గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 23 November 2014

పద్మం, కమలం

పద్మం, కమలం
* పద్మం, కమలం - సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన సంకేతాలు.
పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయే, పద్మదళాయతాక్షి, .. పద్మాసనస్థా .. లక్ష్మీ స్తోత్రం, * నాభికమలం - విష్ణువులో బ్రహ్మోత్పత్తి స్థానం, * ముఖ పద్మం, హృదయ కమలం, కర కమలం, -- కవుల ఉపమానాలు; * పద్మం బుద్ధునికి కూడా ప్రియమైనది. ఓం మణిపద్మేహం - బౌద్ధుల ధ్యానమంత్రం. హృదయ పద్మంలో అవలోకితేశ్వరుని ధ్యానించాలి. పద్మ పాణి, పద్మసంభవుడు బోధిసత్త్వులు. కృష్ణుడే బుద్ధుడిగా వచ్చాడు. * పద్మాసనం, సహస్రారపద్మం - యోగం, పద్మ వ్యూహం - మహాభారత యుద్ధం. * * వీటన్నిటికీ కృష్ణావతారం తో సంబంధం ఉన్నది. కృష్ణుడు యోగీశ్వరుడు. జగద్గురువు. ఆయన ప్రథమ శిష్యుడు అన్న బలరాముడు. ఆయన ఆదిశేషుని అవతారం. ఆయన అవతారం పతంజలి మహర్షి, యోగ శాస్త్రమునకు ఆద్యుడు.కృష్ణుడు అన్నిజీవుల హృదయాలలో అంతరాత్మ ఐన పరమాత్మ. బలరాముడు ఆదిశేషువుగా మానవులలో మూలా ధారంలో ఉండే కుండలిని. మూలా ధారానిది భూతత్త్వం. అధిదేవత గణపతి. యోగసాధనకు కూడా ఆయనయే ప్రథమ పూజార్హుడు. మూలాధార పద్మానికి నాలుగు రేకలు. వం, శం, షం, సం బీజాక్షరాలు. తరువాతది స్వాధిస్ఠానం. అగ్నితత్త్వం. ఆరురేకల పద్మానికి బీజాక్షరాలు బం, భం, మం, యం, రం, లం, .. రం అగ్నిబీజం. మొత్తంఆరు పద్మాలు. లేక చక్రాలు. సాధనతో కుండలిని జాగృతం చేసి మూలాధారం నుండి కుండలినిని సహస్రారంవరకు తీసుకొని వెళ్ళగలిగితే సిద్ధి. మార్గంలో అనేక సిద్ధులు కలుగుతాయి. ఈ మార్గంలోనే పరకాయ ప్రవేశం, ఊర్ధ్వలోక దర్శనం వంటివి సాధ్యమౌతాయి. సహస్రారానికి బీజాక్షరం ఓం. ప్రణవం. ప్రణవ స్వరూపం వక్రతుండం. మళ్ళీ గణపతి యొక్క పరమేశ్వరతత్త్వం. మార్గంలో సకలదేవతల దర్శనాలు కలుగుతాయి. ఇవి పురాణ కథలు కావు.యోగుల అనుభవాలు.No comments:

Powered By Blogger | Template Created By Lord HTML