గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 28 September 2014

అన్నదాన గొప్పతనం.

అన్నదాన గొప్పతనం.

అన్నిదానములను నన్నదానమే గొప్ప
కన్నతల్లికంటే ఘనములేదు
ఎన్నగురునికన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ.

తాత్పర్యము : అన్నింటికంటే ఘనమైనది అన్నదానము. ఎన్ని దానములు చేసిన అసంతృప్తితో ఉన్నవారు అన్నము దానము చేయుటతోనే సంతుష్టులు అవుతారు. కన్నతల్లి కంటే లోకములో ఉత్తమమైనది మరేది లేదు. జ్ఞానము ప్రసాదించు గురువు కంటే మించినవారు ఎవరూ లేరు. ఇవి నిత్య సత్యాలు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు. అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు. దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా చెప్తారు. మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏంలాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేసావని, అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు. మరి.. ఎప్పుడైనా అన్నదానం చేసావా?’’ అనడిగాడు. దానికి సమాధానంగా లేదు.. నేనెన్నో దానాలు చేసాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు. ‘‘పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?’’ అనడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు- ‘‘అవును. ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను’’ అని.నీవుఅన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిను నోట్లో పెట్టుకో’’ అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి, ఇక్కట్ల నుండి బయటపడడానికి చక్కటి రెమిడీగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితులు. అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమవుతాయని చెప్తారు. అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తేఅద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ప్రతీతి. కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం, దానికితోడు విపరీతమైన ఖర్చులతో సతమతమవడం జరుగుతుంది. అలాంటివారు అన్నంతో లడ్డు పెట్టి, తాంబూల సహితంగా దానం ఇస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దీర్ఘ రోగాలతో సతమతమవుతున్నవారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి. అటువంటప్పుడు చిత్రాన్నంతోపాటు వడ దానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్ర, తంత్ర సంబంధమైన దోషాలైనా తొలగిపోతాయి. బెల్లం అన్నం దానం చేస్తే శ్రీమంతులవుతారు. భోజనం చేసేముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో, ఇతర పక్షులతో ప్రాణులకో పెడతారు. ఇలా చేయడంవలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినేముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాలనుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు.
Read More

నవరాత్రులు – పూజావిధి:

నవరాత్రులు – పూజావిధి:

మామూలు రోజుల మాదిరిగా కాకుండా వసంత, (చైత్రపాడ్యమి మొదలు నవమి వరకు) శరన్నవ రాత్రులలో (ఆశ్వయుజ పాడ్యమి మొదలు నవమి వరకు) ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజావిధి నిర్వర్తించాలి. వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష. చేయగల్గిన వాళ్ళు ఆ తొమ్మిది రోజులు పండ్లు, పాలు మాత్రం సేవించి, పూజావిధి నిర్వర్తించవచ్చును. లేదా ఏకభుక్తం (పగలు పూజానంతరం భుజించడం)గానీ, నక్షం (రాత్రి భుజించడం) గానీ చేయవచ్చును. ‘ఉపవాసేవ నక్తేన చైవ ఏక భుక్తేన వాపునః పూజాస్థలం దేవీపూజకి ఇంట్లో ఎక్కడపడితే అక్కడ కాకుండా పూజాగృహంలోగానీ లేక ఇంట్లో తూర్పు దిక్కుగా వుండేట్లు సమప్రదేశం చూసుకుని, అక్కడ కడిగి పసుపునీళ్ళతో శుద్ధిచేసి ఆ భాగాన్ని పూజాస్థలంగా నిర్దేశించుకోవాలి. ఆ ప్రదేశం పదహారు హస్తాల మానము, ఏడు హస్తాల వెడల్పు, తొమ్మిది హస్తాల పొడుగు వుండటం మంచిదని పురాణోక్తి. ఆ ప్రదేశం మధ్యలో ఒక హస్తం వెడల్పు, నాలుగు హస్తాలు పొడుగు వుండేలా వేదికనమర్చి పూలమాలలతో, మామిడాకులతో తోరణాలతో అలంకరించాలి. దేవి విగ్రహ ప్రతిష్ట అమావాస్య రాత్రి ఉపవాసం వుండి మరునాడు (పాడ్యమి తిథి) వేద బ్రాహ్మణుల సహాయంతో వేదికపై దేవి ప్రతిమను విద్యుక్తంగా ప్రతిష్టించాలి. ఎక్కువగా అష్టాదశ భుజాలలో వివిధాయుధాలు ధరించి, మహిషాసురుని త్రిశూలం గుచ్చి వధిస్తున్న దేవీమాత ప్రతిమను దేవీ నవరాత్రోత్సవాలలో ప్రతిష్టించి పూజించడం పరిపాటి. నాలుగు భుజాల ప్రతిమను కూడా ప్రతిష్టించవచ్చు. సింహవాహనారూడురాలైన దేవీమాత విగ్రహం నిండుగా, కన్నుల పండుగ చేస్తూ వెలిగిపోతుంది. ప్రతిమ లేకపోతే దేవీ మంత్రం ‘ఐం హ్రీం క్లీం చాముందాయై విచ్చే’ అనేది రాగి రేకుమీద లిఖించబడినది వుంచి యంత్రాన్ని పూజించవచ్చును. ‘వాగ్భావం (ఐం) శంభువనితా (హ్రీం) కామబీజం (క్లీం) తతః పరం! చాముండాయై పదం పశ్చాద్విచ్చే ఇత్యక్షర ద్వయం’ దేవీమాతలోనుండి వాగ్దేవి (ఐం), శంభువనిత పార్వతి (హ్రీం) కామబీజం.. లక్ష్మీదేవి (క్లీం) ముగ్గురు దేవేరులు ప్రకటితమై త్రిమూర్తులకు శక్తిప్రదానం చేస్తూ సృష్టిస్థితి లయకారిణులై విలసిల్లుతున్నారు. అందుకే దేవి నవరాత్రోత్సవాలలో అమ్మవారిని రోజుకొక దేవి అలంకరణలో ఉత్సవమూర్తిని పూజించడం జరుగుతుంది దేవీమందిరాలలో, ప్రతిరోజూ దీక్ష గైకొన్న బ్రాహ్మణోత్తములు చండీయాగం నిర్వహిస్తూ ఉంటారు. మూలా నక్షత్రంతో కూడిన ఆరోజు సరస్వతీదేవి అలంకారంలో శ్వేతాంబర ధారిణిగా, వీణాపాణియై నేత్రపర్వం గావిస్తుంది. దేవీమాత, ఆరోజు సరస్వతీ పూజ చేసి ఐం బీజోపాసన గావించడం వాళ్ళ సర్వవిద్యలు కరతలామలకమౌతాయి. పూజా విధానం పాడ్యమినాడు వేదోక్తంగా ప్రతిష్టించిన ప్రతిమ ముందు కలశంపై కొబ్బరికాయ వుంచి, నూతన వస్త్రం కప్పి దేవీమాతను దానిపై ఆవాహన చేసి షోపశోపచార పూజా విధులతో విద్యుక్తంగా వేద బ్రాహ్మణుల సహాయంతో పూజ నిర్వర్తించాలి. దేవీ సహస్రనామపారాయణ అష్టోత్తర శత నామావళి, త్రిశతి మొదలైనవి చదువుతూ పుష్పాలతో పూజించడం పరిపాటి. బంతి, చేమంతి, జాజి, కనకాంబరం, అన్ని రకాల పుష్పాలు దేవీమాతకు ప్రీతికరమైనవే! పూజానంతరం నైవేద్యంగా పులగం, పొంగలి, పాయసం, చిత్రాన్నం, గారెలు మొదలైన వివిధ భక్ష్యాలు శక్త్యానుసారం సమర్పించాలి. పశుబలి నిషిద్దం, బియ్యప్పిండి, నెయ్యి వంటి వాటితో చేసిన సాత్వికాహారమే సమర్పించడం ప్రీతికరం. అసుర నాశనానికై ఆవిర్భవించిన కాళీమాత (చండముండులు, శంభనిశుంభ మర్థిని) ఉగ్రమూర్తిని శాంతపరచడానికి పశుబలి కావించడం సముచితమే నన్న అభిప్రాయం కొందరిదైనా సాత్విక యజ్ఞమే భుక్తిముక్తి ప్రదమైనది, సర్వులూ ఆచరించదగినది. పూజావిధి సమాప్తమైన తరువాత నవరాత్రులలో నృత్య గీతాలలో సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వర్తించడం కూడా ఆరాధనలో బాగమే. ఇక నవరాత్రుల దీక్షాకాలంలో భూమిమీద శయనించడం, బ్రహ్మచర్యం పాటించడం తప్పకుండా ఆచరించాలి. విజయదశమి నవరాత్రుల్లో దేవిని విద్యుక్తంగా పూజించాలి. దశమినాడు శ్రీరాముడు రావణవధ కావించడం వల్ల ఆరోజు విజయదశమి పర్వదినంగా ప్రసిద్ధిచెందింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఉత్తరాదిన రామలీలగా రావణ, కుంభకర్ణ, మేఘనాధుల విగ్రహాలను దహనం చేసి, బాణాసంచా వేడుకల మధ్య ఆనందోత్సవాలతో తిలకించడం పరిపాటి. ఇక ద్వాపరయుగంలో ఉత్తర గోగ్రహణ సందర్భంగా జమీవృక్షం మీద దాచిన దివ్యాస్త్రాలను పూజించి వాటితో కౌరవులను పరాజితులను చేస్తాడు అర్జునుడు. ఆ విజయాన్ని పురస్కరించుకుని దశమిరోజు జమీవృక్షాన్ని పూజించడం, ఆ చెట్టు ఆకులు బంధుమిత్రులను కలుసుకుని పంచడం ఆనవాయితీగా మారాయి. ఆయుధ పూజ దేవీమాత వివిధ హస్తాలతో దివ్యాయుధాలు ధరించి దుష్టసంహారం కావించింది. ఆయుధాలను పూజించడం వల్ల విజయం ప్రాప్తిస్తుందన్న విశ్వాసం అనాదినుండి వస్తున్నదే. అందుకే అష్టమి నవమి దశమిలలో ఒకరోజు వృత్తిపరంగా వాడే ఆయుధాలను, వాహనాలను పూజించడం జరుగుతున్నది. మహిమాన్వితమైన దేవీ నవరాత్రులలో భక్తిశ్రద్ధలతో కావించే పూజావిధులే గాక దశమి విజయదశమిగానూ, దసరాగానూనూ పిలువబడుతూ పండగ ఉత్సాహం అంతటా వెల్లివిరుస్తుంది. అంతటా భక్త్యావేశమే కానవస్తుంది. మహిషాసురమర్దిని ‘యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా! నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః ఇంద్రాది దేవతలు, త్రిమూర్తులు, నారదాది మునులు, ఊర్ద్యలోకవాసులు తమ ప్రార్థనలకు ప్రసన్నురాలై ఎదుట సాక్షాత్కరించిన దేవీమాతకు ప్రణామాలు అర్పించారు. దేవీమాత మణిద్వీపవాసిని వాళ్ళవైపు ప్రసన్నంగా చూసింది. ‘హే జగన్మాతా! రంభాసురుని పుత్రుడు మహిషాసురుడు బ్రహ్మవల్ల స్త్రీచేత తప్ప ఇతరులెవరివల్లా మరణం రాకుండా వరంపొంది, ఆ వరప్రభావంతో మూడు లోకాలను తన వశం చేసుకుని నిరంకుశంగా సాధుహింస చేస్తూ పాలన సాగిస్తున్నాడు. అతడిని వధించి లోకాలకు శాంతి చేకూర్చు మాతా!’ అంటూ ప్రార్ధించారు. ‘దేవతలారా! విచారించకండి. ఆ మహిషాసురుని దురాత్ములైన అతని అనుచరులను హతమార్చి, అధర్మం అంతరించేలా చేస్తాను’ అంటూ కరునార్ద్ర్హ వీక్షణాలతో వాళ్ళకు ధైర్యం చెప్పి అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా అష్టాదశ భుజాలతో (పదునెనిమిది) సంహవాహనరూఢురాలై గగనతలాన నిలిచింది. దేవి దివ్య శక్తులు, తేజం విలీనమైనాయి. శంకరుని తేజం దేవి ముఖ పంకజాన్ని చేరింది. శ్వేత పద్మంలా ప్రకాశించింది. ముఖమండలం, నల్లనైన కేశపాశంలో యముని తేజం నిక్షిప్తమై యమపాశంలా గోచరించింది. ఆమె మూడు నేత్రాలు అగ్ని జ్వాలలు విరజిమ్ముతున్నాయి. అగ్ని తేజంతో, వాయువు తేజం శ్రవణాలలో, సంధ్యా తేజం కనుబొమలలో ఒదిగాయి. నాసికలో కుబేరుని తేజం విలసిల్లగా, సూర్యుని తేజంతో అధరం విప్పారింది. ప్రజాపతి తేజం దంతపంక్తిలో, మహావిష్ణువు తేజం బాహువులలో, పశువుల తేజం అంగుళంలో కేంద్రీకృతమయ్యాయి. చంద్రుని తేజం వక్షస్థలంలో, ఇంద్రుని తేజం నడుములో, పృద్వితేజం నితంబాలలో నిక్షిప్తమయ్యయి. ఆయా దివ్య తేజస్సులు దేవీమాత అవయవాలను చేరడంతో కోటి విద్యుల్లతల కాంతితో ఆమె దేహం ప్రకాశించింది. సర్వాభరణ భూషితయై నిలిచిన ఆమె బాహువులలో వరుసగా మహావిష్ణువు చక్రం, శంకరుని త్రిశూలం, వరుణుని శంఖం, అగ్ని శతఘ్ని సంకాశమనే శక్తి వాయుదేవుని అక్షయ తూణీరాలు, ధనువు ఇంద్రుని వజ్రాయుధం, యముని దండం, విశ్వకర్మ పరశువు, ఖడ్గం, ముసలం, గద, పరిఘ, భుశుండి, శిరము, పాశం, చాపం,అంకుశం మొదలైన ఆయుధాలు ధరించి, సింహ వాహినియై మహిషాసురుని మహిప్యతీపుర బాహ్యంలో నిలిచి భయంకరంగా శంఖం పూరించింది. ఆ నాదానికి దిక్కులు పిక్కటిల్లాయి, భూమి కంపించింది. కుల పర్వతాలు గడగడలాడాయి, సముద్రంలో తరంగాలు ఉవ్వెత్తున ఎగిరిపడసాగాయి. ప్రళయ వాయువులు భీకరంగా వీచసాగాయి. దేవీమాత శంఖం నాదానికి అదిరిపడి ఆశ్చర్యంతో కారణం తెలుసుకురమ్మని పంపాడు మహిషాసురుడు తన అనుచరులను, వాళ్ళు తెచ్చిన వార్త మరింత ఆశ్చర్య చకితుడిని చేసిందతడిని. ‘ఎవరో దివ్యాంగన, అష్టాదశభుజాలలో వివిధాయుధాలు ధరించి సింహంపై ఆసీనురాలై తనతో యుద్ధభిక్ష కొరుతున్నదట. ఈ మహిషాసురుడు మాయా యుద్ధ ప్రవీణుడని, త్రిమూర్తులు, దేవతలు కూడా తన ధాటికి తాళలేకపోయారని తెలియక అంతటి సాహసం చేసి వుంటుంది. ఆమె బలశౌర్యాలేపాటివో తెలుసుకోవలసిందే’ అనుకుంటూ ముందుగా తన సేనాధిపతులైన బష్కల దుర్ముఖులను ఆమెను జయించి తీసుకురావసిందిగా ఆజ్ఞ ఇచ్చి పంపాడు మహిషాసురుడు. బాష్కల దుర్ముఖులు, ఆపైన అసిలోమ బిడాలాఖ్యులు, చిక్షుతతామ్రాక్షుల వంటి ఉగ్రదానవులందరూ ఆమెను జయించవచ్చి ఆమె చేతుల్లో చిత్తుగా ఓడి మరణించారు. ఆఖరుకు మహిషాసురుడు కదనానికి కదలక తప్పలేదు. దేవీమాత విశ్వమోహన రూపంతో కానవచ్చింది అతని కన్నులకు. ఆ సౌందర్యాన్ని చూస్తూ వివశుడై తనను వివాహం చేసుకుని, అసుర సామ్రాజ్యరాణివై సుఖించమని వేడుకుంటాడు. అతని మాటలకు ఫక్కున నవ్వి ‘దానవుడా! రూపం లేని నేను నీకోసం ఈ రూపు దాల్చి రావడం దేవతలను రక్షించడానికే సుమా, నీకు ప్రాణాలమీద ఆశవుంటే దేవ, మర్త్యలోకాలను విడిచి పాతాళానికి వెళ్ళి సుఖించు. కాని పక్షంలో యుద్ధానికి సిద్ధపడు మూర్ఖప్రలాపాలు మాని’ అంటూ శంఖం పూరించింది దేవీమాత. మహిషాసురుడు మాయను ఆశ్రయించి జంతు రూపాలు ధరిస్తూ యుద్ధం సాగించాడు కొంతసేపు లీలగా అతనితో పోరాడి సూటిగా త్రిశూలంతో వక్షస్థలాన్ని చీల్చి యమనదనానికి పంపివేసినది దేవీమాత. మహిషాసురుడు మరణంతో లోకాలు శాంతించాయి. దేవతలు ఆనందంతో పుష్ప వృష్టి కురిపించి ‘మహిషాసురమర్ధినికి జయము జయము’ అంటూ జయ జయ ధ్వానాలు చేసారు. వాళ్ళవైపు ప్రసన్నంగా చూస్తూ అంతర్ధానం చెందింది మహిషాసురమర్ధిని చరతం శరన్నవరాత్రులలో పఠించడంవల్ల దేవీమాత అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. రోజూ వీలుకాకపోయినా శరన్నవరాత్రుల పర్వదినాలలో దేవీ మహత్యాన్ని వివరించే దేవీ భాగవత పారాయణం అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. నవ అంటే నూతనమైన, రాత్రులంటే జ్ఞానాన్ని ప్రసాదించేవి కనుక ఆశ్వయుజ మాసం శుక్ల పాడ్యమి మొదలు తొమ్మిది రోజులు దేవీమాతను విశేష పూజలతో అర్చించడంవల్ల ఒక్క సంవత్సరకాలంలో చేసే పూజాఫలం లభిస్తుందని పురాణాలు తెలుపుతున్నాయి. ఆ తొమ్మిది రోజులలో అష్టమినాడు మహిషాసురుని వధించడమే గాక, శంభనిశంభులు, చందముండులు, రక్తభీజుడు, దుర్గమాసురుడు మొదలైన ఉగ్రదానవులెందరినో వధించి లోకాలలో శాంతిభద్రతలు, ధర్మం సుస్థిరం కావించింది దేవీమాత. అందుకే ఆ జగదంబ అనుగ్రహం సిద్ధించడానికి, ఈతిబాధలు, అతివృష్టి అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలకు గురికాకుండా వుండటానికి, యమదంష్ట్రికులైన (అంటే మరణాలు ముఖ్యంగా రోగాల వల్ల) శరధ్వంత ఋతువుల్లో ప్రజలు అకాలమృత్యువు వాతపడకుండా వుండటానికి భూలోకంలో అనాదికాలం కృతయుగం నుండి నేటివరకు దేవీనవరాత్రోత్సవాలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతున్నాయి.
Read More

నవరాత్రి పూజ విధానం

నవరాత్రి పూజ విధానం

తిథి తేదీ
మొదటి రోజు పాడ్యమి 25 సెప్టెంబర్ శ్రీ బాలా త్రిపుర సుందరి
రెండవ రోజు విదియ 26 సెప్టెంబర్ శ్రీ గాయత్రి
మూడవ రోజు తదియ 27 సెప్టెంబర్ శ్రీ మహాలక్ష్మి
నాలుగో రోజు చవితి 28 సెప్టెంబర్ శ్రీ అన్నపూర్ణ
ఐదవ రోజు పంచమి 29 సెప్టెంబర్ శ్రీ లలితాదేవి
ఆరవ రోజు సప్తమి 30 సెప్టెంబర్ శ్రీ సరస్వతి
ఏడవ రోజు అష్టమి 01 అక్టోబర్ శ్రీ దుర్గాదేవి (దుర్గాష్టమి)
ఎనిమిదవ రోజు నవమి 02 అక్టోబర్ శ్రీ మహిషాసురమర్ధిని
తొమ్మిదవ రోజు దశమి 3 అక్టోబర్ శ్రీ రాజరాజేశ్వరి

దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. రాక్షసుడు మహిషాసురుడిని కాళికా దేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకలు జరుపుకుంటాం. మరి అమ్మవారి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలిగా. దుర్గాదేవీ పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం.

ప్రాణ ప్రతిష్ట చేయు విధానం.

అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతో అలంకరించి, పళ్లు, ఫలాలను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ప్రాణప్రతిష్ట చేసేందుకు పువ్వులు, అక్షింతలను పట్టుకుని అమ్మవారి పాదాలను పట్టుకుని కింది మంత్రములను పఠించాలి.

మం ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునఃప్రాణ మిహ నో ధేహి భోగమ్
జ్యోక్పశ్యేషు సూర్యముచ్చరంత మనుమతే మృడయా న స్స్వస్తి
అమృతంవై ప్రాణా అమృతమాపః

ప్రాణానేన యథాస్థాన ముపహ్వయతే
ఓం అం హ్రీం క్రీం హంస స్సోహం

దేవి సర్వ జగన్నాథే యావత్పూజావసానకం
తాపత్వ్తం ప్రీతిభావేన ప్రతిమేస్మిన్ సన్నిధింకురు...

రక్తాంభోదిస్థపోతోల్లస దరుణసరోజాధిరూఢా కరాభైః
పాశం కోదండ మిక్షూద్భవ మణిగుణ మప్యంకుశం పంచబాణాన్
భిభ్రామా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీనవక్షోరుహాఢ్యా
దేవీబాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః
సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం శ్రీవహాకాళీ

శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవీ అవాహితాభవ
స్థాపితాభవ సుప్రసన్నాభవ వరదాభవ స్థరాసనం కురు ప్రసీద ప్రసీద

ధ్యానం
లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం
విద్యాప్రదాన సమయే శరదిందుశుభ్రాం
విద్వేషి వర్గవిజయేతు తమాలనీలాం
దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే
ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ శూలం భుశుండిం శిరః
శంఖం సందధతీంకరైః త్రిణయనాం సర్వాంగభూషాభృతాం
యాదేవీ మధుకైటభ ప్రశమనీ యామాహిషోన్మూలినీ
యాధూమ్రేక్షణ చండముండ దమనీ యారక్తబీజాశినీ
యాశుంభాది నిశుంభ దైత్యశమనీ యా సిద్ధలక్ష్మీఃవరా
తాంత్వాం చంద్ర కళావతంస మకుటాం చారుస్మితాం భావయే
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః

అక్షతలు, పుష్పములను దేవి పాదాల వద్ద ఉంచవలెను.

ఆవాహనం

ఈ క్రింది మంత్రమును జపిస్తూ కొద్దిగా దేవిపై పుష్పాలను లేదా అక్షింతలు చల్లవలెను.

హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ

ఆసనం
ఈ క్రింది మంత్రమును జపిస్తూ కొద్దిగా దేవిపై పుష్పాలను లేదా అక్షింతలు చల్లవలెను.

తాంమ ఆవాహ జాతదేవోలక్ష్మీ మనపగామినీం
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వరి పురుషానహం

దేవి పాదము వద్ద పుష్పముతో నీటిని చల్లవలెను.

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రభోదినీమ్
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్

అర్ఘ్యం

దేవి పాదములపై దేవి పాదము వద్ద పుష్పముతో నీటిని చల్లవలెను.

కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్
పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్

ఆచమనీయం
ఈ క్రింది మంత్రము చెబుతూ గ్లాసులోని నీటిని పుష్పముతో కొద్దిగా దేవిపై చల్లవలెను

చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే

పంచామృతాభిషేకం

ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః

క్షీరం (పాలు)

ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమ వృషియం
భవావాజస్య సంగధే

దధి (పెరుగు)

దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్పృణ ఆయూగంషి తారిషిత్

ఆజ్యం (నెయ్యి)
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దెవోవస్సవితోత్పువా
త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః

మధు (తేనె)
మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః
మాధ్వీర్నస్సన్త్వౌ షధీః

చక్కెర (పంచదార)
స్వాదుః పవస్య దివ్యాయజన్మనే స్వాదురింద్రాయ సుహవీతునామ్నే
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్

ఫలోదకం (కొబ్బరి నీరు)
యాఃఫలినీర్యా ఫలా పుష్పా యాశ్చ పుష్పిణీః
బృహస్పచి ప్రసూతాస్తానో ముంచన్త్వగ్ హనః

శుద్ధోదకం (మంచినీరు) స్నానం

ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః

చివరగా అమ్మవారికి మంచినీటిలో స్నానం చేయించి పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. తర్వాత పత్తితో చేసిన ఉపవీతం సమర్పించుకోవాలి. తర్వాత ఈ క్రింది మంత్రం చదువుతూ గంధం వేయవలెను

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ
ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుదమే గృహాత్

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః గంధాం ధారయామి

సుగంధ ద్రవ్యాణి

ఓం అహిరివ భోగైః పర్యేతి బాహుం
జాయా హేతిం పరిబాధమానాః
హస్తేఘ్నో విశ్వావయునాని విద్వాన్
పుమాన్‌పుమాంసంపరిపాతువిశ్వతః

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః హరిద్రా కుంకుమ కజ్జల కస్తూరి గోరోజనాది సుగంధద్రవ్యాణి సమర్పయామి.

ఆభరణాణి (నగలు)
తర్వాత అమ్మవారికి ఈ క్రింది మంత్రం చెబుతూ నగలు సమర్పించుకోవాలి.

మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః సర్వభరణాణి సమర్పయామి

పుష్పాణి (పూలమాలలు)
ఈ క్రింది మంత్రం చదువుతూ సుగంధ పూలమాలలను అలంకరించాలి.

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి.

అధాంగ పూజ
ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి
ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి
ఓం అపర్ణాయై నమః జానునీ పూజయామి
ఓం హరిప్రియాయై నమః ఊరూ పూజయామి
ఓం పార్వత్యై నమః కటిం పూజయామి
ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి
ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి
ఓం మంగళాయై నమః కుక్షిం పూజయామి
ఓం శివాయై నమః హృదయం పూజయామి
ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి
ఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం కాళ్యై నమః బాహూ పూజయామి
ఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామి
ఓం వరదాయై నమః ముఖం పూజయామి
ఓం సువణ్యై నమః నాసికం పూజయామి
ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి
ఓం అంబికాయై నమః శిరః పూజయామి
ఓం దేవ్యై నమః సర్వాణ్యం పూజయామి

ధూపం (అగరవత్తులు)

ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే

తర్వాత అమ్మవారికి అగరవత్తులను సమర్పించుకోవాలి.

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి.

దీపం
అమ్మవారి దీపం వెలిగించి క్రింది మంత్రమును చదవాలి.

ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
అని చెబుతూ నీటిని పళ్లెములో విడువలెను

నైవేద్యం

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

తర్వాత నైవేద్యం సమర్పించాలి

తాంబూలం

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్
యస్యాం హిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహమ్

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి.

కర్పూరనీరాజనం
ఈ క్రింది మంత్రమును జపిస్తూ హారతి ఇవ్వవలెను.

యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహమ్
శ్రియః పంచదశర్చం చ శ్రీకామః సతతం జపేత్

సంతత శ్రీరస్తు, సమస్త మంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః
కర్పూర నీరాజనం సమర్పయామి.

మంత్రపుష్పమ్
చేతిలో అక్షింతలు, పువ్వులను ఉంచుకుని మంత్రపుష్పమ్ చెప్పవలెను. ఇక్కడ పెద్ద మంత్రపుష్పమ్ లేదా చిన్న మంత్రపుష్పమ్ చెప్పవలెను లేదా శ్రీ సూక్త ఫలమును పఠించవలెను.

శ్రీ సూక్త ఫలము

ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః

ఋషయస్తే త్రయః ప్రోక్తాస్వయాం శ్రీరేవ దేవతా

పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే
త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్

అశ్వదాయీ గోదాయీ ధనదాయీ మహాధనే
ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ్చ దేహి మే

పుత్రపౌత్రం ధనం ధాన్యం హస్త్యశ్వాదిగవేరథమ్
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మామ్

ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః
ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్ను తే

చంద్రాభాం లక్ష్మిమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం
చంద్రసూర్యాగ్ని వర్ణాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే

వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా
సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః
భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్సదా

వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః
రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి
విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ

యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ
గంభీరావర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా
లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైమణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభైః
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్

సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా

వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం
బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమాద్యాం జగదీశ్వరీం త్వామ్

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే

సరసిజ నిలయే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమహ్యమ్

ఓం విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం
విష్ణోః ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభామ్

ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్

శ్రీవర్చస్యమాయుష్యమారోగ్యమావిధాత్ పవమానం మహీయతే
ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః
ఋణరోగాది దారిద్ర్య పాపంక్షుదపమృత్యవః
భయశోకమనస్తాపా నశ్యంతు మమ సర్వదా

శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయో జరితృభ్యో దధాతు
శ్రియం వసానా అమృతత్వమాయన్ భజంతి సద్యః సవితా విదధ్యూన్

శ్రియ ఏవైనం తచ్ఛ్రియామాదధాతి
సంతతమృచావషట్ కృత్యం సంధత్తం సంధీయతే ప్రజయా పశుభిః
య ఏవం వేద

ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్

తర్వాత ఆత్మప్రదక్షిణ నమస్కారం చేయవలెను. అనంతరం తీర్థం పుచ్చుకుంటూ ఈ మంత్రాలను జపించవలెను.

మం అకాలమృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్తపాపక్షయకరం
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గాపరాదేవీ పాదోదకం పావనం శుభమ్

ఉద్వాసన
ఈ క్రింది మంత్రము జపించుచూ ఉద్వాసన పలుకవలెను
మం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తేహనాకం మహిమానస్సచంతే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః యథాస్థాన ముద్వాసయామి.
Read More

నవ రాత్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ, ఇందులో నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగం.

నవ రాత్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ, ఇందులో నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగం. నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు మరియు పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.
దసర (విజయ దశమి) గురించి చిన్న కథ:
ఒకానొకప్పుడు, మహారాజైన ధృవసింధు వేటకు వెళ్ళినపుడు ఆయనను సింహం చంపివేసింది. యువరాజు సుదర్శనుడికి రాజ్యాభిషేకం చేయడానికి సన్నాహాలు జరిగాయి. కానీ, మహారాణి లీలావతికి తండ్రి, ఉజ్జాయినీ రాజ్యానికి రాజయిన యుధజిత్తు, మరియు మహారాణి మనోరమకు తండ్రి, కళింగ రాజ్యానికి రాజయిన వీరసేనుడు తమ తమ మనవళ్ళ కోసం కోసల రాజ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న కోరిక కలిగి ఉన్నారు. వాళ్ళు ఒకరితో మరొకరు యుధ్ధం చేసారు. యుధ్ధంలో రాజు వీరసేనుడు మృతి చెందాడు. మనోరమ యువరాజు సుదర్శనుడినీ, ఒక నపుంసకుడినీ తోడు తీసుకుని అడవిలోకి పారిపోయింది. వాళ్ళు ఋషి భరద్వాజుని ఆశ్రమంలో తలదాచుకున్నారు.

విజితుడయిన రాజు యుధజిత్తు, అప్పుడు కోసల రాజధాని అయిన అయోధ్యలో, తన మనుమడయిన శత్రుజిత్తుని పట్టాభిషిక్తుని చేసాడు. అతను ఆ తరువాత, మనోరమను ఆమె కొడుకునూ వెతుక్కుంటూ బయలుదేరాడు. తనను రక్షణ కోరిన వారిని అప్పగించనని ఋషి సెలవిచ్చాడు. యుధజిత్తు కోపోద్రిక్తుడయ్యాడు. అతను ఋషిపై దాడి చేద్దామని అనుకున్నాడు. కానీ, అతని మంత్రి అతనికి ఋషి యొక్క వ్యాఖ్యకు సంబంధించిన నిజాన్ని చెప్పాడు. యుధజిత్తు రాజధానికి వెనుదిరిగాడు.
యువరాజు సుదర్శనుడిని అదృష్టదేవత వరించింది. తపస్వి కుమారుడు ఒక రోజు వచ్చి, నపుంసకుడిని తన సంస్కృత నామమయిన క్లీబ అన్న పేరుతో పిలిచాడు. యువరాజు మొదటి శబ్దమయిన క్లిను పట్టుకుని దానిని క్లీం అని సంబోధించడం మొదలు పెట్టాడు. ఆ అక్షరం చాలా శక్తిమంతమయిన, పవిత్రమయిన మంత్రం. అది దేవీ మాతకు బీజాక్షరం (మూల అక్షరం). యువరాజు ఈ అక్షరాన్ని మాటిమాటికీ పలకడం వలన అతనికి మనశ్శాంతి, దేవి మాత యొక్క అనుగ్రహం కలిగింది. దేవి అతనికి దర్శనం ఇచ్చి, ఆశీర్వదించి, అతనికి దైవికమైన ఆయుధాలను మరియు ఎప్పటికీ తరిగిపోని అంబులపొదినీ వరంగా ఇచ్చింది.
వారణాసి యొక్క రాజదూతలు ఋషి ఆశ్రమం గుండా పయనించినపుడు ఉదాత్తమైన యువరాజు సుదర్శనుడిని చూసి, అతనిని వారణాసి రాజు కుమార్తె అయిన యువరాణి శశికళకు వరుడిగా ప్రతిపాదించారు.
యువరాణి తన వరుడిని ఎన్నుకునే స్వయంవరం ఏర్పాటు చెయ్యబడింది. శశికళ వెంటనే సుదర్శనుడిని వరించింది. వారికి శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. ఆ పెళ్ళిలోనే ఉన్న రాజు యుధజిత్తు, వారణాసి రాజుతో యుధ్ధం చేయడం మొదలు పెట్టాడు. దేవీ మాత సుదర్శనుడునీ అతని మామనీ రక్షించింది. యుధజిత్తు ఆమెను హేళన చేసాడు, దానితో వెనువెంటనే దేవీ మాత అతనినీ అతని సైన్యాన్ని బూడిదగా మార్చింది.
అప్పుడు సుదర్శనుడు, తన భార్య మరియు మామతో కలిసి దేవిని స్తుతించాడు. దేవి అతి ప్రసన్నురాలై, వారికి తనని హోమంతో ఇతర సాధనాలతో వసంత నవరాత్రులపుడు పూజించమని ఆదేశించింది. తరువాత ఆమె మాయమయ్యింది.
యువరాజు సుదర్శనుడు మరియు శశికళ ఋషి భరద్వాజుని ఆశ్రమానికి వెనుదిరిగి వచ్చారు. ఋషిపుంగవుడు వారిని ఆశీర్వదించి సుదర్శనుడిని కోసల రాజుగా పట్టాభిషిక్తుని గావించాడు. సుదర్శనుడు మరియు శశికళ ఇంకా ఆమె తండ్రి అయిన వారణాసి రాజు తుచ తప్పకుండా దేవి మాత యొక్క ఆదేశాలను పాటించి ఆమెకు వసంత నవరాత్రులలో అద్భుతరీతిలో పూజలు జరిపారు.
సుదర్శనుడి వారసులయిన, శ్రీ రామ లక్ష్మణులు కూడా శరన్నవరాత్రులలో, దేవిని పూజించి, ఆమె సహాయంతో సీతను తిరిగి తేగలిగారు.
శ్రీ దుర్గా మాత అలంకారాలు
క్ర.సం థితి అలంకారం అలంకార ప్రాముఖ్యత చిత్రపటము
1) ఆశ్వయుజ శుద్ద పాడ్యమి రోజు శ్రీ చక్రం లో మొదటి దేవత అయిన శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారం.
శ్రీ బాలా దేవి పవిత్ర శ్రీ చక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే మొదటి దేవత.
శ్రీ బాలా మంత్రం సమస్త దేవి మంత్రాలన్నింటిలోకి మహిమాన్వితమైనది.
శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిని ధ్యానిస్తే దుర్గామాత సంతోషిస్తుంది.
శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి
2) ఆశ్వయుజ శుద్ద విదియ రోజు సకల మంత్రాలకి మూల శక్తి, వేద మాత గాయత్రి అలంకారం
ముక్తా విద్రుమ హేమనీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది.
సంధ్యావందన అధి దేవత
గాయత్రి మంత్రం రెండు రకాలు
లఘు గాయత్రి మంత్ర్తం
బృహద్గాయత్రి మంత్రం
ప్రతీ రోజు త్రిసంధ్యా సమయాల్లో వేయి సార్లు గాయత్రి మంత్రమ్ ని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది.
శ్రీ గాయత్రీ దేవి
3) ఆశ్వయుజ శుద్ద తదియ రోజు మంగళ ప్రద దేవత శ్రీ మహా లక్ష్మి దేవి అలంకారం
అష్ట రూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత
రెండు చేతులలో కమలాలని దరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తు, పద్మాసనిగా దర్శనమిస్తుంది.
ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాలు దరించింది. అ ఆదిపరాశక్తి రూపంగానే మహ లక్ష్మి అలంకారం.
శ్రీ మహా లక్ష్మీ దేవి
4) ఆశ్వయుజ శుద్ద చవితి నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం
అన్నం జీవుల మనుగడకు ఆదారం.
జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధి నాయకుడు విశ్వేశ్వరుడి ప్రియ పత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది.
శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి
5) ఆశ్వయుజ శుద్ద పంచమి రోజు త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం.
త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలవబడుతుంది.
శ్రీ చక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత.
ఆది శంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్థించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా "చండీదేవి" గా పిలవడేది
ఆది శంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్థించాక పరమశాంత రూపిణిగా లలితా దేవి గా పిలవబడుతుంది.
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
6 ఆశ్వయుజ శుద్ద సప్తమి రోజు చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం
త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వ్తతీ దేవి
సరస్వతీ దేవి సప్త రూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది.
అవి:
చింతామణి సరస్వతి
జ్ఞాన సరస్వతి
నిల సరస్వతి
ఘట సరస్వతి
కిణి సరస్వతి
అంతరిక్ష సరస్వతి
మరియు
మహా సరస్వతి.
మహా సరస్వతి దేవి శుంభనిశుంభులనే రాక్షసులను వధించింది.
శ్రీ మహా సరస్వతీ దేవి
7 ఆశ్వయుజ శుద్ద అష్టమి రోజు దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గాదేవి అలంకారం
రురుకుమారుడైన "దుర్గముడు" అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని "దుర్గా" అని పిలిస్తారు.
శ్రీ దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తారాలు, దుర్గా సహస్ర నామాలకు బదులు శ్రీ లలితా అష్టోత్తరాలు, శ్రీ లలిత సహస్రనామాలు తో పూజిస్తారు. ఎందుకంటే లలితా రూపం పరమ శాంత రూపం కనుక.
శ్రీ దుర్గా దేవి
8 ఆశ్వయుజ శుద్ద నవమి (మహర్ణవమి) రోజు మహాదుష్ట సంహారిణి శ్రీ మహిషా సుర మర్థినీ దేవి అలంకారం
మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇదే.
సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు.
సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది.
శ్రీ మహిషాసుర మర్థిని దేవి
9) ఆశ్వయుజ శుద్ద దశమి రోజు. శ్రీ చక్ర అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం
అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను "అపరాజిత" అంటారు.
ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి "విజయ" అని కూడా అంటారు.
శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకము పై ఆసీనురాలై ఉంటుంది.
Read More

దేవీ భాగవతాన్ని వ్యాసుడు పరీక్షిత్తు కుమారుడైన జనమేజయునకు తొమ్మిది రోజులలో వివరించాడు.

దేవీ భాగవతాన్ని వ్యాసుడు పరీక్షిత్తు కుమారుడైన జనమేజయునకు తొమ్మిది రోజులలో వివరించాడు. ఇది పూర్తిగా అమ్మవారి చరిత్ర. శ్రీ దేవీ భాగవతానికి వచన రూపంలో ఎన్నో అనువాదాలు వచ్చాయి, కానీ సులభంగా అర్థమయ్యే తేటతెలుగు పద్యాలలో రచయిత ఆంధ్రీకరించారు. ఇది పన్నెండు స్కంధాల గ్రంథం. ఇందులో హయగ్రీవ చరిత్ర, మధు కైటభుల కథ, నవరాత్రుల పూజా విధానం, ముఖ్యంగా మహిషాసుర సంహారం చక్కగా వర్ణింపబడ్డాయి. ఈ గ్రంథంలో కలియుగంలో జరిగే విశేషాలను గురించి తొమ్మిదవ స్కందంలో వర్ణించడం జరిగింది. పదకొండవ స్కంధంలో సదాచార లక్షణాలు, రుద్రాక్షలు ధరించడం వలన కలిగే ఉపయోగాలు వివరించడం జరిగింది. పన్నెండవ స్కంధంలో అమ్మవారి నివాసమైన మణిద్వీప వర్ణన దండక రూపంలో వ్రాయడం జరిగింది. నూతన గృహాలలో ఈ దండకం చదివితే వాస్తు దోషాల నివారణ జరుగుతుంది.

ఇందులోని సరళమైన తేట తెలుగు పద్యాలు కొన్ని:
భోగ మున్న మోక్షానికి పొందు లేదు
ముక్తి నొందిన భోగ విముక్తి యగును
దేవి పాదాలు సేవించు దివ్యుల కిల
భోగ మోక్షాలు రెండు పెంపొందు గాదె

తల్లి పద పంకజములపై తనరు భక్తి
లేశ లేశము లేశము లేశ మైన
చాలు సుఖ శాంతు లొసగగ జాలునదియు
చాలు ముక్తి నొసంగ గజాల నదియ

మోహమున జన్మ - జన్మచే మోహ మగును
చక్ర భ్రమణంబు వలె, మృతి జన్మ గలుగు
మాయచే మోహ వశుడగు, మాయదాటి
ముక్తి నొందగ దేవియే శక్తి నొసగు

ఆకట్టుకునే పద్యాలు ఇలాంటివెన్నో ఇందులో ఉన్నాయి. చదవండి శ్రీ దేవీ భాగవతము.
Read More

అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం. మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి.

అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం. మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి.

శత్రువయినా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు, ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది. అదే అరటి ఆకులో భోజనం పెడితే, ఒక వేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది. కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు, మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు.
వేడి వేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వలన భోజనానికి అద్భుతమయిన రుచితో పాటు జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది.
ఈ ఆకులో అన్ని రకములయిన విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్ధాలను దాని మీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి.
ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం. ఇది కాన్సరు (మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్ మరియు బ్లాడర్), హెచ్.ఐ.వి , సిక్కా, పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు.
వాడి పారవేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోయి నేలను సారవంతముగా మారుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి.
అరటి ఆకులో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ళ మీద ఉన్న గౌరవానికి ప్రతీక కూడాను.

ఇన్ని రకములయిన ప్రయోజనాలు ఉండటం వలన అరటి ఆకు భోజనం అనేది ఘనమయిన భోజనాన్ని ప్రతిబింబిస్తుంది అంటారు. అంత మంచి, మన అనుకున్న వాళ్ళకి జరగాలి అని అనుకోవడం సహజం కనుక అయినవాళ్ళకి ఆకుల్లో అని వాడడం జరిగినదని నా అభిప్రాయం. ఇహ కన్న వాళ్ళకి కంచాలు అంటే ఇది వరకు అందరూ ఇంట్లో వాళ్ళు వెండి కంచం మధ్యలో బంగారు పువ్వు ఉన్న కంచాలలో భోజనం చేసేవారు. ఇది కూడా విషాన్ని హరిస్తుంది. అటువంటి పనిని చేసేది కేవలం మన అరటి ఆకు కనుక దానిని మనం అయిన వాళ్లకి పెడతాము. బహుశా పూర్వ కాలంలో కేవలం అరటి ఆకులలో భోజనాలు చేయుట వలెనే ఆ కాలం వాళ్ళు అంత ధృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారేమో!

అరటి ఆకులో, అడ్డాకు (విస్తరాకు) లో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిసివచ్చి సాక్షాత్తు లక్ష్మి దేవి ఇంట్లో ఉంటుంది. బాదం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు. టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్త్, వర్తమానాలు తెలుసుకునే జ్ఞానం వస్తుంది. జమ్మి విస్తర్లో భోజనం చేయడం వలన లోకాన్ని జయించే శక్తిని సంపాదించవచ్చు అని మన పురాణాలలో చెప్పబడింది. ఇది నిజమో లేక కల్పనో తెలియదు కాని మన అరటి ఆకుని మించిన ఆకు లేదు.
Read More

నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు మరియు పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారునవ రాత్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ, ఇందులో నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగం. నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు మరియు పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.
దసర (విజయ దశమి) గురించి చిన్న కథ:
ఒకానొకప్పుడు, మహారాజైన ధృవసింధు వేటకు వెళ్ళినపుడు ఆయనను సింహం చంపివేసింది. యువరాజు సుదర్శనుడికి రాజ్యాభిషేకం చేయడానికి సన్నాహాలు జరిగాయి. కానీ, మహారాణి లీలావతికి తండ్రి, ఉజ్జాయినీ రాజ్యానికి రాజయిన యుధజిత్తు, మరియు మహారాణి మనోరమకు తండ్రి, కళింగ రాజ్యానికి రాజయిన వీరసేనుడు తమ తమ మనవళ్ళ కోసం కోసల రాజ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న కోరిక కలిగి ఉన్నారు. వాళ్ళు ఒకరితో మరొకరు యుధ్ధం చేసారు. యుధ్ధంలో రాజు వీరసేనుడు మృతి చెందాడు. మనోరమ యువరాజు సుదర్శనుడినీ, ఒక నపుంసకుడినీ తోడు తీసుకుని అడవిలోకి పారిపోయింది. వాళ్ళు ఋషి భరద్వాజుని ఆశ్రమంలో తలదాచుకున్నారు.

విజితుడయిన రాజు యుధజిత్తు, అప్పుడు కోసల రాజధాని అయిన అయోధ్యలో, తన మనుమడయిన శత్రుజిత్తుని పట్టాభిషిక్తుని చేసాడు. అతను ఆ తరువాత, మనోరమను ఆమె కొడుకునూ వెతుక్కుంటూ బయలుదేరాడు. తనను రక్షణ కోరిన వారిని అప్పగించనని ఋషి సెలవిచ్చాడు. యుధజిత్తు కోపోద్రిక్తుడయ్యాడు. అతను ఋషిపై దాడి చేద్దామని అనుకున్నాడు. కానీ, అతని మంత్రి అతనికి ఋషి యొక్క వ్యాఖ్యకు సంబంధించిన నిజాన్ని చెప్పాడు. యుధజిత్తు రాజధానికి వెనుదిరిగాడు.
యువరాజు సుదర్శనుడిని అదృష్టదేవత వరించింది. తపస్వి కుమారుడు ఒక రోజు వచ్చి, నపుంసకుడిని తన సంస్కృత నామమయిన క్లీబ అన్న పేరుతో పిలిచాడు. యువరాజు మొదటి శబ్దమయిన క్లిను పట్టుకుని దానిని క్లీం అని సంబోధించడం మొదలు పెట్టాడు. ఆ అక్షరం చాలా శక్తిమంతమయిన, పవిత్రమయిన మంత్రం. అది దేవీ మాతకు బీజాక్షరం (మూల అక్షరం). యువరాజు ఈ అక్షరాన్ని మాటిమాటికీ పలకడం వలన అతనికి మనశ్శాంతి, దేవి మాత యొక్క అనుగ్రహం కలిగింది. దేవి అతనికి దర్శనం ఇచ్చి, ఆశీర్వదించి, అతనికి దైవికమైన ఆయుధాలను మరియు ఎప్పటికీ తరిగిపోని అంబులపొదినీ వరంగా ఇచ్చింది.
వారణాసి యొక్క రాజదూతలు ఋషి ఆశ్రమం గుండా పయనించినపుడు ఉదాత్తమైన యువరాజు సుదర్శనుడిని చూసి, అతనిని వారణాసి రాజు కుమార్తె అయిన యువరాణి శశికళకు వరుడిగా ప్రతిపాదించారు.
యువరాణి తన వరుడిని ఎన్నుకునే స్వయంవరం ఏర్పాటు చెయ్యబడింది. శశికళ వెంటనే సుదర్శనుడిని వరించింది. వారికి శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. ఆ పెళ్ళిలోనే ఉన్న రాజు యుధజిత్తు, వారణాసి రాజుతో యుధ్ధం చేయడం మొదలు పెట్టాడు. దేవీ మాత సుదర్శనుడునీ అతని మామనీ రక్షించింది. యుధజిత్తు ఆమెను హేళన చేసాడు, దానితో వెనువెంటనే దేవీ మాత అతనినీ అతని సైన్యాన్ని బూడిదగా మార్చింది.
అప్పుడు సుదర్శనుడు, తన భార్య మరియు మామతో కలిసి దేవిని స్తుతించాడు. దేవి అతి ప్రసన్నురాలై, వారికి తనని హోమంతో ఇతర సాధనాలతో వసంత నవరాత్రులపుడు పూజించమని ఆదేశించింది. తరువాత ఆమె మాయమయ్యింది.
యువరాజు సుదర్శనుడు మరియు శశికళ ఋషి భరద్వాజుని ఆశ్రమానికి వెనుదిరిగి వచ్చారు. ఋషిపుంగవుడు వారిని ఆశీర్వదించి సుదర్శనుడిని కోసల రాజుగా పట్టాభిషిక్తుని గావించాడు. సుదర్శనుడు మరియు శశికళ ఇంకా ఆమె తండ్రి అయిన వారణాసి రాజు తుచ తప్పకుండా దేవి మాత యొక్క ఆదేశాలను పాటించి ఆమెకు వసంత నవరాత్రులలో అద్భుతరీతిలో పూజలు జరిపారు.
సుదర్శనుడి వారసులయిన, శ్రీ రామ లక్ష్మణులు కూడా శరన్నవరాత్రులలో, దేవిని పూజించి, ఆమె సహాయంతో సీతను తిరిగి తేగలిగారు.
శ్రీ దుర్గా మాత అలంకారాలు
క్ర.సం థితి అలంకారం అలంకార ప్రాముఖ్యత చిత్రపటము
1) ఆశ్వయుజ శుద్ద పాడ్యమి రోజు శ్రీ చక్రం లో మొదటి దేవత అయిన శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారం.
శ్రీ బాలా దేవి పవిత్ర శ్రీ చక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే మొదటి దేవత.
శ్రీ బాలా మంత్రం సమస్త దేవి మంత్రాలన్నింటిలోకి మహిమాన్వితమైనది.
శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిని ధ్యానిస్తే దుర్గామాత సంతోషిస్తుంది.
శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి
2) ఆశ్వయుజ శుద్ద విదియ రోజు సకల మంత్రాలకి మూల శక్తి, వేద మాత గాయత్రి అలంకారం
ముక్తా విద్రుమ హేమనీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది.
సంధ్యావందన అధి దేవత
గాయత్రి మంత్రం రెండు రకాలు
లఘు గాయత్రి మంత్ర్తం
బృహద్గాయత్రి మంత్రం
ప్రతీ రోజు త్రిసంధ్యా సమయాల్లో వేయి సార్లు గాయత్రి మంత్రమ్ ని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది.
శ్రీ గాయత్రీ దేవి
3) ఆశ్వయుజ శుద్ద తదియ రోజు మంగళ ప్రద దేవత శ్రీ మహా లక్ష్మి దేవి అలంకారం
అష్ట రూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత
రెండు చేతులలో కమలాలని దరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తు, పద్మాసనిగా దర్శనమిస్తుంది.
ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాలు దరించింది. అ ఆదిపరాశక్తి రూపంగానే మహ లక్ష్మి అలంకారం.
శ్రీ మహా లక్ష్మీ దేవి
4) ఆశ్వయుజ శుద్ద చవితి నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం
అన్నం జీవుల మనుగడకు ఆదారం.
జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధి నాయకుడు విశ్వేశ్వరుడి ప్రియ పత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది.
శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి
5) ఆశ్వయుజ శుద్ద పంచమి రోజు త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం.
త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలవబడుతుంది.
శ్రీ చక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత.
ఆది శంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్థించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా "చండీదేవి" గా పిలవడేది
ఆది శంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్థించాక పరమశాంత రూపిణిగా లలితా దేవి గా పిలవబడుతుంది.
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
6 ఆశ్వయుజ శుద్ద సప్తమి రోజు చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం
త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వ్తతీ దేవి
సరస్వతీ దేవి సప్త రూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది.
అవి:
చింతామణి సరస్వతి
జ్ఞాన సరస్వతి
నిల సరస్వతి
ఘట సరస్వతి
కిణి సరస్వతి
అంతరిక్ష సరస్వతి
మరియు
మహా సరస్వతి.
మహా సరస్వతి దేవి శుంభనిశుంభులనే రాక్షసులను వధించింది.
శ్రీ మహా సరస్వతీ దేవి
7 ఆశ్వయుజ శుద్ద అష్టమి రోజు దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గాదేవి అలంకారం
రురుకుమారుడైన "దుర్గముడు" అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని "దుర్గా" అని పిలిస్తారు.
శ్రీ దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి కనుక ఈ దేవిని దుర్గా అష్టోత్తారాలు, దుర్గా సహస్ర నామాలకు బదులు శ్రీ లలితా అష్టోత్తరాలు, శ్రీ లలిత సహస్రనామాలు తో పూజిస్తారు. ఎందుకంటే లలితా రూపం పరమ శాంత రూపం కనుక.
శ్రీ దుర్గా దేవి
8 ఆశ్వయుజ శుద్ద నవమి (మహర్ణవమి) రోజు మహాదుష్ట సంహారిణి శ్రీ మహిషా సుర మర్థినీ దేవి అలంకారం
మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇదే.
సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు.
సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది.
శ్రీ మహిషాసుర మర్థిని దేవి
9) ఆశ్వయుజ శుద్ద దశమి రోజు. శ్రీ చక్ర అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం
అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను "అపరాజిత" అంటారు.
ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి "విజయ" అని కూడా అంటారు.
శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకము పై ఆసీనురాలై ఉంటుంది.
Read More

మలి మూడు రోజులు : లక్ష్మి పూజ

మలి మూడు రోజులు : లక్ష్మి పూజ

దుర్గాదేవి ఆరాధనతో మలినమైన వాసనలు, చెడుస్వభావాలు, పాత అలవాట్లు లాంటి వ్యతిరేక గుణాలను నిర్మూలించే ప్రయత్నంలో సఫలీకృతుడవు కాగానే... నాశనం అయిన ఆ అసురగుణాల స్థానంలో సకారాత్మక గుణాలను, ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం నీ తక్షణ కర్తవ్యం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టీకరించిన దైవీ సంపదలను ఆర్జించుకోవాలి. జ్ఞానరత్నమనే అపూర్వమైన మణిని, ఆధ్యాత్మిక సంపదను సముపార్జన చేయాలి. శ్రద్ధాసక్తులతో ప్రతిపక్ష భావనను అలవరచుకునే ప్రయత్నం చేయని పక్షంలో పూర్వపు అసురీ గుణాలు మళ్లీ మళ్లీ తలెత్తుతాయి. అందుకే సాధకుడి అభ్యాసదశలో పూర్వ దశ ఎంత విలువైనదో, ఈ దశకూడా అంతే విలక్షణమైంది. తొలిదశ మలిదశల మధ్య ముఖ్యమైన తేడా వుంది. తొలిదశలో మలినమైన, అహంకార పూరిత హీనస్వభావాలను నిరంకుశంగా, నిశ్చయాత్మక బుద్దితో నిర్మూలన చేస్తే, మలిదశలో క్రమబద్ధంగా, కృత నిశ్చయంతో, దృఢంగా, ప్రశాంతంగా, పవిత్రమైన నిర్మలత్వాన్ని వృద్ధి చేసుకోవడం, మహాలక్ష్మి ఆరాధన ద్వారా సాధకుడి, సాధనలో వుండే ఆనందమయ దశ వ్యక్తీకరణ జరుగుతుంది. మహాలక్ష్మి తన భక్తులకు అనంతమైన దైవీ సంపదలను ప్రసాదిస్తుంది. సంపదలను ప్రసాదించే బ్రహ్మస్వరూపమే మహాలక్ష్మి. ఆమె అత్యంత నిర్మలం. రెండవ దశలో మూడు రోజులపాటు
 లక్ష్మి  ఆరాధన జరుగుతుంది.
Read More

యోగాన్ని గురించి చదివే ముందు సూర్య నమస్కారాలను గురించి తెలుసుకోవాలి.

యోగాన్ని గురించి చదివే ముందు సూర్య నమస్కారాలను గురించి తెలుసుకోవాలి.
అందులో ప్రార్ధన, ఆసనాలతో శరీర వ్యాయామము ఈ రెండు కలిసి ఉంటాయి.
సూర్యుడు ఆరోగ్య దేవత. ఆయనకు చేసే నమస్కారాలు ఆరోగ్య ప్రదాయినులవుతాయి.

సూర్య నమస్కారం ఈ క్రింది ప్రార్ధనా శ్లోకంతో మొదలవుతుంది.
" ధ్యేయస్సదా సవిత్రు మండల మధ్యవర్తీ
నారాయణ స్సరసి జాసన సన్ని విష్ణః
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ
హరీ హిరణ్మయవ పుర్ధ్రుత శంఖ చక్రః "

1 .కాళ్ళు దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడి చేతులు మోడ్చి నమస్కరించడం మొదటి అభ్యాసం.
మంత్రం || ఓం హ్రాం| ఉద్యన్నధ్య మిత్ర మహ:| హ్రాం ఓం మిత్రాయ నమః ||

2 . శ్వాస లోనికి పీల్చి, చేతులెత్తి వెనుకకు వంగి వంపుగా వెనుకకు వాలటం రెండవ అభ్యాసం.
మంత్రం || ఓం హ్రీం | ఆరో హన్నుత్త రాందివం| హ్రీ ఓం రవయే నమః ||

3 . కాళ్ళు దగ్గరగా ఉంచి ముందుకు వంగి చేతులతో నేలను తాకటం మూడవ అభ్యాసం.
మంత్రం || ఓం హ్రూం హృద్రోగం మమ సూర్య | హ్రూం ఓం | సూర్యాయ నమః ||

4 . చేతులు సాధ్యమైనంత ముందుకు చక్కగా చాచాలి. దాని వల్ల కాళ్ళు, శరీరం చేతులు కలిపి ఒక సవ్యమైన కోణంగా భాసిస్తాయి.
మంత్రం || ఓం హ్రైం హరి మాణంచ నాశయ | హ్రైం ఓం | భానవే నమః ||

5 . బోరగిల నెల మీద సాష్టాంగ పడి చేతులు ఇరు ప్రక్కలా నిటారున నిలిపి అరచేతులు నేలకానునట్లు ఉంచాలి.
మంత్రం || ఓం హ్రౌం ఐ శుకే ఘమే హరిమాణం - హౌం ఓం |ఖగాయ నమః ||

6 . ఆ తరువాత నిటారుగా చాచిన చేతుల మీద నేల మీద ఊతం తీసుకొని శరీరాన్ని సాధ్యమైనంత మేరకు పైకి ఎత్తాలి.
మంత్రం || ఓం హ్రం రోపణా కుసు ధద్మసి | హ్రః ఓం | పూష్నేనమః ||

7 .శరీరాన్ని పైకి లేపి ఎడమ కాలును చేతుల నడుమకు తీసుకొని రావాలి.
మంత్రం || ఓం హ్రాం | అధో హారి ద్రవే షుమే | హ్రాం ఓం |హిరణ్య గర్భాయనమః ||

8 .కాళ్ళను విడిగా పెట్టి, ఎడమ కాలును ముందుకు చాచి వంచి కుడి కాలును చాచి ఉంచి శరీరాన్ని, చేతులను వెనుకకు వంచాలి.
మంత్రం || ఓం హ్రీం | హారి మాణం సదధ్యసి | హ్రీం ఓం | మరీచయే నమః ||

9 .ఎడమ కాలును వెనక్కు తీసుకొని, నేలమీద 5 వ చిత్రంలో ఉన్నట్లు ఉంచాలి.
మంత్రం || ఓం హ్రూం ఉద గాదయ మాదిత్యః | హ్రూం ఓం | ఆదిత్యాయ నమః

10 .7 వ చిత్రంలో చూపబడిన ముద్రను తీసికోవాలి కాని, కుడి కాలును చేతుల నడుమకు తేవాలి.
మంత్రం || ఓం హ్రైం| విశ్వేన స్సహసా సహ | హ్రైం ఓం | సవిత్రే నమః ||

11 ఆ తరువాత 8 వ చిత్రంలో ఉన్న ముద్రను పట్టి, కుడి కాలును ముందుకు చాచాలి.
మంత్రం || ఓం హ్రౌం | ద్విషంతం మహ్యం రంధయన్ | హ్రౌం ఓం | అర్కాయనమః ||

12 .5 వ చిత్రంలో చూపబడిన ముద్ర లోనికి మరల రావాలి.
మంత్రం || ఓం హ్రః | మో అహం ద్విషతే రధం | హ్రః ఓం | భాస్కరాయ నమః ||

13 .6 వ చిత్రంలో ఉన్న ముద్ర లోనికి రావాలి.
మంత్రం || ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఓం మిత్ర రవి సూర్య భాను ఖగ పూషభ్యో నమః

14 . రెండు కాళ్ళను చేతుల దగ్గరకు తీసుకు రావాలి.
మంత్రం || ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఓం హిరణ్య గర్భ మరీ చ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః.

15 .ఒకటవ చిత్రంలో చూపిన ముద్రకు తిరిగి రావాలి.

ఈ సూర్య నమస్కారాలను చేసిన తరువాత, ఒక కప్పు మంచినీరు తీసుకొని ఈ క్రింది మంత్రాన్ని పటించి, నీటిని త్రాగాలి.
' అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణం
సూర్య పాదోదకం తీర్ధం జడిరే ధార యా మ్యహం'


Read More

పద్మాసనము:

పద్మాసనము:
పద్మమును పోలి యుండుట వలన ఈ ఆసనానికి పద్మాసనం అని పేరు వచ్చింది.

విధానము :
మొదట రెండు కాళ్ళను చాపి నేల పై వుంచాలి, తర్వాత కుడి కాలుని ఎడమ తొడపై, ఎడమ కాలుని కుడి తొడపై వుంచి, రెండు చేతులనూ మోకాళ్ళపై వుంచాలి, చిన్ముద్రను వుపయోగించాలి, భ్రూమద్యమున దృష్టిని నిలపాలి, వెన్నెముకని నిటారుగా వుంచాలి.

శారీరక ఫలితాలు:
1) తొడబాగములోని అనవసర కొవ్వు కరుగుతుంది.
2) వెన్నెముక బలపడుతుంది.
3) శ్వాస సంబందిత వ్యాదులు క్రమక్రమముగా నిదానిస్తాయి.

మానసిక ఫలితాలు:
1) ద్యానానికి ఇది అనుకూలమైన ఆసనం.
2) ఏకాగ్రత కుదురుతుంది.
3) బుద్ది తీక్షణత పెరుగుతుంది.
4) ఆయుః ప్రమాణము పెరుగుతుంది


Read More

వజ్రాసనం:

వజ్రాసనం:
శరీరాన్ని ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంచే అద్భుతమైన ఆసనం ఏదైనా ఉందంటే అది వజ్రాసనమే.
పేరుకి తగ్గట్లే అది శరీరాన్ని వజ్రంలా చేస్తుంది.... క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది. సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్ధం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది.

మిగతా అన్ని ఆసనాలను ఎప్పుడు పడితే అప్పుడు వేయడం సరైనది కాదు. కానీ వజ్రాసనాన్ని 24 గంటల్లో ఎప్పుడైనా వేయొచ్చు. ఈ ఆసనంలో కూర్చుని పేపర్ చదువుకోవచ్చు, టివి చూడొచ్చు, పుస్తకాలు చదవొచ్చు... మెడిటేషన్ చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు....

ఆస‌నం వేయు విధానం: మెద‌ట‌గా మోకాళ్ల మీద కూర్చోవాలి.
ఎడ‌మ‌కాలి బ్రొట‌న‌వేలిపై కుడికాలి బ్రోట‌న వేలు వుంచి పాదాల పైభాగం నేల‌ను తాకేట‌ట్టు వెడ‌ల్పు చేయాలి.
రెండు పాదాల లోప‌లి భాగం అర్ధచంద్రాకృతిలో వుంటుంది. దాని మ‌ధ్య భాగంతో కూర్చొవాలి.
శ‌రీర పీఠ భాగం పూర్తిగా పాదాల మ‌ధ్య ఇమిడేట‌ట్లు చూసుకోవాలి.
రెండు చేతులు పైకి ఎత్తి ఎడ‌మ అది చేతిపై, కుడి అరిచేతిని పెట్టి కుడి అర‌చేతిపై ఎడ‌మ అరిచేతిని వుంచి తొడ‌లు క‌లిపి వుంచాలి.
మెడ, వీపు, త‌ల నిటారుగా భూమికి అభిముఖంలో వుండాలి. వెన్నెముక కూడా ఏ మాత్రం వంచ‌కుండా దృష్ఠిని మ‌ర‌ల్చ‌కుండా నిశ్చ లంగా వుండాలి.
మ‌న‌స్సు పూర్తిగా శ‌రీరం పైనే ల‌గ్నం చేయాలి. శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ నిదానంగా వ‌దులుతూ వీలైనంత ఎక్కువ స‌మ‌యం ఈ ఆస‌నంలో కుర్చొవ‌డం వ‌ల్ల ఎక్కువ మేలు జ‌రుగుతంది. ఆస‌న‌ము నుంచి బ‌య‌ట‌కు రావాల‌నుకున్నపుడు మోకాళ్ల పై నుంచి చేతుల‌కు విరామం క‌లిగించాలి. త‌రువాత ఒక్క కాలిని ఒక్కసారి ఇంకో కాలిని ఒక్కసారి ముందుకు సాంచి ఆసనం నుంచి బ‌య‌ట‌కు రావాలి.

వజ్రాసనం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు:
1. మలబద్దక నివారిణి: మన శరీరంలో అవయవాల మీద ఒత్తిడిని కలిగించే ఆసనం ఇది . ఈ ఆసనం యొక్క భంగిమ ఆబ్డామిన్(పొత్తికడుపు), పొట్ట మరియు ప్రేగుల మీద ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది మరియు దాంతో మలబద్దకం సమస్యతో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వజ్రాసనంతో ఇది ఒక గొప్ప ప్రయోజనం

2. ఒత్తిడి తగ్గిస్తుంది : మోకాళ్ళ మీద కూర్చోవడం వల్ల మీ వెన్ను మరియు కాళ్ళు కొంచెం సాగదీదకు గురిచేస్తుంది . ఈ వజ్రాసన భంగిమ అన్ని రకాల ఒత్తిడిలను తగ్గిస్తుంది. జాయింట్స్ మరియు మజిల్స్ విశ్రాంతి చెంది, స్ట్రెస్ ఫ్రీగా మారుతాయి. మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే మోకాళ్ళ మీద కూర్చొని డీప్ బ్రీత్ తీసుకోవాలి. అలా చేసేప్పుడు, మీ కండరాలు రిలాక్స్ అవ్వడాన్ని మీరు గమనించవచ్చు. వజ్రాసన భంగిమ వల్ల ఇది ఒక గొప్ప ప్రయోజనం, మీరు ఒత్తిడితో బాధపడుతున్నట్లైతే. ఈ భంగిమలో కొద్ది సమయం కూర్చొంటే మీరు రిలాక్స్ గా భావిస్తారు మరియు రిఫ్రెష్ అవుతారు. వజ్రాసన వల్ల ఇది ఒక ముఖ్యమైన ఆరోగ్యప్రయోజనం.

3. వ్యాధులను నివారిస్తుంది: కొన్ని వ్యాధులను చాలా సులభంగా తగ్గించడంలో వజ్రాసనం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఈ వజ్రాసనం భంగిమ వల్ల వెరికోస్ వైన్స్, కీళ్ళ నొప్పులు, మరియు ఆర్థ్రరైటిస్ వంటి వ్యాధులను నివారిస్తుంది . ఈ వజ్రాసనం రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వజ్రాసనం వల్ల ఇది ఒక ఎఫెక్టివ్ మరియు ఎన్సెన్షియల్ బెనిఫిట్

4. వజ్రాసనం వల్ల జాయింట్ మరియు మజిల్ యొక్క వ్యాధులను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

బ్రీతింగ్ ఎక్సర్ సైజ్: వజ్రాసనం భంగిమలోనే బ్రీతింగ్ వ్యాయామం మరియు మెడిటేసన్ వంటివి చేయవచ్చు . ఆడమ్స్ ఆపిల్ భంగిమ ఈ పోజ్ లో డీప్ బ్రీత్ తీసుకోవడానికి మరియు సరిగా మెడిటేట్ చేయడానికిబాగా సహాయపడుతుంది. బరువు తగ్గడానికి మరియు ఫ్లెక్సిబిలిటీ మరియు బాడీ టోనింగ్: వజ్రాసనంతో మరో ప్రయోజనం వల్ల ఫ్యాట్ కరగడంతో పాటు, బరువు క్రమంగా తగ్గించబడుతుంది . ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల బాడీటోన్ అవుతుంది మరియు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.Read More

ద్వాదశ జ్యోతిర్లింగాలు – 10. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము (నాసిక్ కు 30 కి.మీ.లో త్రయంబకేశ్వరం - మహారాష్ట్ర)

ద్వాదశ జ్యోతిర్లింగాలు – 10. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము (నాసిక్ కు 30 కి.మీ.లో త్రయంబకేశ్వరం - మహారాష్ట్ర)

శ్లో.
సహ్యాద్రిశీర్షే విమలే వసం తం, గోదావరీ తీర పవిత్ర దేశే |
యద్దర్శనాత్ పాతకమాశు నాశం, ప్రయాతి తం త్ర్యంబకమీశ మీడే ||

నిర్మలమైన సహ్యపర్వత శిఖరం మీద, గోదావరి తీర ప్రదేశంలో నివసిస్తూ, దర్శన మాత్రము చేతనే పాపములను పోగొట్టే త్ర్యంబకేశ్వరుని పొగుడుచున్నాను.

ఇక్కడి అమ్మవారి పేరు త్ర్యంబకేశ్వరి.

సప్తర్షులలో (గౌతముడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, అత్రి, విశిష్ఠుడు, కశ్యపుడు, జమదగ్ని) ఒకడైన గౌతమ మహర్షి తన భార్యతో అహల్యతో కలిసి సహ్య పరవతముపై గల బ్రహ్మగిరిపై తపస్సుచేసుకొంటు ఉండేవాడు. ఒకప్పుడు దేశమున భయంకరమైన కరవు పరిస్థితి ఏర్పడింది. ప్రజలు, పశుపక్ష్యాదులు త్రాగటానికి కూడ నీరులేక, పంటలులేక నానా బాధలు పడుతుండేవారు. తినడానికి లేనివారు యజ్ఞయాగాదులు ఏమిచేయగలరు? అందువలన హవిస్సులు అందని దేవతలు కూడ ఇబ్బంది పాలయ్యారు. ఆ పరిస్థితిని దయార్ద్ర హృదయుడైన గౌతముడు చూసి బాధపడి వర్షములు కొరకై వరుణదేవుని గూర్చి తపస్సుచేసి, వరుణదేవుని నుండి తాను త్రవ్విన గోతిలో ఆక్షయముగా నీరుండునట్లు వరంపొందాడు. గౌతముడు మూరెడు లోతున ఒక కుండమును త్రవ్వాడు. వరుణుని వారము వలన అది నీటితో నిండి, ఎంత వాడినను తరగకుండ నీరు నిలిచినది. అది తెలిసిన ఋషిగణములు భార్యా పిల్లలతో గౌతమ ఆశ్రమ స్థలమును చేరి పర్ణశాలలను నిర్మించుకొని తపస్సు, యజ్ఞ-యాగాదులతో కాలం వెళ్ళబుచ్చసాగారు.

గౌతముని గాయత్రీ మంత్ర ప్రభావముతో సద్యోజాత ఫలితముగా విత్తనము వేసిన వెంటనే మొక్క మొలచి కాపు కాచేవి. అందువలన, తన దగ్గర చేరినవారందరికి కరువు బారిన పడనీయకుండా కాపాడేవాడు మరియు దేవతలకు క్రమం తప్పకుండా హవిస్సులు అందుతూ ఉండేవి. దేవతలు గౌతముని దయార్ద్రభావానికి, తపోప్రభావానికి మెచ్చుకొనుట తోటివారు అసూయచెంది, గౌతముని ఎలాగైన కించపరచాలని యెంచి, ఒక అవును సృష్టించి గౌతముడు వేసిన పంటపొలము పైకి పంపగా, అది పంటను తినుట చూసి, గౌతముడు ఒక దర్భ (గడ్డి) పుల్లతో ఆ అవును బయటకు తోలుటకు అదిలింప ప్రయత్నింప ఆ ఆవు చనిపోయింది. దాంతో వారు గౌతమునికి గోహత్య పాపమంటినదనీ, దానిని నివారించుకొనుటకు గిరిప్రదక్షణములు చేయుచు, ఇష్వరునికై తపస్సు చేసి, ఆ ప్రదేశమునందు ఒక నది ప్రవహించునటుల జేసిన ప్రాయశ్చిత్తముగునని చెప్పిరి. వారి మోసమును గ్రహించిన గౌతముడు, ఆ సహ్యాద్రి పర్వతమునకు ప్రదక్షిణములు చేయుచు, ఈశ్వరునిఐ తపమాచరించెను. నిస్వార్థపూరితమైన గౌతముని తపస్సుకు మెచ్చి, తనక్కడ జ్యోతిర్లింగమై వెలిసాడు మరియు దివ్యగంగ నదిగా ఇక్కడ ప్రవహిస్తుంది, ఇంకా అది గౌతమి అను పేరుతో పిలువబదుతుందని, గోహత్య నివారణకు తపస్సు చేయుటవలన, గోదావరి అను పేరున కూడా పిలువబడుతుందని వరములిచ్చాడు. తనని మోసముచేసిన వారిని శిక్షిస్తానని శివుడు అనగా, వారిని క్షమించమని గౌతముడు కోర, అతని విశాల మరియు ఔదార్య బుద్ధిని మెచ్చుకొని, గౌతముడు సప్తర్షులలో ఒకనిగా వెలుగొందుదువని ఆశీర్వదించుతాడు. అప్పుడు, గౌతముడు, తనని పలు కష్టముల పాలుజేసిన వారిని పిలిచి శపించబోగా, వారు తమ తప్పు తెలిసికొని, శరణు వేడగా, గౌతముడు జాలిపడి, ప్రతి నిత్యమూ తమ తమ విధులను క్రమం తప్పకుండా నెరవేర్చుమని, గాయత్రని ఉపాసించమని బోధించి, వారిని ఊరడించి, వదిలివేసెను. నాటినుండి గౌతముడు తపస్సుచేసిన ప్రాంతమున వెలిసిన జీవునికి త్రయంబకేశ జ్యోతిర్లింగమని, అక్కడినుంచి ప్రారంభమైన నదికి గొదావర లేక గౌతమి అను పేర్లు వచ్చాయి.

ఇక్కడికి దగ్గరలో గల పంచవటియందు శ్రీరాముడు సీతాలక్ష్మణులతో వనవాసమునకు వచ్చి నివసించినట్లు చెబుతారు. ఇక్కడనే రామ కుండము, లక్ష్మణకుండమను పేర్లతో రెండు కుండములు ఉన్నాయి. సీతాకుందమను పేరుతోకూడా మరొక కుండము కలదు. దీనినే అహల్యాకుండమని, శారంగపాణి కుండమని కూడా వ్యవహరిస్తారు. సీతమ్మ తల్లిని రావణుడు ఇక్కడినుండియా అపహరించాడని, రామాయణం - పంచబటిలో వరుణానది ఒడ్డునగల ఇంద్రకుండములో స్నానము చేయుటచేత గౌతముని శాపమువలన ఇంద్రుని శరీరమున ఏర్పడిన వేలదిక్షిద్రముల (కన్నముల) వలన ఇంద్రుడు పూతాత్ముడయ్యెనని పురాణగాధ. ఇక్కడ గల అంచజాద్రి శిఖరమున ఆంజనేయుడు పుట్టాడని పురజనుల నమ్మకం.

చరిత్ర ::

త్ర్యంబక క్షేత్రమును గూర్చి చెప్పుకోవలసినంతటి విశేషాలేమీ లేవు. మరాఠా రాజ్యాన్ని పరిపాలించిన అనేకమంది రాజులు ఈ క్షేత్రాభివ్రుద్ధికి పాటుపడ్డారు. పీష్వా బాలాజీ బాజీరావు అనే రాజు త్ర్యంబకేశ్వరునికి ఆలయం కట్టించి ఈ క్షేత్రాభివృద్ధికి ఎంతో కృషి చేసాడు.

దర్శనీయ స్థలాలు ::

1. బ్రహ్మగిరిపై త్రిమూర్త్యాత్మకమనుటకు గుర్తుగా మూడు కునులతోనున్నా త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము
2. గంగా ద్వారము
3. పావన కుండము
4. గౌతమ మహర్షి, అహల్యల పూజలందుకొన్న 108 శివలింగములున్న గుహ
5. సీతా-రామ-లక్ష్మణ ధనుష్కుండములు
6. సూర్య-చంద్ర-అశ్వనీ-హనుమత్కుండములు
7. పేష్వా కుండమున్న స్థలమున గోదావరి నదిలో వరుణ, సరస్వతి, గాయత్రి, సావిత్రి మరియు శ్రద్ధా అను అయిదు నదులు కలియుట.
8. ఖండోబా కుండము.
9. ఒక కుండము.
10. వైశంపాయన కుండము.
11. ఇంద్ర కుండము.
12. ముక్తేశ్వర కుండము. 13. మెదాతిథి
14. కోటి-అహల్య సంగమ తీర్థములు.

మందిరములు ::

15. గోదావరి మందిరము (గోదావరి పుష్కర సమయమున 12 సం.ల కొకసారి మాత్రమే తెరువబడి ఒక సంవత్సరం పాటు పూజలు నిర్వహింపబడతాయి).
16. బాణేశ్వర లింగము.
17. గణేశుడు.
18. శివుడు.
19. దేవి.
20. సూర్యుడు
21. విష్ణువు
22. శ్రీ కపాలేశ్వర మందిరం.
23. సంగమేశ్వరుడు
24. కనకేశ్వరుడు
25. కపోతేశ్వరుడు
26. త్రిభువనేశ్వరుడు
27. శ్రీవిసంధ్యా దేవి
28. కృష్ణ మందిరము.
ఊరిలోపల
29. లక్ష్మీ నారాయణ
30. శ్రీ రామ
31. పరశురామ
32. ఇంద్రేశ్వర
33. త్రిసంధేశ్వర
34. కాంచనేశ్వర
35. జలేశ్వర
36. బల్లాలేశ్వర
37. గౌతమేశ్వర
38. రామేశ్వర
39. ముకుందేశ్వర
40. కాశీ విశ్వేశ్వర
41. భువనేశ్వరీ త్రిభువనేశ్వర
42. గాయత్రీ
43. నీలాంబికా దేవి (పరశురాముని తల్లియగు రేణుకాదేవి అని చెబుతారు)
44. నీలకంఠేశ్వర
45. వరాహగుహ (సీతా-రామ-లక్ష్మణుల విగ్రహములు ఉన్నవి)
46. శ్రీ గోరఖ్ నాధుడు
భక్త జ్ఞానేశ్వరుని పెద్ద సోదరుడు శ్రీని వ్రుత్తినాధుడు ఈ క్షేత్రమున తపస్సు చేశాడట.

ఈ క్షేత్రమున ఆలయములకు దగ్గరలో వివిధ అంగడులు, ధర్మశాలలు, హోటళ్ళు ఉన్నాయి. అన్ని సదుపాయములు, వాహనము సౌకర్యములు లభిస్తాయి.

రైలు మార్గము:

చెన్నై / విజయవాడ - వరంగల్ - వాడి - షోలాపూర్ - పూనా - ముంబై - కళ్యాణ్ - నాసిక్ రోడ్ - త్రయంబక్.
హైదరాబద్ - ఖాజీపేట్ - వాడి - షోలాపూర్ - పూనా - ముంబై - కళ్యాణ్ - నాసిక్ రోడ్ - త్రయంబక్.
ఢిల్లీ - ఇటార్సీ - భూసవాల్ - జల్గాన్ - మన్మాడ్ - నాసిక్ రోడ్ - త్రయంబక్.
విజయవాడ - రాజమండ్రి - విశాఖపట్నం - విజయనగరం - రాయపూర్ - నాగ్పూర్ - అకోలా - భూసవాల్ - జల్గాన్ - మన్మాడ్ - నాసిక్ రోడ్ - త్రయంబక్.

సమీప విమానాశ్రయము - ఓఝూడ్
Read More

ద్వాదశ జ్యోతిర్లింగాలు 11. కేదారేశ్వర జ్యోతిర్లింగము (కేదార్నాథ్, ఉత్తర ప్రదేశ్)

ద్వాదశ జ్యోతిర్లింగాలు 11. కేదారేశ్వర జ్యోతిర్లింగము (కేదార్నాథ్, ఉత్తర ప్రదేశ్)

శ్లో.
మహాద్రి పార్శ్వేచ తటే రమంతం, సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురైర్యక్ష మహోరగొద్యై, కేదారమీశం శివమేక మీదే ||

గొప్పదైన హిమవత్పర్వతము ప్రక్కన కొండ చరియ సమీపమున ఎల్లప్పుడు మునులచేత, దేవతలచేత, రాక్షసులు, యక్షులు, నాగులు మొదలగు వారిచేత పూజింపపడుచున్న మంగళ (శివం) కరుడగు కేదారేశ్వరుని పొగడుచున్నాను.

ఇక్కడి అమ్మవారి పేరు కేదారగౌరి.

పురాణగాధ ::

శ్రీ మహావిష్ణువు అంశలు (అవతారములు) గా నరనారాయణులు ధర్మదేవతకు కుమారులుగా జన్మించి హిమాలయ పర్వతం మీద ఉన్న అత్యంత శోభాయమానమైన కేదారశిఖరమున బదరికాశ్రమములో నివసిస్తూ లోక కళ్యాణార్థమై శివుని గురించి తపస్సు చేసారు. వేకువనే పుణ్య అందియైన మందాకినిలో స్నానముచేసి, పార్థివ లింగమును నిర్మించుకొని, మందాకిని జలములతో, పవిత్రమైన బిల్వ పత్రితో, వికసించిన తామరపూలతో మిక్కి శ్రద్ధతో శివుని పూజిస్తూ ఉండేవారు. వారి భక్తికి ప్రసన్నుడైన శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమనగా, వారు "దేవా! మానవ కళ్యాణం కోసం మరియు శుభంకరం కోసం నివెల్లప్పుడు ఇక్కడనే ఉందు, నిన్ను దర్శించి, పూజించు భక్తులకు అక్షయప్రాప్తి కలిగేటట్లు వరమివ్వమని ప్రార్థించారు." అందుకనుగుణంగా పరమేశ్వరుడు, అక్కడ కేదారేశ్వర జ్యోతిర్లింగముగా వెలిశాడు.

ఈ లింగమును దర్శించి పూజించుటవలన అభీష్టములు సిద్ధించి, అచంచల శివభక్తి, మోక్షము లభిస్తాయి. కేదారేశ్వరుని భక్తులు కేదారమార్గమున మరణించిన ముక్తులగుడురని పురాణములు చెబుతున్నవి.

ఈ నరనారాయణుల తండ్రి 'ధర్ముడు' అను ధర్మమూర్తి, తల్లి దాక్షాయణి (దక్ష ప్రజాపతి కుమార్తెలలో ఒకరు). వీరు శివుని గురించి తప్పస్సు చేస్తున్నప్పుడు, ఇంద్రుడు వారి తపమును భంగపరచ దలచి, అప్సరసలను పంప, నిష్ఠాపరులు, సత్త్వ సంపన్నులైన వారు, ఆ అప్సరసలను శపింపక, వారి అజ్ఞానమును తొలగించుటకు, నారాయణుడు తన తొడకొట్టి వారికంటే అందమైన 'మేనక' అను ఒక అప్సరసను సృష్ఠించి వారిని లజ్జితులను చేసి పంపారు.

చరిత్ర మరియు విశేషము ::

పురాణాలలో, ఇతిహాసాలలో ఈ క్షేత్రం గురుంచి వర్ణించబడింది. ఈ క్షేత్రము హిమ ప్రదేశములో ఉండుటవలన, మే నెలనుండి అక్టోబర్ నెల వరకు మాత్రమే ఈ ఆలయం తెరువబడియుంటుంది. అయితే అక్టోబర్ చివరలో గుడి తలుపులు మూసివేసే సమయంలో ఆ కేదారనధుని ముందు వెలిగించిన జ్యోతులు తిరిగి మే నెలలో తలుపు తెరిచేవరకు ఆరిపోకుండా జ్వలిస్తూనే ఉంటాయి. జ్యోతిస్వరూపుడైన ఆ పరమేశ్వరుని అస్తిత్వ ప్రభావమునకు ఇదొక మచ్చుతునక.

చుట్టుప్రక్కల చూడదగిన స్థలములు - ప్రయాణ మార్గములు ::

కేదార్నాథ్ యాత్ర హరిద్వార్ నుండి మొదలవుతుంది. హరిద్వార్ లో కన్ఖల్, చండీదేవి, మానసాదేవి, భారతమాత మందిర్, సప్తర్షి మందిరం/ఆశ్రమం, హరికిపౌడి, ఇంకా ఎన్నో దేవాలయాలు మరియు ఆశ్రమములు. ఇక ఋషికేశ్ లో ఉన్న త్రివేణీఘాట్, లక్ష్మణ ఝూల, రాం ఝూల, రామ మందిరం, లక్ష్మణ మందిరం, భరత మందిరం, శత్రుఘ్న మందిరము, ఇంకా ఎన్నో పురాతన మందిరములు, ఆంధ్రా ఆశ్రమము, కైలాస ఆశ్రమము, శివానంద ఆశ్రమము, దయానంద ఆశ్రమము, టి.టి.డి. వసతి గృహము, దానికి ఇరుప్రక్కల వెంకటేశ్వర స్వామి మరియు మల్లికార్జున ఆలయాలు, చిన్న జీయర్ స్వామి ఆశ్రమం, వశిష్ట గుహ, అరుంధతి గుహ, ఓంకారేశ్వర ఆశ్రమము, ఇంకా ఎన్నో. ఇక బదరీనాథ్, ప్రక్కనే బ్రహ్మకపాలం, బ్రహ్మ కుడం, భీమగోదా, అల్మోర, తెహ్రీ గడ్వాల్ మరియు పౌడీ గడ్వాల్, దేవ ప్రయాగ, రుద్ర ప్రయాగ, కర్ణ ప్రయాగ, విష్ణు ప్రయాగ, గుప్త కాశి, తుంగనథ్, త్రిజోగి-నారాయణం, బదరికాశ్రమము, గౌరీ కుండము, బాల గణేష్, వ్యాస గుహ, గణేష్ గుహ, భీమ్ పుల్, సరస్వతి నది, యమునోత్రి, గంగోత్రి, ఇంకా ఎన్నో, ఎన్నెన్నో.

అది శంకరాచార్య అంతర్ధానమయ్యింది ఇక్కడే. ఇప్పటికి ఆ గుహ ఉన్నది. ఆలయం వెనకాల మందాకిని నది జలపాతాలు, పాండవుల మరియు ద్రౌపది పాద చిహ్నాలు దర్శనీయములు.

హరిద్వార్-ఋషికేశ్ ల మధ్య రైలు, బస్సులు, వ్యాన్సు, టాక్సీలు, ఇంకా ఇతర రవాణా సదుపాయాలు చాలా కలవు.

ఋషీకేశ్ నుండి కేదార్నాథ్ కు సుమారు 250 కి.మీ. దూరం. మారగమధ్యములో పైన చెప్పిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వీటన్నిటికి ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. గౌరీకుండం నుంది కేదార్నాథ్ దూరం 14 కి.మీ.లు. ఇక్కడ నడక కాని, పోనీ (గుర్రం) కాని, లేల డోలీలలో గాని ప్రయాణం చేయవచ్చు. గౌరీకుండమ్ మరియు కేదార్నాథ్ మధ్యలో రామవాడి అనుకోట టీ, ఫలహారాలు దొరుకుతాయి. కేదార్ నాథ్ సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తున ఉంది. కేదార్ నాథ్ లో పూజా సామాగ్రి అమ్ము షాపులు, ధర్మశాలలు, కాటేజీలు, హోటల్సు, మొ. నవి కలవు. మొన్న వచ్చిన ఉప్పెనకు చాలమటుకు కొట్టుకు పోగా, వాటిని ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తున్నారు. పూజారులు / పండ్ల తో స్వామిని తాకి పూజ / అభిషేకము ఏయించుకోవచ్చు.

రైలు మార్గము ::

హైదరాబాదు / చెన్నై / విజయవాడ - వరంగల్ - నాగపూర్ - ఇటార్సి - భోపాల్ - ఝాన్సీ - గ్వాలియర్ - ఆగ్రా - మథుర - డిల్లీ - మీరట్ - ముజఫర్ నగర్ - సహరన్ పూర్ - లక్సర్ - హరిద్వార్ - ఋషీకేశ్ - దేవ ప్రయాగ - రుద్ర ప్రయాగ - గుప్త కాశి - సోన్ ప్రయాగ్ - గౌరీకుండ్ - కేదార్ నాథ్.

సమీప విమానాశ్రమము :: డెహ్రాడూన్.
Read More

ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 - ఘ్రుశ్నేశ్వర జ్యోతిర్లింగం - ఎల్లోరా గుహలకు దగ్గరలో, మహారాష్ట్ర.

ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 - ఘ్రుశ్నేశ్వర జ్యోతిర్లింగం - ఎల్లోరా గుహలకు దగ్గరలో, మహారాష్ట్ర.

శ్లో.
ఇళాపురే రమ్య విశాలకే2స్మిన్, సముల్ల సంతం చ జగద్వరేణ్యం |
వందే మహోదరతర స్వభావం, ఘ్రుశ్నేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ||

రమ్యము, విశాలమైన ఇళాపురము (ఏలా పురము) లో ప్రకాశిస్తున్నవాడు, జగద్వరేణ్యుడు, అతి ఉదారమైన స్వబావము కలవాడు అయిన ఘ్రుశ్నేశ్వరుని శరణు వేడుచున్నాను.

ఇక్కడి అమ్మవారు ఘ్రుశ్నేశ్వరి - ఈ ఇలా (ఏలా) పురము దగ్గర ఉన్న దేవగిరి అను దుర్గము దేవతలకు నిలయమని ప్రసిద్ధి.

పురాణగాథ:
దేవగిరి దుర్గమునందు 'సుధర్ముడ'ను బ్రాహ్మణుడు 'సుదేహ' అను తన భార్యతో నివసిస్తూ, నిత్య-నైమిత్తిక కర్మలతో, అతిథి అభ్యాగతుల ఆదరణతో పవిత్రమైన గృహస్థ ధర్మమును ఆచరిస్తున్న ఈ బ్రాహ్మణ దంపతులకు సంతానము లేక బాధపడేవారు. ఒక రోజున ఆ గ్రామమునకు ఒక యతి రాగా, అతనిని తన ఇంటికి భోజనమునకు రమ్మని ఆహ్వానించి, భక్తితో భోజనము వడ్డిస్తున్న సమయమున, మీకు పిల్లలెంతమందని అడిగితే, వారు తమకు పిల్లరు లేరని విచారము వ్యక్తము చేసారు. భోజనము లేనివారింట భోజనము చేయని నియమం కల ఆ యతి, లేచి వెళ్ళిపోవ సన్నద్ధము కాగా, సుధర్ముడు కాళ్ళపైబడి, భోజనము చేయకుండా పోవద్దని బ్రతిమాలాడు. యోగద్రుష్టితో చూసిన ఆ యతి, సుధార్మున్ని ఓదార్చి, కాలాంతరమున నీకు కుమారుడు కలుగునని దీవించెను. అది విని అతని భార్య సుదేహ తనకు చిన్నతనమున జ్యోతిష్కులు సంతానము కలుగారని చెప్పిన మాట గుర్తుకు వచ్చి, ఆలోచించి, తన చెల్లెలైన ఘ్రుశ్నాను పెండ్లియాడమని సుధర్ముని బలవంతము చేయ, అతను సమ్మతించి అటులనే చేసెను. మహా పతివ్రత మరియు శివ భక్తురాలు అయిన ఆమే తన అక్కను, భార్తకును శుశ్రూష చేస్తూ ప్రతి దినము 101 పార్థివ లింగములను పూజించి దగ్గర ఉన్న చెరువులో నిమజ్జనము చేస్తూ ఉండేది. ఇట్లు లక్షల సంఖ్యలో పార్థివ లింగముల పూజ పూర్తియగుసరికి ఆమె గర్భవతియై ఒక సుపుత్రుని కన్నది.

కాలము గడిచినకొలది సుదేహ మనస్సున అసూయ పెరిగి, ఒకనాటి రాత్రి, నిద్రిస్తున్న బాలుని కత్తితో నరికి దేహభాగములను దగ్గరలో ఉన్న చెరువులో పారవేసి, ఏమీ ఎరుగనట్లు ఇంటికి వచ్చి నిద్ర నటించగా, ఘ్రుష్ణ మామూలు ప్రకారం పార్థివలింగములను పూజించి చెరువులో నిమజ్జనం చేయుటకు నీట అడుగు పెట్టగానే నీటి నడుమ బాలుడు ఈదుకొని వచ్చి తల్లి కాళ్ళు పట్టుకొని, 'అమ్మా! నేను మరణించి మరల మల్లి బ్రతికినటుల రాత్రి కల వచ్చింది, అది నిజమగునా?' అని ప్రశ్నింప, ఘ్రుశ్నకు ఆశ్చర్యము కలిగి, ఇంట్లో పడుకొని యున్న బాలుడు నీటిలోకెలా వచ్చాడు అని తలచి, ఇదంతా శివ మహిమ అనుకొనుచు, బాలును ఎత్తుకొని ఇంటికి వచ్చుచుండ, శివుడు ప్రత్యక్షమై 'స్వాధ్వీ! నీ అక్క అసూయతో నీ బిడ్డను చంపి చెరువులో పారవేసినను, నీ భక్తీ, ప్రాతివత్యములు బిడ్డను బ్రతికించినవి అని పలుకుచు సుదేహను శిక్షించెను. అప్పుడు, ఘ్రుశ్న శివుని కాళ్ళపైబడి, 'మహాదేవా! కరుణాముర్తీ! పుత్రభిక్షపెట్టి నన్ను కాపాడి, మా వంశమును నరకమునుండి తప్పించితివి. మా అక్క అమాయకురాలు, ఆమే కదా నాకు తన భర్తతో వివాహమాడునట్లు చేసినది. అసూయ వలన ఆ పాపముచేసినది కాన, ఆమెను క్షమించమని ప్రార్థించగా, పరమేశ్వరుడు ఘ్రుశ్న సహనమునకు మరియు ఔదార్యమును మెచ్చుకొని, 'అమ్మా! ఈ నాటినుండి నీ పేరుమీదుగా ఘ్రుశ్నేశ్వరునిగా నేనిక్కడ వెలిసెదను, నీవు నీభర్తతో సుఖముగా జీవించి, అంత్యమున నా లోకము చేరుదువని పలికి అంతర్ధానమయ్యెను. సుధర్ముడు, సుడిగా, గ్రామస్థులు చేరి జ్యోతిర్లింగమును గాంచి ఘ్రుశ్నాను వేనోళ్ళ పొగిడిరి. అక్క సుదేహ తన అపరాధమును మన్నించమని వేడుకొనగా, ఘ్రుశ్న అక్కను కౌగలించుకొని ఓదార్చినది. సుధర్ముడు ఘ్రుశ్నేశ్వరునికి ఆలయమును కట్టించి, భార్యా-బిడ్డలతో ప్రతిరోజు శివుని ఆరాధిస్తూ అంత్యమున మోక్షమును పొందిరి.

ఘ్రుశ్నేశ్వరుని దర్శించి ఆరాధించువారికి అకాల మరణముండదు. సంతాన నష్టము నుండి విముక్తులగుదురు.

చరిత్ర:
ఈ క్షేత్రము ఛత్రపతి శివాజీ పూర్వికుల స్వగ్రామముగా చెప్పబడుచున్నది. మాలోజీభోస్లే (శివాజి తాత), అతని తమ్ముడు విఠోజీ ఈ క్షేత్రాభివ్రుద్ధికి యెంతో క్రుషి చేసారు. తరువాత 1765-1795 ప్రాంతంలో ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కార్ ఘ్రుశ్నేశ్వర మందిరాన్ని పునర్నిర్మించి బాగా అభివృద్ధి చేసింది.

దర్శనీయ స్థలాలు:
1. శ్రీ ఘ్రుశ్నేశ్వరాలయం :: ఆలయ ప్రాంగణం చాలా విశాలమై చుట్టూ పెద్ద ప్రహరీతో ఉంది. శ్రీ స్వామి వారి గర్భాలయం భూమిలోపలికి ఉంటుందు. అమ్మవారు కూడ గర్భాలయంలోనే ఉంది. దేవాలయ గోడలపై మంచి శిల్పములు ఉన్నాయి.

2. శివాలయం (కోనేరు) :: దేవాలయ సమీపంలో ఉంది. దీనిలోనే ఘ్రుశ్న పార్థివ లింగాలను నిమజ్జనం చేసేది.

3. ఎల్లోరా గుహలు :: ఘ్రుశ్నేశ్వరాలయానికి 1-1/2 కి.మీ. దోరంలో ఉన్నాయి. 17 గుహలలో హిందూ ఆలయాలు, 12 గుహలలో బౌద్ధాలయాలు, 5 గుహలలో జైన ఆలయాలు ఉన్నాయి. ఈ 34 గుహలు క్రీ.శ. 600-1000 మధ్య నిర్మింపబడ్డాయి. గుహలలోని శిల్పకళ అత్యంత రమణీయంగా ఉంటుంది. ఘ్రుశ్నేశ్వరాలయం గల గ్రామాన్ని 'వెరుల్' అని పిలుస్తారు.

రైలు మార్గము ::
సికింద్రాబాద్ - పర్భని - ఔరంగాబాద్ - బస్ రూట్ - ఎల్లోరా - ఘ్రుశ్నేశ్వర్
చెన్నై - గూటి - గుంతకల్ - సికింద్రాబాద్ - పర్భని - ఔరంగాబాద్ - బస్ రూట్ - ఎల్లోరా - ఘ్రుశ్నేశ్వర్

సమీప విమానాశ్రయం ::
ఔరంగాబాద్
Read More

కుంకుమను ఎలా చేస్తారు? భక్తి సమాచారం కుంకుమను ఎలా చేస్తారు?

కుంకుమను ఎలా చేస్తారు?
భక్తి సమాచారం
కుంకుమను ఎలా చేస్తారు?

కుంకుమ. ... కుంకుమపువ్వు ఒకటికావు . కుంకుమపువ్వు ఒక సుగందద్రవ్యము . కుంకుమ... బొట్తుపెట్టుకోవడానికి వాడే రంగు పదార్ధము . కుంకుమ హిందువులకు చాలా పవిత్రమైనది. స్వచ్ఛమైన కుంకుమను తయారుచేయడానికి పసుపు, పటిక మరియు నిమ్మరసం వాడతారు. హిందువులలో పెళ్ళి జరిగిన తర్వాత ఆడవారు నుదురు మీద కుంకుమ బొట్టు పెట్టుకుంటారు.

ఆ కుంకుమ తయారి గురించి .

కావలిసిన సామానులు :
10 కిలోలు , పసుపుకొమ్ములు ,
1 కిలో పటిక ,
1 కిలో ఎలిగారం ,
400 నిమ్మకాయలు ,
1/2 కిలో నువ్వుల నూనె .

ముందుగా నిమ్మకాయలను రసము తీసుకొని , ప్లాస్టిక్ బకెట్ లో పోసుకోవాలి . పటిక , ఎలిగారం ను కచ్చాపచ్చాగా దంచి , ఆ రసములో ,కరిగి పోయేటట్లుగా కలపాలి . తరువాత పసుపు కొమ్ములు వేసి బాగాకలిపి ఒక రోజు వుంచాలి . మరునాడు వాటిని , ఇంకో ప్లాస్టిక్ బకెట్లోకి పూర్తిగా వంచేయాలి . ఆ విధముగా , నిమ్మరసము , పసుపు కొమ్ములకు పూర్తిగా పట్టేవరకు ,ప్రతిరోజూ ఒక బకెట్ లో నుండి , ఇంకో బకెట్ లో కి గుమ్మరించాలి .. ఇలా మార్చటము వలన పసుపు కొమ్ములకు నిమ్మరసము చక్కగా అంటుతుందన్నమాట. పసుపుకొమ్ములకు నిమ్మరసము పూర్తిగా పట్టిన తరువాత , అంటే ,ఈ సారి బకెట్ వంచుతే ,ఒక్క చుక్క కూడ నిమ్మరసము , పడకూడదన్నమాట , ఎవరూ తిరగని చోట , దుమ్మూ ధూళీ పడని చోట , నీడలో నేల శుభ్రముగా తుడిచి , చాప వేసి , దానిమీద , శుబ్రమైన బట్టను పరిచి , ఈ పసుపు కొమ్ములను ఎండపెట్టాలి . నీడలోనే సుమా ! అవి పూర్తిగా ఎండిన తరువాత , రోటిలో వేసి దంచాలి . ఆ పొడిని , తెల్లటి , పలచటి బట్టలో వేసి , జల్లించాలి . తరువాత ఆ పొడిలో కొద్ది కొద్దిగా నూనె వేస్తూ కలపాలి . నూనె తో కలపటము వలన , కుంకుమ నుదుటి మీద నిలుస్తుంది . లేకపోతే పెట్టుకోగానే రాలిపోతుంది . సరిపడా నూనె కలిపాక , సువాసన కొరకు ,కొద్దిగా రోజ్ వాటర్ కాని , ఉడుకులోన్ కాని కలపాలి . ఈ కుంకుమ మంచి ఎరుపురంగు లో వుంటుంది . ( సింధూరం రంగు కాదు , ఎరుపు ) .

ఎవరైనా ప్రయత్నము చేయాలంటే 100 గ్రాముల పసుపు కొమ్ములతో , మిగితావి ఆ కొలతకు సరిపడా తీసుకొని చేసుకోవచ్చు. పటిక , ఎలిగారము , కిరాణాదుకాణాలలో దొరుకుతాయి . చక్కని సువాసన తో ఈ కుంకుమ చాలా బాగుంటుంది .

పసుపు కొమ్ములలో , కుంకుమ రాళ్ళు వేసి , దంచి , తెల్లనిబట్టతో జల్లించి , నూనె కలుపుకొని , తోపురంగు కుంకుమ ( మెరూన్ కలర్ ) తయారు చేసుకోవచ్చు . కుంకుమరాళ్ళు , పటికలాగా వుంటాయి . తొందరగానే నలుగుతాయి .కుంకుమ రాళ్ళు కూడా కిరాణా దుకాణాలలో దొరుకుతాయి . బజారులో దొరికే కుంకుమ ఇదే .
Read More

వివాహం జరిగే సమయం తెలుసుకోవడమెలా?వివాహం జరిగే సమయం తెలుసుకోవడమెలా?

జాతక చక్రం పరిశీలించినపుడు జాతకం లో పెళ్లి తొందరగా జరుగుతుందా లేదా ఆలస్యంగా జరుగుతుందా అనే విషయం గమనించాలి. ప్రస్తుతం 22 సంవత్సరాలలోపు జరిగే వివాహాలను శ్రీఘ్ర వివాహంగా అనుకోవచ్చు.

1. లగ్నం, సప్తమభావమందు శుభగ్రహాలు ఉండి సప్తమాదిపతి పాపగ్రహములతో కలవకుండా శుభగ్రహాల దృష్టి పొందిననూ...
2. ద్వితీయ అష్టమ స్థానమలలో శుభగ్రహాలు ఉన్నప్పుడు...
3. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు. అనగా మిథునరాశిలో గాని, తుల, వృషభరాశులలో గాని, రవికి 150 లకు పైగా దూరంగా ఉన్నప్పుడు...
4. శుక్రుడు, శని గ్రహాలపైన చంద్రుని దృష్టి పడకుండా ఉన్నప్పుడు...
5. శుభగ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు...
6. జలతత్వ రాశులలో శుభగ్రాహాలు ఉన్నప్పుడు వివాహం తొందరగా జరుగుతుంది.
ఆలస్య వివాహం అనగా 28 సంవత్సరాలు, ఆపైన జరుగునవి. వివాహం ఆలస్యం అవడానికి గల కారణాలు...


1. లగ్నమందు, సప్తమ స్థానమందు పాపగ్రహాలు అనగా... శని, రాహు, కేతువు, రవి, కుజ గ్రహాలు ఉన్నప్పుడు...
2. సప్తమ స్థానమందు రెండుగాని అంతకన్నా ఎక్కువ పాపగ్రహాలు ఉన్నప్పుడు...
3. ద్వితీయ అష్టమ భావములలో పాపగ్రహా లు గాని, వక్రములు గాని ఉన్నప్పుడు...
4. శుక్రుడు రాహువుతో గాని, శనితో గాని కలిసివున్నప్పుడు...
5. శుక్రుడు రవి గ్రహానికి 430 201 కన్నా ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు...
6. జాతకంలో ఎక్కువ గ్రహాలు నీచంలో గాని వక్రించి గాని ఉన్నప్పుడు...
7. సప్తమ భావముపై, సప్తమాధిపై పాపగ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆలస్య వివాహం జరుగును.

ఈ విధంగా జాతకంలో శ్రీఘ్ర వివాహమా? ఆలస్య వివాహమా అని నిర్ణయించిన తరు వాత జరుగుతున్న దశ అంతర్దశలను బట్టి గోచారంలో గురువు, శుక్ర గ్రహాలను బట్టి వివాహ కాలం నిర్ణయించాలి.
వివాహకాలం నిర్ణయించుటకు జాతకునికి 21 సంలు దాటిన తరువాత వచ్చు దశ అం తర్దశలను పరిశీలించాలి. సప్తమాది యెక్క లేదా సప్తమ భావమును చూస్తున్న లేదా సప్త మాధిపతితో యతి వీక్షణలు పొందుతున్న గ్రహాల యొక్క దశ, అంతర్దశలలో వివాహం జరుగుతుంది. అలాగే నవాంశ లగ్నాదిపతి యొక్క, లేదా సప్తమాదిపతి నవాం శమందు న్న రాశి నాదుని యొకక దశ, అంతర్దశలలో వివాహం జరుగుతుంది. ఈ విధంగా వివా హం జరుగు కాలం నిర్ణయించిన తరువాత గురు గ్రహం గోచార గమనమును బట్టి వివా హం జరుగు సంవత్సరం నిర్ణయించాలి. అబ్బాయిల జాతకంలో శుక్రుడు, అమ్మాయిల జాతకంలో కుజుడు ఉన్న రాశులపై గోచార గురువు యొక్క దృష్టి లేదా కలయిక వచ్చిన సంవత్సరంలో వివా హం జరుగుతుంది.
Read More

కనకదుర్గా ఆలయంలో అమ్మవారిని అన్నపూర్ణ అలంకారంతో భావించి ఆరాధించడం సంప్రదాయంగా వస్తున్నది

కనకదుర్గా ఆలయంలో అమ్మవారిని అన్నపూర్ణ అలంకారంతో భావించి ఆరాధించడం సంప్రదాయంగా వస్తున్నది. అన్నపూర్ణ అన్నటువంటి భావనయే చాలా ఉత్కృష్టమైనది. అన్నపూర్ణ మంత్ర విశేషములు చాలా మనకి శాస్త్ర గ్రంథాలలో, ఆగమాలలో కనపడుతూన్నాయి. ఉపాసనా సంప్రదాయంలో అన్నపూర్ణ ఉపాసన ప్రత్యేకించి ఉన్నది. ఏవిధంగా అయితే శారదా ఉపాసన, లలితా ఉపాసన ఉన్నాయో అన్నపూర్ణ ఉపాసన ప్రత్యేకించి ఒకటి ఉన్నది. శ్రీవిద్యలో అయితే అమృత శక్తిగా ఈ తల్లిని చెప్తారు. అమృతేశ్వరీ దేవి, అన్నపూర్ణా దేవి – ఈ రెండు స్వరూపములు ఒకటే. ఈ అన్నపూర్ణ భావన మనకి క్షేత్రాలలో చూస్తే కాశీక్షేత్రంలో ప్రధానంగా కనపడుతున్నది. అదేవిధంగా ద్రవిడ దేశాలలో కొన్నిచోట్ల అన్నపూర్ణ క్షేత్రాలున్నాయి. అన్నపూర్ణ, విశాలాక్షి – ఈ రెండూ కూడా ఒకే తల్లియొక్క రెండు నామములు. అంతేకానీ విశాలాక్షి వేరు, అన్నపూర్ణ వేరూ కాదు. కాశీక్షేత్రంలో విశ్వనాథుడు తండ్రిగానూ, అన్నపూర్ణమ్మ తల్లిగానూ చెప్పబడుతూ సర్వజీవులనూ కూడా కాపాడుతున్న తల్లిదండ్రులు వారు అనే భావనతో
మాతాచ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః!
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్!!
అని ప్రసిద్ధిచెందిన శ్లోకం ఉన్నది. ఆ పార్వతీ దేవి అమ్మ. అమ్మ అనడంలోనే అన్నపూర్ణత్వం అందులో కనపడుతోంది. ఈ అన్నపూర్ణ అన్న మాటలో ప్రతివారికీ ఆకలి బాధ లేకుండా చేసే తల్లి ఆవిడ. ఈ దృష్టితో చూస్తే విశ్వవ్యాపకమైన భగవచ్ఛక్తి సృష్టిలో అందరికీ ఆహారాన్నిస్తోంది. అన్నప్రదాయని ఆవిడ. అందుకే ఎవరైనా సరే అన్నం తినేటప్పుడు ఆ పెట్టినటువంటి తల్లిని జగన్మాతను ఒక్కసారి తలంచుకొని తింటే అంతవరకు అన్నపదార్థం అప్పుడు అన్న ప్రసాదం అవుతుంది. అందుకే ఎవరు ఏది తిన్నా జగన్మాత వడ్డిస్తున్నది అన్న భావనతో ఆరగించగలగాలి. అలా తిన్న అన్నము చిత్తశుద్ధిని కలిగించి జ్ఞాన వైరాగ్యాలు ఇస్తుంది. అందుకే
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణ వల్లభే!
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతీ!!
అనే ప్రసిద్ధ శ్లోకం ఉన్నది. అయితే దీని ప్రసిద్ధి ఎంతో తత్త్వం కూడా అంత గొప్పగా ఉంటుంది. ఆవిడ అన్నపూర్ణ. సమస్తములైన అన్నములు నిండుగా ఉన్నాయిట ఆవిడ దగ్గర. సృష్టిలో అనేకమంది జీవులు ఇప్పుడున్న వాళ్ళు, తరువాత వచ్చేవాళ్ళు, అందరికీ అన్నం పెడుతున్నప్పటికీ ఆమె దగ్గరున్న అన్న భాండాగారం తగ్గదు, తరగదు. అలాంటి అన్నపూర్ణ. పైగా ఎప్పుడూ అది నిండుగా ఉంటుంది కనుక సదాపూర్ణే. పైగా శంకర ప్రాణవల్లభే – శివునియొక్క ప్రాణప్రియ. ఇలా ఎప్పుడైనా అమ్మవారిని తలంచుకున్నప్పుడు అయ్యవారిని కూడా తలంచితే అది ఉత్కృష్టమైన ఫలితములనిస్తుంది. అది ఒక శివశక్త్యాత్మకమైన ఉపాసన ఇస్తుంది. అలాంటి తల్లి ఇచ్చిన అన్నాన్ని మనం తింటున్నాం. ఆ అమ్మ వడ్డించింది అన్న భావన కలిగితే మనస్సు పసితనమంత నిర్మలమౌతుంది. అందుకే తల్లీ! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం – అమ్మ పెట్టిన ప్రసాదం వల్ల చిత్తం శుద్ధమై జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. జ్ఞాన వైరాగ్యం కలిగిందా అది మోక్షహేతువు అవుతుంది. అందుకు జ్ఞాన వైరాగ్యదాయకమైన అన్న ప్రసాదాన్ని ప్రసాదించవలసిందిగా అన్నపూర్ణమ్మను ప్రార్థిద్దాం.
Read More

వ్యాసుని తపస్సు - శివుని ప్రత్యక్షం-శ్రీ దేవీ భాగవతం

వ్యాసుని తపస్సు - శివుని ప్రత్యక్షం-శ్రీ దేవీ భాగవతం

శౌనకాది మహర్షులు తిరిగి ఇలా ప్రశ్నించారు.

"సూతమహర్షీ! మేరు పర్వత శిఖరానికి తపోనిమిత్తం వెళ్లిన వ్యాస భగవానుని గురించి తెల్పుతూ, మధ్య - మధ్య ప్రసక్తాను ప్రసక్తంగా వచ్చే ఉపాఖ్యానాలనూ రసవత్తరంగా వినిపిస్తున్నందుకు మాకు మహదానందంగా ఉంది. తిరిగి ముఖ్యకథా భాగమయిన వ్యాస తపోదీక్షావృత్తంతాన్ని వినిపించు" అని కోరారు.

రోమ హర్షణుడు ఈ ప్రకారం చెప్పసాగాడు.

"దేవతలకు క్రీడారంగం, మునులకు తపోవన భూమి అనదగిన మేరు పర్వత శిఖరంపై అత్యద్భుతావహమైన - సుందర సుమనోహర దృశ్యాలకు నెలవైన ఒక వనం ఉంది. అది అశ్వినులు, రుద్ర గణాలు, ఆదిత్యులు, మరుత్తులు, బ్రహ్మవాదులగు ముని పుంగవులకు నెలవు - నారద ఉపదేశానుసారం, పుత్రకామియైన వ్యాసమహర్హి మహా మాయా స్వరూపిణి అయిన పరశక్తి వాగ్బీజం అయిన ఏకాక్షరీ మంత్రజపం సాధనంగా చేసుకొని, నూరు సంవత్సరాల కాలం మహాదేవుని గురించి ఘోరమైన తపమాచరించాడు. ఆ తపోనిధి శరీరం శుహ్కించింది. తపోవేడిమికి లోకాలే తల్లడిల్లాయి. "మహాదేవా! వ్యాసమౌని తపస్సుకు లోకాలు ప్రకంపిస్తున్న కారణంగా నిన్ను రక్షణనర్థిస్తున్నాము. పాహిమాం !" అంటూ దేవతలను వెంటనిడుకొని దేవరాజు ఇంద్రుడు గౌరీపతిని వేడాడు.

శంకరుడా శచీపతిని భయము వలదని చెప్పి, "సురేంద్రా! ఎవరు ఘోర తపస్సు చేసినా, వారు నీ పదవికి ఎసరు పెడతారేమోనని భీతి చెందడం నీకు అలవాటే! కాని ఈ తాపస శ్రేష్ఠునికి నీ పదవిపై ఇసుమంతైనా ఆశలేదు. సంతానార్థియై ఆ మహర్షి సత్తముడు చేసే తపస్సునకు ప్రతిగా నేడే అతని మనోరధమీడేర్చనున్నాడు" అంటూ ఇంద్రుని వీడ్కోలిపి, వ్యాసునికి ప్రత్యక్షమయ్యాడు శివుడు. ఇష్టకామ్య సిద్ధిగా - ' సర్వులకు పూజ్యుడు, సత్త్వసంపన్నుడు, సత్యశీలుడు, జ్ఞాని, కీర్తిమంతుడు, గుణ ప్రపూర్ణుడు అయిన పుత్రుని బడయగలవు" అని ప్రసన్న వదనుడై వరమిచ్చాడు కైలాసపతి. వ్యాసుడు శివునికి నమసుమాంజలించి, ఘటించి నిజాశ్రమానికి చేరుకున్నాడు.

దేవ వేశ్య ఘృతాచి తారసపడుట :

వ్యాసమౌని ఆశ్రమమున కొంత విశ్రాంతి తీసికొని, అగ్నికార్యం నిమిత్తం అరణిని మధించసాగాడు. అరణి స్థానంలో ఒక కులకాంతను ఊహిస్తూ "స్త్రీ పురుషుల సంయోగం లేనిదే పుత్ర సంతానం ఏరీతి ప్రాప్తించగలదు? ఈ అరణిని మధించినట్లే, దండముతో ఉత్తమకుల సంజాత, రూపయవ్వన సంపన్న పతివ్రత అయిన స్త్రీని కూడి సుఖించాలి కదా! కానీ, కన్యను వరించడం - భార్యగా తెచ్చుకోవడం అంటే...నాకు నేనే కోరి బంధాల్లో చిక్కుకోవడం కాగలదు. గార్హస్థ్య జీవితం లేకుండా సంతాన ప్రాప్తి సంభవమా? ప్రణవ స్వరూపుడైన పరమేశునికే ప్రణయిని పార్వతిని కూడక తప్పని స్థితి. మరి నాకు ఏది సాధనం ?" అని తీవ్రంగా ఆలోచించసాగాడు.

సరిగ్గా అదే సమయంలో...

ఆకాశామార్గాన సంచరిస్తూ దివ్యకామిని అచ్చరలేమ ఘృతాచి వ్యాసునికి తారసిల్లింది. ఆ దేవవేశ్య మన్మధరూపం, తనువిలాసం ఎంతటి జితేంద్రియులనైనా ఆరడి బెట్టగలవనడానికి సందేహించనక్కరలేదు. అమరులకు అందుబాటులో ఉండేవేశ్య..."ఈమె నన్ను ధర్మబద్ధమైన కామానికి రా - రమ్మని ఆహ్వానించిన, నేను అంగీకరించడం ఎంతవరకు సమంజసం? సుఖ సంభోగ నిమిత్తం భ్రాంతుడినై, ఈ తేజవ్వని వెంట నేను పడితే - మునిలోకపు అవహేళనకు నేను గురికావలసి వస్తుంది. అదీగాక - నవమాసాలు మోసి పుత్రుని కని ఇచ్చునా? ఇంతా జేసి వేశ్యసంతానమా? పుత్రప్రాప్తి స్థితి వరకూ ఆమెని తీసుకెళ్లగల్గినా కీర్తిహాని తథ్యం! కనుకనే గణిత, అగణిత రతి సౌఖ్యమిచ్చినా, అట్టి కామం సకామం కానేరదు. దూష్యమే కాగలదు" ఇదీ ఘృతాచిని చూసిన తక్షణం వ్యాసుని మదిలో చెలరేగిన భావపరంపర.

అంతలోనే వ్యాసునికి ఊర్వశీ - పురూరవుల గాథ జ్ఞప్తికొచ్చి "అంతటి మహారాజు పురూరవునికే, దేవవేశ్య ఊర్వశి వల్ల పరాభవం తటస్థించింది. వేశ్యాలంపటం ఒక ఆరని చిచ్చు కదా! నారదుని వల్ల ఈ గాథ లెస్సగా విన్న నాకు దేవవేశ్యల పొందు విముఖత కల్గించాలి గాని, గుణపాఠం నేర్వకపోగా, పైగా గోతిలో పడటం విజ్ఞత కాదు కదా" అని వేశ్యాగమనాభిలాషను అణచుకున్నాడు.

"పౌరాణికగాథలను నీ వాగమృతంతో మరింత మధుర సంధాయకంగా మార్చగల వచో నిపుణ శ్రేష్ఠా ! సూత మహర్షీ! పురూరవుడెవరు? దేవవేశ్య ఊర్వశితో అతనికి పొత్తు ఎలా సంభవం ? సావధానంగా వినిపించ గోరుతున్నాం" అని శౌనకాదులు ప్రశ్నీంచగా, వ్యాస మహామహుని గాథను అక్కడికి ఆపి, పురూరవ చరితాన్ని అందుకున్నాడు సూత పౌరాణికుడు.
Read More

ప్రతివారిలోనూ చైతన్యం వుంది. చైతన్యం వుంటేనే మనం ఇక్కడున్నాం. ఈ చైతన్యం చేస్తున్న పని ఏమిటి?

ప్రతివారిలోనూ చైతన్యం వుంది. చైతన్యం వుంటేనే మనం ఇక్కడున్నాం. ఈ చైతన్యం చేస్తున్న పని ఏమిటి? మనం ప్రపంచంతో అయిదింటితో సంబంధం పెట్టుకుంటాం ప్రధానంగా. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు - మన అనుభవాలన్నీ ఇవే. ఈ అయిదింటినీ మనం అనుభవించడం కోసం పంచజ్ఞానేంద్రియాలు, అయిదింటినీ సంపాదించడంకోసం పంచ కర్మేంద్రియాలు, ఉన్నాయి. ఇంద్రియాలెన్నున్నా వీటితో కలియవలసింది ఒకటి వుంది - మనస్సు. మనస్సు కలవకపోతే అనుభూతి లేదు. ఉదాహరణకి ఒక శబ్దం అక్కడ మ్రోగుతూనే వుంటుంది. కానీ చెవిన పడదు. అందుకే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు బాణాలలాంటివి అయితే మనస్సుతో అవి అనుసంధానించాలి. అందుకు మనస్సు ధనుస్సులాంటిది అయింది. అనుభవమంతా మనస్సు ద్వారానే మనం పొందుతాం. ఆ తీపి అనబడే అనుభవ స్వరూపం మనస్సుదే కనుక మనస్సును చెరకు విల్లుతో పోల్చారు. అందుకు ’మనోరూప ఇక్షు కోదండ’. దీనిని మనం అన్వయించుకోవక్కరలేదు. అక్కడే చెప్పారు. మన బ్రతుకంతా ఈ అయిదింటినీ మనస్సుతో అనుభవించడమే. అయితే ఈ అయిదింటిని అనుభవించేటప్పుడు మనలో రెండు రకాల భావాలు కలుగుతాయి. ఇష్టమైనవి పొందేటప్పుడు అనుకూల భావం, ప్రీతిభావం కలుగుతూ వుంటుంది. అనిష్టమైనవి పొందేటప్పుడు ప్రతికూలభావం, జుగుప్సా భావం కలుగుతుంది. ఈ భావాలలో Degrees తేడా వుంటూ వుంటాయి. కొన్నింటిపట్ల ఎక్కువ అనుకూల భావం, కొన్నింటిపట్ల ఆ మాత్రం కొన్నింటిపట్ల మధ్యమస్థాయి; అలాగే ప్రతికూల భావాలు కూడా కొన్నింటిపట్ల ఉదాసీనత, కొన్నింటిపట్ల తీవ్రమైన క్రోధం, కొన్నింటిపట్ల తలంచుకుంటే బెంగపడి Depression అయిపోవడం, ఇవన్నీ కూడా ప్రతికూల భావంయొక్క Shades. అనుకూలమైన వాటిని రాగము అంటాం. ఎందుకంటే అనుకూలమైన వాటిని కట్టి దగ్గర పెట్టుకుంటాం. ప్రతికూల భావం మనల్ని అంకుశంలా పొడుస్తూ వుంటుంది. అందుకని అనుకూల భావమైన రాగము ఆవిడ పాశంలా పట్టుకున్నది, ప్రతికూల భావాన్ని అంకుశంలా పట్టుకుంది. మొత్తం మన బ్రతుకు చైతన్యమంతా ఈ నాలుగు చేతులలో పట్టుకుంది అమ్మవారు. ఈ నాలుగు అందరికీ అనుభవంలో వున్నవే. శాస్త్రమూ ఉపనిషత్తులూ అక్కరలేదు. అనుభవంలో ఉందా? లేదా? శబ్దస్పర్శరూపరసగంధాలు - ఈ మాట వేదాంతశబ్దమే అయినా బ్రతుకులో ఉన్నవే కదా ఇవి! కనుక పంచతన్మాత్రలు మనస్సుతో కలిసి అనుభవించేది రాగద్వేషానుభవం. ఇంత చైతన్యం ఉందని అందరికీ తెలుసు. కానీ ఇంత చైతన్యం పనిచేయడానికి ఉండాల్సింది ఆత్మచైతన్యం. ఇవన్నీ పనిచేయడానికి ఆత్మచైతన్యం లోపల ఒకటుంది అని తెలుసుకోక తన్మయమై తిరుగుతున్నాం. నాలుగింటినే చూస్తూ కూర్చుంటే బహిర్ముఖత్వం, ఈ నాలుగు ఎవరిచేతిలో ఉన్నాయో తెలుసుకొని లోపలికి వెళితే అంతర్ముఖత్వం. "అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా". ఈ నాలుగింటినీ నడిపే చైతన్యం స్వాత్మశక్తి అని తెలిశాక ఇంక నేనెవరు? నేను అనే అహంకారం ఇప్పుడు ఆవిడలో లీనమైపోయింది. అలా అమ్మవారిని ఎవరు ఉపాసన చేస్తారో వాడు ఉత్తమశ్రేణి ఉపాసకుడు అని లలితాసహస్రానికి ముందు చెప్పే ధ్యాన శ్లోకం చెప్పింది. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపామ్,. అణిమాది భి రావృతాం మయూఖైః అహమి త్యేవ విభావయే భవానీమ్!! ఆ భవానీదేవిని అహం - అని నేను భావన చేస్తున్నాను అన్నారు. అంటే మనలో ఉన్న నేను అనే చైతన్యం మనస్సుతో, పంచతన్మాత్రలతో కలగలసి రాగద్వేషాలనే భావాలతో కలసి వెళుతూంటుంది. ఇదే జీవితం. కానీ నేను అనే చైతన్యానికి మూలమేది? - ఆత్మశక్తి. ఇది గానీ గ్రహించితే ఒక చిత్రం జరుగుతుందిట. నువ్వు మనస్సు చేతిలోనో పంచతన్మాత్రల చేతిలోనో పడిపోకుండా అవి ఆవిడ చేతిలో వున్నాయి అని తెలుస్తాయి ఇక్కడ. మనం వాటి చేతిలో ఉంటే బంధం. ఆవిడ చేతిలో ఉన్నాయని తెలిస్తే అదే మనకి జ్ఞానహేతువు అవుతున్నది. ఇంత చైతన్యాన్ని నడుపుతూ మన హృదయపీఠంలో ఉన్నటువంటి స్వాత్మ చైతన్యమే లలిత. చైతన్యమే అసలు సౌందర్యం. విశ్వమంతా వ్యాపించిన సౌందర్యం ఏమిటంటే "సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్" ఏ జగజ్జనని చైతన్యం చేత ఈ మనస్సు, పంచతన్మాత్రలు, ఇంద్రియములు, పనిచేస్తూ మనలో రాగద్వేషాది అనుకూల ప్రతికూల అనుభవములున్నాయో ఇన్నింటికీ హేతువైన మహా చైతన్య స్వరూపిణియైన అమ్మవారిని నేను ఉపాసిస్తున్నాను అని తెలుసుకోవాలి. అలా ఉపాసన చేయగా చేయగా అహం కాస్తా అమ్మలో లీనమవుతున్నది. అదే అసలైన లలితా ఉపాసాన.
Read More

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత మనది మన గురించి మనం తెలుసుకోవాలి.ప్రతిఒక్కరు చదివి తెలుసుకోండిప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నాగరికత మనది
మన గురించి మనం తెలుసుకోవాలి.ప్రతిఒక్కరు చదివి తెలుసుకోండి
సరస్వతి నాగరికత : అసలైన భారత చరిత్రకు సాక్ష్యంసరస్వతి నాగరిక, సరస్వతి నది గురించి మన పుస్తకాల్లో కనిపించదు.మనది(భారతీయులది) సింధు నాగరికత (Indus valley Civilization) అని, 3300 BC నుంచి 1500 BC కాలం వరకు వర్ధిల్లిందని, ఆ కాలంలో ఇక్కడ ప్రజలు వేరే మతం పాటించేవారని, శివుడుని, ఎద్దును పూజించేవారని చెప్తారు. 1800 BC కాలంలో భారతదేశం మీద ఆర్యులు(Aryans) దండయాత్ర చేసి, సిందూ నాగరికతను నాశనం చేశారని, వేదాలు ఆర్యుల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించాయని, ఆర్యుల చేతిలో ఓడిపోయిన వారు డ్రావిడులని(Dravidians), వాళ్ళు దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డారని స్కూల్ పుస్తకాల్లో చరిత్రలో భోదిస్తారు.మరికొందరు మరికాస్త ముందుకెళ్ళి, అసలు హిందు ధర్మం భారత దేశానికి సంబంధించినది కాదని, ఇక్కడ డ్రావిడులకు వేరే మతం ఒకటి ఉండేదని, అది నాశనం చేసి, దుర్గా పూజు, గోవు(ఆవు) పూజ మొదలైనవి భారతదేశంలోని ఆర్యులు చొప్పించారని వాదిస్తుంటారు. బ్రాహ్మణ క్షత్రియ ఆర్యవైశ్యులు అసలు భారతీయులే కాదని వాదిస్తారు మరికొందరు. మనం అదే చదువుకున్నాం. మన పిల్లలు కూడా అదే చదువుతున్నారు.వేదాల్లో చెప్పబడిన సరస్వతీ నది అసలు భారతదేశంలో లేదని, అదంతా కేవలం ఒక కల్పితమని, వేదాలు గొర్రల కాపర్లు పడుకున్న పిచ్చి పాటలని, కాలక్రమంలో వాటికి దైవత్వాన్ని ఆపాదించారని ప్రచారం చేస్తున్నారు. అసలు భారతదేశం మీద ఇతర దేశస్థులు వచ్చే వరకు ఇక్కడి ప్రజలు అనాగరికులని, బట్టలు కట్టుకోవడం కూడా రాని మూర్ఖులని చెప్తారు.ఇదంత చదివిన తరువాత ఏ భారతీయుడి మనసైన చివుక్కుమంటుంది. ఆత్మనూన్యత భావం కలుగుతుంది. నిరాశ, నిస్పృహకు లోనవుతారు. ఆత్మ గౌరవాన్ని కోల్పోతారు.కాని ఇదంతా నిజం కాదు. ఇందులో నిజం లేదు. నిజానికి మన పిల్లలకు స్కూల్‌లో భోధిస్తున్న చరిత్ర, మనం చదివిన చరిత్ర అబద్దమని, అసత్యమని, అది నిరాధారమనదని చెప్పడానికి అనేక సాక్ష్యాలు దొరికాయి. వాటిలో ఒకటి సరస్వతి నది ఆనవాలు.భారతదేశంలో సరస్వతినది ప్రవహించిందన్నది నిజమని, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం తప్పని చెప్పుటకు సరస్వతి నది అనవాళ్ళూ ఒక మచ్చుతునక. వేల సంవత్సరాల భారతీయ చరిత్రకు సరస్వతీ నది ఒక సాక్ష్యం.మరి అసలు నిజమేంటి?అసలు లేదు అని ప్రచారం చేయబడిన సరస్వతీ నది భూమిపై ప్రవహించిందనడానికి కొన్ని ఋజువులు దొరికాయి. Michel Danino గారు సరస్వతి నది మీద అనేక పరిశోధనలు చేసి, పురాతన గ్రంధాలు, చారిత్రిక సాక్ష్యాలు, బ్రిటిష్ ప్రభుత్వపు అధికారిక పత్రాలు, పురావస్తు శాఖ Archaeological Survey of India వద్ద ఉన్న సమాచారం, రాజస్థాన్లో చెరువుల మీద చేసిన Pollen Analysis, Oxygen-Isotope ratios మీద జరిగిన పరిసోధనా వివరాలు, Remote Sensing satellite చిత్రాలు మొదలైనవాటిని ఎంతో శ్రమతో సంపాదించి అనేక ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టారు. ఈ నది ఎండిపోవడానికి గల కారణాలు, నది ఏఏ ప్రాంతాల్లో ప్రవహించిందో వంటివి చిత్రాల్లో, మ్యాప్ రూపంలో చూపించే ప్రయత్నం చేశారు.4000 BCలో సరస్వతి నది ఎండిపోవడం ప్రారంభయ్యిందని, ఎండిపోయిన సరస్వతీ నది గర్భం చిత్రాలు మొదలైనవి అత్యాధునిక Satellite SPOT ద్వారా బయటపెట్టారు ఫ్రెంచి శాస్త్రవేత్త, Henri Paul Franc-Fort.వీళ్ళ పరిశోధనల ప్రకారం ఋగ్‌వేదంలో ప్రస్తావించబడిన సరస్వతి నది దాదాపు 4000 ఏళ్ళ క్రితం వరకు ఈ భూమిపై ప్రవహించిందన్నది కాదనలేని సత్యం.దీని తోడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO కూడా ఈ నది మూలాలు, ఉనికి గురించి కనుక్కునే ప్రయత్నం చేసింది. Indian Remote Sensing Satellite సమాచారం, Digital elevationతో కొన్ని చిత్రాలను విడుడల చేసింది. Palaeo channels(నది యొక్క పాత ప్రవాహ మార్గం) ను కనుగొనె ప్రయత్నం చేసింది. Palaeo channelsతో పురాతన అనావాళ్ళను, చారిత్రిక ప్రదేశాలను,hydro-geological data ,drilling dataను పోల్చి చూసింది. సరస్వతీ నది భారతదేశానికి వాయువ్య దిశలో ప్రవహించిందని తేల్చారు.హరప్ప నాగరికతకు(Harappa Civilization) చెందిన కాలిబంగనన్(Kalibangan (Rajasthan)) వంటి ముఖ్యమైన ప్రదేశాలు, Banawali, Rakhigarhi (Haryana), Dholavira, Lothal (Gujarat), అన్నీ కూడా సరస్వతీ నది వెంబడి ఉన్నాయని నిర్ధారణకు వచ్చారు. సరస్వతీ నది ఎక్కడ, ఎప్పుడు ప్రవహించింది? దానికి ఋజువులేంటి?సరస్వతి నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గర్హ్వాల్ ప్రాంతంలో హర్-లి-దున్ అనే గ్లాసియర్ వద్ద యమునా నదితో పాటూ ఉద్భవించి, ఉత్తరాఖండ్, హర్యాన, పుంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుజరాత్ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలిసేది అని ఋజువైంది. అంటే పశ్చిమ/పడమర దిశగా ప్రబహించి అరేబియా సముద్రంలో కలిసేది(గంగ తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది). ఋగ్‌వేదంలోని 7వ మండలం ప్రకారం సరస్వతి నది పర్వతాల(హిమాలయాల) నుంచి కొండల ప్రాంతంగుండా ప్రవహిస్తూ సముద్రంలో కలిసేదని, అనేక మందికి జీవనాధరం అని చెప్పబడింది.యమున, సరస్వతి కొద్ది దూరం సమాంతరంగా ప్రవహించిన తరువాత యమునా నది సరస్వతి నదిలో కలిసేది. యమునతో పాటు శతదృ(సట్లెజ్/Sutlej), హక్రా, ఘగ్ఘర్ మొదలైన నదులు హిమాలయల్లో జన్మించి, కొద్ది దూరం ప్రవహించి సరస్వతి నదిలో కలిసేవి. పూరాణాలు, ఆధునిక పరిశోధనలు రెండూ ఈ విషయాలను ధృవపరుస్తున్నాయి.యమున, శతదృ నిత్యం నీటితో నిండి ఉండేవి. సరస్వతి నదీ ప్రవాహానికి అత్యధికంగా యమున, శతదృ(సట్లెజ్) నదులు నీరు అందించేవి. ఋగ్‌వేదంలో [10.75.5] సూక్తంలో భారతదేశంలో తూర్పు నుంచి పశ్చిమ దిశవరకు ప్రవహించే నదులు ప్రస్తావన ఉన్నది.అందులో సరస్వతి, శతదృ, విపస(బీస్/beas), వితస(జేలం/jhelum), పరుషిని(రవి/ravi), అస్కిని(చీనబ్/cheenab), యమున, ద్రిషదవతి, లవణవతి మొదలైన నదులు ఉన్నాయి. కానీ కాలక్రమంలో ఈ నదులన్నీ తమ ప్రవాహ దిశను మార్చుకున్నాయి. వాటిలో సరస్వతీ, ద్రిషదవతి, లవణవతి నదులు ప్రస్తుతం కనుమరుగయ్యాయి.సరస్వతి నది ఎండిపోవడానికి గల కారణాలు ఏమిటి?భారతదేశంలో అనేకమందికి జీవనాధారమని, అతి పెద్ద విశాలమైన నది అని సరస్వతి నది గురించి మన గ్రంధాల్లో కనిపిస్తుంది. సరస్వతినది మీద జరిగిన పరిశోధనల ప్రకారం నదీగర్భం 3 నుంచి 15 కిలోమీటర్ల వెడల్పు(width) కలిగి ఉంది. అంటే సరస్వతి 3 నుంచి 15 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉండేది.సరస్వతీ నది గత 6000 ఏళ్ళ క్రితం ఎండిపోవడం మొదలైంది. మొదటగా నదిప్రవాహం తగ్గుతూ వచ్చింది. గత 4000 సంవత్సరాల క్రితం నాటికి ఈ భూమి పైనుంచి కనుమరుగయ్యిందని ఆధినిక పరిశోధనలు చెప్తున్నాయి.సరస్వతీ నది ఎండిపోవడానికి కారణం భూమి యొక్క Tectonic Platesలో వచ్చిన మార్పులేనట. ఇదే సమయంలో సరస్వతి నదికి అత్యధికంగా నీరు అందించే ఉపనదులైన యమున, సింధు నదులు తమ ప్రవాహా మార్గాన్ని మార్చుకున్నాయి. యమునా నది పంజాబ్ ప్రాంతంలో సరస్వతీ నదీ ప్రవాహాన్ని తన ప్రవాహంలో కలిపేసుకుని గంగానదిలో కలవడం ప్రారంభమయ్యింది.Tectonic Platesలో కలిగిన మార్పుల కారణంగా ఆరావల్లి పర్వతాలు పైకి జరిగాయి. దీని ప్రభావంతో వాయువ్య భారతంలో నదీ ప్రవాహాల్లో తీవ్రమైన మార్పు వచ్చింది. శతదృ(సట్లెజ్) పశ్చిమానికి తిరిగి విపస(బీస్), సింధు(ఇండస్) నదులలో కలవడం ప్రారంభించింది.ఈ కారణాల చేత సరస్వతీ నది నీటి ప్రవాహం తగ్గుతూ వచ్చి, కొంతకాలానికి భూమిపైన ప్రవహించకుండా భూమి అడుగు భాగంలో అంతర్వాహినిగా మారిపోయింది.కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో నది తీరాల్లో వెలిసిన మరికొన్ని నాగరికతలు కూడా టెక్‌టొనిక్ ప్లేట్లలో కలిగిన మార్పుల వల్ల కొన్ని ధ్వంసం అవ్వగా, కొన్ని వైభవాన్ని కోల్పోయాయి.సింధు నాగరికతలో(Sindhu/Indus Valley Civilization) సింధు నది పక్కన 30 పైగా చారిత్రాత్మిక స్థలాలను పురావస్తు శాఖ గుర్తించారు, కానీ సరస్వతి నదీ గర్భం వెంబడి దాదాపు 360 పైగా ముఖ్యమైన పురాతన ప్రదేశాలు ఉన్నాయి. మనం స్కూల్లో చదువుకున్న హరప్ప నాగరికత కూడా ఇందులో భాగమే.ఆర్యులు భారతదేశం మీద దండయాత్ర చేసి డ్రావిడుల మీద యుద్ధం చేయడం వల్ల హరప్ప నాగరికత అంతం అవ్వలేదు. ఈ దేశంలో భౌగోళికంగా జరిగిన మార్పులు ప్రభావం వలన సరస్వతి నది ఎండిపోయింది. హరప్ప నాగరికత ముగియడానికి కారణం సరస్వతి నది ప్రవాహం ఆగిపోవడమే.భారత్, పాకిస్థాన్, రొమానియ, US,UK కు చెందిన శాస్త్రవేత్తల బృందం state-of-the-art Geoscience technology ని ఉపయోగించి హరప్ప నాగరికతగురించి కొన్ని విశేషాలను బయటపెట్టారు. హరప్ప ప్రజలు అత్యంత అనుకూలమైన వాతావరణంలో జీవనం సాగించారాని, వాతావరణంలో కలిగిన మార్పుల కారణంగా అతివృష్టి, అనావృష్టి ఏర్పడి హరప్ప నాగరికత పతనం 4000 ఏళ్ళ క్రితం మొదలైందని తేల్చారు. 10,000 సంవత్సరాల క్రితం నుంచి ఆ ప్రాంతపు భూభాగంలో ఏర్పడిన మార్పులను పరిశీలించారు. గాడి తప్పిన ఋతుపవనాలు కూడా హరప్ప నాగరికతకు హాని చేసిందని నివేదిక ఇచ్చారు.మరిన్ని ఆధునిక పరిశోధనలు కూడా సింధూ నాగరికత సరస్వతీ నది తీరం వెంబడి ఉన్నదేనని, వాతావరణ మార్పులు కారణంగా గందరగోళంగా తయారయ్యిందని చెప్తున్నాయి. ఈ మార్పుల కారణంగా హరప్ప ప్రజలు జీవం కోసం ఇతర ప్రదేశాలకు తరిలిపోయారు. ఈ సమయంలో వీరు అత్యధికంగా గంగానది తీరం వైపు పయనించారు. ఈ సమయంలో వీరు అత్యధికంగా గంగానది తీరం వైపు పయనించారు. అంతేకానీ, డ్రావిడులను ఓడించిన ఆర్యులు వారిని దక్షిణ భారతదేశానికి పంపించి గంగా తీరంలో స్థిరపడ్డరనడానికి ఏ విధమైన ఆధారాలు లేవు. ఇక సరస్వతి నది గురించి మన ఇతిహాసం మహాభారతంలో కూడా ప్రస్తావన ఉంది.మహాభారతం 1.90.25.26 లో అనేక మంది మహారాజులు సరస్వతి నదీ తీరంలో యజ్ఞయాగాలు చేశారని ఉన్నది. సరస్వతి నది గర్భానికి దగ్గరలో ఉన్న హరప్ప నాగరికతలో భాగమైన కాలిబంగన్‌లో పురాతన యజ్ఞగుండాలు యొక్క అవశేషాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. యజ్ఞగుండాలు/ అగ్నిహోత్రాలు ఉన్నది ఒక్క వేద ధర్మలో మాత్రమే. హరప్పనాగరికత ప్రజలు హిందువులనడానికి ఇది ఒక్కటి సరిపోతుందేమొ.మహభారతం జరిగి ఇప్పటికి 5150 సంవత్సరాలు గడించింది. మహాభారతం సరస్వతి నది ఎండిపోవడం గురించి ప్రస్తావిస్తూ వినాశన/ఉపమజ్జన మొదలైన ప్రాంతాల్లో సరస్వతినది కనిపించడం లేదని చెప్తోంది.బలరాముడు సరస్వతి నదిలో యాదవుల చితాభస్మాన్ని కలిపి, ద్వారక నుంచి మధురకు ప్రయాణించాడని ఉంది.అంతేకాదు మహాభారత సమయానికి సరస్వతీ నది ఎండిపోవడం ప్రారంభమయ్యింది. ఎంతో పవిత్రమైన సరస్వతినది ఎండిపోవడం తట్టుకోలేని బలరాముడు యుద్ధంలో పాల్గొనకుండా వైరాగ్యంతో సరస్వతీ నది తీరంలో ఉన్న అనేక పుణ్య క్షేత్రాల దర్శనం చేసుకున్నాడు. సరస్వతి నది 6000 ఏళ్ళ క్రితం నుంచి ప్రవాహం తగ్గిపోయి 4000 ఏళ్ళ క్రితం కనుమరుగయ్యింది. అది కనుమరుగవడానికి 1000 సంవత్సరాల ముందు పరిస్థితిని మహాభారతం వివరిస్తోంది.సరస్వతి నది ఎండిపోవడానికి ఒక కారణం ద్వాపరయుగాంతం.సాధారణంగా యుగాంతం అనగానే చాలామంది ప్రళయం వచ్చి ప్రపంచమంతా నాశనంవుతుందని అనుకుంటారు. కల్పం అంటే 4.32 బిల్లియన్ సంవత్సరాలు. కల్పాంతానికి సమస్త సృష్టి మొత్తం నాశనమవుతుంది. యుగాంతం జరిగి కొత్త యుగం ప్రారంభమయ్యే కాలంలో ప్రళయం రాదు కానీ, అనేక భౌగోళిక మార్పులు సంభవిస్తాయి.ఒక యుగం అంతమై కొత్త యుగం ప్రారంభమయ్యే సమయంలో సంధికాలం అంటూ కొంత ఉంటుంది. యుగం అంతవమవ్వగానే ఒక్క సారే ప్రపంచంలో మార్పులు సంభవిస్తాయని చెప్పలేము. ఒక యుగం అంతమవ్వడానికి కొంతకాలం ముందు నుంచి కొత్త యుగం ప్రారంభమైన కొంత కాలం వరకు అనేక మార్పు చోటు చేసుకుంటాయి. యుగాంతంలో అత్యధిక జనాభా నాశనమవుతుంది.8,64,000 సంవత్సరాల ద్వాపరయుగం 17 ఫిబ్రవరి 3102 BC లో ముగిసింది. దీనికి 36 ఏళ్ళ ముందు మహాభారతం అనే మహాప్రపంచయుద్ధం జరిగి ప్రపంచ జనాభ నాశనమైంది. అణుబాంబులు పడి అనేక నాగరికతలు ధ్వంసమయ్యాయి. ప్రపంచం మొత్తం ఈ యుద్ధంలో పాల్గొన్నది.ద్వాపరయుగాంతం ప్రభావం చేత యుగాంతానికి ముందు సంధికాలంలో సరస్వతి నది ఎండిపోవడం ప్రారంభమైంది. ఇది ఒకట్టే కాదు, మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఇదే సమయంలో ప్రపంచంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సుమేరియ నాగరికత 2200 BC కి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈజిప్ట్ రాజ్యం కూడా సరిగ్గా ఈ సమయంలోనే అంటే సంధికాలంలోనే వాతావరణ మార్పుల కారణంగా పతనమైంది. ఇక పచ్చని మైదాన ప్రాంతమైన సహార గత 4000 ఏళ్ళ క్రితం చోటు చేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా ఏడారిగా మారిపోయింది. అన్నిటికంటే ముఖ్యమైనది, ద్వారక ద్వాపరయుగాంతం సమయంలోనే సముద్రంలో కలిసిపోయింది. ఈనాటికి అరేబియా సముద్రంలో ఉంది. ఇవన్నీ కూడా యుగాంతం ప్రభావమే. వాటిలో భాగమే సరస్వతి నది అంతర్ధానమవడం.150 మిల్లీమీటర్ల కంటే అతి తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు కలిగిన జైసల్మర్ జిల్లాలో భూగర్భ జలాలు 40-50 మీటర్ల లోతులో అందుబాటులో ఉంటాయి. అక్కడ బావులు నిత్యం జలంతో కళకళలాడుతూ ఉంటాయి. ఎప్పుడు ఎండిపోవు. అక్కడున్న భూగర్భ జలాలను పరిశీలిస్తే Tritium content అతి తక్కువగా ఉంది. అంటే ఇవి ఈ కాలంలో నీటి సంరక్షణా చర్య్ల క్రింద నేలలో ఇంకిన నీరు కాదుట. Independent Isotope analyses మరియు Radiocarbon data ప్రకారం ఇసుకతిన్నెల కింద ఉన్న ఈ మంచినీరు కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటివని తేలింది.రాజస్థాన్‌లో మరికొన్ని ప్రాంతాల్లో జరిగిన పరిశోధనల్లో అక్కడ అందుబాటులో ఉన్న నీరు 4000-8000 ఏళ్ళ క్రితం నాటివని తేల్చారు. అసలు ఏడారి ప్రాంతంలో భూగర్భంలో మంచినీరు దొరకడమేంటని పరిశీలిస్తే ఈ నీరు వేల సంవత్సరాల క్రితం పవిత్ర భారతభూమిలో ప్రవహించిన సరస్వతి నది నీరని నిర్ధారణకు వచ్చారు. మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే రాజస్థాన్ ప్రాంతం ఏడారిగా మారిపోవడానికి కారణం సరస్వతీ నది ఎండిపోవడమే అని చెప్తున్నారు.ఇలా నిర్ధారించడానికి కారణం లేకపోలేదు. వీళ్ళకు దొరికిన శుద్ధజాలాలన్నీ ఎండిపోయిన సరస్వతి నది గర్భం ఉన్న ప్రాంతంలోనివేనట. ఈరోజు శాస్త్రవేత్తలు కూడా రాజస్థాన్‌లో భూగర్భంలో ఉన్న సరస్వతీనది నీటిని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ భూగర్భంలో ఉన్న నది నీటిని పైకి తీసుకురావడం ద్వారా రాజస్థాన్ ప్రాంతంలో నీటి కరువును తగ్గిచవచ్చని అభిప్రాయపడుతున్నారు.ఆర్యులు భారతదేశం మీదకు 1800 BC లో దండయాత్రకు వచ్చారని, హిందూ సంస్కృతి వారిదేనని, వారు మధ్య ఆసియా, తూర్ఫు దేశాలకు చెందైనవారని ఒక వాదన ఉంది. కానీ ఆర్యులు దండయాత్ర సిద్ధాంతం(Indo-Aryan Invasion) ఎటువంటి చారిత్రిక ఆధారలు లేవు. అదే కాకుండా ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం తప్పని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. సరస్వతి నది కూడా అటువంటిదే.సరస్వతినది ఋగ్వేదంలో చెప్పబడింది. హిమాలయ పర్వతాల్లో ఉద్భవించి పర్వతప్రాంతాల మీదుగా పాలవంటి స్వచ్చమైన ప్రవాహం కలిగి, తన ప్రయాణమార్గంలో మనుష్యులకు, పశువులకు జీవనాధారమైనదని ఉంది. సరస్వతి నది తీరంలో వెన్న, నెయ్యి మొదలైనవి పుష్కలంగా ఉండేవని, ఈ నది తీరంలో ఉన్న పశుసంపద గురించి కూడా ఋగ్‌వేదం చెప్తోంది. ఈ విధంగా సరస్వతి నది నిండుగా ప్రవహించింది 8000 సంవత్సరాల క్రితం మాత్రమే. 6000 క్రితమే సరస్వతి నది ప్రవాహంలో మార్పులు మొదలయ్యాయి.కాసేపు పచ్చి అబద్ధమైన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం నిజం అనుకుందాం. ఆర్యులు భారతదేశం మీద దండయాత్రకు వచ్చింది 1800 BC లో. సరస్వతి నది 2000 BC నాటికి పూర్తిగా ఎండిపోయింది. 5000 ఏళ్ళ క్రితం జరిగిన మహాభారత యుద్ధం నాటికే కొన్ని ప్రదేశాల్లో నది ప్రవాహం కనిపించలేదు. అంటే ఆర్యులు భారతదేశం మీద దండయాత్రకు వచ్చే నాటికి సరస్వతినది అనేది ఈ భూమి మీద లేనేలేదు. వేదాలు వారివే అంటున్నారు కదా. మరి వేదాల్లో 8000 సంవత్సరాల క్రితం నది ప్రవాహం గురించి ఎలా ప్రస్తావించబడింది? దానితో పాటు ప్రవహించిన ద్రిషదవతి, లవణవతి గురించి వారికి ఏలా తెలిసింది. 2000 BC నాటికి సరస్వతి నది కనుమరుగయ్యింది కానీ అంతకు చాలాకాలం ముందే అది చిన్న పిల్లకాలువలాగా మారిపోయింది. ఒక వేళ ఇక్కడ ఒక నది ప్రవహించిందని ఆర్యులకు తెలిసినప్పటికి అది ఒక కాలువ అని మాత్రమే అనుకునేవారు. మిగితా నదులు తమ గమనాన్ని మార్చుకున్నాయి. ఆర్యులు దండయాత్ర సిద్ధాంతం నిజమే అయితే సరస్వతి నది సహజ రూపం, మిగితా భారతదేశ నదుల గురించి అసలు వేదాల్లో ప్రస్తావనే ఉండేది కాదు.3300-1300 BC మధ్య భారతదేశపు వాయువ్యదిశలో సింధునాగరికత(Indus Valley Civilization) విలసిల్లిందని మనం చదువుకున్నాం. ఈ సింధు నాగరికత సింధు, హక్రా, గగ్గర్ నదులు పరీవాహిక ప్రాంతంలో ఉన్న ప్రపంచపు అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాధమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీశారు. ఇది మహారాష్ట్రలో కొంతప్రాంతం వరకు ఉండేదని కూడా తెలుస్తోంది. 126000 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించడం వల్ల ప్రపంచంలో పురాతన నాగరికతలలో అతి పెద్దదిగా చెప్తారు.హరప్ప నాగరికతకు చెందిన అవశేషాలు దొరికిన తరువాత, హరప్ప, మొహంజిదారొ మొదలైనవన్నీ సింధూ-నాగరికతలో భాగం అని భావిస్తూ వచ్చారు. ఇక్కడ నివసించిన ప్రజలు ద్రావిడులనీ, ఇక్కడి నుంచే భారతదేశ చరిత్రను చెప్పడం ప్రారంభించారు.కానీ రాజస్థాన్ భూగర్భంలో దొరికిన పురాతన సరస్వతినది అనావాళ్ళూ, సరస్వతినది భూగర్భం మీద జరిగిన పరిశోధనలు భారతీయ చరిత్రను మరింత వెనక్కు తీసుకువెళ్తున్నాయి. సింధూ నాగరికత మొత్తం సరస్వతినాగరికతలో భాగం అని, వాతావరణ మార్పుల వల్ల ప్రజలు ఇతర నదుల వద్దక జీవనం కోసం తరలిపోయారని చెప్తున్నారు. సింధూ నాగరికతలోని చారిత్రక స్థలాలన్నీ సరస్వతినది గర్భం చుట్టుపక్కల ఉండడం ఈ వాదనను బలపరుస్తోంది. అందువల్ల భారతదేశంలో సరస్వతి-సింధు నాగరికత(Saraswati-Sindhu Civilization) విలసిల్లింది. ఇప్పటివరకు సింధూ నాగరికత ఒక 4000-5000 సంవత్సరాల క్రితం కాలానికి సంబంధించినదైతే, సరస్వతి సింధూ నాగరికత కనీసం 8000 సంవత్సరాల క్రితంది. ఆర్యుల దండయాత్ర సిద్ధంతాం ఒక కపోలకల్పన.మరో విశేషమేంటంటే, సింధూ నాగరికత ప్రజలు చాలా తెలివైనవారు. భూగర్భ డ్రైనేజి(Under ground Drainage System), బహుళ అంతస్తుల భవనాలతో, పెద్ద పెద్ద రోడ్లు మొదలైనవన్నీ వారి నగర నిర్మాణ(Town Planning) కళకు అద్దం పడుతున్నాయి. ఇవన్నీ అక్కడ దొరికిన అవశేషాల ఆధారంగా చరిత్రకారులు చెప్తున్నారు. ఇవన్నీ కూడా సరస్వతి నాగరికతలో భాగమే. ఇంత గొప్ప పరిజ్ఞానం ఆ కాలంలోనే ప్రజలకు ఉంది.భారతదేశం 8000 ఏళ్ళకు పూర్వమే అపూర్వంగా, అద్భుతంగా వెలిగిపోయిందడానికి సరస్వతినది ఆనవాళ్ళు, సరస్వతి నాగరికత చిన్న ఉదాహరణలు మాత్రమే.సరస్వతి నాగరికత(Sarawati Civilization)కు మతం రంగు పులిమారుఏ దేశస్తులైనా తమ దేశం గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఎంతో ఇష్టపడతారు. ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. చైనాలో 2000 ఏళ్ళ క్రితం నాటి ఒక పురాతన సమాధి బయటపడితే దాని గురించి బహుగొప్పగా ప్రపంచానికి చెప్పుకున్నారు చైనీయులు. కానీ మన దేశంలో 4000 ఏళ్ళ క్రితం వరకు ప్రవహించిన ఒక నది ఆనవాళ్ళు బయటపడి, మన దేశపు చరిత్రను తిరగరాసే అపూర్వమైన అవకాశం మనకు వస్తే మనం మాత్రం అసలు పట్టించుకోలేదు. ఇది మన 'దేశ భక్తి'. మన రాజకీయ నాయకులు సరేసరి.భారతీయసంస్కృతి యొక్క వైజ్ఞానిక, చారిత్రిక సత్యాలను బయటపెట్టి, సనాతన వైదిక(హిందూ) ధర్మం యొక్క పురాతన వైభావాన్ని ప్రపంచానికి సరస్వతి నది ప్రపంచానికి చాటితే అది భారతీయులకు గర్వకారణం. భారతీయత ఈనాటి కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిదని, ప్రపంచానికి కనీసం బట్టలు కట్టుకోవడం కూడా రాని సమయంలో ఈ దేశంలో అద్భుతమైన శాస్త్రీయ పరిజ్ఞానం ఉందని చెప్పుకోవడం కులమతాలకు అతీతంగా ప్రతి భారతీయుడికి ఎంతో గర్వంగా ఉంటుంది. కానీ నీచపు ఆలోచనలు కలిగిన మన రాజకీయ నాయకులు మన దేశపు కీర్తికి సంబంధించిన అంశానికి మతం రంగు పులిమారు.మన దేశాన్ని అత్యధికంగా పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం, కొంత మంది చరిత్రకారులు భారతీయ చరిత్ర గుర్రాలమీద కత్తులు పట్టుకుని (ఎక్కడ నుంచో వచ్చారొ తెలియదు కానీ )ఈ దేశం మీద దండయాత్రకు వచ్చిన శ్వేతవర్ణపు ఆర్యులు ద్రావిడులని దక్షిణానికి వెళ్ళగొట్టడంతో మొదలైందని 'నమ్మిస్తు' వస్తున్నారు.అంతకు ముందు ఈ దేశంలో ఏమి జరిగినా అదంతా కల్పితము, మూఢనమ్మకము మాత్రమేనట. ముఖ్యంగా హిందువుల విషయంలో ఏమి జరిగినా అది మాత్రం అసత్యమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్ర కాస్త కఠినంగా ఉన్న దాన్ని ఈ రోజు కాకపోతే ఏదో ఒకరోజైన ఆధునిక 'సెక్యులర్' వ్యవస్థ ఎదుర్కోనాలి.సరస్వతి అనేది ఒక మాతానికి సంబంధించిన దేవత పేరట(నిజానికి పరిశోధన సరస్వతి దేవి మీద కాదు, భారతీయ చరిత్రకు సరికొత్త నిర్వచనం ఇచ్చే సరస్వతినది మీద. సరస్వతి నది ఒక మతానికి కాదు ఈ భరతజాతికి సంబంధించినదన్న కనీసం జ్ఞానం కూడా పాలకులకు లేకుండా పోయింది.) . ఆమె పేరుతో జరిగే ఏ పరిశోధనలకు నిధులిచ్చినా అది మిగితావారి మనోభావలను దెబ్బతీస్తుందట. 'సెక్యులర్'భావాలకు అది భిన్నంగా ఉంటుందట. అందుకే అధికారంలోకి రాగానే 'సెక్యులరిసం' పేరుతో ఈ దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సరస్వతినదికి నిధులివ్వడం ఆపేసింది.

మీ..బొక్కాసత్యశివబాలబాలాజీ..Read More

దుర్గామాతయొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’.

దుర్గామాతయొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’.
పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥
నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి. ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కల్యాణ కారకము. ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘాంటాకృతిలో ఉండటంవల్ల ఈమెకు ‘చంద్రఘంట’ అనే పేరు స్థిరపడింది. ఈమె శరీరకాంతి బంగారువన్నెలో మిలమిలలాడుతుటుంది. తన పది చేతులలో – ఖడ్గము మొదలయిన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది. సర్వదా సమరసన్నాహయై యుద్ధముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం. ఈమె గంటనుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు.

నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటాదేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. అలాగే వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతికొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.

ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. ఈమె నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. ఈమె ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.

ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అను క్షణమూ సన్నద్ధురాలై ఉండునదే; అయినప్పటికీ భక్తులకూ, ఉపాసకులకూ ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగానూ, ప్రశాంతముగానూ కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడంవల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతోపాటు సౌమ్యతా, వినమ్రతలు పెంపొందుతుంటాయి. వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ, సద్గుణములు వృద్ధిచెందుతుంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు. ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాలనుండి దివ్యమూ, ప్రకాశవంతమూ అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది. ఈ దివ్య ప్రక్రియ సామాన్యులదృష్టికి గోచరించదు. కానీ ఉత్తమ సాధకులూ, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి, అనుభూతిని పొందగలరు.

మనము త్రికరణశుద్ధిగా విధ్యుక్తకర్మలను ఆచరిస్తూ, పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘాంటాదేవిని శరణుజొచ్చి, ఆమెను ఉపాసించడానికీ, ఆరాధించడానికీ తత్పరులమై ఉండాలి. అలాంటి ఉపాసన ప్రభావము వల్ల, మనము సమస్త సాంసారిక కష్టములనుండి విముక్తులమై, సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరమూ ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది.Read More

జీవుడు తన తల్లి కడుపున ప్రవేశించింది మొదలు, చనిపోయినపుడు దహన సంస్కారం జరుపునంత వరకు గల కర్మలను షోడస(పదహారు) సంస్కారాలు అంటారు. (Important life events Read completely) అవి పదహారు..

జీవుడు తన తల్లి కడుపున ప్రవేశించింది మొదలు, చనిపోయినపుడు దహన సంస్కారం జరుపునంత వరకు గల కర్మలను షోడస(పదహారు) సంస్కారాలు అంటారు. (Important life events Read completely) అవి పదహారు..
అవి గర్భాదానము, పుంసవనము, సీమంతోన్నయనం, జాతకర్మ, నామకరణం, నిష్క్రమణ, అన్న ప్రాశనం, చూడాకర్మ, కర్ణవేద, ఉపనయనం, వేదారంభం, సమావర్తనం, వివాహం, వానప్రస్థం, సన్యాసం, అంత్యేష్టి.
ఈ కర్మలన్నిటికీ సమాజమును ఆహ్వానించేది అంటే పది మంది ముందు జరపడానికి గల ముఖ్య ఉద్దేశ్యం.. వారందరి నుండి ఆశీర్వచనాలు తీసుకోవడానికే... ఈ పదహారు కర్మలు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారే వస్తాయి.. అందుకే వాటిని వీలైనంత వరకు సంబరంగా జరుపుకుంటారు... ఈ సంబరానికి అతిథులుగా వచ్చిన వేర్వేరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అంతా ఒక దగ్గరికి చేరి తమ కష్టసుఖాలను పంచుకుంటు ఉంటారు.. ఇవి ఒకవిధంగా ప్రస్తుత కాలంలో గెట్-టుగెధర్ లాంటివన్నమాట... ఈ ఫంక్షన్ కు హాజరయితే చాలు చాలా మంది బంధుమిత్ర పరగణాన్ని ఒకేసారి కవర్ చేయవచ్చు... అందుకే ఈ రోజుల్లో ఈ ఫంక్షన్స్ చాలా ముఖ్యము...
బంధాలనేవి నిలుపుకోవడానికి.. ఈ ఫంక్షన్లు ఒక తరం నుండి ఇంకొక తరానికి తమ విజ్ఞానాన్ని అందించడానికి... కష్టకాలంలో దానినుండి బయట పడే మార్గాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేవి.. ఈ సంబరాలకు వచ్చిన సమాజం .. ఖచ్చితంగా తమ వెనుక ఉందనే ధైర్యాన్ని కలిగిస్తుంది.. జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే విశ్వాసాన్ని మనలో పెందుతుంది.. కానీ ప్రస్తుతం ప్రతిదీ ఖర్చు అనుకునే సమాజం తయారవుతోంది.. పది మంది కలిసి ఒకరిని ఆశీర్వదించడం అంటే హృదయపూర్వకంగా మనం ఆశీర్వదించే ఈ ఆశీర్వచనాలు వారికి స్వస్థతను చేకూరుస్తాయి..... ఇలా సమాజంలో మంచి అనేది స్థిరపడుతుంది...
అందుకే మన బంధుమిత్రుల ఫంక్షన్లను నిర్లక్ష్యం చేయకుండా మనసారా ఆశీర్వదించండి.. అందరితో బంధాలను పెంచుకోండి...
(ఆ ఫంక్షన్లకు పెట్టే ఖర్చు పేదలకు పనికొస్తుంది కదా అనే వారున్నారు .. ఒకరికి ఒకరోజు అన్నం పెట్టొచ్చు.. ప్రతి రోజూ ఆహారాన్ని ఇవ్వాలంటే వారికి ఒక ఉద్యోగం చూపించండి చాలు.. డైరెక్ట్ గా ఇచ్చే ఆహారం కేవలం వారిని బద్ధకస్తులనే చేస్తుంది...)
దానం వేరు ఫంక్షన్లు వేరు.. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే శుభకార్యాలను జరుపుకోవడం అదృష్టం...Read More

Powered By Blogger | Template Created By Lord HTML