గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 21 November 2014

యశోదకు విశ్వరూప దర్శనం-శ్రీ మహాభాగవతము

యశోదకు విశ్వరూప దర్శనం-శ్రీ మహాభాగవతము

వ్రేపల్లెలో చిన్నికృష్ణుడి అల్లరి చేష్టలుతో గొల్లభామలు విసిగిపోసాగేరు.

పాపం, పిల్లాడు, అని వారింక ఊరుకోలేక పోయారు. తలొకరూ మశోద దగ్గరకు వెళ్లి, చిన్నికృష్ణుడు వాళ్లని యెలా విసిగి వేధిస్తున్నాడో మొర పెట్టుకున్నారు. "వద్దంటూన్నా మా మాట వినకుండా దూడలని వేళకాని వేళ వదిలేసి, మా గోవులు మాకు నిండు పాలివ్వకుండా చేస్తున్నాడు. ఆ మిగిలిన చుక్కలైనా మాకు దక్కనిస్తున్నాడా? అబ్బే! మా పెరుగులు, వెన్నలు, దొంగతనం చేసి బొక్కేస్తూ, తనే కాకుండా మిగతా పిల్లలని కూడా తనతో పాటూ ఆ పాడు పనులకి పురికొల్పి చంపుకు తింటున్నాడు.

"బిడ్డలను అతి కష్టం మీద పడుకో పెడితే, ఉయ్యాలలో ఉన్న పిల్లలని లేపి, వాళ్లు యేడుస్తుంటే అక్కడనుండి పారిపోయి, మా పనులు మేం చేసుకోనీయకుండా కాల్చుకు తింటున్నాడు. వీడి బాధలు పడలేక పాలు, వెన్నెలని, పిల్లలకి కనపడకుండా, వారికందకుండా, ఉట్టెలలో దాచుకుంటే, అక్కడ ఉన్నాయని యెలాగో పసిగట్టి, మాకవి దక్కకుండా, పీటలమీద పీటలు పెట్టి, వాటిని కొట్టేస్తున్నారమ్మా వీడు, వీడితో చేరిన మిగతా అల్లరి పిల్లలు.

"పోనీ, చీకటంటే భయపడతారు గదా అని చీకటి కొట్లల్లో వాటిని భద్రపరచి దాచుదామనుకుంటే, మీవాడు ధగధగ మెరిసే ఆభరణాలు పెట్టుకుని వాటికాంతులలో అవి కాజేస్తున్నాడు తల్లీ!" అని వాళ్లగోల.

వాళ్లు చెప్పిన ఆఘాయిత్యాలు ఇలా అమాయకమైన పిల్లాడు చేయగలడంటే నమ్మలేక, వాళ్ళని ఏమీ అనలేకా, వాళ్లు చెప్పినదంతా చిరునవ్వుతో మశోద ఓ చెవిన విన్నది రెండో చెవిద్వారా పోనిచ్చింది. కుర్రాడిని ఏమీ అనలేదని గోపికలకి తరువాత ఏమి చేయాలన్నిది పాలుపోక మూతులు ముడుచుకుని వెళ్లిపోయారు.

ఒకసారి గొల్లభామలంతా కూడపలుక్కుని యశోదకీమారు పిల్లాడిని పట్టుకుని కట్టపడేసి, వాడినలా వెన్నమూతితో చూపించి తన ముద్దుగుమ్మ యెంత నంగనాచో తెలియపరచాలని నిశ్చయించారు.

ఆ రోజు రానే వచ్చింది. ఒక భామయింట్లో. ఆమె కృష్ణుని వెన్న మూతితో పట్టుకుని, కొట్లో పడేసి, కొట్టుకి తాలం బిగించి, యశోద దగ్గరకు పరుగు తీసింది. అదే సమయానికి అందరు భామలూ అదే ఫిరియాదుతో అక్కడికి వచ్చారు. "కావాలంటే వచ్చి మా పాలకొట్లో కట్టిపడేసిన మీ చిన్నారి వాడిని చూడమ్మ" అంటూ అదే చెప్తూ, వారంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, తెల్లబోయారు.

"బాగుందర్రా, మీరూ, మీ కల్పనలూ. ఇక్కడే నా కోంగు వెనకాల దాగివున్న వాడు మరెవరంటారు?" అని నవ్వుతూన్న చిన్నికృష్ణుని వారికి చూపెట్టింది యశోద. వారంతా మరీ దిగ్భ్రాంతి పొందారు.

పరుగు పరుగున ఇళ్లకు వెళ్లి పాలకొట్ల తాళాలు తీసి చూద్దురు కదా! చిన్నికృష్ణుడు లేడని చూసి, వాళ్లకు మతులుపోయినంత పనయింది ఆ లీలామానుషుని మహిమ చూసి.

తృణావర్తుని ఘటన అయిన కొన్నాళ్లకి చిన్నికృష్ణుని క్రీడా సహాధ్యాయులు కొందరు వచ్చి యశోదతో అతడు మన్ను తింటున్నాడని చెప్పారు. అందులో బలరాముడు కూడా ఉన్నాడు. అందుచేత యశోద ఆ మాటలు ఆధారంగా చిన్నికృష్ణుని మందలించబోయింది. కృష్ణుడు "అమ్మా! నేను మన్ను ఎందుకు తింటాను! ఏదో నెపం పెట్టి నన్ను నువ్వు కొడతావని ఇలా చెప్తున్నారు. నమ్మకు. కావాలంటే నేను నోరు బాగా తెరుస్తాను. లోపల మట్టి ఆనవాళ్ళు ఉన్నాయో, మట్టి వాసన ఉందో నువ్వే చూసుకో. తప్పుంటే నన్ను కొట్టు" అన్నాడు. అప్పుడు యశోద ఆ చిన్నికృష్ణుని నోట విశ్వమంతా, ముల్లోకాలు, సమస్త జంతుజాలం, సప్త సముద్రాలు, నదులు , సూర్యచంద్రులూ, చూసింది. గడ గడ వణికిపోతూ తను కలగంటోందో లేక యేమావింత అని తొట్రుపాటు పడి, ఒక్కసారి అలా కనులు మూసుకుంది.

మళ్లీ కనులు తెరిచి చూసే సరికి చిన్నికృష్ణుడు అమాయకంగా నవ్వుతూ కనబడ్డాడు. సందేహం లేదు, తను చూసినది కలే అని ఆ తల్లి ఊహించుకుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML