గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 15 November 2014

మొదట బ్రహ్మ పదివేల నామాలను చెప్పాడు. వాటిని మథించి పెరుగులోనుండి నేతిని తీసినట్లు శివ నామ సహస్రం ఉద్ధరింపబడింది

మొదట బ్రహ్మ పదివేల నామాలను చెప్పాడు. వాటిని మథించి పెరుగులోనుండి నేతిని తీసినట్లు శివ నామ సహస్రం ఉద్ధరింపబడింది. పర్వత సారం బంగారమైనట్లు, పుష్పసారం మకరందమైనట్లు, ఘృతసారం మండ(తరంగ)మైనట్లు పదివేల నామాల సారం సహస్రనామం. ఇది సర్వపాపాలను పోగొట్టగలది. చతుర్వేదాలతోనూ సమన్వయించేది. ప్రయత్నపూర్వకంగా దీనిని పొందాలి. నియమపూర్వకంగా ధారణ చేయాలి. ఇది మంగళకరం, పుష్టికరం, రాక్షసవినాశకం, పరమపావనం కూడా. శ్రద్ధ, ఆస్తికత్వం గల భక్తునకు దీనిని ఉపదేశించాలి. శ్రద్ధలేనివారికి, నాస్తికునకు, మనోనిగ్రహం లేనివానికి ఉపదేశింపదగదు. జగత్కారణరూపుడైన ఈశ్వరుని దోష దృష్టితో చూసేవాడు పూర్వీకులతో, కుమారులతో సహా నరకానికి వెళతాడు. ఇదియే ద్యానం. ఇదియే యోగం. ధ్యానింపదగిన ఉత్తమధ్యేయ మిదియే. ఇదియే జపింపదగినది. ఇదియే జ్ఞానం. ఇదియే ఉత్తమ రహస్యం. మరణ సమయంలో దీనిని గ్రహింపగలిగినా పరమగతిని పొందవచ్చు. ఇది పరమపవిత్రం. మంగళకరం, మేధావర్ధకం, శుభకరం, ఉత్తమం. పూర్వకాలంలో సర్వలోకపితామహుడైన బ్రహ్మ దీనిని ప్రకటించి సమస్త దివ్య స్తోత్రాలకు దీనిని రాజుగా ప్రతిష్ఠించాడు. అప్పటినుండి మహాత్ముడైన ఈశ్వరుని కీ సహస్రనామం దేవ పూజితమై లోకంలో స్తవరాజమని ప్రఖ్యాతినందినది. సర్వకళ్యాణాలకు కళ్యాణ స్వరూపమై, సర్వపాప వినాశకమైన ఈ ఉత్తమ స్తవం శివసహస్రనామ స్తోత్రం.
ఈ స్తోత్రం పుణ్యప్రదం, పవిత్రం, సర్వదా పాపవినాశకం, యోగదాయకం, మోక్షదాయకం, స్వర్గదాయకం, ఆనందదాయకం కూడా. ఈ రీతిగా అనన్య భక్తితో ఈ శంకర స్తోత్రాన్ని పఠించిన వాడు సాంఖ్యుడు యోగులు పొందే స్థితిని (మోక్షాన్ని) పొందగలడు. ప్రయత్న పూర్వకంగా రుద్రసన్నిధిలోఈ స్తోత్రాన్ని నిరంతరంగా సం!!కాలంపాటు పఠించిన వాడు కోరిన ఫలితాన్ని పొందగలడు. ఇది పరమరహస్యం.
బ్రహ్మ హృదయగతం ఈ శివ సహస్రం. బ్రహ్మ ఇంద్రునకు, ఇంద్రుడు మృత్యువుకు, మృత్యువు ఏకాదశరుద్రులకు, రుద్రులనుండి తండికి లభించింది. తండి శుక్రునకు, శుక్రుడు గౌతమునకు, గౌతముడు వైవస్వత మనువుకు చెప్పారు. వైవస్వతమనువు ధీమంతుడై, సమాధిస్థితిలో నున్న నారాయణుడనే సాధ్యునకు చెప్పాడు. అచ్యుతుడైన ఆ సాధ్యుడు - నారాయణుడు యమునికి చెప్పాడు. సూర్య సుతుడైన యముడు నచికేతునకు, నచికేతుడు మార్కండేయునకు చెప్పారు.
ఈ స్తోత్రం స్వర్గాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుస్సును, ధనాన్ని ఇవ్వగలది. వేదసమ్మతమైనది.
(మహాభారతం - అనుశాసన పర్వం)

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML