గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 15 November 2014

హిడింబి - భీమసేనులుహిడింబి - భీమసేనులు

భీమసేనుడు కండబలమే కాదు, గుండెబలమూ ఉన్నవాడు. తనను నమ్మి వచ్చినవారికి అండదండలు అందిస్తాడు. దుర్యోధనుడు పాండవులను మట్టుబెట్టాలని చూస్తున్న తరుణంలో పాండవులు తల్లి కుంతీదేవితో కలిసి అడవిలో ప్రయాణిస్తున్న్నారు.

భీముని ఆచూకీ తెలిసిన హిడింబాసురుడు, అతన్ని బంధించి తెమ్మని తన సోదరి హిడింబిని పంపాడు. తల్లి, సోదరులతో కలిసి అడవిలో నడుస్తున్న భీముని, హిడింబి చూసింది. దృఢకాయం, భారీ విగ్రహం, ఆత్మవిశ్వాసం, అపరిమిత ధైర్యసాహసాలు, ముఖంలో తేజస్సు ఉన్న భీమసేనుని చూసిన హిడింబి విపరీతమైన ఆశ్చర్యానందాలకు గురైంది. సోదరుడు హిడింబాసురుడు చెప్పినట్లు అతన్ని బంధించడానికి మనసు ఒప్పుకోలేదు. తొలిచూపులోనే అతనిపట్ల ప్రేమ చిగురించింది.


భీమునితో మాట కలిపింది. నెమ్మదిగా అతన్ని అనుసరించింది. తాను స్త్రీననే వెరపు లేకుండా, తన నిర్మలమైన ప్రేమను తెలియజేసింది. కానీ భీముడు ఒకపట్టాన ఒప్పుకోలేదు. ఈలోపు అక్కడికొచ్చిన హిడింబాసురుడు, విషయం తెలిసి తన సోదరి అని కూడా చూడకుండా హిడింబిని సంహరించబోయాడు. అప్పుడు భీముడే ఆమెను కాపాడాడు. మొత్తానికి హిడింబి ప్రేమకు లొంగిపోయాడు భీముడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని ఉదయం నుంచి సంధ్య చీకట్లు పడేవరకూ తనతో గడుపుతానని, చీకటిపడగానే వెళ్లిపోతానని చెప్పాడు. హిడింబి అందుకు సమ్మతించింది. ఇద్దరూ సంతోషంగా జీవించారు. వారి ప్రేమ గుర్తుగా ఘటోత్కచుడు పుట్టాడు.

హిడింబి ప్రేమకు, వ్యక్తిత్వానికి చిహ్నంగా చిత్రదుర్గలో ''హిడింబేశ్వర దేవాలయం'' ఉంది. హిడింబి, ఆమె సోదరుడు హిడింబాసురుడు ఈ ప్రాంతంలో ఉండేవారట. ఇక మనాలీలోని ఆలయంలోనూ హిడింబిని పూజిస్తారు.

శకుంతలా దుష్యంతులు

వేటకు వెళ్ళిన దుష్యంతుడు శకుంతల ముగ్ధమోహన సౌందర్యానికి చలించిపోయాడు. శకుంతల సైతం అతని ఆరాధనకు దాసోహమంది. దుష్యంతుడు తన అంగుళీయకం తీసి శకుంతల వెలికి తొడిగి గాంధర్వ వివాహం చేసుకున్నాడు. అంతులేని ఆనందాన్ని చవిచూశారు. శాపవశాన దుష్యంతుడు ఆమెను మర్చిపోయినప్పటికీ అశరీరవాణి జోక్యంతో అతనికి జరిగినదంతా కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. అలా వాళ్ళ ప్రేమ ఫలించి శాశ్వతమౌతుంది.

రతీమన్మథులు

మన పురాణ గ్రంధాల్లో ప్రేమకు సంకేతం రతీ మన్మథులు. మన్మథునికి కామదేవుడు, కాముడు, మదనుడు, రతికాంతుడు - లాంటి అనేకపేర్లు ఉన్నాయి. మన్మథుని అర్థాంగి రతీదేవి. ఈ ప్రేమజంట ప్రేముకులను ప్రేరేపిస్తుందని, వారి ప్రేమను మరింత ఉద్దీపింపచేస్తుందని, సఫలమయ్యేందుకు తోడ్పడుతుందని చెప్పే పురాణ కథనాలు ఉన్నాయి.
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ అభినందనలు. ఒట్టొట్టి ఆకర్షణలు ప్రేమ కాదు. అది తాలూతప్పా లాంటిది. కానీ నిజమైన ప్రేమ స్వచ్ఛమైన స్ఫటికం లాంటిది. సూర్యకాంతి లాంటిది. విశ్వజనీనమైంది. అది అమూల్యం, అపూర్వం. స్త్రీ పురుషులమధ్య కలిగే ప్రేమ సంగతి అలా ఉంచితే... మనచుట్టూ దిక్కూమోక్కూ లేని అనాధబాలలు, నిస్సహాయంగా బ్రతుకులీడుస్తున్న వృద్ధులు, జీవన భారాన్ని మోయలేక మోస్తున్న అంగవికలాంగులు లాంటి వారెందరో! అలాంటివారిమీద కనికరం చూపడమే సిసలైన ప్రేమ. ఆ యూనివర్సల్ లవ్ ఇప్పుడు కావలసింది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML