గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 23 November 2014

మానస సరోవరం విశేషాలు.

హిందూధర్మచక్రం
మానస సరోవరం విశేషాలు.

సాక్షాత్తు పరమశివుని నివాసం కైలాసం. బ్రహ్మదేవుడు మనస్సంకల్పంతో సృష్టించిన మహాద్భుత సరస్సు మానససరోవరం. భూమండలానికి నాభిస్థానంలో ఉన్నట్లు భావించే కైలాసపర్వతం హిందువులకే కాక, బౌద్ధులకు, జైనులకు, టిబెట్ లో ప్రాచీనమైన 'బొంపో' మతానుయాయులకు కూడా ఇది అతిపవిత్రం, ఆరాధ్యం. మామూలు కళ్ళకు ఇది మట్టిగా కనిపిస్తుంది. కానీ యోగదృష్టితో చూసినవారికి దివ్యశక్తే ఇక్కడ పృథివీ రూపం ధరించిందని తెలుస్తుంది. పరమశివుడు పురుషుడు, పరమేశ్వరి ప్రకృతి అతడు శివుడు, ఆమె శక్తి. ఆ శివశక్తుల భవ్యలీలాక్షేత్రం కైలాసమానససరోవరం. రజకాంతులతో వెలిగిపోయే కైలాస శిఖరం సచ్చిదానందానికి నెలవు. లలితాదేవి కాలి అందెల రవళులలో ఓంకారం, నటరాజు తాండవంలో ఆత్మసారం ధ్వనిస్తుంది.

కల్పవృక్షం ఇక్కడే ఉంటుందని కుబేరుడి నివాసం కూడా ఇక్కడే అని విష్ణుపాదోద్భవ గంగ కైలాసశిఖిరికి చేరి దానిని ప్రదక్షించి అక్కడి నుంచి నాలుగు నదులుగా మారి ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్, కర్మలి నదుల పుట్టుక ఇక్కడే. మానససరోవరంలో మునిగి కైలాసపరిక్రమ చేసినవారికి జన్మరాహిత్యమే అంటారు. శివునిలో లీనమై తామే శివస్వరూపులైపోతారని చెబుతారు. కల్పవృక్షం ఇక్కడే, గంగ భూమిని చేరింది ఇక్కడే ఇటువంటి కైలాస మానస సరోవరం దర్శనం అనేక జన్మల పుణ్యం.

ఒక్కోసారి భయాందోళనలతో ఒడలు జలదరింప చేసే అనుభవాలూ, భక్తిపారవశ్యంతో తనువు పులకరింప జేసే దివ్య అనుభూతుల సమ్మేళనం కైలాస మానస సరోవరయాత్ర ఒక వింత అద్భుతం. ఆధ్యాత్మికతలను అందించే ఒక అద్భుత యాత్ర.

కైలాసశిఖరే రమ్యా పార్వత్యా సహితః ప్రభో
అగస్త్యదేవ దేవేశ మద్భక్త్యా చంద్రశేఖరః

కళ్ళు మూసుకుని శ్లోకాన్ని అంటూ ఉండగా, కైలాస పరవతాన్ని కళ్ళల్లో ఊహించుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చూసేసరికి అదిగో 'కైలాస్' అనడం, మేము కారు దిగిపోవడం ఒక్కసారిగా జరిగాయి. ఎదురుగా అల్లంత దూరాన మౌంట్ కైలాస్ శిఖరం తెల్లగా వెండిపర్వతంలా మెరిసిపోతూ కనిపించింది. 'ఎన్ని జన్మల పుణ్యమో కదా ! పరమేశ్వరా! ఎప్పటి నుంచో వస్తున్న పాపాలు....నీ దర్శన భాగ్యంతో హరించుకుపోతాయి. ఈ అల్పజీవి మీద నీకు ఇంత కరుణ ఎందుకు స్వామి!"

దేవతల అర్ధరాత్రి స్నానాలు ..!

మానససరోవరంలో ప్రతిరోజు అర్దరాత్రి దేవతలు వచ్చి స్నానం చేసి కైలాసంలోని ఈశ్వరున్ని దర్శిస్తారు అని కళ్లకు నక్షత్రరూపంలో మాత్రమే కనిపిస్తారని అంటారు. ఈ సరోవరంలో హంసలు ఉంటాయని అదెంతమాత్రం నిజమో, కాని హంసల్లాంటి పక్షులు ఉన్నాయి. మానససరోవరానికి ఇంకోవైపు రాక్షసతాల్ అనే ఒక సరోవరం ఉంది. ఇక్కడ రాక్షసులు స్నానం చేస్తారని మరెవ్వరూ స్నానం చెయ్యరు అని దీని మధ్యలో చిన్న రాతిగుట్ట మీద రావణాసురుడు శివుని కోసం తపస్సు చేశాడని, కైలాసపర్వతం ఎత్తబోయాడని అంటారు.
మానసరోవరం అనేది చైనా కు చెందిన టిబెట్ ప్రాంతంలో గల మంచినీటి సరస్సు,
సంస్కృతములో మానస అనగా మనసు, సరోవరము అనగా సరస్సు. పూర్వ కాలములో భారత దేశం, టిబెట్, నేపాల్ సరిహద్దులతో నిమిత్తం లేకుండా కలిసియుండేవి. అందువలన మానసరోవరము భారతీయులకు, నేపాలీలులకు, టిబిటియన్లకు పవిత్ర స్థలమైయున్నది., అనగా హిందువులకు, బౌద్ధులకు, జైనులకు మనసరోవరం పవిత్రమైన సరస్సు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడి ఆలోచననుండి మానసరోవరం ఆవిర్భవించి భూమ్మీద పడినది. మానసరోవరంలోని నీరు త్రాగితే మరణించిన తర్వాత నరకానికి వెళ్ళకుండా నేరుగా కైలాసానికి చేరవచ్చని, సరస్సులో స్నానమాడితే నూరు జన్మల వరకూ పాపాలు పరిహారమైపోతాయని , జ్ఞానానికి మరియు అందానికి ప్రతిరూపాలైన హంసలు మనసరోవరములో విహరించేవని హిందువులు నమ్ముతారు.బ్రహ్మ దేవుడు మానసాన ఊహించి భూమిపై ఆవిష్కరించినది కనుక ఇది మానస సరోవరం గా చెపుతారు.

ప్రపంచంలో కెల్లా ఈ సరోవర జలం స్వచ్చమైనది, అత్యుత్తమమైనదిగా ప్రతీక. స్వచ్చమైన ఈ సరోవరంలో తెల్లని హంసలు అదనపు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మానస సరోవర పరిధి దాదాపు 90కి,మీ. ఆసియా ఖండంలోని నాలుగు గొప్పనదులు - బ్రహ్మపుత్ర, కర్నలి, ఇండస్, సట్లెజ్ లకి అధారం మానససరోవర జలం. ఇక అన్నిటికంటే ప్రత్యేకత వేదమాత విహరించే స్థలం మానససరోవర తీరం. వేదాలు అభ్యసించి, శాస్త్రాలు ఆచరించలేక పోయినా ఈ సరోవర జలం తీర్థంలా సేవించి, సరోవరంలో స్నానం చేస్తే జన్మధన్యం అనేది నమ్మకం.

చలికాలము లో సరస్సు ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఫలితంగా అక్కడి వాతావరణం యాత్రీకులకు ప్రతికూలంగా ఉంటుంది కనుక యాత్రీకులు సాధారణంగా ఎండాకాలంలోను, ఋతుపవనాల కాలంలోను మనసరోవరాన్ని దర్శిస్తారు. భారత దేశంలో ఉత్తర కాశి నుండి మరియు నేపాల్ లో ఖట్మండు నగరం నుండి ప్రతి సంవత్సరము కైలాస మానసరోవర యాత్రలు జరుగుచున్నవి.వేద, పురాణ ఇతిహాసాల ప్రమాణికంగా కైలాసగిరి-హిమాలయాలు భరత ఖండానికి చెందినవి, 7వ శతాబ్ధం టిబెట్ స్వతంత్ర దేశంగా పాలన మొదలు పెట్టినప్పడి నుండీ ఈ కైలాసగిరి టిబెట్ దేశానికి చెందినది. అందువల్ల హిందువులకే కాక బౌద్ధ, జైనులకి కూడా ఇది ఎంతో పవిత్రమైన పుణ్యస్థలము. 1950 చైనా టిబెట్ ని ఆక్రమించుకున్నాక, భారతీయులకి కైలాస సందర్శనం కష్ట సాధ్యమయ్యింది. 1959 నుండీ 1978 వరకు దాపు 20 సంవత్సరాలు అసలు ఎవరికీ ఈ గిరిని దర్శించడానికి అనుమతి ఇవ్వలేదు.ఆతరువాత 1980 నుండీ కొద్దికొద్దిగా యాత్రికులని భారత ప్రభుత్వం ద్వారా వెళితే అనుమతించేవారట. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా పలు ట్రావెల్ ఏజెంట్స్ ఈ యాత్రని కొంత సుగమం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

మానసిక సంకల్పంతో పాటు శారీరకం గా కూడా అక్కడి వాతావరణం తట్టుకునే శక్తి కావాలి. ఈ యాత్రకి సిద్దం కావడానికి ముందు నుండీ ఉదయం సాయంత్రం నడక, శ్వాసకి సంబంధించిన వ్యాయామం, యోగా చేయడం ఎంతైనా తోడ్పడతాయి. మధుమేహం, స్పాండిలైటీస్, బాక్పేఇన్ ఆస్తమ, సైనస్ వంటివి ఉంటే, ఈ యాత్ర చేయలేరు. అయినాసరే ఈ యాత్ర చేయాలనుకుంటే డాక్టర్ని సంప్రదించి సరైన పర్యవేక్షణలో చేయాలి. సముద్ర మట్టం నుండీ 4000 మీటర్ల ఎత్తు వెళ్లిన తరువాత, శరీరానికి తగినంత ప్రాణవాయువు అందడం కష్టం అవుతుంది. అందుకు డైమాక్స్ అనె టాబ్లెట్ రోజు రాత్రి తప్పనిసరి వేసుకోవాలి. ఇది ఏ ఆల్టిట్యుడ్ లో మొదలుపెడితే, తిరుగు ప్రయాణంలో అక్కడకి వచ్చేదాకా వేసుకోవాలి. ఇక జలుబు దగ్గు, గొంతునొప్పి, నడచి అలసిపోతె వేసుకోడానికి పారాసిటిమాల్, వికారం, వాంతులు, విరోచనాలకి సంబందిచిన ఇంకా ఏ ఇతర వాటికోసమైనా మందులు మన దగ్గర ఉంచుకోడం ఎంతైనా అవసరం. అలాగే చలికి తట్టుకునే విధమైన వస్త్రాలను ధరించాలి. అంతేకాదు ఈ ప్రయాణం లో స్నానం, టాయిలెట్ సౌకర్యం అన్నిచోట్లా సరిగ్గా ఉండదు.అక్కడి పరిస్తితులని బట్టి సర్దుకుని పోడానికి సంసిద్దం కావాలి

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML