గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 8 November 2014

శరత్పూర్ణిమ ఆధ్యాత్మిక, యోగ సాధనాలకు విశేషమైనది

శరత్పూర్ణిమ ఆధ్యాత్మిక, యోగ సాధనాలకు విశేషమైనది. ధ్యానం, అర్చన మొదలైనవి ఈరోజున అద్భుత ఫలాలనిస్తాయి. ఈ పూర్ణిమనాడు విశేషంగా దీపాలు వెలిగించడం ప్రత్యేకత. దీనిని 'దేవ దీపావళి' అంటారు. ఆశ్వయుజ పూర్ణిమ, కార్తిక పూర్ణిమ - ఈ రెండూ శరత్పూర్ణిమలు. ఈ పూర్ణిమనాడే రాసలీలా మహోత్సవం జరిగింది.
యోగ శుద్ధులైన జీవులు గోపికలు. వారిని పరమాత్ముడు అనుగ్రహించిన మోక్షప్రదాన లీల రాసలీల. ఈ పూర్ణిమ నాడు దేవీ ఆరాధన కూడా ముఖ్యమైనది. సహస్రార చంద్ర కళా స్వరూపిణి అయిన లలితా మహా త్రిపుర సుందరిని ఈ పర్వాన ఆరాధించాలి. కృత్తికా నక్షత్రం నాడు పూర్ణిమ ఏర్పడే మాసం కార్తీకం.
కృత్తిక అగ్ని నక్షత్రం. అగ్నియందు ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించి ఆరాధించడమే యజ్ఞం. అందుకే వేదాలలో 'నక్షత్రేష్టి' అనేది -కృత్తికా నక్షత్రంతోనే ప్రారంభమవుతుంది. ఆ యజ్న తత్త్వానికి సంకేతంగానే 'దీపారాధన' అనేది కార్తికంలో ప్రదానమయ్యింది.
కృత్తికా నక్షత్ర జాతకుడైన యజ్ఞాగ్ని స్వరూపుడు సుబ్రహ్మణ్యుని ఆరాధనకు కూడా ఈ మాసం ప్రత్యేకం. 'కుమారదర్శనం' పేరుతొ కార్తిక పూర్ణిమను వ్యవహరిస్తారు

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML