33 కోట్ల దేవతలు, సర్వదేవతలు ఒక్క శివుడిలోనే ఉన్నారు. కోట్లాది నక్షత్రములు ఆకాశములో ఉన్నట్లు, సకల దేవతలు శివుడిలోనే ఉన్నారు. ఆకాశానికి నమస్కారం చేస్తే, సర్వ నక్షత్రాలకూ నమస్కారం చేసినట్లే. అదేవిధంగా శివుడిని ఆరాధిస్తే, సర్వ దేవతలను ఆరాధించినట్లే. శివుడిని ఆరాదించని ఏ దైవ ఆరాధనైనా అసంపూర్ణమే. కాబట్టి ఇష్టదైవంతో పాటు శివుడిని ఆరాదిన్చాలు. శివారాధనే సర్వదేవతారాధనయని, పరిపూర్ణ ఆరాధనయనే మర్మం గ్రహించిన శ్రీకృష్ణుడు, విష్ణువు, శ్రీరాముడు శివుని చక్కగా ఆరాధించారు. పిప్పలాదుడు, అంగీరసుడు, సనత్కుమారుడు అధర్వణమునిని ఆశ్రయించి మహాత్మా! ధ్యానింప దగిన దైవం ఎవరు? శ్రేష్ఠమైన ధ్యాత ఎవరు? అని ప్రశ్నించారు.
ప్రాణం మనసి సహకరణై ర్నాదాంతే పరమాత్మని!
సంప్రతిష్టాప్య ధ్యాయేదీశానం ప్రధ్యాయితవ్యగ్0!!
ఇంద్రియములను మనస్సునందు చేర్చి నాదానికి అంతమైన, మూలమైన పరమాత్మయందు చక్కగా నిలిపి, ఈశానుడైన శివుడిని ధ్యానించవలెను.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .


Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a comment