గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 11 November 2014

బ్రహ్మ విష్ణువులు చేసిన శివ స్తుతి ( శివపురాణం):

బ్రహ్మ విష్ణువులు చేసిన శివ స్తుతి ( శివపురాణం):
నమో నిష్కల రూపాయ నమో నిష్కల తేజసే!
నమః సకలనాథాయ నమస్తే సకలాత్మనే!!
నమః ప్రణవ వాచ్యాయ నమః ప్రణవలింగినే!
నమః సృష్ట్యాదికర్త్రే చ నమః పంచముఖాయ తే!!
పంచబ్రహ్మ స్వరూపాయ పంచకృత్యాయ తే నమః!
ఆత్మనే బ్రహ్మణే తుభ్యమనంత గుణశక్తయే!!
సకలాకల రూపాయ శంభవే గురవే నమః!
ప్రభూ! మీరు నిష్కల రూపులు, మీకు నమస్కారము. నిష్కల తేజస్సుతో దేదీప్యమానులైన మీకు వందనములు. సమస్తమునకు స్వామియైన మీకు నమోవాకములు. సర్వాత్ములైన మీకు ప్రణామములు. సకల స్వరూపులు మహేశ్వరులగు మీకు నమస్కారములు. ప్రణవమునకు వాచ్యార్థమగు మీకు నమస్సులు. ప్రనవలింగ స్వరూపులైన మీకు ప్రణామములు. సృష్టి, పాలన, సంహారము, తిరోభావ అనుగ్రహములనెడు కృత్యములను చేయు మీకు నమస్కారము. పంచముఖులై పరమేశ్వరులైన మీకు ప్రణామములు. పంచబ్రహ్మ స్వరూపులు, పంచకార్య నిర్వాహకులు అయిన మీకు నమోవాకములు. అందరి ఆత్మలు మీరే. పరబ్రహ్మయు మీరే. మీ గుణములు, శక్తులు అనంతములు. అట్టి మీకు నమస్కరించుచున్నాము. సకల, నిష్కల రెండు రూపములును మీరే. సద్గురుడవు, శంభుడవు అయిన మీకు నమస్కారము.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML