
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
గమనిక :
మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 12 November 2014
భీమునకు హనుమంతుడు చతుర్యుగాచార వర్తనంబులను దెలుపుట (సం. 3-148-10)
భీమునకు హనుమంతుడు చతుర్యుగాచార వర్తనంబులను దెలుపుట (సం. 3-148-10)
చేయబడినదే కానీ చేయవలసిన కర్తవ్యము కృతయుగము నందు లేదు; చతుష్పాద మగుచు(నాలుగు పాదాలపై నడుస్తూ) ధర్మము వర్ధిల్లుతుంది. అచ్యుతుడు (చ్యుతి లేనివాడు అంటే నాశం లేనివాడు అచ్యుతుడు) ఆ యుగము నందు శుక్లవర్ణుడై (తెల్లని లేదా శ్వేత వర్ణంలో) ప్రజలను కాపాడుతూ వెలుగొందుతాడు. అది సనాతన ధర్మనాథం. ఆయుగము నందు బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య శూద్రులు ఒకేవిధమైన వేదక్రియాయోగ్యులై (వేదం నిర్దేశించే కార్యాలను చేయడానికి అర్హత కలిగినవారై) కోరకుండా సంక్రమించిన ఫలసంయోగం వలన పుణ్యలోకములు పొందుతారు. ఆయుగము నందు అసూయ, అభిచార, దర్ప, పైశున, విగ్రహ, క్రోధ, మద, మత్సర, భయ, సంతాప, వ్యాధి, ప్రజాక్షయము, ఇంద్రియ క్షయము వంటి వినాశనములు లేవు.
మఱియు త్రేతాయుగము నందు మూడు పాదాలపై ధర్మం వర్ధిల్లుతుంది. ఆ యుగము నందు జనులు నిత్య సత్య వ్రత శీలురై యజ్ఞము, తపస్సు, దానాలు వంటి క్రియలను ఆచరిస్తూ ఉంటారు. ఆ త్రేతాయుగము నందు రక్తవర్ణుడై (ఎర్రటి వర్ణం కలవాడై) విష్ణుభట్టారకుడు ప్రజారక్షణ చేస్తూ ఉంటాడు.
ద్వాపరయుగము నందు ధర్మము రెండు పాదములతో వర్ధిల్లుతుంది. ధర్మమూ వేదములు నాలుగు తీరులై వర్ధిల్లుతాయి. వేదములు, శాస్త్రములు అర్ధములచే నడుపబడి ధర్మార్థకామములు ధరణిపై విలసిల్లుతాయి. జనులు సత్యము పలకడము, మనస్సు మొదలగు అంతరింద్రియ నిగ్రహము లేనివారై కోరికల మీద ఆసక్తి కలవారై అనేక క్రతువులు నిర్వహిస్తారు. ఆ యుగము నందు దైత్యలోక వందితుడు అచ్యుతుడు కృష్ణవర్ణుడై (నీలవర్ణుడై) జగమును రక్షిస్తాడు. మఱియు,
కలియుగము నందు ధర్మము బలం తగ్గి ఒకేపాదం మీద వర్ధిల్లుతుంది. ఆయుగము నందు శ్రీకృష్ణుడు పీతవర్ణుడై (పసుపు వర్ణ దేహుడై) జగతీవలయమును రక్షిస్తాడు. ఆ యుగము నందు జనులు తమోగుణ యుక్తులై కామము, క్రోదములనే దోషములకు వశం అగుట వలన తమను తాము తెలుసుకోలేక అధర్మవర్తనులవుతారు. ఆ యుగములో చేసిన తపస్సు, దానము మొదలైన కర్మములు స్వల్పములే అయినప్పటికీ అనేక ఫలములు ఇచ్చు''నని యుగములు నడిచే తీరును తెలియజేశాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment