గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 31 July 2014

గణేశ భక్తులకు, గణేశ అనుగ్రహాన్ని త్వరగా పొందాలనుకునేవారు ఎవరికైనా మంచి యోగ కాలము..శ్రావణ శుక్ల చవితి

గణేశ భక్తులకు, గణేశ అనుగ్రహాన్ని త్వరగా పొందాలనుకునేవారు ఎవరికైనా మంచి యోగ కాలము..శ్రావణ శుక్ల చవితి (30.07.2014) నుండి భాద్రపద శుక్ల చవితి (వినాయక చవితి-29.08.2014) వరకు గల కాలం. ఈ నెల రోజులు ఎదో ఒక నియమం పాటించాలి. ఉదాహరణకు..గణేశుని నామం, అర్చన, జపం, దేవాలయ దర్శనం వంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏ దేవతా సాధన గానీ, యోగ సాధన గానీ సిద్ధించాలన్నా గణపతి అనుగ్రహం చాలా అవసరం. ముఖపుస్తక మిత్రులందరూ దీనిని గ్రహిస్తారని ఆశిస్తున్నాను.

గణేశునికి సంబధించి అనేక పురాణాలు ఉన్నాయి. గణేశ పురాణం, ముద్గల పురాణం, వినాయక పురాణం. "శ్రీ వినాయక పురాణం" శ్రీ వేదవ్యాస కృతమైనదే. ఆ గ్రంథం మా నాన్నగారు కీ.శే. బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మ గారికి శిథిలావస్థలో లభ్యమయ్యింది. దానిలోనున్న సంస్కృత శ్లోకాలను తెలుగు లిపిలో వ్రాసి భద్రపరిచేరు. ఇది 24 అధ్యాయాల గ్రంథం. ఇందులో గణేశుని ఏడు అవతారాలు వర్ణించబడ్డాయి. ఈ గ్రంథ పారాయణ ఉత్తమ ఫలితాలను ఇవ్వడం నా ప్రత్యక్షానుభవం కూడా. మహారాష్ట్రలో ఉన్న అష్టవినాయకులకు సంబంధించిన అవతార గాథలు కూడా ఇందులో వివరింపబడ్డాయి. దీనిని మా నాన్నగారు "గణేశాభ్యుదయం" పేరుతో పద్యకావ్యంగా వివిధమైన ఛందస్సులలో కూడా రచించేరు. పద్యాల పై మక్కువ కలవారికి అది ఒక ఆనంద సాగరం. ఈ మధ్యనే అది "ఋషిపీఠం" తరపున అది ముద్రితమైంది. వీలున్నంతంగా అందులోని విశేషాలను, కథలను తెలుసుకుంటూ... గణేశ పురాణాలలో ఉన్న మిగతా ఉపాసనా రహస్యాలను, కథలను తెలుసుకుందాం.

(1) మొదటి అవతారం-వక్రతుండావతారం: ఒకానొక ప్రళయ కాలంలో భువనమ్ములన్నీ జలమయములై ఉండగా పరమాత్మ మొదటగా సత్త్వ రజస్తమములనే 3 గుణాలని సృష్టించి వాటికి అధిష్ఠాన దేవతలుగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కూడా సృష్టించాడు. అందులో బ్రహ్మకు సృష్టి బాధ్యతను అప్పజెప్పేడు. పరమాత్మ చెప్పినట్లుగా సృష్టి కార్యం ఆరంభించిన బ్రహ్మకు అనేక రకాలుగా విఘ్నాలు భీకరమైన ఆకారములతో వచ్చి సృష్టికి ఆటంకం ఏర్పరచసాగాయి. వాటిని ఎదుర్కొనడానికి బ్రహ్మ చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. అప్పుడు పరమాత్మను ప్రార్థించగా..ఆ పరమాత్మ బ్రహ్మకు వక్రతుండుని ధ్యానయోగ్యమైన మూర్తిని చెప్పి తత్సంబధమైన మంత్రాన్ని ఉపదేశించాడు. బ్రహ్మ ఆ వక్రతుండునే ధ్యానిస్తూ ఆ మంత్రాన్ని రాత్రి, పగలు కూడా క్రమం తప్పకుండా 12 సంవత్సరములు ఉపాసించాడు. అప్పుడు భక్తవత్సలుడైన వక్రతుండుడు విరాడ్రూపంతో ఎర్రని దేహముతో, ఎర్రని కనులతో, ఏనుగు ముఖముతో, కోటి సూర్యుల వెలుగుతో, కోటి చంద్రుల చలువతో..సింహ వాహనారూఢుడై ప్రత్యక్షమై, ఆ విఘ్నాలను తొలగించి బ్రహ్మను సృష్టి కార్యము ప్రారంభింపుమనెను. అప్పుడు బ్రహ్మ గణేశుడు ఇచ్చిన శక్తితో ఇరువురు కన్యలను సృష్టించి వారికి సిద్ధి, బుద్ధి అని పేరుపెట్టి గణేశునకు అప్పగించేడు. వారిని గణేశుడు తన శక్తులుగా (భార్యలుగా) స్వీకరించి బ్రహ్మను అనుగ్రహించాడు. వంకరగా ఉన్న అనేక విఘ్నాలను తొలగించడం వలన గణేశునికి `వక్రతుండుడు ' అని పేరు వచ్చింది. మన ఏ సాధనకైనా వచ్చే అనేక వక్రములను ఖండించువాడు కనుక వక్రతుండుడు . అంతేకాక సృష్టి నాద ప్రధానమైనది . అన్ని నాదాలకు మూలమైన ఓం కార స్వరూపుడు వక్రతుండుడు . ఈ నామ విశేషం ఇంకా చాలా ఉంది. "వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా" అని ప్రార్థించుకుందాం.
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML