ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Labels

గమనిక : 1) తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు , మరియు స్వీకరించదు. 2) ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి. 3) మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.

Tuesday, 11 November 2014

నిద్రలేవగానే అది మొదటి సంకల్పం ఏమిటి చెప్పాలంటే

నిద్రలేవగానే అది మొదటి సంకల్పం ఏమిటి చెప్పాలంటే - సాధారణంగా ఎడమవైపు నిద్రపొమ్మని శాస్త్రం చెపుతోంది. మీరు నిద్రలేవగానే నీ దృష్టి ప్రసారము తిన్నగా మీరు ఆరాధించే దేవతా స్వరూపము మీద పడాలి.
ఆ స్వరూపం లక్ష్మీ నారాయణులు కావచ్చు, పార్వతీ పరమేశ్వరులు కావచ్చు లేక మరొక దేవతా స్వరూపం కావచ్చు. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మస్వరూపం కాబట్టి దానియందు అభ్యంతరం లేదు. అలా లేవగానే దేవతా స్వరూపమును చూడడం మొదటిదిగా మనస్సుకు మీరు అలవాటు చేయాలి. అంతేకాని, టైము అయిపోతోందని గడియారం వంక చూస్తూ కంగారు కంగారుగా లేవడం అలవాటు కాకూడదు. నిద్రలేవగానే మీ తలను తిప్పి కళ్ళువిప్పితే మీ మొట్టమొదటి దృష్టి చెదురుతూ నిద్రపోయిన కనులలో నుండి వెలువడిన మొదటి కిరణప్రసారము పరమేశ్వరమూర్తి మీద పడడం చేత పరావర్తనము చెంది, ఆ పార్వతీ పరమేశ్వరులు లేక లక్ష్మీనారాయణుల దర్శనం జరిగి ఈ కంటితో చూసి లేచిన తరువాత కాలు పెట్టేముందు మనస్సునందు మరల 'సముద్రవసనేదేవి పర్వతస్తనమండలే' అని ఒక శ్లోకం చెప్పి క్రిందకి దిగగానే 'గురువుగారూ, మీరు నాకు ఉపదేశం చేశారు - మీరు చెప్పిన బుద్ధితో ఈ రోజు నారోజు గడుచు గాక' అని నేలమీద పడి గురువుగారి పాదములను ఒక్కసారి మనస్సులో ధ్యానం చేసి, వారి పాదములకు శిరస్సు తాటించి పైకి లేవాలి. ఇది మీకు అలవాటయితే మీకు తెలియకుండా మీకు మొదటి ఆలోచన రావడానికి సాక్షి అవుతుంది. ఇపుడు ఈ ఆలోచనను మీరు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదీ స్థితికారకత్వము!
లలితాసహస్రంలో అమ్మవారికి 'భావనామాత్ర సంతుష్టాయై నమః' అని ఒక నామం ఉన్నది. నీ భావన చేత ఆవిడ సంతుష్టురాలవుతుంది. మీ మనస్సులో మీరు మంచి భావన చేస్తుంటే అక్కడ ఆమె ఆనందిస్తుంది. మనలోవున్న శక్తి అంతా ఆవిడే! ఇక్కడవున్న ప్రకృతి వికారమయిన శరీరము ఆవిడ. ఇది ఆయనను కోరుతోంది. దీనిని దానితో కలపాలని ఆవిడ తెరపైకెత్తుతుంది. ఇది మాయ అన్న యవనికను ఒకరోజున పైకి ఎత్తేస్తుంది. అప్పుడు మీరు దానితో కలుస్తారు. అప్పుడు మీరు జీవితంలో అనుసంధాన ప్రక్రియగా వెళ్ళవలసిన మహేశ్వర స్వరూపము. అంతేకాని - మహేశ్వర స్వరూపమనగా ఏదో దేవతలందరి చేత పూజించబడేవాడు అని అనుకోకూడదు. అలా అనుకోవడం దోషం కాకపోవచ్చు. కాని మీరు అలా అనుసంధానం చేసుకుంటే అది భక్తికి బాగా పనికొస్తుంది. కాని ఇది మీరు నిత్యజీవితమునందు అలవాటులోకి తెచ్చుకోవలసిన ప్రక్రియ. మీరు యిలా దర్శనం చేస్తూ వెడుతున్నట్లయితే మీ లయ పరమశివుడు. నిద్రలేవగానే మిమ్మల్ని ఎవరయినా 'మీరు ఇప్పటిదాకా ఎవరితో కలిసి ఉన్నారు' అని అడిగినట్లయితే అపుడు మీరు ధైర్యంగా 'నేను ఇప్పటివరకు కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులతో కలిసి వున్నాను - అదీ నా నిద్ర' అని చెప్పగలగాలి. ఎందుచేత? నేను ణా నిద్రను పడుకోబోయే ముందు అలా స్వీకరించాను. నేను లేచినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ దర్శనమే ణా మేల్కొనుట. ణా పూజామందిర ప్రవేశము స్థితికర్త ప్రార్థన. నా నిన్నటిరోజు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల సమాహారము. అది మహేశ్వర స్వరూపముగా నాచేత ఉపాసన చేయబడిన కాలము. కనుక నేను మహేశ్వరోపాసన చేత మరొక మాహేశ్వరుడను అయినాను. ఇది మీ జీవితమునందు రావలసిన ప్రక్రియ. ఇలా చెయ్యగా చెయ్యగా భ్రమరకీటక న్యాయంలో ఒకనాడు మీరు ఆ స్వరూపమును పొందుతారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML