గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Sunday, 31 August 2014

ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విష్ణు విగ్రహం ప్రపంచంలోకెల్లా అతి పురాతనమైన గుడికి సంభందించినది...

ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విష్ణు విగ్రహం ప్రపంచంలోకెల్లా అతి పురాతనమైన గుడికి సంభందించినది...
1)ఇది పూర్తిగా ద్రవిడ సంస్కృతిని ప్రతిబింబిస్తూ కట్టబడిన అతి పెద్ద కట్టడం..
ఎందుకంటే అప్పుడు ఈ భూభాగం అఖండ భారతంలో ఉండేది...
ప్రపంచ వారసత్వ సంస్కృతీ వారసత్వ సంపద సంస్థ వారిచే గుర్తించబడి సంరక్షింపబడుతున్న దేవాలయానికి సంబంధించినది...
2) హిందూ రాజులచే కట్టించబడి... బౌద్ధుల కాలంలో విరాజిల్లి.. ప్రస్తుతం ముస్లింలఏలు బడి లో ఉండి... మహా వెలుగునొందదుతున్న అత్యద్భుత కట్టడం..
3) ఈ దేవాలయం మన దేశంలో లేదు... థాయిలాండ్, కాంబోడియా దేశ సరిహద్దులలో ఉంది..
4) రెండు దేశాల మధ్య చాలా వాగ్వివాదాల తర్వాత అంతర్జాతీయ జోక్యంతో ఈ ఆలయం...కాంబోడియా పరమయింది...
5) ఈ గుడిలోకి వెళ్ళాలంటే చుట్టూ ఉన్న అగడ్తను దాటి వెళ్ళాల్సి ఉంటుంది...
6) విచిత్రమేమంటే ఇక్కడ నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహిస్తుంది... ఔరా ఆరోజుల్లో ఎంత గొప్ప నైపుణ్యం..
7) ఈ గుడి చిహ్నాన్ని తమ కరెన్సీ నోట్ల మీద... జెండా పై వచ్చేలా చేసుకున్నారు కాంబోడియన్లు...
8) క్షీరసాగర మథన దృశ్య శిల్పాలను తమ అంతర్జాతీ విమానాశ్రయంలో ప్రదర్శించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు కాంబోడియన్లు...
9) ఉన్న ఏకైక ఆలయానికి అపార మైన యాత్రికులు వచ్చేవిధంగా ప్రణాళికలను వేసుకుని.. దానిలో కృతకృత్యులయ్యారు కాంబోడియన్లు..
10) ఈ ఆలయాన్ని ప్రేరణగా తీసుకుని ఇక్కడ టాంబ్ రైడర్ అనే ఆంగ్ల చిత్రాన్ని నిర్మించడం జరిగింది...
11) ప్రపంచంలో అత్యుత్తమ గేమ్ గా పేరొందిన టెంపుల్ రన్ తెరవెనుక దృశ్యాలన్నీ ఈ గుడి కి సంబంధించినవే...
ఈ ఆలయంలో క్షీరసాగర మథనం శిల్పాలు, కథలు, లోపలికి వచ్చే రహదారుల పక్కన విగ్రహాలు, ఆలయాన్ని పెకిలించుకుని వచ్చిన మహావృక్షాలు,Read More

గుడిమల్లం = అరుదైన, అద్భుతమైన ఈ శివలింగాన్ని దర్శించారా ??

గుడిమల్లం

అరుదైన, అద్భుతమైన ఈ శివలింగాన్ని దర్శించారా ??
ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో ఉంది. ఇది క్రీస్తుపూర్వం 1వ శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులంటున్నారు. 1911లో గోపీనాధరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల ఈ శివ లింగం పై ఒక చేత్తో పశువును,మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు. తలపాగా,దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ రుగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. ప్రాచీన శైవపూజా విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆలయ గర్భ గుడి సైతం గజ పుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది.
ఆలయంలో దొరికిన శాసనాలలో దీనిని పరమేశ్వరాలయంగా పేర్కొన్నారు. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయట పడ్డాయి.
చోళ,పల్లవ,గంగపల్లవ,రాయల కాలంలో నిత్యం ధూప,దీప,నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి. చాలా విగ్రహాలు చోరికి గురయ్యాయి. ఆర్కియాలజీ వెబ్‌సైట్‌లో ఇంత ప్రముఖమైన శివలింగం గురించి కనీస సమాచారం లేదు. గుడి చుట్టూ పచ్చిక పెంచడం మినహా ఆ శాఖ సాధించిన మార్పు ఏమీ లేదు.
ఏ ఎస్‌ ఐ ధర్మాన కనీసం పూజలు కూడా చేసుకోలేక పోతున్నామని……వాపోతున్న గుడిమల్ల గ్రామస్తుల్లో ఒకరైన వున్నం గుణశేఖర నాయుడు 2006 నుండీ 2008 వరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆర్కియాలిజీతో సమాచార చట్టం ఆయుధంగా యుద్దం చేసి వారిని కేంద్ర సమాచార చట్టం ముందు నిలబెట్టాడు.ఈ గుడికి సంబంధించిన ఆస్తుల వివరాలు అటుంచితే కనీసం గుడికి సంబంధించిన సాహిత్యం కూడా వారి దగ్గర లేదనే నగ్నసత్యం బయట పడింది. ఈ క్రమంలో గుణశేఖర నాయుడు చేసిన కృషి ఫలితంగా 2009లో గుడిలో పూజలు జరిపేందుకు గ్రామస్తులకు అనుమతి సాధించాడు.
గతంలో ఎపుడో ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇట్లాంటి శిల్పం ఉంది. ఇక ఇంగువ కార్తికేయ శర్మ రాసిన ‘పరమేశ్వర టెంపుల్‌ ఎట్‌ గుడిమల్లం’ ‘డెవలప్‌ మెంట్‌ ఆఫ్‌ ఎర్లీ శైవ ఆర్ట్‌ అండ్‌ అర్కిటెక్చర్‌ ‘ అనే రెండు పుస్తకాలు ,మరి కొన్ని శిల్ప,కళా చరిత్ర పరిశోధన పత్రాలు మినహా ఈ గుడి గురించి మరే ఇతర సమాచారం లేదు.
ఇపుడిపుడే ఈ ఆలయం మార్కెట్‌ దేముడి మాయలో పడబోతుంది. కోట్లరూపాయల హెరిటేజ్‌ ప్రాజెక్టులో ఇదీ భాగం అయింది. అంబికా సోనీ ఇటీవలే ఇక్కడ అంగపూజలు జరిపారు. ఒక ఎంపీ ఇక్కడ గెస్ట్‌హౌస్‌ కట్టే ప్లాన్‌లో ఉన్నారు.
ప్రపంచంలోని ఏడు వింతలకు పదిమెట్లు పైనుండే ఈ శివలింగం కాల ప్రభావాన్ని సవాలు చేస్తూ అనేక సంవత్సరాలు చెక్కుచెదరకుండా అచంచలంగా నిలిచి ఉంది. ఎపుడో భూమి మీద వశించి గతించి పోయిన వొకానొక మానవ సమాజపు సామూహిక ధార్మిక అలౌకిక విశ్వరూపం. మీరు అస్తికులైనా,నాస్తికులైనా,అమెరికనిస్టులైనా విగ్రహ రూపంలోని ఈ పురాతన ప్రత్యుత్పత్తి సాధనాన్ని తప్పక దర్శించండి. లేకుంటే మీరున్న చోటు నుండే చేతులెత్తి నమస్కరించండి. భక్తితో కాదు……
పరిపూర్ణ తృప్తితో….
( రేణి గుంట నుండి గుడిమల్లం 16 కిలోమీటర్లు)

మిత్రుల దగ్గర ఇంకా సమాచారం ఉంటే తెలియ చేస్తే బాగుంటుంది.Read More

నవగ్రహ పూజలో దానాలు... ఫలితాలు

నవగ్రహ పూజలో దానాలు... ఫలితాలు

నవగ్రహ శాంతికి సంబంధించి పూజాది కార్యక్రమాలు చేసేవారు ఆయా ప్రత్యేక వస్తువులతో పూజని నిర్వహించాలి. పూజలో గ్రహ శాంతికి దోష నివారణకు దానాలు చేయాలి. ఇలా చేసిన వారకి దోష నివారణ జరిగి సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరతాయి. సూర్య గ్రహ పూజ చేసేవారు గోధుమలను దానము చేయాలి. చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.

గురు గ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానం చేయాలి. అదే విధంగా కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించటం వల్ల అధికారం, ధనయోగంతో పాటు కీర్తివంతులవుతారు. చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ముత్యాన్ని ధరించటం వల్ల నేత్రాలకు సంబంధించిన బాధలకు నివృత్తి కలుగుతుంది. ఇక కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శత్రు బాధ తొలగుతుంది. బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. పచ్చల ఉంగరాన్ని ధరించటం వల్ల ధనలాభం కలగటమే కాక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.

శుక్రుని పూజలో అలచందల దానము చేయాలి. వజ్రం, పగడము ధరించిటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యములకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రాహు పూజకు మినుములను దానం చేయాలి. గోమేధిక ఉంగరాన్ని ధరించటం వల్ల భయాందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. వైఢూర్యం ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల సర్పాది భయాలు తొలగటమే కాక దైవశక్తి పెరుగుతుంది. శనిపూజలో నువ్వులను దానం చేయాలి. నీలిరంగు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యవంతులవటమే కాక ఇతరత్రా కష్టాలు తొలగిపోతాయి.
Read More

సంకల్పం లోని కాల ప్రమాణం

సంకల్పం లోని కాల ప్రమాణం

నిత్య పూజలలో సంకల్పం చేస్తూ వుంటారు. సంకల్పములో - ఆది నుండి, అంటే అధ్య బ్రహ్మణం లగాయితు, వర్తమానం వరకు గడచిన కాల మానాని ప్రస్తావిస్తారు. అనునిత్యం పూజారంభంలో గోత్ర నామలతో సంకల్పం చేస్తారు:

అద్య బ్రాహ్మణ, ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతర, అష్టావింశత్ మహాయుగే, కలి యుగే, ప్రధమ పాదే ..... అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్ర మానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే, శ్రీ సర్వధారి నామ సంవత్సరే, ఉత్తరాయణే / దక్షిణాయణే, వసంత/గ్రీష్మ/వర్ష/శరధ్/హేమంత/శిసిర ఋతౌ, చైత్ర /.. మాసే, శుక్ల/కృష్ణ పక్షే, .. తిథౌ, వాసరహ వాసరస్తు, భాను/ఇందు/భౌమ/సౌమ్య/గురు/భృగు/స్థిర వాసరే, శుభ నక్షత్రే, శుభ యొగే, శుభ కరణ,ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభ తిథౌ, ....

సృష్టికి ఆది ఐన బ్రహ్మ మొదలిడుకుని, ద్వితీయ పరార్ధ, శ్వేత వరాహ కల్పంలో, వైవస్వత మన్వంతరంలో, అష్టావింశిన్ (28) మహాయుగంలో, కలి యుగ ప్రధమ పాదంలో, ....

ఇలా మానవులను పరాత్పరుడితో కాలంతో అనుభందం చేసారు. ఒక్క భారతీయ పరంపరలో తప్పితే, ప్రపంచ ఇతిహాశంలో మరే పరంపరలో ఇంత పరీవ్యాప్తమైన భారీ కాల మనాలను ప్రస్తావించిన వైనాలు లేవు.
షట్ కాల చక్రం

మనం ఆచరించే ఆరు కాలాలు - 1. సంవత్సరం; 2. ఆయనం; 3. ఋతువు; 4. మాసం; 5. పక్షం; 6. దినము;
పంచ కాల స్వరూపాలు

భారతీయులు అనాదిగా ఆచరిస్తున్న కాల స్వరూపాలు - చాంద్రమాన సంవత్సరం; సౌరమాన సంవత్సరం; సావన మాన సంవత్సరం; నక్షత్ర మాన సంవత్సరం, బృహస్పత్య సంవత్సరం.

చాంద్ర మాన సంవత్సరం - శుక్ల పాడ్యమి మొదలు పౌర్ణమి; కృష్ణ పాడ్యమి మొదలు అమావాస్య - ఈ విధంగా 12 పౌర్ణమిలు, 12 అమావాస్యలు కలిగి వుండేది చాంద్ర మాన సంవత్సరం. ఇందులో 12 మాసాలుంటాయి.
Read More

నెల (మాసం) పేరు యెలా వస్తుందంటే? - చంద్రుడు పౌర్ణమి నాడు యే నక్షత్రంతో ఉంటే ఆ నక్షత్రం పేరుతో ఆ నెల పిలువబడుతుంది.

నెల (మాసం) పేరు యెలా వస్తుందంటే? - చంద్రుడు పౌర్ణమి నాడు యే నక్షత్రంతో ఉంటే ఆ నక్షత్రం పేరుతో ఆ నెల పిలువబడుతుంది. 

చిత్తా నక్షత్రమున పౌర్ణమి కల్గిన చైత్ర మాసం (30 లేక 31 దినాములు)
విశాఖ నక్షత్రమున పౌర్ణమి కల్గిన వైశాఖ మాసం (31 దినములు)
జ్యేష్ఠ నక్షత్రమున పౌర్ణమి కల్గిన జ్యేష్ఠ మాసం (31 దినములు)
పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రమున పౌర్ణమి కల్గిన ఆషాఢ మాసం (31 దినములు)
శ్రవణ నక్షత్రమున పౌర్ణమి కల్గిన శ్రావణ మాసం (31 దినములు)
పూర్వాభాధ్ర, ఉత్తరాభాధ్ర నక్షత్రమున పౌర్ణమి కల్గిన భాద్రపద మాసం (31 దినములు)
అశ్విని నక్షత్రమున పౌర్ణమి కల్గిన ఆశ్వీజ మాసం (30 దినములు)
కృత్తిక నక్షత్రమున పౌర్ణమి కల్గిన కార్తీక మాసం (30 దినములు)
మృగశిరా నక్షత్రమున పౌర్ణమి కల్గిన మార్గశిర మాసం (30 దినములు)
పుష్యమి నక్షత్రమున పౌర్ణమి కల్గిన పుష్య మాసం (30 దినములు)
మఖా నక్షత్రమున పౌర్ణమి కల్గిన మాఘ మాసం (30 దినములు)
పుబ్బ (పూర్వ ఫల్గుణి) నక్షత్రమున పౌర్ణమి కల్గిన ఫాల్గుణ మాసం (30 దినములు) ప్రాప్తిస్తాయి
Read More

శుద్ధ పక్షము (శుక్ల పక్షం) / బహుళ పక్షం (కృష్ణ పక్షం)

శుద్ధ పక్షము (శుక్ల పక్షం) / బహుళ పక్షం (కృష్ణ పక్షం) - అమావాస్య తరువాత 15 దినములు శుక్ల పక్షమని వ్యవహరిస్తారు. అలానే పౌర్ణమి తరువాత 15 రోజులు కృష్ణ పక్షం లేక బహుళ పక్షమని వ్యవహరిస్తారు.
శుక్ల పాడ్యమి కృష్ణ పాడ్యమి శుక్ల విదియ కృష్ణ విదియ శుక్ల తదియ కృష్ణ తదియ శుక్ల చవితి కృష్ణ చవితి శుక్ల పంచమి కృష్ణ పంచమి శుక్ల షష్ఠి కృష్ణ షష్ఠి శుక్ల సప్తమి కృష్ణ సప్తమి శుక్ల అష్టమి కృష్ణ అష్టమి శుక్ల నవమి కృష్ణ నవమి శుక్ల దశమి కృష్ణ దశమి శుక్ల ఎకాదశి కృష్ణ ఎకాదశి శుక్ల ద్వాదశి కృష్ణ ద్వాదశి శుక్ల త్రయోదశి కృష్ణ త్రయోదశి శుక్ల చతుర్దశి కృష్ణ చతుర్దశి పౌర్ణమి అమావాస్య
Read More

సౌర మాన సంవత్సరం

సౌర మాన సంవత్సరం

సూర్యుడు మేష రాశిలో ప్రవేశించి మీన రాశి వరకు సంచరించు కాలాన్ని సౌర సంవత్సరంగా పరిగణిస్తారు.
సూర్యుడు మేష రాశిలో సంచరించు కాలం - మేష మాసం
సూర్యుడు వృషభ రాశిలో సంచరించు కాలం - వృషభ మాసం
సూర్యుడు మిథున రాశిలో సంచరించు కాలం - మిథున మాసం
సూర్యుడు కర్కాటక రాశిలో సంచరించు కాలం - కర్కాటక మాసం
సూర్యుడు సిమ్హ రాశిలో సంచరించు కాలం - సిమ్హ మాసం
సూర్యుడు కన్య రాశిలో సంచరించు కాలం - కన్య మాసం
సూర్యుడు తుల రాశిలో సంచరించు కాలం - తుల మాసం
సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరించు కాలం - వృశ్చిక మాసం
సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించు కాలం - ధనస్సు మాసం
సూర్యుడు మకర రాశిలో సంచరించు కాలం - మకర మాసం
సూర్యుడు కుంభ రాశిలో సంచరించు కాలం - కుంభ మాసం
సూర్యుడు మీన రాశిలో సంచరించు కాలం - మీన మాసం
ఈ సౌర సంవత్సరంలో 12 రాశులలో సూర్యుడు మొత్తము 365 దినములు సంచరిస్తాడు.
Read More

సావన సంవత్సరం

సావన సంవత్సరం

ఇందులో మాసానికి 30 దినములు; 12 మాసాలకి 360 దినములు కలిగి ఉంటుంది.
నక్షత్ర సంవత్సరం

అశ్వినాది 27 నక్షత్రముల మీద చంద్రుడు సంచరించు కాలాన్ని ఒక మాసంగా పరిగణిస్తారు. ఇలాటి 12 మాసాలు ఉండి, 324 దినములు ఒక సంవత్సరముగా వ్యవహరిస్తారు
బృహస్పత్య సంవత్సరం

బృహస్పతి (గురు గ్రహం) ఒక రాశిలో ప్రవేశించి ఆ రాశి యందు పూర్తి సంచార కాలం, ఒక సంవత్సరముగా పరిగణిస్తారు.
ఆయనములు

ప్రతీ సంవత్సరానికి రెండు ఆయనాలుంటాయి. అవి - ఉత్తరాయణం; దక్షిణాయణం. సూర్యుడు ఉత్తరధ్రువంలో సంచరించు కాలం ఆరు నెలలు. అంటే ఇది మకర ప్రవేశం నుంచి మిథునం ఆఖరు వరకు ఉండే కాలం. సూర్యుడు దక్షిణధ్రువంలో సంచరించు కాలం ఆరు నెలలు. అంటే కర్కాటకం నుండి ధనస్సు ఆఖరు వరకు సంచరించిన కాలం.
ఋతువులు

చాంద్ర మాన సంవత్సరంలో రెండు నెలలకు ఓ ఋతువు. ఇలా యేడాదికి ఆరు ఋతువులు ఏర్పడ్డాయి.
చైత్ర, వైశాక మాసాలు - వసంత ఋతువు
జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు - గ్రీష్మ ఋతువు
శ్రావణ, భాద్రపద మాసాలు - వర్ష ఋతువు
ఆశ్వయుజ, కార్తీక మాసాలు - శరద్ ఋతువు
మార్గశిర, పుష్య మాసాలు - హేమంత ఋతువు
మాఘ, ఫాల్గుణ మాసాలు - శిశిర ఋతువు

మరికొన్ని భారతీయ కాల స్వపుర ప్రమణాలు

ఎంతో కాలంగా వాడుకలో ఉన్న మరికొన్ని భారతీయ కాల రాశులు:
60 తత్పరలు 1 పర
60 పర లు 1 విలిప్త
60 విలిప్తలు 1 లిప్త
60 లిప్తలు 1 విఘడియ (24 సెకండ్లు)
60 విఘడియలు 1 గడియ (24 నిమిషాలు)
60 గదియలు 1 రోజు (24 గంటలు)
30 అహొరాత్రులు (రోజులు) 1 మాసం (నెల)
12 మాసాలు 1 సంవత్సరం
12 సంవత్సరాలు 1 పుష్కరం
7 రోజులు 1 వారం
15 రోజులు 1 పక్షం
2 పక్షాలు 1 మాసం
2 మాసాలు 1 ఋతువు (సీజన్)
6 రుతువులు 1 సంవత్సరం
60 లిప్తలు 1 భాగ
30 భగాలు 1 రాశి
12 రాశులు 1 భగణం
ఇలా ఖగోళంలోని సూర్య చంద్ర నక్షత్రాలతో భూ మండల, చరా చర రాశులతో అనుసందాంచేసిన మేదస్సు అసామాన్య శక్తే. ఇంతటి మహోత్కృష్ట విషయాలను ప్రపంచంలో భారతీయ సాంప్రదాయం తప్ప మరెవరు చెప్పలేక పోయారు సరికదా, వారికి ఇది అవగాహన అవటానికి చాలా కాలం పట్టింది.
Read More

ప్రపంచ, అవనీ తల కాలమానాలు

ప్రపంచ, అవనీ తల కాలమానాలు

ప్రపంచ కాలమానం, అందులో భూగోళ కాలమానం, పాక్షిక ప్రళయాలు, అంతః ప్రళయాలు - ఇలా అనంత కాలచక్రాన్ని వివరించారు. మానవాతీత శక్తి తోడవుతే కాని ఇంతటి మహత్తర పరిమాణంగల విషయాలు ఆకళింపుజేసుకోవడం దుస్సాధ్యం. ఇది భారతీయ శాస్త్రజ్ఞుల ఇచ్చా శక్తి, క్రియా శక్తులకు నిదర్శనాలు. అంతే కాదు, ఇంత భారీ కాల ప్రమాణాలు, నిర్వచించాలంటే పటిష్టమైన గణిత శాస్త్రం, సంఖ్యా శాస్త్ర సాధనా పద్ధతులు కూడా తెలిసి ఉండాలి. విభిన్న గణిత సంబంధ శాస్త్రాలను అవపోసన చెసిన కాల శాస్త్రవేత్తలకు అనంత కాలాల్ని ఒక క్రమ పద్ధతిలో పట్టికలాగ వివరించేదుకు ఆస్కారం కలిగింది. బ్రహ్మ కాలం (ఆయువు) లో 120 మహాకల్పాలు (దివ్య సంవత్సరాలు) ఉన్నాయి.

మనుగడలో ఉన్న విభిన్న మాస, సంవత్సరాల కాలమనాలు:
1 చాంద్ర మాసం లో 29 189005/356222 (29.53) రోజులు ఉన్నాయి
1 కల్పం లో - సూర్య, చంద్రుల భ్రమణ తేడా - 534333300000
1 సౌర మాసంలో - 30 సౌర దినాలు; 30 1362987/3110400 సాధారణ రోజులు ఉన్నాయి
1 పితృ-మాసం - 30 మానవ మసాలు; ఇందులో 885 163410/178111 సాధారణ రోజులు ఉన్నాయి
1 దెవ-మాసం - 30 యేళ్ళు; ఇందులో 10957 241/320 సాధారణ రోజులు ఉన్నాయి
1 బ్రహ్మ మాసం - 60 కల్పాలు; ఇందులో 94,674,987,000,000 సాధారణ రోజులు ఉన్నాయి
1 పురుష మాసం - 2,160,000 కల్పాలు; ఇందులో 3,408,299,532,000,000,000 సాధారణ రోజులు ఉన్నాయి
1 " ఖ " మాసం - 9,467,498,700,000,000,000,000,000,000,000 సాధారణ రోజులు
1 చాంద్ర మాన సంవత్సరంలో - 354 65,364/178,111 సాధారణ రోజులు ఉన్నాయి
1 సౌర సంవత్సరం లో - 365 827/3200 సాధారణ రోజులు ఉన్నాయి
1 పిత్రు సంవత్సరం లో - 10,361 1699/178,111 సాధారణ రోజులు ఉన్నాయి
1 దేవ సంవత్సరం - 131,493 3/80 సాధారణ రోజులు
1 బ్రహ్మ సంవతసరం లో - 1,136,099,844,000,000 సాధారణ రోజులు
1 పురుష సంవత్సరం లో - 25,920,000 కల్పాలు; 40,899,594,384,000,000,000 సాధారణ రోజులు

1 " ఖ " సంవత్సరం లో - 113,609,984,400,000, 000, 000, 000, 000, 000, 000 సాధారణ రోజులు
ఇంతటి మహాత్కాలాల్ని భారీ సంఖ్యలను వాడి విశదీకరించడం అప్పటి భరతీయ శాస్త్రకారుల అసమాన ప్రతిభాపాటవాలని చాటి చెప్తోంది.

ఈ పేర్కొన్న అంశాలన్ని అల్-బరూని (1034 ఏ డీ) విభిన్న భారతీయ శాస్త్రాల నుండి తర్జుమా చేసి " తారీక్ అల్ హింద్ ", " తహ్-కీక్ అల్ హింద్ " పుస్తకల రూపేణ పర్షియా (నేటి ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనన్) అరేబియా దేశాలకు చేరవేసాడు. దీనితో భారతీయ సాంకేతిక విషయాలు ఈ ప్రాంతాల వాడుకలోకి చేరి, కొంతకాలానికి యురోప్ లో క్రమంగా చేరాయి. ఇక్కడ పేర్కొనదగిన విషయమేమిటంటే అప్పటికి యురోప్ లో రోమన్ అంకెలే ప్రాచుర్యంలో ఉండేవి. క్రమేపి భారతీయ సాధనా పద్ధతులను వాడుకోవడం మొదలయ్యింది.
Read More

బ్రహ్మ, కేశవ, మాధవ, ఈశ్వర, సదాశివ కాలాలు

బ్రహ్మ, కేశవ, మాధవ, ఈశ్వర, సదాశివ కాలాలు

బ్రహ్మ కాలం = 72,000 కల్పాలు = 1 కేశవ దినం (రోజు)
నారాయణ = 155,520,000,000 కల్పాలు
కేశవ కాలం = 2,592,000,000 కల్పాలు (ఒక కల్పం - సుమారు 4.2

మహాదేవ కాలం = 93,312,000,000,000 కల్పాలు

రుద్ర కాలం = 5,374,771,200,000,000,000 కల్పాలు

ఈశ్వర కాలం = 3,359,232,000,000,000,000 కల్పాలు

సదాశివ కాలం = 120,932,352,000,000,000,000,000 కల్పాలు - ఇది 1 వికరణ (Eternal) లో ఒక రోజు

శక్తి కాలం = 10,782,449,978,758,523,781,120,000,000,000,000,000,000,000,000,000 కల్పాలు ఒక్క శివ రోజు -

37,264,147,126,589,458,187,550,720,000,000,000,000,000,000,000,000,000,000 కల్పాలు. శివ వికరణ - దీనికి మించినది యేమి లేదు.
నేటి లెక్కలతో పోలిస్తే కొన్ని లక్షల ట్రిల్లియన్ల యేళ్ళన్నమాట. ఇట్టి మహతర పరిమాణంలో సంవత్సరాలు ప్రపంచంలో మరెక్కడా, యెన్నడూ పేర్కొనడం గానీ, లెక్కించిన ఉదంతాలు లేవు. ఈ అద్బుత గణాంక సాధనాలు భారతీయ వైజ్ఞానికులదే!.
Read More

మన్వంతరాలు

మన్వంతరాలు

పద్నాలుగు మన్వంతరాలు:
స్వయంభువ మనువు
స్వారోబిష మనువు
ఉత్తమ మనువు
తామస మనువు
రైవత మనువు
చక్షుష మనువు
వైవస్వత మనువు
సూర్య సావర్ణిక మనువు
దక్ష సావర్ణిక మనువు
బ్రహ్మ సావర్నిక మనువు
రుద్ర సావర్ణిక మనువు
ధర్మ సావర్ణిక మనువు
రోచ్చ్య మనువు
భౌచ్చ్య మనువు
28 మన్వంతరాలు ఒక బ్రహ్మ రోజు. ఒక్కకొక్క మన్వంతరానికి ఒక అధిపతి - మనువు - ఉన్నాడు.
Read More

పరం, పరమార్ధలు - మానవ-బ్రహ్మ కాల అనుసంధానం

పరం, పరమార్ధలు - మానవ-బ్రహ్మ కాల అనుసంధానం

బ్రహ్మ జీవన కాలం ఒక పరం. అందులో సగ భాగం పరార్ధం. బ్రహ్మ కాలమానం ప్రకారం ఇప్పుడు ద్వితీయ పరార్ధం నడుస్తోంది. యాబై ఒకటవ పడి నడుస్తోంది.

ముప్పై కల్పాలు - శ్వేత-కల్ప, నీలలొహిత, వామదేవ, గతంతర, రౌరవ, ప్రాణ, బృహత్-కల్ప, కందర్ప, సధ్యోత, ఈశన, ధ్యాన, సారస్వత, ఉదాన, గరుడ, కౌర్మ, నారసిమ్హ, సమాధి, ఆగ్నేయ, విష్ణుజ, సౌర, సోమ-కల్ప, భావన, సుపుమ, వైకుంఠ, ఆర్సిస, వలి-కల్ప, వైరజ, గౌరి-కల్ప, మహేశ్వర, పైత్ర-కల్ప.

కొన్ని కల్పాల పేర్లు నిత్య పూజలలో చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు - శ్వేత వరాహ కల్పం. నమక ప్రశ్నలో నీలలోహిత, ఈశాన, ఉదాన, ద్యాన, మహేశ్వర వాడి ఉన్నారు. ఈ ప్రశ్నలు కృష్ణ యజుర్వేదంలోనివి. అంటే ఇవి వేలాది సంవత్సరాల నుండి వాడుకలో ఉన్నాయన్న మాట!.
బ్రహ్మ కాలం

కల్పాల ప్రమాణంలో బ్రహ్మ కాలం వివరించ బడింది.
1 బ్రహ్మ రోజు - 4,320,000,000 మానవ యేళ్ళు (4.32 బిల్లియన్ యేళ్ళు)
1 బ్రహ్మ అహో-రాత్రి - 8,640,000,000 మానవ యేళ్ళు (8.64 బిల్లియన్ యేళ్ళు)
1 బ్రహ్మ మాసం - 259,200,000,000 మానవ యేళ్ళు (259.2 బిల్లియన్ యేళ్ళు)
1 బ్రహ్మ సంవత్సరం - 3,110,400,000,000 మానవ యేళ్ళు (3.1104 ట్రిల్లియన్ యేళ్ళు)
100 బ్రహ్మ సంవత్సరాలు (బ్రహ్మ ఆయువు) - 311,040,000,000,000 మానవ యేళ్ళు (311.04 ట్రిల్లియన్ యేళ్ళు)

ఒక మహాయుగంలో 4,320,000 యేళ్ళు ఉన్నాయి. ఇందులో కృతయుగ ప్రమాణం 1,728,000 యేళ్ళు. త్రేతాయుగ ప్రమాణం 1,296,000 సంవత్సరాలు; ద్వాపరయుగ ప్రమాణం 864,000 యేళ్ళు; కలియుగంలో 432,000 సంవత్సరాలు. ఇలాటి 71 మహాయుగాలు ఒక మన్వంతరం. ఇలాటి 14 మన్వంతరాలు బ్రహ్మకు పగటి కాలం - 1 అహస్సు. ఇదే ఒక కల్పం. రెండు కల్పాలు కలిపితే బ్రహ్మకు ఒక అహోరాత్రి. ఇలాటివి 360 దినాలు ఉంటే ఒక బ్రహ్మ సంవత్సరం అవుతుంది. బ్రహ్మకు ఇప్పుడు 51 వ సంవత్సరంలో ప్రధమ కల్పంలో యేడవ మనువు - వైవస్వత మన్వంతరంలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగం నడుస్తోంది. ఇప్పటికి స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, దైవత, చాషుఘులు - ఆరు మనువులు గడచినాయి. ఇంతటి అపార సంఖ్యలు ప్రాచీన శాస్త్రవేత్తలు సునాయాసంగా లెక్కలు కట్టేసి వ్రాశారు. మానవ కాలాన్ని బ్రహ్మ కాలంతో సమన్వయం కూడా చేశారు. వారి ప్రజ్ఞా పాటవాలు యెంత మహత్తర మైనవో ఈ విషయాలను బట్టి అర్ధమవుతుంది.

చంద్రుడు దినానికి సుమారు ఒక నక్షత్రం, అంటే 800 లిప్తల క్షేత్రములు, కుజుడు దినానికి 31.5 లిప్తల క్షేత్రము, బుధుడు 245.5 లిప్తల క్షేత్రము, గురువు దినానికి 5 లిప్తల క్షేత్రము, శుక్రుడు దినానికి 96 లిప్తల క్షేత్రము, శని దినానికి 2 లిప్తల క్షేత్రము కడిచేస్తారు.
Read More

బ్రహ్మానంద పురాణ - కాల పట్టిక వ్యఖ్యానం

బ్రహ్మానంద పురాణ - కాల పట్టిక వ్యఖ్యానం

బ్రహ్మాంద పురాణం (3.4.2.92-103) లో పద్దెనిమిది సంఖ్యల వరకూ అంకడాలు వివరించారు. అవి:
దశ = 10
శతం; పరివృధ = 100
శహస్రం; పరిపద్మకం = 1,000
అయుతం = 10,000
నియుతం = 100,000
ప్రయుతం = 1,000,000
అర్వుతం; అర్బుదం = 10,000,000
న్యర్బుదం = 100,000,000
వృదం; ఖర్బుదం = 1,000,000,000
పరం = 10,000,000,000
ఖర్వం = 100,000,000,000
నిఖర్వం = 1,000,000,000,000
శంఖం = 10,000,000,000,000
పద్మం = 100,000,000,000,000
సముద్ర = 1,000,000,000,000
అంత్యం = 1,000,000,000,000,000
మధ్యమం = 10,000,000,000,000,000
పరార్ధం = 100,000,000,000,000,000
పర = 2 X పరార్ధ = బ్రహ్మా ఆయువు (లైఫ్ టైం) = 311.04 ట్రిలియన్ యేళ్ళు

తైత్తిరీయ సమ్హిత, కటక సమ్హితలు కూడా ఈ సంఖ్యా కాలాలు ప్రస్తావించేయి. వాజసనేయి సమ్హిత, బౌద్ధ గ్రంధం లలితవిస్తార (5 వ సంవత్సరం క్రీస్తు పూర్వం), శ్రీధర త్రైశతిక (క్రీ.శ.750), గణిత సార సంగ్రహ ఇత్యాది గ్రంధాలలో ఈ గణాంకాలు వివరిచబడ్డాయి.

అనేక వేల సంవత్సరాలకు పూర్వమే ఇట్టి అసాధరణమైన సంఖ్యలను ఉదాహరించారు భారతీయ వైజ్ఞానికులు, గణికులు, ఋషులు. దశాంశమాన గణితం కూడా ప్రాచుర్యంలో ఉందని వెరే చెప్పనక్కర లేదు. సుమారు 600-1000 సంవత్సర కాలం లో ఈ విషయాలు అరబ్ దేశాలు, ఉత్తర ఆఫ్రికా - మొరాక్కో ల మీదుగా ఇటలీ, స్పేన్, ఫ్రాన్స్, యూరోప్ చేరాయి. ఫిభొనాసి - క్రీ.శ.1225 సంవత్సరంలో - భారతీయ దశాంక గణితాన్ని యూరోప్ లో పరిచయం చేసినా, రోమన్ పద్ధతిని వీడి, భారతీయ దశాంశ గణాక పద్ధతిని అవలంబించడానికి దదాపు 200 సంవత్సరాలు పట్టింది.

అమెరికా ఎం ఐ టి విశ్వవిద్యాలయ తత్వ శాస్త్రం అచార్యుడు, రచయిత, హ్యూస్టన్ స్మిత్ మాటల్లో చెప్పాలంటే - " భారతీయులకు కనపడనిదంటూ ఏమి లేదు; కనిపించనిది, దేన్ని మినహాయించనిది లేదు - భారత దేశ ఆత్మ అనంతం. వారు అనంతంలో కూడా యేమి ఉందో మినహాయించకండా విశదీకరించి చెప్పేసారు. భారతీయుల మేధా శక్తి అంతః-కరణాన్ని అబ్బుర పరుస్తుంది". మరి కొంత వివరణ ఇస్తూ ఇలా అన్నారు " భారతీయులు - కల్పాలు, విశ్వం, అపార కాల గణాలు యెప్పుడో ప్రకటించారు. వారి వైదుష్యం యెంత గొప్పదీ అంటే, అభినవ ఖగోళ శాస్త్రం కూడా అందులో ఒక బిందువే. అంత అపారమైంది భారతీయుల జ్ఞానం " అని తన మనోగతాన్ని విశిదీకరించి చెప్పేరు.

అంతర్జాతీయ విఖ్యాతి చెందిన ఖగోళ శాస్త్ర అచార్యుడు, నోబెల్ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం శిష్యుడు, "కాస్మోస్" (విశ్వం) టీ వీ ధరావాహికం (సీరియల్) నిర్వాహకుడు, ఖగోళ శాస్త్ర అచార్యుడు కార్ల్ సాగన్, హిందూ (భారతీయ) విశ్వాంతరాళ శాస్త్రానికి (కాస్మాలజీ) కి కేటాయించిన శీర్షికలో ఇలా వివరించారు - హిందూ కాస్మాలజీ అద్బుతమేమిటంటే ఇది ప్రపంచంలొనే అతి బృహత్ పరిమాణం గల ప్రపంచ కాల మానాన్ని అందించింది. ఇది నేటి అధునాతన సాంకేతిక కాస్మాలజీ (విశ్వశాస్త్రం) కి అనుగుణంగా ఉంది. భూమి వయస్సు సుమారు 4.6 బిల్లియన్ యేళ్ళు; ఇది " భారతీయ కాస్మొలాగికల్ సైకిల్ సిధ్ధాంతా"నికి అనుగుణంగా ఉంది. సాగన్ తన అనుభవాన్ని వ్యక్తం చేస్తూ " నాకు తెలిసినంత పరిదిలో ఇంత సరైన, భూమి యొక్క ఇంతటి బృహత్ కాల ప్రమాణాలు పేర్కున్న ఉదంతాలు యెక్కడా చూడలేదు " అని విశ్లేషించి చెప్పారు. ఇక భారతీయ వైజ్ఞానికుల పరిణితి యేపాటిదో ప్రాజ్ఞులైన పాఠకులే నిర్ణయించుకోవాలి.

సాగన్ ఇంకా ఇలా విశిదీకరించారు - " పశ్చిమ దేశాలలో జన బాహుళ్యానికి ఈ విశ్వం కొన్ని వేల సంవత్సరాల కిందట ఆవిద్భవించిందని నమ్మకం. కాని నిజానికి ప్రపంచంలో అద్బుత సాంప్రదాయం గల హిందూ భావన (కాన్సెప్ట్) ప్రకారం విశ్వం కొన్ని బిలియన్ల్ల యేళ మనుపు మొదలయ్యిందని స్పష్టంగాం చెప్పాయి ".

భారతీయ విశ్వశాస్త్రం ప్రకారం, విశ్వాంతరాళం - సృష్టి, స్థితి, లయ, కారక చక్రం, అంటే విశ్వం మొదలు నుంచి అంతం వరకు నిరాఘాటంగా సాగుతున్న కాలచక్రం స్వరూపాన్ని కూలంకషంగా వివరించారు - భారతీయ కాలజ్ఞానులు.
Read More

బ్రహ్మాది కాలం - హిందూ సంవర్గమాన (లాగరతమిక్) గణ పరిమాణం (యూనిట్స్ ఆఫ్ స్కేల్)

బ్రహ్మాది కాలం - హిందూ సంవర్గమాన (లాగరతమిక్) గణ పరిమాణం (యూనిట్స్ ఆఫ్ స్కేల్)

బ్రహ్మాది కాల పట్టిక - హిందూ సంవర్గమాన గణ పరిమాణం సుమారు 2500 సంవత్సరాల నుండి వ్యవరాహంలో ఉంది. ఇది:
బ్రహ్మ కాలం – 10**22
బ్రహ్మ రోజు – 10**17
మన్వంతరం – 10**16
మహాయుగం – 10**14
సంవత్సరం
ఆయనం
రుతువు
మాశం
పక్షం
నక్షత్ర అహొరాత్రి
ఘటి - 24 నిమిషాలు
విఘటి - 24 శెకండ్లు
ముహూర్త
క్షణం – 100
లీక్షక - 10**-1
లవ – 10**-3
రేణువు – 10**-5
త్రుటి – 10**-7

నిత్యం మాట్లాడే భాషలో కూడా ఈ శబ్ధ ప్రయోగాలు జరుగూతూనే ఉనాయి. " ఒక్క క్షణం ఆగు ", " ఈ ఘడియో, ఆ ఘడియో రవాలి "; " తృటిలో తప్పిపోయిందోయి " వంటివి కొన్ని ఉదాహరణలు. 2 1/2 ఘడియలు - ఒక గంట 60 ఘడియలు - "అహోరాత్రి"; 24 గంటలు; 8 ప్రహరాలు - 1 అహోరాత్రి; కాబట్టి ఒక " ప్రహరా " సుమారు మూడు గంటలు; 1 ఘడియ - అంతే 24 నిమిషాలు; విఘటి అంటే సుమారు 24 క్షణాలు (సెకండ్లు) లేదా 6 ప్రమాణాలు.

" తృటి " అన్నిటికన్నా అతితక్కువ కాలమాన కొలత. ఒక చాంద్ర మాన సంవత్సరంలో సుమారు 350 రోజుల, 30 ఘడియలు (అంటే 12 గంటలు) ఉన్నాయి.

ప్రపంచంలో మరి యే సంస్కృతి 4000 వేల యేళ్ళకు మించి మానవ చరిత్ర చెప్ప లేక పోయింది. భారతీయ విజ్ఞానవేత్తలు 4,000 సంవత్సరాలకు మునుపే అపారమైన గణాంకాలు చేసి, 311 ట్రిలియన్ యేళ్ళ భూగోళ ఆది నుంచి అంతం, తదనుగుణ కాలమానాలు ప్రకటించారు. ఇంత విస్తృతంగా గణాంకాలను రూపొందించేందుకు అద్బుతమైన మేదస్సు, సంఖ్యా శాస్త్ర విద్వత్తు, గణిత పద్ధతుల పాండిత్యం, సాధనా ప్రతిభ ఖగోళ, క్షేత్ర గణిత శాస్త్ర అవాగాహన దోహద పడ్డాయి.
Read More

ప్రపంచం ఎప్పుడు ఆవిర్భవించింది? ఈ అవనీ తలం యెప్పుడు యేర్పడింది? ఈ అనంత కాల ప్రవాహాన్ని యెలా కొలిచేది? దీని ఆది యెక్కడ? అంతం యెప్పుడు? అది తెలుసుకోడం యెలా?

ప్రపంచం ఎప్పుడు ఆవిర్భవించింది? ఈ అవనీ తలం యెప్పుడు యేర్పడింది? ఈ అనంత కాల ప్రవాహాన్ని యెలా కొలిచేది? దీని ఆది యెక్కడ? అంతం యెప్పుడు? అది తెలుసుకోడం యెలా? మానవ మనుగడకు సంబంధించిన ఇలాటి ప్రాధమిక ప్రశ్నలను, అతి సంక్లిష్ట సమస్యను పరిష్కారం చేసిన భారతీయ విజ్ఞానవేత్తల మేదస్సు మహాద్భుతమైనది. సమస్యని పరిష్కరించడంతో పాటు అది జనానికి సులభంగా అర్ధమయ్యేట్టు విశధీకరించడం, కాలాన్ని నియంత్రించే మార్గాన్ని రూపొందించడం వీరి మనవాతీత మేదస్సుకు ఓ మచ్చుతునక. ఆది, అంతం తెలీనప్పుడు కాలాన్ని యెలా కొలవడం? కొలిచిన కాల మానాన్ని మానవ సౌర సంవత్సరాలతో అనుసంధానం చేయడమెలా? ఇలాటి చిక్కు ముడి ప్రశ్నలకు అద్వితీయ సమాదానాలు ఇచ్చారు ప్రాచీన భారతీయ శాస్త్ర, విజ్ఞానవేత్తలు.

విద్యా, మేధా, క్రియా శక్తులకు ఆలవాలం భారతం. ఉదాహరణకు - నక్షత్ర విద్య, రాశీ విద్య, బ్రహ్మ విద్య, పర విద్య, గణితం, క్షేత్ర గణితం, విశ్వ శాస్త్రం, జ్యోతిషం, సంఖ్యాన, గణన, త్రైప్రశ్న (దిక్కు, స్థానం, కాలం) కాలశాస్త్రాలు, దిక్, కాల సంబంధ పరిపూర్ణ పరిజ్ఞానం అందించాయి. ప్రపంచం యక్కడ మొదలైయ్యిందో, యెంత కాలం గడచిందో, భవిషత్ కాలం యెంత వుందో, అందులో ఈ పృధ్వ్వీ మండలానికి యెంత కాల పరిమితి వుందో, మానవులకు, చరా చర రాశులకు యెంత కాల మానం నిర్ణయమై ఉందో తెలుసుకోవడం దుర్లభంగా గోచరించ వచ్చు. ఇట్టి ఉత్కృష్ట సమస్యలను పరిణితి చెందిన పాండిత్య ప్రకర్షలతో, విభిన్న శాస్త్రీయ పద్ధతులనుసారంగా సంక్లిష్ట సమస్యలను పరిష్కరించారు ప్రాచీన భారతీయ శాస్త్రజ్ఞులు.

కాలాన్ని ఒక " ప్రాధమిక " పదార్ధంగా పేర్కొన్నాడు సుప్రసిద్ధ వైజ్ఞానికుడు, కణాదుడు - వైశేషిక శాస్త్రం లో. అకాశం, కాలం, దిక్ అనంతాలు; వీటికి అంతం లేదు. దిక్, కాలం - ఈ రెండూ సర్వ వ్యాప్త పదార్ధాలు. భూత, భవిషత్, వర్తమాన నిర్ధారణా చేయడానికి కాలమే మూలం. ఈ కొల బద్ధ లేనిదే భూత, భవిషత్, వర్తమాన వర్గీకరణ అసంభవం. కాలం సూర్య భ్రమణం మీద ఆధార పడి క్షణ, దిన, ఋతు, సంవత్సరాది కొలబద్ధ ప్రామాణికమయ్యాయి. ఆంగ్లం (ఇంగ్లిషు) లో పలికే " హవర్" కాల ప్రమాణానికి మూలం రూపం సంస్కృతంలోని " అహో రాత్రి " (అహొ - పగలు; రోజు; రాత్రి - రాత్రి; ఒక పగలు ఓ రాత్రి కలసినది అహో రాత్రి - కాల సంభంద మైన శాస్త్రం హోరా శాస్త్రం).

దదాపు 2300 యేళ్ళ నాటి జైన శాస్త్రాలలో - విభిన్న అనంతాలు (టైప్స్ ఆఫ్ ఇంఫినిటి) వాటి భావార్ధ, పరమార్ధాలు గ్రహించి వర్గీకరణ చేసారు, ఈ శతాబ్ధం ఆరంభంలో ప్రముఖ భారతీయ గణిత శాస్త్ర దిగ్గజం, ఐ ఎస్ ఐ వ్యవస్తాపకుడు డాక్టర్ ప్రశాంత చంద్ర మహాలనోబిస్, ఈ అనంతాల విభజనతో పాటు, షడ్వాద పద్ధతిని అవలోకనం చేసి నేటి విధానలతో అనుసందానం చేసి తన దృక్పథాలు, మెళకువలు చాటి చెప్పిన గణిత కోవిదుడు.
Read More

కృష్ణ యజుర్వేదం లోని తైత్తిరీయ శాఖలో ముఖ్యమైనది ఈ కఠోపనిషత్తు.

కృష్ణ యజుర్వేదం లోని తైత్తిరీయ శాఖలో ముఖ్యమైనది ఈ కఠోపనిషత్తు. శంకరాచార్యులు భాష్యాలు వ్రాసిన పది ఉపనిషత్తులలో ఒక ముఖ్యమైన ఉపనిషత్తు కఠోపనిషత్తు. 108 ఉపనిషత్తులలో ముఖ్యమైన ఈ ఉపనిషత్తుది మూడో స్థానం. ఈ ఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో మూడు వల్లిలు ఉన్నాయి. కఠోపనిషత్తు లోని శ్లోకాల సారానికి భగవద్గీతలోని కొన్ని శ్లోకాల సారానికి చాలా సారూప్యత ఉంటుంది(ఉపనిషత్తుల సారమే భగవద్గీత అని భగవానుడే చెప్పాడు కదా).
శాంతి మంత్రం

ప్రతి ఉపనిషత్తు కి ఒక శాంతి మంత్రం ఉంటుంది.అదే విధంగా కఠోపనిషత్తు శాంతి శ్లోకం లేదా మంత్రం

ఓం సహనావవతు ,
సహనౌ భుజన్తు,
సహవీర్యం కరవావహై,
తేజస్వి నా వధీతమస్తు,
మావిద్వాషావహై ,
ఓం శాంతి: శాంతి: శాంతి:

మూల కథ

వాజశ్రవుడు (ఉద్దాలకుడు) విశ్వజిద్యాగం చేస్తాడు.యాగం చివర తనవద్ద ఉన్న సర్వ సంపదలు బ్రాహ్మణు లకు దానమిస్తాడు.వాజశ్రవుడు దానమిస్తున్న సంపదలో ఉన్న గోవులలో ముసలి గోవులు కూడా చాలా ఉంటాయి. వాజశ్రవుని కుమారుడైన నచికేతుడు దానిని గమనించి ఈ విధంగా ముసలి గోవులను దానమివ్వడం వల్ల తండ్రి ఆనంద లోకాలకు ఏవిధంగా చేరుకొంటాడు అని భావిస్తాడు.

పీతోదకా జగ్ధతృణా దుగ్ధ్దోహా నిరింద్రియా:
అనందా నామ తే లోకాస్తాన్ స గచ్చతి తా దతాత్
సహోవాచ పితరం తత కస్మై మాం దాస్యసీతి
ద్వితీయం తృతీయం త హఓవాచ మృత్యవే త్వా దదామీతి

నచికేతుడు తన తండ్రి వద్ద కు వెళ్ళి తనను ఎవరికి దానమిస్తున్నావు అని అడుగు తాడు.ఒకసారి సమాధానం రాకపోయేటప్పటికి అదే ప్రశ్న మూడుసార్లు వేస్తాడు. తండ్రి విసిగి యముడి కి దానమిస్తున్నాను అని అంటాడు.

పితృ వాక్య పరిపాలన కోసం నచికేతుడు యమ లోకానికి వెడతాడు. అక్కడ యమధర్మరాజు కనిపించడు . నచికేతుడు మూడు రాత్రులు యమలోకం లో అన్నపానాలు లేకుండా గడుపుతాడు. యముడు ఇంటికి తిరిగి వచ్చి, అతిథి బ్రాహ్మణుడు మూడు రోజులు అన్నపానాలు లేకుండా ఉండడం చూసి, నచికేతుడి కి మూడు వరాలు ప్రసాదిస్తాను అని అంటాడు. నచికేతుడు మొదటి వరంగా తన తండ్రి తనను మళ్లీ చూసేటప్పటికి శాంతస్వరూపం లో ఉండాలి అని కోరుకొంటాడు. రెండోవరం గా యముడు నచికేతుడికి అగ్నికార్యం ఏవిధంగా చెయ్యాలో బోధిస్తాడు. ఆవిధంగా నచికేతుడు అగ్నివిద్యోపదేశం పొందడం వల్ల దానిని నచికేతాగ్ని అని పిలుస్తారు.

చివరి వరంగా నచికేతుడు మనిషి మరణించిన తరువాత మరో దేహంతో సంబంధపడే జీవి ఉంటాడా, ఉండడా అనే విషయాన్ని విశదీకరించమంటాడు. అప్పుడు యముడు నచికేతుడి బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి కల యోగ్యత ను పరీక్షించదలచి రకరకాలైన ప్రలోభాలు పెడతాడు. వేరే వరాన్ని ఏదైనా కొరుకొమ్మంటాడు.అయితే నచికేతుడు నిశ్చల మనస్సుతో సాంసారిక భోగాలను తృణీకరించి జ్ఞాన విద్య మీదే మనస్సు కేంద్రీకరిస్తాడు. యముడు నచికేతుడి వైరాగ్యానికి మెచ్చి మనిషి మరణాంతరం జరిగే విషయాలు చెబుతాడు.
Read More

పూర్వమీమాంస

పూర్వమీమాంస

షడ్దర్శనాలలో ఐదవది మీమాంసా దర్శనం. కర్మకాండకు సంబంధించిన పూర్వ భాగాన్ని వివరిస్తుంది కనుక దీనికి పూర్వమీమాంస అని పేరు వచ్చింది. కాగా, జ్ఞానకాండకు సంబంధించిన ఉత్తర భాగాన్ని(ఉపనిషత్తులను) వివరిస్తుంది కనుక బ్రహ్మసూత్ర దర్శనానికి ఉత్తరమీమాంస అని పేరు వచ్చింది. మీమాంస అంటే వివేచించడం, వితర్కించడం, విచికిత్స చేయడం.

పూర్వమీమాంసా కర్త జైమిని. ఇతడు భారతాన్ని కూడా వ్రాశాడు. దీనిని జైమిని భారతం అంటారు. జైమిని సూత్రాలు కర్మకాండను, యజ్ఞ యాగాలపై విశ్వాసాన్ని పునరుద్ధరించడమే ముఖ్యోద్ధేశ్యంగా రచించబడ్డాయని ఒక అభిప్రాయం. మీమాంసా దర్శనములో 2500 సూత్రాలున్నాయి. ఇవి 12 అధ్యాయాలుగా, 60 పాదాలుగా ఉన్నాయి.

"అథాతో ధర్మజిజ్ఞాసా" అని జైమిని పూర్వమీమాంసా సూత్రాలు ప్రారంభమవుతాయి. అంటే "ఇప్పుడు ధర్మాన్ని గురించి వివేచన చేద్దాము" అని అర్థం. పూర్వమీమాంస ధర్మోద్ధరణకు ఉద్ధేశించిన దర్శనం. ధర్మం అంటే వేదధర్మం. అంటే యజ్ఞయాగాది కర్మకాండ. అందుచేత దీనికి కర్మ మీమాంస, ధర్మ మీమాంస అనే పేర్లు కూడా ఉన్నాయి.

యజ్ఞ కర్మకాండకు ఆధారం బ్రాహ్మణాలు. ఏ యజ్ఞాలను ఏ విధంగా చేయాలి, ఏ కర్మలను ఏ క్రమంలో చేయాలి మొదలైన అనేక విషయాలపై సందేహాలు బయలుదేరినప్పుడు వాటిపై వివిధ సందర్భాలలో చర్చలు జరిగేవి. ఆ చర్చలపై ఆధారపడి వాటి సారాంశాన్ని సూత్రాల రూపంలో మీమాంస దర్శనంగా జైమిని క్రోడీకరించాడు.
Read More

ఉత్తరమీమాంస

ఉత్తరమీమాంస

వ్యాస విరచితమైన బ్రహ్మ సూత్రములే షడ్దర్శనాలలో ఆఖరిదైన ఉత్తరమీమాంసా దర్శనము లేదా వేదాంత దర్శనము. బాదరాయణునిచే సూత్రబద్ధం చేయటం వలన బాదరాయణ సూత్రాలనీ, వేదాంతాన్ని వివరిస్తాయి కనుక వేదాంత సూత్రాలనీ, బ్రహ్మమును గురించి నివేదిస్తాయి కనుక బ్రహ్మమీమాంస లేదా బ్రహ్మ సూత్రాలనీ పేరు వచ్చింది. శారీరకుని (శరీర పరివృతుడైన జీవాత్మ) గురించి మీమాంసించడం వలన శారీరక మీమాంస అని కూడా అంటారు. అందుకే బ్రహ్మసూత్రాలకు శంకరుడు వ్రాసిన భాష్యం శారీరక భాష్యంగా ప్రసిద్ధి కెక్కింది. ఈ సూత్రములను వ్రాసినది బాదరయణుడు అని ఆదిశంకరుడు స్పస్టముగ వ్రాసినా బాదరయణుడు మరియు వ్యాసుడు ఒకరే అను విషయములో ఖచ్చితమైన ఆదారములు లేవు. ఇందులో జైన, బౌద్ధ మతములను పరామర్సించుట చేత, ఆ మతములు మన దేశములో ప్రచారమైన తర్వాత ఈ గ్రంధము రచించి యుండవచ్చునని తెలియవచ్చుచున్నది.

బ్రహ్మసూత్ర గ్రంథంలో నాలుగు అధ్యాయాలు, ప్రతీ అధ్యాయంలో నాలుగు పాదాలు, ప్రతి పాదంలో కొన్ని అధికరణాల చొప్పున మొత్తం 192 అధికరణాలు, ప్రతి అధికరణంలో కొన్ని సూత్రాల చొప్పున మొత్తం 555 సూత్రాలు ఉన్నాయి. శంకరునితోపాటు రామానుజుడు, మధ్వాచార్యుడు, వల్లభాచార్యుడు మొదలైనవారు కూడా బ్రహ్మసూత్రాలకు భాష్యాలను రచించడం జరిగింది.

ఇందలి ప్రథమమున గల నాలుగు సూత్రములు మాత్రము బహు మిక్కిలి గా గురువులు తమ శిష్యులకు బోధింతురు. వీటిని "చతుస్సూత్రి" అని అంటారు.

దీనితో పాటు శంకరులవారి అధ్యాస భాష్యము చాల ముఖ్యమైనది. అధ్యాస అనగా ఆరోపము. అధ్యాస ఎలా జరిగింది అని శ్రవణ కాలములో అవగతము చేసుకున్నవారికి, వేదాంత అర్ధమును గ్రహించుట బహు సులువు అగును. సూత్రము అనగా, తక్కువ సంఖ్యగల మాటలు, సారమైన విషయము, వివిధములైన అర్ధములు దానియందుండ వలయును. అనావస్యమైన మాటలు ఉండకూడదు. మరి ఏ దోషములు ఉండరాదు. సూత్రమును విడగొట్టి వివరముగ గురుశిష్య సంప్రదాయముతో తెలుసుకొనిన గాని సూత్రమున దాగిన అర్ధము యథాతథముగ బోధపడదు.
Read More

అపరిచిన్నమైనది పరమాత్మ తత్త్వం

అపరిచిన్నమైనది పరమాత్మ తత్త్వం 

యది మన్యసే సువేదేతి దహరమేవాపి
నూనం త్త్వం వేత్థ బ్రహ్మణో రూపమ్ |
యదస్య త్వం యదస్య దేవేష్వథ ను
మీమాంస్యేమేవ తే మన్యే విదితమ్ || (1వ మంత్రం)

"యది మన్యసే సువేదేతి" భగవంతుని గురించి విన్న వారికి భగవంతుడి గురించి తెలిసిపోయింది అనిపించిందంటే ఏమీ తెలియలేదని అర్థం. భగవంతుడి గురించి తెలియలేదంటే మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. "దహరమేవా", ఎంత తెలుసునూ అనుకున్న వాడికి కూడా ఆ తెలిసింది కొంచం మాత్రమే అని గుర్తించు. భగవంతునిలో అనేక అంశలు ఉన్నాయి, సముద్రంలో ఒక నీటి బిందువు వలె. ఇది మనకే కాదు పై లోకాల్లో ఉండే దేవతలకు కూడా. ఆ దేవతలకు పైన ఉన్న చతుర్ముఖ బ్రహ్మకు కూడా తెలిసింది ఎంత అంటే, "దహరమేవాపి నూనం" వాళ్ళకి తెలిసింది కూడా కొంతే, తెలియవలసింది ఇంకా ఎంతో ఉంటుంది.

దేవతలకి రాజు ఇంద్రుడు, రాక్షసులకి రాజు విరోచనుడు. ఇద్దరూ ఆధిపత్యం కోసం బ్రహ్మ విద్య నేర్వాలని బ్రహ్మ వద్దకి వెళ్ళారు. అక్కడ ముప్పైయేండ్లు బ్రహ్మ చర్యం చేసి ఉపదేశం పొందారు. కంటిలో కనిపించేదేదో అదే బ్రహ్మ తత్త్వం అని గురువు గారు ఉపదేశం చేసారు. ఇద్దరూ ఇక తెలిసింది అనుకుంటూ బయలుదేరారు. విరోచనుడు ఎవ్వరి కంటిలో చూసినా తానే కనబడ్డాడు, నేనే పరం బ్రహ్మ తత్త్వాన్ని అనుకుంటూ వెళ్ళిపోయి లోకాన్ని హింసించటం ప్రారంభించాడు. ఇంద్రుడికి కూడా అలాగే అనిపించాలి కానీ మార్పులు చెందే వాణ్ణి నేను కనుక నేనేలా పరం బ్రహ్మనవుతాను అని ఇంద్రుడికి మాతం సందేహం కలిగింది. ఈ ఉపదేశంలో ఏదో రహస్యం ఉండే ఉంటుంది అని మళ్ళీ బ్రహ్మ వద్దకి వెళ్ళి మొత్తం నూటా ఇరవై సంవత్సరాలు శుశ్రూష చేసి, "అపహతపాత్మా విజరః విమృత్యుః .." అంటూ ఉపదేశం పొంది బ్రహ్మ తత్త్వాన్ని గుర్తించాడు. బ్రహ్మ జ్ఞానం కలగడం అనేది ఏదో వింటేనో తెలిసిపోయేది కాదు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. జ్ఞానం కలుగుతూ ఉంటుంది కానీ అది సరియైన జ్ఞానాన్ని ఇవ్వక పోవచ్చు. నీరు ఒకటే అయినా అది ముత్యపు చిప్పలో పడితే ముత్యముగా వస్తుంది, మరొక దాంట్లో పడితే ఆల్చిప్పగా వస్తుంది. నీరు వేడిని పుట్టించటానికి పనికి వస్తుంది, అదే నీరు వేడిని ఆర్పివేయటానికీ పనికి వస్తుంది. ఒకటే జ్ఞానం మనం బాగుపడటానికి పనికొస్తుంది, తెలిసిపోయింది అని అహంకరిస్తే పాడు అవ్వటానికి పనికొస్తుంది. విన్న ఉపదేశం ఒకటే అయినా విరోచనుడికి విపరీత జ్ఞానం కలిగింది. అదే ఇంద్రుడిలో మరింత జిజ్ఞాస కలిగింపజేసి సరియైన జ్ఞానాన్ని ఇచ్చింది. కనుక బ్రహ్మ జ్ఞానం కలగడం అనేది చాలా కష్టం.

లోకంలో భగవంతుని కొన్ని రూపాల గురించి వింటుంటాం, కానీ అది భగవంతుని గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నట్లు కాదు. "యది మన్యసే సువేదేతి దహరమేవాపి నూనం త్వం వేత్థ బ్రహ్మణో రూపమ్", పరమాత్మ గురించి ఎవరెవరు ఎంతేంత తెలిసినది అన్నా అది చాలా కొంచమే. చతుర్ముఖ బ్రహ్మ చాలా సార్లు తనకి తెలుసునూ అని అనుకుఉన్నా, తిరిగి నాకు తెలియదు అని చెప్పుకున్నాడు. కనుక భగవంతుని గురించి పరిపూర్ణంగా ఎవ్వరికీ తెలియదు. ఆకాశం ఇంత అని చెప్పగలమా? అట్లానే పరమాత్మ అంటే అపరిచిన్నమైన తత్త్వం అది.
Read More

కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం

కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం
మౌనేన కలహం నాస్తి నాస్తి జాగరతో భయం

తాత్పర్యం : కృషివల్ల కరువు ఉండదు .జపం వల్ల పాపం వుండదు .మౌనంగా వుంటే కలహం ఉండదు .మెలకువగా ఉండేవానికి భయం ఉండదు .

౨ . యథా ధేను సహస్రేషు వత్సో విందతి మాతరమ్
తథా పూర్వకృతం కర్మ కర్తార మను గచ్ఛతి .

తాత్పర్యం : వేల ఆవులలో నున్న తనదూడను తన తల్లి గుర్తు పట్టినట్టే పూర్వజన్మలో చేసిన కర్మ జీవుడిని అనుసరిస్తుంది .
Read More

నవగ్రహాల శక్తులు- మన అపోహలు.

నవగ్రహాల శక్తులు- మన అపోహలు.

గ్రహాలు అనగానే మన మనసులో దుష్టత్వం తో కూడుకున్నవి ,లేక దుష్టగ్రహాలు ,శనిగ్రహం ….ఇలా భావనలు సాగుతుంటాయి.ఈ మాటలను మనం ధూషణలలో కూడా వాడుతుండటం జరుగుతుంది.. ఏదన్నా పూజ శాంతి జరిపినా భయముతో తప్ప భక్తి తో కాదన్నది అంగీకరించాల్సిన విషయము.ఇది చాలా పొరపాటు. జీవులన్నియు గ్రహ శక్తులతోనే జీవించుచున్నవి .సృష్టి కర్త జీవరాసి వికాసము కొరకు ఆయా శక్తులను ఆయాగ్రహదేవతలకు ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిచేయమని. ఒక్కోగ్రహానికి ఒక్కొక్క శక్తి వుంటుంది. ముఖ్యంగా తొమ్మిది గ్రహాల శక్తుల ప్రభావం వలన జీవరాసి పుట్టుక, అంతము జరుగుతున్నవి. ఇందులో రెండు ఛాయా గ్రహాలు.
జీవరాశిలో మానవుడు అతి ముఖ్యమైన జీవి. అందువలననే గ్రహ శక్తులు మానవుని చు ట్టు ఆవరించుకొని ,మనిషి కదలికలపైన,ఆలోచనలపైన ప్రభావం చూపుతూ జీవితాన్ని ఆయాప్రభావాలు అనుభవించునట్లు చేయును.గ్రహబలం సరిగా లేనిచో స్త్రీ,పురుషులెవరైనా పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ గ్రహదేవతలను భక్తితో ధ్యానిస్తుంటే వారు శుభదృష్టిని ప్రసరింపజేసి మనకు కలగబోయే చెడును దూరం చేస్తుంటారు. మోసము ,కౄరము,ప్రతీకారము ,అసూయ ..ఈవిధమైన దుష్ట స్వభావాలు మనలో కలిగినప్పుడు గ్రహముల యొక్క వక్ర దృష్టి దానికి తోడైతే మనిషి పతనానికి అవి బలం చేకూర్చును. మంచి మనస్తత్వం తో ప్రవర్తించేవారిని గ్రహదేవతలు శుభదృష్టితో చూస్తారు.అలాగే పంచభూతాలు,అష్టదిక్పాలకులు కూడా . ప్రతిదినమూ ఉదయాన్నే నిదురలేవగానే ఒక్కపరి నవగ్రహాలను ,అష్టదిక్పాలకులను,పంచభూతాలను స్మరించుకుని మంచి మార్గం లో నడిపి సుఖశాంతులను ప్రసాదించమని వేడుకోవాలి.
అలాగే గ్రహముల అనుగ్రహానికి చిన్న తంత్రమున్నది. రోజూ యాభైగ్రాముల బియ్యం బెల్లం పొడితో కలిపి పక్షులకు వేయండి. పక్షులు తిన్నచో గ్రహశాంతి జరిగి మీకు మేలు కలుగుతుంది. వీలైతే ఈక్రింది శ్లోకం చదివి తర్పణమియ్యండి.

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:

పంచభూతాలంటే : భూమి ,వాయువు ,అగ్ని ,నీరు ,ఆకాశము .

అష్ట దిక్పాలకులు: ఇంద్రుడు [తూర్పు] అగ్ని [ఆగ్నేయం] యముడు[దక్షిణం] నిరృతి [నైరుతి] వరుణుడు [పశ్చిమం]
వాయువు [వాయువ్యం] కుబేరుడు [ఉత్తరం] ఈశ్వరుడు [ఈశాన్యం]

నిద్రలేవగనే గణేశుని ,గురువును ,పైదేవతలను మహాత్ములను ,మహర్షులను తలచుకోవటం సర్వదా శుభకరమని శాస్త్రాదులు సూచిస్తున్నాయి.
Read More

విష్ణు సుదర్శన చక్ర మహిమ

విష్ణు సుదర్శన చక్ర మహిమ

వశిష్టుల వారు జనక మహారాజుతో తిరిగి ఇలా అంటున్నారు… ”ఓ జనక మహారాజా! విన్నావా? దుర్వాసుడి అవస్థలు! తాను ఎంతటి కోపవంతుడైనా… వెనకా ముందు ఆలోచించకుండా మహాభక్తుని శుద్ధని శంకించాడు. కాబట్టి ప్రయాసలపాలయ్యాడు. ఎంత గొప్పవారైనా… ఆచరించు కార్యక్రమాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి” అని చెబుతూ… అత్రి మహర్షి అగస్త్యునికి చెప్పిన వృత్తాంతాన్ని తిరిగి వివరిస్తున్నాడు…

అలా దుర్వాసుడు శ్రీమన్నారాయణుడి వద్ద సెలవు తీసుకుని, తనను వెన్నంటి తరుముతున్న సుదర్శన చక్రాన్ని చూసి, భయపడుతూ తిరిగి భూలోకానికి చేరుకుని, అంబరీషుడి వద్దకు పోయి… ”ఓ అంబరీషా! ధర్మపాలకా! నా తప్పును క్షమించి, నన్ను రక్షింపుము. నీకు నాపై ఉన్న అనురాగంతో ద్వాదశిపారాయణానికి నన్ను ఆహ్వానించావు. అయితే నేను నిన్ను కష్టాలపాలు చేశాను. వ్రతభంగం చేయించి, నీ పుణ్యఫలాన్ని నాశనం చేయాలనుకున్నా. కానీ, నా దుర్భుద్ధి నన్నే వెంటాడి, నా ప్రాణాలను తీయడానికి సిద్ధపడింది. నేను విష్ణువు వద్దకు వెళ్లి సుదర్శనం నుంచి కాపాడ మని ప్రార్థించాను. ఆ పురాణపురుషుడు నాకు జ్ఞానోదయం చేసి, నీ వద్దకు వెళ్లమని చెప్పాడు. కాబట్టి నీవే నాకు శరణ్యం. నేను ఎంతటి తపశ్శాలినైనా… ఎంతటి నిష్టావంతుడనైనా… నీ నిష్కళంక భక్తి ముందు సరిపోలను. నన్ను ఈ విపత్తు నుంచి కాపాడు” అని అనేక విధాలుగా ప్రార్థించాడు. అంబరీషుడు శ్రీమన్నారాయణుడిని ధ్యానించి… ”ఓ సుదర్శన చక్రమా! నీకివే నా నమస్కారాలు. ఈ దుర్వాస మహాముని తెలిసో, తెలియకో తొందరపాటుగా ఈ కష్టాలను కొని తెచ్చుకున్నాడు. అయినా ఇతడు బ్రాహ్మణుడు. కాబట్టి, ఇతన్ని చంపకు. ఒకవేళ నీ కర్తవ్యాన్ని నిర్వహించక తప్పదనుకుంటే… ముందు నన్ను చంపి ఆ తర్వాత ఈ దుర్వాసుడిని చంపు. శ్రీమన్నారాయణుడి ఆయుధానివి నీవు. నేను ఆ శ్రీహరి భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు. దైవం. నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధాల్లో అనేక మంది లోక కంటకులను చంపావు. కానీ, శరణు కోరేవారిని ఇంతవరకు చంపలేదు. అందుకే… దుర్వాసుడు ముల్లోకాలు తిరిగినా… ఇతన్ని వెంటాడుతూనే ఉన్నావు. కానీ, చంపలేదు. దేవా! సురాసురాది భూతకోటి ఒక్కటిగా ఏకమైనా… నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైనా అడ్డు లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలుసు. అయినా… మునిపుంగవుడికి ఏ అపాయం కలుగకుండా రక్షింపుము. నీయందు ఆ శ్రీమన్నారాయణుడి శక్తి ఇమ ఇమిడి ఉంది. శరణు వేడిన ఈ దుర్వాసుడిని రక్షింపుమని నిన్ను వేడుతున్నాను” అని అనేక విధాలుగా స్తుతించాడు. అప్పటి వరకు అతి రౌద్రంతో నిప్పులు కక్కుతున్న విష్ణుచక్రం అంబరీషుడి ప్రార్థనకు శాంతించింది. ”ఓ భక్తాగ్రేసరా… అంబరీషా! నీ భక్తిని పరీక్షించడానికి ఇలా చేశానేతప్ప మరొకందుకు కాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను, దేవతలంతా ఏకమైనా చంపలేని మూర్ఖులను నేను దునిమాడటం నీకు తెలుసుకదా? ఈ లోకంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు శ్రీహరి నన్ను వినియోగించి, ముల్లోకాల్లో ధర్మాన్ని స్థాపిస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే… ముక్కోపి అయిన దుర్వాసుడు నీపై పగపట్టి, నీ వ్రతాన్ని భంగపరిచి, నశింపజేసి, నానా ఇక్కట్లు పెట్టడం, కన్నులెర్రచేసి నీ మీద చూపిన రౌద్రాన్ని నేను గమనించాను. నిరపరాధివైన నిన్ను రక్షించి, ఈ ముని గర్వం అణచాలని తరుముతున్నాను. ఇతనూ సామాన్యుడు కాదు. రుద్రాంశం సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహా తపశ్శాలి. రుద్రతేజంతో భూలోకవాసులను చంపగల శక్తి ఆయనకుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తేజస్సు కలవాడు. వారుగానీ, నేనుగానీ, క్షత్రియ తేజస్సున్న నీవుగానీ, ఆయన ముందు సరితూగలేం. అయితే… తనకన్నా ఎక్కువ శక్తివంతులతో సంధిచేసుకోవడం ఉత్తమం. ఈ నీతిని ఆచరించు వారు ఎలాంటి విపత్తుల నుంచి అయినా తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగినదంతా విస్మరించి, శరణార్థిగా వచ్చిన ఆ దుర్వాసుడిని గౌరవించి, నీ ధర్మం నీవు నిర్వర్తించు” అని సుదర్శనుడు పలికాడు.

ఆ మాటలకు అంబరీషుడు… ”నేను దేవ, గో, బ్రాహ్మణాదుల పట్ల, స్త్రీలపట్ల గౌరవభావంతో మెసలుకుంటాను. నా రాజ్యంలో సర్వజనులూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటాను. కాబట్టి శరణు కోరిన ఈ దుర్వాసుడిని, నన్ను రక్షించు. వేల అగ్నిదేవతలు, కోట్ల సూర్యమండలాలు ఏకమైనా… నీ శక్తికి, తేజస్సుకు సాటిరావు. నీవు అసమాన్య తేజోరాశివి. మహావిష్ణువు నీన్ను విశేష కార్యాలకు వినియోగిస్తాడు. లోక కంఠకులు, గోవధ చేసేవారు. బ్రహ్మ హత్యాపాతకులు, బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడు” అని ప్రార్థిస్తూ అంబరీషుడు చక్రాయుధానికి ప్రణమిల్లాడు.

అంతట సుదర్శనుడు అంబరీషుడిని లేపి, ఆలింగనం చేసుకుని… ”అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చాను. విష్ణు స్తోత్రం త్రికాలాల్లో ఎవరైతే చేస్తారో.. ఎవరు దాన ధర్మాలతో పుణ్యఫలాన్ని వృద్ధి చేసుకుంటారో… ఎవరు పరులను హింసించకుండా, పరధనంపై ఆశపడకుండా, పరస్త్రీని చెరపట్టకుండా, గోవధ, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాకాలను చేయకుండా ఉంటారో… వారి కష్టాలు తొలగిపోయి… ఈ లోకంలో, పరలోకంలో సుఖశాంతులతో తలతూగుతారు. కాబట్టి, నిన్నూ, దుర్వాసుడిని రక్షిస్తున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్య ఫలం ముందు ఈ మునిపుంగవుడి తపశ్శక్తి సాటిరాదు” అని చెప్పి అదృశ్యుడయ్యాడు.
Read More

జగన్మాత

జగన్మాత

సకలచరాచర జగత్తుకు మూలాధారమేది? ఎవరివల్ల ఈ సృష్టి అంతా జరుగుతుంది? ఎవరైనా రక్షణ కోసం ఎవరిని ఆశ్రయించాలి? అనే సందేహాలు సాక్షాత్తూ సృష్ఠికర్త అయిన బ్రహ్మదేవుడికే కలిగాయి. ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాల సారం దేవీభాగవతం తృతీయ స్కంధంలో మనకు కనిపిస్తుంది. జనమేజయుడు తన మనసులోని ఈ సందేహాలను వ్యాసుడి దగ్గర ప్రస్తావించాడు. వ్యాసుడికి కూడా ఇటువంటి సందేహాలు కలిగితే వాటిని నారద మహర్షి దగ్గర ప్రస్తావించాడు. నారదుడు ఆ ప్రశ్నలన్నింటినీ విని తనకే ఆ సందేహాలు వచ్చాయని వాటిని గురించి తన తండ్రి అయిన బ్రహ్మదేవుడిని అడిగినప్పుడు ఆయన తనకు సందేహనివృత్తి చేసి త్రిమూర్తులకు కలిగిన దివ్యానుభూతులను వివరించాడని, కథాక్రమాన్నంతా చెప్పాడు. ఒకప్పుడు ప్రళయం సంభవించింది. ఆ ప్రళయ కాలంలో చుట్టూ జలం, మధ్యలో ఒక మహాపద్మం, ఆ పద్మం దుద్దుమీద బ్రహ్మదేవుడు ఒంటరిగా కూర్చొని తానెవరు? తానిప్పుడు ఏంచేయాలి? అనే విషయాలను గురించి తీవ్రంగా ఆలోచించటమేగాక అసలు తానున్న పద్మం ఎక్కడ నుంచి ఉద్భవించింది? అని కూడా తెలుసుకోవాలనుకున్నాడు. అలా అనుకొని పద్మానికున్న కాడను పట్టుకొని జలంలోకి బయలుదేరాడు. ఎంతకాలం వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా బ్రహ్మకు ఆ కాడ అంతమూ, భూమి ఎక్కడా ఆనవాళ్ళే కనిపించలేదు. దాంతో వెంటనే ఆయన మళ్ళీ పద్మంలో ఉన్న దుద్దు మీదకు వచ్చి చేరాడు. ఇంతలో మధు, కైటభులనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మను సంహరించటానికి బయలుదేరి వచ్చారు. వారి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక బ్రహ్మ పద్మం కాడ లోపలికి ప్రవేశించాడు. అలా ఆ మార్గాన ఎంతోదూరం వెళ్ళగా ఒకచోట శేషతల్పం మీద యోగనిద్రలో శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువు కనుపించాడు. కొద్ది సమయం ఆగి బ్రహ్మ నిద్రాదేవిని స్తుతించాడు. వెంటనే ఆమె శ్రీ మహావిష్ణువును వీడి గగనంలో నిలిచింది. ఆ వెంటనే విష్ణువు మెల్లగా కళ్ళు తెరిచి బ్రహ్మను చూశాడు. విషయమంతా తెలుసుకొని మధు, కైటభులను తన విశాలమైన తొడమీద పెట్టుకొని సంహరించాడు. ఇంతలో అక్కడకు రుద్రుడు వచ్చాడు. బ్రహ్మ, విష్ణు, రుద్రులు ముగ్గురూ కలిసి జగదాంబను స్తుతించారు. జగదాంబ వారి స్తుతులకు ఆనందించి రాక్షస సంహారం అయింది కనుక ఇక ఎవరి విధులను వారు నిర్వర్తించమని బ్రహ్మకు ప్రత్యేకంగా సృష్టిని చెయ్యమని చెప్పింది. అయితే బ్రహ్మ చుట్టూ నీరు తప్ప మరెక్కడా భూమి కానీ, మరేమీ కానీ లేవని మరి సృష్టి ఎలా చేయటం? అనే సందేహాన్ని వ్యక్తపరిచాడు. అప్పుడు జగదాంబ తాను ఏ పలుకు పలికినా పూర్వాపరాలు లేకుండా, ఆధారాలు లేకుండా వృధాగా ఎప్పుడూ పలకనని నిరూపించటానికి, అలాగే తాను ఏదిచెప్పినా వెంటనే చేసితీరాలనికానీ సందేహపడకూడదనే విషయాలను నిరూపించటానికి తన శక్తేమిటో, తానెవరో మరోమారు త్రిమూర్తులకు వివరించటానికి ఒక విషయాన్ని వారికి చూపించాలనుకుంది. ఆమె చిరునవ్వు నవ్వగానే ఒక దివ్యవిమానం వారిముందు వాలింది. ఆ విమానంలో బ్రహ్మ, విష్ణు, రుద్రులు, జగన్మాత అందరూ ఎక్కి కూర్చున్నారు. అప్పుడు ఆ దివ్యవిమానం సర్వలోకాలను చుట్టిరావాలన్న దేవీ సంకల్పంతో బయలుదేరింది. లోకాలన్నీ సంచరిస్తూ స్వర్గలోకానికి, అలాగే వైకుంఠానికి, కైలాసానికి, సత్యలోకానికి బయలుదేరి వెళ్ళింది. చాలా విచిత్రంగా త్రిమూర్తుల లోకాలు త్రిమూర్తులకు మళ్ళీ వారి రూపాలలో ఒక్కొక్కరు కనిపించసాగారు. ఆ మాయ ఏమిటో, అలా ఎందుకు జరుగుతుందో బ్రహ్మ, రుద్రులకు త్వరగా అవగతం కాలేదు. అయితే విమానంలో ఉన్న శ్రీమహావిష్ణువు మాత్రం కొంత ముందుగా విషయాన్ని గ్రహించగలిగాడు. తమ చెంత ఉన్న జగన్మాత ఈ సకల సృష్టికి మూలస్వరూపిణి అని, అంతకుముందు ప్రళయకాలంలో వటపత్రశాయిగా ఉన్న తనను తల్లిగా లాలించి, పోషించింది కూడా ఆ జగన్మాతే అని గ్రహించగలిగాడు విష్ణుమూర్తి. అలా ఆ దివ్యవిమానం మెల్లగా కదులుతూ పాలసముద్రంలో ఉన్న ఒక అద్భుత ద్వీపానికి చేరుకుంది. ఎన్నెన్నో అమూల్య సుందర సౌధాలు, వనాలు వారికక్కడ కనిపించాయి. ఆ ద్వీపంలో ఒకచోట శివాకారంలో ఒక ప్రదేశం కనిపించింది. ఆ ప్రదేశంలో ఓ దివ్యమైన స్త్రీమూర్తి ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని పూలమాలలు, ఎర్రచందనం, విశాలంగా ఉండి ఎర్రబారిన కళ్ళతోనూ, పెదవులతోనూ, మిరుమిట్లు గొలిపే కాంతితో ప్రకాశిస్తుంది. చిరునవ్వులు చిందిస్తున్న ఆ దివ్యసుందరమూర్తిని ఎందరెందరో దేవకన్యలు సేవిస్తూ ఉన్నారు. అటువంటి దివ్యసుందరమూర్తి ఎవరై ఉంటుందా? అని త్రిమూర్తులంతా నివ్వెరపోతూ చూస్తూ ఉన్న సమయంలో మళ్ళీ విష్ణుమూర్తే ఆమె సాక్షాత్తూ తమకందరికీ కారణభూతురాలైన మహాదేవి అని గుర్తించాడు. మహావిద్య, మహామాయ, పూర్ణప్రకృతి, అవ్యయ, యోగగమ్య, ఇచ్ఛారూపిణి, నిత్యానిత్య స్వరూపిణి, విశ్వేశ్వరి, వేదగర్భ అన్నీ ఆమేనని విష్ణుమూర్తి గ్రహించాడు. సకల జీవకోటి చిహ్నాలు ఆమె శరీరంలో కనిపించసాగాయి. ఆ విషయాలను విష్ణువు తన పక్కన ఉన్న బ్రహ్మకు కూడా చెప్పాడు. ఇంతలో ఓ విచిత్రం జరిగింది. విమానం దిగి ఆ మహాశక్తి ముంగిట నిలచిన ముగ్గురు దేవతలు ఆ మహాదేవిని చూసి స్తుతిస్తూ నమస్కరించారు. ఆ మహాదేవి కూడా చిరునవ్వు నవ్వుతూ త్రిమూర్తులవంక చూసింది. క్షణంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు స్త్రీమూర్తులుగా మారిపోయారు. ఈ విచిత్రం ఆ ముగ్గురికి ఆశ్చర్యాన్ని కలిగించింది. త్రిమూర్తులు నానారత్న శోభితమై ప్రకాశిస్తున్న ఆ దేవి పాదపీఠాన్ని అలా చూస్తు నిలుచుండిపోయారు. దేవి చుట్టు ఉన్న సఖీజనం వింజామరులు వేస్తూ, మంగళఘోషతో అమ్మవారికి ఆనందం కలిగిస్తున్నారు. మరోక్షణంలో త్రిమూర్తుల చూపులు ఆమె పాదాలపైన ప్రత్యేకించి బొటనవేలి గోరుపైన పడ్డాయి. తళతళలాడుతూ అద్దంలా ఉన్న ఆ బొటనవేలి అద్దంలాంటి గోరులో సకల జగత్తు, బ్రహ్మాండం, సూర్యచంద్రులు, గ్రహతారకలు, సముద్రాలు, దేవతలు ఒకటేమిటి సృష్టిలో ఉన్నదంతా కనిపించంది. ఆ మహాత్వాన్ని చూసి బ్రహ్మ, విష్ణు, రుద్రులు ఒక్కొక్కరు విడివిడిగా దేవిని స్తుతించి తమకు జ్ఞానోదయమైందని పలికారు. అనంతరం జగదాంబ కరుణారస దృక్కులతో త్రిమూర్తులకు వారివారి రూపాలు వచ్చాయి. దేవిజగన్మాత పలుకు పలికినా అది శిరోధార్యమేనని అనుకున్నారు. తమవెంట విమానంలో ఉన్న జగన్మాత ఈ ఆదిపరాశక్తిగా ఇక్కడ భాసిల్లుతోందని గ్రహించారు.
Read More

కందళి.................

కందళి.................

బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఖండంలో సాంసారిక జీవితానికి సంబంధించిన సందేశాన్ని ఇచ్చే కథ ఇది. పురాణాలలోనూ, ఇతిహాసాలలోనూ, దుర్వాసమహాముని అంటే తెలియని వారుండరు. మహాముని అయినప్పటికీ కోపానికి పెట్టింది పేరుగా దుర్వాసుడు ఉండేవాడు. అంతటి మహామునికి అంతకంటే గయ్యాళిగా ఉండే ఒక భార్య ప్రాప్తించిన సంఘటన ఒకసారి జరిగింది. ఒకసారి దుర్వాస మహార్షి గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ప్రశాంత ప్రకృతిలో దైవసంకల్పానుసారంగా అప్సరసకాంత అయిన తిలోత్తమ సాహసి అనేవాడితో విహరించసాగింది. ఎదురుగా మునిని పెట్టుకుని ఏమాత్రం జంకు లేకుండా విహరిస్తున్న ఆ ఇద్దరినీ చూసి దుర్వాసుడికి కోపం వచ్చింది. వెంటనే ఆ ఇద్దరినీ రాక్షసులుగా జన్మించమని శపించాడు. ఆ శాపానుసారంగా సాహసి గార్ధభరూపంతో రాక్షసుడిగా జన్మించి శ్రీకృష్ణుడి చేతిలో హతమై మళ్లీ సాహసిగా మారాడు. తిలోత్తమ భూలోకంలో ఉష అనే పేరుతో జన్మించి శ్రీకృష్ణుడి కుమారుడైన అనిరుద్ధుడిని వివాహమాడి మరికొంత కాలానికి శాపవిముక్తిని పొంది స్వర్గానికి వెళ్లింది. అయితే సాహసి తిలోత్తమల శృంగార చేష్టలను కళ్ళారా చూసిన దుర్వాస మహామునికి మనసు చలించింది. వివాహంపై ఆలోచన కలిగింది. అదే సమయానికి ఔర్వుడు తన కుమార్తె అయిన కందళిని వెంటపెట్టుకుని దుర్వాసుడి దగ్గరకు వచ్చాడు. ఎంతో అందగత్తె అయిన కందళి దుర్వాసుడిని గురించి ఆ నోటా ఆ నోటా విని ఎలాగైనా అతడినే పెళ్లాడుతానని పట్టుబట్టి కూర్చుందని ఔర్వుడు దుర్వాసుడికి చెప్పాడు. అంతేకాక తన కుమార్తె ఎంతో అందగత్తె అని సుగుణాల రాశి అని వివరించి చెబుతూ ఆమెలో ఒకేఒక్క దుర్లక్షణం ఉందని ఎటువంటి మొహమాటం లేకుండా అప్పుడప్పుడు తీవ్రంగా దుర్భాషలాడుతుంటుందని చెప్పాడు. అయినా అంత అందం ఎంతో మంచి గుణాలు ఉన్నాయి కనుక దయతో తన కుమార్తెను పెళ్లాడమని ఔర్వుడు దుర్వాసుడిని బతిమలాడాడు. ఒకపక్క తిలోత్తమ, సాహసికుల శృంగార చేష్టల వల్ల కలిగిన మదనతాపం, ఎదురుగా అతిలోక సౌందర్యవతిగా ఉన్న కందళి, ఔర్వమహాముని వినయపూర్వక విజ్ఞప్తులు అన్నీ కలిసి దుర్వాసుడి మనస్సును కరిగించాయి. వెంటనే వివాహానికి ఒప్పుకున్నాడు. కానీ ఒక నియమం మాత్రం తాను పెడతానన్నాడు. కందళి నూరు దుర్భాషలు ఆడే వరకు మాత్రమే తాను సహించనున్నట్లు, అందుకు ఇష్టమైతే వివాహానికి తగిన ఏర్పాట్లను చేయమని దుర్వాసుడు చెప్పాడు. ఔర్వుడు అందుకు సంసిద్ధుడై వివాహం జరిపించాడు. ఆ నూతన వధూవరుల దాంపత్యం కొంతకాలం బాగానే గడిచింది. కందళిలో ఉన్న సద్గుణాలు ఆమె అందం దుర్వాసుడిని బాగా మురిపిస్తున్నా కందళి ఎప్పుడు పడితే అప్పుడు తనను ఎలా పడితే అలా దుర్భాషలాడే తీరు మాత్రం దుర్వాసుడికి నచ్చలేదు. నూరుసార్లు ఆమె అలా మాట్లాడగానే ఇక నిగ్రహించుకోలేకపోయాడు. ఒకరోజున కందళి తన సహజధోరణిలో దుర్వాసుడిని దూషించింది. దాంతో తీవ్రఆగ్రహానికి గురై అతడిచ్చిన శాపంతో ఆమె భస్మమైంది. ఆ తరువాత కానీ ఆమెకు తన తప్పేంటో తెలిసిరాలేదు. ఆత్మరూపంలో అప్పుడు కందళి తన భర్తను క్షమించమని వేడుకుంది. కానీ అప్పటికే చేయిదాటిపోయింది. మితిమీరిన కోపంతో తీవ్రంగా తన భార్యను శపించి భస్మం చేసినందుకు బాధపడుతూ దుర్వాసుడు మూర్చపోయాడు. కొద్ది సమయం తరువాత అక్కడికి ఒక విప్రుడు వచ్చి స్త్రీ వ్యామోహానికి గురై తపశ్శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్న దుర్వాసుడికి కర్తవ్య దీక్షను వివరించాడు. ఈ కథలో దుర్వాసుడంతటి ముని కామ వికారానికి గురయ్యాడు. సిగ్గువిడిచి ఆయన ఎదుట శృంగార చేష్టలు చేసిన సాహసి తిలోత్తమ శాపాలను పొందారు. అందుకే పెద్దల ముందు మహాత్ముల ముందు ఎవరూ అసభ్యంగా ప్రవర్తించకూడదనే నీతి కనిపిస్తుంది. అలాగే ముని అయినవాడు యోగనిష్టతో తపశ్శక్తి సాధనలో నిమగ్నం కావాలి కానీ కామ వికారానికిలోనై వివాహం చేసుకునే ఆలోచనకు త్వరపడి రాకూడదని ఎంత అందం, మరెన్ని మంచి గుణాలు ఉన్నా నోటి దురుసుతనం అయిన దానికీ కాని దానికీ అనవసరంగా భర్తను దుర్భాషలాడటం మంచిదికాదనే సందేశాన్ని కూడా ఈ కథ అందిస్తుంది.
Read More

జపమాల మెడలో ధరించకూడదా ?

జపమాల మెడలో ధరించకూడదా ?
జపతపాలతో భగవంతుడిని ఆరాధించడం వలన ఆయన మనసును తొందరగా గెలుచుకోవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. ముందు యుగాలలో మహర్షులు యజ్ఞయాగాలను విరివిగా నిర్వహించారు. అదేపనిగా తపస్సులు చేశారు. కలియుగంలో భగవంతుడి అనుగ్రహానికి తపస్సు చెప్పబడలేదు. స్మరణం మాత్రంచేత భగవంతుడి కృపాకటాక్షాలకు పాత్రులు కావొచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.
భగవంతుడి నామాన్ని ఎక్కడపడితే అక్కడ ... ఇష్టం వచ్చిన విధంగా స్మరించడం కాకుండా, మహర్షులు ఒక నియమం చేయడం జరిగింది. ఉదయాన్నే స్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ... పవిత్రమైన ప్రదేశంలో చాప వంటి ఆసనంపై కూర్చుని జపం చేసుకోవాలని చెప్పడం జరిగింది. శ్రీమహావిష్ణువుకు 'తులసి' ... సదాశివుడికి 'రుద్రాక్ష' ప్రీతికరమైనవి కనుక, వారిని ఆయా జపమాలలతో స్మరించాలని సెలవిచ్చారు.
ఇక స్పటిక ... తామర ... పగడపు పూసలతో జపం చేసేవాళ్లు లేకపోలేదు. ఒక్కో జపమాల వలన ఒక్కో ఫలితం వుంటుంది. ఇక ఆధ్యాత్మిక ప్రపంచంలో 108 అనే సంఖ్యకు ఎంతో విశిష్టత వుంది కనుక, ఇష్టదైవం నామాన్ని 108 మార్లు స్మరించాలని మహర్షులు నిర్ణయించడం జరిగింది. ఆధ్యాత్మిక వాతావరణం అధికంగా గల కుటుంబాలవారు అనునిత్యం జపం చేసుకుంటూ వుంటారు. ఇక మిగతా వాళ్లు ఏదైనా దీక్ష తీసుకున్నప్పుడు మాత్రమే జపం చేస్తుంటారు.
వేంకటేశ్వరస్వామి ... శివుడు ... అయ్యప్పస్వామి ... ఆంజనేయస్వామి ... భవానీ మండల దీక్షలు తీసుకుని జపాలు చేసే వాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే చాలామంది దీక్ష ప్రారంభంలో రెండు తులసిమాలలు ధరించి ... జపం సమయంలో ఒకదానిని తీసి జపం చేస్తుంటారు. మరికొందరు ఒక మాల మాత్రమే తీసుకుని దానితోనే జపం చేసి ... జపం పూర్తి కాగానే తిరిగి దానినే ధరిస్తూ వుంటారు. ఈ విధంగా చేయడం వలన జపమాల అపవిత్రమై పోవడమే కాకుండా, తన సహజసిద్ధమైన శక్తిని కోల్పోతుంది. అనేక దోషాలను మూట గట్టుకోవలసి వస్తుందని శాస్త్రం చెబుతోంది.
ఒక మాల మెడలో ధరించి, మరోమాలను పూజా మందిరంలోనే ఉంచాలి. జపం చేసే సమయంలో పూజా మందిరంలో ఉంచిన మాలను మాత్రమే ఉపయోగించాలి. జపం తరువాత ఆ మాలను తిరిగి పూజా మందిరంలోనే ఉంచాలి గానీ మెడలో ధరించకూడదు. ఈ నియమాన్ని పాటించడం వలన మాత్రమే జప ఫలితం పరిపూర్ణంగా లభిస్తుందనే విషయాన్ని మరిచిపోకూడదు.
Read More

వైష్ణవమాయ

వైష్ణవమాయ

ప్రపంచ స్థితిగతులనే మార్చివేసి తనకు అనుకూలంగా ఓ ఆటవస్తువుగా కూడా విశ్వాన్నంతటినీ తన మాయతో మార్చగల శక్తి జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువుకు ఉందని వివరించే కథ ఇది. వరాహపురాణంలో భూదేవికి శ్రీమహావిష్ణువు తన మాయావిలాసాన్ని వివరిస్తూ సోమశర్మ అనే ఒక మునికి సంబంధించిన కథను కూడా చెప్పాడు. సకల చరాచర జగత్తు అంతా తన మాయేనని వివరించి చెప్పిన తర్వాత శ్రీమహావిష్ణువు తన మాయకు ఉదాహరణగా ఈ కథను చూపటం ఓ విశేషం. పూర్వం సోమశర్మ అనే ఒక ముని ఉండేవాడు. ఆయన ఇహలోక పరమైన సుఖాలన్నింటినీ విడిచి కేవలం శ్రీ మహావిష్ణువు ధ్యానంలోనే కాలం గడుపుతుండేవాడు. ఆ తర్వాత కొద్దికాలానికి విష్ణువును గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై సోమశర్మను ఏమైనా వరాలు కోరుకోమన్నాడు. అంతేగాక అతులిత ఐశ్వర్యం, భోగభాగ్యాలు ఇవేవి కావాలన్నా క్షణాలలో ప్రసాదిస్తానని కూడా శ్రీ మహావిష్ణువు చెప్పాడు. అయితే సోమశర్మ తనకు అటువంటి విలువైన వరాలేవీ అక్కరలేదని భోగభాగ్యాలమీద తనకు మనసు కూడా లేదని అన్నాడు. అయితే తనకు చిరకాలంగా ఓకోరిక ఉందని అందరూ వైష్ణవమాయ అని చెప్పుకోవడం తాను నిరంతరం చూస్తూనే ఉంటానని అందువల్ల అసలామాయ అంటే ఏమిటో తనకు తెలుసుకోవాలని కోరికగా ఉందని సోమశర్మ విష్ణువుతో అన్నాడు. అయితే శ్రీ మహావిష్ణువు తన మాయను అందరూ అనుభవించటమే తప్ప దాన్ని ముందుగా తెలుసుకోవడం సాధ్యపడదని కనుక మరింత ఏవైనా కోరికలు కోరుకోమని అన్నాడు. అయితే సోమశర్మ అందుకు నిరాకరించి తన తపస్సుకు మెచ్చినట్లయితే తనకు వైష్ణవమాయను చూపించమని పట్టుపట్టాడు. తన భక్తుడి కోరికను శ్రీ మహావిష్ణువు కాదనలేక అలాగేనని, తన మాయను తెలుసుకోవడానికి అక్కడకి సమీపంలో ఉన్న గంగానదికి వెళ్ళి స్నానం చేసిరమ్మనమని అప్పుడు తన మాయేంటో తెలుసుకోవచ్చని చెప్పాడు. విష్ణువు తన కోరికను తీర్చుతున్నందుకు ఎంతగానో సంతోషించి గంగలో స్నానం చేయటానికి బయలుదేరి వెళ్ళాడు. నది ఒడ్డున దండ, కమండలాలను, కాషాయ వస్త్రాలను విడిచి నదిలోకి దిగి సోమశర్మ ఆనందంగా స్నానం చేయడం ప్రారంభించాడు. పూర్తి స్నానవిధుల ప్రకారం నదిలో మునిగి ఓమారు పైకిలేవగానే సోమశర్మ వైష్ణవమాయ ప్రభావంతో ఒక ఆటవిక స్త్రీ గర్భంలోకి చేరాడు. తాను మునై ఉండి, శ్రీ మహావిష్ణువు భక్తుడై ఉండి అలా ఆటవిక స్త్రీ గర్భాన శిశువులాగా మారటం, గర్భక్లేశం ఇవన్నీ తలుచుకొని తనకెందుకు ఇలా కష్టాలు కలుగుతున్నాయో కదా అనుకుంటుండగానే ఆ ఆటవిక స్త్రీ ప్రసవించడం, సోమశర్మ ఆడశిశువుగా నేలమీద పడటం జరిగాయి. ఆడశిశువుగా జన్మించగానే అతడికి పూర్వజన్మ జ్ఞానం అంతా నశించిపోయింది. మెల్లమెల్లగా పెరిగి పెద్దదవుతున్న ఆ శిశువు యుక్తవయస్సుకు చేరుకుంది. అప్పుడామె తల్లిదండ్రులు ఆమెకు తగినట్లుగా మరొక ఆటవికుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆటవిక జాతి లక్షణం ప్రకారం ఆ యువతి భర్తతో కాపురం చేస్తూ ఆటవికులు చేసే కొన్ని కొన్ని హింసామార్గాలను అవలంబిస్తూ కాలం గడపసాగింది. ఆ దంపతులకు ఏడుగురు బిడ్డలు కూడా కలిగారు. ఎంతో ఆనందంగా కాలం గడుస్తుండగా ఒకరోజున ఆటవిక స్త్రీ, ఏడుగురు బిడ్డలకు తల్లిగా కూడా అయిన సోమశర్మకు మళ్ళీ పూర్వజన్మ జ్ఞానం కలిగింది. తనలాంటి తపశ్శక్తి సంపన్నుడికి ఇంతటి అధోగతి ఎందుకు కలిగిందా అని స్త్రీ రూపంలో ఉన్న సోమశర్మ బాధపడుతూనే ఇంటి నుంచి ఒక కుండను నెత్తిన పెట్టుకొని నీటిని తేవటంకోసం గంగానదికి బయలుదేరింది. తనకు అలాంటి స్థితి విష్ణువు ఎందుకు కలిగించాడా? అని బాధపడుతూ ఆమె ఆ బాధ నుంచి ముందు ఉపశమనం పొందేందుకు కొద్దిసమయం గంగలో దిగాలనుకొని ముందుకువెళ్ళి నదిలో పూర్తిగా స్నానం చేస్తుండగా మళ్ళీ వైష్ణవమాయ వల్ల ఆస్త్రీ రూపం పోయి సోమశర్మకు అంతకుముందులాగానే తన సహజరూపం సంక్రమించింది. వెంటనే ఒడ్డుకు వచ్చి తాను గర్భస్థ శిశువుగా మారే ముందు తన వస్త్రాలు ఉంచిన చోటుకు వెళ్ళి దండ, కమండలాలను, వస్త్రాలను స్వీకరించాడు. అప్పటికైనా తన రూపం వచ్చినందుకు ఆనందిస్తూ ఆటవిక స్త్రీగా ఉన్నప్పుడు తాను చేసిన హింసాత్మక కార్యాలన్నింటినీ తలచుకొని ఆ పాపానికి చింతించసాగాడు. ఆ పాపం పోగొట్టుకోవటానికి మళ్ళీ ఆ పరిసరాలలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకుని తపస్సు చేసుకోవటం ప్రారంభించాడు. ఇంతలోసోమశర్మ స్త్రీగా ఉన్నప్పుడు భర్తగా లభించిన ఆటవికుడు ఏడుగురు పిల్లలను వెంటపెట్టుకొని ఆమెను వెతుకుతూ అక్కడకి వచ్చాడు. అక్కడ ఉన్న మరికొందరు మునులను చూసి నీటికోసం తన భార్య అటుగా వచ్చిందని అయితే ఆమె ఎంతసేపటికి ఇల్లు చేరలేదని ఆమె ఆచూకీ ఎవరికైనా తెలుసేమోనని అడిగాడు. అయితే ఆ మునులంతా తాము స్త్రీని ఆత్రం మాత్రం చూడలేదని, నది ఒడ్డున కుండ, వస్త్రాలు ఉన్నాయని కొత్తగా అక్కడకు వచ్చిన ఆ మునికేమైనా తెలుసేమోనని అడిగి చూడమని చెప్పారు. అక్కడ ఉన్న కుండ, వస్త్రాలు, తన భార్యవేనని గుర్తించిన ఆ ఆటవికుడు సోమశర్మ దగ్గరకు వెళ్ళి తన బాధంతా చెప్పి తన భార్య గురించి తెలిసుంటే చెప్పమని వేడుకున్నాడు. అతడి బాధ చూడలేక సోమశర్మ తానే ఆటవికుడి భార్యనని ముందు నమ్మకపోయినా ఆ తర్వాత ఆ విషయాన్ని నమ్మిన ఆ ఆటవికుడు ఒక స్త్రీగా అదీ బోయ యువతిగా జన్మించాల్సినంత పాపం మునివై ఉండి నీవెందుకు చేశావని సోమశర్మను అడిగాడు. అప్పుడు సోమశర్మ తన పూర్వకథను, శ్రీ మహావిష్ణువుకు తనకు జరిగిన సంవాదాన్ని, విష్ణువు వారిస్తున్నా మూర్ఖంగా మాయను తెలుసుకోవడానికి తాను చేసిన ప్రయాత్నాన్ని అంతటినీ వివరించాడు. సోమశర్మ ఇలా చెపుతుండగానే ఆ ఆటవికుడు అతడి వెంట వచ్చిన ఏడుగురు పిల్లలు, అంతకుముందు అక్కడ ఉన్న కుండ, వస్త్రాలు అన్నీ మాయమైపోయాయి. ఆశ్చర్యంలో మునిగిన సోమశర్మ శ్రీ మహావిష్ణువును తలుచుకుంటూ పదేపదే నమస్కారాలు చేస్తుండగా విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సోమశర్మ తాను భక్తుడై ఉండి అన్ని సంవత్సరాలపాటు అలా ఎన్నెన్నో కష్టాలను అనుభవించటం ఏమిటని, ఇదంతా ఎందుకు జరిగిందని విష్ణువును అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చిద్విలాసంగా నవ్వుతూ భగవంతుడు ఎప్పుడూ భక్తుడికి ఏంకావాలో అవి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంటాడని తానివ్వపోయిందికాక అనవసరంగా మాయాతత్వాన్ని గురించి తెలుసుకోవడం వల్లనే ఇదంతా జరిగిందని శ్రీ మహావిష్ణువు అన్నాడు. అంతేగాక ఒకానొక సందర్భంలో భక్తులను తులనాడిన పాపఫలితంగా కూడా సోమశర్మ కష్టాలను అనుభవించాల్సి వచ్చిందని చెప్పాడు. అయితే ఇదంతా తన మాయావిలాసమని ఇన్ని సంవత్సరాలకాలం జరగలేదని కేవలం కొద్దిసమయం కిందట మాత్రమే సోమశర్మ తనను మాయాతత్వాన్ని గురించి అడగటం జరిగిందని ఇన్ని సంవత్సరాల కాలం పాటు ఇన్ని కష్టాలు అనుభవించినట్లుగా అనుపించటం కూడా తన వైష్ణవమాయేనని శ్రీమహావిష్ణువు సోమశర్మకు వివరించి చెప్పి అతడికి వైకుంఠప్రాప్తి కల్పించాడు.
Read More

చాతుర్మాస్య వ్రత ప్రభావం

చాతుర్మాస్య వ్రత ప్రభావం

నైమిశారణ్యంలో మునులంతా కలిసి చిదానందుని స్తోత్రం చేసిన తర్వాత జ్ఞానసిద్ధుడు అనే ఒక మహాయోగి ”ఓ దీనబాంధవా! వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రాలుగా ఉన్నవాడివని, సర్వాంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వతా పూజలందుకునే వాడివని, సర్వాంతర్యామివని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుతున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారాలు. సకల ప్రాణకోటికి ఆధారభూతడవైన ఓ నందనందనా… మా స్వాగతం స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమాలు, మా నివాస స్థలాలు అన్నీ పవిత్రాలయ్యాయి. ఓ దయామయా! మేం ఈ సంసార బంధం నుంచి బయటపడలేకున్నాం. మమ్మల్ని ఉద్దరింపుము. మానవుడెన్ని పురాణాలు చదివినా… ఎన్ని శాస్త్రాలను విన్నా… నీ దివ్య దర్శనం దొరకజాలదు. నీ భక్తులకు మాత్రమే నీవు కనిపిస్తావు. ఓ గజేంద్ర రక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! నన్ను కాపాడుము” అని మైమరచి స్తోత్రము చేయడగా… శ్రీహరి చిరునవ్వుతో…. ”జ్ఞానసిద్ధా! నీ స్తోత్ర వచనానికి నేనెంతో సంతోషించాను. నీకు ఇష్టమైన ఒక వరం కోరుకో” అని పలికెను. అంతట జ్ఞాన సిద్ధుడు ”ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరం నుంచి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగలా కొట్టుకుంటున్నాను. కాబట్టి నీ పాదపద్మాలపై ధ్యానముండేట్లు అనుగ్రహించు. మరేదీ నాకు అవసరం లేదు” అని వేడుకొన్నాడు. అంతట శ్రీమన్నారాయణుడు ”ఓ జ్ఞాన సిద్ధుడా! నీ కోరిక ప్రకారం వరమిస్తున్నాను. అదేకాకుండా, మరో వరం కోరుకో… ఇస్తాను. ఈ లోకంలో అనేకమంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలుచేస్తున్నారు. అలాంటివారి పాపాలు పోవడానికి ఒక వ్రతం కల్పిస్తున్నాను. ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించొచ్చు. సావధానుడవై ఆలకించు…. నేను ఆషాఢ శుద్ధ దశిమిరోజున లక్ష్మీసమేతంగా పాలసముద్రంలో శేషశయ్యపై పవళిస్తాను. తిరిగి కార్తీకమాసం శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు అమిత ఇష్టమైనవి. చాతుర్మాస్యాల్లో ఎలాంటి వ్రతాలు చేయనివారు నరక కూపాలలో పడతారు. ఇతరులతో కూడా ఈ వ్రతాన్ని ఆచరింపజేయాలి. దీని మహత్యాన్ని తెలుసుకో. వ్రతం చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి. ఇక చాతుర్మాస్య వ్రతం చేసేవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమంగా ఆషాఢ శుద్ధ దశిమి మొదలు శాఖములు (కూరలు), శ్రావణ శుద్ధ దశిమి మొదలు పప్పుదినుసులు విసర్జించాలి. నాయందు భక్తిగలవారిని పరీక్షించడానికి నేను ఇలా ద్రవ్యాల నిషేధాన్ని విధించాను. ఆ కాలంలో నేను ఆయా ద్రవ్యజాల్లో శయనిస్తాను. నీను ఇప్పుడు నన్ను స్తుతించిన తీరున త్రిసంధ్యల్లో భక్తిశ్రద్ధలతో పఠించేవారు నా సన్నిధికి నిశ్చయంగా వస్తారు” అని శ్రీమన్నారాయణుడు తెలిపాడు. అనంతరం ఆయన మహాలక్ష్మితో కలిసి పాలసముద్రానికి వెళ్లి, శేషపాన్పుపై పవళించాడు.

తిరిగి వశిష్టుడు జనకమహారాజుతో ఇలా అంటున్నాడు… ”ఓ రాజా! ఈ విధంగా విష్ణుమూర్తి, జ్ఞాన సిద్ధుడు, మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్యాన్ని ఉపదేశించాడు. ఈ వృత్తాంతాన్ని ఆంగీరసుడు ధనలోభునికి తెలియజేశాడు. నేను నీకు వివరించాను. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి స్త్రీపురుష బేధం లేదు. అన్ని జాతుల వారు ఈ వ్రతాన్ని ఆచరించొచ్చు. శ్రీమన్నారాయణుడి ఉపదేశం ప్రకారం మునిపుంగవులంతా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి, ధన్యులయ్యారు. అనంతరం వైకుంఠ ప్రాప్తిని పొందారు” అని వశిష్టులు చెప్పారు.
Read More

అర్ధనారీశ్వరుడు

అర్ధనారీశ్వరుడు

శివుడు అర్ధనారీశ్వరుడుగా ఎందుకు అవతరించవలసి వచ్చింది? ఈ అవతరణం వెనుక ఉన్న రహస్యమేమిటి? అర్ధనారీశ్వరతత్వం మానవాళికి ఇచ్చే మహాసందేశమేమిటి? అనే విషయాలను విరించే కథ శివపురాణంలోని శతరుద్ర సంహితంలో కనిపిస్తుంది. నందీశ్వరుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడికి ఈ కథను వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయడం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు. కానీ అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవంపోస్తూ ఎంతకాలంగా తన పనిని తను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతిల్లిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రసన్నుడయ్యాడు. అయితే బ్రహ్మకు ఆ క్షణాన ప్రసన్నమైన శివుడు అంతకు ముందులా కాక ఒక తేజోవంతమైన విచిత్ర స్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. సగం పురుషుడు, సగం స్త్రీ రూపంగల దేహంతో ఆ శివస్వరూపం వెలుగొందసాగింది. పరమశక్తితో కూడి ఉన్న ఆ శంకరుడిని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాల స్తుతించాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మసృష్టికి సహకరించటానికే అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పాడు. అలా పలుకుతున్న శివుడి పార్శ్వభాగం నుండి ఉమాదేవి బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్తుతించి సృష్టి వృద్ధి చెందటం కోసం సర్వసమర్ధమైన ఒక రూపాన్ని ధరించమని తనకుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్ధించాడు. ఆమె బ్రహ్మను అనుగ్రహించింది. ఆ వెంటనే భవానీదేవి కనుబొమ్మల మధ్య నుండి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్యశక్తి అక్కడ అవతరించింది. అప్పుడా శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మతపస్సు చేసి మెప్పించాడు. కనుక ఆయన కోర్కెలను నెరవేర్చమని కోరాడు. పరమేశ్వరుని ఆ ఆజ్ఞను ఆమె శిరసావహించింది. బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆలోకంలో నారీ విభాగం కల్పితమైంది. స్త్రీ, పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుండి ప్రవర్తిల్లింది. స్త్రీశక్తి సామాన్యమైనది కాదని ప్రతివారు స్త్రీమూర్తులను గౌరవించి తీరాలని ఆది దేవుడు, ఆది పరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్ధ్యాలు కలిగి ఉన్నారో ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తిసామర్ధ్యాలు కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కధాసందర్భం వివరిస్తుంది. అంతేకాక సృష్టి స్థితి, లయ కారకులో సృష్టికర్తా అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన, దానివల్ల ఎక్కువ ఫలితం కలుగలేకపోయిందని పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని ఈ కథ వివరిస్తుంది. స్త్రీశక్తి విశిష్టతను తెలియజెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు. కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించటం కానీ, స్త్రీలను, స్త్రీ శక్తిని కించపరచటం కానీ ఎంతమాత్రమూ దైవ హితం కాదనే విషయాన్ని ఈ కధలో మనం గమనించవచ్చు.
Read More

Powered By Blogger | Template Created By Lord HTML