గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Friday, 28 November 2014

మా బాబు నడవ లేడు, పుట్టుక తోనే వచ్చింది మాది మేనరికం వివాహం, ఏమయినా సలహా ఇవ్వకలరు బాబు గురించి ???? బేగం, ముస్తా బాద్

మా బాబు నడవ లేడు, పుట్టుక తోనే వచ్చింది  మాది మేనరికం వివాహం, ఏమయినా సలహా ఇవ్వకలరు బాబు గురించి ????   బేగం, ముస్తా బాద్

సహజముగా మేనరిక వివాహంలలో  గటకాల  సర్ప దోషం  ఉంటుంది,  అందువలనే ఇలా అవుతుంది,  జ్యోతిశాయం లో దీని గురించి చెప్పి ఉన్నారు, మేనరిక  సంబంధాలు చేయునపుడు, గటకాల  సర్ప దోషం ఉన్నదో లేదో చూసి చేయాలి అని . అన్ని మేనరిక సంబంధాలలో ఇలా జరుగదు.  మినప్పిండితో చేసిన దీపాలు ఆ బాబు పడుకునే గదిలో ఉంచండి, రోజు ఆ కాంతిలో ఆ బాబు పడుకోవాలి , ఇలా 4- మాసాలు చేయండి. ఏదయినా సుబ్రమణ్య స్వామి గుడి కి వెళ్లి , బాబు బరువున్నంత  బెల్లం దేవునికి దానం ఇవ్వండి.  ఆ తరువాత వైద్యం చేయించిన అంతనిలో , అతని ఆరోగ్యం లో పురోగాభివ్రుద్ది కనపడును.  
Read More

ఏమయినా ప్రమాదాలు జరిగే అవకాసం ఉన్న, శత్రువుల నుండి ప్రాణ భయము ఉన్న ఏమి చేయాలి ??

ఏమయినా ప్రమాదాలు జరిగే అవకాసం ఉన్న, శత్రువుల నుండి ప్రాణ భయము ఉన్న ఏమి చేయాలి ??


సోమవారం శివా లయం లో రుద్రాభిషేకం చేయించండి 
Read More

త్వరగా వివాహం జరగాలంటే ????త్వరగా వివాహం జరగాలంటే ????

దసరా పండుగ సమయంలో అంటే దసరా లో 6- వ రోజున కాత్యాయని వ్రతం చేయించటం వాళ్ళ వివాహయోగం కలుగును . ఈ వ్రతం చేసిన రోజు సాయంత్రం బిల్వ వృక్షాన్ని పూజించి, ప్రార్దించి , నీరుపోయండి .
Read More

బ్రహ్మ హత్యా దోషం పోవుటకు

జనం నక్షత్రం లో బ్రహ్మ హత్యా దోషం ఉన్న అందరు వారిని మోసం చేస్తూ ఉంటారు, చిన్నప్పటి నుండి కస్తాల పాలవుతూ ఉంటారు, అలాగే జీవిస్తూ ఉంటారు. 9 రోజులు ఉదయమునే లేచి 5-6 గంటల మద్య స్నానం చేసి, సేనగాలతో చేసిన మాల , పసుపు దారం తో కుర్చీ నవగ్రహాల లోని గురు గ్రహానికి వేసి , నెయ్యి దేపం వెలిగించాలి, ఇలా చేసి ఇంటికి వెళ్ళేప్పుడు శివాలయం లో శివుని దర్సనం చేసుకుని ఇంటికి వెళ్ళండి . మహా లక్ష్మి  ని, లక్ష్మి నారాయణుని పూజించండి . ప్రతి  పున్నమి నాడు ఏదయినా దేవా లయమున సత్యన్నారాయణ వ్రతము చేయించండి . ఆర్దికముగా అభివృద్ధి చెందును 
Read More

కుజుడు - సుబ్రహ్మణ్య స్వామికుజుడు - సుబ్రహ్మణ్య స్వామి

కుజుడు కోపానికి కారకుడు. సుబ్రహ్మణ్య స్వామి కేవలం ఒక మామిడి పండు విషయంలోనే తల్లితండ్రుల పై అలిగి కోపగించి పళని కి ఏగిన విషయం విదితమే. ఇక కుజుడు అగ్నికి కారకుడు. సుబ్రహ్మణ్య స్వామి తొలూత శివుని మూడవ కంటనుండి 6 నిప్పు రవ్వలుగా బయటపడ్డాడన్నది పురాణం. కుజుడు క్రిమి కీటకాదులకు వ్యతిరేకంగా పోరాడే తెల్ల కణాలకు అధిపతి. సుబ్రహ్మణ్య స్వామి ఏకంగా దేవుళ్లకే సైన్యాధిపతి. కుజుడు ఆయుధాలకు కారకుడు. గుహుడు తన పండ్రెండు చేతుల్లోను ఆయుధాలు కలిగి ఉంటాడుగా. ఇలా కుజ గ్రహానికి ,గుహబ్రహ్మ అయిన సుబ్రహ్మణ్యస్వామికి ఎన్నో సంబంధాలున్నాయి. అందుకే కుజ దోషం వలన కలిగే రుగ్మతలకు ఉపశమనం కోరువారు సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలని సూచించియున్నాం. మూలమంత్రం:ఓం సౌం శరహణ భవ శ్రీం హ్రీం క్లీం క్లౌం సౌం నమహ భీజం:సౌం.స్వామి ! సుబ్రహ్మణ్యస్వామి ని పూజిస్తే కుజ దోషం కారణంగా ఎదురయ్యే సమస్యలు పరిష్కారమవుతాయని శాస్త్రంలో చెప్పబడి ఉంది.Read More

సొంత ఉరికి వెళితే 9 వ రోజు తిరిగి రాకూడద ??సొంత ఉరికి వెళితే 9 వ రోజు తిరిగి రాకూడద ??
అప్పుడప్పుడు అత్తా వారింటికి వెళ్ళే వారు, అల్లుడు కోడలు 9- వ రోజు తిరిగి రాకూడదు
Read More

దైవం నామ నారాయణ ప్రీత అంటే ??దైవం నామ నారాయణ ప్రీత అంటే ??

నామ జపము చేత, అర్చన చేత ఆనంది అని అర్ధం వ్రాతములలో ఎన్ని నైవేద్యములు పెట్టేమన్నది కాదు, ఎంత దైవ నామ జపం చేసేమన్నది ముక్యం
Read More

నీవు ఏనాడు సమస్తం కోల్పాతవో ఆ నాడు తెలుస్తుంది నీ నిజమయిన స్నేహితులెవరో

Read More

మహర్షి అన్ని కాండలకీ సంబంధించిన పేర్లు మనకి అర్థం అయేటట్లు పెట్టారు.

మహర్షి అన్ని కాండలకీ సంబంధించిన పేర్లు మనకి అర్థం అయేటట్లు పెట్టారు. బాలకాండలో రాముని జననము, రాముని బాల్యము స్పృశింపబడింది. బాలుడు, జ్ఞాని, పిశాచము వీళ్ళందరినీ ఒకటిగా చెబుతారు. అపారమయిన జ్ఞాని, బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని కథ విశేషంగా చెప్పబడింది. అయోధ్యాకాండకు - అయోధ్యలో రామచంద్రమూర్తి జీవితానికి సంబంధించిన విశేషాలను వర్ణించింది. కాబట్టి అయోధ్యాకాండ అని పేరు పెట్టారు. తదనంతరం సీతారాముల అరణ్య వాసం గురించి వర్ణించిన కాండ అరణ్య కాండ. తదనంతరం కిష్కింధలో జరిగిన విశేషములను వర్ణించిన కాండ కనుక దానికి కిష్కింధకాండ అని పేరు పెట్టారు. యుద్ధకాండ సరే తెలిసిపోతుంది. అదంతా రామరావణ యుద్ధానికి సంబంధించిన కాండ. లేదా రాక్షస వానర సంగ్రామమునకు సంబంధించిన కాండ. కాని సుందరకాండ దగ్గరకు వచ్చేసరికి మహర్షి ఒక గమ్మత్తు చేశారు. కథకు సంబంధించిన పేరు పెట్టలేదు. పెట్టకుండా దీనిని సుందరకాండ అని పిలిచారు. సుందరకాండ అని పిలిచారు కాబట్టి అందులో ఒక సుందరుడికి సంబంధించిన కథ ఉండి ఉండాలి. ఎవరా సుందరుడు? మనకి సుందరకాండలో ప్రధానంగా కనపడే వారు స్వామి హనుమ. అందుకని హనుమ సుందరుడనాలా? రామచంద్రమూర్తి సుందరుడనాలా? లేకపోతే సీతమ్మ తల్లి సుందరి అనాలా? ఎందువల్ల అది సుందరకాండ? దీనికి పెద్దలు మనకి ఒక గమ్మత్తయిన జవాబు చెప్పారు. వారు ఏమన్నారంటే

సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా
సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?!!

అందులో ఉన్న రామచంద్ర ప్రభువు సుందరాతిసుందరుడు. సరే సీతమ్మ తల్లి సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆమె సాక్షాత్తు బాలాత్రిపుర సుందరీ స్వరూపం. స్వామి హనుమ ఆత్మదర్శనం చేసిన యోగి స్వరూపుడయిన సౌందర్యరాశి. అశోకవనం మిక్కిలి సౌందర్యవంతమయింది. లంకాపట్టణం మిక్కిలి సుందరమయినది. మంత్రం సుందరం. ఇంక అందులో సుందరం కానిదేముంది? అన్నీ సౌందర్య భరితములే. అయితే మనకి అనుకోవడానికి మాత్రం రెండు ప్రధానమయిన తేడాలు కనపడతాయి. బాలకాండ ప్రారంభంనుంచి కిష్కింధకాండ చివరి వరకు రామచంద్రమూర్తిని ప్రధానంగా పెట్టుకొని, మిగిలిన పాత్రలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాని సుందరకాండ దగ్గరకు వచ్చేసరికి గమ్మత్తు ఏమిటంటే ఇక్కడ రాముడు కనపడడు. సుందరకాండలో ఎక్కడా రామునికి సంబంధించిన విశేషం ఉండదు. అంటే రాముని ప్రత్యక్షమయిన కదలిక మనకి కనపడడు. కాని రామకథ, రామనామము, రాముని సౌశీల్యము వీటికి సంబంధించిన గొప్పతనమేమిటో మనకి వర్ణింపబడుతుంది. అందుకే మహర్షి ప్రారంభం చేస్తూనే ఒక గమ్మత్తు చేశారు. కిష్కింధకాండ చివరలో, రామకార్యం మీద వెడుతున్న వానరులకి రామచంద్రమూర్తి ఇల్లాలయిన సీతమ్మతల్లి జాడ చెప్పడంలో మాటసాయం చేసినంత మాత్రం చేత, సంపాతికి కాలిపోయిన రెక్కలు వచ్చాయి. రామ కథా బలం ఎటువంటిదో, రామనామానికి ఉన్న బలం ఎటువంటిదో, రామ కార్యానికి రామకార్యంలో వెడుతున్న వారికి చేసే సహాయం, ప్రతిఫలం ఎంత స్థితిలో వుంటుందో మనకి నిరూపిస్తుంది కిష్కింధకాండ చిట్టచివరి స్థితి. కిష్కింధకాండలో అంతటి పునాదివేస్తే ఇక సుందరకాండలో రామకథ గొప్పతనం ఎన్నిమాట్లు చెప్పబడుతుందో చూడండి! అందుకే సుందరకాండ గొప్పతనం అంతా శ్రీ రామోపాసనలో ఉంది.
Read More

స్కంద అంటే జారివచ్చిన వాడు అని ఒక అర్థం. సృష్టికి అతీతమైనటువంటి శివశక్తి సృష్టియందు జారి వచ్చింది

స్కంద అంటే జారివచ్చిన వాడు అని ఒక అర్థం. సృష్టికి అతీతమైనటువంటి శివశక్తి సృష్టియందు జారి వచ్చింది. మనకి కనిపిస్తూ ఉన్నది. కనుక కనిపించని పరోక్షమైన ఆ దివ్యశక్తి అపరోక్షమైన విశ్వమంతా వ్యాపించి ఉండడమే జారి రావడమంటే. అదే స్కంద అనేదాంట్లో ఒక అర్థం.
"గతి శోషణయోః" అనే మాట ప్రకారంగా స్కంద శబ్దానికి ఒక అర్థం ఏమిటంటే గమనము చేయువాడు అని ఒకటి. శోశింపజేయువాడు అని ఒక అర్థం. ఎటైనా గమనం చేయగలగడం అంటే ఆయనకి అవరోధం అనేది లేదు అని అర్థం. ఎవరూ అడ్డుకోలేరు ఆయనని. అందుకే సుబ్రహ్మణ్యుని ప్రతాపాన్ని ఎవరూ అడ్డుకొనలేరు. ఆయన అనుగ్రహాన్నీ ఎవరూ అడ్డుకోలేరు. అలాంటి అద్భుతమైన అప్రతిహత ప్రతాపము ఎవరూ అవరోధించలేని అనుగ్రహమూ కలవాడు కనుక స్కందుడు. ఇది ఒక అర్థం. శోషణయోః - శత్రు సేనలను ఎండింపజేయువాడు ఆయన. అంటే శత్రు సేనలనన్నింటినీ తపింపజేసి వాళ్ళని నిర్మూలిస్తాడు గనుక సుబ్రహ్మణ్యుడు ప్రధానంగా యోధ దేవత. యుద్ధదేవతగా కూడా చెప్పబడుతున్నాడు. శత్రువులను నశింపజేసే శక్తి సుబ్రహ్మణ్య స్వామి వద్ద ఉన్నది. పైగా దేవశక్తులకి విజయం కావాలి అంటే సుబ్రహ్మణ్యుని ఆరాధన కావాలి. దేవ శక్తులు అంటే లోక క్షేమంకర శక్తులు. లోకానికి మంచి కలిగించాలని కొందరు ప్రయత్నిస్తూంటారు. చెడు కలిగించాలని కొందరు ప్రయత్నిస్తూంటారు. అది ఎప్పుడూ ఉంటూ ఉంటుంది ఈ విశ్వంలో. అయితే మంచికోసం ప్రయత్నించే వాళ్ళకోసం బలం ఇవ్వాలి. చెడు కలగాలని ప్రయత్నించే వాళ్ళకి బలం తొలగించాలి. ఇదే దేవాసుర సంగ్రామం అనేటప్పుడు. అయితే మంచి కలిగించే వాళ్ళకి బలం ఇవ్వడం అనేది భగవంతుని యొక్క కృత్యము. ఆ కృత్యమే సుబ్రహ్మణ్యుని రూపంలో ఉన్నది. అందుకే లోక క్షేమం కోసం అవతరించినటువంటి రామచంద్ర మూర్తికి సాక్షాత్తూ నారాయణ స్వరూపుడైనటువంటి ఆ రఘురామునికి విశ్వామిత్రుల వారు ముందుగా సుబ్రహ్మణ్యుని కథను చెప్తారు. ఆ తరువాతే రామచంద్రమూర్తి అవతార కార్యములన్నీ నెరవేరుతాయి.
ఇంకొక చోట ప్రత్యేకించి మహాభారతంలో కూడా కృష్ణ తత్త్వానికి ప్రధానంగా సుబ్రహ్మణ్య తత్త్వాన్ని కలిపి చూపిస్తారు. ఏవిధంగా అయితే కృష్ణుడు బాలకృష్ణుడై అసురసంహారం చేసి చిట్టచివరికి జ్ఞానోపదేశం కూడా చేశాడో అదేవిధంగా కృష్ణతత్త్వమూ, సుబ్రహ్మణ్య తత్త్వమూ ఒకేవిధంగా కనపడుతాయి. మనకి పురాణాలలో వివిధ రకాల పేర్లతో రకరకాల రూపాలతో దేవతలను చెప్తున్నా తత్త్వతః దేవతల మధ్య సమన్వయము ఉన్నది. అందుకే సుబ్రహ్మణ్య తత్త్వము రామకృష్ణుల అవతారములయందు సమన్వయింపబడుతోంది. లోకరక్షణ కోసం ప్రయత్నించే నారాయణుని యొక్క శక్తియే సుబ్రహ్మణ్య తత్త్వంగా స్పష్టమవుతోంది. అందుకే పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యుడు నారాయణ స్వరూపంగా చెప్పబడుతూ ఉంటాడు. అందుకే
"స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః" అని విష్ణుసహస్రంలో కూడా మనం చదువుతూ ఉన్నాం.
ఇక సుబ్రహ్మణ్య అనే శబ్దమే రెండు రకాలుగా చెప్పబడుతున్నది. బ్రహ్మము అంటే వేదము, యజ్ఞము, తపస్సు అని అర్థం. బ్రహ్మణ్యః అంటే యజ్ఞమును, తపస్సును, వేదమును, వేద ధర్మాన్ని దానిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్న వారిని కాపాడువాడు. "బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదనః" అని వేదవాక్యం మనకి కనపడుతున్నది. అందుకు బ్రహ్మణ్యుడు అన్నప్పుడు యజ్ఞమును, తపస్సును, వేదమును, దానిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి మహాత్ములను కాపాడేవాడు బ్రహ్మణ్యుడు. అలాంటి బ్రహ్మణ్యుడే ఇటు యజ్ఞాన్ని, వేదాన్ని కాపాడడమే కాకుండా బ్రహ్మము అనగా బ్రహ్మ జ్ఞానము - ఆ బ్రహ్మ జ్ఞానాన్ని కూడా అందించేవాడు. ఎలా అందిస్తున్నాడు అంటే సుష్టుగా అందిస్తున్నాడు, సంపూర్ణంగా అందిస్తున్నాడు గనుక సుబ్రహ్మణ్యుడు అని చెప్పబడుతున్నాడు. అందుకు సుబ్రహ్మణ్య తత్త్వము అటు యజ్ఞ తత్త్వము, శక్తి తత్త్వము, జ్ఞాన తత్త్వము. ఇన్ని అద్భుతమైన తత్త్వములను కలబోసుకున్నది. ఒక్క సుబ్రహ్మణ్య ఆరాధన అటు శివశక్తుల ఇరువురినీ ఆరాధించిన ఫలితాన్నిస్తున్నది. సర్వదేవతలనూ ఆరాధించిన ఫలితాన్నిస్తున్నది. వేదములలో చెప్పిన సర్వయజ్ఞములనూ ఆరాధించిన ఫలితాన్నిస్తున్నది. అటువంటి సుబ్రహ్మణ్యుడికి నమస్కరిస్తూ
శరవణ భవాయ నమః!!
Read More

సుబ్రహ్మణ్యుని చేతిలో ఉన్నటువంటి ఆయుధము శక్త్యాయుధము అని చెప్పబడుతున్నది.

సుబ్రహ్మణ్యుని చేతిలో ఉన్నటువంటి ఆయుధము శక్త్యాయుధము అని చెప్పబడుతున్నది. అందుకే "ప్రథమో జ్ఞాన శక్త్యాత్మా" - పైగా దానికి జ్ఞాన శక్త్యాయుధమని పేరు. అంటే ఆ ఆయుధంలో రెండు విశేషములున్నాయి. జ్ఞానము, శక్తి రెండు చెప్పబడుతున్నాయి. అసలు జ్ఞానానికే పెద్ద శక్తి ఉంది. ఎంతటి శక్తి ఉంది అంటే ఎవరూ ఛేదించలేని అజ్ఞానాన్ని ఛేదించడమే జ్ఞానముయొక్క శక్తి. అలా జ్ఞానశక్తి ఆయనయొక్క ఆయుధం. ఇది భావన చేసినప్పుడు ఆయన గురుస్వరూపంగా కనిపిస్తాడు.
అసుర సంహారం చేసినటువంటి మహా ప్రతాపమూర్తి. "సేనానీనాం అహం స్కందః" అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి మాట. సేనానులలో స్కందుడు. స్కందుడు అని సుబ్రహ్మణ్యునికి మరొక పేరు. చెల్లాచెదురైనటువంటి దేవసేనలన్నింటినీ సమీకరించి వారందరికీ తాను బలమై, బలాన్ని ఇచ్చి నడిపించి అసుర శక్తులను సంహరించాడు. అందుకే ఎప్పుడైనా సరే కాలంలోనూ, దేశంలోనూ ప్రపంచాన్ని బాధించే అసుర శక్తులు ఉన్నవేళ సుబ్రహ్మణ్య ఆరాధన గానీ చేసినట్లయితే వెంటనే అసుర శక్తులు తొలగి దేశానికీ, కాలానికీ, వ్యక్తికీ కూడా క్షేమం లభిస్తుంది. అలాంటి క్షేమం కావలసినటువంటి వారు సుబ్రహ్మణ్యారాదన విశేషంగా చేయాలి. దీనివల్ల బాధించె శక్తులు తొలగుతాయి. అందుకు ప్రత్యేకించి దేవతలందరూ కూడా దేవసేనాపతి ఆవిర్భావానికి తపన పడ్డారు. శివశాక్త్యాత్మకంగా ఆవిర్భవించాడు సుబ్రహ్మణ్యుడు. ఆయన ఆవిర్భావంతో దేవతలందరికీ బలం వచ్చింది. అసలు బలమే ఆయనయొక్క స్వరూపం. అందుకే సేనాని అయ్యాడు. అందుకు లోక క్షేమంకరమైన ఉత్తమ శక్తులు చెల్లాచెదురై బలం తగ్గినప్పుడు వాటన్నింటికీ బలాన్నిచ్చి నడిపించేటటువంటి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకు గొప్ప నాయకుడు కూడా ఈయన. అలాంటి సేనానిగా ఎవరైతే నమస్కరిస్తారో వారికి మొత్తం దేవతా సమూహం అంతా కూడా రక్షణ చేస్తుంది.
Read More

మన సంతతికి మనం ఇవ్వవలసినది

మన సంతతికి మనం ఇవ్వవలసినది
దేనిని మనము చేర్చవలసి వుంటుంది? సుకృతములా లేక దుష్కృతములా?
మన సంతతి మన కర్మఫలములను మోసేవారు. మనము మన పూర్వీకుల కర్మ ఫలముల భారమును మోయుచున్నాము. అందువల్ల మనమందరు కర్మఫలములను మోయు వాళ్ళమే.
మన పూర్వీకుల పాప పుణ్య ఫల ఫలితమే మనం. మన పాప పుణ్య ఫలమే మన సంతతి. అందుకే ఒక నానుడి
"పూర్వజన్మ కృతం పాపం పుత్రరూపేణ బాధతే" అని చెప్పేవాళ్ళు . మన దేహం మన పూర్వీకుల అణువు నుండి వచ్చింది దీనినే ఆంగ్లేయులు జీన్స్ అంటారు. దీనిని శాస్త్రము సైన్సు రెండు ఒప్పుకుంటుంది అందుకే మనము వైద్యుని వద్దకు చికిత్స నిమిత్తం వెళ్లినప్పుడు ఈ బాధ మీ వంశంలో నాన్నకో, తాతకో, ముత్తాతకో వున్నదా? వారు దీని వల్ల బాధపడ్డారా? అని అడుగుతారు.
ఒక రోగము మట్టుకే కాదు వంశావళిగా వచ్చేది అణుకువ, బుద్ది, జ్ఞానం, వివేకం నడత, భావన, లాభ నష్టాలు, జయాపజయాలు అన్ని వంశావళిగా సంక్రమించేదే. పెద్దల వంశావళిగా మనకు సంక్రమించిన వ్యాధులకు చికిత్స ఎలా తీసుకుంటామో అదే విధముగా మనకు సంప్రాప్తించే పాప నివృత్తికి కూడా పరిహారాదులు దైవీకముగా చేసుకోవలసి వుంటుంది.
మనకు బోధించే శాస్త్రములు యేమని గమనించితే తెలుస్తుంది. నువ్వు చేసే పాపకృత్యములు ఎవ్వరూ చూడడంలేదు అనే నీ అజ్ఞానం కేవలం అపోహే. నీలోని నీ అణువాంకురమైన నీ పిల్లలు తగిన తరుణమునకు వేచి వున్నారు. వారు పడే బాధ నీ కర్మఫలమే అనేది అప్పుడు గ్రహించగలవు.
మన సంతతి మన దుష్కృతముల వల్ల బాధపడకూడదు అనుకుంటే వారు బాగుపడటానికి మనం పుణ్యకార్యములు చేయవలసి వుంటుంది. ఏది చేస్తే మన సంతతి సుఖ సంతోషములతో వుంటుంది అంటే మనము చేసే పుణ్య కార్యములు వాటి వల్ల. మన సంతతి ఎన్ని తరాలు సుఖపడుతారు అని శాస్త్ర వచనము చూద్దాము
౧. బీదలైన అన్నార్తులకు ఆహారం అమర్చడం వల్ల మూడు తరాలు సుఖములను అనుభవిస్తారు
౨. పుణ్య నదీ స్నానం సంకల్ప పూర్వకంగా చేయడం వల్ల మూడు తరాలు సుఖములు అనుభవిస్తారు
౩. కోవెలలో దీపము నిరంతరం వెలగటానికి ఏర్పాటుచేస్తే ఐదు తరాలు సుఖులుగా వుంటారు
౪.జాతిమతభేదం లేక అన్నదానం చేస్తే, బీద ఆడపిల్లకు వివాహమునకు సహాయము అందిస్తే ఐదు తరాలు సుఖులుగా వుంటారు
౫. లేమివల్ల పితృకార్యములు చేయలేని వాళ్లకు సహాయపడి వారిచేత చేయిస్తే ఆరు తరాలు సుఖులుగా వుంటారు
౬ దేవాలయ జీర్ణోద్ధరణకు సహాయ పడితే ఏడు తరాలు సుఖులుగా వుంటారు
౭. అనాధ ప్రేత సంస్కారమునకు సహాయ సంస్కారములు అందిస్తే తొమ్మిది తరాలు సుఖులుగా వుంటారు
౮ గో సంరక్షణ చేస్తే పదునాలుగు తరములు సుఖులుగా వుంటారు
౯ గయా క్షేత్రములో పితరులకు పిండ దానం చేయడం, మాతృగయలో తల్లికి పిండదానం చేయడం, వైదీకముగా సాలంకృత కన్యా దానము చేయడం వల్ల ఇరువది ఒక్క తరాలు సుఖులుగా వుంటారు
అందువల్ల మనము మన వల్ల మాలినంత పుణ్యకార్యములు చేద్దాం. మన సంతతికి మంచి మార్గం ఏర్పరుద్దాం!!
Read More

వేదాంతంలో కస్తూరీమృగం కధ చెబుతారు.కస్తూరీమృగం అంటే ఒక రకమైన జింక

వేదాంతంలో కస్తూరీమృగం కధ చెబుతారు.కస్తూరీమృగం అంటే ఒక రకమైన జింక. సీజన్ వచ్చినపుడు దాని బొడ్డు నుంచి ఒక రకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది.అది మంచి మదపువాసనగా ఉంటుంది.అప్పుడు ఆ వాసన ఎక్కణ్ణించి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది.ఆ వాసన తనవద్ద నుంచే వస్తున్నదని అది గ్రహించలేదు.ఆ అన్వేషణలో అలా అడవంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది.వేదాంత గ్రంధాలలో ఉన్న ఈ కధ అందరికీ తెలిసినదే.
మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా వ్యర్ధంగా ఇలాగే తిరుగుతూ ఉంటాడు.పుణ్యక్షేత్రాలనీ తీర్ధయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ కాలాన్నీ వృధా చేసుకుంటూ ఉంటాడు.నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు.
పాండవులు తీర్ధయాత్రలకు వెళుతూ కృష్ణుణ్ణి కూడా తోడు రమ్మని పిలుస్తారు.సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్ధయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయామోహితులైన పాండవులకు తెలియదు.కనుక కృష్ణుని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్ధయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు.ఆయన చిరునవ్వు నవ్వి వారికొక దోసకాయ నిచ్చి 'నా ప్రతినిధిగా దీనిని తీసుకువెళ్ళి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనిని ముంచండి.'అని చెబుతాడు.వారు అలాగే చేసి తీర్ధయాత్రలు ముగించి తిరిగి వస్తారు.
అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింపచేస్తాడు కృష్ణుడు.ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.
'అదేంటి బావా?ఇది చేదు దోసకాయ.కటికవిషంలాగా ఉంది.ఇలాంటి వంటకం చేయించావేమిటి?' అని వారు అడుగుతారు.
దానికి కృష్ణుడు నవ్వి.' బావా.ఎన్ని గంగలలో మునిగినా ఈ దోసకాయ చేదు పోలేదు చూచావా?' అంటాడు.
ఎన్ని తీర్ధయాత్రలు చేసినా,మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు.ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.
మనిషి ప్రయాణం బయటకు కాదు.లోపలకు జరగాలి.యాత్ర అనేది బయట కాదు.అంతరిక యాత్రను మనిషి చెయ్యాలి.ప్రపంచమంతా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు.అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలోనుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు.పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు.ఒకచోట స్థిరంగా కూచుని తపస్సు చేశారు.జ్ఞానసిద్ధిని పొందారు
Read More

తల్లికి నమస్కరించటం వాళ్ళ కలిగే పుణ్యం

Read More

సుబ్రహ్మణ్య షష్ఠి:

సుబ్రహ్మణ్య షష్ఠి:
(కుమార షష్ఠి, స్కంద షష్ఠి... : 28-11-2014)
(నేడే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి)
బ్రహ్మ నుండి "శివసుతుని చేత" మాత్రమే మరణం పొందేలా వరం అందుకున్నాడు తారకాసురుడు... వాడి మరణానికై ఎన్నో వ్యయప్రయాలు కూర్చి శివపార్వతులకు వివాహం జరిపించారు దేవతలు... అమ్మవారి అయ్యవారి కళ్యాణానంతరము, పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో ఒక వేయి దివ్య సంవత్సరాలు శృంగారలీలాకళోస్సాల హృదయులై క్రీడిస్తూ గుడుపుతున్నారు.. కానీ సమస్త లోకాలన్నీ కూడా తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు...శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలూ అహోరాత్రులూ ఎదురుచూస్తున్నారు. అప్పుడే శివుని నుండి మహా తెజస్సు వెలువడింది...
అప్పుడు దేవతలందరి ప్రార్ధన మీద హవ్యవాహనుడు, ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ, శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలికా… అంతట అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు, అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశ పెడతాడు. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా, వెళ్ళి గంగామాతని ప్రార్ధిస్తుంది. అప్పుడు గంగా అమ్మ వారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక, కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకంలో విడిచిపెడుతుంది. ఆ రెల్లుపొదల తటాకం నుండి, ఆరుముఖాలతో, పన్నెండు చేతులతో, దివ్యమంగళ స్వరూపుడై, మార్గశీర్ష శుద్ధషష్ఠినాడు, అనగా ఈ రోజే, ఒక దివ్య తెజోమయుడైన బాలుడు ఉద్భవించాడు. ఆయనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు. ఈ రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. దీనికే కుమారషష్ఠి, స్కంద షష్ఠి అని కూడా పేరు...
ఆయన పుట్టగానే, ఆరుగురు కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి, స్వామివారికి, కార్తికేయ అనీ, పుట్టగానే ఆరుముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్ అనీ, షణ్ముఖ అనీ నామం వచ్చింది.
తండ్రి యైన పరమశివుని వద్ద సమస్త విద్యలూ నేర్చుకొన్న స్వామి దేవతల సేనాధిపతిగా నియుక్తుడయ్యాడు... అటు తరువాత తారకుని సంహరించి లోకాలలో శాంతిని నెలకొల్పాడు మన స్వామి....తారకుని విజయం అనంతరం దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను కుమారస్వామికిచ్చి వివాహం జరిపిస్తాడు...అటు తరువాత దక్షిణదేశం వచ్చిన స్వామి శ్రీ వల్లి దేవిని కూడా వివాహమాడతాడు... అలా శ్రీ కుమారస్వామి, శ్రీ వల్లీ దేవసేన సమేతుడై లోకాలను అనుగ్రహిస్తున్నాడు...
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః... అందరికీ స్కంద షష్ఠి శుభాకాంక్షలు...
Read More

శ్రీ సుబ్రమణ్య కరవలంబ స్తోత్రమ్...!

శ్రీ సుబ్రమణ్య కరవలంబ స్తోత్రమ్...!

హె స్వామినాథ కరుణాకర దీనబంధో| శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబందో|
శ్రీశాది దేవ గణపూజిత పాదపద్మ| వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్|

దేవాది దేవసు(ను)త దేవ గణాధినాథ| దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద|
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే| వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్|

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్| తస్మాత్ర్పదాన పరిపూరిత భక్తకామ|
శ్రుత్యాగమ ప్రణవాచ్య నిజస్వరూప| వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్|

క్రౌంచా సురేంద్ర పరి ఖండన శక్తిశూల| పాశాది సస్త్ర పరిమండిత దివ్యపాణే|
శ్రీ కుండలీశ ధృతతుండ శిఖీన్ద్రవాహ| వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్|

హారాది రత్న మణి యుక్త కిరీటహార| కేయూర కుండల లసత్కవచాభిరామ|
హే వీర తారక జయామర బృందవంద్య| వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్|

పంచాక్షరాది మనుమన్త్రిత గాజ్గతోయైః| పంచామృతైః ప్రముదితేస్థ్ర ముఖైర్మునీంద్రైః|
పట్టాబిషిక్త హరియుక్త పరాసనాధ| వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్|

శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా | కామాది రోగ కలుషీకృత దిష్టచిత్తమ్|
భక్త్వా తు మా మవ కళాధర కాంతికాన్త్యా| వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్|
ఫలశ్రుతి:
సుబ్రమణ్యకరావలంబమ్ పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః|
తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రమణ్య ప్రసాదతః|
సుబ్రమణ్య కరావలంబమ్ మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్|
కోటిజన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి|
శ్రీ సుబ్రమణ్య భుజంగ స్తోత్రమ్
భజే హం కుమారం భవానీ కుమారం| గళోల్లాసిహారం నమ త్సద్విహారం|
రిపు స్తోమ పారం నృసింహావతారం| సదా నిర్వికారం గుహం నిర్విచారమ్|

నమామీశపుత్రం జపాశోణగాత్రం | సురారాతి శత్రుం రవీందగ్ని నేత్రం|
నహా బరిపత్రం శివాస్యాబ్జ మిత్రం| ప్రభాస్వ త్కళత్రం పురాణం పవిత్రమ్|

అనేకార్కకోటి ప్రభావజ్వలమ్ తమ్| మనోహారి మాణిక్య శోణాంబు జాక్షం
ప్రయోగ ప్రదాన ప్రవాహైక దక్షం| భజే షణ్ముఖం తం శరచ్చంద్ర కాంతమ్|

కృపా వాఇ కల్లో భాస్య త్కటాక్షం| విరాజ న్మనోహరి శోణాంబు జాక్షం|
ప్రయోగ ప్రదాన ప్రవాహైక దక్షం| భజే క్రీడితాకాశ గంగాద్రికూటమ్|

సుకుంద ప్రసూనావళీ శోభితాంగం| శరత్పూర్ణ చంద్రప్రభా కాంతి కాంతం|
శిరీష ప్రసూనాభిరామం భవంతం| భజే దేవసేనాపతిం వల్లభం తమ్|

సులావణ్య సత్పూర్య కోటి ప్రవీకం| ప్రభుం తారకారిం ద్విషడ్బాహు మీశమ్|
నిజాంక ప్రభాదివ్య మానావదీశం| భజే పార్వతీ ప్రాణ పుత్రం సుకేశమ్|

అజం సర్వలోకప్రియం లోకనాథం| గుహం శూర పద్మాది దంభోళి ధారమ్|
సుచారుం సునాశాపుటం సచ్చరిత్రం| భజే కార్తికేయం సదా బాహులేయమ్|

శరారణ్య సంభూత మింద్రాది వంద్యం| ద్వి షడ్బాహు సంఖ్యాయుధశ్రేణి రస్యుమ్|
మరు త్సారథిం కుక్కుటేశం సుకేతుం| భజే యోగి హృత్పద్మమధ్యాదివ్ఆసమ్|
విరిచీంద్ర వల్లీశ దేవేశ ముఖ్యం| ప్రశస్తామర స్తోమ సంస్తూయమాన|
దిశ త్వం దయాళో శ్రియం నిశ్చలాం మేం| వినా త్వాం గతిః కా ప్రభో మే ప్రసీద|

పదాంభోజ సేవా సమాయాత బృందా| రకశ్రేణి కోటీర భాస్వ ల్లలాటమ్|
కళత్రోల్లస త్పార్శ్వ యుగ్మం వరేణ్యం | భజే దేవ మాద్యంత హీన ప్రభావమ్|

భవాంభోధిమధ్యే తరంగే పతంత| ప్రభో మాం సదా పూర్ణ దృష్ట్యా సమీక్ష్య|
భవద్భక్తినావోద్దరత్వం దయాళో| సుగత్యంతరం నాస్తి దేవ ప్రసీద|

గళే రత్నభూషం తనౌ మంజువేషం| కరే జ్ఞాన శక్తిం దరస్మేర మాస్యే|
కటిన్యస్త పాణిం శిఖిస్థం కుమరం| భజే హం గుహదన్యదైవం న మన్యే|

దయాహీన చిత్తం పరద్రోహ వృత్తిం(పాత్రం)| సదా పాపశీలం గురో ర్భ్హక్తిహీనమ్|
అనన్యావలంబం భవన్నేత్ర పాత్రం | కృపాశీల మాం భో పవొత్రం కురు త్వమ్|

మహేసేన గాంగేయ వల్లీసహాయ | ప్రభో తారకారే షడాస్యామరేశ|
సదా పాయసాన్న ప్రియ స్త్వం గుహేతి| స్మరిష్యామి భక్త్యా కదా హం విభో త్వామ్|

ప్రతాపస్య బాహో నమ ద్వీరబాహో| ప్రభో కార్తికేయష్ట కామ ప్రదేతి|
యదా యేపఠంతే భవంతం తదేవం| ప్రసన్నం సుతోశం బహు శ్రీం దదాసి|

అపారాతి దారిద్ర్య వారాశి మధ్యే| బ్రమంతం జనగ్రాహ పూర్నే నితాంతమ్|
మహాసేన మాముద్ధర త్వం కటాక్షావలోకేన కించిత్ర్పసీద ప్రసీద|

స్థిరాం దేహిం భక్తిం భవత్పాదపద్మే| శ్రియం నిశ్చలాం దేహి మహ్యం కుమార|
గుహం చంద్రాతారం సువంశాభి వృద్ధిం| కురు త్వం ప్రభో మే మనః కల్పసాల|

నమస్తే నమస్తే మహాశ్క్తి పాణే| నమస్తే నమస్తే లస ద్వజ్రపాణే|
నమస్తే నమస్తే కటి న్యస్త పానే| నమస్తే నమస్తే సదా భీష్టపాణే|

నమస్తే నమస్తే మహా శక్తి ధారిన్| నమస్తే సురాణాం మహాసౌఖ్య దాయిన్|
నమస్తే సదా కుక్కుటేశోగ్ని కేతా| స్సమస్తాపరాధం విభో మే క్షమస్య|

కుమారాత్పరం కర్మయోగం న జానే| కుమారాత్పరం కర్మశీలం న జానే|
య ఏకో మునీనాం హృదబ్జాధివాస| శ్శివాంకం సమారుహ్య సత్పీఠకల్పమ్|
విరించాయ మంత్రోపదేశం చకార| ప్రమోదేన సోయం తనోతు శ్రియం మే|
య మహుః పరం వేద శూరేషు ముఖ్యం| భుజంగ ప్రయాతేన హృద్యేన కాంతమ్|
ఫలశ్రుతి:-
జనా యే పఠంతే మహాభక్తి యుక్తాః| ప్రమోదేన సాయం ప్రభాతే విశేషః|
నజన్మరయోగే యదా తే రుదంతో| మనోవాంచితాన్ సర్వకామాన్ లభంతే
Read More

మహాభారతంలో రెండు చోట్ల సుబ్రహ్మణ్యుడి యొక్క వైభవం చెప్పబడుతోంది

మహాభారతంలో రెండు చోట్ల సుబ్రహ్మణ్యుడి యొక్క వైభవం చెప్పబడుతోంది. ౧. ధర్మరాజాదులకు మార్కండేయ స్వామి ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుని ఆవిర్భావ ఘట్టం చెప్తారు. అరణ్యపర్వంలో వస్తుంది. మళ్ళీ శల్యపర్వంలో సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్టం అని అద్భుతమైన ఒక ఘట్టం చెప్పబడుతున్నది. దాని సారాంశం ఏమిటంటే స్వామికి పట్టాభిషేకం చేసి సర్వదేవతలూ వారి వారి గణములన్నీ సుబ్రహ్మణ్యుని అధీనం చేస్తారుట. ప్రతి దేవతకీ కొన్ని గణములుంటాయి. ఇంద్ర గణములు, వాయు గణములు, వరుణ గణములు, అలాగే వసు గణములు, రుద్ర గణములు, ఆదిత్య గణములు. బ్రహ్మ దేవునికి సృష్టిలో సహకరించే గణములు, విష్ణువునకు స్థితిలో సహకరించే వైష్ణవ గణములు, అలాగే రుద్ర గణములు, శక్తి గణములు వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యునికి అప్పగించబడతారు. వారందరినీ నడిపేవాడు సుబ్రహ్మణ్యుడు. అంటే సర్వదేవతా శక్తి సమూహ స్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. అందుకు సుబ్రహ్మణ్యుని అనుగ్రహం ఉంటే సర్వదేవతల అనుగ్రహం ఉన్నట్లే. ప్రధానంగా ఈయన పేరు కుమారుడు అని వ్యవహారం. అంటే ఇది కుమారతత్త్వము. శివ, శక్తి ఈ రెండూ మూల తత్త్వములు గనుక తల్లిదండ్రులుగా చెప్పబడతాయి. ఆ రెండిటి సమాహారమై వచ్చినవాడు గనుక కుమారతత్త్వంగా చెప్తూన్నారు. కుమార తత్త్వం కూడా జ్ఞాన స్వరూపం. బ్రహ్మదేవుడికి సనత్కుమారుడు అని పుత్రుడు ఉన్నాడు. యితడు బ్రహ్మవేత్త. బ్రహ్మకు సనత్కుమారుడు ఎలాగో శివుడికి సుబ్రహ్మణ్యుడు. అందుకే సనత్కుమారుడే కుమారస్వామిగా శివుడికి పుత్రుడయ్యాడు అని ఉపనిషత్తుల ఆధారంగా ఒక కథ మనకి చెప్పబడుతున్నది. ఇందులో ఆంతర్యం ఏమిటి అంటే సుబ్రహ్మణ్యుడు జ్ఞానప్రదాత. పైగా 'సుబ్రహ్మణ్య' అనే మాటయే ఆయన ప్రత్యేకించి బ్రహ్మజ్ఞాన స్వరూపుడు అని మాట చెప్పబడుతున్నది. కనుక జ్ఞానపరంగా ఈయన గురువైతే యజ్ఞపరంగా సర్వదేవతలకీ బలాన్ని ఇచ్చేది యజ్ఞం. యజ్ఞం ద్వారానే దేవతలు బలం పొందుతారు. బలం పొందిన దేవతలు ప్రపంచాన్ని కాపాడతారు. అందుకు దేవతలు బలంపొంది మనల్ని కాపాడాలంటే దేవతలకి మనం బలం ఇవ్వాలి. అలా బలమివ్వగలిగే శక్తి యజ్ఞానికి ఉన్నది. యజ్ఞ స్వరూపమే సుబ్రహ్మణ్యము అని చెప్పబడుతున్నది. వేదమునందు యజ్ఞాగ్నిని ఉద్దేశించి 'సుబ్రహ్మణ్యోం' అని మంత్రం ప్రత్యేకించి చెప్పబడుతున్నది.
దేవా యుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్యాయం హ్యాయమ్!
యం సిద్ధయంతి స్కందం వందే సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం!!
అని వేదపాదస్తవం చెప్తున్నటువంటి మాట. దేవతలు యుద్ధ సమయంలోనూ అలాగే ఋషులు యజ్ఞసమయంలోనూ ఎవరిని ఆరాధించడం చేత వారి వారి ప్రయోజనములను సిద్ధింపజేసుకుంటున్నారో అటువంటి సుబ్రహ్మణ్యుడికి నమస్కారము అని భావం ఇక్కడ.
కార్య సిద్ధి కలగాలన్నా, ప్రతికూలతలు తొలగాలన్నా, విద్య కావాలన్నా, శక్తి కావాలన్నా, వంశవృద్ధి కలగాలన్నప్పటికీ కూడా సుబ్రహ్మణ్యారాధన చేయాలి. అందుకే యజ్ఞ, శక్తి, జ్ఞాన తత్త్వములే కాకుండా వంశ వృద్ధిని కలిగించే శక్తి సుబ్రహ్మణ్యుని స్వరూపము. ఇది ఒక ప్రత్యేక కోణం. ఎందుకంటే ఆయన కుమారుడు. శివశక్తులను తల్లిదండ్రులను చేసినటువంటి వాడు ఇతను. అందుకే ఈయన కారణంగా వాళ్లకి సంతాన తృప్తి లభించింది. అందుకు దివ్య బాలకుడైన సుబ్రహ్మణ్య ఆరాధన ఎవరు చేస్తారో వాళ్లకి కూడా ఉత్తమ సంతానాన్ని పొందినటువంటి తృప్తిని కలిగిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. అందుకు ఈయనని కుమారతత్త్వంగా ఆరాదించడంలో విశేషమిది.
Read More

రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొనక ముందే ఎగురగలిగిన విమానాన్ని తయారుచేసిన భారతీయ శాస్త్రవేత్తలు

విమానాన్నికనుగొన్నభారతీయ శాస్త్రవేత్తలు
రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొనక ముందే ఎగురగలిగిన విమానాన్ని తయారుచేసిన భారతీయ శాస్త్రవేత్తలు
శివకర్ బాపుజీ తల్పాడే (1864–1916)మరియు సుబ్రహ్మణ్య శాస్త్రి ... వీరిద్దరే మొట్ట మొదట ఎగిరే విమానాన్ని తయారుచేసింది.. వీరు తమ విమానాన్ని 1895లో 1500 అడుగుల వరకు ఎగురవేయ గలిగారు...
ఇదే పనిని రైట్ బ్రదర్స్ 1903 (దాదాపు 8ఏళ్ళ తర్వాత)లో చేసారు.. కానీ వారికే విమానాన్ని కనుగొన్న పేరు దక్కింది..
మన హిందూ గ్రంథాలలో “సమరాంగణ సూత్రధర” అనే విమాన శాస్త్ర గ్రంథం ఉంది... శివకర్ దానిని ఆధారంగా చేసుకుని advanced Vedic Mercury ion plasma ఇంథనంగా చేసుకుని ఏ మాత్రం శబ్దం లేని విమానాన్ని తయారు చేసారు... పాదరసాన్ని చక్రాకారం లో త్రిప్పి వేడి చేయడం వలన వచ్చే శక్తితో విమానం నడిచేలా చేసారు... (చాలా వరకు వేద కాలంలో విమానాలను నడిపేందుకు పాదరసాన్ని ఉపయోగించే వారని గ్రంథాలలో పేర్కొనబడింది) వేదాలలో క్వాంటం ఫిజిక్స్ కు సంబంధించిన విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయట..
అయితే ఈ ప్రయోగాన్ని దాదాపు మూడు వేల మంది ప్రజలు, బ్రిటిష్ వారి సాక్షిగా నిర్వహించారని కానీ దురదృష్టవశాత్తూ అప్పుడు భారత దేశం బ్రిటిషువారి పరిపాలనలో ఉండి వారి చే అణగద్రొక్కబడి... పరిశోధనలన్నీ వారి పరిశోధనలుగా వెలువడ్డాయి...

Read More

మార్కండేయుడు చేసిన సుబ్రహ్మణ్య స్తుతి:

మార్కండేయుడు చేసిన సుబ్రహ్మణ్య స్తుతి:

మహాత్మా! మూడులోకాలలో ప్రసిద్ధమైన కార్తికేయుని నామాలను వినగోరుతున్నాను అని యుధిష్ఠిరుడు అడుగగా మహాతపస్వి, మహాత్ముడు అయిన మార్కండేయ మహర్షి ఈ విధంగా చెప్పాడు.
ఆగ్నేయుడు, స్కందుడు, దీప్తకీర్తి, అనామయుడు, మయూరకేతువు, ధర్మాత్ముడు, భూతేశుడు, మహిషాసురమర్దనుడు, కామజిత్తు, కామదుడు, కాంతుడు, సత్యవాక్కు, భువనేశ్వరుడు, శిశువు, శీఘ్రుడు, శుచి, చండుడు, దీప్తవర్ణుడు, శుభాననుడు, అమోఘుడు, అనఘుడు, రౌద్రుడు, ప్రియుడు, చంద్రాననుడు, దీప్తశక్తి, ప్రశాంతాత్ముడు, భద్రకృత్తు, కూటమోహనుడు, షష్ఠీప్రియుడు, ధర్మాత్ముడు, పవిత్రుడు, మాతృవత్సలుడు, కన్యాభర్త, విభక్తుడు, స్వాహేయుడు, రేవతీ సుతుడు, ప్రభువు, నేత, విశాఖుడు, నైగమేయుడు, సుదుశ్చరుడు, సువ్రతుడు, లలితుడు, బాలక్రీడనక ప్రియుడు, ఆకాశచరుడు, బ్రహ్మచారి, శూరుడు, శరవణోద్భవుడు, విశ్వామిత్రప్రియుడు, దేవసేనా ప్రియుడు,

అనే ఈనామలను పఠించేవాడు స్వర్గాన్ని, కీర్తిని, ధనాన్ని పొందుతాడు. ఈ విషయంలో సందేహంలేదు.

మహాభారతం - వనపర్వం - 2
Read More

పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్యరూపం-సుబ్రహ్మణ్య స్వామి

పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్యరూపం-సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నామధేయం కేవలం సుబ్రహ్మణ్యానికే సొంతం. దేవసేనాధిపతిగా, సకల దేవగణాల చేత పూజలందుకునే దైవం కుమార స్వామి అని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి షణ్ముఖుని అనుగ్రహం పొందగలిగితే కుమార షష్ఠి రోజుల్లో స్వామిని పూజించాలి. కుమార స్వామిని పూజిస్తే గౌరీశంకరుల కటాక్షం మనకు లభించినట్లే.

శివపార్వతుల తనయుడైన కుమార స్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె భరించలేకపోవడంతో, ఆ శిశువు రెల్లు పొదల్లో జారిపడింది. ఆ శిశువును కృత్తికా దేవతలు ఆరుగురు స్తన్యమిచ్చి పెంచారు. జారిపడినందున ఆ శిశువును స్కందుడని, రెల్లు గడ్డిలో ఆవిర్భవించడంతో శరవణుడని, కృత్తికా దేవతలు పెంచడంతో కార్తీకేయుడని కుమార స్వామిని పిలుస్తారు.

ఇక సుబ్రహ్మణ్యునికి ఉన్న ఆరు ముఖాలకు ప్రత్యేకతలున్నాయి. మయూర వాహనాన్ని అధిరోహించి కేళీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం, పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం, శూరుడనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం, శరుణు కోరిన వారిని సంరక్షించే ముఖం, శూలాయుధ పాణియై వీరుడిగా ప్రస్పుటమయ్యే ముఖం, లౌకిక సంపదల్ని అందించే ముఖం... ఇలా ఆరు ముఖాల స్వామిగా ఆనంద దాయకుడిగా స్వామి కరుణామయుడిగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్నాడు.

అందుచేత మార్గశిర శుద్ధ షష్ఠి పుణ్య దినాల్లో భక్తులు స్వామిని విశేషంగా సేవిస్తారు. వీటిని స్కంద షష్ఠి,సుబ్రమణ్య షష్ఠి,, కుమార షష్ఠి అన్న పేర్లతో జరుపుకుంటారు.
ఇంకా పంచమి నాడు ఉపవాసం ఉండి, షష్ఠి నాడు కుమార స్వామిని పూజించడం ఓ సంప్రదాయంగా వస్తుంది. నాగ దోషాలకు, సంతాన లేమి, జ్ఞాన వృద్ధికీ, కుజ దోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయ. స్కంద పంచమి, షష్ఠి రోజుల్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని విశ్వాసం.
Read More

భారత దేశంలో బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయంభారత దేశంలో బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయం.

ఆమె మనసు ఉద్విగ్నంగా ఉంది యుద్ధానికి వెళ్లిన భర్త క్షేమసమాచారం లేదు. ఏమయ్యాడో తెలియదు. పది రోజుల క్రింద ఉత్తరం వచ్చింది. ఆ తరువాత నుంచి అజా అయిపూ లేదు గుర్రంపై స్వారీ చేస్తూ తెలియకుండానే కొండపైకి ఎక్కుతోంది ఆమె "మార్టిన్ ఐ మిస్ యూ మార్టిన్ ఐ మిస్ యూ సో మచ్ డియర్" కళ్లల్లో నీళ్లు తిరిగాయి కడిగేసినంత స్పష్టంగా కల్నల్ మార్టిన్ బొమ్మ ఆమె కళ్లముందు కట్టింది సాయంత్రం సూర్యుడు పడమర ఒడిలో పడుకుండిపోతున్నాడు కొండమీద కాషాయ కాంతి విరజిమ్ముతోంది వింత నిశ్శబ్దం అంతా పరుచుకుపోయింది ఉన్నట్టుండి గణ గణ గణ గణ గణ గణ గణ గణ గంటల శబ్దం నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చింది.

ఆ శబ్దం వచ్చిన వైపు చూపింది ఆమె దూరంగా ఒక శిధిల దేవాలయం అందులోనుంచి హారతి దీపాల వెలుగు ధూపాల పొగ ఘంటారావం అప్రయత్నంగానే ఆమె ఆ గుడిపైపు వెళ్లింది. గుడిముందు గుర్రం దిగి చెప్పులు విప్పి లోపలికి వెళ్లింది
లోపల వైద్యనాథ మహాదేవ శివుడు లింగాకారంలో విచిత్ర కాంతులు వెదజల్లుతూ అర్థనిమీలిత నేత్రాలతో పూజారి అర్చన చేస్తున్నాడు ఆయన నోటి నుంచి మంత్రాలు అలవోకగా వెలువడుతున్నాయి ఆమె తనకు తెలియకుండానే అక్కడే నిలబడిపోయింది కళ్లనుండి ధారగా నీరు కారుతూనే ఉంది పూజ పూర్తికాగానే పూజారి ఆమె వైపు చూశాడు"మేమ్ సాబ్ తీర్థం తీసుకొండి" "ఏమిటమ్మా ఏదో దుఃఖంలో ఉన్నట్టున్నారు" ఆమె తన భర్త కల్నల్ మార్టిన్ అఫ్గన్ యుద్ధానికి వెళ్లిన సంగతి, ఆయన క్షేమ సమాచారం లేని విషయమూ చెప్పింది. చెప్పిందన్న మాటే కానీ కన్నీళ్ల వర్షం కురుస్తూనే ఉంది

"మేమ్ సాబ్ కంగారు పడకండి బైద్యనాథ్ మహాదేవుడు అందరినీ కాపాడతాడు ఆయన దయ ఉంటే మృత్యువేమీ చేయదు. అంతఃకరణశుద్ధిగా బైద్యనాధుడిని అర్చించండి. ఓం నమశ్శివాయ అన్న మంత్రాన్ని పదకొండు రోజుల పాటు లఘురుద్రి జపం చేయండి అంతా మంచే జరుగుతుంది." అన్నాడు ఆమెకి ఏమనిపించిందో తెలియదు కానీ ఆ మరుసటి రోజు నుంచే అన్నపానాలు మానేసింది.

అన్ని పనులూ మానేసింది. తన గదిలోనే కూచుంది "ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ " మంత్రం జపించసాగింది. మరొక ధ్యాస లేదు ఇంకో ధ్యానం లేదు ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఒకటి రెండు మూడు నాలుగు అయిదు రోజులు గడిచిపోతున్నాయి "ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ "

పదకొండో రోజు రోజు రోజంతా పంచాక్షరిని జపించింది సాయంత్రం అవుతూ ఉండగా సేవకుడొకడు "మేమ్ సాబ్ మేమ్ సాబ్ సాహిబ్ కీ చిట్ఠీ ఆయీ హై సాహిబ్ కీ చిట్ఠీ ఆయీ హై " అని పరిగెత్తుకుంటూ వచ్చాడు ఉద్వేగాన్ని ఆపుకుంటూ ఆమె ఆ లేఖను తెరిచి చూసింది తన ప్రియాతిప్రియమైన మార్టిన్ సంతకం చూసింది కట్టలు తెంచుకుంటున్న భావోద్వేగాన్ని ఎలాగోలా ఆపుకుంటూ లేఖను చదవసాగింది "డియర్ గతంలో నీకు లేఖ వ్రాసిన మరుసటి రోజు నుంచే అఫ్గన్లు మా పటాలాన్ని చుట్టుముట్టారు. నలు వైపుల నుంచి భీకరమైన దాడి చేశారు. మేమెవరమూ బతికిబట్టకట్టి బయటపడే పరిస్థితి లేదు. మా దగ్గర ఆయుధాలూ తక్కువే ఆహారమూ తక్కువే వాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు ఇక మా పని అయిపోయిందనుకున్నాను ఒక అఫ్గన్ పొడవాటి ఖడ్గంతో నాపై దూకాడు నేను భయంతో కళ్లు మూసుకున్నాను ఆ క్షణంలో నువ్వు తప్ప నాకింకెవరూ గుర్తుకురాలేదు అంతలో అద్భుతం జరిగిపోయింది.

ఎవరో ఒక మనిషి అఫ్గన్లపైకి దూకాడు ఆయన్ని నేను అంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఒళ్లంతా తెల్లగా ఏదో రాసుకున్నాడు. సింహం చర్మం మొలకి కట్టుకున్నాడు చేతుల్లో పొడవాటి శూలం లాంటి ఆయుధం ఉంది.ఆ శూలం కొన మూడుగా చీలి ఉంది ఆయన ధాటికి అఫ్గన్లు కకావికలమైపోయారు. కాలికి బుద్ధిచెప్పి పారిపోయారు వాళ్లు పారిపోగానే ఆయన కూడా ఏమైపోయాడో తెలియదు ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు ఆయన ఆ క్షణాన వచ్చి ఉండకపోతే నేను నీకు దక్కేవాడికి కాదు డియర్"

1880 అఫ్గన్ యుద్ధం నుంచి తిరిగి వచ్చాక కల్నల్ మార్టిన్, ఆయన భార్య కొండమీద కొలువున్న బైద్యనాథ్ మహాదేవుడిని దర్శించుకున్నారు. శిథిలావస్థలో ఉన్న ఆ దేవాలయం జీర్ణోద్ధరణకు పదిహేనువేల రూపాయలు సమర్పించుకున్నారు. మహాదేవ్ మందిరానికి కొత్త శోభ వచ్చింది. కొన్నాళ్లకి కల్నల్ మార్టిన్ సతీ సమేతంగా ఇంగ్లండుకు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ కూడా వారి ఇంట్లో ఒక శివుడి విగ్రహం పెట్టుకున్నారు. కడవరకూ ఆయన్నే అర్చించారు. మందిరం ముందు ఉన్న శిలాఫలకంపై తమ కథను కల్నల్ మార్టిన్, ఆయన భార్య వ్రాయించారు. ఆ మందిరం మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలోని అగర్ మాల్వాలో ఉంది. భారత దేశంలో బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయం అది.


Read More

Thursday, 27 November 2014

దత్తాత్రేయ స్తోత్రం:దత్తాత్రేయ స్తోత్రం:

దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనో వతు|| 1
దీనబంధుం కృపాసింధుం సర్వకారణ కారణం
సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనో వతు|| 2
శరణ గతదీనార్తపరిత్రాణ పరాయణం
నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనో వతు|| 3
సర్వానర్ధహరం దేవం సర్వమంగళ మంగళం
సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనో వతు|| 4
బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం
భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీ సనో వతు|| 5
శోషణం పాపపంకస్య దీపనంజ్ఞానచేతసః
తాపప్రశమనం వందే స్మర్తృగామీ సనో వతు|| 6
సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం
ఆపదుద్ధరణం వందే స్మర్తృగామీ సనో వతు|| 7
జన్మ సంసారబంధఘ్నం స్వరూపానందదాయకం
నిశ్శ్రేయసవదం వందే స్మర్తృగామీ సనో వతు|| 8
జయలాభయసః కామదాతు ర్దత్తస్య హః స్తవం
భోగమోక్షప్రస్యేమం య పఠేత్ సుకృతీ భవేత్|| 9


जै.श्रीराम .....!!
Read More

నిత్య పూజా విధానం

నిత్య పూజా విధానం

{ప్రతి దేవుని (దేవత) పూజకు ముందుగా గణపతి పూజ చేసి అనంతరం మీరు ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుని పూజించవలెను.}

వినాయకుని శ్లోకం:

శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.

***

వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా

ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః
{అని నమఃస్కారం చేసుకోవాలి}

అహం __________ నామ ధేయా
(భర్త పేరు చదువు కోవాలి) (Ex: సత్య ప్రకాష్)

ధర్మ పత్ని ______________ నామ ధేయా,
(Ex: లక్ష్మీ శైలజ)

సకుటుంభాయాః సకుటుంబస్య - ఉపాత్త దురితక్షయ ద్వారా,

శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం,

క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం,

ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం,

సర్వాపదాం నివారణార్ధం, సకలకార్య విఘ్న నివారణార్ధం,

సత్సంతాన సిద్ధ్యర్ధం, శ్రీ పార్వతీ సహిత పరమేశ్వర దేవతా ముద్దిశ్య,

కల్పోక్త విధానేన యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే,

{అని చదివి అక్షంతలు నీరు కలిపి పళ్ళెములో విడువవలెను.}

****

కలశారాధన

అదౌ నిర్విఘ్న పరి సమాప్త్యర్ధం శ్రీ మహాగణపతి పూజార్ధం తదంగ కలశారాధనం కరిష్యే.

{కలశమునకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి, కలశంలో ఒక పువ్వు, కొద్దిగా అక్షంతలు వేసి, కుడి చేటితో కలశంను మూసి పెట్టి, ఈ క్రింది మంత్రాలను చెప్పవలెను.}

కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః మూలే తత్ర స్థితోబ్రహ్మా

మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా

వసుంధరా ఋద్వేదో థ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః అంగైశ్చ

సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః గంగేచ యమునే చైవ

గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు.

{శిరస్సు పైన పూజా ద్రవ్యముల పైన నీరు చల్లవలెను}

ఆత్మానం సంప్రోక్ష్య, పూజ ద్రవ్యాణి సంప్రోక్ష్య.
Read More

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

||ఓం||

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్. ||1||

(2 times)


ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ

ఉత్తిష్ఠ కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు. ||2||

(2 times)


మాతస్సమస్త జగతాం మధుకైట భారేః

వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే |

శ్రీ స్వామి నిశ్రిత జనప్రియ దానశీలే

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్. ||3||

(2 times)


తవ సుప్రభాత మరవిందలోచనే

భవతు ప్రసన్న ముఖచంద్రమండలే

విధి శంకరేంద్ర వనితాభి రర్చితే

వృషశైల నాథ దయితే దయానిధే. ||4||


అత్ర్యాది సప్తఋషయస్స ముపా స్యసంధ్యాం

ఆకాశ సింధు కమలాని మనోహరాణి

ఆదాయ పాదయుగ మర్చయుతుం ప్రపన్నాః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||5||


పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యాః

త్రైవిక్రమాది చరితం విభుధాః స్తువంతి

భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||6||


(ఈషత్ప్రఫుల్ల సరసీరుహ నారికేళ

పూగద్రుమాది సుమనోహర పాళికానాం)

ఆవాతి మందమనిల స్సహ దివ్యగంధైః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||7||


ఉన్మీల్యనేత్రయుగముత్తమ పంజరస్థాః

పాత్రావశిష్ట కదళీఫల పాయసాని

భుక్త్వా సలీలమథ కేళిశుకాః పఠంతి

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||8||


తంత్రీప్రకర్ష మధురస్వనయా విపంచ్యా

గాయత్యనంతచరితం తవ నారదోపి

భాషాసమగ్రమసకృత్కర చారురమ్యం

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||9||


(భృంగావళీచ మకరంద రసానువిద్ధ

ఝంకారగీత నినదైః సహ సేవనాయ)

నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||10||


యోషాగణేన వరదధ్ని విమధ్యమానే

ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషాః

రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||11||


పద్మేశమిత్రశతపత్ర గతాళివర్గాః

హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్యాం

భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం

శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ||12||


శ్రీ మన్నభీష్ట వరదాఖిల లోకబంధో

శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో

శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్య మూర్తే

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||13||(2 times)


శ్రీ స్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగాః

శ్రేయోర్థినో హరవిరించి సనందనాద్యాః

ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగాః

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||14||


(శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి

నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం)

ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||15||


(సేవాపరాః శివసురేశ కృశానుధర్మ

రక్షోంబునాథ పవమాన ధనాధినాథాః)

బద్దాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||16||


(ధాటీషు తే విహగరాజ మృగాధిరాజా

నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః)

స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||17||


(సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యసౌరి

స్వర్భానుకేతు దివి షత్పరిషత్ప్రధానాః)

త్వద్దాస దాస చరమావధి దాస దాసాః

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||18||


త్వత్పాదధూళిభరిత స్ఫురితోత్తమాంగాః

స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగా

కల్పాగమాకలనయా కులతాం లభంతే

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||19||


త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః

స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంతః

మర్త్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||20||


శ్రీ భూమి నాయక దయాది గుణామృతాబ్ధే

దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే

శ్రీ మన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||21||


శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ

వైకుంఠ మాధవ జనార్ధన చక్రపాణే

శ్రీవత్సచిహ్న శరనాగతపారిజాత

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||22||


కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే

కాంతా కుచాంబురుహ కుట్మలలోలదృష్టే

కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||23||


మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్

స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర

శేషాంశ రామ యదునందన కల్కిరూప

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||24||


ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం

దివ్యం వియత్సరతి హేమఘటేషు పూర్ణం

ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః

తిష్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతం. ||25||


భాస్వానుదేతి వికచాని సరోరుహాణి

సంపూరయంతి నినదైః కకుభో విహంగాః

శ్రీవైష్ణవాః సతత మర్చిత మంగళాస్తే

ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతం. ||26||


బ్రహ్మాదయస్సురవరాస్స మహర్షయస్తే

సంతస్సనందన ముఖాస్త్వథ యోగివర్యాః

ధామాంతికే తవ హి మంగళవస్తు హస్తాః

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||27||


లక్ష్మీనివాస నిరవద్య గుణైక సింధో

సంసార సాగర సముత్తరణైక సేతో

వేదాంత వేద్య నిజవైభవ భక్తభోగ్య

శ్రీ వేంకటా చలపతే తవ సుప్రభాతం. ||28|| (2 times)


ఇత్థం వృషాచలపతే రిహ సుప్రభాతం

యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః

తేషాం ప్రభాత సమయే స్మృతిరంగ భాజాం

ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే. ||29|| (2 times)
Read More

Siva Thandava Sthothram

Siva Thandava Sthothram

జటాకటాహ సంభ్రమ ద్భ్రమ న్నిలింప నిర్ఝరీ,

విలోలవీచివల్లరీ విరాజమానమూర్థని;

ధగధగ ధగజ్జ్వల ల్లలాటపట్టపావకే,

కిశోర చంద్ర శేఖరే రతిః ప్రతిక్షణం మమ. ||1 ||


ధరా ధరేంద్ర నందినీ విలాస బందు బంధుర,

స్ఫురదృగంత సంతతి ప్రమోద మాన మానసే ,

కృపా కటాక్ష ధోరణీ నిరుద్ధ దుందరాపది,

క్వచి ద్దిగంబరే మనో వినోద మేతు వస్తుని . ||2||


జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణామణిప్రభ,

కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే;

మదాంధ సిందురస్ఫురత్త్వ గుత్తరీయ మేదురే,

మనోవినోదమద్భుతం భిభర్తు భూతభర్తరి. ||3||


సహస్రలోచన ప్రభృ త్యశేష లేఖ శేఖరః,

ప్రసూన ధూళిధోరణీ విధూసరాంఘ్రి పీఠభూః;

భుజంగరాజ మాలయా నిబద్ధ జాట జూటకః,

శ్రియైచిరాయజాయతాం చకోరబంధు శేఖరః. ||4||


లలాట చత్వరజ్వల ద్ధనంజయ స్ఫులింగభా,

నిపీత పంచసాయకం నమ న్నిలింపనాయకం;

సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం,

మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః. ||5||


కరాల ఫాల పట్టికా ధగద్ధగద్ధగ జ్జ్వల,

ద్ధనంజయాహుతికృత ప్రచండపంచసాయకే;

ధరాధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్ర పత్రక,

ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ. ||6||


నవీన మేఘ మండలీ నిరుద్ధ దుర్ధరస్ఫురత్,

త్కుహు నిశీధీనీతమః ప్రబంధ బంధకంధరః;

నిలింపనిర్ఝరీధర స్తనోతు కృత్తిసింధురః,

కలానిదానా బంధురః శ్రియం జగద్ధురంధరః. ||7||


ప్రఫుల్ల నీలపంకజ ప్రపంచ కాలి మచ్ఛటా,

విడంబి కంఠ కంధరా రుచి ప్రబంధ కంధరం;

స్మరచ్చిదం, పురచ్చిదం, భవచ్చిదం, మఖచ్చిదం,

గజచ్ఛి దంధ కచ్చిదం తమంత కచ్ఛిదం భజే. ||8||


అగర్వ సర్వ మంగళా కలాకదంబ మంజరీ,

రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం;

స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం,

గజాంత కాంధ కాంతకం తమంతకాంతకం భజే. ||9||


జయత్వ దభ్ర విభ్రమ ద్భ్రమద్భుజంగ మస్ఫుర,

ద్ధగ ద్ధగ ద్వినిర్గ మత్కరాల ఫాల హవ్యవాట్;

ధిమి ద్ధిమి ద్ధిమి ధ్వన మృదంగ తుంగ మంగళ,

ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవశ్శివః. ||10||


దృషద్విచిత్ర తల్పయో ర్భుజంగ మౌక్తి కస్రజో,

ర్గరిష్ఠరత్న లోష్ఠయోః సుహృద్వి పక్ష పక్షయోః;

తృణారవింద చక్షుషోః ప్రజా మహీ మహేంద్రయో,

స్సమం ప్రవర్తితం కదా సదా శివం భజామ్యహమ్. ||11||


కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోట రేవస,

న్విముక్త దుర్మతిస్సదా శిరస్థ మంజలిం వహన్;

విముక్త లోల లోల లోచనో లలాట ఫాల లగ్నక,

శ్శివేతి మంత్ర ముచ్చరన్ కదా సుఖీ భవామ్యహమ్. ||12||


ఇమం హి నిత్యమేవ ముత్త మోత్తమం స్తమం,

పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధి మేతి సంతతం;

హరే గురౌ సుభక్తి మాశు యాతినాన్యథా గతిం,

విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్. ||13||


పూజావసాన సమయే దశ వక్త్ర గీతం,

య శ్శంభు పూజన మిదం పఠతి ప్రదోషే;

తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగ యుక్తాం,

లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః. ||14||

||లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః.||
Read More

కాలభైరవాష్టకం

కాలభైరవాష్టకం

దేవ రాజ సేవ్య మాన పావనాంఘ్రి పంకజం,

వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం |

నారదాది యోగిబృంద వందితం దిగంబరం,

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||1||

భాను కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం,

నీల కంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనం |

కాల కాల మంబుజాక్ష మక్ష శూల మక్షరం,

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||2||

శూలటంక పాశదండ పాణిమాది కారణం,

శ్యామ కాయ మాది దేవ మక్షరం నిరామయమ్|

భిమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం,

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||3||

భుక్తి ముక్తి దాయకం ప్రశస్త చారు విగ్రహం,

భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహమ్ |

నిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీలసత్కటిం,

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||4||

ధర్మ సేతు పాలకం త్వధర్మమార్గ నాశకం,

కర్మ పాశ మోచకం సుశర్మదాయకం విభుమ్|

స్వర్ణవర్ణ శేశపాశశోభితాంగ మండలం,

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||5||

రత్న పాదుకాప్రభాభిరామ పాద యుగ్మకం,

నిత్య మద్వితీయమిష్ట దైవతం నిరంజనం|

మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్రమోక్షణం,

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||6||

అట్టహాసభిన్న పద్మజాండకోశసంతతిం,

దృష్టిపాతనష్ట పాపజాలముగ్రశాశనమ్|

అష్టశిద్ధిదాయకం కపాలమాలికంధరం,

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||7||

భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం,

కాశివాసిలోకపుణ్య పాపశోధకం విభుమ్|

నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుం,

కాశికాపురాధి నాథ కాల భైరవం భజే ||8||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం,

జ్ఞాన ముక్తి సాధనం విచిత్రపుణ్య వర్ధనమ్|

శోకమోహదైన్యలోభకోపతాపనాశనం,

తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధం ధ్రువమ్ ||9||

||కాశికాపురాధి నాథ కాల భైరవం భజే||

||కాశికాపురాధి నాథ కాల భైరవం భజే||

||కాల భైరవం భజే||

||కాల భైరవం భజే||

||ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణమ్||
Read More

శ్రీ లలిత శివ జ్యొతి - మంగళ హారతి

శ్రీ లలిత శివ జ్యొతి - మంగళ హారతి
===========================

శ్రీ లలిత శివ జ్యొతి సర్వ కామదా,

శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.

జగముల చిరు నగముల పరిపాలించే జననీ,

అనయము మము కనికరమున కాపాడే జననీ,

మనసే నీ వసమై, స్మరణే జీవనమై,

మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ హారతి. ||1||

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,

శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.

అందరికన్నా చక్కని తల్లికి --- సూర్యహారతి,

అందలేలే చల్లని తల్లికి --- చంద్రహారతి,

రవ్వల తళుకుల కలలా జ్యోతుల --- కర్పూరహారతి,

సకల నిగమ వినుత చరణ --- శాశ్వత మంగళ హారతి. ||2||

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,

శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద.
Read More

భగవంతుడు ఒక్కడే కానీ రూపాలు వేరువేరుగా ఉంటాయియని మనకు తెలుసుభగవంతుడు ఒక్కడే కానీ రూపాలు వేరువేరుగా ఉంటాయియని మనకు తెలుసు .బ్రహ్మదేవుడనగానే నాలుగు ముఖాలతో కమలాసనం మీద కూర్చున మూర్తి కళ్ళకు కడుతుంది .
విష్ణువు నాభిలో తామరపువ్వుతో లక్ష్మీదేవి సరసన ఉండగా శేషతల్పం మీద శయనించి ఉంటాడు .శంఖం ,చక్రం ,గదమొదలైనవి అయన చిహ్నాలు .శరీరం నిండా భస్మం అలుదుకొని ఉంటాడు .సర్పాన్ని హారంగా వేసుకుంటాడు .చర్మా౦బరం కట్టుకుంటాడు.ఒక్కోసారి దిగంబరంగాను ఉంటాడు .రుద్రాక్ష మాల వేసుకుని ఉంటాడు .కుడి చేతిలో జపమాల ఉంటంది .అయన నంది వాహనుడు .ఇవన్ని శివుడి చిహ్నాలు.

'లిం 'అంటే మాములు చూపులకు కనిపించకుండా లోపల ఉన్నదానిని ,అంటే 'లీన'మై ఉన్నదానిని 'గం '(గమయంతి )అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంది కనుక అది.'లింగ 'మై౦దన్నమాట. పన్నెండు తావులు -పన్నెండురూపాలు పరమేశ్వరుడు పరిపూర్ణుడు .అయన అంతటా ఉంటాడు.అన్ని తెలసి ఉంటాడు .అటువంటి పరిపూర్ణ రూపంలో ఉన్నప్పుడు ఆయనకు ఆకారం ఉండదు .ఇతరులకు తనూ కనిపిచాలనుకున్నప్పుడు అంబతో కలసి (సాంబ )కనిపిస్తాడు .ఆయనే సాంబమూర్తి .

రూపంలేని స్తితి నుంచి సాంబమూర్తిగా మారడానికి మధ్యలోఇంకో రూపం ఉంది .దానిని 'ఆరూపం 'అంటారు .అదే శివలిగం . మొట్టమొదట్ట పరమేస్వారుడు జ్యోతిర్మయలింగాకారంలో అవతరించాడు .దాని మొదలు .తుది కనుక్కోవడంలో బ్రహ్మవిష్ణువులు కూడా భంగపడ్డారు .ఈ జ్యోతిర్లింగావిర్భావం జరింగింది అర్ధరాత్రి సమయంలో !అదే శివరాత్రి అయింది .

ఈ ఆవిర్భావకాలాన్నేలింగోద్భవ కాలం అంటారు .జ్యోతిర్లింగాలుమన దేశంలో పన్నెండు చోట్ల తాను వ్యాపించి ఉంటానని ,ప్రత్యేకించి పన్నెండు చోట్ల పన్నెండురూపాలలో ఉంటానని శివుడంటాడు.అవే ద్వాదశజ్యోతిర్లింగాలు. ఈ బ్రహ్మ౦డమే జ్యోతిర్లింగ౦. అదే హిరణ్యగర్బుడు కూడా.ఈ జ్యోతిర్లింగా౦ ప్రకటితమవడమే సృష్టి మనకు తెలిసిన కాలము ,ప్రదేశము అనే పరిమితులకు అతీతంగా పరమసత్యంగా భాసించే పరమాత్మ రూపమే జ్యోతిర్లింగ౦.

అయిదు రకాల లింగాలు శివలింగాలను అయిదు రకాలుగా చెబుతారు .వాటిలో మొదటిది స్వయంభులింగం ,అంటే తనంతట తానుగా అవతరించింది .రెండోవది బిందులింగం.ఇది ధ్యాన పూర్వకమైనలింగం.మూడోది ప్రతిస్టాలింగం,ఆగమశాస్త్ర పద్దతిలోమంత్రపూర్వకంగా ప్రతిష్టి౦చినది.నాలుగోవది చరలింగం .దీనిని అభ్యాత్మిక లింగంమని కూడా అంటారు .అయిదోవది గురులింగం .శివుని విగ్రహమే గురులింగం.

ఆరు రకాల ద్రవ్యాలు అష్టాదశ పురాణాలలో ఒకటైన 'లింగపురాణం 'శివలింగం మహిమను సమగ్రంగా వివరిస్తుంది .ఈ పురాణం ప్రకారం ,దేవశిల్పి అయిన విశ్వకర్మ కరకాల వస్తువులతో లింగాలను తయారు చేసి దేవతలకు ఇస్తూ ఉంటాడు .ప్రధానంగా లింగాలు ఆరు రకాల పదార్థాలతో తయారుచేస్తారు .

అవి:

రాతితో తయారు చేసే శైలజ లింగాలు లేదా శిలాలింగాలు ,రత్నాలు,వజ్రలు మొదలైన వాటితో తయారు చేసేవి రత్నాజలింగాలు లోహ లేదా ధాతాజలింగాలు ,మట్టితో చేసేవి మృత్తికాలింగాలు,అప్పటికప్పుడు దేనితోనైన తయారుచేసేవి క్షణిక లింగాలు ,చెక్కతో తయారు చేసేవి దారుజ లింగాలు. ఎవరు ఏ లింగాలని పూజించాలి లింగ పురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్నీ శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్నీ,వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్నీఅర్చించాలి .

స్పటిక లింగాన్నిమాత్రం ఎవరైనా అర్చించవచ్చు.స్త్రి విషయాని కొస్తే ,భర్త జీవించి ఉన్నవారు స్పటికలింగాని ,భర్త జీవించి లేనివారు స్పటికలింగాన్ని కానీ రసలింగాని కాని అర్చిస్తే మంచిదని లింగ పురాణం చెబుతోంది .స్త్రి లలో అన్ని వయస్సుల వారు స్పటిక లింగాన్ని అర్చించవచ్చు. ఏలింగాన్ని పూజ ఏ ఫలితం? ఏ లింగాన్ని పూజించడం వల్ల ఏఫలితముంటు౦దొకూడా లింగ పురాణం వివరించింది.

ఉదాహరణకు రత్నాజ లింగాన్నిపూజిస్తే ఐశ్వర్య౦ ,వైభవం సిద్దించి పరిపూర్ణత కలుగుతుంది .ధాతుజలింగం భోగ విలాసాలనిస్తుంది .మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుం ది.కాల్చిన మట్టితో చేసిన లింగం శ్రేష్టమైనది .అన్నిటిలోకి ఉత్తమం శిలా లింగం ,మధ్యమం లోహ లింగం . అతి పవిత్ర బాణలింగం అన్ని రకాల లింగాలలోనూ అత్యంత పవిత్రమైనది బాణలింగాలు .ఇవి నర్మదానదిలో ఎక్కువగా లభిస్తాయి .ఇవి తెల్లాగా ,చిన్నగా అండాకారంలో నదీ ప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి ఉంటాయి.

రత్నాజ లింగాలలో ఏ లింగాన్ని ఏ మాసంలో పూజిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందో కూడాలింగ పురాణం చెప్పింది .వైశాఖంలో వజ్రలింగాన్ని ,జ్యేష్ట౦లోమరకత లింగాన్ని,శ్రావణంలో నిలపు లింగాన్ని ,భద్రపదంలో పద్మరాగ లింగాన్ని ,ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని ,కర్తికంలో ప్రవాళలింగాన్ని ,మార్గశిరంలో వైడూర్య లింగాన్ని పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని ,మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని ,ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి .వీటికి ప్రత్యామ్నాయంగా వెండి ,రాగి లింగాలను కూడా పూజించవచ్చు.

స్తావర,జంగమ లింగాలు జగత్తంతా శివమయం ,అంటే లింగమయమే .బ్రహ్మ౦డమే లింగరుపమైనప్పుడు ,సృష్టి స్తితిలయలన్నింటికి లింగమే ఆధారమైనప్పుడు సృష్టిలో స్తావరాలు (కదలనవి-పర్వతాలు ,చెట్లు మొదలైనవి )జంగమాలు(కదిలేవి -మనుషులు.జంతువులు,పక్షులు ,క్రిమికీటకాలు మొదలైనవి )కూడాలింగ రూపాలే అవుతాయి .వీటికి స్తావర లింగాలు అంటారు .వీటిని పూజించడం ,సేవిచడం కూడా శివపుజలోకే వస్తుంది.

లింగ పూజ చేసేవారు ఉత్తర ముఖంగా కూర్చోవాలని,రుద్రాక్ష ,భస్మం ,మారేడు అనే మూడువస్తువులు వారి వద్ద తప్పనిసరిగా ఉండాలని శివపురాణం చెబుతోంది.
Read More

శ్రీశైలం క్షేత్రం - స్థల పురాణంశ్రీశైలం క్షేత్రం - స్థల పురాణం

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లిఖార్జున లింగము, అమ్మవారి కంఠం( గ్రీవం ) పడిన స్థానం కనుక అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబికా శక్తి పీఠము శ్రీశైలంలో ఒకే ఆవరణలో వెలిశాయి. శ్రీశైల స్థల పురాణం మేరకు శ్రీమల్లి కార్జున స్వామి ఆలయం 10వ శతాబ్దానిదనీ, భ్రమరాంబాలయం 16వ శతాబ్దానిదని ఆధునిక చరిత్రకారులు చెప్తున్నప్పటికీ ఇది చాలా ప్రాచీన మైనది. శ్రీశైల స్థల పురాణమంతయు స్కాందపురాణములోని “శ్రీశైల ఖండము” అనుపేర గలదు.

ఈ ప్రాంతంలో శిలాదుడనే మహర్షి శివుని గురించి ఘోర తపస్సు చేయగా పరమశివుడు ఆ మహర్షి తపమునకు మెచ్చి ప్రత్యక్షమై వరము కోరుకోమని అడిగెను.అప్పుడు శిలాదుడు స్వామి నాకు నీ వరం చేత పుత్రుడు పొందేలా వరం ప్రాసాదించు అని కోరుకున్నాడు.ఆ వర ప్రభావంచేత శిలాదుడికి నందీశ్వరుడు,పర్వతుడనే ఇద్దరు కుమారులు జన్మించారు.వీరిలో పర్వతుడు స్వామి వారి గురించి మరలా తపస్సు చెయ్యగా స్వామి ప్రత్యక్షమయ్యి నీకు సాయుజ్య ముక్తి నిస్తున్నాను అని వరమివ్వగా, పర్వతుడు స్వామికి నమస్కరించి పరమేశ్వరా! "నీవు నన్ను పర్వతంగా మార్చి నా మీదే నువ్వు కొలువుండేలా, నాయందు ముక్కోటి దేవతలు, సర్వ తీర్థములు, సమస్త ఓషధులు వసించేలా" వరం ప్రసాదించు అని అడిగెను. అదివిని శంకరుడు ఎందుకు అలాంటి వరం కోరుకొంటున్నావు అనగా నేనొక్కడిని తరించడంకాదు, ఇక్కడికి వచ్చిన ప్రతిభక్తుడూ తరించేందుకు అనువుగా ఈవరాన్ని కోరుతున్నాను. ఈ తీర్థాలలో స్నానమాడిన వారికి సమస్త పాపాలూ నశించాలి, ఇక్కడ లభించే ఓషధులతో ఎటువంటి రోగమైనా నశించాలి, శ్రమకోర్చి వచ్చిన వారందరూ నీ దర్శనాన్ని,అనుగ్రహాన్నీ పొందాలి. అందుకనే ఈవరంకోరుతున్నాను అని పర్వతుడు తెలుపగా బొళా శంకరుడు సంతోషించి వరం ప్రసాదించాడు. శివుడు లింగరూపంలో అక్కడ అవతరించాడు. ఇక్కడ పరమేశ్వరుడు మల్లిఖార్జునిగా,పార్వతీ దేవి భ్రమరాంబికా దేవిగా స్వయంభువులుగా వెలిసారు.

మల్లికార్జున నామ ప్రశస్తి :
స్వామి వారిని మల్లిఖార్జునుడు అని పిలవడానికి ఒక పురాణగాధ ఉన్నది. పూర్వం తలిదండ్రులపై కోపించిన కుమారస్వామి కైలాసం నుండి వచ్చి క్రౌంచ పర్వతం చేరాడు. ఆ పర్వతమే నేడు శ్రీశైలం అయినది. కుమారస్వామి వచ్చి ఉన్నచోట మద్దిచెట్టుకు మల్లెతీగ అల్లుకుని ఉన్నది. కుమారునికోసం వచ్చిన శంకరుడు ఆచెట్టు క్రిందనే లింగ రూపంలో వెలిశాడు కనుక స్వామిని “మల్లికార్జునుడు” అంటారు. అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు.

మరొక కథ కూడా ఉన్నది : పూర్వం చంద్రవంశపు రాజు అయిన చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతి శివుని పరమ భక్తురాలు. ఎపుడూ శివునిని ద్యానిస్తూ గడిపేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడగగా అంత చంద్రావతి స్వామీ! నేను మీ శిరముపై ఉంచిన మల్లెపూల దండ ఎన్నటికీ వాడి పోకుండా ఉండేలా వరం ప్రాసాదించమని కోరింది.అపుడు ఆ దండను శివుడు గంగ,చంద్రవంకల మద్య ధరిస్తాడు. శిరమున మల్లెపూల దండ ధరించాడు కావున స్వామి వారికి మల్లిఖార్జునుడు అనే పేరు వచ్చిందని అంటారు.

వృద్ధ మల్లిఖార్జునుడు : పూర్వం అమ్మవారు తపమాచరించి పరమేశ్వరుని ఇక్కడకు వచ్చి తనను వివాహమాడవలసినదిగా ప్రార్థించారు. అందుకు స్వామివారు ఒక వృద్ధుని రూపంలో వచ్చి ప్రత్యక్షమౌతారు. అమ్మవారు స్వామీ ఏమిటి ఈ అవతారం అని ప్రశ్నించగా నేను అనాదినుండీ ఉన్నవాడను నారూపం ఇదే! ఇష్టమైనచో వివాహమాడుము అని తెలుపుతారు. అందుకు అమ్మ మాహాదేవా! మీ తత్వం నాకు తెలియనిది కాదు. మీ మనోహరత్వం నాకు బాగా తెలుసును మీరు ఏరూపంలో ఉన్నా నాకు ఆమోదమే అని తెలిపి స్వామిని వివాహం చేసుకుంటారు. అలా వచ్చిన స్వామే వృద్ధ మల్లిఖార్జునుడు. నేటికీ లింగ రూపంలో ప్రథాన ఆలయానికి కుడివైపున ఉన్నారు.

భ్రమరాంబికా నామ ప్రశస్తి :
పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. ఈవరం తో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్ధించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతి ని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాక లో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన అమ్మవారు అరుణాసురుని సంహరించడానికి వెళతారు. ఆదిశక్తి ఎంతసేపు యుద్ధం చేసినా అరుణాసురుని చంపలేక పోతుంది. చివరికి అతని వరప్రభావమని తలచి షట్పదిఅయిన భ్రమర ( తుమ్మెద ) రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడి సైన్యాన్ని సంహరిస్తాయి. అమ్మవారు పేద్ద తుమ్మెదగా వచ్చి అరుణాసురుని సంహరిస్తుంది. అరుణాసురుని సంహరించిన తరువాత భ్రమరాంబ దేవతలకోరిక మేరకు శ్రీశైలం నివాసయోగ్యమని తలచి తనంతట తానుగా వచ్చి “భ్రమరాంబికాదేవి”గా ఇక్కడవెలసింది. ఈ గాథ వైవస్వత మన్వంతరంలో జరిగింది. ఐతే అంతకు ముందు ఏనాడో ఈ క్షేత్రం వెలసి ఉంది. ఆనాడు “అర్థనారీశ్వరీ దేవియే” మహాశక్తిగా, క్షేత్ర దేవతగా మల్లికార్జునునితో పాటు వెలసి ఉంది. ఇందుకు నిదర్శనంగా అర్థనారీశ్వరీ దేవాలయం మల్లికార్జున స్వామి ఆలయానికి ప్రక్కనే ఉంది. అంతేకాదు. అర్థనారీశ్వరీదేవియే మహాదేవి అయినట్లు, క్షేత్ర దేవత అయినట్లు శ్రీశైల మహాసంకల్పం కూడా ''... అర్థనారీశ్వరీ భ్రమరాపరమేశ్వరీ ముఖ్యదశ కోటి మహాశక్తి స్థానానాం...'' అనడంలో నిరూపిత మయింది.

" ఆయన్ని దర్శించుకుంటే జన్మాంతరం కైలాస లోకానికి వెళ్లినప్పుడు ఈ జీవి శ్రీశైలాన్ని దర్శించాడా లేదా అని ప్రశ్నవేస్తారట. అప్పుడు సాక్షిగణపతి మనకు సాక్షిగానిలబడి వచ్చాడని తెలుపుతాడట. అందువలన శ్రీశైలం వచ్చిన వారు "సాక్షిగణపతి" ని తప్పక దర్శించి గోత్రనామాలు తెలుపుకోవాలి.

కుమ్మరి కేశప్పకు అటిక(కుండ పెంకు)లో శివుడు బంగారు లింగరూపంలో ప్రత్యక్షమైన ప్రదేశం "హటకేశ్వరం". ఇక్కడ అగస్త్యుడు తపస్సుచేశాడని ప్రతీతి. ఆదేవాలయానికి ప్రదక్షిణలు చేస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని ప్రతీతి. ఆదిశంకరులు తపస్సు చేసిన ప్రదేశ "ఫాలధార-పంచధార" ఇక్కడే శంకరులు సౌందర్యలహరి, శివానందలహరి రచించారట. ఇచట శంకరులను చంపడానికి గజదొంగ ఒకడు ప్రయత్నించ బోతే నృసింహస్వామి సింహంగా వచ్చి అతనిని హతమార్చారు. "శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే" "శిఖరేశ్వరం" మీదున్న నంది మీద నువ్వులు పోసి నందిని తిప్పి నందికొమ్ములలో నుండి శ్రీశైల దేవాలయ శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు. శ్రీశైలం కొండలన్నిటిలోనూ ఈ శిఖరేశ్వరం అత్యంత ఎత్తైనది.
Read More

సుముహూర్తం...........................సుముహూర్తం...........................

సనాతన ధర్మ సంస్కారాల్లో 'వివాహం' అతి ప్రధానమైనది. సూర్య కిరణాలు తాకగానే పద్మం వికసించినట్లు, మానవజీవితంలో వివాహం తొలి వెలుగులను విరజిమ్ముతుంది ధర్మార్ధ కామ మోక్షములను సాధించే రాచబాటే మన వివాహ వ్యవస్థ. అందుకే విదేశీయులను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. ఇంక పెళ్ళి ప్రక్రియలు అనేకం. వాటిలో "శుభముహూర్తం " లేదా "సమీక్షణం" అతి ముఖ్యమైనది. వధూవరులిద్దరూ పెళ్ళి మంటపం మీద తూర్పు, పశ్చిమ ముఖాలుగా కూర్చుంటారు. వారి కుడి చేతికి జీలకర్ర, బెల్లం కలిపిన ముద్దలు ఇస్తారు. వారి వివాహానికి సరిగ్గా, నిర్ణయించిన సుముహూర్తం సమయంలో, వేద ఘోష, మంగళ వాయిద్యాలు మధ్య ఆ మిశ్రమాన్ని వధూవరులు ఒకరి తలపై మరొకరు ఉంచి, అణచి పట్టుకొని, శిరస్సులను తాకుతారు. ఒక ప్రక్క "గట్టి మేళం" మ్రోగుతూనే ఉంటుంది. అంతవరకు వారిద్దరి మధ్యా అడ్డుగా ఉన్న తెర/తెరశెల్లాను తొలగిస్తారు. అప్పటి వరకు వేచియున్న వధూవరులు ఒకరినొకరు పవిత్రంగా చూసుకొంటారు. దీనినే "సుమూహుర్తం" అంటారు. ఇదే సమయంలో వేదపండితులు ఋగ్వేదంలోని ఈ మంత్రాన్ని ఉచ్ఛరిస్తారు.


"ధృవంతే రాజావరుణో ధృవం దేవో బృహస్పతిః
ధృవంతే ఇంద్రశ్చాగంచ్ఛ రాష్ట్రం థార్యతాం ధృవం."

అంటే " ఓ రాజా! రాజైన వరుణుడు, దేవతలైన బృహస్పతి, ఇంద్రాగ్నులు నీ రాజ్యాన్ని స్థిరమొనర్చుగాక." అలాగే, ఈ గృహస్తు జీవితం నిలకడగా ఆనందంగా జీవించాలని, చివరిదాక ఇద్దరూ ఎడబాటు లేకుండా ఉండాలని, అన్యోన్యమైన దాంపత్యాన్ని కలిగిఉండాలనే ఆకాంక్షే దీని పరమార్ధం. వరుడి శ్రేయం కోరడమే ఇందులోని ముఖ్యాంశం.

ఇహ జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని వినియోగించడంలో కల ప్రయోజనం: జీలకర్ర వృద్ధ్యాప్యం రాకుండా దోహదపడుతుంది. అందువలన శుభకార్యాల్లో దీని వినియోగం మంగళప్రదం. అందుకే జీలకర్రని వంటలలో కూడా విరివిగా వాడతారు. బెల్లం భోగ్య పదార్ధం. ఇది మధురంగాను, తన మధురాన్ని ఇతర వస్తువుల్లోకి సంక్రమింప చేసేదిగాను, పవిత్రమయినదని, కృష్ణ యజుర్వేద సంహిత చెబుతోంది. ఈ రెంటిని కలిపి నూరినా, నమిలినా "ధనసంజ్ఞకమైన విద్యుత్తు"(POSSITIVE ELECTRONIC CHARGE) కలుగుతుందని పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువలనే ఈ మిశ్రమ సంయోగం వలన ఒక క్రొత్త శక్తి పుడుతుందనీ, దీనిని తలపై పెట్టినపుడు వధూవరుల శరీరాల్లో ఒక విశిష్ట ప్రేరణ కలిగి , పరస్పర జీవ శక్తుల ఆకర్షణకు సహాయపడుతుందని చెబుతారు. అందుకే ఈ మిశ్రమం పావనం, మంగళకరం అని మహర్షుల మాట. అలాగే మన వివాహ వ్యవస్థ లో మాంగల్య ధారణ, సప్తపది, తలంబ్రాలు మొదలయిన ప్రక్రియల్లో కూడా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్నది పెద్దల మాట.
Read More

ఖాట్మాండులోని పశుపతినాథ్ ఆలయంఖాట్మాండులోని పశుపతినాథ్ ఆలయం

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం.. భవద్భువ్యతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశాన మీడే..అని కొలుస్తారాయన భక్తులు. అసలే బోళా శంకరుడు ఆ పైన భక్తుల కోసమే వెలసిన మహాదేవుడు. అలాంటి శివదేవుడి ప్రపంచ ప్రఖ్యాత క్షేత్రాల్లో.. నేపాల్లోని పశుపతి నాథ్ ఆలయం అత్యంత ప్రముఖమైంది. ఇంతకీ ఈ నేపాల్ దేవుడి విశిష్టతలేమిటి? ఇక్కడీ శివుడెలా వెలిసాడు? శివుడంటే పిలిస్తే పలికే దైవం. శివుడంటే అభయంకరుడు. భక్తజన ప్రియంకరుడు. ఆపత్కాలంలో శంభోశంకర అని అర్చించిన వెంటనే ఆదుకునే అపర భక్తవ శంకరుడు. ఉండేది లింగాకారం. మహత్యం చూపడంలో అనంతాకారం. శివుడ్ని కొలిస్తే ఆపదలు మటుమాయం. శివుడి గురించి విన్నా.. కొలిచినా.. స్మరించుకున్నా పుణ్యమే. శివుడంటే మాటలకందని మహిమాన్విత దేవుడు. శివుడంటే కొలిచేకొద్దీ కొంగుబంగారమయ్యే శక్తి స్వరూపుడు. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఖాట్మండులోని పశుపతినాథ్ దేవాలయం. ఖాట్మండులోని పశుపతి నాథ్ దేవాలయం. ప్రపంచ ప్రఖ్యాత శైవక్షేత్రం.

ఇక్కడి శివుడు నేపాల్ జాతీయ దైవంగా కొలవబడుతున్నాడు. తూర్పు ఖాట్మండులోని భాగమతి నదీ తీరాన వెలిశాడు పశుపతి నాథుడు. యునెస్కో వారి వాల్డ్ హెరిటేజ్ సైట్స్ లో ఒకటైన ఈ దేవాలయానికి నిత్యం దేశ విదేశాలనుంచీ కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు. పశుపతిని దర్శించి జన్మధన్యమైందని భావిస్తుంటారు. సుప్రసిద్ధ 275 శైవక్షేత్రాల్లో పశుపతినాథ్ ఆలయం కూడా ఒకటి. ఈ దేవాలయంలోకి హిందువులకు మాత్రమే అనుమతి. ఇతర మతస్థులు పశుపతిని దర్శించాలంటే భాగమతి నదీ తీరం నుంచి చూసి తరించాల్సిందే. ప్రపంచంలో హైందవ దేశం ఏదైనా వుందంటే అది నేపాల్ అన్న పేరుంది. నేపాళీయులకు పశుపతి అంటే ఎంతో భక్తి. అనివార్యకారణాల వల్ల తమ దేవదేవుడికి ఎక్కడ నిత్య పూజలు తప్పుతాయో అని దక్షిణ భారతదేశపు పూజారులను నియమించారు.

పరమేశ్వర అంశతో భువిపై జన్మించిన ఆదిశంకరుడు ప్రారంభించిన సంప్రదాయం ప్రకారం.. పశుపతి పూజలు జరుగుతాయి. దక్షిణభారతదేశం నుంచి వచ్చిన పూజారులు ఈ ఆలయంలో నిత్య పూజలు చేస్తుంటారు. ఎందుకంటే నేపాల్ సంప్రదాయం ప్రకారం రాజు మరణించినప్పుడు ఇక్కడి ప్రజలకు శివ పూజలు చేసే అర్హత వుండదు. ఎందుకంటే రాజును తండ్రిగా భావించడం ఇక్కడి వారి ఆచారం. దాని ప్రకారం పశుపతి నిత్య పూజలకు ఆటంకం ఏర్పడుతుంది. తమకెంతటి కష్టం కలిగినా.. పరమేశ్వరుడి నిత్యకైంకర్యాలకు లోపం రానివ్వకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేసారు నేపాలీయులు. ఆదిశంకరుడు కొలిచిన పశుపతినాథ తత్త్వం.. అనన్య సామాన్యం. ఎందుకంటే మనిషిలోని పశుత్వాన్ని జయించి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడానికి.. దివ్యత్వపు వెలుగులు పొందడానికి అర్హత సాధించాలంటే పశుపతిని కొలవాలి. మోక్షానికి దగ్గరి దారి చూపడం పశుపతినాథుడికి మాత్రమే సాధ్యం. అందుకే దూరా భారం లెక్కించకుండా ఆయన దర్శనం కోరి వస్తుంటారు దేశ విదేశీ భక్తులు.

పశుపతినాథ్ ఆలయం ఇక్కడ ఎప్పుడు వెలిసిందో స్పష్టమైన కాలం తెలీదు. కానీ కొన్ని శాసనాల ప్రాకారం ఆలయనిర్మాణం గురించిన వివరాలు దొరుకుతాయి. గోపాల రాజ్ వంశవలి అనే చారత్రిక పత్రికను అనుసరించి చెబితే.. క్రీస్తు శకం 753వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. శుశూపదేవ మహారాజు అధ్వర్యంలో ఈ నిర్మాణం సాగినట్టు 11జయదేవ ఆలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. 1416వ సంవత్సరంలో.. రాజా జ్యోతిమల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని అంటారు. 1697వ సంవత్సరంలో రాజాభూపేంద్ర ఈ దేవాలయాన్ని పునర్నించాడని తెలుస్తోంది. ఖాట్మండులో పశుపతినాథుడు లింగాకారంలో దర్శనమివ్వడానికి కొన్ని ఇతిహాస కథనాలు ప్రచారంలో వున్నాయి. గో ఇతిహాసం ప్రకారం ఒకప్పుడు శివుడు జింక వేషం ధరించి భాగమతీ తీరాన విహరిస్తుండగా దేవతలు ఆ కొమ్ము పట్టుకున్నారు. అప్పుడా కొమ్ము విరిగింది. దాన్నిక్కడ పూడ్చి పెట్టారు. తర్వాతికాలంలో ఆ కొమ్ము లింగాకారంలోకి రూపాంతరం చెందింది. అక్కడి భూమిలోపలున్న లింగాన్ని గుర్తించి ఒక ఆవు తన పాలనక్కడ కురిపించింది. ఆ వింత చూసిన పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని తవ్వగా ఒక శివలింగం బయట పడిందట. అదే పశుపతినాథ లింగమని చెబుతారు.

గో ఇతిహాసంలాంటిదే మరో ఇతిహాసకథనం ప్రచారంలో వుంది. దీని ప్రకారం ఒక రోజు శివుడు కాశీ నుంచి భాగమతి నదీ తీరంలోని మ్రుగస్థలి అనే ప్రదేశంలో పార్వతీ సమేతంగా వచ్చి.. జింక అవతారంలో నిద్రిస్తాడు. ఆయన్ను తిరిగి కాశీ తరలించాలని భావిస్తారు దేవతలు. అలా శివుడు జింక రూపంలో నిద్రిస్తుండగా దేవతలు కొమ్ములు పట్టుకుని లాగుతారు. ఆ ఒత్తిడికి జింక కొమ్ము నాలుగు ముక్కలుగా విరిగి అక్కడి నేల మీద పడతాయి. ఆ నాలుగు కొమ్ములే చతుర్ముఖ లింగంగా ఏర్పడిందట. ఇది నేపాల మహత్యం హిమవత్ ఖండం ప్రకారం చెబుతున్న కథనం.

ఈ దేవాలయ నిర్మాణం ప్రత్యేక శైలిలో వుంటుంది. రెండు పై కప్పులు రాగి, బంగారాలతో తాపడం చేసి ఉంటాయి. నాలుగు ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేసి వుంటారు. పశ్చిమ ద్వారం దగ్గర.. పెద్ద నంది బంగారు కవచం తో వుంటుంది. ఈ నంది విగ్రహం ఎత్తు ఆరు అడుగులు. నేపాల్ ప్రజలు తాము చల్లగా ఉండటానికి పశుపతినాథుడే కారణమని భావిస్తుంటారు. ఇక్కడ ఆలయ అర్చకులు నేరుగా నేపాల్ రాజుకు జవాబుదారీగా వుంటారు. దీన్ని బట్టీ ఈ ఆలయం అంటే నేపాల్ కి ఎంత ప్రత్యేకమైందో తెలుస్తుంది. పశుపతినాథ్ ఆలయంలో పూజలు చేసే పూజారులను భట్ అని , ప్రధాన అర్చకుడిని మూల భట్ట లేదా రావల్ అని పిలుస్తారు.

ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీ. దీనిని బట్టి ఈ ఆలయ ప్రాముఖ్యత, ప్రధాన అర్చకుల అధికారాలు తెలుస్తాయి. ప్రధాన అర్చకులు అప్పుడప్పుడు ఆలయ విశేషాలను నేపాల్ రాజుకి తెలియజేస్తుంటారు. ఇక్కడ పని చేసిన రావెల్ పద్మనాభ శాస్త్రి అడిగ.. ఎంతో ప్రఖ్యాతి చెందిన ప్రధాన అర్చకులు. 1955 సంవత్సరంలో అర్చకత్వం ప్రారంభించి 1967 సంవత్సరంలో ప్రధాన అర్చక హోదాకి పదోన్నతి పొందారీయన.1993 సంవత్సరంలో అర్చకత్వం నుండి విరామం తీసుకొని తన స్వగ్రామం ఉడిపి వెళ్ళి పోయారు. పశుపతినాథుడు సర్వశక్తిమంతుడు. ఆయన ముందు ఎవరైనా సరే నిజం చెప్పి తీరాలి. అబద్ధం చెప్పడానికి వీలు లేదు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆలయంలోని ధర్మశాల ముందు ప్రమాణం చేయించడం ఒక ఆచారం.

అలాగే పశుపతినాథ్ ఆలయంలో ఇంకా ఎన్నో దర్శనీయ స్థలాలున్నాయి. బంగారు తాపడం చేసిన దేవతామూర్తులు, చతుర్ముఖ విగ్రహం, ఏడవ శతాబ్ధికి చెందిన చండకేశ్వరుడు, బ్రహ్మదేవాలయం, ఆర్యఘాట్. గౌరీ ఘాట్ లు ఎంతో ప్రముఖమైనవి. శివుడు స్మశాన సంచారి. ఆర్యఘాట్ లో స్మశానం కూడా వుంది.
కొన్ని ప్రత్యేక దినాల్లో పశుపతినాథ్ దేవాలయాన్ని వేలాది భక్తులు దర్శిస్తారు. సంక్రాంతి, మహాశివరాత్రి, రాఖీ పౌర్ణమి రోజుల్లో పశుపతినాథుని దర్శనం కోసం.. భక్తులు అపరమిత సంఖ్యలో వస్తారు. ముఖ్యంగా గ్రహణం రోజున ఇక్కడి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున పశుపతినాథ్ ఆలయం నేతిదీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తుంది. మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఇక్కడి భాగమతిలో స్నానం చేసి పశుపతినాథుడ్ని దర్శించుకుంటే పుణ్యమని భావిస్తారుRead More

పూజ-పరమార్థాలుపూజ-పరమార్థాలు

పూజ --> పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణఫలాన్నిచ్చేది.

అర్చన--> అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.


జపం--> అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం.

స్తోత్రం--> నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.

ధ్యానం--> ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది, ఇష్టదేవతను చింతింపచేసేది ధ్యానం.

దీక్ష--> దివ్యభావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.

అభిషేక:--> అహంభావాన్ని పోగొట్టేది, భయాన్ని మథించేది, పవిత్రోదకాన్నిచల్లేది, ఆనందాదులను కల్గించేది.

మంత్రం--> తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం.

ఆసనం--> ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది ఆసనం.

తర్పణం--> పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.

గంధం--> అంతంలేని దౌర్భాగ్యాన్ని, క్లేశాన్ని నశింపుచేసేది ధర్మఙ్ఞానాలనిచ్చేది.

అక్షతలు--> కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి.

పుష్పం--> పుణ్యాన్నివృద్ధిచేసేది, పాపాన్ని పోగొట్టేది, పుష్కలార్ధాన్ని ఇచ్చేది.

ధూపం--> చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది, పరమానందాన్ని ప్రసాదించేది.

దీపం--> సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది, అహంకారం లేకుండా చేసేది, పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది.

నైవేద్యం--> ఆరు రుచులతో నున్న నాల్గు విధాల పదార్ధాలను,దేవతకు తృప్తినిచ్చేదానిని నివేదన చేయుటయే.

ప్రసాదం--> ప్రకాశానందాల నిచ్చేది, సామరస్యాన్ని కల్గించేది, పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం.

ఆచమనీయం--> లవంగ, జాజి, తక్కోలములతోకూడిన ద్రవ్యం ఆచమనీయం .

ఆవాహనం--> పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవాహనం.

స్వాగతం--> దేవతను కుశలప్రశ్నవేయుట.

పాద్యం--> చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.

మధుపర్కం--> తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది.

స్నానం--> గంధం, కస్తూరి, అగరు మొవాటితో స్నానం.

వందనం--> అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం ఉరస్స(వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం సాష్టాంగం).

ఉద్వాసన--> దేవతను, ఆవరణ దేవతలను పదహారు ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసనమని అంటారు.
Read More

ఏ శివ లింగాలకు పూజ చేస్తే ఎలాంటి ఫలితం వుంటుంది?ఏ శివ లింగాలకు పూజ చేస్తే ఎలాంటి ఫలితం వుంటుంది?

జ్యోతిర్లింగాలకు పూజ చేస్తే విశేష ఫలితం వుంటుంది. అలాగే సిధ్ధులు, పురాణ పురుషులు, మహిమాన్వితులు ప్రతిష్టచేసిన లింగాలను పూజించినా మంచి ఫలితం వుంటుంది. స్వయంభూ లింగార్చన కూడా.

లింగాలలో అనేక రకాలు వున్నాయి. వాటిని పూజిస్తే వివిధ రకాల కామ్యాలు సిధ్ధిస్తాయంటారు. అవేమిటో తెలుసుకుందామా?


వజ్ర లింగాన్ని పూజిస్తే ఆయుః వృధ్ధి, ముత్యం లింగాన్ని సేవించటం రోగ నాశకరం, పద్మరాగ లింగం లక్ష్మీ ప్రాప్తినిస్తుంది, పుష్యరాగం లింగాన్ని పూజిస్తే యశస్సు, నీలం లింగం ఆయుః వృధ్ధి, మరకత లింగం పూజ సుఖ ప్రాప్తి, స్ఫటిక లింగార్చన సర్వకామనలనూ సిధ్ధింపచేస్తుంది. లోహ లింగ పూజ శతృనాశనాన్ని చేస్తుంది, ఇత్తడి లింగార్చన తేజస్సునిస్తుంది. గంధం లింగార్చన స్త్రీలకు సౌభాగ్యాన్నిస్తుంది, వెన్న లింగం మోక్షాన్ని ప్రసాదిస్తుంది, ధాన్యపు పిండితో చేసిన లింగార్చనవల్ల ఆరోగ్యం బాగుపడుతుంది.

ఇలా రక రకాల లింగార్చనలవల్ల రకరకాల ఫలితాలున్నాయి. రసలింగం, అంటే పాదరసం వున్న లింగానికి అభిషేకం చేసి ఆ తీర్ధం సేవిస్తే సర్వవ్యాధులు నాశనమవుతాయని ప్రసిధ్ధి. ఇది పరిశోధనల ద్వారా కూడా నిర్ధారింపబడినది. ఈ తీర్ధాన్ని సేవించటంవల్ల కేన్సర్ వగైరా పెద్ద వ్యాధులు పోవటమే కాకుండా మానసిక చింతలు దూరమయి మనశ్శాంతి కలుగుతుంది.

ఈ పాదరస శివ లింగం గురిచి నేను సేకరించిన మరికొన్ని విశేషాలు చదవండి

పాదరస శివ లింగాన్ని పూజించిన వారికి నెరవేరని కోరికలు వుండవు అని బ్రహ్మ పురాణంలో చెప్పబడింది. ఈ లింగం చిన్నగా వున్నా చాలా బరువుగా వుంటుంది. దీన్ని ఇంట్లో వుంచి కూడా నిత్యం పూజ చేసుకోవచ్చు.

మన దేశంలో పాదరస శివలింగం వున్న ఒకే ఒక దేవాలయం ఉజ్జయినిలో సిధ్ధాశ్రమం. ఇక్కడి శివ లింగం బరువు సుమారి 1500 కిలో గ్రాములు. ఫ్రపంచంలో ఎక్కడా ఇటువంటి శివలింగం లేదంటారు. భక్తులు ఈ లింగాన్ని తాకి దర్శనం చేసుకోవచ్చు. మనిషిలోని నెగటివ్ ఎనర్జీ తగ్గించే శక్తి ఈ లింగానికి వుంది. ఈ శివ లింగానికి కొంతసేపు తల ఆన్చితే తలలో నరాలకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయని అక్కడివారి నమ్మకం
Read More

మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి

మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం శక్తి, అది విజ్ఞానానికి, తెలివికీ ప్రతీక. పదునైన ఈటెను ఆయుధంగా ధరించి, సాధకులు తాము సాన చేసేందుకు ఉపకరించే మనస్సును, ఏకాగ్రతలో నడుపవలెననిన, కుశాగ్రబుద్ధితో చరించవలెనన్న భావాన్ని కలిగించే జ్ఞాన వైశిష్ట్యం కలవాడు. పాము కాల స్వరూపం కనుక జ్ఞాన స్వరూపుడైన స్వామి కాలాతీతుడు. ఆయన సన్నిధిలో ద్వేషాలు, దోషాలు కలిగేందుకు వీలులేదని సత్యవాహనంలోని అంతరార్థం.

శివుడు ధ్యాననిమగ్నుడై ఉన్న సమయంలో తపస్సును భగ్నం చేయడానికి మన్మథుడు కామ శరములు ప్రయోగించగా ఆగ్రహించిన శివుడు తన జ్ఞాన నేత్రం తెరవగనే మన్మథుడు భస్మమైయినాడు. శివుని జ్ఞాన నేత్రంనుండి కదలిన జ్ఞానాగ్ని మన్మథుని మసి చేసి ఆకాశ మార్గాన పయనిస్తుండగా, వాయువు సంగ్రహించి, మోయలేక అగ్నిదేవునికి ఇవ్వగా, అగ్నిదేవుడు ఆ దివ్య తేజస్సును గంగాజలమందు వదిలివేయగా, ఆ తేజస్సును భరించలేని గంగా, రెల్లుగడ్డి పొదనందు పడవేయగా ‘కుమారస్వామి’ ఆవిర్భవించాడు.

శ్రీ సుబ్రహ్మణుని రెల్లు గడ్డినందు జన్మించిన పిదప ఆరుగురు కృత్తికలు పెంచారని అందుకే ఆయనకు షట్ ముఖులు వచ్చి ‘షణ్ముఖుడు’ అనే పేరువచ్చింది. కృత్రికలచే పెరిగినవాడుకనుక ‘కార్తికేయుడు’ అయ్యాడు. ‘‘కృత్తికానామ్ అపత్యం పుమాన్ కార్తికేయం’. కృత్తికా నక్షత్రానికి సంబంధించిన సంతాన పుత్రుడెవరో ఆయనే కార్తికేయుడు. కృత్తిక అంటే కత్తెర అని అర్థం. ఈ శరీరాన్ని ఆ కృత్తిక కృత్రికా నక్షత్రానికి తగినట్లు ఆరు చోట్ల కత్తిరించబడిన వస్తువు ఏడు ముక్కలయింది. ఆ ఏడు ముక్కలే శరీరంలో కనిపించే సప్త చక్రాలు. మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరన, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారాలు.

శ్రీ మహావిష్ణువు లేక శివుడు పరమ పురుషుడు, మహాలక్ష్మీ లేక ఉమాదేవి అవ్యక్తశక్తి. వీరిరువురి సమైక్య, సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కంద పురాణం తెల్పుతోంది. కుమారస్వామిని ఆరాధిస్తే శివశక్తులను, లక్ష్మీనారాయణులను కలిసి ఆరాధించినట్లే. ప్రకృతి పురుషుల ఏకత్వం స్వామితత్వం. షట్కోణ యంత్రం షణ్ముఖ తత్వానికి ప్రతీక. ద్వికోణాల సంగమం ఊర్థ్వంగా సాగే త్రికోణం శివతత్వం, అధోముఖంగా సాగే త్రికోణం శక్తితత్వం. ఈ శివశక్తుల సంకేతమైన త్రికోణాల సంగమం షట్కోణం. ఈ రెండు త్రికోణాల వల్ల ఏర్పడ్డ షట్కోణాలు షణ్ముఖాలకు ప్రతీకలు.

మార్గశీర్ష మాసంలో శుద్ధ షష్ఠి, అమావాస్య వెళ్లిన ఆరవ రోజును సుబ్రహ్మణ్యషష్ఠి అని, ‘సుబ్బరాయ్ షష్ఠిగా, స్కంద షష్ఠిగా జరుపుకుంటారు. శ్రీ సుబ్రహ్మణ్యుడంటే ‘సు’ అంటే మంచి, ‘బ్రహ్మణ్యుడు’ అంటే వికాసము, తేజస్సు కలవాడని అర్థం.

సర్ప, రాహు, కేతు దోషాలున్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడంవల్ల సత్ఫలితాలు పొందుతారని సంతాన భాగ్యానికి నోచుకోని స్ర్తి, పురుషులు ఈ రోజున సర్పపూజలు చేసి, వెండి పడగలను పుట్టలో వేసినట్లైతే సత్‌సంతాన యోగ భాగ్యం కల్గుతుందనే విశ్వాసం. మంత్రగాళ్ళు ఈ రోజున స్కందుని ఆరాధించి మంత్రాన్ని వశ్యం చేసుకునే శక్తిని పొందుతారు. బ్రహ్మచారియైన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం.

ఈ స్వామి అర్చనవల్ల కుటుంబంలో శాంతి, సౌఖ్యాలు, ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయి.
Read More

పరమ పవిత్రం రావి

Read More

రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొరికింది.

రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొరికింది. ఆంజనేయుడు సంజీవినీ
పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి కాపాడిన లంక దొరికింది.. రామ రావణ
యుద్ధం భీకరంగా జరిగిన లంక దొరికింది. ఇవి ఒట్టి మాటలు కావు.. పుక్కిటి
పురాణం అంతకంటే కాదు.. లక్షల సంవత్సరాల నాటి యథార్థ గాథ.. ఒక మహా
అసురుని ఉనికిని ఇవాళ్టికీ చాటి చెప్తున్న కథ.. ఇంతకాలం మిథ్యగా
భావిస్తున్న చరిత్ర. రావణ రహస్య మిది..
ఇదేదో సోది రామాయణ కథ కాదు.. రావణ లంక.. ఇది ఒక నిజం.. నిప్పులాంటి
నిజం... వైజ్ఞానికులకు కొత్త సవాలును విసురుతున్న నిజం.. భారత దేశ
చరిత్రను గొప్ప మలుపును తిప్పనున్న నిజం... ఒక నాడు రావణుని
రాజరికం అప్రతిహతంగా సాగిన రాజ్యం... సాక్ష్యాలతో సహా లభించింది. రామ
రావణ యుద్ధంలో ఆనాడు రావణుడు చనిపోయి ఉండవచ్చు. కానీ, శ్రీలంకలో
కనిపిస్తున్న సాక్ష్యాలలో రావణుడు ఇంకా జీవించే ఉన్నాడు.. ఇది నిప్పులాంటి
నిజం..
లంక మిథ్య కాదు.. లంకేశ్వరుడు రాజ్యమేలిన లంక.. ప్రపంచాన్నంతా జయించి
తెచ్చిన బంగారంతో నిర్మించిన మహానగరం లంక.. సముద్రం మధ్యలో
అందమైన దీవిలో, అపురూపంగా రావణుడు నిర్మించుకున్న నగరం లంక
ఇదే..మీరు రాముణ్ణి నమ్మకపోవచ్చు.. రాముడు ఉన్నాడా.. లేడా అని
హేతువాదులతో వాదాలకూ దిగవచ్చు. కానీ, రావణుడి ఉనికిని మాత్రం ఇవాళ
ఎవరూ కాదనలేరు.. రావణుడు ఉన్నాడన్నది వాస్తవం. సాక్షాత్తూ శ్రీలంక సర్కారే
రావణుడి ఆనవాళ్లను అధికారికంగా గుర్తించింది. రాజముద్ర వేసింది.
రావణుడి ఆనవాళ్ళు శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. అశోకవనంతో ఈ
గుర్తులు మొదలవుతాయి. అశోక వాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని
ఆనాడు రావణుడు బంధించి ఉంచాడు.. ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియని
వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఈ
ఆలయం పక్కనే సీతాజల పారుతుంది. సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటి
కుండమని ఇక్కడి ప్రజల విశ్వాసం..ఈ నీటి కుండాన్ని ఆనుకుని హనుమంతుని
అడుగులూ మనకు కనిపిస్తాయి. అశోక వాటిక సమీపంలోమొక్కల్లో నల్లని
మట్టి ఉంది.. ఇది మామూలు నల్లరేగడి మట్టో, లేక మరో రకమైన
మట్టో కాదు.. బాగా కాలిపోయి ఉన్నట్లు కనిపించే మట్టి ఇది.. ఈ మట్టి
ఇలా ఎందుకు ఉందో ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్తలకూ అంతుపట్టలేదు.. అశోక
వాటిక చుట్టూ లెక్కలేనన్ని కోతులు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో
ఇక్కడ మాత్రమే కోతులు కనిపిస్తాయి.
సీతా జలకు దగ్గరలోనే మరో చిన్న ఏరు పారుతుంటుంది.. అది
నిత్యం రావణుడు స్నానం చేసే ఏరు.. ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుని
అర్చించేవాడు రావణుడు...
2
ప్రతి చారిత్రక ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాలను చూపించి స్థల
పురాణాలు చెప్పటం సహజమే.. లంకలో కనిపిస్తున్న ఆనవాళ్ళు కూడా ఇలాంటివే
అనుకుంటే పొరపాటే.. ఇవాళ్టి శ్రీలంకలో ఆనాటి తేజోమయ రావణ లంక
స్మృతులు చాలా చాలా ఉన్నాయి.. త్రేతాయుగాన్ని
మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
రావణ లంక సామాన్యమైంది కాదు.. రామాయణం ఉనికిని చాటిచెప్తున్న లంక..
రావణ స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఓ పెద్ద పర్వతం కనిపిస్తుంది. ఆ
పర్వతాన్ని జాగ్రత్తగా పరికిస్తే అతి పెద్ద హనుమాన్ ఆకృతి
నిద్రిస్తున్నట్లుగా గోచరిస్తుంది.
ఈ పర్వతాన్ని రాము సోలా అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు.. ఈ పర్వతం ఒక
విచిత్రమైన పర్వతం.. రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో
లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని
మొక్కను తీసుకువచ్చిన పర్వతం ముక్క ఇది..
ఇది సంజీవని తీసుకువచ్చిన పర్వతమేననటానికి రుజువేమిటి? ఏదో
టూరిజం డెవలప్ చేసుకోవటానికి లంక సర్కారు ఏదో ఒక కొండను చూపించి ఇదే
సంజీవని అంటే నమ్మేదెలా?
శ్రీలంక సర్కారు ఏమైనా చెప్పవచ్చు. కానీ, ఇది ఆంజనేయుడు సంజీవని
తీసుకువచ్చిన సుమేరు పర్వతమనటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి
పర్వత భాగం శ్రీలంకలో మరెక్కడా కనిపించదు.. మనకు ఇది మామూలు కొండ..
కానీ, శ్రీలంక ప్రజలకు ఇది హాస్పిటల్... ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ
ఔషధ మొక్కలే కావటం ఇది సుమేరువే అనటానికి బలమైన సాక్ష్యం.
దీనికి దగ్గరలో ఉన్న ప్రజలు ఏ జబ్బు వచ్చినా డాక్టర్ల
దగ్గరకు వెళ్లరు.. ఈ పర్వతం దగ్గరకు వచ్చి ఇక్కడి మొక్కలతోనే
వైద్యం చేయించుకుంటారు..నికోల్ పారమల్ ఫార్మాస్యూటికల్‌‌స.. ఇతర
దేశీయ, అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చి
ఔషధ మొక్కలను పరిశోధించాయి.
విచిత్రమేమంటే ఈ ఔషధ మొక్కలు పెరగాలంటే ప్రత్యేకమైన మట్టి
కావలసి ఉంటుంది.. ఈ కొండపై మనకు కనిపించే మట్టి హిమాలయాల్లో
మాత్రమే కామన్గా కనిపిస్తుంది...
3
రావణుడు దశకంఠుడు.. అంటే పది తలలు ఉన్నవాడు.. అంటే శారీరకంగా కాదు..
అతనిలో పది రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయని అర్థం. అతని మేధస్సు పది
రకాలుగా, అనేక రంగాల్లో విస్తరించిందని అర్థం. ఇందుకు సాక్ష్యం మనకు లంకలో
స్పష్టంగా కనిపిస్తుంది. అతను పండితుడో, సీతను అపహరించుకు వచ్చిన
రాక్షసుడు మాత్రమే కాదు.. రావణుడు గొప్ప శాస్త్రవేత్త కూడా..
మీకు పుష్పక విమానం గుర్తుందా? అందులోనే సీతాదేవిని
రావణుడు అపహరించుకు వెళ్లాడు... రావణ సంహారం తరువాత రాముడు అందులోనే
అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆ కాలంలో విమానాలు ఉన్నాయా? అంటే
ఉన్నాయని లంక చెప్తోంది.. చూపిస్తోంది.. రావణుడు తన లంకాపట్టణంలో
నిర్మించిన అయిదు విమానాశ్రయాలను శ్రీలంక సర్కారు గుర్తించింది.. అంతే
కాదు.. ఒక విమానాల మరమ్మతు కేంద్రాన్ని కూడా గుర్తించింది.. వీటన్నింటినీ
హనుమంతుడు లంకాదహన సమయంలో కాల్చివేశాడు..
శ్రీలంక పరిశోధనల్లో గరుడ పక్షి ఆకారంలోని ఓ బొమ్మ దొరకింది. ఈ
ఆకారాన్ని జాగ్రత్తగా పరిశోధించారు... గరుడపక్షి ఆకృతిలో ఉన్న ఈ బొమ్మ
మామూలు విగ్రహం కాదు.. దీనికి ఉన్న రెక్కలు సాధారణ గరుడ పక్షికి ఉండే
స్థాయి కంటే కొద్దిగా ఎత్తులో ఉన్నాయి. దీనిపై
ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.. వాస్తవానికి ఇది ఓ లోహ యంత్రం.
వేల ఏళ్ల నాటిది.. ఆనాడు ఇది ఎలా ఎగిరిందీ అన్నదానిపై లంక ప్రభుత్వం ఇంకా
పరిశోధిస్తూనే ఉంది..
ఇక విమానాశ్రయం దగ్గరకు వస్తే.. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి
దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రయాణం చేస్తే ఓ పెద్ద పర్వత
ప్రాంతం వస్తుంది. ఇక్కడ దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున
సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఉంది.. అంత ఎత్తున
ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండటం, ఈ మైదానానికి నాలుగు వైపులా
కొండలు ఉండటం విశేషం. ఈ మైదానం మానవ నిర్మితమైనదేనని స్పష్టంగా
కనిపిస్తోంది. దీన్నే రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించాడని శ్రీలంక
పరిశోధన బృందం నిర్ధారించింది.
మరో విశేషమేమంటే ఈ మైదానం అంతటా కాలిపోయిన గుర్తులు ఉన్నాయి.
ఇక్కడి మట్టి కాలి నల్లగా మాడిపోయింది.. ఇక్కడి రాళు్ల కాలి
కనిపిస్తున్నాయి. ఎనిమిది వేల అడుగుల ఎత్తులో తక్కువ వాతావరణం ఉన్న
ఈ ప్రాంతంలో ఇంకా వేడి వాతావరణం ఉండటం విశేషం..
లంకాదహనం చేసినప్పుడు హనుమంతుడు ముందుగా రావణుడి రవాణా వ్యవస్థను,
సాంకేతిక వ్యవస్థలనే దహనం చేశాడు.. అందుకు సాక్ష్యం ఈ విమానాశ్రయం.
4
రావణుడికి సంబంధించిన వివరాలు ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో, ఆ తరువాత
తులసీదాస్ రామచరిత మానస్లో మనకు ముఖ్యంగా కనిపిస్తాయి.. లంకలో
అడుగడుగునా రామాయణ కాలం నాటి గుర్తులు లభిస్తున్నాయి..
తులసీదాస్ రాసిన రామచరితమానస్ ఒరిజినల్ ప్రతి ఒకటి చిత్రకూటంలో
భద్రంగా ఉంది. అయితే ఆయన స్వయంగా రాసిన వాటిలో ఒకే ఒక
అధ్యాయం ప్రపంచానికి మిగిలి ఉంది. చేత్తో తయారు చేసిన కాగితంపై రాసిన
ఈ రామాయణంలో మిగిలి ఉన్న అధ్యాయం 117 పేజీల్లో ఉంది. ఒక్కో
పేజీకి 7లైన్లు రాసి ఉంది.
కెలీనియా.. రావణుడి తమ్ముడు విభీషణుడి రాజభవనం ఉన్న ప్రాంతం..
ప్రస్తుతం బౌద్ధ ధర్మాన్ని పాటిస్తున్న శ్రీలంకలో కెలీనియా చాలా
ముఖ్యమైన ప్రదేశం. బుద్ధ భగవానుడు ఈ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర
చెప్తోంది. ప్రపంచంలోని బౌద్ధులు శ్రీలంకకు వస్తే కెలీనియా చూడకుండా వెళ్లరు..
ఆ పక్కనే విభీషణుడి భవనాన్నీ సందర్శిస్తారు.. ఇంతెందుకు లంక సార్లమెంటులో
విభీషణుడి ఫోటో కనిపిస్తుంది...
ఆ తరువాత నరోలియా.. ఇక్కడే అశోక్ వాటిక ఉంది. దీనికి సమీపంలోనే సీతాదేవి
అగ్ని ప్రవేశం చేసింది. అయితే ఇక్కడ విచిత్రం ఉంది. ఇక్కడ అటవీ ప్రాంతంలో
కొన్ని చిత్రమైన గోళీలు దొరుకుతాయి. ఈ గోళీలను సీతా గోళీలంటారు.. ఇవి
అలోపతి మాత్రల్లాంటివి.. ఈ గోళీలను దొరకడమే భాగ్యంగా
ప్రజలు భావిస్తారు. వీటిని తలకు రాసుకోవటం, కడుపుకు రాసుకోవటం, వాటిని పొడిని
చేసి కొద్దిగా తీసుకోవటం వంటివి చేస్తారు.. ఈ గోళీలను శ్రీలంక
ప్రభుత్వం జపాన్కు పంపించి పరీక్ష చేయించింది. ఇందులో వైద్య
లక్షణాలు ఉన్నట్లు దాదాపు పదివేల సంవత్సరాలకు పూర్వ కాలం నాటివేనని
నిర్ధారణ అయింది. రావణుడికి సంబంధించి ఇప్పటి వరకు లభించిన ఆధారాలన్నీ
ఒక ఎత్తైతే , అసుర రాజు అస్తిత్వానికి సంబంధించిన అత్యంత కీలక
సాక్ష్యం మరొకటి ఉంది. అది రావణ గుహ. లంకలో రామరావణ
యుద్ధం భీకరంగా జరిగింది. రామబాణంతో రావణుడిని శ్రీరామ
చంద్రుడు హతమార్చాడు.. రావణుడు మరణించిన తరువాత ఏం జరిగింది? వాల్మీకి
రామాయణంలో కానీ, రామ చరితమానస్లో కానీ, రావణుడు చనిపోయిన తరువాత
ఏం జరిగిందో ప్రస్తావన లేదు.. రావణుడి అంత్యక్రియలు జరిగాయో లేదో
తెలియదు.. కానీ, ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప
రహస్యం వెలుగులోకి వచ్చింది. అదే రావణ గుహ..
శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలోఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది..
ఈ గుహలోకి ప్రవేశించటం చాలా కష్టమైన పని.. దాదాపు ఇరవై ఏళ్ల
క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్లాడు.. ఈ
గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది.. ఈ పేటికలో ఒక శవం ఉందని, దాన్ని
చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్లు అతను చెప్పాడు.. అది రావణుడి
భౌతిక శరీరమని చెప్తున్నారు.. ఈ శవపేటిక దాదాపు పదిహేడు అడుగుల పొడవు,
నాలుగు అడుగుల వెడల్పుతో ఉంది. ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన
లేపనాలు రాసి ఉన్నాయి.
రావణుడు చనిపోయిన తరువాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి
ప్రజలు తీసుకెళ్లి ఈ శవపేటికలో భద్రపరిచారట. శ్రీలంక ప్రభుత్వం ఒక
ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ
శవపేటికను తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నించిన ప్రతిసారీ
ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఒకసారి చిరుతపులులు, మరోసారి పెద్ద
పాములు అడ్డం వచ్చాయి. హెలికాప్టర్లో వెళ్లేందుకు ప్రయత్నించినప్ప
ుడు సరిగ్గా గుహ దగ్గరకు వచ్చేసరికి వాతావరణం హఠాత్తుగా మారిపోయి
తప్పనిసరిగా వెనక్కి మళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గుహలో అతని
అనుచరులు కాపలా ఉన్నారని, లక్ష్మణుడి మాదిరిగా సంజీవని తో తమ
రాజు పునర్జీవుతుడవుతాడని నమ్ముతున్నారు .. రావణుడి ఉనికికి సంబంధించిన
చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది. ఈ పేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే
చరిత్రలో అనేక కొత్త కోణాలు వెలికి వస్తాయి.
చూద్దాం ఏం జరుగుతుందో ............................. కాలమే సమాధానం
రావణుడు.. రామాయణం... భారతీయ సంస్కృతి, నాగరికతలతో గాఢంగా పెనవేసుకుని
పోయిన అంశాలు.. శ్రీలంకలో రావణుడి ఆనవాళ్లు అనేకం మనకు కనిపిస్తాయి.
అడుగడుగునా కనిపించే అక్కడి నిర్మాణాలు, కట్టడాల శిథిలాల్లో ఏడువేల
సంవత్సరాల క్రితమే అత్యంత వైభవంగా భారత ఉపఖండంలో విలసిల్లిన
నాగరికత స్పష్టంగా కనిపిస్తుంది.. అంతే కాదు.. రామాయణం గురించి
మనకు అందుబాటుకు ఇంతకాలం రాని అనేక అంశాలు మనకు లంకలో కొత్తగా
కనిపిస్తాయి... లంకలో రావణ రహస్యం గురించి మరి కొన్ని
అంశాలను మనం తెలుసుకుందాం..
మనలో ప్రత్యేకించి ఈ తరంలో వాల్మీకి స్వయంగా రాసిన అసలైన
రామాయణాన్ని చదివిన వాళ్లు వేళ్లపైన లెక్కించదగిన వాళ్లే ఉంటారు.. ఈ
తరానికి తెలిసిందల్లా, ఎక్కువగా సినిమాల్లో చూసిన రామాయణ కథే...ఈ
దేశంలో ఎన్ని రామాయణాలు వెలుగులోకి వచ్చాయో చెప్పలేం.. వాల్మీకి రాసింది ఒక
రామాయణం.. వేర్వేరు భాషల్లో వేర్వేరు సమయాల్లో వచ్చిన రామాయణాల్లో
కొత్త కొత్త ఉపకథలు పుట్టుకొచ్చాయి.. ఇప్పుడు లంకలో మనకు చూపిస్తున్న
ఆనవాళ్లలో మరో సరికొత్త రామాయణం ఆవిష్కారం అవుతోంది..
రావణుడు సీతాదేవిని పంచవటి నుంచి అపహరించుకుని వెళ్లి ఎక్కడ దాచాడు? అని
అడిగితే టక్కున వచ్చే జవాబు అశోక వనం.. కానీ లంక అదే శ్రీలంకలో సీన్
వేరేలా ఉంది.. సీతాదేవిని పరిస్థితులను బట్టి, ముందు జాగ్రత్త చర్యగా
వేర్వేరు ప్రదేశాలకు రావణుడు తరలించాడట..పంచవటిలో, పర్ణశాలలో ఉన్న
సీతాదేవిని తన పుష్పకంలో లంకకు తీసుకువచ్చిన రావణుడు వెరగన్ తోటలోని తన
ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాడు.. పక్కనే ఉన్న తన భార్య
మండోదరి దేవి భవనానికి సీతమ్మను తీసుకువెళ్లాడు.
లంకాపురంలో అతిగొప్ప ప్యాలెస్ మండోదరికి ఉండేదిట..చుట్టూ జలపాతాలు.. పూల
తోటలు. అక్కడ సీత ఉన్నది కొన్ని రోజులే. ఆ తరువాత
అశోకవాటికకు తరలించాడు.. మండోదరి భవనానికి చాలా దూరంలో అశోక వాటిక ఉంది.
అక్కడికి విమానంలోనే సీతను రావణుడు తీసుకువెళ్లాడు.. ఆకాశమార్గంలో
లంకానగర సౌందర్యాన్ని అద్భుతంగా ఏరియల్ వ్యూ ద్వారా సీతాదేవికి
వర్ణిస్తూ చూపించాడట రావణుడు..
అశోక వాటికకు సమీపంలోనే సీతా పకన్ అనే చిన్న ప్రాంతం ఉంది..
చుట్టూ కమ్ముకుని ఉన్న దట్టమైన అడవి.. నిటారుగా నిలుచుని వున్న
వృక్షాల మధ్య ౨౦౦ గజాల మేరకు ఉన్న చిన్న స్థలం.. అంత అడవిలో
ఇక్కడ చిన్న మొక్క కూడా మొలవదు.. గతంలో ఇక్కడ నీళ్లు ఉండేవట..
సీతాదేవి లంకనుంచి అయోధ్యకు వెళ్లిన తరువాత ఇది పూర్తిగా డ్రెユ
అయిపోయింది.. అప్పటి నుంచి ఇలాగే ఉంది..
.. ఇస్త్రిపుర . అంటే ఏరియా ఆఫ్ వుమెన్ అని అర్థం.
హనుమంతుడు లంకకు వచ్చి చేయాల్సిన బీభత్సం అంతా చేసేశాక, ముందు జాగ్రత్త
చర్యగా రావణుడు సీతాదేవిని అశోకవాటిక నుంచి ఇస్త్రిపురకు తరలించాడట.
ఇక్కడి నుంచి కూడా రావణ గోడా అనే ప్రాంతానికి సీతను షిప్ట్
చేసినట్లు చెప్తారు.. అది ఇస్త్రిపురకు మరోవైపున ఉంది...
ఈ ప్రాంతాన్ని దిశృంపోలా అంటారు ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి ఆలయం ఉంది.. దీంతో
పాటే అతి ముఖ్యమైన ప్రాంతం ఇది.. రావణ సంహారం తరువాత సీతాదేవి అగ్ని
ప్రవేశం చేసిన ప్రదేశం ఇదే... ఇక్కడ బౌద్ధ మతాచార్యులు ఓ స్తూపాన్ని
కూడా నిర్మించారు..
2
లంకలో సీతాదేవికి సంబంధించిన చాలా ఆనవాళ్లను మనం చూడవచ్చు. అదే
సమయంలో రామాయణంలో రావణుడి సంబంధించినంత వరకు మిగతా
కేరెక్టర్లు కొన్ని ఉన్నాయి..వాళ్లకు సంబంధించిన స్మృతులు కూడా ఇప్పటికీ
మనకు లంకలో కనిపిస్తాయి...
లంకలోని కెలీనియాలో రావణ సోదరుడు విభీషణుడికి
పట్టాభిషేకం జరిగినట్లు గతంలోనే చెప్పుకున్నాం...ఇక్కడ విభీషణుడికి ఓ
ఆలయం కూడా ఉంది.. లంక పార్లమెంటులో కూడా విభీషణుడి
చిత్రపటం మనకు కనిపిస్తుంది..అంతే తప్ప అంత గొప్ప నాగరికతను ప్రపంచానికి
అందించిన రావణుడికి మాత్రం ఎక్కడా ఆలయం లేదు..
రావణుడి కొడుకు ఇంద్రజిత్.. ఇతను కూడా శివుడికి మహా భక్తుడు..
ఈతడు శివుని పూజించిన ఆలయం, అందులో శివలింగం ఇవాళ్టికీ పూజలందుకుంటున్న
ాయి.
రావణుడి తల్లి కేకసి.. ఈమె భవనం సముద్రానికి సమీపంలో ఉండేది.. ఆమె
నిత్యం ఉదయం ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి దానికి పూజ చేసి వచ్చేది..
శ్రీలంకలోని తిరుక్కోవిల్లో ఆమె తల్లి భవంతి ఉండేది.. ఇప్పుడా ప్రాంతంలో
దేవాలయం ఉంది..ఇక్కడో విచిత్రం ఉంది.. తన తల్లి మరణించిన తరువాత
ఆమె అంత్యక్రియలు జరిపిన తరువాత స్నానాదులకు మంచినీరు కరవైందట..
అప్పుడు రావణుడు తన త్రిశూలంతో ఏడుసార్లు నేలను గట్టిగా కొట్టాడట.. దీంతో
ఏడు ప్రాంతాలలోని నీటిధార ఉబికి వచ్చింది. సముద్రానికి దగ్గరలో మంచినీటి
బావులు ఇవి. ఈ ఏడింటిలో నీటి ఉష్ణోగ్రతలు ఏడు రకాలుగా ఉండటం ఇక్కడి
విచిత్రం.
తోటపాలకొండలో రావణుడి అతి పెద్ద గోశాల ఉంది.. లంకారాజ్యానికంతటికీ అదే
ఏకైక డైరీఫారమ్.. శ్రీలంకలోనే కలుతర అన్న ప్రాంతంలో రావణుడికి మరో కోట
ఉండేది.. ఈ కోట ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెప్తారు..
దీనికోసం లంక సర్కారు పరిశోధిస్తోంది.. ఇప్పుడు ఈ ప్రాంతంలో లైట్ హౌస్
కనిపిస్తుంది.
ఇక్కడ హనుమంతుడి గురించి కొంత చెప్పుకోవాలి.. లంకాదహనం చేశాక ఓ ప్రాంతంలో
కాసేపు రెస్ట్ తీసుకున్నాడు.. దాన్ని ఇప్పుడు రామ్ బోడా అంటారు.. అక్కడ
చిన్మయ మిషన్ వాళ్లు అతి పెద్ద ఆలయ నిర్మాణం చేశారు..

రామాయణంలో మనకు తెలిసిన రావణుడు వేరు..లంకలో కనిపిస్తున్న
రావణుడు వేరు.. ఆయన సీతను ఎత్తుకుపోయిన సంగతే చాలామందికి తెలుసు.
ఆయన పండితుడన్న సంగతి కొందరికి తెలుసు.. కానీ, రావణుడిలో
మనకు అంతు చిక్కని అనేక కోణాలు ఉన్నాయి..
రావణుడు ఆర్కిటెక్ట్
రావణుడు ఏరోనాటికల్ ఇంజనీర్
రావణుడు డాక్టర్
రావణుడు వార్ఫేర్ టెక్నాలజిస్ట్
రావణుడు నిత్య పరిశోధకుడు
రావణుడు గొప్ప సంగీతవేత్త
ఇలా చెప్పుకుంటూ పోతే రావణుడిలో అనేక కోణాలు బయటపడతాయి. తన
భార్య మండోదరితో సరదాగా ఆడుకోవటానికి చెస్ను కనుక్కొన్నాడట. ఆమెతో
కలిసి వీణ అద్భుతంగా వాయించేవాడట రావణబ్రహ్మ.
రావణుడికి సంబంధించి అయిదు విమానాశ్రయాలను లంక సర్కారు కనుక్కొందని
చెప్పుకున్నాం.. గుర్లపోతలో విమాన మరమ్మతు కర్మాగారం ఉంది.. వాల్మీకి
రామాయణంలోనూ ఈ గుర్లపోత ప్రస్తావన ఉంది. రావణుడి విమానం పెద్ద
నెమలి ఆకారంలో ఉండేదిట.. దీనికి సింహళభాషలో గుర్లపోత అంటారు..అంటే పక్షి
వాహనం అని అర్థం. విమానాన్ని సింహళ భాషలో దండు మోనరా అంటారు.. అంటే
ఎగిరే నెమలి అని అర్థం.
రావణ లంకానగరం అపూర్వమైంది.. అపూర్వ నిర్మాణాన్ని కలిగి ఉన్నది..
లంకానగరం శత యోజన విస్తీర్ణంలో నిర్మించారని రామాయణం చెప్తోంది..
ఏడు ప్రాకారాలు, ఎనిమిది ద్వారాలు.. మూడు కందకాలతో అత్యంత సురక్షితంగా
లంకా నగరాన్ని నిర్మించాడట రావణుడు.. ఆనాటి లంకలో నాలుగు లక్షల
వీధులు ఉండేవిట.
లంకలో చాలా ప్రాంతాల్లో అనేక గుహలు, సొరంగాలు కనిపిస్తాయి. ఇవన్నీ రావణ
కాలం నాటివే. రావణుడి ఆర్కిటెక్చరల్ ప్రతిభకు ఇవి నిదర్శనంగా నిలుస్తాయి.
ఈ సొరంగాలు లంకలోని అన్ని పట్టణాలకు ఒకదానితో మరొకటి లింక్ కలిపే
నెట్వర్క్ వ్యవస్థను కలిగి ఉన్నాయి.
ఈ సొరంగాలు తొందరగా ఒకచోటి నుంచి మరోచోటికి తరలివెళ్లేందుకు సరైన రవాణా
వ్యవస్థను కలిగి ఉన్నాయి.
ఈ సొరంగాలు సహజంగా ఏర్పడినవి కావు.. ప్రతి సొరంగం మానవ నిర్మితమేనని
స్పష్టంగా తెలుస్తుంది.. రావణ గుహకే దాదాపు ఏడు వందల దాకా
కిటికీలు ఉన్నాయి,
ఎంత గొప్ప నగర నిర్మాణం.. ఎంత సాంకేతిక పరిజ్ఞానం.. ఎంత గొప్ప నాగరికత..
భారత దక్షిణా పథాన కనీవినీ ఎరుగని సాంస్కృతిక వైభవం విలసిల్లిన
లంకానగరం ఎంత దారుణంగా ధ్వంసమైంది? తన ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా
చేసిన సార్వభౌముడు ఎలా పతనమయ్యాడు..
పధ్నాలుగేళ్ల వనవాసానికి అయోధ్య నుంచి బయలు దేరిన
రామచంద్రుడు చిత్రకూటం మీదుగా పంచవటికి వెళ్లాడు.. అప్పటికి
దండకారణ్యం దాకా రావణుడి ఆధిపత్యం కొనసాగినట్లు తెలుస్తుంది..
దండకారణ్యంలో రావణుడి గవర్నర్ ఖరుడు పరిపాలన సాగించాడు..
రాముడు ఖరదూషణులను ఇక్కడే చంపాడు..
పంచవటి నుంచి కిష్కింధకు వెళ్లిన రాముడు అక్కడ వానర సైన్యాన్ని
కలుసుకున్నాడు.. ఆ సైన్యం తోనే శ్రీలంకకు చేరుకున్నాడు.. భారతీయ నిర్మాణ
రంగంలోనే అపురూపమైన సేతువును రాముడు రామేశ్వరం మీదుగా లంకలోని
తలైమన్నార్ దాకా నిర్మించాడు. నీటిపై తేలే రాళ్లతో వానర సైన్యంలోని నీలుడి
పర్యవేక్షణలో ఈ సేతు నిర్మాణం సాగింది.. ఇదేం విచిత్రం కాదు.. నీటిపై తేలే
ఇటుకలను ఇప్పుడు వరంగల్లోని రామప్ప దేవాలయ
గోపురంలోనూ మనం చూడవచ్చు.. లైట్వెయిట్ స్టోన్స్, నీరు, ఇసుక.. పునాదులపై
నిర్మాణాలు భారతీయులకే సాధ్యమైన విద్యలు.. రామ సేతువు ఇవాళ్టికీ
సుమారు ౩౦ కిలోమీటర్ల మేర మనకు కనిపిస్తుంది..
శ్రీలంక సరిహద్దులకు చేరుకున్నాక రాముడు తన సైన్యంతో నీలవరై పుత్తుర్
దగ్గర మొదట ఆగాడట.. అక్కడ రాముడు తన సైన్యం కోసం సృష్టించిన
నీటి జల ఇప్పటికీ కనిపిస్తుంది..
నీలవరై పుత్తుర్ దగ్గర నుంచి లగ్గల అన్న ప్రాంతానికి రాముడి
సైన్యం తరలింది.. లగ్గల అంటే టార్గెట్ రాక్ అని అర్థం.. ఈ పర్వత పై
భాగం నుంచి రావణ సైన్యం రాముడి గురించిన సమాచారాన్ని అందించింది.. ఈ
ప్రాంతం భౌగోళికంగా ఉత్తర లంకలో అత్యంత ఎతెユ్తన ప్రాంతంలో ఉంటుంది. ఈ
ప్రాంతానికి ఈశాన్య భాగంలో తిరుకోణేశ్వరం ఉంది.. అటు వాయవ్య దిశలో
తలైమన్నార్ ఉంటుంది.. రామసేతువు లంకకు కలిపింది ఇక్కడే.. ఈ
తిరుకోణేశ్వరంలోనే రావణుడు తపస్సు అదేనండీ ఇవాళ మనం అనే మెడిటేషన్
చేసేవాడు..
ఈ యుద్ధ భూమిలోనే భీకరంగా రామరావణుల పోరాటం జరిగింది. రామబాణానికి
దశకంఠుడు నేలకొరిగాడు.. రాక్షస సంహారం జరిగింది. సుందరలంక స్మశానంగా
మారిపోయింది.. రాముడు వనవాసానికి వెళ్లేనాటికా ఆయన వయసు ౨౫
సంవత్సరాలు.. రావణున్ని హతమార్చేప్పటికి రాముడు ౩౯ ఏళ్ల వాడు...
రావణ సంహారంతో రామాయణం ముగియలేదు.. యుద్ధం తరువాత
రాముడు సీతాలక్ష్మణ సమేతంగా బయలు దేరినప్పుడూ లంకలోని కొన్ని
ప్రాంతాలలో ఆగాడు.. సేద తీరాడు.. పరమేశ్వరుని కొలిచాడు..
రావణ వధ తరువాత సీతారామలక్ష్మణులు పుష్పకంలో
అయోధ్యకు బయలు దేరుతూ వందారుమూలై అన్న ప్రాంతంలో కాసేపు ఆగారు..
వందారుమూలైలో ఉన్నప్పుడు రాముడికి అనుమానం కలిగింది..
రావణుడు బ్రాహ్మణుడు.. అతణ్ణి చంపినందుకు తనకు బ్రహ్మహత్యాదోషం
చుట్టుకుంటుంది కదా అన్న సందేహంతో దీనికి పరిష్కారం చెప్పమంటూ పరమేశ్వరుని
కోరాడు.. అప్పుడు శివుడు నాలుగు ప్రాంతాలలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజించమని
రాముడికి సూచించాడట.. దీంతో రాముడు లంకలో మానావారి అన్న ప్రాంతంలో తొలి
శివలింగాన్ని ప్రతిష్ఠించాడు.. దీన్ని రామలింగ శివుడని కొలుస్తారు.. ఆ తరువాత
తిరుకోణేశ్వరంలో, అక్కడి నుంచి తిరుకేదారేశ్వరంలో మరో
రెండు శివలింగాలను ప్రతిష్ఠించాడు... చివరగా భారత భూభాగంలో ఇప్పుడున్న
రామేశ్వరంలో మరో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు..
పుష్పకంపై తిరిగి వెళ్తూ, రాముడు రామసేతువును పాక్షికంగా ధ్వంసం చేసి వెళ్లాడని
కూడా కథనం చెప్తారు.. మొత్తం మీద రావణ లంక భారతీయ నాగరికతలోని
అనేక కొత్త కోణాలను వెలికి తీస్తున్నది..

Read More

మహాభారతం లో ధర్మబోధమహాభారతం లో ధర్మబోధ
"పూర్వం జాబలి అనే ముని వుండేవాడు. అతడు నిష్ఠగా తపస్సు చేసుకుంటున్నాడు. అతని నెత్తిమీద పిచికలు గూడు కట్టుకుని,గుడ్లు పెట్టుకొని పిల్లలతో హాయిగా కాపురమున్నాయి. జాబలి దయార్ద్ర హృదయుడు కావటం వలన వాటిని తరిమెయ్యకుండా తన నెత్తిమీద అలాగే ఉంచుకున్నాడు.

'ఆహా! నాకున్న ధర్మనిష్ఠ ఇంకెవరికైనా వుందా!' అనుకుంటూ తననితానే మెచ్చుకునేవాడు. ఒకసారి అశరీరవాణి అతని అహంభావాన్ని ఖండిస్తూ 'నీకెంటే ఎక్కువ ధర్మపరుడు తులాధారుడనే వర్తకుడు. అయితే అతను నీ మాదిరి ఎప్పుడూ గర్వపడలేదు' అంది.

"జాబలికి అసూయ కలిగింది. ఆ తులాధారుడెవరో చూడాలనుకుని విసవిస బయలుదేరాడు. వర్తకం చేసుకుంటున్న అతన్ని చూశాడు.

'అయ్యా వచ్చావా! రా! పిచికలు నెత్తిమీద గూడు కట్టుకుని పిల్లలతో సుఖంగా తిరుగుతున్నా చిత్తవికారం లేకుండా తపస్సు చేస్తున్న దయాసాగరా! ఎంత గొప్పవాడివి నువ్వు!!" అని అమితంగా గౌరవించి ఆదరించాడు తులాధారుడు.

జాబలి ఆశ్చర్యపోయాడు.

'ఈ సంగతి నీకెలా తెలిసింది?' అని అడిగాడు.

'మహర్షీ! నాకు దేనిమీదా, ఎవరిమీదా మమకారం లేదు. ధర్మమార్గంలో సంచరించడ మొక్కటే నాకు తెలుసు. ప్రపంచాన్ని రంగస్థలంగా చూసేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను. అందుచేత నా మనస్సు దేనికీ ఆకర్షింపబడక తామరాకు మీద నీటి బొట్టులా వుంటుంది. అందువల్లే నీ గొప్పతనం తెలుసుకోగలిగాను' అన్నాడు తులాధారుడు.

'అయితే నేను ధర్మమార్గాన నడవడం లేదంటావా? నా తపస్సూ, యజ్ఞాలు ధర్మాలూ కావంటావా?' అన్నాడు జాబలి కొంచెం కోపంగా.

'అహంకారంతో చేసే తపస్సునీ, ఫలం కోరి చేసే యజ్ఞాన్నీ దేవతలు మెచ్చరు. నిత్యతృప్తి అనేది మంచి యజ్ఞం. దానివల్ల దేవతలూ, మనమూ కూడా తృప్తి పొందుతాము' అన్నాడు తులాధారుడు.

'మరైతే నువ్వీ వ్యాపారం ఎందుకు విడిచిపెట్టవు? ధనాశ కాదా ఇది?' అని అడిగాడు జాబలి.

'అయ్యా! కర్తవ్యాలు విడిచిపెట్టడం తగదు. అయినా మనిద్దరికీ వాదం ఎందుకు! నేను చెప్పినదంతా సత్యమో కాదో అడుగుదాం - ఇన్నాళ్ళూ నువ్వు తండ్రిలా పెంచిన నీ పిచికలను పిలు' అన్నాడు తులాధారుడు.

పిలిచాడు జాబలి.

"అవి ముని కేశపాశంలో నుంచి రివ్వున ఎగిరి ఆకాశమార్గాన నిలబడి 'మేము ధర్మదేవత భటులం. ఆయన ఆజ్ఞవల్ల నిన్ను పరీక్షించడానికి వచ్చాం. మత్సరం మంచిది కాదు. అది సర్వధర్మాలనూ నాశనం చేస్తుంది. అందుచేత స్పర్ధ మాని శ్రద్ధగా అవలంబించాలి. శ్రద్ధలేని తపస్సూ, యజ్ఞాలూ వ్యర్థం. శ్రద్ధతో యాగం చేసినవాడు శుచి కాకపోయిన ఫరవాలేదు. శ్రద్ధ లేకూండా యాగం చేసినవాడు శుచి అయినా ప్రయోజనం శూన్యం. శ్రద్ధ వల్ల దానగుణం అబ్బుతుంది. అందువల్ల మేలు కలుగుతుంది. సర్వ సుఖాలూ చేకూరుతాయి ' అని వివరించి మాయమయ్యాయి.

'అయ్యా! మునుల నుంచి తత్త్వజ్ఞానం తెలుసుకోకపోవడం వల్ల నాకీ అసూయ కలిగింది. ఎవరికి వారు తమ తమ విధానాలైన కర్మలు చెయ్యటం మంచిదని నీ నుంచి గ్రహించాను. కాని వాటివల్ల ప్రయోజనం ఆశించకూడదు. అదీ నీ నుంచే తెలుసుకున్నాను. వెళ్ళొస్తాను' అని చెప్పి తులాధారుడి దగ్గర సెలవు తీసుకున్నాడు.

"ధర్మరాజా! ఆచార ధర్మాలు అలాంటివి. సూర్యుడి రూపం నీళ్లలో ప్రతిబింబించినట్లు ఆత్మస్వరూపం నిర్మల బుద్ధిలో ప్రతిబింబిస్తుంది. ఈ శరీరం యావత్తు మహాపట్టణం. దానికి బుద్ధి రాణి. సర్వ విషయాలూ చర్చించే మనస్సు మంత్రి. విషయాలు అయుదూ పురోహితులు. చెవి, ముక్కు మొదలైన ఇంద్రియాలు పౌరులు. ఈ శరీర సామ్రాజ్యంలో రజోగుణం, తమోగుణం అనే మోసగాళ్ళున్నారు. మనస్సు చెప్పిన మాట బుద్ధి వినకపోయిందంటే ఆ మోసగాళ్ల బారినపడి చెడిపోతుంది. మనస్సు, బుద్ధి కలిసి ఏకముఖంగా ప్రయాణిస్తే రాజ్యపాలన చక్కగా సాగుతుంది. శాశ్వత సౌఖ్యం లభిస్తుంది" అని చెప్పాడు వేదవ్యాసుడు.

"మహర్షీ! కార్యసమీక్ష త్వరగా చెయ్యడం మంచిదా? నిదానంగా చెయ్యడం మంచిదా?" అని అడిగాడు ధర్మరాజు.

"కార్యవిచారం చెయ్యడంలో తొందర ఎప్పుడూ పనికిరాదు" అని చెబుతూ ఒక కథ చెప్పాడు వ్యాసుడు.

"మేధాతిథి అనే మునికి చిరకారి అనే కొడుకుండేవాడు. అతడు ప్రతి పనీ బాగా ఆలోచించి చేసేవాడు. యుక్తాయుక్త విచక్షణ తెలిసినవాడు. అందుకే అతనికి ఆ పేరు వచ్చింది. ఒకనాడు మేధాతిథికి భార్య మీద కోపం వచ్చింది. ఆమెను చంపెయ్యమని చిరకారిని ఆదేశించి వెళ్ళిపోయాడాయన.

'నవమాసాలు మోసే కన్నతల్లి కంటే ఈ భూమి మీద ఎక్కువ ఏదీ లేదు. తల్లి దైవమంటారు. ఆమెను చంపటం కంటే పాపం వుందా! కాని తండ్రి ఆజ్ఞ మీరకూడదంటారు. ఏంచెయ్యను? ఇద్దరిమీదా గౌరవం వున్నవాడనే నేను!' అనుకుంటూ చిరకారి చాలాసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు. ఆలోచనలో చాలా సమయం గడిచిపోయింది. ఏదో కోపంలో అన్న మాటలు పట్టుకుని కొడుకు తల్లిని ఎక్కడ చంపేశాడోనని విచారపడుతూ, తన కొడుకు అలా చెయ్యడని ధైర్యం తెచ్చుకుంటూ ఆశ్రమానికి వచ్చాడు మేధాతిథి. తండ్రిని చూస్తూనే చిరికారి చేతిలో వున్న కత్తి కిందపడేసి అతని కాళ్ళమీద పడ్డాడు. భార్య వచ్చి నమస్కరించింది. కన్నీటితో ముని భార్యాతనయుల్ని గుండెకు హత్తుకున్నాడు. కొడుకును మెచ్చుకుని దీవించాడు.

"ధర్మరాజా!కార్యవిచారం చాలా ధైర్యంగా, జాగ్రత్తగా చెయ్యాలి. తొందరపడి ఏ పని చేసినా చివరకు పశ్చాతాప పడవలసి వస్తుంది" అని ముగించాడు వ్యాసమహర్షి
Read More

Both telugu and tamil versions. శిలా తోరణంBoth telugu and tamil versions.
శిలా తోరణం
చాలా సంవత్సరములకు పూర్వం మన దక్షిణ భారత దేశాన్ని మ్లేచ్చ రాజైన మాలికాపూర్ దండెత్తి ద్వంసం చేసింది అందరికి విశదమే. అలా వస్తుండడం మధుర నగర వాసులకు తెలిసింది ఆతను వచ్చే దారిలో అంట హత్యలు దోపిడీలు స్త్రీలను బలాత్కారం చేయడం స్త్రీలను నిర్భందించి అదుపులోకి తీసుకొని అందరికి పంచడం చేయడం కాకుండా మన దేవాలయములు అన్ని ద్వంసం చేసి నగలు ధనం కొల్లకోట్టుకొని పోవడం అతనికి వెన్నతో పట్టిన విద్య.
అప్పుడు మన ప్రజలు ఎలాగైనా దేవతా మూర్తులను కాపాడాలని శత విధములుగా ప్రయత్నం చేసి కాపాడుతున్దినారు. అలాంటి వాటిలో ఒక పద్దతి గర్భ గుడికి ముందు ఒక గోడను లేపి అక్కడ ఒక శిలా విగ్రహాన్ని ప్రతిష్ట చేసి పూజాదులు నిర్వర్తించు చుండిరి. దీనినే శిలాతోరణం అని చెప్పడం. మ్లేచ్చ రాజు కోవెలకు వచ్చి ఇదియే అసలు విగ్రహం అని అపోహతో దానిని విద్వంసము చేసి నగలు ధనము కొల్లకోట్టుకు పోతున్దినాడు.
అప్పుడు మధుర మీనాక్షి కోవేలలోని అర్చకులు ఈ విధానమును గ్రహించి ఎలాగైనా సుందరేశ్వరుని మీనాక్షిని కాపాడుకోవాలని ప్రతిజ్ఞ తీసుకొని గర్భగ్రుహం ముందు గోడను లేపి అక్కడ ఒక లింగమును మీనాక్షి ఉత్సవ విగ్రమును ప్రతిష్టించి పూజాదులు నిర్వర్తించు చుండిరి. అప్పుడు అక్కడికి రానేవచ్చాడు మన మ్లేచ్చుడు మాలికాపూర్. లింగమును విగ్రహమున్ ద్వంశం చేసి నగలు దస్కం తీసుకెళ్ళి పోయాడు. తర్వాత అక్కడ కోవెలలో సుమారు నలుబై ఎనిమిది సంవత్సరములు పూజాదులు లేకుండా కోవెల పాడు పది వుండినది. ఆ అర్చకులు మట్టుకు ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు ఈ అసలు విషయం ప్రాణం పోయిన బయటకు చెప్పా రాదు అని.
సుమారు యాబై సంవత్సరముల అనంతరం విజయనగ రాజులు దండెత్తి మ్లేచ్చులను పారదోలి ఎన్నో కోవేలలను పునరుద్దీకరించారు. అలా చేస్తూ వచ్చి మీనాక్షి ఆలయంలోని పరిస్థితి చూసి చాల దుఃఖ పడి కోవెల పునరుద్దీకరణకు ప్రయత్నములు ఆరంభిచినారు. అప్పుడు ఒక వృద్ద పూజారి కోవెలకు వచ్చి నూతన ఆలయ నిర్మాణం అవ్యస్యం లేదు స్వామీ విగ్రహం క్షేమంగా వుంది అని చెప్పాడు. ఎవ్వరు నమ్మలేదు కాని అప్పుడు ఆటను సుమారు యాబై సంవత్సరములకు ముందు తాము చేసిన ఏర్పాటును చెప్పి గోడను తొలగించితే అసలు విగ్రహం వుందని చెప్పారు. రాజు గోడ తొలగించి చూస్తె యాబై సంవత్సరములకు పూర్వం స్వామీ ఎలా వుందో అలానే చెక్కు చెదరకున్డ్డ వుండటం చూసారు. దేవుని పిన వేసివుండిన మాలలు కాని దీపం కాని ఏమి మారకుండా వుండటం చూసి ఆశ్చర్య చకితులై స్వామికి మోకరిల్లి దేవాలయం పునరుద్దీకరణకు పాల్పడ్డారు. అప్పుడు విరిగిపోయిన శివ లింగమును గుడిలోని తామర కొలను వద్ద వుంచి ఒక శిలా ఫలకమును ఏర్పాటు చేసి విషయము సువిస్తారముగా వెనుక సంతతికి తెలియాలని ఏర్పాటు చేసినారు.
చాలా రోజుల తర్వాత చెన్నై ముఖ్య మంత్రి ఎం.జి. రామచంద్రన్గారు మదురై గుడికి వేంచేసినప్పుడు ఆ లింగమును శిలా ఫలకమును చూసి ఆశ్చర్యపోయి ఈ విగ్రహం అంటే లింగము పురావస్తుశాలలో వుండకూడదు దేవాలయంలోనే వుంచి పూజాదులకు ఏర్పాటు చేసి అక్కడే ఈ విషయం అందరికి తెలియాలని శిలా ఫలకం కూడా ఏర్పాటుచేసినారు. నేటికి మనం మదురై కోవలేకు వెళితే ఆ లిగామును శిలాఫలకమును చూడవచ్చు.

கல்திரை.
பல ஆண்டுகள் முன்னால் மாலிக்கபூரின் படையெடுப்பு.
மதுரைக்கு வந்து கொண்டிருந்தான். வரும் வழியெங்கும் இரத்தம், கொலை, கொள்ளை, பலாத்காரம், பெண்களை சிறைப்படுத்துதல். நிறுத்தாமல் தொடர்ந்து நடந்து கொண்டிருந்தது. கோவில்களை இடித்தான். முடியாதவற்றில் மூர்த்தியை மட்டுமாவது இடிப்பான். பல கோவில்களில் மூர்த்தியை எப்படியாவது காப்பாற்றிவிடுவார்கள் நம் மக்கள்.
இப்படியாக துவங்கியதுதான் கல்திரை.
கர்பக்ருஹதிர்க்கு முன்னால் ஒரு சுவரை எழுப்பி அதற்கு முன் ஒரு மூர்த்தியை பிரதிஷ்டை செய்துவிடுவார்கள். ஆக்கிரமிப்பாளன் வருவான். இதுதான் மூர்த்தி என்று நினைத்து இடிப்பான்.
இதை கேள்விப்பட்டனர் மதுரை மீனாக்ஷி அம்மன் கோவிலை சேர்ந்த 5 சிவாச்சாரியார்கள், எப்படியாவது நமது கோவிலை காப்பாற்ற வேண்டும், சுவாமி மீது ஒரு மிலேச்சன் கை வைக்க விடக்கூடாது என்று தங்களுக்குள் சபதம் செய்து கொண்டார்கள். தாம் செய்யும் காரியத்தை நேரம் வரும்வரை யாருக்கும் சொல்வதில்லை என்று சத்தியம் செய்தார்கள்.
சுவாமிக்கு அபிஷேகமெல்லாம் செய்து முடித்து, கண்ணில் நீருடன், மீண்டும் உன்னை எப்போது காண்போம் சர்வேசா, சுந்தரேசா என்று கதறியபடியே கல் திரை எழுப்பினார்கள். வெளியே மூர்த்தியை பிரதிஷ்டை செய்தார்கள். அசலைப்போலவே நகை, விளக்கு, மாலை, எல்லாம் ஏற்பாடு செய்தார்கள்.
வந்தான் மாலிக்கபூர். ஆயிரக்கணக்கான பேரை கொன்றான். பல ஆயிரம் பேரை மதம் மாற்றினான். மாட்டு கறியை வாயில் திணித்தான். விக்ரஹத்தை இடித்தான். செல்வங்களை எல்லாம் கொள்ளை கொண்டு போனான்.
அதன் பின் 48 ஆண்டுகள் கோவிலில் பூஜை இல்லை. தெரிந்து கொள்ளுங்கள் நண்பர்களே, மதுரை மீனாக்ஷி அம்மன் கோவிலில் 48 ஆண்டுகள் பூஜை கிடையாது. கோவிலே பாழாக இருந்தது.
அதன் பின் விஜயநகர சாம்ராஜ்யம் துவங்கியது. முகலாயர்களை துவம்சம் செய்தார்கள். எல்லா கோவில்களையும் புனருத்தாரணம் செய்தார்கள். அப்போது மதுரை மீனாக்ஷி அம்மன் கோவிலிலும் வேலையை ஆரம்பித்தார்கள். அங்கே இடிந்து கிடந்தது சிவலிங்கம். அம்பாளை காணோம். சரி வேறு ஒரு சிலையை செய்ய சொல்லி உத்தரவு கொடுப்போம் என்று சொன்னார்கள்.
அப்போது தள்ளாத வயதான ஒரு சிவாச்சாரியார் வந்தார். புது விக்ரஹமெல்லாம் வேண்டாம். சுவாமி பத்திரமாக இருக்கிறார் என்றார். என்ன சொல்கிறீர்கள். இதோ இடித்துவிட்டு போயிருக்கிறார்களே என்றனர். இல்லை, இல்லை, இது மூல விக்ரஹமில்லை என்று சொல்லி நடந்ததை சொன்னார். சத்தியம் செய்த 5 பேரில் 4 பேர் இறந்து விட்டார்கள். காலம் வரும்வரை எப்படியாவது நான் இதை சொல்லிவிட்டு சாக வேண்டும் என்று உயிரை கையில் பிடித்துகொண்டு இருக்கிறேன் என்று சொல்லி தாளாத துக்கத்துடனும் மனதில் இருந்த பாரம் இறங்கியதில், நல்லது நடக்கிறதே என்று சந்தோஷத்துடனும் அழுதுகொண்டே சொன்னார். உடனடியாக அந்த மூர்த்தி இருந்த இடத்தின் பின்னே உள்ள சுவற்றை இடிக்க ஆரம்பித்தார்கள். முழுவதும் இடித்து உள்ளே சென்று பார்த்தால்.......
உள்ளே 48 ஆண்டுகள் கழித்து எந்த பூஜையும் இல்லாமல், விளக்கு எரிந்து கொண்டிருந்தது. சுவாமியின் மீது சாற்றிய சந்தன கலபம் ஈரமாக இருந்தது. பூக்கள் வாடாமல் இருந்தன. கர்பக்ருஹத்தில் உள்ளே இருந்து வரும் அந்த வாசம் அப்படியே இருந்தது!!!!
48 ஆண்டுகள் கழித்து எந்த பூஜையும் இல்லாத நிலையில் உள்ளே அனைத்தும் மூடும்போது இருந்தபடியே இருந்தது.
திளைத்தனர் பக்தியில் அனைவரும். அனைத்து சோக நிழல்களும் பறந்தன. ஊரே திருவிழா கோலம் பூண்டது இந்த அதிசயத்தை காண. மீதும் புது பொலிவுடன் கோவில் திறக்கப்பட்டது.
இன்றும் அந்த கோவிலுக்கு போனால் உடைக்கப்பட்ட சிவலிங்கம் ஒரு ஓரமாக பொற்றாமரை குளம் சுவரருகில் வைக்கப்பட்டுள்ளது. இந்த விவரம் ஒரு பலகையில் எழுதிவைக்கப்பட்டுள்ளது. யாரும் பார்ப்பதில்லை அதை. எம்.ஜி.ஆர் அப்போது முதலமைச்சர். கோவிலுக்கு வந்தார். அருங்காட்சியகத்திற்கு வந்து பார்த்தார். இதை படித்து விட்டு, எப்பேர்ப்பட்ட நடப்பு இது, இதை எதற்கு அருங்காட்சியகத்தில் வைத்தீர்கள்? வெளியே கோவிலில் வையுங்கள். விவரமாக எழுதிபோடுங்கள். அனைவரும் படிக்கட்டும் என்றார்.
சம்போ மகாதேவா!!
Read More

Powered By Blogger | Template Created By Lord HTML