గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 28 November 2014

మహాభారతంలో రెండు చోట్ల సుబ్రహ్మణ్యుడి యొక్క వైభవం చెప్పబడుతోంది

మహాభారతంలో రెండు చోట్ల సుబ్రహ్మణ్యుడి యొక్క వైభవం చెప్పబడుతోంది. ౧. ధర్మరాజాదులకు మార్కండేయ స్వామి ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుని ఆవిర్భావ ఘట్టం చెప్తారు. అరణ్యపర్వంలో వస్తుంది. మళ్ళీ శల్యపర్వంలో సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్టం అని అద్భుతమైన ఒక ఘట్టం చెప్పబడుతున్నది. దాని సారాంశం ఏమిటంటే స్వామికి పట్టాభిషేకం చేసి సర్వదేవతలూ వారి వారి గణములన్నీ సుబ్రహ్మణ్యుని అధీనం చేస్తారుట. ప్రతి దేవతకీ కొన్ని గణములుంటాయి. ఇంద్ర గణములు, వాయు గణములు, వరుణ గణములు, అలాగే వసు గణములు, రుద్ర గణములు, ఆదిత్య గణములు. బ్రహ్మ దేవునికి సృష్టిలో సహకరించే గణములు, విష్ణువునకు స్థితిలో సహకరించే వైష్ణవ గణములు, అలాగే రుద్ర గణములు, శక్తి గణములు వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యునికి అప్పగించబడతారు. వారందరినీ నడిపేవాడు సుబ్రహ్మణ్యుడు. అంటే సర్వదేవతా శక్తి సమూహ స్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. అందుకు సుబ్రహ్మణ్యుని అనుగ్రహం ఉంటే సర్వదేవతల అనుగ్రహం ఉన్నట్లే. ప్రధానంగా ఈయన పేరు కుమారుడు అని వ్యవహారం. అంటే ఇది కుమారతత్త్వము. శివ, శక్తి ఈ రెండూ మూల తత్త్వములు గనుక తల్లిదండ్రులుగా చెప్పబడతాయి. ఆ రెండిటి సమాహారమై వచ్చినవాడు గనుక కుమారతత్త్వంగా చెప్తూన్నారు. కుమార తత్త్వం కూడా జ్ఞాన స్వరూపం. బ్రహ్మదేవుడికి సనత్కుమారుడు అని పుత్రుడు ఉన్నాడు. యితడు బ్రహ్మవేత్త. బ్రహ్మకు సనత్కుమారుడు ఎలాగో శివుడికి సుబ్రహ్మణ్యుడు. అందుకే సనత్కుమారుడే కుమారస్వామిగా శివుడికి పుత్రుడయ్యాడు అని ఉపనిషత్తుల ఆధారంగా ఒక కథ మనకి చెప్పబడుతున్నది. ఇందులో ఆంతర్యం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యుడు జ్ఞానప్రదాత. పైగా 'సుబ్రహ్మణ్య' అనే మాటయే ఆయన ప్రత్యేకించి బ్రహ్మజ్ఞాన స్వరూపుడు అని మాట చెప్పబడుతున్నది. కనుక జ్ఞానపరంగా ఈయన గురువైతే యజ్ఞపరంగా సర్వదేవతలకీ బలాన్ని ఇచ్చేది యజ్ఞం. యజ్ఞం ద్వారానే దేవతలు బలం పొందుతారు. బలం పొందిన దేవతలు ప్రపంచాన్ని కాపాడతారు. అందుకు దేవతలు బలంపొంది మనల్ని కాపాడాలంటే దేవతలకి మనం బలం ఇవ్వాలి. అలా బలమివ్వగలిగే శక్తి యజ్ఞానికి ఉన్నది. యజ్ఞ స్వరూపమే సుబ్రహ్మణ్యము అని చెప్పబడుతున్నది. వేదమునందు యజ్ఞాగ్నిని ఉద్దేశించి 'సుబ్రహ్మణ్యోం' అని మంత్రం ప్రత్యేకించి చెప్పబడుతున్నది.
దేవా యుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్యాయం హ్యాయమ్!
యం సిద్ధయంతి స్కందం వందే సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం!!
అని వేదపాదస్తవం చెప్తున్నటువంటి మాట. దేవతలు యుద్ధ సమయంలోనూ అలాగే ఋషులు యజ్ఞసమయంలోనూ ఎవరిని ఆరాధించడం చేత వారి వారి ప్రయోజనములను సిద్ధింపజేసుకుంటున్నారో అటువంటి సుబ్రహ్మణ్యుడికి నమస్కారము అని భావం ఇక్కడ.
కార్య సిద్ధి కలగాలన్నా, ప్రతికూలతలు తొలగాలన్నా, విద్య కావాలన్నా, శక్తి కావాలన్నా, వంశవృద్ధి కలగాలన్నప్పటికీ కూడా సుబ్రహ్మణ్యారాధన చేయాలి. అందుకే యజ్ఞ, శక్తి, జ్ఞాన తత్త్వములే కాకుండా వంశ వృద్ధిని కలిగించే శక్తి సుబ్రహ్మణ్యుని స్వరూపము. ఇది ఒక ప్రత్యేక కోణం. ఎందుకంటే ఆయన కుమారుడు. శివశక్తులను తల్లిదండ్రులను చేసినటువంటి వాడు ఇతను. అందుకే ఈయన కారణంగా వాళ్లకి సంతాన తృప్తి లభించింది. అందుకు దివ్య బాలకుడైన సుబ్రహ్మణ్య ఆరాధన ఎవరు చేస్తారో వాళ్లకి కూడా ఉత్తమ సంతానాన్ని పొందినటువంటి తృప్తిని కలిగిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకు ఈయనని కుమారతత్త్వంగా ఆరాదించడంలో విశేషమిది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML