గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 23 November 2014

శకున ఫలితములు, శుభ శకునములు:

శకున ఫలితములు

శుభ శకునములు:

కన్యలు, ముత్తైదువలు , పువ్వులు, భోగంసాని, పండ్లు ,కుంకుమ ,పసుపు, పాలు, మంగళ వాద్యములు, మండుచున్న కాగడా, గంటాద్వని, విజయ శబ్దములు, గాడిద అరుపు ,వేదనాదము, జంట బ్రాహ్మణులు ,చల్లటి గాలి,గుఱ్ఱములు, ఏనుగులు, ఆవులు, చేపలు, సంతోషవార్తలు, తెల్లని గొడుగు, నీళ్ళ బిందెలు, మద్దెలలు, వీణ, శంఖము, కర్ర పట్టుకొనినవాడు, నీళ్ళ బిందెలతో స్త్రీలు, అనుకూలమైన గాలి ఇవి ఎదురగుట మంచిది.

అశుభ శకునములు:

ఎక్కడకు వెళ్తున్నావని అడుగుట , ఎందుకని అడుగుట, నేనూ వచ్చేదననుట , కొంతసేపు ఆగమనుట, ఒక్కడివీ వెల్ల వద్దనుట,భోజనం చేసి వెళ్ళమనుట , వంటివి వినుట మంచిది కాదు. తుమ్ములు వినుట, పొగతో ఉన్న నిప్పు ,గ్రుడ్డివాడు, విధవ, నూనె కుండ, ఆయుధము, గొడ్డళ్ళు, బోడివాడు , ఏడ్చు చున్నవారు, ఒంటి బ్రాహ్మణుడు, దిగంబరుడు , వాన, గాలి, రక్త దర్శనము, కష్టమైన మాటలు వినుట ,పిల్లి, కాకి, పాము, కోళ్ళు ,కోతులు అడ్డుగా వచ్చుట అశుభ శకునములు.

అశుభ శకునములు ఎదురైన, వెళ్ళుట తప్పని సరియైనప్పుడు ' వాసు దేవాయ మంగళం' అని భగవంతుని స్మరిస్తూ బయలు దేరవలెను.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML