గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 19 November 2014

రచన: శ్రీ గంగ చౌదరి : ఆదిశక్తి రెండు రూపాలు

ఆదిశక్తి రెండు రూపాలు మొదటి రూపం ఆదిశక్తి సతిదేవి - 
రెండోవ రూపము నారాయణుడి అంశం పార్వతిదేవి.
కథ రచన: శ్రీ గంగ చౌదరి 
ప్రళయకాలం లో సకల దేవతలని తనలో విలీనం చేసుకొని అనంత రూపముగా మారి సర్వ సృష్టిని నశింప చేసి తిరిగి యధా ప్రకారము సూర్యోదయంలా ప్రశాంతమైన సృష్టిని అవిర్భావింప చేయు తల్లి భద్రకాళి.ఆదిశక్తి తన శక్తులను విభజన చేయు వేళా శివుని నుంచి శక్తి గా రెండు రూపాలు మారాయి ఈ వియోగము భరించలేని మహాదేవుడు యోగ ధ్యానములో సృష్టి కి సంభంధం లేకుండా తారక మాత్రం జపిస్తూ ధ్యానం లో ఉండిపోయాడు.... పునర్ సృష్టి జరిపి అంతర్ధానం అయిన అది శక్తి కోసం తపసు చేయమని తన పుత్రుడైన దక్ష ప్రజాపతి కి ఆజ్ఞ ఇస్తాడు బ్రహ్మ దేవుడు. తండ్రి మాట పైన తపస్సు చేసి పునః సృష్టి తరువాత నిర్వికార రూపిణి గా ఉన్న అది శక్తి తనకి తనయ గా జన్మించి లయ కారుడైన శివుని ని చేరాలని కోరుతాడు.తపః శక్తి తో ఆదిశక్తి కి తండ్రి అయ్యాడు దక్షుడు.... చిన్నారికి సతిదేవి అనే నామముతో పిలిచేవారు... దక్షునికి ప్రధమ పుత్రిక కనుక దక్షాయని అను నమముతోను పిలువపడింది ఆదిశక్తి సతి. బాల్యము నుండి యోగేశ్వరుని దయను తప్ప మరొకటి ఎరుగదు జగదిశ్వరి. సతి యొక్క జప తపదులతో ధ్యాన ముగ్ధుడైన పరమేష్టిని ప్రపంచం వైపు మర్లించింది సతీదేవి. శివ నామమే అమృతముగా....శివ ధ్యానమే జివనముగా...శివ రూపమే సర్వముగా....
శివ వియోగమే మరణముగా మారిపోయింది సతీదేవి. తన తండ్రి శివ ద్వేశిగా మారటం సహించలేక వారించింది విన్నవించింది...వద్దు నాన్న శివ ద్వేశిగా మారాకు... మహాదేవుడు దేవా దేవుడు ఆయినే సత్యము ఆయనే సుందరం ఆయినే శివుడు.... అంటూ ఎంతో ప్రార్దేయ పడింది సతి... పుత్రిక మాటలు ఏ మాత్రం దక్షుని మనస్సు మార్చలేకపోయాయి. ఒకనాటికి సతి స్వయంవర వేడుక రోజు వచ్చింది.... శివునికి తప్ప అందరికి ఆహ్వానం పలికాడు దక్ష ప్రజాపతి... వేదిక పైకి వచ్చిన సతి మనసారా శివనామము జప్పించి పుల మాల విడిచింది అక్కడికి ప్రత్యక్షమైన శివుని మేడలో వాలింది. ఈశ్వర సంకల్పం మేరకు సృష్టిలో మొట్టమొదటి వివాహం పరిణయం జరిగింది. ఇది సహించలేని దక్షుడు తన శత్రువునే తన పుత్రిక వివాహమాడి తనని అవమానించింది అనే ఆవేశములో తన పుత్రిక అన్నా విషయం మరచి సతీదేవిని శత్రువు యొక్క భార్యగా చూడసాగాడు దక్షుడు. లోకమంతా శివుని గుణాలను తత్వాలను కీర్తిస్తుంటే తన తండ్రి దూషించడం తట్టుకోలేక పోయింది సతీదేవి.తన ముద్దుల పుత్రికను నేను ఒకసారి వెళ్లి నాన్న మనస్సు మార్చి తమ దగ్గరకు పిలుచుకొని వస్తాను స్వామి అన్నది సతీదేవి శివునితో.... త్రికాల జ్ఞానీ అయిన ఈశ్వరుడు అంగీకారం తెలుపలేదు.... అయిన సతీదేవి పుట్టింటికి బయలుదేరింది... అక్కడ చూస్తే మహా యజ్ఞం తలపెట్టాడు దక్షుడు... తన పుట్టింట్లో జరుగుతున్న యజ్ఞానికి తన భర్తని పిలువకపోవడం ఏంటి అంటూ సతి మనసు కన్నీళ్ళతో మునిగిపోయింది....నేరుగా యజ్ఞ వేదిక పైకి వెళ్లి,... తండ్రి ఏమిటిది మీ అల్లుడుగా కాకపోయినా త్రిముర్తులో ఒక్కడుగానైన మహాదేవుడిని ఆహ్వానించడం మరిచార.....కనీస మర్యాద కూడా మీకు తెలిద అంటూ కోపముతో ప్రశ్నించింది సతీదేవి... ఇదే అవకాశముగా దక్షుడు శివుడిని అతి నీచమైన దూషణలు చేయడం మొదలు పెట్టాడు... సతి సహనము విడచింది శివ ద్వేషి పుత్రిక గా నాకు ఈ జీవితం వలదు అంటూ ఆక్రోశించింది... శివుడు లేని ఈ యజ్ఞం ఆగిపోవాలని తనే యజ్ఞముగా మారి భస్మం అయింది సతీదేవి.... సతీదేవి చితి నుంచి ప్రళయకాల రూపిణి కాళీ ఉద్భవించింది.... తన స్వస్వరుపములోకి మారి తన జన్మయోక్క లక్ష్యం శివ దేవుడని... నిర్వికార రూపంలో తను ఉన్నంత కాలము శివుడు సృష్టి కర్తవ్యము మరచి ఉంటాడు కనుక సతిగా ఆవిర్భవించి శివుడిని లోక కళ్యాణము చేయుటకు శివశక్తిగా చేరి జగతిని సంపూర్ణము చేయాలనే..మానవ రూపము ధరించడము అందున నీ భక్తికి వరముగా నీ తనయగా జన్మించడం జరిగింది.అహంకారముతో పరమేష్టిని తుచ్చమైన దూషణలు చేసిన నీ నాలుకను వెయ్యి ముక్కలు చేసేద అంటూ కత్తి దుసింది కాళి మాత.దక్ష శిరః చేధానం అయ్యాక...ఆదిశక్తి అంతర్ధానం అవుతూ ఒక శబ్దం చేసింది
ఎక్కడ స్త్రీలకు అన్యాయం జరుగుతుందో
ఎక్కడ స్త్రీలను దుర్భాశాలడుతరో
ఎక్కడ స్త్రీ కన్నీళ్ళు నేలరలుతాయో అక్కడ దక్షునికి జరిగినట్టే శిరః చేధానం జరుగుతుంది
అంతే కాదు దక్షుని యొక్క రాజ్యం స్మశానం అయ్యినట్టే వారి యొక్క గృహాలు భూత ప్రేత పిశాలతో నివాసం అవుతుందని నేను అంటే కాళీకను అక్కడ విలయ తాండవం చేస్తాను అంటూ ఉగ్ర రూపిణిగా ఘర్జించింది...! సతిదేవిగా భాస్మైనా నేను స్త్రీలకు ఓ వరం ఇస్తున్న ఆడపిల్లకి ఎక్కడ ద్రోహం జరిగిన ఎవరు ద్రోహము చేసిన నేను సహించను... ప్రతి స్త్రీ ఆత్మలో నేను ఉంటాను వారికి తోడుగా వారికి రక్షణ గా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను... వారికి అమ్మగా కాళీ రక్షణ గీస్తున్నాను అంటూ అంతర్ధానమైంది...!!సతి పార్ధివ దేహముతో ముల్లోకాలలో విలయ తాండవం చేస్తున్నాడు మహాదేవుడు., సతి దేహము కనుమరుగు ఐతే కాని శివుడు పునః స్థితిలోనికి రాడని తన సుధార్శనముతో సతి దేహాన్ని 18 భాగాలుగా భూమండల మధ్యమున స్థాపించి... మనవ జనులను ఉద్ధరించాడు శ్రీమాన్ నారాయణుడు. సతీదేవి వియొగముతో... సతి దేహ భస్మాన్ని ధరించాడు మహేశ్వరుడు... సతిదేవి అంతర్ధానమైన మరణమే నిజమని శ్మశానమే శాశ్వతమని కాటి నివాసుడు అయ్యాడు జగదిశుడు...ఇదంతా చూస్తూ దేవతల సృష్టిలో లయారుకుడు లేక గతి తప్పుతోందని శ్రీహరికి విన్నవించారు..., ఆదిశక్తి పునరాగమనం జరగాలని సంకల్పించి... సతీదేవి ధ్యానముతో కాళీ ఉపాసన చేసాడు శ్రీమాన్ నారాయణుడు... ఆదిశక్తి జగన్మాత ప్రత్యక్షమైంది విష్ణువు అమ్మ తమరి కోసం మహాదేవుడు ఎదురు చూస్తున్నాడు తమ మళ్ళి జన్మించి మహాదేవుడిని చేరాలని అన్నాడు శ్రీహరి. ఆదిశక్తి ఈ విధముగా సమాధానం ఇచ్చింది నారాయణ నేను మళ్ళి మనవ రూపం ధరించాను ఏ మానవునికి పుత్రికగా పుట్టాను శివదేవుడిని చేరటం ఇక ప్రళయ కాలములోనే అన్నారు జగన్మాత...ఈ మాట కి విష్ణు దేవుడు ఈ విధముగా అన్నారు "దేవి దుర్గ తమరు శక్తి రూపమున శివుని సగ భాగము...మీరు లేని సృష్టి అసంపూర్ణం... మీరు మానవుని ఘర్బమున జన్మించవద్ధు... కాని మీరు శివదేవుడిని చేరాలి దానికి మీ సహకారం అందిస్తే మీరు శివుని చేరుటకు మార్గము వేస్తాను అన్నారు శ్రీహరి... అలాగే నారాయణ అన్నారు జగన్ మాత.విష్ణువు కోసం హిమవంతుడిని తపస్సు చేయమని నారదుడు ఆజ్ఞ ఇస్తాడు... హిమవంతుని తపః ఫలితంగా నారాయణుడు ప్రత్యక్షమైనాడు.., వరముగా తమ అంశము కల్గిన పుత్రిక కావాలని తన కోరికను విన్నవించాడు హిమవంతుడు... తధాస్తు అంటూ అంతర్ధనమైడు శ్రీహరి. హిమవంతుని తనయగా ఎదిగింది పార్వతి... నారాయణుడి ఉపదేశముతో శివుని కోసం గోరా తపస్సు చేసింది పార్వతి.... తపస్సు చేస్తున్న కాలములో సతీదేవి యొక్క నవ దుర్గ శక్తిని పార్వతి లో విలీనం చేసింది...ఒకనాటికి పార్వతి సతి యెక్క రూపమై శివుని కోసం కట్టినమైన తపస్సు చేసింది... 'పార్వతి నారాయణి' సతీదేవి కాళిక' వీరిరువు ఆదిశక్తులే... వీరి యొక్క ఏక రూపము అమోఘమైన శివ శక్తిగా ప్రజ్వరిలింది... తపస్సు - భక్తి కలిసి శివుని ఆగమనం కోసం నిరిక్షిస్తున్నాయి..సమయం అసన్నమైంది సతి పార్వతి ఏక రూపమై చేస్తున్న తపస్సుకి ఫలితంగా శివుడి ప్రత్యక్షమై పార్వతిని పరిణయం చేసుకున్నాడు.... వివాహమైన కొన్నాళ్ళకి పార్వతి యొక్క నారాయణ వర్ణం అనగా నీలము కాలిక యొక్క శరీర వర్ణం నలుపు కలసి పార్వతి యొక్క మేని ఛాయ కాటుక నలుపు గా మారింది...శివుడు తన మేని ఛాయను చూసి చిరునవ్వు చిందించాడు అది అవమానంగా భావించి తప్పసు చేసి కాళికగా గౌరీగా రెండు రూపాలలోకి మారింది ఆదిశక్తి.Displaying 3110429_orig.jpg

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML