గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 21 November 2014

"మహా భారతం" మనిషి జీవితానికే కాదు సృష్టికే ప్రతిక. రచన :శ్రీ గంగ చౌదరి.

సృష్టి లో యుగాలు 4 వాటి పేర్లు సత్య-త్రేతా-ద్వాపర-కలియుగ... ఈ యుగాలు దేవతలకి ఒకరోజు పరిమాణం... సత్య యుగము బ్రహ్మ కాలము అనగా 3 గంటల నుండి 6 గంటల వరకు. త్రేతా యుగము ఉదయం ఆరు నుండి మధ్యానం 12 వరకు. ద్వాపర యుగం మధ్యానం 12 నుండి సాయంత్రం ఆరు వరకు. కలియుగం సాయంత్రం 6 నుండి రాత్రి 12 వరకు. మధ్య రాత్రి 12 నుండి 3 వరకు గోరమైన ప్రళయ కాలం.3 నుండి పునః సృష్టి. ఈ విధముగా ఇప్పటికి 8 సార్లు సృష్టి జరిగింది.రాబోయే నూతన సృష్టి కి నవ బ్రహ్మ శ్రీ అంజినేయుడు అని త్రేతా యుగమున శ్రీ సీతారాములు హనుమకి వరము ఇచ్చారు. ఇప్పుడు మనం ఉన్నదీ ఆఖరి యుగం సంధ్య సమయం. ఈ యుగానికి మహారాజు కలిపురుషుడు ఇతడు అది నుండే ఉన్నాడు..కానీ దేదిప్యమైన యుగములలో ఇతని ప్రతాపం ఎవరి పైన పడలేదు కారణం ఇతనికి రుపములేదు ఆ రూపము పొందే సమయం ఈ కలియుగం..దిని కొరకు అతడు ఎదురు చూడ సాగాడు.. సంధ్య సమయం కానున్నది... ఇతడు అవతరించుటకు సృష్టిని యేలుటకు మానవుల పైన అరాచకాలు చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ఇతడు పుట్టుటకు తల్లి తండ్రి గా గాంధారి ద్రుత రాష్ట్రులను ఎన్నుకొన్నాడు. ఇతని పుట్టుకకు పూర్వం ఉన్న ధైవంశాల జన్మ రహస్యాలను చూద్దాం
"భీష్ముడు" ధరణి పైన మానవుల ధర్మానికి రక్షకుడు ధర్మ సుక్ష్మరుపం. "వ్యాసుడు" బ్రహ్మ రూపము అందుకే పిండానికి నూరు రూపాలు కల్పించి కౌరవులను సృష్టించారు. మనవ దేహమున పంచ ప్రాణములకు ప్రతి నిధులు పంచ పాండవులు...మనిషి లోని జివశక్తి-క్రియశక్తి-పర ప్రకృతి-కాళి రూపిణి ద్రౌపది. మనిషి మనుగడ ఆధారమైన ధరణి రూపము కుంతి మాత' కాల చక్రము కలియుగములో చూపులేని ద్రుతరాష్టుడు'కలియుగమున తన చూపును భందిచుకున్న న్యాయ దేవత గాంధారిదేవి. ద్రోణుడు శివుని పంచ ముఖములైన పంచ పాండవులకు గురువు...కలియుగమున దాసి తత్వముగా మూగబోయిన ధర్మానికి అనుజుడు విదురుడు. కలియుగమున ధర్మాన్ని న్యాయాన్ని కాల చక్రాన్ని దైవమునకు దగ్గర చేయుటకు మానవులకు పంచమ వేదాన్ని అందించుటకు చెడుకి చెడు మార్గములోనే వెళ్లి హతమార్చడానికి పుట్టిన శానేశ్వరుని మనవరుపం గంధర నరేషుడు శకుడు...
శ్రీ కృష్ణుడి భక్తుడు... న్యాయానికి సోదరుడు శకుని మామ.
కౌరవులు మనిషి లోని దుర్గుణ.. దౌజన్య అత్యాచారాలకు పరాకష్ట్రకి రూపం పొందిన కలిపురుషుడి అనుచరులు. వారి లో ప్రధముడు దుర్యోధనుడు వికృత ఆలోచనలకి అగ్రజుడు... పర స్త్రీ మొహితుడు... దైవ గురు పిత్రు దుశించేవాడు... అధికారాన్ని మొహించేవాడు... సృష్టి గతిని మార్చాలని ధర్మాన్ని హింసించే వాడు... స్వార్ధపరుడు.. కామా క్రోధ మధ మాచార్య లోబ మోహ గుణాలకి స్వరూపుడు సుయోధనుడు...ఎక్కడ ఏ యుగామునంధైన పంచ భూతల ధర్మానికి ఆధారమైన ప్రకృతి కి అవమానం జరిగితే నశిస్తున్న మనవ ధర్మానికి ఉపిరి పోయడానికి నేను ఉద్భావిస్తాను అని ప్రతిజ్ఞ చేసాడు గీత కృష్ణుడు,ప్రేమ దయ కరుణ ధర్మమూ న్యాయములను ఎవరు మనసులో స్థిరముగా చేసుకొని జివిస్తుంటారో వారి ఆత్మలో నేను నిలిచి ఉంటాను అన్నారు వాసుదేవ శ్రీ కృష్ణుడు పరమాత్మ... అలంటి వాళ్ళే పంచ పాండవులు ద్రౌపది... వారికి దైవము ప్రత్యక్ష సారధిగా మారి మహాభారతమనే ఒక నూతన సృష్టికి కర్త కర్మ క్రియ ఆచరించి ధరణి పైన ధర్మాన్ని సుస్థిరం చేసాడు సర్వజ్ఞాని వాసుదేవుడు... మనిషి లోని అంతరాత్మ రథ సారధిగా నిలచినాడు శ్రీ కృష్ణుడు పరమాత్మ. కర్మని అచరించూ ఫలితం భగవంతునికి అర్పించు...సర్వం శ్రీహరి సంకల్పం అని నమ్మి జీవించాలి.. మంచి మాట్లాడితే మేలు జరుగుతుంది
చెడు వింటే కూడా హాని జరుగుతుంది..
ఏమి చేయాలి అనేది మన ఇష్టం---
ఏమి చేసిన దాని ఫలితం మన సొంతం.
ధర్మో రక్షతి రక్షితః
ధర్మం ఆచరిస్తే కాలానికి అతీతమైన జీవితం గడపగలం
ఓం నమో భగవతే వాసుదేవయ.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML