గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Thursday, 31 July 2014

తిరుమల

తిరుమల

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు. [1]. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి.

తిరుమల కలియుగ వైకుంఠం అని భక్తుల విశ్వాసం. కలియుగంలో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలో స్వయంభువు గా అవతరించాడని భవిష్యోత్తరపురాణం లోని శ్రీ వేంకటాచల మహత్యం కథనం. తిరుమల వేంకటేశ్వరుని శ్రీనివాసుడు, బాలాజీ అని కూడా పిలుస్తారు. శ్రీవారు అని కూడా అంటారు. మొట్ట మొదటగా, వైఖానస అర్చకుడు శ్రీ మాన్ గోపీనాథ దీక్షితుల వారు (శ్రీ వేంకటాచల మహాత్యం అనుసరించి), శ్రీవారి మూర్తి ని స్వామి పుష్కరిణి చెంత, చింత చెట్టు క్రింది చీమల పుట్ట లో కనుగొని, శ్రీవారి మూర్తి ని ప్రస్తుతం వున్న ప్రదేశం లో ప్రతిష్టించి, అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అప్పటి నుండి శ్రీ గోపీనాథ దీక్షితులు యొక్క వంశీయులే పరంపర గా స్వామి వారి పూజా కైంకర్యాల నిర్వహణ చేస్తున్నారు. తిరుమల ఆలయం లోని మొదటి ప్రాకారం (విమాన ప్రాకారం), ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.

దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవ రాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.

“ వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన !
వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి !!


స్థల పురాణం

శ్రీవారి పాదముల నుండి తిరుమల దృశ్యము
ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయు దేవుడు, వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి, మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళవాళ్ళ గొప్పతనం చెప్పుకొంటారు. మహావిష్ణువు వారికి పరీక్షగా మేరు పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకొమని చెప్పి, వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడ నుండి కదిలించమని పరీక్షపెడతాడు. ఆ పరీక్షకు సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖబ్రహ్మ, ఇంద్రాది దేవతల కోరికమేరకు ఆదిశేషువు ఆనందపర్వతం మీద తన పట్టు సడలించి పరీక్షనుంచి విరమిస్తాడు. దాని ఫలితంగా ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడనుండి వెళ్ళి స్వర్ణముఖీ నది ఒడ్డున పడుతుంది. ఇది తెలుసుకొని ఆదిశేషువు బాధ పడతాడు. ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వేంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడ మహావిష్ణువు వెలస్తాడు అని చెబుతాడు. ఆదిశేషువు వేంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు పడగ భాగంలో (శేషాద్రి) శ్రీమహావిష్ణువు వెలశారు, శేషువు మధ్య భాగంలో అహోబిలంలో శ్రీ నారసింహమూర్తి, తోక భాగంలో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జునస్వామిగా వెలశారు.

చరిత్ర
మరింత సమాచారం: తిరుమల చరిత్ర వ్యాసంలో

తిరుపతిలో హాథీరాంజీ మఠం... భవనము
19 వ శతాబ్దాంతానికి... కొండపైన శ్రీవారి ఆలయం, హథీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలూ ఉండేవి కావు. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ, గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడిన తితిదే బోర్డు రూ.26 వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. 1980 లో తితిదే బోర్డు ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుద్దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేసింది.

15 వందల ఏళ్ల నుండి తిరుమల, పాలకుల ఆదరణకు నోచుకుంటూ ఉంది. క్రీ.శ.614. పల్లవ రాణి సామవై కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్దారణ కావింపబడింది. సామవై పెరిందేవి క్రీ.శ. 614 లో భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని బహుకరించింది. అక్కడి అర్చకులు సూచించిన విధంగా ఈ విగ్రహాన్ని బహుకరించి శ్రీ వైఖనస భగవఛ్ఛాస్త్రోక్తంగ ప్రతిష్టింపజేసింది. ఇదే తిరుమల ఆలయం లో మొట్టమొదటి కానుక గ దేవాలయం లో ని గోడల మీది శాసనం వలన తెలుస్తోంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు క్రీ.శ.1328లో, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాధయాధవరాయలు క్రీ.శ.1429లో, హరిహరరాయలు క్రీ.శ. 1446లోను బ్రహ్మోత్సవాలు నిర్వహించారు.

సాళువ నరసింహరాయలు 1470 లో భార్య, ఇద్దరు కుమారులు, తన పేర్లతో సంపగి ప్రదక్షిణం నాలుగు మూలలో నాలుగు స్థంభాల మండపాలను నిర్మించాడు. 1473లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.1513 నుండి 1521 వరకు ఏడు సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుత రాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించాడు, ఆలయానికి ఎన్నో గ్రామాలు, భూములను కానుకగా ఇచ్చాడు. తిరుమల రాయలు 16వ శతాబ్దం చివరలో, అన్నా ఊయల మండపాన్ని విస్తరింపజేసి, ఉత్సవాలు నిర్వహించాడు. వెంకటపతి రాయలు 1570లో చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు.

విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్నాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజామ్ కు కట్టవలసిన పన్నులను సమకూర్చుకునేందుకు, ఆలయంపై పన్నులు విధించాడు. ఈ విషయంగా మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు. 1740లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీన పరచుకుని, స్వామివారికి ఎన్నో అమూల్య ఆభరణాలు సమర్పించాడు. తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈస్టిండియా కంపెనీ వారి ఆధీనంలోకి వచ్చింది. 1841లో ఆంగ్లప్రభుత్వం హిందూ మతసంస్థలలో జోక్యం చెసుకోకూడదని చట్టం చేసినందున అలయ నిర్వహణను మహంతులకు అప్పజెప్పారు.

90 ఏళ్ళ పాటు మహంతుల నిర్వహణ తరువాత,1933లో అప్పటి గవర్నర్ ధర్మ కర్తల మండలిని ఏర్పాటు చేసి ఆలయ నిర్వహణ బాధ్యతను అప్పజెప్పారు.
Read More

ఆత్మ-పరమాత్మ కలుస్తాయా?

ఆత్మ-పరమాత్మ కలుస్తాయా?

నిద్రపోతున్నపుడు మన ఆత్మ పరమాత్మతో కలుస్తుందని మన వేదాంత శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కానీ, నిజంగానే ఈ రెండు ఒక్కటిగా కలుస్తాయా అనే ధర్మ సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. నిజంగానే ఈ రెండు కలుస్తాయట. ఇదెలాగంటారా... అయితే ఈ కథనం చదవండి. 

సాధారణంగా మన శరీరాల్లో ఐదు కోశాలుంటాయని వేదాంత శాస్త్రం చెపుతోంది. అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఇవి పొరపొరలుగా ఉంటాయి. అన్నింటికన్నా పై పొర అన్నమయ కోశం. అన్నిటికన్నా లోపలి పొర ఆనందమయ కోశం. ఒక దానిలో ఒకటి ఇమిడిపోయే లక్క పిడతల్లాగా ఉంటాయట.

వీటిలో నాలుగోది విజ్ఞానమయ కోశం. అంటే ఆత్మ. ఐదోది ఆనందమయ కోశం. అంటే పరమాత్మ. ఇందులో ముందు మూడు కోశాలు దేహం, మనస్సు, ప్రాణం అంటారు. అంటే దేహం, మనస్సు, ప్రాణం, ఆత్మ , పరమాత్మ వరుసలో ఉంటాయి. దీనికితోడు ఇంద్రియాలన్నింటినీ కలిగి వుండేదే దేహం. నాలుగో తొడుగు అయిన ఆత్మ మనం మెలకువగా ఉన్నపుడు దేహం, మనస్సుల వైపు అంటే విషయాల వైపు తిరిగి ఉంటుందట.

అదే గాఢ నిద్రలో ఉన్నపుడు దేహం, ఇంద్రియాలు, మనస్సు విశ్రాంతి తీసుకుంటాయి. ఆ సమయంలో ఆత్మ పరమాత్మ వైపు అంటే విజ్ఞానమయ కోశం అయనందున ఆనందమయ కోశానికి అభిముఖం అవుతుంది. మన రెండు అరచేతులు కలిపి నమస్కరించినట్టన్నమాట. అదే ఆత్మ పరమాత్మను కలత లేని, నిలకడ గల గాఢ సుఘుప్తిలో చేరుకోవడం. అంటే ఆత్మ పరమాత్మలు గాఢ నిద్రలో కలుస్తాయన్నటమాట.
Read More

లక్ష్మీదేవి పూజా విధానం

లక్ష్మీదేవి పూజా విధానం

పసుపు గణపతి పూజ
శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)

శ్లో // అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
(గంటను మ్రోగించవలెను)

ఆచమనం
ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ //
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ //
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే //

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే //

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ప్రాణాయామము
(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం
ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత

వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును

చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక

చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ

(ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ

గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య

ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా

నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీ మహా లక్ష్మి దేవతా

ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే
కలశారాధనం
శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)

శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది

మంత్రము చదువవలెను.)మం // ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

(అక్షతలు వేయవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి

(గంధం చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ

నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః,

స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.
మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

(అగరవత్తుల ధుపం చూపించవలెను.)

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

(నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.

(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)

ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)

ప్రాణప్రతిష్ఠపన మంత్రము


అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ మిహనోధేహి భోగం
జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానస్వస్తి
అమృతమాపః ప్రాణానేన యధాస్థాన ముపహ్యయతే
రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః
పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్
బిబ్రాణా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా
దేవీబాలార్కవర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః //

సాంగాం సాయుధాం సపరివారాం శ్రీ మహాలక్ష్మీ పరదేవతాం ఆవాహితాః స్థాపితాః సుప్రితా సుప్రసన్నా వరదాభవతు.

(సమాప్తం.)

దేవి షోడశోపచార పూజవిధి
ఆచమనం

ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
(స్త్రీలు స్వాహాకి బదులు గా నమః అని చెప్పవలెను)

ఓం గోవిందాయ నమః,విష్ణవే నమః,
మధుసూదనాయ నమః,త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః,శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

సంకల్పం

ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత

వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును

చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక

చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ

(ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ

పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం

ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా

నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,సర్వదేవతా స్వరూపిణీ శ్రీ మహా

లక్ష్మి ప్రీత్యర్ధం యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)
కలశారాధనం

శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.
కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)

శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా, పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.)
ధ్యానం:
(పుష్పము చేతపట్టుకొని)

పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే
నారాయణ ప్రియేదేవి సుప్రీతా భవసర్వదా
లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాంలోకైక దీపాంకురాం
శ్రీమన్మన్ద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాంత్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్ //
శ్రీలక్ష్మీదేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి
(పుష్పము వేయవలెను).
నమస్కారమ్
(పుష్పము తీసుకొని)

క్షీరదార్ణవ సంభూతే శ్రీప్రదే కమలాలయే /
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే // శ్రీలక్ష్మీ దైవ్యై నమః నమస్కారమ్ సమర్పయామి.
(పుష్పము వేయవలెను.)
ఆవాహనం:

ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజితస్రజాం
చంద్రాం హిరణ్మయీం జాతవేదో మ మావహ
శ్లో. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షః స్థలాలయే /
ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా //
శ్రీలక్ష్మీ దేవ్యై నమః ఆవాహయామి
(పుష్పము వేయవలెను).
రత్నసింహాసనం:

తాం ఆవహజాతదో లక్ష్మీమనపగామినీమ్
యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహమ్
శ్లో//సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే
రత్న సింహాసనమిధం దేవీ స్థిరతాం సురపూజితే
శ్రీలక్ష్మీదేవ్యై నమః రత్నసింహాసనం సమర్పయామి
(అక్షతలు వేయవలెను.)
పాద్యం:

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రభోధినీం
శ్రియం దేవీముపహ్వమే శ్రీర్మాదేవిజుషతాం
శ్లో//సువాసితం జలంరమ్యం సర్వతీర్థ సముద్భవం
పాద్యం గృహణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే
శ్రీలక్ష్మీదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి
(నీరు చల్లవలెను.)
అర్ఘ్యం:

కాంసోస్మి తాం హిరణ్య ప్రాకార మార్ద్రాంజ్వలంతిం తృప్తాం తర్పయంతీం
పద్మేస్ఠఃఇతాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం
శ్లో//శుద్దోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దాశ్యామి తే దేవి గృహణ సురపూజితే
శ్రీలక్ష్మీదేవ్యై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి
(నీరు చల్లవలెను.)
ఆచమనం:

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతిం శ్రియంలోకేదేవజుష్టా ముదారం
తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీ ర్మేనశ్యతాం త్వాం వృణే.

శ్లో//సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతాం
గృహణాచమనం దేవిమయాదత్తం శ్భప్రదే
శ్రీలక్ష్మీదేవ్యై నమః శుద్దాచమనీయం సమర్పయామి
(నీరు చల్లవలెను.)
మధుపర్కం:
(పెరుగు,తేనె,నేయి,నీరు,పంచదార వీనిని మధుపర్కం అంటారు.)

శ్లో//మధ్వాజ్యదధిసంయుక్తం శర్కరాజలసంయుతం
మఢఃఉపర్కం గృహాణత్వం దేవి నమోస్తుతే
శ్రీలక్ష్మీదేవ్యై నమః మధుపర్కం సమర్పయామి
(పంచామృత స్నానానికి ముందుగా దీనిని దేవికి నివేదన చేయాలి.పంచామృతాలతో సగం అభిషేకించి మిగిలిన దనిని దేవికి నైవేద్యంలో నివేదన చేసి

స్నానజలంతో కలిపి ప్రసాద తీర్ధంగా తీసుకోవాలి.)
పంచామృతస్నానం:

శ్లో//ఓం ఆప్యాయస్య సమేతు తే విశ్వతస్సోమ
వృష్టియంభవావాజస్య సంగథే
శ్రీలక్ష్మీదేవ్యై నమః క్షీరేణ స్నపయామి.
(దేవికి పాలతో స్నానము చేయాలి)

శ్లో//ఓం దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణరశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్ప్రన ఆయూగం షి తారిషత్
శ్రీలక్ష్మీదేవ్యై నమః దధ్నా స్నపయామి.
(దేవికి పెరుగుతో స్నానము చేయాలి)

శ్లో//ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా
తచ్చి ద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్శిభిః
శ్రీలక్ష్మీదేవ్యై నమః అజ్యేన స్నపయామి.
(దేవికి నెయ్యితో స్నానము చేయాలి)

శ్లో// ఓం మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః
మాధ్వీర్నస్సంత్వోషధీః,మధునక్తముతోషసి మధుమత్పార్థివగంరజః
మధుద్యౌరస్తునః పితా,మధుమాన్నొ వనస్పతిర్మధుమాగుం
అస్తుసూర్యః మాధ్వీర్గావో భ్వంతునః
శ్రీలక్ష్మీదేవ్యై నమః మధునా స్నపయామి.
(దేవికి తేనెతో స్నానము చేయాలి)

శ్లో//ఓం స్వాదుః పవస్వ దివ్యాజన్మనే స్వాదురింద్రాయ సుహవీతునమ్నే,
స్వాదుర్మిత్రాయ వరుణాయవాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః
శ్రీలక్ష్మీదేవ్యై నమః శర్కరేణ స్నపయామి.
(దేవికి పంచదారతో స్నానము చేయాలి)

ఫలోదకస్నానం:

శ్లో//యాః ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగం హసః
శ్రీ దుర్గాదేవ్యైనమః ఫలోదకేనస్నపయామి.
(దేవికి కొబ్బరి నీళ్ళుతో స్నానము చేయాలి)

శ్రీలక్ష్మీదేవ్యై నమః పంచామృత స్నానాంతరం శుద్దోదక స్నానం సమర్పయామి.
స్నానం:

ఆదిత్యవర్ణే తపోసోధి జాతో వనస్పతి స్తవవృక్షో థబిల్వః
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ
శ్లో//గంగాజలం మయానీతం మహాదేవ శిరస్ఠఃఇతం
శుద్దోదక మిదం స్నానం గృహణ సురపూజితే
శ్రీ లక్ష్మీదేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి
(దేవికి నీళ్ళుతో స్నానము చేయాలి/ నీరు చల్లాలి)
వస్త్రం:

ఉపై తుమాం దేవ సఖః కీర్తిశ్చ మణినాసహ
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రేస్మికీర్తిమృద్ధిం దదాతుమే.

శ్లో//సురార్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహణ సురపూజితే
శ్రీ లక్ష్మీదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి
ఉపవీతం:

క్షుత్పిపాసా మలాంజ్యేష్టాం అలక్ష్మీర్నాశయా మ్యహం
అభూతి మసమృద్ధించ సర్వా న్నిర్ణుదమే గృహతే
శ్లో//తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ వీభూషితం
ఉపవీతం ఇదం దేవి గృహణత్వం శుభప్రదే
శ్రీలక్ష్మీదేవ్యై నమః ఉపవీతం (యజ్ఞోపవీతం) సమర్పయామి.
గంధం:

గంధం ద్వారాందురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం
ఈశ్వరీగం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియం.
శ్లో//శ్రీఖంఠం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం
విలేపనం సురశ్రేష్ఠే చందనం ప్రతిగృహ్యతాం
శ్రీలక్ష్మీదేవ్యై నమః గంధం సమర్పయామి
(గంధం చల్లవలెను.)
ఆభరణములు:

శ్లో//కేయూర కంకణ్యైః దివ్యైః హారనూపుర మేఖలా
విభూష్ణాన్యమూల్యాని గృహాణ సురపూజితే
శ్రీలక్ష్మీదేవ్యై నమః ఆభరణార్ధం అక్షతాన్ సమర్పయామి.
(పుష్పములు, అక్షతలు సమర్పించవలెను)
అక్షతాః :

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్
హరిద్రాకుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధి పుత్రికే //
శ్రీలక్ష్మీదేవ్యై నమః అక్షతాన్ స్మర్పయామి
(అక్షితలు వేయవలేను.)
పుష్పసమర్పణం (పూలమాలలు):

కర్దమేన ప్రజాభూతామయి సంభవకర్దము
శ్రియం వాసయ మేకులే మాతరం పద్మమాలినీమ్ //
శ్లో//మల్లికాజాజి కుసుమైశ్చ చంపకా వకుళైస్థథా
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరప్రియే
శ్రీలక్ష్మీదేవ్యై నమః పుష్పాంజలిం సమర్పయామి.
(పుష్పాములు వేయవలెను)
పసుపు:

అహిరివభోగైః పర్యేతి బాహుం జ్యాయాహేతిం పరిబాధ్మానః
హస్తఘ్నో విశ్వావయునాని విద్వాన్ పుమాన్ పుమాగంసం పరిపాతు విశ్వతః //
హరిద్రా చూర్ణమేతద్ది స్వర్ణకాంతి విరాజితం
దీయతే చ మహాదేవి కృపయా పరిగృహ్యతామ్ //
శ్రీలక్ష్మీదేవ్యై నమః హరిచంద్రాచూర్ణం సమర్పయామి.
కుంకుమ:

యాగం కుర్యాసినీవాలీ యా రాకా యా సరస్వతీ
ఇంద్రాణీ మహ్య ఊత మేవరూణానీం స్వస్తయే //
శ్రీలక్ష్మీదేవ్యై నమః కుంకుమ కజ్జలాది సుగంద ద్రవ్యాణి సమర్పయామి.

అథాంగపూజా:

చంచలాయై నమః పాదౌ పూజయామి
చపలాయైఅ నమః జానునీ పూజయామి
పీతాంబర ధరాయై నమః ఊరూ పూజయామి
కమలవాసిన్యై నమః కటిం పూజయామి
పద్మాలయాయై నమః నాభిం పూజయామి
మదనమాత్రే నమః స్తనౌ పుజయామి
లలితాయై నమః భుజద్వయం పూజయామి
కంబ్కంఠ్యై నమః కంఠం పూజయామి
సుముఖాయై నమః ముఖం పూజయామి
శ్రియై నమః ఓష్ఠౌ పుఅజయామి
సునాసికాయై నమః నాసికం పూజయామి
సునేత్రాయై నమః ణెత్రే పూజయామి
రమాయై నమః కర్ణౌ పూజయామి
కమలాలయాయై నమః శిరః పూజయామి
ఓం శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి
తదుపరి ఇక్కడ దేవి అష్టోత్తరము చదువవలెను.
తదుపరి ఈ క్రింది విధము గా చేయవలెను
ధూపం:

అపస్రజంతు స్నిగ్థాని చిక్లీతవసమేగృహే
నిచదేవీం మాత్రం శ్రియం వాసయ మేకులే //

శ్లో//వనస్పత్యుద్భవైర్ధివ్యై ర్నానాగందైః సుసంయుతః
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
శ్రీలక్ష్మీదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి.
దీపం:

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ //
ఘృతాక్తవర్తి సంయుక్తం అంధరాశి వినాశకం //
దీపం దాస్యామి తే దేవి గృహణ ముదితాభవ //
శ్రీలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి //
నైవేద్యం:

ఆర్ద్రాంపుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలీనీమ్
చంద్రాం హిరన్మయీం లక్ష్మీం జాతవేదోమమా అవహ.

శ్లో//అన్నం చతురిధం స్వాదు రసైః సర్పిః సమనిత్వం
చంద్రాం హిరణ్మయీం జాతవేదో మమావహ //
షడ్రసోపేతరుచిరం దధిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే //
శ్రీలక్ష్మీదేవ్యై నమః మహానైవేద్యం సమర్పయామి //
నైవేద్యం గృహ్యతాం దేవి భక్తిర్మే హ్యచలాంకురు
(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)

ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా
ఓం సమనాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అమృతాభిధానమపి - ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ పక్షాళయామి - పాదౌ ప్రక్షాళయామి - శుద్దాచమనీయం సమర్పయామి.
పానీయం :

ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యతాందేవి శీతలం సుమనోహరమ్ //
శ్రీలక్ష్మీధేవ్యై నమః పానీయం సమర్పయామి //
తాంబూలం:

తాంమ అవహజాతవేదో లక్ష్మీ మనపగామినీమ్ /
యస్యాం హిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహమ్ //

శ్లో//పూగీఫలైశ్చ కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతం
కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీలక్ష్మీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి /
నీరాజనం:

సమ్రాజంచ విరాజం చాభి శ్రీర్యాచనో గృహే
లక్ష్మీరాష్ట్రస్య యాముఖే తయామాసగం సృజామసి /

శ్లో//నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహేణ సురపూజితే
సంతత శ్రీరస్తు,సమస్తమంగళాని భవంతు,నిత్యశ్రీరస్తు,నిత్యమంగళాని భవంతు.
శ్రీలక్ష్మీ దేవ్యై నమః నీరాజనం సమర్పయామి //
(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)
మంత్రపుష్పమ్:

జాతవేదసే సుననామ సోమమరాతీయతో నిదహాతి వేదః /
సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః //
తామగ్ని వర్ణాం తపసాజ్వలంతీం వైరో చనీం కర్మ ఫలేషు జుష్టామ్
దుర్గాం దేవీగం శరణమహం పపద్యే సుతరసి తరసే నమః
అగ్నే త్వం పారయా నవ్యో అస్మాన్ స్వస్తిభి రతి దుర్గాణి విశ్వా
పూశ్చ పృథ్వీ బహులాన ఉర్వీ భవాతోకాయ తనయాయ శంయోః
విశ్వాని నోదుర్గహా జాతవేద స్సింధుం ననావా దురితాతి పర్షి
అగ్నే అత్రివన్మనసా గృహణానో స్మాకం బోధ్యవితా తనూనామ్
పృతనాజితగం సహమాన ముగ్ర మగ్నిగం హువేమ పరమాత్సధస్దాత్
సనః పర్షదతి దుర్గాణి విశ్వక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః
ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి
స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యంచ సౌభగ మాయజస్వ
గోభి ర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణొ రనుసంచరేమ
నాకస్య పృష్ఠ మభిసంవసానో వైష్ణవీం లోక ఇహ మదయంతామ్
'లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం" ఇత్యాది పఠింపవలెను.

శ్రీలక్ష్మీదేవ్యై నమః సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి.
ప్రదక్షిణ
(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)

శ్లో//యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి
శ్రీలక్ష్మీదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
సాష్టాంగ నమస్కారం:

నమస్తే లోకజనని నమస్తే విష్ణు వల్లభే
పాహిమాం భక్తవరదే శ్రీలక్ష్మ్యైతే నమో నమః
శ్రీలక్ష్మీదేవ్యై నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి
ప్రార్ధనం:

శ్లో// సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి స్వరూపిణి
పూజాం గృహాణ కౌమురి జగన్మాతర్నమోస్తుతే
శ్రీలక్ష్మీదేవ్యై నమః ప్రార్దనాం సమర్పయామి
సర్వోపచారాలు:

చత్రమాచ్చాదయామి,చామరేణవీచయామి,నృత్యందర్శయామి,
గీతంశ్రాపయామి,ఆందోళికంనారోహయామి
సమస్తరాజోపచార పూజాం సమర్పయామి.
శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వోపచారాన్ సమర్పయామి
క్షమా ప్రార్థన:
(అక్షతలు నీటితో పళ్ళెంలో విడువవలెను)

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశవ్రి
యాత్పూజితం మాయాదేవీ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మిక
శ్రీలక్ష్మీదేవ్యై నమః సుప్రీతా స్సుప్రసన్నో వరదో భవతు సమస్త సన్మంగళాని భవంతుః
శ్రీ దేవి పూజావిధానం సంపూర్ణం
(క్రింది శ్లోకమును చదువుచు అమ్మవారి తీర్థమును తీసుకొనవలెను.)

అకాల మృత్యుహరణమ్ సర్వవ్యాది నివారణం
సర్వపాపక్షయకరం శ్రీదేవి పాదోదకం శుభమ్ //
(దేవి షోడశోపచార పూజ సమాప్తం.)

శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళిఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్దాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై / వాచే నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం పద్మాయై /శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై
Read More

శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేయాలి?

శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేయాలి?
శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం ముఖ్యంగా శ్రావణ రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం, ఆయుష్యు బాగుంటుందని మహిళల విశ్వాసం. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు, గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూళం, శెనగలు ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగాదలిచి గౌరవిస్తారు.శ్రావణ మాసంలో గోవులు, తామరపుష్పాలు, పాడిపంటలు, ఏనుగులు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలనూ అర్చించే వారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పువ్వులు, పండ్లతోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళవాద్యాలు, దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరిత వర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి, శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇళ్లు, బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయపాలనలోనూ మహాలక్ష్మీ దేవి నివసిస్తుందని పురోహితులు చెబుతున్నారు.
అందుచేత శ్రావణ శుక్రవారం పూట తులసీపూజ, ఆలయాల్లో పాలు, తేనెతో అభిషేకాలు చేయించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు సూచిస్తున్నారు. శ్రావణ శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి.
గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజా సమయంలో దుర్గాష్టకం లేదా ఏదేని అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి.
ఇంకా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసముండి, అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురోహితులు అంటున్నారు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మీ లేదా అమ్మవారిని ఆలయాల్లో దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.
అంతేగాకుండా.. మల్లెపువ్వులు, కస్తూరి, జాజిపువ్వులను అమ్మవారి కోసం సమర్పించి, నేతితో దీపమెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు
Read More

ఆ శ్రీ మహా విష్ణుమూర్తే సమస్త సృష్టి :

సృష్టి అంతా విరాట్‌ స్వరూపుడైన ఆదినారాయణుడి నుంచి అవతరించినదే. ఆ ఆదినారాయణుడి రూపమే అనేక భగవదావతారాలుగా కూడా ఆవిర్భవించింది. అవతారాలన్నీ అవి నిర్వర్తించాల్సిన పని అయిపోయాక తిరిగి ఆ స్వరూపంలోనే కలిసిపోతుంటాయి. విరాట్‌ స్వరూపం సూక్ష్మాంశలోనే దేవతలు, పశువులు, పక్షులు, మనుషులు లాంటి సకల సృష్టి పుడుతూ ఉంటుంది.

ఆ ఆదినారాయణ స్వరూపం ప్రధానంగా ఓ ఇరవై రెండు అవతారాలుగా అవతరించిన విషయాన్ని మహాభాగవతం ప్రధమ స్కందం ఇలా వివరిస్తోంది.
విరాట్పురుషుడు తన మొదటి అవతారంలో శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలతో అఖండమైన బ్రహ్మచర్యాన్ని పాటించేందుకు బ్రాహ్మణుడై అవతరించాడు.

రెండో అవతారంలో యజ్ఞేశ్వరుడైన ఆయన లోకకల్యాణం కోసం వరాహ రూపాన్ని ఎత్తి భూమండలాన్ని నీటిలో మునిగిపోకుండా ఉద్ధరించాడు.

మూడో అవతారంలో దేవర్షి నారదుడిగా అయ్యాడు. కర్మ బంధాల నుంచి విముక్తి కలిగించే వైష్ణవ తంత్రాన్ని ఆనాడు ఉపదేశించాడు.

నాలుగో అవతారంలో ధర్ముడికి మూర్తి గర్భాన నరనారాయణులుగా పుట్టారు.

ఐదో అవతారంలో సిద్ధేశ్వరుడైన కపిలుడిగా జన్మించాడు. సాంఖ్యయోగాన్ని ఆనాడు ఉపదేశించాడు.

ఆరో అవతారంలో అత్రి, అనసూయలకు దత్తాత్రేయుడిగా జన్మించాడు. ఈ అవతారంలోనే అలర్కుడికి ఆధ్యాత్మ విద్య నేర్పాడు.

ఏడో అవతారంలో రుచి, అకూతి దంపతులకు యజ్ఞరూపంలో జన్మించాడు.

ఎనిమిదో అవతారంలో నాభి రాజు కుమారుడిగా వృషభుడు అనే పేరున జన్మించాడు. ఆశ్రమ ధర్మాలను, జ్ఞానాన్ని బోధించాడు.

తొమ్మిదో అవతారంలో పృధువు అనే రాజుగా జన్మించి భూమిని గోవుగా చేసి ఓషధులను పితికాడు.

పదో అవతారంలో మత్స్యావతారాన్ని ధరించి వైవస్వత మనువును రక్షించాడు.

పదకొండో అవతారంలో ధన్వంతరిగానూ,

పన్నెండు, పదమూడు అవతారాలలో రాక్షసులను మోహంలో పెట్టేందుకు, దేవతలకు అమృతం పంచేందుకు మోహినిగానూ అవతరించాడు.

పద్నాలుగో అవతారంలో నరసింహుడై అవతరించి హిరణ్యాక్షుడిని సంహరించాడు.

పదిహేనులో వామనమూర్తి అయి బలిచక్రవర్తిని అణిచాడు.

పదహారులో పరశురాముడిగా అవతరించాడు.

పద్దెనిమిదో అవతారంలో శ్రీరాముడిగా జన్మించి రావణ సంహారం లాంటి అనేక అద్భుత కార్యాలను సాధించాడు.

పందొమ్మిది, ఇరవై అవతారాలలో కృష్ణ బలరాములుగా జన్మించి భూభారాన్ని తగ్గించాడు. ఇరవై ఒకటో అవతారంగా బుద్ధుడై పుట్టాడు.

ఆయన ఇరవై రెండో అవతారమే కల్క్యావతారం.

ఈ ఇరవై రెండింటికీ హంస, హయగ్రీవ అనే మరో రెండు చేర్చి ఆ భగవంతుడి అవతారాలు ఇరవై నాలుగు అని కొందరు అంటుంటారు.

భగవంతుడి అవతారాలు అనంతమని, ధర్మ రక్షణకోసం ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అలా ఆ స్వామి అవతరిస్తుంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఆదినారాయణుడి విరాట్‌ స్వరూపం నుంచి లెక్కలేనన్ని అవతారాలు ఉద్భవిస్తుంటాయి. రుషులు, ప్రజాపతులు, మనుషులు… ఇలా అన్నీ ఆ భగవంతుడి అవతారాలే. ఆ ఆదినారాయణుడినే శ్రీకృష్ణుడని అంటారు. అందుకే ఆ కృష్ణుడిని పరబ్రహ్మ స్వరూపుడని, సకలసృష్టి కర్త అని పండితులు, వేదవిదులు నిత్యం కీర్తిస్తుంటారు. భగవంతుడికి రూపం లేదు. భూమి మీద ధూళి, వాయువుకు రూపం ఉన్నట్లు కనిపించిన తీరులో భ్రమతో భగవంతుడికి దృశ్యత్వాన్ని కల్పిస్తుంటారు. వాస్తవానికి భగవంతుడికి జన్మ, కర్మలు ఉండవు. అయినా ఆ జన్మ కర్మలుంటాయని వర్ణిస్తుంటారు. ఇదంతా వేద రహస్యమని పండితులు విశ్లేషిస్తున్నారు
Read More

నోముల కోసం-శ్రావణ మాసం

నోముల కోసం-శ్రావణ మాసం
సాక్షాత్తు విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన 'శ్రవణం' సమీపమున చంద్రుడు చరించు మాసమే శ్రావణ మాసము. శ్రావణ భాద్రపద మాసములు వర్షబుతువు.
ఆధ్యాత్మికముగా, సాంఘికముగా ఈ మాసము అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. స్త్రీల సాన్నిహిత్యమునకు ఇదొక రాచబాట. మహిళల నేకీకృతము చేయు చక్కని జీవన సరళికిది సోపానము.
ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనవి, శుభప్రదమైనవి. పసుపురాసి కుంకుమ సుద్ద బొట్లతో, మంగళ తోరణములతో గడపలను, ద్వారబంధాలను అత్యంత శోభాయమానంగా అలంకరించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుచున్నట్లు ముంగిళ్ళను అందాల రంగవల్లులతో సిద్ధము చేయుదురు. ఇది వ్రతముల నెల. ఈ నెలంతయు ఒంటిపూట భోజనము ఆచరించిన మేలు.
ఈ మాసమున ప్రతి దినము సువాసినులు సుస్నాతులై భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి నర్పించుట సౌభాగ్యదాయకము. ముఖ్యముగా ఈ నెలలోని మంగళవారములు చాలా ప్రశస్తమైనవి. విష్ణ్వారాధాన,శివారాధనలు విశేష ఫలితము లొసంగును.
శ్రావణమాస సోమవారము చాలా మహిమాన్వితమైనది.
శ్లో్ప్ప తత్రాపి దుర్లభం మన్యే నభో మాసేందువాసరే్ప
సోమవార వ్రతం కార్యం శ్రావణే వై యథావిధి్ప
శక్తేనోపోషణం కార్యం అథవా నిశి భోజనమ్‌్ప్ప
వివాహితలు తమ మాంగల్య బలము కొరకు -
శ్లో్ప్ప మంగళం మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే్ప
మంగళార్థం మంగళేశి మాంగల్యం దేహియే సదా్ప్ప
అనుచు మంగళ గౌరిని ప్రార్థింతురు. తమ భర్తలనే దైవముగా నెంచి మహిళామణులు భర్తలకు పాదాభివందనము చేసి అక్షతలు వేయించుకుని ఆశీర్వచనములు పొందుదురు.
సాయం సమయమున ముత్తైదువులను ఆహ్వానించి పేరంటమును జరిపి వారి పాదములకు పసుపురాసి, నొసట కుంకుమబొట్టు దిద్ది, గళసీమనందు గంధమద్ది, వారి కనులకు కాటుక నలంకరించి వారికి పాదాభివందనము చేయుచు ఆశీఃపూర్వకముగా అక్షతలు తలపై వేయించుకుని వారికి పూలు, పండ్లు, తాంబూలము, నానబెట్టిన శెనగలు వాయనముగా ఇచ్చి పూజింతురు.
శ్రావణ మంగళగౌరీ వ్రతము చేసుకునే వారు శ్రావణమాసంలో వచ్చే మొదటి మంగళవారమునాడు ఈ నోమును ప్రారంభించాలి. ప్రతి శ్రావణ మంగళవారము నాడు ఉదయమున శ్రావణ లక్ష్మిని, గౌరిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రావణ మంగళవారము కథ చదువుకుని అక్షతలు శిరస్సున ధరించి ఆ రోజు ఏకభుక్తముగా నుందురు. ఇటుల ఐదు సంవత్సరములు ఈ నోము నోచుకుని తదుపరి పెండ్లి జరుగుచున్న అమ్మాయికి మట్టెలు, మంగళసూత్రములు చేయించి, అరిశెలలు వండి, ఆ అరిశెలను ఒక క్రొత్త యిత్తడి గిన్నెలో ఉంచి, ఆ అమ్మాయికి వాయనముగా ఇచ్చి ఉద్యాపన చేసికొందురు.
శుద్ధ తదియ: మధుశ్రవా వ్రతము, స్వర్ణగౌరీ వత్రము.
శద్ధ చవితి: నాగుల చవితి. ఉపవశించి పాముల పుట్టలో పాలు పోసి, నువ్వులు చిమ్మిడి నైవేద్యము చేయుదురు. దూర్వా గణపతి వ్రతము కూడా నేడే.
శుద్ధ పంచమి: గరుడ పంచమి. దీనినే నాగ పంచమి అందురు.
శుద్ధ షష్ఠి: సూర్య షష్ఠీ వ్రతము. దీనిని ఆయురారోగ్యములు కోరుచూ చేయుదురు. కల్కి అవతార జయన్తి.
శుద్ధ నవమి: కౌమారీ పూజ.
శుద్ధ దశమి: దీధా వ్రతారంభము.
శుద్ధ ఏకాదశి: పుత్త్రైకాదశి, ఈనాటి ఈ వ్రతము వలన పుత్రులు జన్మింతురు.
శుద్ధ ద్వాదశి: దావెూదర ద్వాదశి.
శుద్ధ త్రయోదశి: అనంగ త్రయోదశి. మన్మథుని ప్రీత్యర్థం అనంగపూజ చేయుదురు. పూర్ణిమకు ముందువచ్చు శుక్రవారమునాడే వరలక్ష్మీ వ్రతము.
శుద్ధ పూర్ణిమ: జంధ్యాల పూర్ణిమ, రాఖీ పండుగ, హయగ్రీవ జయన్తి, సంతోషిమాత జయన్తి, మృకండ జయన్తి, వైఖానస జయన్తి.
శ్లో్ప్ప జ్ఞానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ్ప
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే ్ప్ప
ఈ రోజున సర్వ విద్యలకు ఆధారభూతుడైన హయగ్రీవుని ఉపాసన, పూజ ఎనలేని ఫలితాన్నిస్తాయి. విద్యార్థులు వేదపఠనము ఆరంభించు పవిత్ర దివసమిదియే.
ఈ రోజున పాలలో చంద్రుని చూచుచు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలము ఇంతింతని చెప్పనలవికాదు.
బహుళ : అశూన్య శయన వ్రతము.
బహుళ విదియ:శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన. ఈ రోజున (క్రీ.శ. 1671లో) స్వామివారు సజీవ సమాధిలో ప్రవేశించిరి.
చాతుర్మాస్య ద్వితీయ.
బహుళ చవితి : సంకటహర గణేశ చతుర్థి.
బహుళ సప్తమి : శీతలా వ్రతము.
బహుళ అష్టమి : శ్రీ కృష్టాష్టమి. ఈ రోజున శ్రీకృష్ణుని
శ్లో్ప్ప పాహిమాం సర్వలోకేశ హరే సంసార సాగరాత్‌్ప
త్రాహిమాం సర్వ పాపఘ్న దుఃఖ శోకార్ణవాత్‌ ప్రభో్ప్ప
సర్వ లోకేశ్వర త్రాహి పతితం మా భవార్ణనే ్ప
త్రాహిమాం సర్వ దుఃఖఘ్న దుఃఖ శోకార్ణవాత్‌ హరే ్ప్ప
దుర్గతాం స్త్రయసే విష్ణో యే స్మరంతి సకృత్సకృత్‌ ్ప
త్రాహిమాం దేవదేవేశ త్వత్తో నాసోస్తి రక్షితా ్ప్ప
యద్వాక్వచన కౌమారే యౌవనే యచ్చ వార్థకే ్ప
తత్పుణ్యం వృద్ధిమాయాతు పాపం దహ హలాయుధ ్ప్ప
అంటూ భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలి. ఈ రోజున ఉట్టి కొట్టుట, కృపారాధన చేస్తారు. పగలు ఉపవశించి సంధ్యాసమయమున తులసి దగ్గర దీపములు పెట్టి నవకాయ పిండివంటలు నైవేద్య మిడుదురు.
ఈ రోజే అరవింద జయన్తి, దశఫల వ్రతారంభము కూడా.
బహుళ అమావాస్య : పోలాంబ వ్రతము. దీనినే 'పోలాల అమావాస్య' అనీ, 'పోలేరు అమావాస్య' అనీ అంటారు. రైతులు తమకు వ్యవసాయమున సాయపడు బసవన్నలను పూజించెడి రోజు ఇదియే.
ఈ రోజే అగ్ని సావర్ణికామన్వాది. పితృయజ్ఞము కూడా.
ఈ మాసము అన్ని శుభకార్యములకు మంచిది. కాని శయనైకాదశి దాటిన పిమ్మట వివాహాదుల ఆచారము లేదు. కాని గృహారంభాదులకు తగును.
శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు విష్ణుమూర్తి ఎత్తిన దశావతారాల్లో రెండు ఈ మాసముననే ధరించుట చెప్పుకొనదగిన విషయము. లీలామానుష వేషధారి శ్రీకృష్ణునిగా బహుళ అష్టమి నాడు,వేదములను పరిరక్షించుటకు పౌర్ణమినాడు హయగ్రీవునిగా అవతరించెను.
కేశవున కిష్టమైన ఈ మాసము అమ్మవారికీ అత్యంత ప్రీతిపాత్రము. అందులకే ఈ నెల మహిళలకు మిక్కిలి ప్రాముఖ్య సంతరించుకున్నది. క్రొత్తగా పెండ్లైన ఆడపిల్లలు తమ ఐదవతనము కలకాలం నిలవాలని శ్రావణ మంగళవారాల యందు మంగళగౌరీ వ్రతము, పూర్ణిమకు ముందు వచ్చు శుక్రవారమున వరలక్ష్మీ వ్రతము నాచరింతురు. మంగళ గౌరీ వ్రతమును శ్రీకృష్ణుడే స్వయముగా ద్రౌపదికి వివరించినట్లు పురాణములు చెప్పుచున్నవి. వరలక్ష్మీ వ్రతమును శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చు శుక్రవారమునాడు ఆచరించవలె ననియు, అప్పుడు కుదరని పక్షమున శ్రావణ మాసమున ఏ శుక్రవారమునాడైనా ఆచరించవచ్చని సంప్రదాయము పేర్కొనుచున్నది. క్రొత్తగా పెళ్ళయిన స్త్రీలు శ్రావణ మంగళ వారపు నోములు ఐదేండ్ల పాటు నోచిన మంచిదని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి.
శ్రావణ పూర్ణిమయే జంధ్యాల పూర్ణిమ. పాత జన్నిదమును విసర్జించి క్రొత్త జన్నిదము (జంధ్యము)ను మంత్ర పూర్వకముగా ధరింపవలెను. ఈ రోజే రక్షాబంధన్‌ - రాజీ పండుగ. సోదర సోదరీమణుల అనుబంధానికి సంబంధించిన పండుగ ఇది.
పూర్వము యుద్ధమునకేగు భర్తలకు భార్యలు వారి రక్షాణార్థము, తమ మాంగల్య సుస్థిరత కొరకు ఈ రక్షాబంధనము మంత్రపూర్వకముగా కట్టేవారు. దీనికి సంబంధించిన పురాణగాథ ఒకటి గలదు. పూర్వము, దానవులతో జరిగిన కదనమున పరాజితుడైన ఇంద్రుడు తన సైన్యముతో అమరావతియందు ఒకచోట రహస్యముగా దాగి వుండెను. భర్తకు జరిగిన పరాభవమును తట్టుకొనలేక శచీదేవి శ్రావణ పూర్ణిమనాడు లక్ష్మీనారాయణులను,పార్వతీ పరమేశ్వరులను శాస్త్రోక్తముగా పూజించి ఇంద్రుని చేతికి రక్ష కట్టి సమరోత్సాహమును ఇనుమడింపజేసినది. ఆ ఉత్సాహముతో యుద్ధ మొనర్చిన ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యమును పొందెను. రక్షాబంధన్‌ ఉత్సవమున కిదియే ఆరంభము.
ఆధునిక కాలమున - శత్రువులు తన దుర్గమును ముట్టడించిన సమయమున చిత్తోడ్‌రాణి కర్ణావతి ఢిల్లీ పాదుషా హుమాయూన్‌కు 'రాఖీ' పంపగా పాదుషా ఆమెను తన సోదరిగా భావించి సైన్యముతో ఆమెకు బాసటగా నిలిచెను.
కర్నాటక రాశి నుండి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించెడి రోజే సింహ సంక్రమణము. తమిళులకు శ్రావణమాసము ప్రాంరభమగు రోజు. ఈ రోజున ఉపవసించి నరసింహస్వామి నర్చించిన విశిష్ట ఫలిత మొనగూడును.
భారతీయ సంప్రదాయమున నాగారాధనకు ప్రత్యేక స్థానమున్నది. నాగేంద్రుడు శివునకు హారము, కేశవునకు తల్పము. శ్రావణ శుద్ధ పంచమి నాగ పంచమి. కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి. ఈనాటి వ్రతమే శాంతివ్రతము. ఈ చవితి ఉత్థానైకాదశికి సమీపమున ఉండుటచే ఆ రోజు నుండియే జ్యోతిర్మండలమున అనంతశయనాకృతి గోచరించునని ఖగోళశాస్త్ర పండితులు పేర్కొందురు.
కుండలినీ శక్తి మూలాధారము నుండి బయలుదేరి వెన్నుపాము ద్వారా సహస్త్రారము చేరునని తద్వారా ఆనందప్రాప్తి కలుగునని యోగశాస్త్రము పేర్కొనుచున్నది. అష్టలక్ష్ములు సిద్ధించవలెనని లక్ష్మీదేవిని ఈ మాసమున శుక్రవార వ్రతములతో మహిళామణులు అర్చించెదరు.
మొలకెత్తిన శనగలు ఆరోగ్యకరము. ఈ మాసమున పగటిపూట నిద్ర పోరాదని, ఒక్కపూట మాత్రమే భుజింపవలెనని చెప్పుటలో అంతస్సూత్రముగా ఆరోగ్య పరిరక్షణ యిమిడి యున్నది.
Read More

నలంద, తక్షశిల,విక్రమశిల విశ్వవిద్యాలయాలలో ఉన్న అమూల్యమైన గ్రంధాలను భక్తియార్ ఖిల్జీ అనే ఉన్మాదుడైన ముఘల్ రాజు కాలంలో కాల్చివేయ్యబడ్డాయి


నలంద, తక్షశిల,విక్రమశిల విశ్వవిద్యాలయాలలో ఉన్న అమూల్యమైన గ్రంధాలను భక్తియార్ ఖిల్జీ అనే ఉన్మాదుడైన ముఘల్ రాజు కాలంలో కాల్చివేయ్యబడ్డాయి - తరువాతి కాలంలో మళ్ళి ఆ వేదం విద్యనూ గ్రంధాలను తిరిగి రాయడానికి ప్రయత్నం చేసిన ఎంతో మంది భారతీయ విద్యావేత్తలను అత్యంత క్రురంగా హింసించి చమేయ్యడం జరిగింది
ఇది గమనించిన కొంతమంది ఔత్సాహిక విద్యావేత్తలు ఈ వేదాన్ని కంటస్తం చెయ్యడం అలాగే మరికొంత మందికి కన్తోపాటం గా నేర్పడం మొదలు పెట్టారు - అలా చాలా వరకు వేదాధ్యయనం ముఖత గానే కొనసాగింది అందువల్లే వేదాన్ని కంటస్తం చెయ్యడం అలవాటుగా మారింది
4 వేదాలు నోటికి వచ్చిన వాడిని చతుర్వేది అని
3 వేదాలు వచ్చినవాడిని త్రివేది అని
2 వేదాలు వచ్చిన వాడిని ద్వివేది అని
1 వేదం నేర్చినవాడిని ఉపాధ్యాయ అని
శాస్త్రాలు తెలిసినవాడిని శాస్త్రి అని
మిశ్రమంగా కొన్ని విషయాలు నేర్చుకున్న వాడిని మిశ్రా అని
శాస్త్రీయ కర్మ విధి విధానాలను నేర్చిన వాడిని శర్మ అని ఇలా రకరకాలుగా విభజించి నేర్పించడం జరిగింది
మరి ఇప్పుడు మనం స్వతంత్రులం కదా, రాయించవచ్చుకదా ?
ఎవరు చెప్పారు మనం స్వతంత్రులమని గత 65 ఏళ్లుగా గమనిస్తున్నాను ఒక్కడంటే ఒక్క మహా మంత్రి లేదా ప్రభుత్వ అధికారి ఈ వేదాలను తిరిగి రాయించడం మిద దృష్టి పెట్టనేలేదు - ఇప్పటకి మనం ముఘల్ రాజుల పాలనలోనే ఉన్నాం - హిందుమత గ్రంధాలను అవహేళన చేస్తూనే ఇతర మత గ్రంధాలకు ఎనలేని గౌరవం ఇస్తున్నాం లేదా ఇతరులకు ఇంకా భయపడుతూనే ఉన్నాం ........మీరేమంటారు
Read More

వర్ణన, ధ్యానము, ప్రార్ధన – ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రములోనే లీనమై ఉన్నవి

”ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం
భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!”
గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం వహించునది గాయత్రి, సత్యమును పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ… ఈ త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము. ఈమెకు తొమ్మిది వర్ణనలున్నాయి.
1) ఓం 2) భూః 3) భువః 4) సువః 5) తత్‌ 6) సవితుర్‌ 7) వరేణ్యం 8) భర్గో 9) దేవస్య
ప్రతిపదార్ధం :
ఓం : ప్రణవనాదం
భూః : భూలోకం, పదార్ధముల చేరిక, దేహము, హృదయం, మెటీరియలైజేషన్‌
భూవః : రువర్లోకం, ప్రాణశక్తి, వైబ్రేషన్‌
సువః : స్వర్గలోకం, ప్రజ్ఞానము, రేడియేషన్‌ఈ మూడు లోకములు మన శరీరములోనే వున్నవి.
తత్‌ : ఆ
సవితుర్‌ : సమస్త జగత్తును
వరేణ్యం : వరింపదగిన
భర్గో : అజ్ఞానాంధకారమును తొలగించునట్టి
దేవస్య : స్వయం ప్రకాశ స్వరపమైన బ్రహ్మను
ధీమహి : ధ్యానించుచున్నాను
ధీయోయోనః ప్రచోదయాత్‌ : ప్రార్ధించుచున్నాను
కనుక వర్ణన, ధ్యానము, ప్రార్ధన – ఈ మూడు ఒక్క గాయత్రీ మంత్రములోనే లీనమై ఉన్నవి.Read More

ప్రాశ్చాత్య సంస్కృతి,మతాల వెంటబడుతున్న ఓ దారితప్పిన హైందవా, అక్కడి మేధావులే మన సనాతనధర్మం గురించి ఏమన్నారో తెలుసుకో!


ప్రఖ్యాత జెర్మన్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్
మ్యాక్స్ ముల్లర్ గారు ఆర్యులగురించిచేసిన పరిశోధనావ్యాసాలు
ఆయన మరణానంతరం ప్రచురితమయ్యాయి. అందులో
భారత తత్వశాస్త్రం 6వ భాగంలో "ఆర్యులు క్రీస్తు పూర్వం
15వేల సంవత్సరాల క్రితమే తమదంటూ ఒక ప్రత్యేక నాగరికత, సాహిత్యాలతో ప్రపంచ చరిత్రలో నిలిచారు" అని వ్రాసుకొన్నారు.

Read More

నమస్కారం మరీ మంచిది.. అభివాదాలతో రోగాల రొస్టు..

నమస్కారం మరీ మంచిది..
అభివాదాలతో రోగాల రొస్టు..
.....
రకాల అభివాదాల వల్ల ఈ కోలై వంటి బ్యాక్టీరియాలు ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తున్నాయట. అందుకే చేతులు కలపొద్దు. కావిలించుకోవద్దు. చెంప పై ముద్దు పెట్టవద్దు. పెక్ కూడా వద్దు. అంతగా కావాలంటే పిడికిళ్లు పరస్పరం ఆనించుకొండి. కుదిరితే కేవలం మోచేతులను ఒకరికొకరు తాకించుకొండి. బ్రిటిష్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం మిగతా రకాల అభివాదాల వల్ల బ్యాక్టీరియాలు ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తాయి. షేక్ హ్యాండ్స్ కంటే ఫిస్ట్ బంప్ చేసుకుంటే పది శాతం తక్కువ బ్యాక్టీరియాలు వ్యాపిస్తాయట. ఈ కోలై వంటి బాక్టీరియా వ్యాపిస్తే జీర్ణకోశసంబంధిత ఇన్ ఫెక్షన్ వస్తుందట. అధ్యయనం ప్రకారం మోచేతి తాటింపు బెస్టు. పిడికిలి స్పర్శ పరవాలేదు. హ్యాండ్ షేక్ వద్దు. ఆలింగనం అసలు వద్దు. ముద్దు పెట్టుకుంటే ముప్పు. ఇంత అధ్యయనం చేసిన వారు భారతీయుల నమస్కారాన్ని లెక్కలోకి తీసుకోలేదు. నమస్కారం మరీ మంచిది ఎందుకంటే ఒకరి చేయి మరొకరికి తాకే ప్రసక్తే లేదు మరి. కాబట్టి అన్ని రోగాలకి నమష్కారంతో పరిష్కారం. అది అసలుసిసలైన భారతీయం..@ జనబంధు.
Read More

మీకో విషయం తెలుసా? ప్రపంచం లో ఆక్సిజన్ పీల్చుకొని, ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి మన గోవు.

మీకో విషయం తెలుసా? ప్రపంచం లో ఆక్సిజన్ పీల్చుకొని, ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి మన గోవు....ఇంకో అద్బుతమైన విషయం తెలుసా? ..... మనం తల్లి గా భావించే ఈ గోవు తో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపటం వల్ల, మన శరీరం లో వున్న అనారోగ్యాన్ని , ఆ గోవు ముక్కు లో వున్న ఒక గ్రంధి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేత కు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డి ని తిని, అందుకు తగిన విధం గా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయం అవుతుంది. ఇది మహా అద్భుతం. అందుకే ప్రతి ఒక ఇంట్లో ఒక గోవు వుంటే దైవం మన వెంటే వున్నట్లు మన పురాణాల లో చెప్పారు.మన భారత దేశం లో జాతి ఆవులు 36 రకాలు, ప్రపంచం లో వింత వ్యాది సోకడం తో ఎన్నో జాతులు నశించిపోయాయి. కాని మన జాతి గోవు జాతు ల పై ఆ ప్రభావం పడలేదు. ఎండకు, వానకు, చలి కి అన్నిటికి తట్టుకొని జీవించింది. ఏ శాత్రవేత్తలకు అర్థం కానిది మన గోవు, వారు ఎన్ని జన్యు మార్పిడి లు చేసిన జాతి అయిన ఆన్ని వాతావరణాల కు తట్టుకోలేక పోతున్నాయి ఆ కృతిమ జాతులు. అందుకే ప్రపంచం లో ఎన్నో దేశాలు మన గోవు ను ఎగుమతి చేసుకొని వృద్ధి చేసుకొంటున్నారు.ఇక గోమూత్రం లో 47 రకాల మూల పదార్థాలు వున్నాయి. మన పురాణాల లో చెప్పిన పంచాకవ్యం లో ని 64 సూత్రాల పైన జరిగిన పరిశోధన తో గోమూత్రం మరియు గోవు పేడ తో 300 రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన అవుషదాలు కనుగోన్నారు. అలానే వ్యవసాయానికి సంబంధించిన 25 రకాల అవుషదాలు కూడా కనుగొన్నారు. ఈ అవుషదాలు ప్రకృతి సహజమైనవి, ఎంటువంటి రసాయనాలు అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చు.అందుకే మాన భారతీయ సంస్కృతి ని గోసంస్కృతి అని కూడా అంటారు, గోవు యొక్క విశిష్టత ఎంతో అందుకే మన పూర్వికులు మన పురాణాల లో ఎప్పుడో చెప్పారు.అందుకే మన గోవు ని మనం రక్షించుకొందాం, మన సంస్కృతి ని మనం రక్షించుకొందాం. ఆరోగ్యం మరియు ఆనందం మన సొంతం.


Read More

అత్యంత ఆరోగ్యకరమైన తులసి

అత్యంత ఆరోగ్యకరమైన తులసి

తులసిని అత్యంత పవిత్రంగా కొలిచే వాళ్లు మన పూర్వీకులు. ఉదయం లేవగానే తులసి పూజ చేయకుండా పనులు మొదలు పెట్టేవాళ్లు కాదు. పురాణాలలో కూడా విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. అత్యంత ఆరోగ్యకరమైన అంశాలు తులసిలో ఉన్నాయి. ఇంతటి పవిత్రత గల తులసి గురించి ......
ఎన్నో ఏళ్ల తరబడి హిందువులు భగవంతుడికి కానుకలు, పువ్వులు సమర్పించడం ద్వారా వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఎంతో పవిత్రతను, ప్రాధా న్యతను సంతరించుకున్న తులసి నేడు ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు దీనిలో ఉన్న ఔషధ గుణాలను సౌందర్య పోషణకు వాడుకుంటున్నారు. ఎందుకంటే తులసి కొమ్మలు, ఆకులు, విత్తనాలు, కాడలే కాదు మొక్క కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్ర మైనదని, ఔషధాలతో కూడుకున్నదని పద్మ పురాణంలో పేర్కొ న్నారు. ‘‘తులసి మొక్కను చూసినా లేదా తాకినా అన్ని రకాల ఒత్తిడులు, జబ్బుల నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి మొక్కపై నీళ్ళు పోస్తే భయాలన్నీ తొలగిపోతాయి. ఎవరైనా తులసి మొక్కను నాటినా, నీళ్లు పోసినా వారు కృష్ణుడికి ప్రీతి పాత్రమవుతారని’’ స్కందపురాణం చెబుతోంది. అయితే కేవలం దైవాత్వా నికే కాకుండా తులసిలో కొన్ని రకాల ఔషధ గుణాలున్నాయని వైద్య నిపుణులు చెబతున్నారు.
తులసితో....!
ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్న తులసి వల్ల లాభా లెన్కో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది.
కాచిచలార్చిన నీళ్లలో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయని అంటారు.
అల్లం రసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. పొట్టలో నులిపురుగులు నశిస్తాయి.
జలుబు చేసినప్పుడు తేనెలో ఒక టేబుల్‌ స్పూన్‌ తులసి రసం కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.
బెల్లంతో తులసి ఆకులు కలిపి తింటే కామెర్లు తగ్గు ముఖం పడతాయి.
ఆకులు
జ్వరాన్ని తగ్గిస్తుంది.
అల్సర్‌ల నుంచి రక్షిస్తుంది.
రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా నియంత్రిస్తుంది.
కాలేయం శక్తివంతంగా పనిచేయడానికి
దోహద పడుతుంది.
నోటినుంచి దుర్వాసన వెలువడకుండా నిషేధిస్తుంది.
అలర్జీలనుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఎండవల్ల సోకే అలర్జీలు, పొగ, దుమ్ము నుంచి
శరీరానికి కలిగే హానిని అరికడుతుంది.
ఒత్తిడిని దూరం చేస్తుంది.
దాదాపు అందరి ఇళ్లలోనూ ప్రధాన ద్వారానికి ఎదురుగా లేదా పెరట్లో తులసి మొక్క ఉంటుంది. ఎందు కంటే తులసి ఆకుల నుంచి వచ్చే సువాసన ఇల్లంతా పరుచుకొని మంచి యాంటీసెప్టిక్‌గా పనిచేస్తూ వ్యాధులు రాకుండా చేస్తుందని విశ్వసిస్తారు. తులసి ఆకులను చప్పరించడం వల్ల దానిలో ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తులసి ఆకులో ఉండే రసం ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. అందుకే చాలా దేవాలయాలలో తీర్ధంలో తులిసీ దళాలను వేసిస్తారు.


