాయలు మాత్రమె ఇచ్చి కాళ్ళకు నమస్కారము చేసి ఆశీర్వాదము పొందండి

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment