గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Monday, 17 November 2014

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ''త్రిపుర పూర్ణిమ'', ''దేవ దీపావళి'' అని కూడా అంటారు.

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ''త్రిపుర పూర్ణిమ'', ''దేవ దీపావళి'' అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీకమాసం ప్రారంభమౌతుంది. ఇక ఆరోజు నుండి కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగించి సంరంభం చేస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ నెల అంతా కార్తీక మహా పూరాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తారు.

మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి.

కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.

కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి.

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి అన్ని పౌర్ణముల కన్నా అధిక ప్రాముఖ్యం ఉంది. .

ఉదయం నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేసి వస్తారు. సాయంత్రం చీకటి పడ్డాక దేవాలయంలోనూ, ఇంట్లోనూ దీపాలు వెలిగించి వెలుగులు నింపుతారు.

దీపం అంటే మన సంస్కృతిలో జ్ఞానం అని అర్ధం. దీపం వెలిగించడమంటే జ్ఞానాన్ని వెలిగించడం అని అర్థం. అంటే మన మాతృ మూర్తులు దీపాలు వెలిగించి మన సమాజంలో జ్ఞానాన్ని నింపుతున్నారు. కాబట్టి మన జన్మదినం రోజున మన తల్లి దీపం వెలిగించి మనలో జ్ఞానాన్ని నింపుతుంది. ఇది తరతరాల నుండి పరంపరగా వస్తున్న మన సంస్కృతి.

కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా దీపం వెలిగించినట్లుగా ఉంటుందని మన సంస్కృతిలో ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇప్పటికీ మన మాతృ మూర్తులు పాటిస్తూ సమాజంలో జ్ఞానమనే వెలుగులు నింపుతూనే ఉన్నారు. మన మాతృ మూర్తులకు మనమెంతో ఋణపడి ఉన్నాము. వారికీ ఇవే మన శుభాభినందనలు.

కార్తీక పౌర్ణమి రోజున రాత్రి పండు వెన్నెల ఉంటుంది. ఈ వెన్నెలకు కూడా ఒక విశేషం ఉంది. అదేమిటంటే ఈ వెన్నెలలో పాలు కాస్తే ఆ పాలు పున్నమి చంద్రునిలో ఉండే అమృతంతో నిండి అమృత తుల్యం అవుతాయని ఒక నమ్మకం. ఆ పాలు త్రాగితే మనం కూడా అమృతం త్రాగిన దేవతల వలె యవ్వన వంతులై ఉంటామని, నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా వర్దిల్లుతామని కూడా ఒక నమ్మకం. అందుకని పూర్వకాలంలో మన పెద్దలు కార్తీక పౌర్ణమి వెలుగులో పొయ్యి వెలిగించి పాలను మిరియాలతో పాటుగా కాచి త్రాగేవారు.

ఈ విధంగా సంవత్సరం పొడవునా ఏదో ఒక పండుగ పేరుతో మానవులు నిత్యం ఉల్లాసంతో, ఉత్సాహంతో కళకళలాడుతూ నిండు నూరేళ్ళు జీవించాలనే ఉద్దేశ్యంతో మన పెద్దలు వీటిని పరిశోధించి మరీ పెట్టారు. అందుకే ప్రపంచంలో హిందువులలో ఉన్న ఉత్సాహం, ఉల్లాసం మిగతా దేశాలలో మనకు కనిపించదు.

దీపారాధన కార్తీక పౌర్ణమి నాడు చేయడం శ్రేష్టమైనది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది, సాదారణంగా కృత్తిక సక్షత్రం కార్తీక పౌర్ణమి కలసి వస్తుంటాయి. పౌర్ణమి కృత్తిక నక్షత్రంలో దీపారాధన చేయడం శ్రేష్టం. ఈ నక్షత్రంలో చేసే దీపారాధనకు కృత్తిక దీపం అనే పేరుకూడా ఉంది.

పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం, సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించాలి. బియ్యప్పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనే కూడా వాడవచ్చు. కార్తీకమాసంలో దీపదానం చేస్తే ఫుణ్యమని అంటారు.

దీపదానం చేయాలనుకునే వారు పత్తితో స్వయంగా వత్తులు చేసుకోవాలి. బియ్యంపిండి లేదా గోదుమపిండితో ప్రమిధలు చేసిన అందులో ఆవునెయ్యితో తాము చేసిన వత్తులు వేసి వెలిగించాలి. బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఈ నెలలో వచ్చే నాలుగు సోమవారాలలో శివునిని పూజించడంతో పాటు ఉపవాస వ్రతాలు చేస్తే మంచిది.

ఈ నెలలో వచ్చే అమావాస్యనాడు దేవాలయాలలో రకరకాల దీపారాధనలతో అలంకరిస్తారు. ఎవ్వరు ఎన్ని దీపాలు పెడితే అంత పుణ్యం వస్తుందని ప్రతీతి. కార్తీకమాసంలో వెలిగించే దీపాలను దర్శించడం వలన మనుష్యులతో పాటు సమస్త జీవరాసులకు పునర్జన్మ ఉండదని పురాణాల్లో ఉంది.

దేవాలయాలలో చేసిన దీపారాధన వలన పుణ్యలోకాలు లభిస్తాయని నమ్ముతారు. కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన జన్మాంతర పాపాలు నశిస్తాయంటారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML