గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 29 October 2014

ఉత్తరకుమారుడు

ఉత్తరకుమారుడు

పాండవులు మారువేషాల్లో విరాట మహారాజు కొలువులో అజ్ఞాతవాసం చేస్తుండగా కీచకుడిని భీముడి నర్తనశాలలో వధించాడు. కీచకుని మరణానికి కారకురాలైన ద్రౌపదిని ఉపకీచకులు తమ అన్న శవంతో కట్టి చంపటానికి తీసుకువెళ్ళారు. భీముడు ఉపకీచకులను కూడా వధించాడు. కౌరవులు విరాటుని కొలువులో పాండవులు ఉన్నారని గ్రహించి విరాట మహారాజు గోసంపదను చేజిక్కించుకోవటానికి సుశర్మను దక్షిణ దిక్కువైపు పంపి దక్షిణ గోగ్రహణానికి పథకం సిద్ధం చేశారు. తాము ఉత్తరం దిక్కు నుంచి విరాట మహారాజు గోసంపదను గ్రహించటానికి ఉత్తర గోగ్రహణానికి సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. విరాట మహారాజు త్రిగర్తాధీశుడైన సుశర్మ మీదకు సైన్యాన్ని నడిపించాడు. ఇదే అదనుగా కౌరవులు ఉత్తర గోగ్రహణం చేశారు. ఆ సమయంలో అంతఃపురంలో ఉత్తరకుమారుడు స్త్రీజనుల మధ్యన సరససల్లాపాలతో ఉన్నాడు. ఉత్తర గోగ్రహణం జరిగిందని గోరక్షకుడు వచ్చి చెప్పాడు. తాను వెంటనే కౌరవులను ఓడించి గోవులను తీసుకువస్తానని ఉత్తరకుమారుడు ప్రగల్బాలు పలికాడు. కానీ తన రథాన్ని యుద్ధరంగంలో నడిపించేందుకు తగిన సారథి ఎవరూ దొరకలేదని ఒక సాకు చెప్పి మళ్ళీ స్త్రీలతో సరస సరాగాలకు దిగాడు. బృహన్నలగా రాకుమారి ఉత్తరకు అర్జునుడు నృత్యాన్ని నేర్పుతూ అప్పుడు ఆ కొలువులోనే ఉన్నాడు. జరిగిన విషయాన్నంతా గమనిస్తున్న సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపది అర్జునుడికి వివరించింది. యుద్ధం చేసి కౌరవులను జయించేందుకు అర్జునుడు సంసిద్ధుడైనాడు. ఉత్తరకుమారుడి దగ్గరకు వెళ్లి గతంలో అర్జునుడి రథానికి సారథిగా ఉన్న బృహన్నల మన కొలువులోనే ఉన్నాడని ఖాండవ వన దహనం వంటి అనేక సందర్భాల్లో అర్జునుడి విజయానికి బృహన్నలే కారణమని ఉత్తర కుమారుడికి చెప్పమని అర్జునుడు ద్రౌపదిని పంపించాడు. ద్రౌపది విషయాన్నంతా చెప్పింది. తొలుత బృహన్నల తన వంటి వీరపురుషుడికి రథసారథిగా ఉండటమా అని ఉత్తరుడు కొంత హేళనగా అన్నా తరువాత తప్పింది కాదు. అర్జునుడు బృహన్నలగానే రాకుమారుడి రథానికి సారథ్యం వహించి తన శక్తియుక్తులు అన్నింటినీ ప్రదర్శిస్తూ యుద్ధరంగానికి రథాన్ని నడిపించాడు. ఎదురుగా ఉన్న అనంత కౌరవ సేనావాహినిని చూసేసరికి ఉత్తరుడికి కాళ్ళు వణికాయి. బతికుంటే బలుసాకు తినవచ్చునని రథాన్ని వెనక్కి తిప్పమని ప్రాధేయపడ్డాడు. కానీ వీరుడి లక్షణం వెన్నుచూపడం కాదని వీరోచితంగా పోరాడి శత్రువులను మట్టుపెట్టాలని అర్జునుడు ఉత్తరకుమారుడికి ధైర్యాన్ని నూరిపోశాడు. కేవలం ప్రగల్భాలు పలికి పొద్దుపుచ్చుకూడదని కష్టకాలంలో వీరోచితంగా పోరాడి కష్టాలను ఎదుర్కోవాలని అర్జునుడు చేసిన హితబోధ ఒక్క ఉత్తరకుమారిడికే కాదు ఆరంభ శూరత్వంతోనూ, ప్రగల్బాలతోనూ కాలం వెళ్లదీసే అందరికీ అది చక్కటి బోధామృతం. ఉత్తరకుమారుడు ఆ బోధామృతాన్ని అందించిన అర్జునుడి సహకారంతోనే ఉత్తర గోగ్రహణం సమయంలో విజయాన్ని చేజిక్కించుకోగలిగాడు. అర్జునుడి మాటలలోని ఆత్మస్త్థెర్యాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవచ్చు
Read More

కుజదోష నివారణకు పరిహారం

కుజదోష నివారణకు పరిహారం

కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.

సుబ్రహ్మణ్య ఆలయ స్తుతి దర్శనం చేయాలి. షష్టి, సుబ్రహ్మణ్య షష్టి, సుబ్రహ్మణ్య జననం జరిగిన కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయాలి.

సంతానం లేని దంపతులు ఏడు ఆదివారాలు కుమారస్వామి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి. ఎర్రని పుష్పాల మాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి.

కుజుని అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉండి కందిపప్పు బెల్లంతో చేసిన పదార్ధాలను నైవేద్యం పెట్టాలి.

కార్యాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంచి ధూపదీప నైవేద్యములు సమర్పించి కార్యక్రమాలు ప్రారంభించాలి.

మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుట చేయాలి. ఎర్రని వస్త్రాలను, ఎర్రని పండ్లను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం చేయాలి.

స్త్రీలు ఎర్రని వస్త్రధారణ, పగడపు ఆభరణాలు ధరించి చేసి దుర్గాదేవిని పూజించుట, అమ్మవారికి ఎర్రని పూలను మాలలను సమర్పించి కుంకుమపూజ చేయాలి.

దుర్గాదేవిని స్తుతించాలి. మంగళ వారాలు దుర్గాదేవి ఆలయదర్శనం చేసి ప్రదిక్షిణం చేసి స్తుతించి పూజించాలి. గణపతి స్తోత్రం చేయాలి.

ఆంజనేయస్వామి దండకం స్తుతి చేయాలి. బలరామ ప్రతిష్టిత నాగావళీ నదీతీర పంచలింగాలను దర్శించాలి.

మంగళ వారాలాలలో సింధూరవర్ణ ఆంజనేయ స్వామి దర్శనం, ప్రదిక్షిణం, స్తుతి చేయాలి.

మంగళ వారం లేక కృత్తికా నక్షత్రం రోజున కుజుడికి శివాలయం లేక సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఏడు వేల కుజ జపం చేయించి ఎర్రని వస్త్రంలో కందిపప్పు మూట కట్టి దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి.

ఏడు మంగళవారాలు కుజుడికి ఉపవాసం ఉండి కుజ శ్లోకం డెబ్భై మార్లు పారాయణం చేసి ఏడవ వారం కందులు దానం ఇవ్వాలి.

నానవేసిన కందులను బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కోతులకు తీపి పదార్ధములు పెట్టాలి, ఎర్రమి కుక్కకు ఆహారం పెట్టాలి.
Read More

వినాయకుని 32 రూపాలు మీకు తెలుసా?

వినాయకుని 32 రూపాలు మీకు తెలుసా?

వివిధ ఆగమ శాస్త్రాల్లో గణపతులు :

ముద్గల పురాణాన్ని అనుసరించి 32 గణపతులు ఉన్నారు.

1. బాల గణపతి 2.తరుణ గణపతి 3.భక్త గణపతి 4.వీర గణపతి

5. శక్తి గణపతి 6.ద్విజ గణపతి 7.సిద్ధ గణపతి 8.ఉచ్చిష్ట గణపతి

9.విఘ్న గణపతి 10.క్షిప్ర గణపతి 11.హేరంబ గణపతి 12.లక్ష్మీ గణపతి

13.మహా గణపతి 14. విజయ గణపతి 15.వృత్త గణపతి

16. ఊర్ద్వ గణపతి 17.ఏకాక్షర గణపతి 18.వర గణపతి 19.త్ర్యక్షర గణపతి 20.క్షిప్ర ప్రసాద గణపతి

21.హరిద్రా గణపతి 22.ఏకదంత గణపతి 23.సృష్టి గణపతి 24.ఉద్ధండ గణపతి

25.ఋణ మోచన గణపతి 26.దుండి గణపతి 27.ద్విముఖ గణపతి 28.త్రిముఖ గణపతి

29.సింహ గణపతి 30.యోగ గణపతి 31.దుర్గా గణపతి 32 .సంకష్ట గణపతి

ఈ గణపతి రూపాల్లో మొదటి 16 గణపతులు చాలా మహిమాన్వితమైనవి. వీటిని "షోడశ'' గణపతులు అంటారు.
షోడశ గణపతులు
విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో తాంత్రికులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిదీ ఒక్కో విశిష్టత. ఆ రూపాలేంటో, వాటి విశిష్టతలేంటో తెలుసుకుందాం.

1. బాల గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.

కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్
బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్
అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి.

2. తరుణ గణపతి:
ఈ వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు. ఈయనను... పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంత శాలీనమపి స్వహస్త్రైః ధత్తే సదా య సతరుణాభః పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః అనే మంత్రంతో పూజించాలి.

3. భక్త గణపతి

ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

నాలికేరామ్ర కదలీ గుడపాయాస ధారిణమ్
శరచ్చంద్రాభ్వవుషం భజే భక్త గణాధిపమ్

అనే మంత్రతో స్తుతించాలి...ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.

4. వీరగణపతి
ఈ వినాయకుడి రూపానికి పదహారు చేతులుంటాయి కుడి వైపు చేతులతో బాణం, బేతాలుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం, గొడ్డలిబొమ్మ ఉన్న జెండా, ఎడమవైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి దర్శనమిస్తారు. ఈయనను....

బేతాల శక్తి శర కార్ముక చక్ర ఖడ్గ
ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్
శూలం చ కుంత పరశుధ్వజ మాత్తదంతం
వీరం గణేశ మరుణం త్వనిశం స్మరామి
అనే మంత్రంతో కీర్తించాలి. ఈయనను పూజించిన భక్తులకు తిరుగులేని ధైర్యం ప్రసాదిస్తారు.

5. శక్తి గణపతి

ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం
పరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్
సంధ్యారుణం పాశ స్ఫటీర్దధానం
భయాపహం శక్తి గణేశ మీదే
అనే మంత్రంతో ఈ గణేశుని ప్రార్థించాలి. నాలుగు చేతులున్న ఈ గణపతి అంకుశం, పాశం,
విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు. ఈయన కరుణిస్తే ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.

6. ద్విజ గణపతి ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పుస్తకం, దండం ఎడమవైపు ఉన్న చేతులతో అక్షమాల, కమండలం పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీః
విద్యోతమాన కరభూషణ మిందువర్ణమ్
స్తంబేరమానవ చతుష్టయ శోభమానం
త్వాం ద్విజగణపతే ! సిద్ధ్విజ గణాధిపతే స ధన్యః అనే మంత్రంతో పూజించాలి. ఈ గణపతి తెలివి తేటలు ప్రసాదిస్తాడు.

7. సిద్ధి (పింగల) గణపతి

ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పండిన మామిడిపండు, ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

పక్వచుత ఫల పుష్పమంజరీ
ఇక్షుదండ తిలమోదకై స్సహ
ఉద్వహన్ పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత హేమం పింగల
అనే మంత్రంతో స్తుతించాలి.

8. ఉచ్ఛిష్ట గణపతి
కోరిన కోర్కెలు తీర్చే ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మపండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్
దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః
అనే మంత్రంతో ప్రార్థించాలి.

9. విఘ్న గణపతి

గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడివైపు చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

శంఖేక్షు చాప కుసుమేషు కుఠార పాశ
చక్ర స్వదంత సృణి మంజరికా శరౌఘై
పాణిశ్రిఅఅఅ పరిసమీహిత భూషణా శ్రీ
విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః అనే మంత్రంతో ప్రార్థించాలి.

10. క్షిప్త గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ ఎడమ వైపు ఉన్న చేతులతో కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి కనిపిస్తారు. ఈయనను....

దంత కల్పలతా పాశ రత్న కుంభాంకుశోజ్జ్వలమ్
బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర గణాధిపమ్
అనే మంత్రంతో స్తుతించాలి.

11. హేరంబ గణపతి

అభయ వరదహస్త పాశదంతాక్షమాల
సృణి పరశు రధానో ముద్గరం మోదకాపీ
ఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రం
గణపతి రతిగౌరః పాతు హేరంబ నామా

అనే మంత్రంతో స్తుతించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమవైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తారు. ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారు.

12. లక్ష్మీ గణపతి

బిభ్రాణ శ్శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశన్
పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్జ్యోతి స్సుధా నిర్ఘరః
శ్యామేనాత్తసరోరు హేణ సహితం దేవీద్వయం చాంతికే

గౌరాంగో వరదాన హస్త సహితో లక్ష్మీ గణేశోశావ తాత్ అనే స్తోత్రంతో పూజించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తారు. ఈ సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.

13. మహాగణపతి

ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలూ కలుగుతుంది.

హస్తీంద్రావన చంద్రచూడ మరుణచ్చాయం త్రినేత్రం రసాదాశ్యిష్టం శిరయమాస పద్మకరయా స్వాంకస్థయా సంతతమ్

బీజాపూరగదా ధనుర్విద్య శిఖయుక్ చక్త్రాబ్ద పాశోత్పల
వ్రీహ్యగ్ర స్వవిశాణ రత్న కలశాన్ హస్త్రై ర్వహంతం భజే
అనే మంత్రంతో ప్రార్థించాలి.

14. విజయ గణపతి
సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని....
పాశాంకుశ స్వదంత్రామ ఫలావా నాఖు వాహనః
విఘ్నం నిఘ్నంతు నమః స్సర్వం రక్తవర్ణో వినాయకః అనే మంత్రంతో పూజించాలి.

15. నృత్య గణపతి

సంతృప్తిని, మనశ్శాంతినీ ఇచ్చే ఈ గణపతి కుడి చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి దర్శనమిస్తారు.

పాశాంకుశాపూస కుఠారదంతః చంచత్కరః క్లుప్త పరాంగులీకుమ్
పీతప్రభం కల్పతరో రథః స్థం భజామి తం నృత్త పదం గణేశమ్
అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.

16. ఊర్ధ్వ గణపతి
కారాగార బాధ నుండీ తప్పించే ఈ గణపతి కుడి చేతులలో కలువ, పద్మం, విల్లు, విరిగిన దంతం, ఎడమ వైపు చేతులతో వరివెన్ను, చెరకుముక్క, బాణం, మొక్కజొన్న కండె ధరించి దర్శనమిస్తారు.

కల్హార శాలి కమలేక్షుక చాపదంతా ప్రరోహ కనకోజ్జ్వల లాలితాంగ ఆలింగ్య గణోద్యతకరో హరితాంగ యష్ట్యా దేవ్యా కరోతు శుభమూర్ధ్వ గణాధిపో మేః అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.

శిల్ప ఆగమ శాస్త్రాలను అనుసరించి 21 గణపతుల రూపాలు ఉన్నాయి. అవి వరుసగా...

1.వినాయకుడు 2.బీజ గణపతి 3.హేరంబ గణపతి 4.వక్రతుండ గణపతి

5.బాల గణపతి 6.తరుణ గణపతి 7.భక్తి విఘ్నేశ 8.వీర విఘ్నేశ 9.శక్తి గణేశ

10.ధ్వజ గణపతి 11.పింగళ గణపతి 12. ఉచ్చిష్ట గణపతి 13. విఘ్నరాజ గణపతి

14.లక్ష్మీ గణేశ 15.మహా గణేశ 16. భువనేశ గణపతి 17.నృత్త గణపతి

18.ఊర్ద్వ గణపతి 19.ప్రసన్న గణపతి 20.ఉన్మత్త వినాయక 21.హరిద్రా గణేశ
Read More

పరమేశ్వరుడు జపించే శ్రీరామ మంత్రమేంటో తెలుసా?

పరమేశ్వరుడు జపించే శ్రీరామ మంత్రమేంటో తెలుసా?

పరమేశ్వరుడు, ముక్కంటి అయిన శివుడే విష్ణు స్తోత్రమునకు శ్రీరామ మంత్రాన్ని జపించినట్లు శాస్త్రాలు చెబుతున్నారు. దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధమై చైత్రశుద్ద దశమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం 'శ్రీరామనవమి' గా విశేషంగా జరుపుకుంటాం.

'రామ' యనగా రమించుట అని అర్ధం. కావున మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న 'ఆ శ్రీరాముని' కనుగొంటూ వుండాలని పండితులు అంటున్నారు.

ఒకసారి పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, "ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!" అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు.

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వార్కి సధ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు 'రా' అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయని విశ్వాసం. అలాగనే 'మ' అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందుచేత శ్రీరామనవమి నాడు శ్రీరాముని అనుగ్రహం పొందాలంటే ఈ ఒక్క మంత్రముతో జపిస్తే చాలునని పండితులు అంటున్నారు
Read More

నదుల ప్రాశస్త్యము

నదుల ప్రాశస్త్యము

భారతదేశం ఎన్నో పుణ్యనదులు, తీర్ధాలకు నిలయం. ఇవన్నీ భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో స్నానమాచరిస్తే అనంత పుణ్యాన్ని, అత్మతత్వాన్ని ప్రసాదింపజేసి పునర్జన్మరాహిత్యాన్ని కలిగిస్తాయి.

భారతదేశం ఖండాంతరాల్లో పెరుగాదించడానికి మూలకారణం ఈ దేశం యొక్క నగ-నన-నదీ-తీర్థ కలయికతో గూడిన ప్రకృతి.

ఋగ్వేదంలో నదుల మహిమల గురించి ఇలా చెప్పారు. “గంగానదీ తీరమున దానం చేయటంవల్ల మానవుడు పరితాత్ముడౌతాడు. సరస్వతీ మొదలగు ప్రఖ్యాతాలైన పుణ్యనదీతీరముల యందు యజ్ఞాది వైదికకర్మలను ఆచరించుట చాలా మంచిది. సరస్వతీనది శ్రేష్ఠమైన తల్లిగా సంబోధింపబడింది".

నదిలో కొన్ని పవిత్ర స్థలాలున్నాయి. తైత్తిరీయ సంహిత ఇలా చెప్పింది -

తీర్థే, స్నాయి తీర్థమేవ సమానానాంభవతి

నదులన్నీ దైవతాలుగా ప్రస్తావింపబడ్డాయి. సరస్వతీ నది సర్వోత్తమమైన నదీదేవత.

మన దైనందినజీవితంలో శ్రౌత, స్మార్తాది కర్మలలోని కలశారాధనలో నదులపేర్లను ఈ విధంగా స్మరిస్తాం.

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి,

నర్మదే సింధు కావేరి, జలే స్మిన్ సన్నిధం కురు ||

“దివ్యములైన ఈ జలాలు మంగళకరాలైన మా అభీష్టమును తీర్చుగాక! మాకు త్రాగుటకు అనువైన నీటిని ఇచ్చుగాక! మావైపు ప్రవహించు గాక!” ఇవి జలవైశిష్ట్యాన్ని సంపూర్ణంగా అర్థంచేసుకున్న వేదఋషులు త్రికరణశుద్ధిగా జలదేవతను ప్రార్థించిన మంత్రం యొక్క భావం.

ఇంటిలో స్నానం చేస్తున్నా కూడా “గంగేచ యమునే కృష్ణేగోదావరి సరస్వతి" అంటూ ఆ నదులను స్మరిస్తూ చేసే స్నానం వల్ల వచ్చే ఫలాలను అర్షులు ఇలా చెప్పారు.

నదీస్నానం చేస్తే శారీరకంగా కనబడే మాలిన్యం పోతుంది.
నిండు ప్రవాహమున్ననదిలో స్నానం చేయడంవల్ల శరీర మంతటికీ సుఖస్పర్శ కలిగి శరీరంలో ఉష్ణాధిక్యత తగ్గుతుంది.
నడీనీటిలోని చల్లదనం ఇంద్రియతాపాలను తగ్గించి మనస్సుకూ, వాక్కుకూ శుచిత్వాన్ని కలిగిస్తుంది. కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధిస్తుంది.
పుణ్యనదీతీర్థాల్లో చేసే స్నానం మనసుకు ఏకాగ్రతనిస్తుంది.
తీర్థమందు స్నానం చేసినవాడు తనకు సంబంధించిన వారిలో చాలా శ్రేష్ఠమైన వాడవుతాడు.
మహర్షుల యొక్క దీక్షా, తపస్సుల విశేషాలు, శక్తి నదీ జలాల్లో ఉన్నవని వేదం నిర్దేశించింది. కావున నదీస్నానంచే వాటిని మనము స్వీకరించి పవిత్రులమౌతాం.

అందుచేతే నదీజల స్నానం సర్వథా, సర్వదా యోగ్యమని అర్షుల వాక్కు.

భారతదేశంలో పుణ్యనదులకు కొరతేలేదు. పుట్టింది మొదలు మానవులు చేసే పాపాలు విశిష్టదినాల్లో అనగా – పుష్కర సమయంలో, గ్రహణ సమయాల్లోను, మకర సంక్రమణ సమయంలో, కార్తీక, మాఘమాసాల్లో నదీ స్నాన మాచారిస్తే త్రికరణశుద్ధిగా పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి.

గంగానదీ స్నానం అరవైయోజనాల పవిత్ర ప్రదేశం. అరవై పాపాలు హరించే పుణ్యమూర్తి. గంగాద్వారా స్నానఫలం దీనికి రెట్టింపు.
యమునానదీ తీరం ఇరువది యోజనాలు విస్తరించి, ఇరవై రకాల పాపాలు పరిహరిస్తుంది.
సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించి ఇరవైనాలుగు యోజనాలు విస్తరించిన ఈ నది ఇరవై పాపాలు పోగొడుతుంది.
వరుణ, కుశావర్త; శతద్రువు; విపాశక; శరావతి; వితస్త; ఆశిక్ని; మధుమతి; ఘ్రుతవతి; మొదలిఅన నదీతీరాల్ సందర్శనం శుభప్రదం. దేవనడిగా ప్రఖ్యాతమైన ఆ నదీ పరీవాహక ప్రాంతం పదియోజనాలు విస్తరించి; పదిహేను రకాల పాపాలను పోగొడుతుంది. రేవానదీ స్నానం బ్రహ్మ హత్యాపాతకాన్ని నాశనం చేస్తుంది. చంద్రభాగ, రేవతి, సరయు, గోమతి, కౌశిక, మందాకినీ, సహస్త్రవక్ర్త, పూర్ణ, పుణ్య, బాహుదాలనే నదులు పదహారు యోజనాలు విస్తరించాయి. నదీ సంగమ ప్రదేశాల్లో చేసే స్నానం, సంధ్యాదికాలు అనంత పుణ్యఫలాలనిస్తాయి.
గోదావరీతీరం ఆరు యోజనాలు విస్తరించి ఉంది. ఒక్కసారి గోదావరి తీరం చుట్టి వచ్చినవారికి “వాజపేయ” యాగ ఫలం లభిస్తుంది.
భీమేశ్వరం, వంజర సంగమస్థానాలు ప్రయాగాతో సమానం. ద్వాదశ యోజనాలు విస్తరించిన కుశస్థలీనది ముప్ఫై ఆరు పాపాలను, పూర్ణానది యాత్ర ముప్ఫై పాపాలను, కృష్ణవేణి పదిహేను పాపాలను, తుంగభద్ర ఇరవైపాపాలను ప్రక్షాలనం చేస్తాయి.
పంపాసరోవర శక్తి అనంతం. పాండురంగా మాతులింగ, గంధర్వ నగరాలు తీర్థాలతో విలసిల్లుతున్నాయి. రామేశ్వరంలో 108 తీర్థాలు, ఆదివరాహక్షేత్రమైన తిరుమలలో దాదాపు 18 తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలలో స్నానమాచరిస్తే పాపాలు తొలగి పుణ్యఫలం కలుగుతుంది.
మహానది, తామ్రపర్ణి నదుల పుణ్యం వర్ణశక్యముకాదు. కుంభకోణంలో స్నానం సమస్త తీర్థాల సమానం.

కొన్ని సమయాల్లో నదులు, తీర్థాలలో స్నానమాచరించటం నిషేధించటం జరిగింది. రవి కర్కాటకంలో ఉన్న సంక్రమణ సమయం రెండుమాసాలు నదీ రజస్వల సమయం. ఆ సమయంలో నదీస్నానం దోషం. నదీ తీరప్రాంత వాసులకు ఈ దోషముండదు.

నదీ రజస్వల అంటే, కొత్తనీరు రావటమన్న మాట. అప్పుడు స్నానం చేయడం, మహాదోషం. తీర్థసేవన విషయంలో ఇది సాధారణ విషయమైనా, ఈ సమయంలో తీర్థ దర్శనం చేయవలసివస్తే స్నాన, క్షౌర, ఉపవాసాదులు ఆచరించాలి. కాబట్టి “జాగ్రత్త" అని హెచ్చరించారు.

ప్రతి నదీ పాపహారిణే, పుణ్యమూర్తే. నది స్త్రీ రూపం. అందుకే స్త్రీలు పసుపు, కుంకుమ, పువ్వులతో విశేషంగా నదిని పూజిస్తారు.

ప్రతి జీవనడికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. జీవన ప్రదాతలైన నదులకు కృతజ్ఞత చెప్పటం పుష్కరాల ప్రధానోద్దేశం. పెద్దలకు పిండ ప్రదానం చేసి పితృఋణం తీర్చుకోవటం ఒక ధార్మిక, సాంస్కృతిక ప్రయోజనం.

మేషం మొదలైన పన్నెండు రాశులలో బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కో సంవత్సరం ఉంటాడు. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినపుడు గోదావరి నది పుష్కరాలు వస్తాయి. అలాగే కన్యారాశిలో బృహస్పతి ప్రవేశించినపుడు కృష్ణానదికీ పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో నదీస్నానం చేస్తే వెయ్యి గోదానాలు చేసిన పుణ్యం లభిస్తుంది.
Read More

నవ దుర్గాలు

శ్రీ శాంకరీ దేవి

ఈ పీఠం శ్రీలంకలో ఉంది. ఇక్కడ అమ్మవారి కాలి గజ్జెలు పడ్డాయని పురాణాలు చెప్తున్నాయి. ఇది అష్టాదశ పీఠాల్లో ప్రథమ పీఠం. రావణుని స్తోత్రాలకు ప్రసన్నమైన పార్వతీదేవి లంకలో అవతరించింది.రావణుని సీతాపహరణ దోషం వల్ల ఆ తల్లి అంతర్ధాన మైందని తెలుస్తోంది. రావణ సంహారానంతరం తిరిగి లంకలో మహర్షుల చేత ప్రతిష్ఠించబడింది. ఇదీ ఈ శక్తి పీఠం యొక్క పురాణగాథ.

శ్రీ శృంఖలా దేవి

శృంఖలా దేవి శక్తిపీఠం పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి ఉదర భాగం పడిందని ప్రతీతి.త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు.ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖలా దేవిగా మారిందని ఒక గాథ.ఋష్యశృంగుని తపశ్శక్తితరంగాలను ఆది శంకరులు ఆవాహన చేసి శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారు.

శ్రీ చాముండేశ్వరీ దేవి

ఈ శక్తి పీఠం కర్నాటకలోని మైసూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడ్డాయి. మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భవించిన శక్తి స్వరూపం. సముద్రమట్టానికి 3500 కి.మీ. ఎత్తున ఉన్న చాముండీ హిల్స్‌పై ఈ శక్తి పీఠం ఉంది.మైసూరులో ఉన్న ఈ శక్తిపీఠం వద్ద దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయ గోపురం ఏడు అంతస్తులు. ప్రతి గోపురంపై ఒక చాముండేశ్వరి శిల్పం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో ఒక పెద్ద రావిచెట్టు, ఆలయం చుట్టూ విశాలమైన ఖాళీ ప్రదేశం. ఈ దేవాలయానికి సమీపంలోనే నల్లరాతితో మలచిన 16 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు గల నంది విగ్రహం ఉంటుంది. ఈ శక్తిపీఠం సుమారు రెండువేల సంవత్సరాల నాటిదని చెబుతారు.

ఈ శక్తి పీఠంలో అమ్మవారు దుష్ట సంహారిణిగా, మంగళదాయినిగా, జగన్మాతగా, చాముండేశ్వరిగా కొలువైవుంది. మనదేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగోదిగా ప్రసిద్ధికెక్కిన చాముండేశ్వరి ఆలయ ప్రాంగణంలోనే గణపతి, శివలింగం, ఆంజనేయస్వామి ఉపమందిరాలు భక్తులను ఆకట్టుకుంటాయి.దేవాలయ ప్రాంగణంలోని రావిచెట్టుకు భక్తులు కుంకుమ పూజలు చేస్తుంటారు. కాళిక, దుర్గ, చాముండీమాతల కలయికగా భక్తులకు దర్శనమిచ్చే చాముండేశ్వరి అనుకున్న కార్యాలను విజయవంతం చేస్తుందని భక్తుల విశ్వాసం. మైసూరు రాజుల ఇష్టదైవమైన ఈ ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా చేస్తుంటారు. ఈ ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు.

ఆలయ చరిత్ర:

ప్రాచీన కాలంలో ఈ ప్రాంతానికి క్రౌంచపట్టణమని పేరుండేది. అశోకుని కాలంలో ఈ ప్రాంతాన్ని మహిషాసుర మండలమని పిలిచేవారు. ఆధునిక కాలంలో మైసూర్‌ ప్రాంతాన్ని పరిపాలించిన వడయార్‌ (రాజవంశరాజు) ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. 1895-1940 కాలంలో ఈ దేవాలయం బాగా అభివృద్ధి చెందింది. ఆ కాలంలో చాముండేశ్వరి ఆలయం అత్యంత సుందరమైన ఆలయంగా రూపొందింది.

పురాణగాథ: పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సుచే పురుషుల చేతుల్లో మరణించకూడదని పరమేశ్వరుని నుంచి వరాన్ని పొందుతాడు. ఆ వరం పొందిన గర్వంతో సకలలోకాలను పీడించాడు.ఇంద్రుని జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు. భయభ్రాంతులైన సకలలోకవాసులు త్రిమూర్తులను వేడుకోగా, మహిషాసురుని వధించుటకై ఒక స్ర్తీశక్తిని సృష్టిస్తారు. ఆ శక్తి స్వరూపిణియే చాముండేశ్వరి. 18 చేతులతో ప్రతిచేతిలో ఒక ఆయుధంతో ఆ తల్లి దర్శనమిస్తుంది.

ముందుగా చండ, ముండ అనే రాక్షసులను సంహరించిన తర్వాత మహిషాసురుని వధించి మహిషాసురమర్దినిగా సకలలోక వాసుల కీర్తనలను అందుకుంటుంది. చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళే మార్గంలోనే మహిషాసురుని విగ్రహం ఉంది.ఒక చేతిలో కత్తితో, మరొక చేతిలో పడగవిప్పిన పాముతో ఈ శిల్పం భయంకరంగా కనిపిస్తుంది. మహిషాసురుని వధించిన ఈ శక్తిమాతను దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా సకల సంపదలు, వ్యాపారాభివృద్ధి, ఆయురారోగ్యాలను చాముండేశ్వరి ప్రసాదిస్తుందని విశ్వాసం.

శ్రీ కామాక్షీ దేవి

ఈ పీఠం తమిళనాడులో ఉంది. ఇది అమ్మవారి వీపు భాగం పడిన చోటు. కాత్యాయనమహర్షి తపస్సు చేసి గౌరీదేవిని కూతురుగా పొందాలని వరం కోరుకున్నాడు. కామాక్షి ఏకామ్రనాథుని అర్చించి కంచిలో వెలసింది. కాంచి అంటే వడ్డాణం. భూమికి వడ్డాణం స్థానంలో కంచి ఉందిట. ఇక్కడ విభిన్నాకారాలతో ఆకులు ఉండే ఒక మామిడి చెట్టు ఉంది. ఒక్కొక్క కొమ్మకు ఒక్కో రుచి ఉన్న పండు కాస్తుందని చెబుతారు.

పార్వతిదేవి కంచి పట్టణంలో కామాక్షిగా పూజలు అందుకొంటున్న ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైనది.ఆదిశంకరులు ఇక్కడ ఉన్న కామాక్షి దేవికి పూజలు జరిపారు. మధుర మీనాక్షి, తిరువనైకవల్‌లో ఉన్న అఖిలాండేశ్వరి, కాశీలో ఉన్న విశాలాక్షి దేవాలయాలవలే ఈ కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది.కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరిస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింది హస్తాలతో చెఱకుగడ, తామర పుష్పాన్ని, చిలుకను... పై చేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది.

కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు. కామాక్షివిలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించి మన్మధునిలో ఆవహింపజేస్తుందని, మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండటం వల్ల ఈ అమ్మవారు సృష్టిలోఉండే అన్ని శక్తులమీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు. కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రిందమట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠచేసి ఈశ్వరుని పాణి గ్రహణం చేసిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు చాల ఉగ్రతతో ఉండి బలులు తీసుకొంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించే శ్రీచక్రాన్ని ప్రతిిష్ఠించారట.

శ్రీ మహాలక్ష్మీ దేవి

ఈ పీఠం మహారాష్టల్రోని కొల్హాపుర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి మూడు కళ్ళు పడ్డాయి అని చెప్పుతారు.మహాలక్ష్మి అనే పేరు ఉండడం మూలంగా ఈ అమ్మవారిని శ్రీ మహావిష్ణువు భార్య అని అనుకుంటారు.కానీ, ఈమె విష్ణుపత్ని కాదు. 18 భుజాలతో రజోగుణంతో భాసిల్లుతున్న మహాశక్తి. ఇక్కడ అమ్మవారి పాదాలపై ఏడాదికి మూడుసార్లు సూర్యకిరణాలు పడతాయి. అలా సూర్యకిరణాలు పడే రోజులలో కిరణోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

పంచగంగ నది ఒడ్డున కొల్హాపూర్‌ నగరం ఉంది. కొల్హాపూర్‌ దేవాలయాన్ని క్రీస్తు శకం ఏడో దశాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య రాజు కరణ్‌ దేవ్‌ కట్టించారు. ఆ తరువాత 9వ శతాబ్దంలో యాదవ రాజు వంశానికి చెందిన షిలాహార యాదవుడు మరింత అందంగా దేవాలయాన్ని తీర్చిదిద్దటానికి కృషిచేశాడు.దేవాలయంలో లోపల మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం స్వయం వ్యక్తమని ప్రజలు భావిస్తారు. అమ్మవారికి అర్చకులు ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు.

ఈ మహాలక్ష్మి దేవాలయం

హేమాడ్‌ పంతి నిర్మాణశైలిలో కట్టబడినది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది.ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాసృష్టి అని చెప్పవచ్చు.ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు వందడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం వుంది. గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది.

మహారాష్ట్రీయులకు కొల్హాపూర్‌ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని అంబాబాయి అని పిలుస్తారు.ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా ఐదు కి.మీ. దూరంలో ఉన్న తెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు.ఇదిగాక చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది.

శ్రీ గిరిజా దేవి
ఒరిస్సాలో వైతరణీనదీతీరంలో జాజ్‌పూర్‌ రోడ్డుకు 20 కి. మీ.దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. ఇది అమ్మవారి నాభి భాగం పడిన చోటుగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. ఇక్కడి గిరిజాదేవి సింహవాహనగా కనిపిస్తుంది. అమ్మ వారు ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని దర్శనమిస్తుంది. ఈమె శక్తి త్రయరూపిణి.

శ్రీ ఏకవీర్యకా దేవి

ఈ శక్తి పీఠం మహారాష్టల్రోని నాందేడ్‌ జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరంలో దత్తాత్రేయుని జన్మక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహోర్‌లో ఉంది. ఇది అమ్మవారి కుడి హస్తం పడిన చోటు. ఇక్కడ అమ్మవారి శిరస్సు మాత్రమే దర్శన మవుతుంది. ఇక్కడ మూడు కొండలు ఉన్నాయి. ఒక దానిపై అత్రి- అనసూయలు, రెండవ దానిపై దత్తాత్రేయుడు, మూడవ దానిపై ఏకవీరికా దేవి ప్రతిష్ఠితిమయ్యారు. అమ్మవారి ముఖం గర్భాలయపు పై కప్పునుతాకేంత పెద్దదిగా ఉంటుంది. జమ దగ్ని రేణుకా దంపతులకు చెందిన కథ ఇక్కడ జరిగిందని చెపుతారు. పరశురాముని చేత ఖండితమైన తల్లి శిరస్సే ఈ దేవత. ఈ తల్లినే ఛిన్నమస్త అని కూడా అంటారు.

శ్రీ మహంకాళీ దేవి

ఈ శక్తిపీఠం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. ఇది అమ్మవారి పై పెదవి పడిన చోటు. విక్రమార్క మహారాజు చరిత్ర ఉజ్జయినితో ముడిపడిఉంది. ఇక్కడి నది సిప్ర. కుజునికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. భూమినుంచి కుజుడు విడిపోయిన ప్రాంతం ఇది అని జ్యోతిషశాస్తవ్రేత్తలు చెపుతున్నారు. కుజుడు అంటే భూమికి జన్మించిన వాడని అర్థం. ఇక్కడ త్రిపురాసురుణ్ని వధించిన మహాకాలుని ఆలయం ఉంది. ఆ స్వామికి ఆధారమైన శక్తి మహంకాళి. ఆ మహంకాళి శక్తి పీఠం ఇది. ఈ ఆలయాన్ని గర్‌ కాళికా అని కూడా పిలుస్తుంటారు. దేవీ మాతలందరిలో కాళికామాతకు ఎనలేని ప్రాధాన్యముంది. ప్రాచీన భారతీయ కవులలో అగ్రగణ్యుడైన కాళిదాసు సైతం కాళికా దేవి భక్తుడని చెబుతుంటారు.

పురాణాల ప్రకారం కాళిదాసు నిత్యం కాళీమాతను పూజించేవాడు. గర్‌ కాళిక ఆశీర్వాదం వల్లే అతడికి అపూర్వమైన కవితాశక్తి అబ్బింది. కాళికా మాతను పూజించడానికి శ్యామలా దండకం పేరిట జగత్ప్రసిద్ధమైన స్తోత్రాన్ని కాళిదాసు రచించాడు. ఉజ్జయినిలో ప్రతి ఏటా నిర్వహించే కాళిదాస్‌ సమారోహ్‌ కార్యక్రమంలో ఈ దండకాన్ని పఠిస్తుంటారు. ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తులు ఈ గర్‌ కాళిక ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారనే విషయం ఎవరికీ తెలీదు కానీ మహాభారత కాలంలో నిర్మించారని ప్రజల నమ్మకం. అయితే మహా భారత కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించిన ప్పటికీ కాళికామాత విగ్రహం మాత్రం సత్య యుగానికి చెందినదని చెబుతుంటారు. హర్ష వర్ధన రాజు హయాంలో ఈ ఆలయానికి మరమ్మతులు చేసి పునరుద్ధరించినట్లు ఆధారాలు ఉన్నాయి. తర్వాత
చాలాకాలానికి గ్వాలియర్‌ రాజు ఈ ఆలయానికి తిరిగి మరమ్మతులు చేయించారు. సంవత్సరం పొడవునా ఇక్కడ అనేక ఉత్సవాలు జరుగుతుంటాయి కాని,నవరాత్రులలో మాత్రం భారీస్థాయిలో ఉత్సవాలు నిర్వహించబ డతాయి. మతపరమైన యజ్ఞాలు, పూజలు కూడా నవరాత్రుల సమయంలో ఇక్కడ భారీ స్థాయిలో నిర్వహించబడతాయి.

శ్రీ మాధవేశ్వరీ దేవి

ఈ పీఠం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌లో ఉంది. అమ్మవారి హస్తాంగుళి పడిన చోటుగా ఈ స్థలాన్ని చెబుతారు. బ్రహ్మదేవుడు ఇక్కడ వరుసగా ఎన్నో గాయాలు చేసినందున ప్రయాగగా మారింది. ఈమెను కృతయుగంలో బృహస్పతి అమృతంతో అభిషేకించాడని పురాణాలు చెబుతున్నాయి.అమృతతీర్థం అని అంటారు. త్రేతాయయుగంలో రాముడు, ద్వాపరంలో శ్రీకృష్ఱుడు ఈ తల్లిని పూజించారు. సూర్యుడు పూజించడం వలన ఈ క్షేత్రాన్ని భాస్కరక్షేత్రం అని కూడా పిలుస్తారు.ఈ తల్లి శక్తిత్రయస్వరూపిణి.

శ్రీ సరస్వతీ దేవి

కాశ్మీర్‌లో శ్రీనగర్‌కు 40 కి.మీ. దూరంలో తుళుముల ప్రదేశంలో ఈ శక్తి పీఠం ఉంది.అమ్మవారి దక్షిణ హస్తం పడిందని చెబుతారు. సరస్వతీ దేవిని కీరవాణి అని పిలుస్తారు.పార్వతీపరమేశ్వరులు విశ్వకర్మతో అందమైన ఇల్లు కట్టించుకుని గృహప్రవేశానికి సిద్ధ్దమౌతారు. శివభక్తుడైన రావణుని పురోహితునిగా నియమిస్తారు. గృహప్రవేశం పూర్తయిన తరువాత దక్షిణ కోరుకొమ్మంటుంది పార్వతీదేవి. ఆ ఇంటినే తనివ్వమంటాడు రావణుడు. ఆడిన మాట తప్పలేక ఇచ్చేస్తుంది పార్వతీదేవి. తన పుట్టింటికి బాధపడుతూ వెళుతుంది. దారిలో సరస్వతి కనిపించి తన ను ఓదారుస్తుంది. వారిద్దరూ కలిసిన ప్రదేశమే ఈ శక్తి పీఠం. ఈ ఆలయం చెరువులో ఉంటుంది.

శ్రీ కామ రూపా దేవి

అస్సాం గౌహతి సమీపంలోనీ నీలాచలపర్వతశిఖరం పై ఈ శక్తిపీఠం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది ఆషాఢమాసంలో స్రవించే జలధార ఎర్రగా మారుతుంది. అది స్ర్తీత్వానికి ప్రతీక అంటారు. పరశురాముని మాతృ హత్యాదోషాన్ని ఈ తల్లి పోగొట్టిందని, శివుని కంటి మంటకు దహనమైన మన్మథుణ్ని జీవింపచేసిన తల్లిగా ఈమె ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ అమృతేశ్వర్‌, కోటిలింగ, సిద్ధేశ్వర, కామేశ్వర శివాలయాలున్నాయి.

శ్రీ మాంగళ్య గౌరీ దేవి

ఈ పీఠం బీహార్‌లోని గయలో ఉంది. అమ్మవారి వక్షోజాలు ఇక్కడ పడ్డాయని చెబుతారు. తనను తాకిన ప్రతి జీవికీ మోక్షం వచ్చేలా విష్ణుమూర్తి వరం పొందిన గయాసురుడు పర్వతాకారంలో ఉన్న ప్రాంతమిది. గయాసురుడు శరీరాన్ని విపరీతంగా పెంచి అందరికీ మోక్షాన్ని ఇచ్చే సందర్భంలో, అతని శరీరం పెరగకుండా ధర్మవతశిలను అతని శిరస్సుపై ఉంచి, దాని పైకి విష్ణువును ఆవాహన చేసినట్లు ఒక పురాణగాథ ఉంది. విష్ణుమూర్తి సహోదరియైైన మాంగల్యగౌరి ఈ క్షేత్రరూపిణి. శ్రాద్ధకర్మలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి.

శ్రీ విశాలాక్షీ దేవి

ఈ పీఠం ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో ఉంది. ఇది అమ్మవారి మణికర్ణిక పడిన చోటు. కాశీలో 1500 ఆలయాలకు పైగా ఉన్నాయి. శివుని కన్నులు మూసి లోకాన్ని చీకటి చేసిన పాపానికి నల్లగా మారిన గౌరి, అన్నదాన పుణ్యంతో తిరిగి బంగారు వర్ణంలోకి మారిన క్షేత్రం కాశి. వ్యాసునికి కడుపార భోజనం పెట్టిన తల్లి అన్నపూర్ణ తిరుగాడిన క్షేత్రం కాశి. హిమాలయాలపై ఉండడం ఇష్టం లేక తన కోసం నిర్మించుకున్న పట్టణం కాశి. శివుని వైభవాన్ని విశాల నేత్రాలతో చూసిన తల్లి శక్తిపీఠంగా వెలిసింది విశాలాక్షి పీఠం.

అయోధ్య, మధుర, హరిద్వార్‌, కాంచీపురం, కాశీ, ఉజ్జయిని, ద్వారక సప్త మోక్ష ప్రదాయికాల్లో కాశీక్షేత్రం శ్రేష్టమైనది. ఈ పుణ్యస్థలంలో మహావిష్ణువు ముక్కంటిని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఓసారి సూర్యభగవానుడు ఆకాశ మార్గాన వెళ్తుండగా, మహావిష్ణువు కాశీలో శివ లింగపూజలో ఉండటం గమనిస్తాడు. ఉమాపతి కొలువైన ఈ పుణ్యస్థలంలో పూజలు చేస్తే అత్యంత పుణ్య ఫలం లభిస్తుం దని మహావిష్ణువుచే తెలుసుకుని ఆదిత్యుడు ఆ ప్రాంతంలో లింగాన్ని స్థాపించి పూజించ సాగాడు. మహావిష్ణువు మాత్రమే కాకుండా, సృష్టికర్త బ్రహ్మ కూడా ఈశ్వరుని వేడు కుంటూ పది అశ్వమేధయాగాలు చేశాడు.

ఈ దశాశ్వ మేథఘాట్‌కు ఇప్పటికీ బ్రహ్మదేవుడు పూజలు చేస్తుంటాడని ప్రతీతి. అటువంటి ఈ పుణ్యస్థలిలో భక్తులను బ్రోచే జగన్మాత విశాలాక్షిగా కొలువైంది. ఈ శక్తిపీఠంలో విశాలాక్షి గర్భాలయంలో రెండు రూపాలతో దర్శనమిస్తుంది. ఒకరూపం స్వయంభువు. మరొక రూపం అర్చామూర్తి. మనం ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా అర్చామూర్తిని, పిమ్మట స్వయంభువును దర్శించుకోవాలి. పసుపు కుంకుమలతో ప్రకాశిస్తూ, పుష్పమాలాలంకృతురాలైన ఆమెను భక్తులు మనసారా పూజిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వాసం.

శ్రీ వైష్ణవీ దేవి

హిమాచలప్రదేశ్‌లో పఠాన్‌కోటలో జ్వాలా ముఖి రైల్వే స్టేషన్‌కు 20 కి.మి.దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. అమ్మవారి శిరస్సు పడిన చోటిది. జమ్మూలో కాట్రా వద్ద ఉన్న వైష్ణోదేవి ఆలయాన్ని శక్తిపీఠంగా చెపుతారు. భైరవనాథుడు అనే తాంత్రికుని బారి నుండి విష్ణుభక్తురాలైన ఒక బాలిక తప్పించుకుని, అతని తం త్రాలను తిప్పికొట్టిన కథ ప్రచారంలో ఉంది. ఈమెను వైష్ణవ దేవి అని పిలుస్తారు.
Read More

హోమం విశిష్టత

హోమం విశిష్టత

ప్రతి మనిషికీ ఎంతోకొంత స్వార్థం ఉంటుంది. నిజమే కానీ, కేవలం మన కోసమే మనం బ్రతకడంలో అర్ధం లేదు. తోటివారి శ్రేయస్సును కూడా కొంచెం దృష్టిలో ఉంచుకోవాలి. అందరూ బాగుంటేనే, మనమూ బాగుంతామని గుర్తించి, గుర్తుంచుకోవాలి. మహర్షులు ఎన్నో సందర్భాలలో 'పరోపకారార్థమిదం శరీరమ్' అని చెప్పారు. చెప్పడమేకాదు, ఆచరణాత్మకంగా చేసి చూపించారు. బహుశా అందుకే కావచ్చు మహర్షులకు వాక్ శుద్ధి వుండేది. వారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల కోసం ఎంతో కొంత చేసేవారు.

మహర్షులు మాట్లాడేది తప్పకుండా జరిగేది. సత్ప్రవర్తన, సత్యవాక్కుల మహత్తు అది. మహర్షులు వివిధ ప్రయోజనాల కోసం రకరకాల హోమాలు చేసేవారు. తమ ఆశయాలను నేరవేర్చుకునేవారు. ఇక్కడ గమనించవలసింది ఏమంటే మహర్షుల కోరికలన్నీ నేరుగా కానీ, అంతర్గతంగా కానీ ప్రజల కోసమే ఉద్దేశించి వుండేవి. అంటే లోక కళ్యాణం కోసం అన్న మాట!

ఆమధ్య శ్రీశైలం దగ్గర జరిగిన హోమం సందర్భంగా ఆకాశంలో పెను పరిమాణంలో పెద్ద శిల నదీ జలాల్లో పడటం, జాలరులు తాటి చెట్టు ఎత్తున పైకి లేవటం పేపర్లలో కూడా వచ్చింది. హోమాల్లో ఎన్నో రకాల సమిధలు వాడవలసి వుంటుంది. ఒక్కో సమిధ ఒక్కో గ్రహానికి సంబంధించినదై వుంటుంది. అంటే అన్ని గ్రహాలూ సమతుల్య స్థితిలో వుంటేనే సృష్టి సక్రమంగా వుంటుంది.

కొన్నిసార్లు వాతావరణం సానుకూలంగా ఉండదు. వ్యాధులు సోకటం, వర్షాలు సక్రమంగా పడకపోవటం లాంటివి జరుగుతాయి. ఏ ఒక్క గ్రహానికి సంబంధించిన శక్తి (ఎనర్జీ) భూమిమీద తక్కువగా వున్నా అసమతుల్యతలు ఏర్పడతాయి. అందుకే ఆయా గ్రహాలకు సంబంధించిన మూలికలు, ధాన్యాలతో, ఇతర వస్తువులతో హోమం చేస్తారు. స్థూలంగా ఇదీ హోమం చేయటంలో ఉద్దేశ్యం.

హోమ ఫలాలు సమిష్టిగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా అందుకునే విధంగా జ్యోతిష్యవేత్తలు కొన్ని సూచనలు చేశారు. ఎవరైనా ఒక వ్యక్తిపై నవగ్రహాలలో ఏదో ఒక గ్రహ ప్రభావం తక్కువగా వుంటే దానికి సంబంధించిన రంగంలో లేదా విషయంలో ఆ వ్యక్తికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఏ వ్యక్తి అయితే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంట్లో హోమం చేయిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. సూర్య గ్రహ ప్రభావం బాగా తగ్గిపోయి, అదే సమయంలో ఇతర గ్రహాలు కూడా అననుకూలంగా మారితే, ఆ వ్యక్తి అకాల మృత్యువాతన పడవచ్చు లేదా ఆరోగ్య పరంగా తీవ్ర నష్టం జరగవచ్చు. దీనిని నివారించేందుకు సూర్యగ్రహానికి సంబంధించిన శాంతి చేయమని సూచిస్తారు.

తరచుగా హోమాలను చేసినట్లయితే ఏ రకమైన ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురుకావు. హోమాలలో రకరకాల మూలికలు వాడతారు. శని గ్రహం అనుకూలత కోసం శమీ వృక్ష సమిధను, రాహువు కోసం గరిక ఉపయోగిస్తే, సూర్యానుగ్రహం కోసం అర్క సమిధను ఉపయోగిస్తారు. కేతు గ్రహ ఉపశాంతికోసం దర్భను ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుంది.

శరీరంలో ఉత్పన్నమయ్యే వివిధ రకాల దోషాలను పోగొట్టగలిగే శక్తి ఈ మూలికకు వుంది. అలాగే చంద్రగ్రహ శాంతి కోసం మోదుగను వాడతారు. అటు వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు వుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రావి చెట్టు కలపను గురు గ్రహోపశాంతి కోసం ఉపయోగిస్తారు.ఇది వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో వుంది.

హోమంవల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి. పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుందని అర్థం అవుతుంది. మరో ముఖ్య సంగతి ఏమంటే, హోమ క్రమం గురించి క్షుణ్ణంగా తెలిసినవారు హోమం చేస్తేనే హోమ ఫలం అందుతుంది
Read More

పితృ తర్పణము --విధానము

పితృ తర్పణము --విధానము

శ్రీః

శ్రీమతే వేద పురుషాయ నమః

పితృ దేవతలకు శ్రాద్ధం చేసినపుడు , తర్పణము కూడా అందులో భాగం గా చెయ్యాలి. దీనిని చదివి , బ్రాహ్మణుడు దొరకకున్ననూ , ఎవరికి వారు తర్పణము చేయవచ్చును

తర్పణము అర్థము , అవసరము , ప్రాశస్త్యము వంటి వాటి గురించి వేరొక చోట వ్రాయుచున్నాను )

ముగ్గురు పితృ దేవతలను బ్రాహ్మణులలో ఆవాహన చేసి కూర్చోబెట్టి చేసే శ్రాద్ధాన్ని ’ పార్వణ శ్రాద్ధం ’ లేక ’ చటక శ్రాద్ధం ’ అంటారు..కొన్ని సాంప్ర దాయాలలో బ్రాహ్మణులు లేకుండా కేవలము కూర్చలలో పితృదేవతలను ఆవాహన చేస్తారు ..
.తగిన కారణము వలన అది కూడ వీలు కానప్పుడు క్లుప్తముగా చేసే శ్రాద్ధాలు... దర్శ శ్రాద్ధము , ఆమ శ్రాద్ధము , హిరణ్య శ్రాద్ధము.

ఆ పద్దతి ముందుగా ఇచ్చి , తదుపరి తర్పణ విధి వివరించడమయినది..

దర్శాది హిరణ్య / ఆమ శ్రాద్దం

పుణ్య కాలే | దర్భేషు ఆశీనః | దర్భాన్ ధారయమాణః | ఆచమ్య , పవిత్ర పాణిః ప్రాణానాయమ్య |
ఓం భూః ..ఓం భువః...ఓగ్ం సువః.. ఓం మహః.. ఓం జనః.. ఓం తపః.. ఓగ్ం సత్యం..| .....ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ |

ఓమాపోజ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

సంకల్ప్య || శ్రీగోవింద గోవింద......దేశకాలౌ సంకీర్త్య , .అస్యాం పుణ్య తిథౌ

| ప్రాచీనావీతి |

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం ... ----- గోత్రాణాం. .. ------ , -------- , ------ శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం , ------- , --------- ,-------దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,
అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ... ------ గోత్రాణాం , --------, ---------- , --------- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం ,
--------, ------------ , --------------- దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం , అమావాస్యా పుణ్యకాలే ( సంక్రమణ పుణ్యకాలే ,/ సూర్యోపరాగ పుణ్యకాలే / సోమోపరాగ పుణ్యకాలే / వస్వాది పుణ్యకాలే ) దర్శ శ్రాద్ధం ../ .. ఆమ శ్రాద్ధం హిరణ్య రూపేణ అద్య కరిష్యే | తదంగ తిల తర్పణం చ కరిష్యే |

దక్షిణతో దర్భాన్ నిరస్య | అప ఉపస్పృశ్య |

హిరణ్య శ్రాద్ధం |

అమావాస్యా పుణ్యకాలే అస్మిన్ మయా క్రియమాణే హిరణ్యరూప దర్శ శ్రాద్ధే , ఏక బ్రాహ్మణ సంభవే వర్గ ద్వయ పితృణాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( అనేక బ్రాహ్మణ పక్షే పృథక్ వరణం కుర్యాత్ )
తాంబూలం , హిరణ్యం చ గృహీత్వా ||

|| హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసోః |
అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయఛ్చ మే ||

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం | -------- గోత్రాణాం. .. -------- , --------- , --------- శర్మణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ... --------- గోత్రాణాం , --------- , ---------, --------దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ... ------- గోత్రాణాం , ---------, -------- , ---------- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం ... -------- గోత్రాణాం ,

-------- , ---- , --------- దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం ,దర్శ శ్రాద్ధ ప్రత్యామ్నాయం యద్దేయం అన్నం తత్ ప్రతినిధి హిరణ్యం వర్గ ద్వయ పితృ ప్రీతిం కామయమానః తుభ్యమహం సంప్రదదే | నమమ | ఓం తత్ సత్ |

ఉపవీతి |

ప్రదక్షిణం |

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

నమస్కారః

ప్రాచీనావీతి | వర్గ ద్వయ పితృభ్యో నమః | స్వామినః మయా కృతేన హిరణ్య రూప దర్శ శ్రాద్ధేన మమ వర్గ ద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసురితి భవంతోను గృహ్ణంతు | ఇతి ప్రార్థ్య |

( యజమానస్య వర్గద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసుః ఇతి బ్రాహ్మణాశీర్వాదః )

తర్పణమ్

దీనికి ఇచ్చిన బొమ్మ చూడుడు ...దర్భలతో కూర్చలు చేసుకొన వచ్చును .

పితృ దేవతల ప్రీతి కొరకు అర్పించే తిలాంజలినే ’ తర్పణం ’ అంటారు..

ముఖ్య గమనిక :

ఇంటి లోపల తిల తర్పణము నిషిద్ధము..ఇంటి బయట ఆవరణలో గానీ , బాల్కనీ లో గాని లేదా తులసి కోట దగ్గరగానీ తర్పణము ఆచరించవచ్చును..

తండ్రి బ్రతికి ఉన్న వారు తర్పణము ఆచరించరాదు..సజీవులు గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి మాత్రమే తర్పణము ఇవ్వాలి.

అమావాశ్య , గ్రహణ కాలము , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలాలు , ఆయనములు , సంక్రమణ కాలములందు తర్పణాలు ఇవ్వాలి. అప్పుడు ద్వాదశ పితృ దేవతలకు మాత్రము తర్పణం ఇవ్వాలి అనేది కొందరి మతము. అయితే , సాధారణ సంక్రమణము మరియు అమావాశ్యలందు ద్వాదశ పితృ దేవతలకు , మిగిలిన కాలాలలో సర్వే పితృ తర్పణము చెయ్యడము వాడుక లో ఉంది... వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి చేయవచ్చును..

మహాలయ పితృ పక్షమునందు మరియు పుణ్య క్షేత్రములందు సర్వ పితృ దేవతలకూ తర్పణం వదలాలి. మహాలయ పక్షము నందు ఆయా తిథులలో మరణించిన పితృ దేవతలకు ఆయా రోజుల్లో తర్పణం వదలవచ్చు.

తిథులు తెలియని యెడల , అందరికీ అన్ని రోజులూ తర్పణం వదలవచ్చు. అది వీలు కానిచో , కనీసం అమావాశ్య రోజైనా అందరికీ తర్పణం ఇవ్వాలి.. వారి వారి శక్త్యానుసారం చెయ్యవచ్చును.

తర్పణము ఇచ్చునపుడు , మొదట సంబంధము ( మాతుః ... పితుః... మాతులః.. ఇలా ) , తరువాత వారి పేరు , గోత్రము చివర పితృదేవతారూపము ( వసు , రుద్ర , ఆదిత్య.... ఇలా ) చెప్పి వదలవలెను..

ఆడవారు సుమంగళి అయిన ’ దేవి ’ అని , కానిచో ’ కవీ ’ అని చెప్పి ఇవ్వాలి.

మాతృ , పితామహి , ప్రపితామహి...ఈ మూడు వర్గాలు తప్ప మిగిలిన స్త్రీలందరికీ ఒక్కొక్కసారి మాత్రమే తర్పణం వదలాలి..

మిగిలినవారికి , వారి వారి సూత్రానుసారముగా చెప్పినటువంటి సంఖ్యలో తర్పణం ఇవ్వాలి...

ఇతర నియమాలు

తర్పణము ఇచ్చునపుడు కుడి చేతి ఉంగరపు వేలికి మూడు దర్భలతో చేసిన పవిత్రం ధరించాలి.

తర్పణానికి ఉత్తమమైన కాలము సుమారు మధ్యాహ్నము 12 గంటలకు . తర్పణము వదలు నపుడు ప్రాచీనావీతి గా ఉండి జంధ్యమును కుడి భుజం పై వేసుకొని ( అపసవ్యము ) ఎడమచేతిలో నీటి పాత్ర పట్టుకొని , కుడి చేతిలో నువ్వులు ఉంచుకుని , చూపుడు వేలు , బొటన వేలు మధ్యనుండి ( పితృ తీర్థం లో ) నీరు , తిలలు వదలాలి
తర్పణము ఈ కింది సందర్భాలలో ఆచరించవచ్చు..

అమావాశ్య మరియు సాధారణ సంక్రమణ కాలములందు

గ్రహణ , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలములలో , దక్షిణాయన , ఉత్తరాయణ పుణ్య కాలాలలోను , మహాలయ పితృ పక్షం లోనూ , మరియు తీర్థ క్షేత్రములకు వెళ్ళినపుడు...
ఒకేసారి , ఒకే రోజు రెండు కారణాలవలన రెండు సార్లు తర్పణము ఇవ్వరాదు..ఒకే తర్పణము ఇవ్వాలి..ఉదాహరణకి ,

అమావాశ్య , సంక్రమణము ఒకే రోజు వస్తే , అమావాశ్య తర్పణము మాత్రము ఇవ్వాలి.
దక్షిణాయన / ఉత్తరాయణ పుణ్య కాలాలు అమావాశ్య రోజున వస్తే , ఆయన పుణ్యకాలం లో మాత్రము తర్పణము ఇవ్వాలి..

గ్రహణము , మరియు దక్షిణ / ఉత్తర పుణ్యకాలాలు ఒకరోజే వస్తే , గ్రహణ నిమిత్తం మాత్రం తర్పణం ఇవ్వాలి. ఉత్తరాయణ పుణ్య కాలము , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాలు ఒకే రోజు వస్తే , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాల తర్పణం ఇవ్వాలి..

చంద్ర గ్రహణమైతే గ్రహణ మధ్య కాలము దాటిన తర్వాత , సూర్య గ్రహణమైతే గ్రహణ మధ్య కాలానికన్నా ముందుగాను , తర్పణము ఇవ్వాలి.

సంక్రమణమైతే , పుణ్యకాలంలో ఇవ్వాలి..

విధానము

ప్రాగగ్రాన్ దర్భాన్ ఆస్తీర్య | తేషు దక్షిణాగ్రౌ ద్వౌ కూర్చౌ నిధాయ | ( మూడు దర్భలను బొమ్మలో చూపినట్టు , కొనలు తూర్పుకు వచ్చేలా ఒకదానికొకటి సమాంతరం గా పరచాలి... వాటిపైన రెండు కూర్చ లను , దక్షిణానికి కొనలు వచ్చునట్లు పరచాలి.)

కూర్చలను చెయ్యడానికి : రెండేసి దర్భలను తీసుకుని పైనుంచి ( కొనలనుంచి ) ఆరంగుళాలు వదలి మడవాలి, మడిచినచోట ఒక వృత్తం లాగా చేసి, రెండు సార్లు కొనలను దర్భల చుట్టూ తిప్పి వృత్తం లోనించీ అవతలికి తీసుకొని ముడి వెయ్యాలి. తర్వాత ,

ఆచమనము చేసి , పవిత్రము ధరించి , తర్వాత ప్రాణాయామము చేసి , సంకల్పము ఇలా చెప్పాలి

సంకల్పము : ( దేశకాలౌ సంకీర్త్య ) శ్రీ గోవింద గోవింద మహా విష్ణురాజ్ఞయా ప్రవర్ధమానస్య , అద్య బ్రహ్మణః , ద్వితీయ పరార్థే , శ్వేత వరాహ కల్పే ,

వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరత వర్షే , భరత ఖండే , రామ క్షేత్రే , బౌద్దావతారే ,

అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానేన , ప్రభవాది షష్టి సంవత్సరణాం మధ్యే , శ్రీ ------నామ సంవత్సరే ( సంవత్సరం పేరు ) , -----ఆయనే ( ఆ కాలపు ఆయనము పేరు ) , ........ఋతౌ ( ఋతువు పేరు ) , ..... మాసే ( మాసపు పేరు ) , .....పక్షే (శుక్ల .. లేక కృష్ణ పక్షము) ,....తిథౌ ( ఆనాటి తిథి పేరు )..... వాసరే ( ఆనాటి వారము.. భాను ( ఆది ) / ఇందు ( సోమ ) / భౌమ ( మంగళ ) / సౌమ్య ( బుధ ) / బృహస్పతి ( గురు ) / భార్గవ ( శుక్ర ) / స్థిర ( శని ) ....

విష్ణు నక్షత్ర , విష్ణుయోగ , విష్ణు కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్య తిథౌ

ప్రాచీనావీతి ( జంధ్యము అపసవ్యము గా వేసుకొనవలెను..)
అస్మత్ పిత్ర్యాది ద్వాదశ పితౄణాం అక్షయ పుణ్య లోకావాప్త్యర్థం అమావాశ్యాయామ్ / సంక్రమణ పుణ్య కాలే...
( లేక , సూర్యోపరాగ / చంద్రోపరాగ / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచ మహాఽపర పక్షేషు అస్మిన్ పితృ పక్షే సకృన్మహాలయే / గంగా కావేరీ తీరే .....

ఇలా ఏది సందర్భోచితమో దాన్ని చెప్పి )

శ్రాద్ద ప్రతినిధి సద్యః తిల తర్పణమ్ ఆచరిష్యే...
( కింద చెప్పిన విధముగా , తిలోదకాలతో వారి వారి పేరు , గోత్రము , రూపము చెప్పి తర్పణము ఇవ్వాలి..)
మొదట పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.మనకు కుడి వైపున ఉన్న మొదటి కూర్చ లో తండ్రి వైపు పితృ దేవతలను , ఎడమ వైపున ఉన్న రెండో కూర్చలో మాతృ వర్గపు పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.
ప్రథమ కూర్చే ..
|| ఆయాత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |
ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే....--------- గోత్రాన్. .. ---------( తండ్రి పేరు ) , .........తాతయ్య పేరు , ........ముత్తాత పేరు శర్మాణః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ , అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహాన్ ,

-------- గోత్రాః , -------- , -----------, ---------దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి |

|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||

పితృ , పితామహ , ప్రపితామహానాం , మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం |

( మొదటి కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

ద్వితీయ కూర్చే ( రెండవ కూర్చ పై )

|| ఆయాత మాతుః పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే..------ గోత్రాన్ .........( తల్లి యొక్క తండ్రి ) , ..........( తల్లి తాత ), .........( తల్లి ముత్తాత ) శర్మాణః ...వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ | , ,
-------- గోత్రాః ,........( తల్లి యొక్క తల్లి ) , .........( తల్లి యొక్క అవ్వ ) , ...........( తల్లి యొక్క ముత్తవ్వ ) దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి ||
|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||
సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( రెండవ కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

పితృ వర్గము వారికి తర్పణము ఇచ్చునపుడు మొదటి కూర్చ పైనను , మాతృ వర్గము వారికి ఇచ్చేటప్పుడు రెండో కూర్చ పైనను నువ్వులు , నీళ్ళు పితృ తీర్థం లో వదలాలి.

ప్రథమ కూర్చే.. ...పితృ వర్గ తర్పణం |
౧ పితృ తర్పణం (ఒక్కో మంత్రము చెప్పి ఒక్కోసారి , మొత్తం మూడు సార్లు తండ్రి కి ... అలాగే మూడేసి సార్లు ఇవ్వ వలసిన మిగిలిన వారికి )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్ఞాస్తేనోవంతు పితరో హవేషు ||

-------- గోత్రాన్. .. ---------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |

తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||
------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||

------- గోత్రాన్. .. ----------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨.. పితామహ తర్పణం ( మూడు సార్లు తాత కు)

౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||

--------గోత్రాన్. .. --------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||

------- గోత్రాన్. .. ---------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||

--------- గోత్రాన్. .. ---------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||

-------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||

------- గోత్రాన్. .. ------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||

------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౪. మాతృ తర్పణం ( మూడు సార్లు )

------ గోత్రాః , --------- దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతౄః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౫.. పితామహీ తర్పణం

-------- గోత్రాః , ---------దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౬. ప్రపితామహీ తర్పణం
--------- గోత్రాః , ----------- దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )
౭. ద్వితీయ కూర్చే మాతృ వర్గ తర్పణం. ( రెండవ కూర్చ పై )

మాతా మహ తర్పణం ( మూడు సార్లు )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్~ఝాస్తేనోవంతు పితరో హవేషు ||

--------గోత్రాన్. .. ---------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |

తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||

---------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||

---------- గోత్రాన్. .. --------- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ మాతా మహాన్ స్వధా నమః తర్పయామి ||

౮.. మాతుః పితామహ తర్పణం ( మూడు సార్లు )
౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||

--------- గోత్రాన్. .. ------------ శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||
----------గోత్రాన్. .. ------------- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||

---------- గోత్రాన్. .. ------------ శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ మాతుః పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౯. మాతుః ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||

--------గోత్రాన్. .. ----------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||

--------- గోత్రాన్. .. -------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||

-------- గోత్రాన్. .. ------- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ మాతుః ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||
౧౦ మాతామహీ తర్పణం ( మూడు సార్లు )
--------- గోత్రాః , ------ దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౧౧. మాతుః పితామహీ తర్పణం

--------గోత్రాః , ------- దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ మాతుః పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౧౨.. మాతుః ప్రపితామహీ తర్పణం
------- గోత్రాః , -------దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ మాతుః ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

ద్వాదశ పితృ దేవతలకు మాత్రమే తర్పణం ఇస్తే , కింది మంత్రం చెప్పి ఒకసారి తిలోదకం ఇవ్వాలి...

జ్ఞాతాఽజ్ఞాత సర్వ కారుణ్య పితౄన్ స్వధా నమః తర్పయామి ||

|| ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ || తృప్యత తృప్యత తృప్యత |

సర్వే కారుణ్య పితృ దేవతలకు ఇస్తే కింది విధం గా , సజీవం గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి ఒక్కొక్క సారి మాత్రము తిలోదకం వదలాలి..

ఆత్మ పత్నీం( భార్య ) ------దేవీదామ్-----గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
అస్మత్ సుతమ్ ( పుత్రుడు ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ జ్యేష్ట భ్రాతరం ( అన్న ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ కనిష్ట భ్రాతరం ( తమ్ముడు ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ జ్యేష్ట పితృవ్యం ( పెదనాన్న ) ------శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
తత్పత్నీం ( పెద్దమ్మ ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
అస్మత్ కనిష్ట పితృవ్యం ( చిన్నాన్న )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
తత్పత్నీం ( పిన్ని ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
అస్మత్ మాతులం ( మేనమామ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
తత్పత్నీం ( మేనత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి.
( ఇలా మేనమామలు , మేనత్తలు , పెద్దమ్మలు....ఎంతమంది కీర్తి శేషులై ఉంటే అంతమందికీ అదే శ్లోకం చెప్పి , వారి వారి పేర్లతో విడివిడి గా తర్పణం ఇవ్వాలి..)

అస్మద్దుహితరం ( కూతురు )-----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి

ఆత్మ భగినీం ( అక్క / చెల్లెలు ) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
అస్మత్ దౌహిత్రం ( కూతురు కొడుకు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ భాగినేయకం ( అక్క చెల్లెళ్ళ కొడుకు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ పితృ భగినీం ( మేనత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
తద్భర్తారమ్( ఆమె భర్త )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ మాతృ భగినీం ( తల్లి అక్క/చెల్లెలు) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
తద్భర్తారమ్( ఆమె భర్త )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

అస్మత్ జామాతరం ( అల్లుడు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ భావుకం ( బావ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ స్నుషాం ( కోడలు) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
అస్మత్ శ్వశురం ( పిల్లనిచ్చిన మామ )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మత్ శ్వశ్రూః ( పిల్లనిచ్చిన అత్త) -----దేవీదాం / కవీదాం --------గోత్రాం వసురూపాం స్వధానమస్తర్పయామి
అస్మత్ స్యాలకం ( భార్య సోదరులు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి
అస్మత్ సఖాయం ( ఆప్తులు / స్నేహితులు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మద్గురుం ( గురువు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.
అస్మదాచార్యం ( ఆచార్యుడు )-----శర్మాణం---గోత్రం వసురూపం స్వధానమస్తర్పయామి.

పైన చెప్పిన వారిలో సజీవులుగా ఉన్నవారిని వదలి , మిగిలిన వారికి తర్పణం ఇవ్వాలి.

ఉపవీతి | ప్రదక్షిణం | ( జంధ్యము సవ్యం గా వేసుకొని కింది మంత్రం చెప్పుతూ , పరచిన దర్భల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి )

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

నమోవః పితరో రసాయ నమోవః పితరః శుష్మాయ నమోవః పితరో జీవాయ నమోవః పితరః స్వధాయై నమోవః పితరో మన్యవే నమోవః పితరో ఘోరాయ పితరో నమో వో య ఏతస్మిన్ లోకేస్థ యుష్మాగ్ స్తేఽను యేస్మిన్ లోకే మాం తే ను య ఏతస్మిన్ లోకేస్థ యూ యం తేషాం వసిష్ఠా భూయాస్త యేస్మిన్ లోకేహం తేషాం వసిష్ఠో భూయాసం ||

తనచుట్టూ తాను ప్రదక్షిణం

| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

పాపోఽహం పాప కర్మోఽహం పాపాత్మా పాప సంభవః
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పితృదేవతాః..

|| చతుస్సాగర పర్యంతం ... .... .... అభివాదయే || ( ప్రవర చెప్పి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి )

పిత్రాదిభ్యో నమః |

ప్రాచీనావీతి | ఉద్వాసనం ( అపసవ్యం గా జంధ్యం వేసుకొని కింది మంత్రం చెప్పి కూర్చలను విప్పి పక్కన పెట్టాలి
|| ఉత్తిష్ఠత పితర ప్రేత శూరా యమస్య పంథా మను వేతా పురాణం | ధత్తాదస్మాసు ద్రవిణం యచ్చ భద్రం ప్రణో బ్రూతాత్ భాగధాన్దేవతాసు ||

|| పరేత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |
అథా పితౄంథ్సువిదత్రాగ్ం అపీత యమేనయే సధమాదం మదంతి ||

అస్మాత్ కూర్చాత్ మమ పితృ , పితామహ , ప్రపితామహాన్ , మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ యథా స్థానం ప్రతిష్ఠాపయామి |
ద్వితీయ కూర్చాత్ సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ యథా స్థానం ప్రతిష్ఠాపయామి | శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ |

| కూర్చ ద్వయం విస్రస్య |

నివీతి |( జంధ్యము మాల లాగా వేసుకోవాలి ) తర్వాత , గోత్రాలు , సంబంధాలు తెలియని బంధువుల కొరకు తర్పణం ఇవ్వాలి..

యేషాం న మాతా న పితా న బంధుః నాన్య గోత్రిణః | తే సర్వే తృప్తిమాయాంతు మయోత్సృష్ట్యైః కుశొదకైః || ఇతి తిలోదకం నినీయ |

ఈ కింది శ్లోకము చెప్పి , జంధ్యాన్ని కాని నీటితో తడిపి , ( జంధ్యపు ముడిని ) ఆ నీటిని నేల పైకి పిండాలి..

|| యేకేచాస్మత్ కులే జాతాః అపుత్రా గోత్రిణోమృతాః
తే గృహ్యంతు మయా దత్తం వస్త్ర ( సూత్ర ) నిష్పీడనోదకం ||

దర్భాన్ విసృజ్య || పవిత్రం విసృజ్య || ఉపవీతి | దర్భలను , పవిత్రాన్ని విప్పి తీసెయ్యాలి , జంధ్యాన్ని సవ్యం గా వేసుకోవాలి )

తర్పణము అయ్యాక ,ఇది చెప్పాలి

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపో తర్పణ క్రియాదిషు | న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం ||

మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం జనార్దన | యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ||

అనేన మయా అమావాస్యా పుణ్యకాలే / సూర్యోపరాగే / చంద్రోపరాగే / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / పితృ పక్షే సకృన్మహాలయే / తీర్థ క్షేత్రే కృతేన తిల తర్పణేన శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రియతాం ప్రీతో వరదో భవతు||

అని చెప్పి , అరచేతిలో నీళ్ళు వేసుకొని వదలాలి.

మధ్యే మంత్ర , తంత్ర , స్వర , వర్ణ , ధ్యాన , నేమ , లోప దోష పరిహారార్థం నామ త్రయ మంత్ర జపమ్ కరిష్యే |

అచ్యుతాయ నమః | అనంతాయ నమః | గోవిందాయ నమః || ( రెండు సార్లు పలకాలి )

అచ్యుతానంత గోవిందేభ్యో నమః |

|| కాయేన వాచా మనసేంద్రియైర్వా బుధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |

కరోమి యద్యద్ సకలం పరస్మై శ్రీమన్నారాయణేతి సమర్పయామి ||

అని చెప్పి నీరు వదలాలి

శ్రీ కృష్ణార్పణమస్తు

పైన చెప్పినంత విస్తారముగా చేయుటకు సమయము లేనిచో , క్లుప్తముగా కిందివిధముగా చెయ్య వచ్చును..ఇది కేవలం విధి లేని పరిస్థితి లో మాత్రమే...ఎందుకంటే, శ్రాద్ధానికి , తర్పణానికి శ్రద్ధ ముఖ్యము.

ఈ శ్లోకము చెప్పి , మూడు సార్లు తిలోదకాలు ఇవ్వవలెను

|| ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం దేవర్షి పితృ మానవాః |

తృప్యంతు పితరః సర్వే మాతృ మాతా మహాదయః |

అతీత కుల కోటీనాం సప్త ద్వీప నివాసినాం |

ఆ బ్రహ్మ భువనాల్లోకాత్ ఇదమస్తు తిలోదకం ||

ఆచమ్య || బ్రహ్మ యజ్ఞాదికం చరేత్ || యథా శక్తి బ్రాహ్మణాన్ భోజయేత్ || ఓం తత్ సత్

( ఆచమనం చేసి , శక్తి ఉన్నవారు బ్రహ్మ యజ్ఞం చెయ్యాలి ... బ్రాహ్మణులకు భోజనం పెట్టవచ్చు )
( బ్రహ్మ యజ్ఞం విధి ప్రత్యేకముగా వ్రాయుచున్నాను )

ఇతి ఆబ్దిక / దర్శ శ్రాద్ధ విధిః తర్పణ విధిశ్చ

Read More

ఇంట్లో పాటించాల్సిన-పాటించకూడని ఆచారాలు......

ఇంట్లో పాటించాల్సిన-పాటించకూడని ఆచారాలు......

కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వ కాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను, ఆచారాలను చాలా మంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి.
- కొంత మంది వేళ పాళ లేకుండా చేతి గోళ్ళను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు. కానీ అలా చేయడం తగదు. చాలా మందికి చేతి వేళ్ళ గోళ్ళను కొరుకుతుంటారు. చేతి గోళ్ళను తిన్నవాడు విశానమును పొందుతారు.

- లేత ఎండ, శవధూమము, విరిగిపోయిన ఆసనము - ఇవి తగవు. ఊరక మట్టిని మర్థించువాడు, గడ్డి పరకలను తుంచువాడు, ఎదుటి వాని ఉన్న దోషములను కాని, లేని దోషములను కాని వెల్లడించు వాడు, శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశము పొందుదురు.

- రెండు చేతులతోను తలగోక కూడదు. ఎంగిలి చేతులతో తలను ముట్టుకొనరాదు. శిరస్సును విడిచి కేవలము కంఠ స్నానము చేయరాదు. (శిరః స్నానము ఆరోగ్య భంగకరమైనప్పుడు స్నానము చేసియే కర్మానుష్ఠానము చేసి కొనవచ్చునని జాబాలి వచనము).

- ప్రాకారము కల్గిన గ్రామమును గాని, ఇంటిని కాని ద్వారము గుండా ప్రవేశింపవలయునే కాని ప్రాకారము దాటి ప్రవేశింపకూడదు. రాత్రులందు చెట్ల కింద ఉండరాదు. దూరముగా ఉండవలయును.

- ఎక్కువ కాలం జీవించాలనుకునే వాడు వెంట్రుకలను, బూడిదలను, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కరాదు.

- చాలా మంది సరదా కోసం పాచికలు (జూదము) ఆడుతారు అలా ఆడటం సరికాదంటున్నారు. పాదరక్షలను చేతితో మోసికొనిపోరాదు. పక్క మీద కూర్చుని ఏమియు తినరాదు. చేతిలో భోజ్య వస్తువును పెట్టుకొని కొంచెం కొంచెంగా తినకూడదు. ఆసనము మీద పెట్టుకొని ఏ వస్తువును తినరాదు.

- రాత్రి సమయంలో నువ్వులతో గూడిన ఏ వస్తువును తినకూడదు. వస్తహ్రీనుడై పడుకోకూడదు. ఎంగిలి చేతితో ఎక్కడకును వెళ్ళరాదు.

- కాళ్ళు తడిగా ఉన్నప్పుడే భోజనము చేయవలయును. దాని వలన దీర్ఘీయువు కలుగును. తడి కాళ్ళతో నిద్రకు ఉపక్రమించకూడదు.
Read More

ఎన్నటికీ వీడనిది ఋణానుబంధం:

ఎన్నటికీ వీడనిది ఋణానుబంధం:

"పువ్వు తొడిమనుండి విడిపోతుంది, పండు చెట్టునుండి రాలిపోతుంది, కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను విడిచిపెట్టరు’ అని మహాభారతం చెబుతోంది. పిల్లలపై తల్లిదండ్రులకున్న అనుబంధం ఎలాంటిదో కృష్ణుని ఎడబాటును భరించలేని యశోదానందుల హృదయావేదనను ఒక్కసారి తెలుసుకుంటే అర్థమవుతుంది.
శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది. దుఃఖంతో కుమిలిపోతున్న యశోదను చూసి నందుడు కూడా ’కన్నయ్య లేకుండా మేము బ్రతకలేం’ అని కన్నీరుమున్నీరు కాసాగాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు అవ్యక్తావేదనతో యశోదమ్మను తలచుకుంటూ ఉద్ధవునితో, "ఉద్ధవా! నాకన్నయ్య భోజనం చేస్తే గానీ నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టను’ అని మొండి పట్టుదలతో కూర్చొనే నాతల్లి యశోదమ్మను నేను మరువలేకున్నాను" అని చెబుతూ కృష్ణుడు విలపించసాగాడు.
కంసుని చెరాలనుంచి దేవకీ వసుదేవులను విడిపించిన తరువాత బలరామకృష్ణులు వారికి పాదాభివందనాలు చేసి, వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని ఇలా వ్యక్తపరిచారు:
మాకు నిన్నాళ్ళు లేదయ్యె మరియు వినుడు
నిఖిల పురుషార్థ హేతువై నెగడుచున్న
మేనికెవ్వార లాఢ్యులు మీరు కారె
యా ఋణము దీర్ప నూరేండ్లకైన జనదు (దశమస్కంధం - పోతన భాగవతం).
’అమ్మా! నాన్నా! మేము ఇన్నాళ్ళూ మీ ప్రేమ, ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైన ఈ దేహాన్నిప్రసాదించిన వారు మీరు. అలాంటి దుర్లభమైన మానవదేహాన్ని ఇచ్చిన మీ ఋణం తీర్చడానికి మాకు నూరేళ్ళైనా సాధ్యం ాదు.’
బలరామకృష్ణులు పలికిన మాటల వల్ల తల్లితండ్రుల స్థానం ఎంతటి మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండడం వల్ల వారి విలువ ఏమిటో మనం గుర్తించలేకపోతున్నాం. అందువల్ల వారిపట్ల నిర్లక్ష్య వైఖరినీ, నిర్దాక్షిణ్యాన్నీ చూపుతున్నాం. తల్లిదండ్రులే ఇలలో ప్రత్యక్షదైవాలనీ, వారి ఋణం ఎన్ని జన్మలైనా తీర్చలేనిదనీ నిరూపించిన వినాయకుడు, శ్రీకృష్ణుడి జీవితాలు మనకు ఆదర్శం కావాలి.
Read More

విభూతి

విభూతి

విభూతి శివునికి యిష్టం.విభూతిని నుదట ధరిస్తే, చెమటను పీలుస్తుంది. శరీరంలోని ఉష్ణాన్ని అదుపుచేస్తుంది. విభూతిని మెడ, భుజాలు, చేతులకు రాసుకుంటారు. విభూతి శివునికి యిష్టం. దేహంలోని నరాలు ఉబ్బటం, బాధపెడుతుంటాయి. విభూతి సక్రమంగా రాస్తే, వీటిని అరికట్టవచ్చు. మన శరీరంలో 72,000 నరాలుంటాయి.
హోమంలో విభూతిని, ఆవునెయ్యి, ఔషధమొక్కలతో హోమంలో వేస్తుంటారు. ఈ విధంగా చేస్తే, వాతావరణ కాలుష్యం బారినుండి రక్షించుకోవచ్చు. సంస్కృతిలో విభూతిని భస్మం అంటారు. 'భాసతియత్‌ తత్‌ భస్మ' అని బ్రహ్మపురాణం చెబుతుంది. శైవపురాణం ' భస్మకల్మష భక్షనాత్‌' అని పేర్కొంది. అంటే భస్మం పాపాలను హరిస్తుంది. 'భక్షణత్‌ సర్వపాపానామ్‌ భస్మేతి పురికీర్తితమ్‌' పాపనాశిని కాబట్టే, దానిని భస్మమ్‌ అని కొనియాడారు.మారేడు దళం శివునికి ప్రీతికరమైనది. భస్మంతో అభిషేకం తర్వాత, మారేడు దళంతో శివుని పూజిస్తారు మూడు ఆకులు, మూడుగుణాలు సూచిస్తాయి. మారేడు కొమ్మలే వేదాలు. వేరులు రుద్రుడు. మారేడు దళం త్రినేత్రాలను సూచిస్తాయి. వీటిని పౌర్ణమి నాడు కోయరాదు. పశ్చిమ దేశాలలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మారేడు మొక్కలను పరిశోధనలకై పెంచు తున్నారు. కీళ్లవ్యాధులు, వాంతులు, క్షయ, విరేచనాలకు మారేడు అద్భుతంగా పనిచేస్తుంది. మారేడు దళాల రసాన్ని మంచినూనెలో కలిపి వేడిచేసిన తర్వాత చెవివ్యాధులకు ఉపయోగిస్తారు.
విభూతి భారతీయ సంస్కృతిలో విశిష్టస్థానముంది.
Read More

మహావిష్ణువునే మనువాడిన గోదాదేవి

మహావిష్ణువునే మనువాడిన గోదాదేవి

లక్ష్మీ స్వరూపమైన గోదాదేవి శ్రీరంగంలో క్రీ.శ 776లో జన్మించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ద్రవిడ భాషల్లో గోదాదేవికి కోదై, చూడిక్కొడుత్త నాచ్చియార్, ఆండాళ్, అనే నామాంతరములు గలవు. తెలుగు సాహిత్యంలో సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం “ఆముక్తమాల్యద” గోదాదేవీ వైశిష్ట్యమునకు ప్రతీక. ఈ ప్రబంధానికి “విష్ణుచిత్తీయం” అనే మరోపేరున్న సంగతి తెలిసిందే.

ఇక గోదాదేవి జన్మ వృత్తాంత్తాన్ని ఓ సారి పరిశీలిస్తే.. శ్రీరంగంలో… ఆషాఢ శుద్ధ చతుర్దశిన, పుబ్బా నక్షత్రంలో గోదాదేవి జన్మించింది. గోదాదేవి, శ్రీ విష్ణుచిత్తులకు పూలతోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సులో వచ్చిన తరువాత లక్ష్మీస్వరూపమైన గోదాదేవి, తన శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలనుకుంటుంది.

వైష్ణవుడైన విష్ణుచిత్తుడు రంగనాథ స్వామిని ప్రతినిత్యం భక్తిశ్రద్ధలతో కొలిచేవాడు. ఇందులో భాగంగా… ప్రతిరోజూ స్వామివారికి పూలమాలలను సుందరంగా అల్లుకుని అలంకరణకు తీసుకుని వెళ్లేవాడు. అయితే వాటిని గోదాదేవి ముందే ధరించి తర్వాత స్వామివారికి పంపిస్తుంది.

ఈ రహస్యం తెలుసుకున్న విష్ణుచిత్తుడు దుఃఖించి రంగనాథుడికి మాలాధారణ గావించరు. దీంతో స్వామివారి మొహం చిన్నబోతుంది, దీనికంతటికీ తన కుమార్తె తప్పిదమే కారణమని విష్ణుచిత్తుడు బాధపడుతుంటే.. రంగనాథుడు విష్ణుచిత్తునితో ఇక ప్రతిరోజూ తనకు గోదాదేవి ధరించిన మాలాధారనే కావాలని ఆదేశిస్తారు. రంగన్న ఆదేశం మేరకే విష్ణుచిత్తుడు నడుచుకుంటాడు.

ఇంతలో శ్రీరంగనాథుడే తనకు భర్తగా రావాలని కోరుకుంటూ గోదాదేవి… తన తోటి బాలికలతో కలిసి “తిరుప్పావై” (తిరుప్పావు) వ్రతాచరణ చేస్తారు. ఈ వ్రతమహిమతో… లక్ష్మీ స్వరూపమైన గోదాదేవి శ్రీరంగనాథుడి సతీమణి అవుతుంది. రంగనాథుడి ఆజ్ఞమేరకే గోదాదేవికి, రంగనాథస్వామికి విష్ణుచిత్తుడు దేవేరులకు భూలోకంలో వైభవంగా వివాహం జరిపించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. వివాహానంతరం గోదాదేవి ఆ చిద్విలాసునిలో లీనమవుతుంది. అదిచూసి విష్ణుచిత్తుడు దుఃఖితుడైతే మలయప్ప స్వామి జ్ఞానోపదేశం చేస్తాడు. దీంతో విష్ణుచిత్తుడు గోదాదేవి లక్ష్మీస్వరూపి అని, తన కుమార్తె అన్న మాయ నుంచి బయటపడతాడు.

ఇకపోతే… గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించిన తిరుప్పావై చాలా ప్రసిద్ది చెందింది. దీనిని ధనుర్మాసంలో ప్రతిరోజూ రోజుకొక్కటి చొప్పున ఓ పాశురం వైష్ణవ ఆలయాల్లో పఠించడం చేస్తారు. అందుచేత యువతులు ధనుర్మాసంలో 30 రోజుల పాటు గోదాదేవి వ్రతాచరణ చేస్తే తను మెచ్చిన, సుగుణుడైన భర్త లభిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
Read More

కాశీ క్షేత్రం

కాశీ క్షేత్రం
కాశీలాంటి మోక్షదాయక క్షేత్రం ఇంకెక్కడా లేదంటారు. అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరుడు కొలువుతీరిన ఈ క్షేత్రంలో అడుగు పెట్టటమే ఎన్నో జన్మల పుణ్యఫలం. అసలు కాశీ వెళ్తాను అనుకుంటేనే చాలుట..ఎంతో పుణ్యంవస్తుందట.

అలాంటి పుణ్యక్షేత్రం కాశీ వెళ్ళాలని తపించి, వెళ్ళాక, ఆధ్యాత్మిక భావాలలో మునిగిపోయేవారికి అన్నిచోట్లా విశ్వేశ్వరుడూ, విశాలాక్షే కనిపిస్తారు. కానీ అంత తాదాత్మ్యంచెందలేనివారికి కాశీలో ఇరుకు సందులు, అడుగడుగునా అపరిశుభ్రత, ఏ సమయంలోనైనా రోడ్లమీద కనిపించే పశువులూ, అడుగు బయటపెడితేచాలు అడ్డంపడే బట్టల షాపులవాళ్ళూ…ఓహ్..ఇదా విశ్వేశ్వరుడి నివాసం అనిపిస్తుంది.

అవ్వన్నీ పక్కనపెట్టి నిండుమనసుతో ఒక్కసారి పావనమైన ఆ కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వరుని, గంగమ్మతల్లిని, చల్లని తల్లులు విశాలాక్షి, అన్నపూర్ణలను తల్చుకోండి. మీ మనసు భక్తి భావంతో నిండుతుంది. మనసునిండా వున్న ఆ భక్తి భావంతో కాశీని చూడండి. పురాణ ప్రాశస్త్యంపొందిన కాశీనగరం కనిపిస్తుంది. సత్య హరిశ్చంద్రుడు తన సత్యవాక్పరిపాలనను నిరూపించుకున్న పట్టణం ఇది. బుధ్ధ భగవానుడు జ్ఞానోదయం తర్వాత మొట్టమొదట ధర్మప్రబోధం చేసింది ఇక్కడికి అతి సమీపంలోను సారనాధ్ లోనే.

ఆది గురువు శంకరాచార్యులవారు, ఇంకా ఎందరో మహానుభావులు ఇక్కడ విద్యాభ్యాసం చేశారు. మహాకవి తులసీదాసు తన రామాయణాన్ని ఇక్కడే రాశాడు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎందరో, ఎందరెందరో మహనీయులు ఈ కాశీక్షేత్ర మహత్యాన్ని పెంపొందించారు. అలాంటి కాశీ క్షేత్ర ఆవిర్భావం గురించి శివ పురాణంలో ఈ విధంగా వర్ణించారు.

కల్పం మొదట్లో ఎక్కడ చూసినా నీరు వుంది. బ్రహ్మ సృష్టి చెయ్యటానికి తగిన సామర్ధ్యం సంపాదించుకోవటానికి తపస్సు చెయ్యటానికి స్ధలం కోసం పరమ శివుడు తన త్రిశూలాగ్రంమీద సృష్టించిన భూ భాగమే కాశీ క్షేత్రం. బ్రహ్మ దీనిమీద కూర్చుని తపస్సుచేసి పొందిన శక్తితో బ్రహ్మ అన్ని లోకాలను, గ్రహాలను, జీవజాలాన్నీ సృష్టించాడు. అన్ని గ్రహాలతోబాటు భూమినికూడా సృష్టించాడు బ్రహ్మ. దేవతలు, ఋషులు చేసిన ప్రార్ధనను మన్నించిన శివుడు తన త్రిశూలాగ్రానవున్న భూ భాగాన్ని అలాగే భూమిమీదకు దించాడు. అదే కాశీ క్షేత్రమనీ, కాశీ పట్టణం, స్వయంగా ఈశ్వర సృష్టేననీ, అందుకనే తర్వాత సృష్టి చేసిన బ్రహ్మదేవుడికిగానీ, ఆ సృష్టిలో ఆవిర్భవించిన ఏ దేవీ దేవతలకుగానీ అక్కడ ఏ విధమైన అధికారం లేదనీ, కేవలం, శివుడు, అతని పరివార దేవతల ప్రభావం మాత్రమే ఇక్కడ వుంటుందని పురాణ కధనం. అంతేకాదు, బ్రహ్మ సృష్టించినవన్నీ ప్రళయకాలంలో నశించినా, ఆయన ప్రభావంలేని కాశీనగరం మాత్రం ప్రళయ సమయంలోకూడా చెక్కుచెదరదని కూడా పురాణ కధనం.
బ్రహ్మ, విష్ణుల కోరికమీద శివుడు కాశీ క్షేత్రంలో భక్తులను కాపాడటంకోసం జ్యోతిర్లిగంగా వెలిశాడు.
అంతేకాదు. కాశీ పట్టణంలో మరణించబోయే జీవుల కుడిచెవిలో పరమశివుడు సాక్షాత్తూ తనే మంత్రోపదేశంచేస్తాడని, అలాంటివారి జన్మ ధన్యమయి మోక్షం లభిస్తుందని నమ్మకం.

ఈ ప్రఖ్యాత పట్టణంమీదు తురుష్కులు అనేకసార్లు దండయాత్రచేసి ఇక్కడి సిరిసంపదలను కొల్లగొట్టారు. ఈ దాడులతో విశ్వనాధ మందిరంతోసహా అనేక విగ్రహాలు, లింగాలు స్ధానభ్రంశంచెందాయి. ప్రస్తుతం వున్న మందిరం క్రీ.శ. 1785లో ఇండోర్ మహారాణి అయిన అహల్యాబాయి నిర్మించింది. ఆక్రమణలకు గురిఅయినతర్వాత ప్రస్తుతంవున్న మందిరం చిన్నదే. ఆలయంలోపలకూడా ఇరుగ్గానే వుంటుంది. కాశీలో విశాల ఆలయాలు, శిల్పకళ కనబడదు.

ఇక్కడ వసతికి హోటల్సేకాకుండా అనేక సత్రాలుకూడా వున్నాయి. వీటిలో గదులు అద్దెకు ఇవ్వబడుతాయి. చాలాచోట్ల ఉచితంగా భోజనం పెడతారు…అయితే ముందు మనం చెప్పాలి. అప్పటికప్పుడు వెళ్తే ఏర్పాటు చెయ్యలేరు. వాళ్లు ఉచితంగా పెట్టినా ఇవ్వదల్చుకున్నవారు అన్నదానానికి డబ్బు ఇచ్చిరావచ్చు.

విశ్వనాధుని దర్శనానికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్లు, కెమేరాలు, పెన్నులు వగైరాలు తీసుకువెళ్ళద్దు. వాటిని లోపలకి తీసుకెళ్ళనివ్వరు.
శివాలయాలలో ఎక్కడైనా మీరు తీసుకెళ్లిన పూజా ద్రవ్యాలతో మీరు స్వయంగా పూజ, అభిషేకం చేసుకోవచ్చు. అమ్మవార్ల ఆలయాలలోమాత్రం పూజారులే చేస్తారు. అమ్మవార్ల ఆలయాలలో శ్రీచక్రానికి కుంకుమపూజ మనం చేసుకోవచ్చు.

మనం కాశీ వెళ్తుంటే పొలిమేరల్లోనే మన పాపాలన్నీ పటాపంచలవుతాయట. అంతేకాదు. కాశీలో చేసిన మంచికానీ, చెడుకానీ అనేక రెట్ల ఎక్కువ ఫలితాన్నిస్తుందట. అందుకే సాధ్యమైనంత ఎక్కువ దైవనామ స్మరణ, దాన ధర్మాలు, పరోపకారం చెయ్యండి. గంగా స్నానం, దైవ దర్శనం గురించి చెప్పక్కరలేదుకదా. అలాగే పితృకార్యాలు చెయ్యదల్చుకున్నవారు వాటిని చెయ్యండి. మీ కాశీయాత్రని సఫలం చేసుకోండి.

‘’ఆది పూజ్యం ,ఆది వన్ద్యం ,సిద్ధి బుద్దీశ్వరం ప్రభుం –శుభ ,లాభ తనూజం తం ,వందేహం ,గణ నాయకం ‘’
‘’న గాయత్ర్యా సమో మంత్రం –న కాశీ సదృశీ పురీ –న విశ్వేశ సమం లింగం –సత్యం ,సత్యం ,పునః పునః ,

‘’కలౌ విశ్వేశ్వరోదేవః –కలౌ వారాణశీ పురీ –కలౌ భాగీరధీ గంగా –కలౌ దానం విశిష్యతే ‘’

‘’కాశ్యాం హి కాశ్యతే కాశీ –కాశీ సర్వ ప్రకాశికా –సాకారీ విదితా ఏవ –తేన ప్రాప్తాహి కాశికా ‘’

‘’కాశీ బ్రహ్మేతి వ్యాఖ్యానం –తబ్రహ్మ ప్రాప్యతే –త్రాహి –తస్మాత్ కాశీ గుణాన్ ,సర్వే-తత్ర తత్ర వదన్తిహి’’

‘’కాశీ కాశీ తి కాశీతి –రాసానా రస సం యుతా –యస్య కస్యాపి భూ యాశ్చేత్త్ –స రసజ్నో న చేతరః ‘’

వింధ్యాద్రి వర్ధనం

ఒకప్పుడు నారద మహర్షి నర్మదా నది లో స్నానం చేసి ఓంకార నాధుడిని దర్శించి ,సంచారం చేస్తున్నాడు ..ఆ రేవా నది ఒడ్డున ఉన్న వింధ్య పర్వతాన్ని చూశాడు .దాని నిండా ఫల పుష్ప వృక్షాలు కన్నుల విందు చేస్తున్నాయి .అనేక జంతు సమూహాలు ,పక్షులు తిరుగుతూ దాని శోభను పెంచుతున్నాయి ..నారదుని చూసి వింధ్యాద్రి పర వశించింది .ఆయన కు సపర్యలు చేయాలని కోరిక కలిగింది .నారదుని రాకతో పునీతుడై నట్లు వింధ్యాద్రి చెప్పుకొన్నది .మూడు లోకాలలో సంచరించే మహర్షికి తెలిసిన ఆశ్చర్య కర విశేషాలను అడిగి తెలుసుకొన్నది .మేరు పర్వతం మొదలైన వాటికి భూమిని దర్శించే భాగ్యం ఉందని , హిమాలయం శివ పార్వతుల నివాస స్తానము , పర్వతాలకు రాజు కనుక దానికి గౌరవించాలి అన్నాడు వింధ్యుడు .మేరువు స్వర్ణ మయం అయినా ,రత్నాల తో నిండి ఉన్నా తాను గౌర విన్చాల్సిన పని లేదని బింకం గా పలికాడు .మందేహాదులకు నిలయ మైన ఉదయ పర్వతం కూడా ఉంది కదా, నీలం రంగులో నీలాద్రి ఉన్నది ,సర్వ సర్ప సమూహాలున్నరైవతాద్రి ఉన్నది ,హేమ ,త్రికూట ,క్రౌంచ పర్వతాలు భూ భారాన్ని నిర్వ హింప లేవు మొత్తం మీద భూ భారాన్ని మోసే శక్తి ,సామర్ధ్యాలు తనకు మాత్రమె ఉన్నాయని వింధ్య పర్వతం నారద ముని తో ప్రగల్భాలు పలికింది

నారదునికి వింధ్యాద్రి నిజ రూపం తెలిసింది .గర్వం తో అందర్ని చులకన గా మాట్లాడు తున్నాడని గ్రహించాడు .శిఖర దర్శనం తోనే మోక్షమిచ్చే శ్రీ శైల పర్వతం ఉంది దాని ముందు వింధ్య ఎంత ?అను కొన్నాడు .కాని ఉపాయం గా వింధ్యాద్రి తో ‘’వింధ్య రాజా ! నిజం చెప్పావు .మేరు పర్వతం నీ చేత కించ పరచ బడింది .నేనూ అదే అనుకొన్నాను నీ నోటి నుంచి నిజం బైటికి వచ్చింది .అయినా ఏదో పేరు ,ప్రతిష్టా సంపాదించుకొన్న వారి గురించి మనకెందుకు చింత ?మనం విమర్శించటం ఉచితం కాదు .నీకు స్వస్తి ‘’అని చెప్పి ఆకాశ మార్గం లో వెళ్లి పోయాడు .నారదుని మాటలు విన్ధ్యాద్రికి మాత్సర్యం కలిగించాయి .’’శాస్త్రం తిరస్కరించిన వారి జీవితం ,జ్ఞాతుల చే పరాభ వింప బడిన వారి జీవితం వృధా .వారికి కునుకు పట్టాడు ..దుఖం తో నాకేమీ పాలు పోవటం లేదు .దుఖం జ్వరం లాంటిది.వైద్యుడికి లొంగదు.మేరువును ఎలా జయించాలి ?యెగిరి వెళ్లి మేరువు మీద పడదామను కొంటె, మా రెక్కల్ని టిని వాజ్రాయుధం తో ఇంద్రుడు నరికేశాడాయే .మేరు పర్వతం ఇంత ఔన్నత్యాన్ని ఎలా పొందుతోంది ?దాని గొప్ప తనానికి ఈర్ష్య నాలో పెరిగి, దహిస్తోంది .భూములన్నీ దాన్ని ఎలా చుట్టి వస్తున్నాయి .భూభారం ఎలా మోస్తోంది ?బ్రహ్మ చారి నారడుడి మాటలు నర్మ గర్భం గా ఉన్నాయి .నాకు సరైన మార్గాన్ని చూప గల వాడు విశ్వేశ్వరుడే .సాక్షాత్తు సూర్య భాగ వానుడే మేరువు చుట్టూ నిత్యం ప్రదక్షిణం చేస్తుంటాడు ..కనుక నేను కూడా నిలువు గా పెరిగి నా ఔన్నత్యాన్ని నిరూపించు కోవాలి ‘’అని అనేక రకాలు గా మధన పడింది .చివరకు ఆకాశం లోకి నిలువు గా పెరగటం ప్రారంభించింది ‘

సూర్య గమనానికి అడ్డు కోనేంత ఎత్తుకు వింధ్య పర్వతం పెరిగి పోయింది .సూర్యుడే తనను దాటి వెళ్ళ లేడుఇక యముడెలా దాటి దక్షిణ దిక్కు కు వెళ్తాడు ?అను కొన్నది .మనసు లోని చింత తీరి ధైర్య స్తైర్యాలు కలిగాయి వింధ్యకు .

సత్య లోక వర్ణనం

సకల జగత్తుకు సూర్యుడు ఆత్మ .చీకటికి విరోధి రోజూ ఉదయాద్రిన ఉదయించి చీకటిని సంహరించి వెలుగు నింపుతూ పద్మాలకు ప్రకాశాన్నిస్తూ నిత్య కృత్యాలకు తోడ్పడుతాడు సాయంకాలం పశ్చిమాన అస్తమించి కలువలకు వికసనం కలగ టానికి కారణం అవుతున్నచంద్రుని రప్పిస్తున్నాడు . .సూర్యునికి మలయానిలం ఉచ్చ్వాసం క్షీరోదకం అంబరం ,త్రికూట పర్వతం రత్న రాశుల ఆభరణం ,సువేల పర్వతం నితంబం ,కావేరి గౌతములు జన్ఘాలు ,చోళ రాజ్యం అమ్శుకం ,మహారాష్ట్ర వాగ్విలాసం .అలాంటి దక్షిణ నాయకుడైన రవి అక్కడే నిలిచి పోవాల్సి వచ్చింది .అప్పుడు ఆయన సారధి అనూరుడు మేరువు తో పోటీ పడి వింధ్య పెరిగి మార్గాన్ని అడ్డ గిన్చిందని తెలిపాడు .గగన మార్గానికి నిరోధం కలిగి నందుకు సూర్యుడు ఆశ్చర్య పడ్డాడు .

సూర్య గమనం లేక పోయే సరికి యజ్న యాగాదులు ,బ్రాహ్మల సంధ్యా వందనాదులు ఆగి పోయాయి .సృష్టి స్తితి లయాలకు కారణమైన సూర్యుని గతి ని స్తంభింప జేసి నందుకు మూడు లోకాలు తల్లడిల్లి పోయాయి .దేవత అందరు బ్రహ్మ దేవుని చేరి మొర పెట్టుకోవాలని బయల్దేరారు న్’బ్రహ్మను దర్శించి స్తోత్రాలతో తృప్తి చెందించారు ,దానికి బ్రహ్మ పరమానంద భరితుడైనాడు .ఏమి వరం కావాలో కోరుకో మన్నాడు త్రిమూర్తుల మైన తాము సృష్టి స్తితి లయాలను చేస్తామని కోరిన కోర్కెలను తీరుస్తామని చెప్పాడు .అప్పుడు బ్రహ్మ వారికి సత్య లోకం లోని విశేషాలను వివ రించిచేప్పాడు ‘’ఈమె భారతి నా భార్య .ఇవి శ్రుతి స్మృతులు .ఇక్కడ కామ క్రోధ మద మాత్సర్యాలుండవు .వీరందరూ చాతుర్మాస్యాది వ్రతాలు చేసిన బ్రాహ్మణులు .వీరు పతివ్రతలు .వీరు బ్రహ్మ చారులు .వీరు మాతా పితర పూజ చేసిన పుణ్యాత్ములు .వీరు గోసంరక్షణ చేసిన వారు .వీరు నిష్కామ కర్ములు .వీరు నిత్యాగ్ని హోత్రులు ,కపిల దానం చేసిన వారు వీరు .వీరు సారస్వత తపో సంపన్నులు .వీరు దానం తీసుకోని వారు .వీరంతా నాకు ప్రియులు సూర్య తేజం ఉన్న వారు .ప్రయాగలో మాఘ మాసం లో రవి మకర రాశి లో ప్రవేశించి నపుడు పుణ్య స్నానం చేసిన వారు వీరు .కార్తీకం లో కాశీలో పంచ నదాలలో మూడు రోజులు స్నానం చేసిన వారిరుగో .మణి కర్ణిక లో స్నానం వీరు చేసిన వారు .వీరు వేదాధ్యన పరులు వీరు పురాణ ప్రవచకులు వీరు వైద్య విద్యా భూ దానాలు చేసిన వారు వీరంతా ఇలాంటి పుణ్య కార్యాలు చేసి ఇక్కడి నా సత్య లోకం చేరారు .’’అని అక్కడ ఉన్న వారందరినీ దేవత లందరికి చూపించాడు బ్రహ్మ .

బ్రహ్మ మరల మాట్లాడుతూ బ్రాహ్మణులలో మంత్రాలున్నాయని ,గోవులలో హవిస్సులున్నాయని ,బ్రాహ్మణులు అంటే నడిచే తీర్ధాలని ,ఆవులు పవిత్ర మైనవని ,గోవు గిట్టల నుండి రేగిన దుమ్ము కణాలు గంగా జలం అంత పవిత్ర మైనవని ,ఆవుల కొమ్ముల చివర్లలో అన్ని తీర్ధాలు ఉన్నాయని ,గిట్ట లలో అన్ని పర్వతాలు ఉన్నాయని ,కొమ్ముల మధ్య గౌరీ దేవి ఉంటుందని ,గోదానం చేస్తే పితృదేవతలు మహా సంతోషిస్తారని ,ఋషులు దేవతలు ప్రీతీ చెందుతారని గోవు లక్ష్మీ స్వరూపమని పాపాలను పోగొట్టు తుందని వివరించాడు .గోమయం యమునా నది అని ,గోమూత్రం నర్మదా నదీ జలం ,ఆవు పాలు గంగోదకంఅని , దాని అన్ని అంగాలలో అన్ని లోకాలు ఉన్నాయని బ్రహ్మ చెప్పాడు .ఎవరు గంగా స్నానం చేస్తూ ఆ నది ఒడ్డున నివశిస్తూ పురాణాలు వింటాడో వాడు సత్య లోకానికి అర్హుడు అని తెలిపాడు .ఇంతకూ దేవతలేందుకు వచ్చారో మళ్ళీ అడిగాడు .వింధ్యాద్రి చేసిన పనిని వివరించారు దేవతలు .అప్పుడు బ్రహ్మ వారితో ‘’కాశీ క్షేత్రం అవి ముక్త క్షేతం .అక్కడ మహా తపస్వి అయిన అగస్త్య మహర్షి నిత్య విశ్వేశ్వర దర్శనం గంగా స్నానాల తో పునీతు డవుతున్నాడు .ఆయన దగ్గరకు వెళ్ళండి .ఆయనే తగిన ఉపాయం చెప్ప గలదు .మీ ప్రయత్నం సఫలం అగు గాక ‘’అని చెప్పి అదృశ్య మయాడు .బ్రహ్మ దర్శనం అయి నందుకు ,కాశీ క్షేత్ర దర్శనం,గంగా విశ్వేశ్వరఅగస్త్య దర్శనం చేయమని ఆయన చెప్పిన సలహా కు ఆనంద పడి దేవత లందరూ కాశీ పట్నానికి బయల్దేరి వెళ్లారు

వారాహీ దేవి ఆలయం వుంది. ఈవిడిని చూడలంటే ఉదయం 7 గం. లోపే వెళ్ళాలి. ఈవిడ విగ్రహం భూగృహం (సెల్లార్) లో వుంటుంది. నేలపై వున్న గ్రిల్ లోనుంచి చూడాల్సిందే. ఈవిడ గ్రామదేవత. ఉగ్రదేవత. ఎప్పుడూ చాలా వేడిగా వుంటుంది. అందుకే దర్శనం ఉదయం 7 గం. లలోపే.
===
భూగృహంలో ఉన్న వారాహిదేవి విగ్రం చాలా పెద్దది. ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికీ ఆ భూగృహంలో ప్రవేశం లేదు. ఉదయం 7 గంటలలోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించినా కిందకి మాత్రం వెళ్ళనీరు. పై భాగంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూడగలం. అమ్మవారి ముఖం, పాదాలు మాత్రమే చూడగలం.

వారాహిదేవి ఉగ్రదేవతే కానీ, గ్రామ దేవత కాదు. అష్టమాతృకా దేవతలలో ఒకటి.

సూర్య స్తుతి - కాశీ ఖండం - నవమోధ్యాయం.

ఈ 70 నామములను ఉచ్చరించుచూ, సూర్య భగవానుని చూస్తూ, మోకాళ్ళపై నిలబడి, రెండు చేతులతో రాగి పాత్రను పట్టుకొని, ఆ పాత్రను నీటితో నింపి, గన్నేరు మున్నగు ఎర్రని పూలు, ఎర్ర చందనము, దూర్వారాన్కురములు, అక్షతలు ఉంచి, ఆ పాత్రను తన నొసటికి ఎదురుగా ఉంచుకొని, సూర్య భగవానునకు అర్ఘ్యము నొసంగిన వారు దరిద్రులు కారు, దుఃఖము లను పొందరు, భయంకర వ్యాధుల నుండి విముక్తిని పొందెదరు, మరణానంతరము సూర్య లోకమున నివసింతురు.

౧. ఓం హంసాయ నమః
౨. ఓం భానవే నమః
౩.ఓం సహశ్రాంశవే నమః
౪.ఓం తపనాయ నమః
౫.ఓం తాపనాయ నమః
౬.ఓం రవయే నమః
౭.ఓం వికర్తనాయ నమః
౮.ఓం వివస్వతే నమః
౯. ఓం విశ్వ కర్మణే నమః
౧౦. ఓం విభావసవే నమః
౧౧. ఓం విశ్వ రూపాయ నమః
౧౨. ఓం విశ్వ కర్త్రే నమః
౧౩. ఓం మార్తాండాయ నమః
౧౪. ఓం మిహిరాయ నమః
౧౫. ఓం అంశు మతే నమః
౧౬. ఓం ఆదిత్యాయ నమః
౧౭. ఓం ఉష్ణగవే నమః
౧౮. ఓం సూర్యాయ నమః
౧౯. ఓం ఆర్యంణే నమః
౨౦. ఓం బ్రద్నాయ నమః
౨౧. ఓం దివాకరాయ నమః
౨౨. ఓం ద్వాదశాత్మనే నమః
౨౩. ఓం సప్తహయాయ నమః
౨౪. ఓం భాస్కరాయ నమః
౨౫. ఓం అహస్కరాయ నమః
౨౬. ఓం ఖగాయ నమః
౨౭. ఓం సూరాయ నమః
౨౮. ఓం ప్రభాకరాయ నమః
౨౯. ఓం లోక చక్షుషే నమః
౩౦. ఓం గ్రహేస్వరాయ నమః
౩౧. ఓం త్రిలోకేశాయ నమః
౩౨. ఓం లోక సాక్షిణే నమః
౩౩. ఓం తమోరయే నమః
౩౪. ఓం శాశ్వతాయ నమః
౩౫. ఓం శుచయే నమః
౩౬. ఓం గభస్తి హస్తాయ నమః
౩౭. ఓం తీవ్రాంశయే నమః
౩౮. ఓం తరణయే నమః
౩౯. ఓం సుమహసే నమః
౪౦. ఓం అరణయే నమః
౪౧. ఓం ద్యుమణయే నమః
౪౨. ఓం హరిదశ్వాయ నమః
౪౩. ఓం అర్కాయ నమః
౪౪. ఓం భానుమతే నమః
౪౫. ఓం భయ నాశనాయ నమః
౪౬. ఓం చందోశ్వాయ నమః
౪౭. ఓం వేద వేద్యాయ నమః
౪౮. ఓం భాస్వతే నమః
౪౯. ఓం పూష్ణే నమః
౫౦. ఓం వృషా కపయే నమః
౫౧. ఓం ఏక చక్ర ధరాయ నమః
౫౨. ఓం మిత్రాయ నమః
౫౩. ఓం మందేహారయే నమః
౫౪. ఓం తమిస్రఘ్నే నమః
౫౫. ఓం దైత్యఘ్నే నమః
౫౬. ఓం పాప హర్త్రే నమః
౫౭. ఓం ధర్మాయ నమః
౫౮. ఓం ధర్మ ప్రకాశకాయ నమః
౫౯. ఓం హేలికాయ నమః
౬౦. ఓం చిత్ర భానవే నమః
౬౧. ఓం కలిఘ్నాయ నమః
౬౨. ఓం తాక్ష్య వాహనాయ నమః
౬౩. ఓం దిక్పతయే నమః
౬౪. ఓం పద్మినీ నాధాయ నమః
౬౫. ఓం కుశేశయ నమః
౬౬. ఓం హరయే నమః
౬౭. ఓం ఘర్మ రశ్మయే నమః
౬౮. ఓం దుర్నీరీక్ష్యాయ నమః
౬౯. ఓం చండాశవే నమః
౭౦. ఓం కశ్యపాత్మజాయ నమః

కాశీపంచకం

మనో నివృత్తిః పరమోపశాంతిః స తీర్థవర్యా మణికర్ణికా త్ర
జ్ఞానప్రవాహో విమలాదిగంగా సా కాశికాహం నిజబోధరూపా || ౧ ||

యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా కా కాశికాహం నిజబోధరూపా || ౨ ||

కోశేషు పంచస్వభిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిగేహగేహం
సాక్షీ శివః సర్వగతోంతరాత్మా కా కాశికాహం నిజబోధరూపా || ౩ ||

కాశ్యాంతు కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా
సా కాశీ విదితా యేన తేన ప్రాప్తా హి కాశికా || ౪ ||

కాశీక్షేత్రం శరీరం త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞానగంగా
భక్తి శ్రద్ధా గయేయం నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః
విశ్వేశోzయం తురీయః సకలజనమనః సాక్షిభూతోంతరాత్మా
దేహే సర్వం మదీయే యది వసతి పునస్తీర్థమన్యత్కిమస్తి || ౫ ||

పై శ్లోకములలో శ్రీ శంకరులు కాశికను ఆత్మజ్ఞానపరముగా భావించి వివరించినారు. ఆచార్యులవారి దృష్టిలో కాశీ నగరము అద్వైత విద్యకు ఒక ప్రతీకగా కన్పించినది. ముముక్షువునకు బహిర్భూతము గా కాశీ లేదు. అందుచేతనే కాశీకి వేదములలో ప్రదానస్తానము కన్పించుచున్నది
Read More

ఋణవిమోచక అంగారక శ్తోత్రం

ఋణవిమోచక అంగారక శ్తోత్రం

స్కంద ఉవాచ :
ఋణ గ్రస్తారాణాం తు – ఋణముక్తి కథం భవేత్ |
బ్రహ్మోవాచః వక్ష్యో హం సర్వలోకానాం – హితార్థం హితకామదం
శ్రీమద్ అంగారక స్తోత్ర మహామంత్రస్య – గౌతమఋషిః – అనుష్టుప్ ఛందః
అంగారకో దేవతా మమ ఋణవిమోచనార్థే జపే వినియోగః

ధ్యానం:
రక్తమాల్యాంభరధరః – శూలశక్తిగధాధరః
చతుర్భుజో మేశాగతో – వరధశ్చ ధరాసుతః
మంగళో భూమిపుత్రశ్చ – ఋణహర్తా ధనప్రదః |
స్థిరాసనో మహాకాయః – సర్వకామఫలప్రదః
లోహితో లోహితాక్షశ్చ – సామగానాం కృపాకరః |
ధరాత్మజః కుజోభౌమో – భూమిజో భూమినందనః
అంగారకో యమశ్చైవ – సర్వరోగాపహారకః |
సృష్టి కర్తాచ హర్తాచ – సర్వదేవైశ్చ పూజితః
ఏతాని కుజ నామాని – నిత్యం యః ప్రాతః పటేత్ |
ఋణం చ జాయతే తస్య – ధనం ప్రాప్నోత్యసంశయం
అంగారక మహీపుత్ర – భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమాశేష – ఋణ మాశు వినాశయ
రక్తగంధైశ్చ పుష్పైశ్చ – దూపదీపై ర్గుడోదకైః
మంగళం పూజయిత్వా తు – దీపం దత్వా తదంతికే
ఋణరేఖాః ప్రకర్తవ్యా – అంగారేణ తదగ్రతః |
తాశ్చ ప్రమార్జయే త్పశ్చాత్ – వామపాదేన సంస్పృషన్ .

మూల మంత్రం
అంగారక మహీపుత్ర – భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమాశేష – ఋణ మాశు విమోచయ
ఏవం కృతే న సందేహో – ఋణం హిత్వాధనీ భవేత్
మహతీం శ్రియ మాప్నోతి – హ్యపరో ధనదో యథా

ఆర్ఘ్యం
అంగారక మహీపుత్ర – భగవాన్ భక్తవత్సల
నమోస్తుతే మమాశేష – ఋణ మాశు విమోచయ
భూమిపుత్ర మహాతేజ – స్స్వేదోద్భవ పినాకినః
ఋణార్తస్త్వాం ప్రపన్నో స్మి – గృహాణార్ఘ్యం నమోస్తుతే
Read More

కొన్ని ప్రాంతాలలో ధన త్రయోదశి .. నరక చతుర్దశి .. బలిపాడ్యమి .. యమద్వితీయలను కలుపుకుని దీపావళి అయిదు రోజుల పండుగలా కనిపిస్తుంది

కొన్ని ప్రాంతాలలో ధన త్రయోదశి .. నరక చతుర్దశి .. బలిపాడ్యమి .. యమద్వితీయలను కలుపుకుని దీపావళి అయిదు రోజుల పండుగలా కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాలలో నరకచతుర్దశితోనే మొదలై దీపావళి .. బలిపాడ్యమితో మూడురోజుల పండుగగా దర్శనమిస్తుంది. ఆశ్వయుజ బహుళ చతుర్దశి 'నరకచతుర్దశి' గా చెప్పబడుతోంది.

లోక కంటకుడైన నరకాసురుడు అనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు వధించిన కారణమే ఈ రోజుకి గల విశేషమని కొందరు చెబుతుంటారు. ఇక నరకలోక బాధలను అనుభవించే పరిస్థితి తమకి రాకూడదనీ, ఒకవేళ తమ పూర్వీకులు నరకలోకంలో గనుక వుంటే అక్కడి నుంచి వాళ్లకి విముక్తి కలగాలని భావిస్తూ యమధర్మరాజుని పూజించే కారణంగా కూడా ఇది నరక చతుర్దశిగా పిలవబడుతోందని మరికొందరు చెబుతుంటారు.

నరకాసురుడు ఈ రోజు ఉదయాన సంహరించబడిన కారణంగా తలస్నానం చేయడం ... ఆ సంతోషంతో పిండివంటలు చేసుకోవడం ... మతాబులు కాలుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ రోజున చేసే స్నానం విశేషమైన పుణ్యఫలాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున ... దీపావళి రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ... నీటిలో గంగ కొలువై ఉంటారట.

అందువలన ఈ రోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో తలంటుకుని, స్నానం చేయడానికి ముందు ఔషధ గుణాలు కలిగిన ఉత్తరేణి .. తుమ్మి .. తగిరస చెట్ల కొమ్మలతో ఆ నీటిని కలుపుతారు. ఆ తరువాత యముడికి తర్పణం వదలడం ... ఆయనని పూజించడం చేస్తారు. ఈనాటి సాయంత్రం పితృదేవతలను తలచుకుని ఇంటిముందు దీపాలను వెలిగిస్తారు. ఇలా నరక చతుర్దశి ... నరకాసురుడి సంహారం జరిగిన కారణంగా జరుపుకునే సంతోషాల సంబరంగా కనిపిస్తుంది. నరకలోక బాధల నుంచి తమ పూర్వీకులకు విముక్తి కల్పించమని యమధర్మరాజుని ప్రార్ధించే విశేషమైన రోజుగా అనిపిస్తుంది
Read More

దీపావళి రోజున నువ్వుల నూనెతోనే దీపాలు పెట్టాలట!

దీపావళి రోజున నువ్వుల నూనెతోనే దీపాలు పెట్టాలట!

దీపావళి రోజున దీపాల వెలుగులు తమ ఇంటి ముందు వెదజల్లాలని స్త్రీలు తాపత్రయ పడతారు. ఇందులో భాగంగా కొత్త బట్టలు, తీపి వంటలు, టపాకాయలు వంటివి సిద్ధం చేసుకుని సాయంత్రానికల్లా దీపాలు పెట్టేందుకు సిద్ధమవుతారు. అయితే దీపాలకు ఉపయోగించే నూనె ఏది ఉపయోగించాలో కొందరు తెలియకపోవచ్చు.

దీపావళి రోజున నెయ్యితో దీపమెలిగించినా ఫలితం లేదని నువ్వులనూనెతోనే దీపాలు పెట్టాలని పండితులు అంటున్నారు. ఎందుకంటే దీపావళి రోజున లక్ష్మీదేవి నువ్వులనూనెలోనే నివాసముంటుంది. అందుకే దీపాలు పెట్టాలనే నియమం పాటించడం ఆనవాయితీగా వస్తుందని పురోహితులు అంటున్నారు. దీపావళి రోజున దీపాలు పెట్టడం ద్వారా ఆ లక్ష్మీదేవి ఆయా ఇళ్లలో నివాసముంటుందని వారు చెబుతున్నారు.

దీపం వెలుగులు ఎక్కడైతే విరజిమ్ముతూ ఉంటాయో అక్కడ దుష్ట శక్తులు నిలవలేవు. అలాంటి దివ్యమైన వెలుగులు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంటాయి. అందువల్లనే ఈ రోజున నువ్వులనూనెతో దీపాలు పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించి పూజిస్తూ వుంటారు. ఆ తల్లి అనుగ్రహంతో సిరిసంపదలను పొందుతుంటారు. అందుచేత ఈ దీపావళి రోజున నువ్వుల నూనెతో దీపమెలిగించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుదురుగాక.
Read More

దీపాలంకరణ మరియు లక్ష్మీ పూజ

దీపాలంకరణ మరియు లక్ష్మీ పూజ

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.
మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది.
దీపాలపండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత కలదు. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు.

ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు.

ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.. "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది.
అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.

Read More

ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి, సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి

ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి, సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.

దీపావళినాడు నూనెలో ( ముఖ్యంగా నువ్వులనూనె) లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారు. కనుక ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఇలా చేయుడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది, గంగానదీ స్నాన ఫలం లభిస్తుంది, నరక భయం ఉండదనేది పురాణాలు చెపుతున్నాయి.

అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. 'యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టి చెంది ఆశీర్వదిస్తారు.

స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇళ్ళ ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపు , కుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి, సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన, రుచికరమైన భక్ష్యభోగ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్దం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం, ఆ రోజంతా ఎక్కడలేని హడావుడి, ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాంటాయి.
దిబ్బు దిబ్బు దీపావళి

దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...

అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయంగా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత, కాళ్ళు కడుక్కుని, ఇంటిలోపలకు వచ్చి, తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
పర్యావరణానికి హాని కలగకుండా దీపావళి
Read More

కార్తిక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది

కార్తిక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం. కనుక 'కార్తిక దామోదర' అనే నామంతో స్మరణ చేయాలి. సూర్యోదయానికి ముందుగా 'ఆకాశదీపం' పెట్టే సంప్రదాయం ఉంది. హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపం ద్యోతకమవుతుంది. దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది.
ఏక భక్తం (ఒంటిపూట భోజనం) ఈ మాసంలో చేయాలి. ప్రతిరోజూ ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివదర్శనం చేయడం శ్రేష్ఠం. శివాలయంలో, విష్ణ్వాలయంలో దీపాన్ని వెలిగించడం మంచిది. ఇంట్లో కూకా ప్రతిరోజూ సంధ్యాదీపం వెలిగించాలి. కార్తికమాసమంతా కార్తిక పురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం.
శివుడు 'ఆశుతోషుడు' - వెంటనే సంతోషించే స్వామి.
అభిషేక ప్రియః శివః - అన్నారు కనుక ఈ మాసంలో శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి, సకల శుభాలను ప్రసాదిస్తుంది. కార్తికమాసం బృందావన యాత్ర, బృందావన పూజ విశిష్టం. బృందావనంలో శ్రీకృష్ణుని ఈ కార్తిక మాసాన ఆరాధించితే బహుశ్రేష్ఠం. దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో తులసి కోటను ఆరాధించే విధానాన్ని ఏర్పరచారు. నెలరోజులూ తులసి సన్నిధిలో దీపాన్ని వెలిగించి, విష్ణు పూజ చేయడం మంచిది.
పాడ్యమి నాడు - గోవర్ధన పూజ చేయాలి. బృందావనం వెళ్లి గోవర్ధన పూజ చేయలేని వారు - ఇంట్లో ఆవుపేడను ముద్దగా పెట్టి గోవర్ధన గిరిగా భావించి పూజించాలి. కార్తిక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యమును సంపాదించుకుంటారు.
కార్తిక బహుళ త్రయోదశి మొదలు అమావాస్య వరకు గల మూడు రోజులు గోపూజ చేస్తే ఇహమందు ఐశ్వర్యమును అనుభవించి అంత్యమున విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తిక శుద్ధ అష్టమి నాడు గోపూజ చేసిన వారు సమస్త వ్రతములు చేసిన ఫలమును పొందుతారు.
కార్తిక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం. కనుక 'కార్తిక దామోదర' అనే నామంతో స్మరణ చేయాలి. సూర్యోదయానికి ముందుగా 'ఆకాశదీపం' పెట్టే సంప్రదాయం ఉంది. హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపం ద్యోతకమవుతుంది. దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది. ఏక భక్తం (ఒంటిపూట భోజనం) ఈ మాసంలో చేయాలి. ప్రతిరోజూ ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివదర్శనం చేయడం శ్రేష్ఠం. శివాలయంలో, విష్ణ్వాలయంలో దీపాన్ని వెలిగించడం మంచిది. ఇంట్లో కూకా ప్రతిరోజూ సంధ్యాదీపం వెలిగించాలి. కార్తికమాసమంతా కార్తిక పురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం. శివుడు 'ఆశుతోషుడు' - వెంటనే సంతోషించే స్వామి. అభిషేక ప్రియః శివః - అన్నారు కనుక ఈ మాసంలో శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి, సకల శుభాలను ప్రసాదిస్తుంది. కార్తికమాసం బృందావన యాత్ర, బృందావన పూజ విశిష్టం. బృందావనంలో శ్రీకృష్ణుని ఈ కార్తిక మాసాన ఆరాధించితే బహుశ్రేష్ఠం. దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో తులసి కోటను ఆరాధించే విధానాన్ని ఏర్పరచారు. నెలరోజులూ తులసి సన్నిధిలో దీపాన్ని వెలిగించి, విష్ణు పూజ చేయడం మంచిది. పాడ్యమి నాడు - గోవర్ధన పూజ చేయాలి. బృందావనం వెళ్లి గోవర్ధన పూజ చేయలేని వారు - ఇంట్లో ఆవుపేడను ముద్దగా పెట్టి గోవర్ధన గిరిగా భావించి పూజించాలి. కార్తిక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యమును సంపాదించుకుంటారు. కార్తిక బహుళ త్రయోదశి మొదలు అమావాస్య వరకు గల మూడు రోజులు గోపూజ చేస్తే ఇహమందు ఐశ్వర్యమును అనుభవించి అంత్యమున విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తిక శుద్ధ అష్టమి నాడు గోపూజ చేసిన వారు సమస్త వ్రతములు చేసిన ఫలమును పొందుతారు.
Read More

కార్తీకమాసంలో ఆచరించవలసిన విధులు

కార్తీకమాసంలో ఆచరించవలసిన విధులు


మాసాలలో కార్తీక మాసానికి సమానమైనది లేదని శాస్త్రం చెబుతోంది. చాంద్రమానాన్ని అనుసరించి ఎనిమిదవ మాసంగా చెప్పబడుతోన్న కార్తీక మాసాన్ని కౌముది ( వెన్నెల) మాసమని అంటారు. కార్తీక మాసానికి అధిదేవుడు 'దామోదరుడు' కనుక దీనిని 'దామోదర మాసం' అని కూడా పిలుస్తుంటారు.

ప్రతి రోజు ఒక విశేషాన్ని కలిగివుండే కార్తీకమాసం, శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది. హరిహరుల అనుగ్రహాన్ని పొందాలంటే ఈ మాసంలో అనేక విధులను పాటించవలసి వుంటుంది. ఈ మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కార్తీక దామోదరుడి నామాన్ని స్మరిస్తూ నదీ స్నానం చేయవలసి వుంటుంది. ఈ మాసంలో అన్ని జలాశయాల్లోనూ 'గంగ' అంతర్లీనంగా ప్రవహిస్తూ వుంటుంది కనుక, స్నాన ఫలితం విశేషంగా వుంటుంది.

ఈ మాసంలో చేయబడిన దైవారాధన ... ఉపవాసాలు ... జపాలు ... దీప దానాలు ... కూడా అనంతమైన పుణ్య ఫలాలను అందిస్తాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో హరిహరులను పూజించడం ... కీర్తించడం ... పురాణ పఠనం చేయడం ... ఆలయాలలో దీపారాధన చేయడం ... వనభోజనాలకు వెళ్లడమనేది కార్తీకమాసంలో ఆచరించవలసిన ప్రధానమైన విధులుగా చెప్పబడుతున్నాయి. ఈ విధులను ఆచరించడం వలన లభించే పుణ్యఫలం జన్మజన్మల పాటు వెంట వస్తుందని స్పష్టం చేయబడుతోంది.
Read More

కార్తీక శని, ఆదివారాల్లో దీపాలు ఎలా వెలిగించాలంటే..!?

కార్తీక శని, ఆదివారాల్లో దీపాలు ఎలా వెలిగించాలంటే..!?

కార్తీక మాసంలో శివుడిని ప్రార్థిస్తూ దీపాలు వెలిగించడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే కార్తీక మాసంలో వచ్చే శని, ఆదివారాల్లో ఉత్తర దిశలో నేతితో దీపమెలిగించిన వారికి కుబేర అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

తపోశక్తిచే పరమేశ్వరునికి స్నేహితుడైన కుబేరునికి కార్తీక శుక్రవారాల్లో పూజమందిరం లేదా ఆలయాల్లో నేతితో ఉత్తర దిశన దీపమెలిగిస్తే ఆర్థిక వృద్ధి ఉంటుందని పురోహితులు చెబుతున్నారు.

దీపమెలిగించే సమయాన ముందుగా దీపాన్ని ముందుగా నూనెను లేదా నేతితో నింపి తర్వాత తామర, దూది వత్తులను వేయాలి. అలాగే పూజ పూర్తయ్యాక నైవేద్యం సమర్పించి దీపారాధన చేసేటప్పడు కర్పూరం కింద విభూతిని పెట్టి హారతి ఇవ్వాలి. ఆ విభూతిని ప్రతిరోజూ ధరిస్తే శుభఫలితాలు ఉంటాయి.

కార్తీక సోమ, శుక్ర, శని, ఆదివారాల్లో పంచముఖాలతో కూడిన దీపాలు వెలిగించే వారికి వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది. అలాగే ఆలయాల్లో నేతితో పంచముఖ దీపాలు వెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు.
Read More

దీపదానం చేస్తే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయట..!

దీపదానం చేస్తే.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయట..!

కార్తీక మాసంలో పత్తిని చక్కగా తీసుకొని వత్తి చేసి వరిపిండితోగానీ, గోధుమపిండితోగానీ చేసిన ప్రమిదలో నెయ్యి పోసి దీపం వెలిగించి ఆ దీపాన్ని పురోహితునికి దానం చెయ్యాలి. ఇదేవిధంగా నెలంతా దానం ఇచ్చి నెలాఖరున వెండి ప్రమిదలో బంగారపు రంగుతో అంటే… పసుపునుపూసిన వత్తితో దీపం వెలిగించి దానిని బ్రాహ్మణునికి దానం చేయండి. ఆపై బ్రాహ్మణునిని అన్నదానం కూడా చేయండి. దీపాన్ని దానం చేసేటప్పుడు…

“సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంప త్సుఖావహం”
“దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ”-
అనే మంత్రాన్ని మనస్సులో ధ్యానించి దానం చేయాలి. ఇలా స్త్రీలుగాని, పురుషులు గానీ దీపదానం చేస్తే విద్య, దీర్ఘాయువు, అష్టైశ్వర్యాలు, స్వర్గప్రాప్తి లభిస్తుంది. కార్తీకమాసంలో దీపదానం చేస్తే.. తెలిసిగానీ, తెలియకగానీ చేసిన పాపాలు తొలగిపోతాయి.

“దీపదానం మహిమను గురించి వివరించే కథ”
పూర్వం ద్రవిడ దేశంలో పరమలోభిగా ఓ స్త్రీ జీవించేది. తమకంటూ ఎవ్వరూ లేని స్థితిలో ఉన్నఆ మహిళ బిచ్చమెత్తుకుంటూ… తనకని వంట చేసుకోక ఇతరుల ఇళ్లల్లో తింటూ బతికేది. అంతేకాకుండా ఎవరికి దాన ధర్మాలు చేయదు. ప్రతి పైసాను కూడబెట్టుకునేది. పుణ్యక్షేత్రాలకు వెళ్లేదికాదు. పరమలోభి.

శుచిశుభ్రత లేకుండా జీవితాన్నిగడుపుతూ ఏదో ఒక మార్గంలో వెళ్తున్నఆమెకు ఓరోజు ఉత్తముడైన బ్రాహ్మణుడు ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం మేరకు కార్తీక మాసం పూర్తిగా చల్లటినీటిలో స్నానం చేసి దీపదానం చేసింది. కొద్ది రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించింది.

అయితే ఇతరులకు దానం, పుణ్యక్షేత్రాల సందర్శన చేయని ఆమెకు దీపదానం చేయడం ద్వారా స్వర్గప్రాప్తి లభించింది. ఈ కథను వసిష్ఠుడు జనక మహారాజుకు మోక్షమార్గాలను ఉపదేశించే సమయంలో పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.
Read More

స్త్రీలు చేయ తగిన చేయ కూడని పనులు

స్త్రీలు చేయ తగిన చేయ కూడని పనులు

౧. స్త్రీలు ఎప్పుడు గుమ్మడి కాయను కొట్టరాదు ఎందుకంటె గర్భ సంచి కిందికి జారిపోయే అవకాశములు ఎక్కువ
౨.గర్భిణి స్త్రీలు శూర టెంకాయ తమిళంలో చిదరు కాయ్ అంటారు దానిని కొట్ట కూడదు ఎందుకంటె అడురుడుకు గర్భము జారిపోవచ్చు, అదే మాదిరి శూర టెంకాయ కొట్టే స్తలములో కూడా ఉండకూడదు
౩ గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాల ఉంటుంది ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్నమవడానికి కావలసిన ఆమ్లములు ఉరవు అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు
౪ మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును
౫ మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయ వలెను
౬ మీరు మీ పిల్లలో దిండు పైన కూర్చో వద్దు ఐతే ఈ కాలములో అందరు దీనిని తప్పక చేస్తుంటారు
౭ స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు
౮ దుక్కము విచారణ చేయ వచ్చిన వారిని ఆహ్వానించ కూడదు అలాగే వారు పోయేటప్పుడు వెల్లివస్తానని చెప్పా కూడదు ఈ మధ్య కాలంలో దుఃఖము విచారించ వచ్చిన వారినిని రండి రండి అంది సాదరముగా ఆహ్వానించి స్థలము ఇచ్చి పోర్చోపెట్టి కాపీలు ఇచ్చి చాల అతిథి మర్యాదలు చేస్తారు పరోక్షముగా మనము అశుభములను కోరుదోవడానికి ఇది నాంది అవుతుంది
౯ కోత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక ముల రాయాలి పసుపు క్రిమి నాసిని
౧౦ ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోడదు అయితే ఈ మధ్య కాలములో ఈ పని చాల చోట్లలో సహజమై పోయింది
౧౧ నలుపు రంగు వస్తువులు బట్టలు దరించ కండి ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలుకుడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువై పోయింది
౧౨ ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన చేతిలో ఇవ్వకూడదు కింద పెట్టండి వాళ్ళే తీసుకొంటారు ఈ మద్య కాలంలో ఉప్పు చేతితో వడ్డించడం చాల చోట్లలో గమనిస్తాము
౧౩ ప్రతి రోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి ఇది పితృ దేవతలకు ప్రీతి కాకికి మనము భోజనము చేయుటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి అయితే కుక్కలను ఎల్లప్ప్పుడు కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనము చేయడము ఎక్కువై పోయింది
౧౪ టెంకాయ చిప్ప తామ్బులము ఇచ్చేటప్పుడు మూడు కండ్లు వుండే భాగము మీరు ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను
౧౫ స్త్రీలు ఎప్పుడు జుట్టు విరవ పోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్టాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది ఈ చర్య ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పని సరి అయిపొయింది
౧౬ సుక్రవారమునాడు గాని జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పైపై డబ్బులు చేరటానికి అవకాసము ఎక్కువ
౧౭ కాలిపైకాలు వేసుకొని కుర్చోవడము, కాల్లాడిస్తూ కూచోవడం ఒంటి కాలితో నిలవడం స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ
౧౮ ఎల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ఎడమ చేతిని ఉపయోగించ కూడదు
౧౯ సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారము తినకుండా నిద్రించ కూడదు
౨౦ స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు
౨౧ పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు రేపు తీసుకుంటాను అని అనవలెను
౨౨ ఎప్పుడు మన నోటినుండి పీడ దరిద్రం శని పీనుగా కష్టము అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు
౨౩ ఇంటిలో దుమ్ము ధూలి సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువు పదిరోజులకు ఒకమారు మంగళ శుక్ర వారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను
౨౪ స్రాద్హ దినమందు ఇంటి ముందు ముగ్గు స్రాద్హము అయ్యేవరకు వేయకూడదు స్రాద్హనంతరము ముగ్గు వేసి తర్వాత ఇంటిలోని వారు భోజనము చేయవలెను
౨౫ దిండు ఓర దుప్పట్లు అప్పుడప్పుడు ఉతుకుతూ వాడాలి మనకు తెలియని సుక్ష్మ క్రిములు చాల ఉంటాయి దాని వాళ్ళ మనకు హాని జరుగును
Read More

కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు కలవు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.

కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు కలవు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.
ఇంకా చూడండి

చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్తమ్రులు, గంగకంటే పుణ్యప్రథములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం. కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు’ అన్న పేరు వచ్చింది. ‘అభిషేక ప్రియః శివః’ శివునికి అలంకారాలతో రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని శివుడ్ని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగ చేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునిని శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు, ఏకకాలంలో రెండురూపాలని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధ నారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనంచేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయములో ప్రార్ధన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహా లింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సర మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణుని కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్ధం’ అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉతృష్టమైంది. కార్తిక మాసంలో ఏమంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. ‘కార్త్తిక పురాణం’ రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం. ఈ మాసం మొదటినుండి సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరాను గ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్య తిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలునుండే ‘ఆకాశదీపం’ ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో గృహమందు, పూజామందిరంలోను, తులసి సన్నిధిలోను, ఆలయమలలో దీపారాధన, ఇహ, పర సౌఖ్యాలను కలగచేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్త్యం. దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమం. మంచి నూనె మధ్యమము. ఏకాదశి అత్యంత విశేషమైనది. ‘ఉత్థానైకాదశి’ కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి లాంటి దినాలుప్రశస్తమైనవి.
పండుగలు
Read More

Powered By Blogger | Template Created By Lord HTML