Read More

అష్టాదశ పురాణాలు విష్ణుస్వరూపమే

అష్టాదశ పురాణాలు విష్ణుస్వరూపమే
"అష్టాదశ పురాణాలు" అంటే ఏమిటి ? వాటిలోని శ్లోకాల సంఖ్య ఎంత ? వ్యాసమహర్షులవారి కృతమైన ఈ మహాపురాణాలన్నింటినీ మనం గుర్తు పెట్టుకోవడం ఎలా ? అందుకే సద్గురువులైన వ్యాసులవారు ఇలా మనకు అందించారు.అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. వీటిని వ్యాసభగవానుడు మనకు అందించారు. పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయ గృహనుండి ఒక అనాహత శబ్ధం వెలువడింది. ఆ శబ్ధంలో నుండి అ కార ఉకార మకార శబ్ధాలు కూడిన ఓంకారశబ్ధంఆవిర్భవించింది. "అ" నుండి "హ" వరకు గల అక్షరాలు ఆశబ్ధంనుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ 'అ'కార, 'ఉ'కార 'మ'కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰ భువ॰ సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి. వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తుసారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించారు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పారు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించారు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి. ఈ క్రింది శ్లోకం నేర్చుకుంటే గుర్తుపెట్టుకోవడం చాలా సులభం.శ్లో! ! మద్వయం భద్వయం చైవ, బ్రత్రయం వచతుషటయం !అనాపలింగ కూస్కానీ, పురాణాని ప్రచక్షత !!మద్వయం: మ కారంతో ప్రారంభమయ్యేవి 2. అవి మత్స్య పురాణం. మార్కండేయ పురాణం.భద్వయం: భ కారంతో ప్రారంభమయ్యేవి 2. అవి భాగవత పురాణం. భవిష్యత్ పురాణం.బ్రత్రయం: బ్ర కారంతో ప్రారంభమయ్యేవి 3. అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం.వచుతష్టయం: వకారంతో ప్రారంభమయ్యేవి 4. అవి వాయుపురాణం, వరహా పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం.అ కారంతో అగ్ని పురాణం, నా కారంతో నారద పురాణం, ప కారంతో పద్మ పురాణం, లి కారంతో లింగ పురాణం, గ కారంతో గరుడ పురాణం, కూ కారంతో కూర్మ పురాణం మరియు స్క కారంతో స్కంద పురాణం రచించిరి.1. మత్స్య పురాణం: దీనిలో 14000 శ్లోకములున్నవి. మత్స్యావతారమెత్తిన విష్ణువుచే మనువుకు బోధింపబడినది. కార్తికేయ, మయాతి, సావిత్రుల చరిత్రలు. ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్మ్యములు చెప్పబడినవి.2. మార్కండేయ పురాణము: ఇందులో 9000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది. శివవిష్ణువుల మహత్మ్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్మ్యములు మరియు సప్తపతి (లేక దేవి మహత్మ్యము) చెప్పబడినవి. చండీ హోమము, శతచండీ సహస్ర చండీ హోమ విధానమునకు ఆధారమయినది ఈ సప్తశతియే.3. భాగవత పురాణము: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేద వ్యాసుని వలన శుకునకు, శుకుని వలన పరీక్షత్ మహారాజునకు 12 స్కందములులో మహా విష్ణు అవతారలు శ్రీ కృష్ణ జనన, లీలాచరితాలు వివరించబడినవి.4. భవిష్య పురాణము: దీనిలో 14,500 శ్లోకాలు కలవు. సూర్య భగవానునిచే మనువునకు సూర్యాపాసన విధి, అగ్ని దేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం. భవిష్యత్తులో జరుగబోవు విషయాల వివరణ ఇందు తెలుపబడినది.5. బ్రహ్మపురాణము: దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. దీనిలో 10,000 శ్లోకాలున్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీ కృష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ – నరకాలను గూర్చి వవరించబడినవి.6. బ్రహ్మాండ పురాణము: దీనిలో 12,000 శ్లోకాలు కలవు. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకృష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు. శ్రీ లలితా సహస్ర నామస్తోత్రాలు, శివకృష్ణ సోత్రాలు, గాంధర్వం, ఖగోళశాస్త్రం మరియు స్వర్గ నరకాలు వివరణ ఇందు వివరించబడినది.7. బ్రహ్మ వైవర్త పురాణము: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. సావర్ణునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకృష్ణుల వైభవములు, సృష్టికర్త బ్రహ్మ, సృష్టికి కారణమయిన భౌతిక జగత్తు (ప్రకృతి) మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచ శక్తుల ప్రభావము గురించి వివరించబడినది.8. వరాహ పురాణము: దీనిలో 24,000 శ్లోకములు కలవు. వరాహ అవతార మొత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణుమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు. పరమేశ్వరీ, పరమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు, పుణ్య క్షేత్రవర్ణనలు ఈ పురాణములో కలవు.9. వామన పురాణము: దీనిలో 10,000 శ్లోకములు కలవు. పులస్త్వ ఋషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణము, శివగణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము – ఋతు వర్ణనలు వివరించబడినవి.10. వాయు పురాణము: దీనిలో 24,000 శ్లోకములు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభగవానుని మహాత్మ్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణనము చెప్పబడినది.11. విష్ణు పురాణము: ఇందు 23,000 శ్లోకములు కలవు. పరాశరుడు తన శిష్యుడయిన మైత్రేయునికి బోధించినది. విష్ణుమహాత్మ్యము, శ్రీ కృష్ణ, ధృవ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపబడినవి.12. అగ్ని పురాణము: దీనిలో 15,400 శ్లోకాలు కలవు. అగ్ని భగవానునిచే వశిష్ణునకు శివ, గణేస, దుర్గా భగవదుపాసన, వ్యాకరణం, చంధస్సు, వైద్యం, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాము, జ్యోతిషం మొదలగు విషయాలు చెప్పబడినవి.13. నారద పురాణము: ఇందు 25,000 శ్లోకములు కలవు. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతరన్ అను నలుగురు బ్రహ్మామానసపుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము (శివస్తోత్రము) ఇందు కలదు వేదాంగములు, వ్రతములు, బదరీ ప్రయాగ, వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందు కలవు.14. స్కంద పురాణము: దీనిలో 81,000 శ్లోకములు కలవు. ఇది కుమారస్వామి (స్కందుడు) చే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహాత్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవా ఖండము (సత్యనారాయణ వ్రతము ఇందులోనివే), వైష్ణవ ఖండము (వేంకటాచల క్షేత్రము), ఉత్కళ ఖండము (జగన్నాధ క్షేత్రము), కుమారికా ఖండము (అరుణాచల క్షేత్రము), బ్రహ్మ ఖండము (రామేశ్వర క్షేత్రము) బ్రహోత్తర ఖండము. (గోకర్ణక్షేత్రము, ప్రదోషపూజ), అవంతికాఖండము (క్షీప్రానదీ, మహాకాల మహాత్మ్యము) మొదలగునవి కలవు.15. లింగ పురాణము: ఇది శివుని ఉపదేశములు. లింగరూప శివ మహిమ, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు. ఖగోళ జ్యోతిష, భూగోళ శాస్త్రములు వివరించబడినవి.16. గరుడ పురాణము: ఇందు 19,000 శ్లోకములున్నవి. ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది. శ్రీ మహావిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ – నరక ప్రయాణములు తెలుపబడినవి.17. కూర్మ పురాణము: ఇందులో 17,000 శ్లోకములున్నవి. కూర్మావతార మెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ నారసింహ అవతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళముతో వారణాసి, ప్రయోగక్షేత్ర వర్ణనలు తెలుపబడినవి.18. పద్మపురాణము: ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను, కేవలం వినినంత మాత్రముననే పొగొట్టగలిగేది ఈ పద్మపురాణము. అష్టాదశ పురాణాలలోకెల్ల, అత్యధిక శ్లోకాలు ( 85,000 శ్లోకములు) కలిగి అనేక విశేషాలను మనుకు తెలియజేస్తుంది. మరియు మదుకైటభవధ, బ్రహ్మసృష్టికార్యము, గీతార్థసారం – పఠనమహాత్య్మం, గంగామహాత్మ్యం, పద్మగంధి దివ్యగాధ, గాయత్రీ చరితము, రావి వృక్ష మహిమ, విభూతి మహాత్మ్యం, పూజావిధులు – విధాణం, భగవంతుని సన్నిథిలో ఏ విధంగా ప్రవర్తించాలో పద్మపురాణంలో వివరంగా తెలియజేయబడింది.ఈ విధముగా పురాణములందలి విషయములు క్రమముగా సంక్షిప్త రూపమున వేదవ్యాసపీఠ మందిరము నందు రచింపబడి నైమిశారణ్యమునందు ప్రసిద్ధములైయున్నవి
మీ.....వల్లూరి రామకృష్ణాచార్యులు.


Read More

శ్రీమద్భగవద్గీత...సాంఖ్యయోగం 02--02 & 03

శ్రీమద్భగవద్గీత...సాంఖ్యయోగం 02--02 & 03
---------------------------------
శ్రీ భగవానువాచ:
కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితమ్ |
అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున ||
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ||
......
అర్జునా! ఈ సంక్లిష్ట సమయంలో ఆర్యధర్మ విరుద్ధమూ,
అపకీర్తి దాయకమూ, నరకప్రాప్తి హేతువూ అయిన
ఈ పాడుబుద్ధి నీ కెందుకు పుట్టింది? నపుంసకుడిలాగ
అధైర్యం పొందకు. ఇది నీకు పనికిరాదు.
మనోదౌర్బల్యం నీచం. దాన్ని విడిచిపెట్టు.
నీవు శత్రుమర్దనుడవు. యుద్ధం ప్రారంభించు.
------------------
సర్వ శాస్త్ర సారం భగవద్గీత
--శ్రీకృష్ణుడు అర్జునునికి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో
యుద్ధారంభంలో ఉపదేశిం చిన జ్ఞానబోధయే శ్రీమద్భగవద్గీత.
''గీతలో శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన మాటలు జ్ఞానకళికలు. మానవుని జీవితాదర్శనమును తెలియజేసినవి. ఉపనిషత్తులను తోటనుండి ఆధ్యాత్మిక సత్యములను పరిమళ పుష్పములను మాలగా కూర్చినదియే భగవద్గీత' అంటారు శ్రీ వివేకానంద.
''మానవుడు తన ధీశక్తి నంతటినీ ధారపోసినప్పటికీ గీతాజ్ఞానంలో ఏ ఒక్క అంశాన్ని మాత్రమే తెలుసుకోగలడు'' అంటారు శ్రీ అరవిందయోగి.
''ప్రపంచ సాహిత్యంలో గీతకు సాటి వేరొకటి లేదు. అమూల్య రత్నం. పరమానంద పదవికి చేర్చే అపూర్వ సాధనము''
శ్రీ బాలగంగాధరతిలక్‌ అభిప్రాయం.
పై మువ్వురు శ్రీమద్భగవద్గీతను మధించి భాష్యాలు వ్రాసిన మేధావులు.
భారతే సర్వవేదార్థో భారతార్థశ్చి కృత్స్నశ:
గీతాయామస్తి తేనేయం సర్వశాస్త్రమయీ మతా.
సమస్త వేదముల సారము భారతంలో ఉంది.
భారతం యొక్క సారాంశం గీత.
గీత అను రెండు అక్షరాలకు
త్యాగం, తత్త్వజ్ఞానం అని వివరణ ఇచ్చారు ఋషులు.


Read More

శ్రీ మంగళ గౌరీ వ్రతకథ :-

శ్రీ మంగళ గౌరీ వ్రతకథ :-
*********************
పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది.
కానీ, వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం కలగలేదు.
ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందునుంచి వెళ్లే భిక్షకుని జోలెలో బంగారం వేయగా, అతను కోపించి సంతానం కలుగకుండుగాక అని శపించాడు. దాంతో ఆ దంపతులు అతణ్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి ‘మంగళ గౌరీ వ్రతం’ చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావంవల్ల ఈ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచించాడు.
అనంతరం, వారు సంతానవంతులై కుమారునికి పదహారేళ్ల వయసురాగానే కాశీకి వెళ్లే వీరికి మార్గ మధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసిన తల్లి గల ‘సుశీల’ అనే కన్యతారస పడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు.
ఆమె సాహచర్యంతో భర్తకు పదహారేండ్ల అకాల మరణం ఉన్నా ‘మంగళగౌరీ’ వ్రతవాయినం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాష్కుడవు తాడు.
కాబట్టి, శ్రావణ మంగళ గౌరీ వ్రతా చరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి.
* మంగళ గౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ అర్చించడం తప్పనిసరి.
* మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. * వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువలను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి.
ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొన దగింది తోరపూజ.
పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు.
ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కడ్తారు. ఈ తోరాలను
* గౌరీ దేవి ముందు పెట్టి పూజచేసి ఒక తోరాన్ని పూజచేసిన వారు కట్టుకుంటారు.
* రెండవ తోరాన్ని ముత్తైదువకు ఇస్తారు.
* మూడో తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు.
ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంచాఫలసిద్ధి కలుగుతుంది. ఈ వ్రతంలో ఆకులు, వక్కలు ఐదేసిచొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు.
తరువాత, వాటిని సెనగలతో కలిపి తల్లికిగాని, బ్రాహ్మణ ముత్తైదువకు గాని వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం.మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యారు .
ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అయిదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు.
మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొన సాగించాలి.
చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి.

Read More

ఇంద్రియం, మనస్సు, బుద్ధి, అహంభావం – ఈ నాల్గింటిని అంతఃకరణ చతుష్టయం అంటారు

ఇంద్రియం, మనస్సు, బుద్ధి, అహంభావం – ఈ నాల్గింటిని అంతఃకరణ చతుష్టయం అంటారు. ఇవన్ని ఒక విధంగా చిత్తం చేసే వేరు వేరు పనులే. చిత్తంలోని సంకల్పాలనే వ్రుతులు అంటారు. నువ్వే అసలు చైతన్యం. చిత్తం నీకు ఒక ఉపకరణం మాత్రమే. దాని ద్వార ప్రపంచాన్ని గ్రహిస్తావు. ఒక రాయిని నీటిలో వేస్తే నీటిపై తరంగాలు వస్తాయి. అలాగే వస్తువుతో చిత్తానికి సంఘర్షణ కలగగానే చిత్తంలో ప్రతిక్రియ కలుగుతుంది.నిజంగా, ప్రపంచమంటే, బాహ్య విషయాలలో చిత్తం చేసే ప్రతిక్రియలే.
మనసు తన సహజ శుద్ధావస్థను చేరటానికి నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. కానీ ఇంద్రియాలు మాత్రం మనసును బయటకు లాగుతూ ఉంటాయి. మనసు ఇలా ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళకుండా నిరోధించటమే మనోనిగ్రహం. మనసును నిగ్రహించి, ఆత్మలో లయం చేయటానికి, అంతర్ముఖం చేయవలసి వుంటుంది. ఇదే యోగం అంటే.
నదిలో నీరు నిర్మలంగా, ఏవిధమైన కదలికలు లేకుండా, అలలు లేకుండా వున్న సమయంలో అడుగుభాగం స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిదంగా మనసులో ఏవిధమైన సంకల్పాలు, ఆలోచనలు లేనప్పుడు మనం మన అంతఃస్వరూపాన్ని కనుగొన గల్గుతాము. మనసు పూర్తిగా మాయమైనప్పుడు మనం ఆత్మ స్వరుపులుగా మిగిలిపోతాము.
ఇతర సమయాలలో అంటే పైన చెప్పినట్లు యోగాస్తితిలో లేనప్పుడు పురుషుడు తన వృత్తులతో తాదాత్మ్యం చెంది ఆయా వృత్తుల రూపాన్ని పొంది వుంటాడు. ఎలాగంటే ఎవరైనా నన్ను బాధపెట్టారను కోండి. దాని వలన నా మనసులో ఒక వ్రుత్తి కలుగుతుంది. ఆ వృత్తిలో నేను తాదాత్మ్యం చెంది, ఆ కారణంగా దుంఖాన్ని పొందుతాను.
వృత్తులు ఐదు రకాలుగా ఉంటాయి. అవి కొన్ని క్లేశయుక్తాలు, కొన్ని క్లేశరహితాలు.ప్రమాణం, విపర్యం, వికల్పం, నిద్ర మరియు స్మృతి అనే ఐదింటిని వ్రుత్తులు అంటారు.
ప్రమాణం: ii.మనకు కలిగే అనుభవంలో భ్రమ లేకుండా వుంటే, అది ప్రత్యక్ష ప్రమాణం. Ii. లక్షణం ద్వారా లక్ష్య వస్తువును గ్రహించగల్గితే అది అనుమాన ప్రమాణం.ఉదాహరునకు పొగను చుచునపుడు నిప్పు ఉన్నది అనే జ్ఞానం కలుగుతుంది. Iii. అత్మసాక్షత్కారాన్ని పొందిన యోగుల ప్రత్యక్షానుభావాలే ఆప్తవాక్యంగా ప్రమాణమవుతున్నాయి.ఆగమాలు, శ్రుతులు, స్మృతులు వారి ద్వారానే వస్తున్నాయి. అటువంటి వేదశాస్త్రాలు మనకు వేదం ప్రమాణాలు.
విపర్యం : లేని వస్తువు రూపంలో ఒక వస్తువు గోచరిస్తే ఆ మిధ్యాజ్ఞానమే విపర్యయ వ్రుత్తి. ముత్యపు చిప్పలో మెరుపును చూసి, అది వెండి అనుకుంటే, అదే విపర్యయ వ్రుత్తి.
వికల్పం : శబ్దానికి సంబంధించిన వస్తువు లేకున్నా శబ్దజ్ఞానంతో అనుసరించే వ్రుత్తి అంటే ఏదైనా ఒక శబ్దాన్ని వినిపించగానే, ఆ శబ్దర్ధాన్ని విచారించకుండా, మనోదౌర్బల్యంతో లేని వస్తువుని నిర్ధరించటమే వికల్పవ్రుత్తి. ఉదాహరున గోడ్రాలి కుమారుడు.
నిద్ర : నిద్రించే సమయంలో చిత్తంలో ఎటువంటి వృత్తులు లేకపోతే, అనుకూల లేదా ప్రతికూల అనుభవాలు ఏవి కలగవు. అనుభవాలు కలగనపుడు, వాటిని స్మరించే ప్రసక్తి వుండదు. కానీ నిద్రించాను అనే స్మృతి మనకు అనుభవంలో కలుగుతోంది కనుక నిద్రావస్థలో కూడ చిత్తంలో వృత్తులు వుండటం నిజం. కనుక నిద్ర కూడా ఒక వ్రుత్తి.
స్మృతి : మనం అనుభవించిన విషయాలు గుర్తు రావటమే స్మృతి అనబడే వ్రుత్తి. ప్రత్యక్షానుభవం, మిధ్యాజ్ఞానం, వికల్పం, నిద్ర అనబడే వృత్తుల ద్వార స్మృతి కలుగవచ్చును. జగ్రుత్తలోని స్మృతి వృత్తే నిద్రలో స్వప్నంగా రూపుదాల్చుతుంది.
పై వ్రుత్తులన్నింటిని అభ్యాసం, వైరాగ్యం ద్వార నిగ్రహించవచ్చును. అభ్యాసం అంటే సాధన. వైరాగ్యం అంటే ఏ విషయాలయందు ఆశ, రాగం లేక పోవటమే. పైన చెప్పబడిన వ్రుత్తులన్నింటిని నిరోదించాలంటే అది అభ్యాసం మరియు వైరాగ్యం వలననే సాధ్యం అవుతుంది. సాధనద్వారా సద్వర్తన అలవరచుకొని, సత్సీలం పొందవచ్చును.
ఆ సాధనని, ఆ అభ్యాసాన్ని చాల కాలం శ్రద్దతో కొనసాగిస్తే, అప్పుడు స్తిరమైన స్తితి కలుగుతుంది. మనోనిగ్రహం ఒక్కరోజు కృషి చేసినంత మాత్రాన సాధించలేము. శ్రద్ద, బ్రహ్మచర్యము, తపసు మొదలైన సత్కార్యములతో ఆ సాధన చేయాలి. వైరాగ్యం రెండు రకాలు.. i.అపర వైరాగ్యం ii.పర వైరాగ్యం.
అపర వైరాగ్యం : ఇహలోకంలో చూడబడినవియు, వేదముల ద్వార వినబదినవియు అయిన భోగావిషయములయందు ఆసక్తి లేని చిత్తమునకు కలుగు ‘వశీకార సంజ్ఞ’ అనే వైరాగ్యం.ప్రాపంచిక విషయాలలో ఆశ, అనురక్తి లేకుండా, వాటికీ వశం కాకుండా, వాటినే తన వశంలో వుంచుకోగల్గటమే వైరాగ్యం. అటువంటి మనోబలం, వైరాగ్యం, మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
పరావైరాగ్యం : పరావైరాగ్యం అత్యున్నతమైనది. అపర వైరాగ్యవంతునికి గుణములు వేరు, పురుషుడు వేరు అనే దృడమైన వివేకజ్ఞానం కలుగుతుంది. ఇది కలిగిన వణికి ఇంతవరకు ఉపకరనములుగా వున్న గుణముల విషయము నందు కూడా వైరాగ్యం కలుగుతుంది.చిత్తము వేరు, పురుషుడు వేరు అనే జ్ఞానమందు కూడా వైరాగ్యం కలుగుతుంది. ఇదియే పరావైరాగ్యం.ఇట్టి ధ్రుడమైన వివేకము కలిగిన వణికి భోగావిషయములయందేకాక, వివేకఖ్యాతినందు కూడా వైరాగ్యము కలుగును. జ్ఞానము యొక్క ఈ అత్యున్నత స్తితియే పరావైరాగ్యం.
సమాధి రెండు విధాలు : i.సంప్రజ్ఞాత సమాధి ii. అసంప్రజ్ఞాత సమాధి.
సంప్రజ్ఞాత సమాధి : సంప్రజ్ఞాత సమాధి వలన ప్రకృతిని వశపరచుకోవటానికి కావలసిన శక్తులన్నీ లభిస్తాయి.సంప్రజ్ఞాత సమాధి మోక్షప్రదం కాజాలదు. సర్వసిద్దులు పొందిన యోగి పతనం కావచ్చును. సంప్రజ్ఞాత సమాధిలో నేను అనే జ్ఞానం ఇంకభాసిస్తూ వుంటుంది. సంస్కార బీజాలు ఉంటాయి.
అవ్యక్త సంస్కారం మాత్రమే చిత్తంలో శేషించి, చిత్తవృత్తుల నన్నింటిని నిరాకరించే సమాధి నిరంతరాభ్యాసం వలన లభిస్తుంది. దీనినే అసంప్రజ్ఞాత సమాధి అంటారు.ఇది ఇంద్రియాతీతమైన జ్ఞానవ్యవస్థ. దీనివలన మాత్రమే మోక్షం లభిస్తుంది.
ఆస్తిక్య బుద్దితో యోగాన్ని సాధించవలననే ఉత్కంటను శ్రద్ద అంటారు. అటువంటి శ్రద్ద గలవారు ఎన్నో ఆటంకాలను అధిగమించగలుగుతారు. శ్రద్దవలన వీర్యము, అంటే వివేకము గుర్చిన ధారణ (ఉత్సాహము), తద్వారా స్మృతి అంటే ధ్యానము కలుగును. ధ్యానము వలన సమాధి , సమాధి వలన ప్రజ్ఞ అంటే తత్వసక్షాత్కారము కలుగును. ఇదియే ప్రజ్ఞ. తీవ్ర కార్యదీక్ష ఉన్నవారికి ఫలితం త్వరితంగా లభిస్తుంది.అతి తీవ్ర సంవేగులకు చాల త్వరితంగాను యోగము సిద్దిస్తుంది.
కర్మఫలాలను ఎస్వరునుకి సమర్పించటం ద్వార కూడా యోగం సిద్దిస్తుంది. భక్తితో ఈశ్వరుని మనోవాక్కాయములచే సేవించుచు, అతనిపై చిత్తము నిలుపుట ద్వార కూడా యోగాసిద్ది లభించును.
సర్వజ్ఞత్వం ఈశ్వరునిలో అనంతంగా వుంటుంది. అత్యదికమైన జ్ఞానం (నిరతిశయంగా) ఒక్క ఈశ్వరునిలో మాత్రమే వుంటుంది. కాలము చేత భాదింపబడనివాడు అంటే కాలాతీతుడు కావటం చేత, అతడు సనాతనాచార్యులకు కూడా గురువై ఉన్నాడు. అతడే అఖండ జ్ఞానస్వరుపుడైన భగవంతుడు. అతడు కాలము చేత కొలవబడనివాడు.
శారీరక రోగం, మానసిక జడత్వం, సంశయం, అజాగ్రత్త మత్తత, అసంతృప్తి, భ్రమ, చిత్తస్తైర్యం నిలువకున్దుట అనేవి యోగానికి అంతరాయాలు.దుఃఖ0, చిత్తక్షోభం, శరీరకంపనం, క్రమరహితశ్వాస అన్నవి చివిక్షేపనికి తోబుట్టువులు వంటివి. చిత్తం శాంతిగా లేనప్పుడు – శరీరం కంపించటం, శ్వాస క్రమరహితంగా జరగటం, దుఃఖ0 కలగటం జరుగుతుంటాయి.
అటువంటి చిత్తక్షోభని, చంచల్యాన్ని నివారించటానికి, ఎకతత్వాన్ని అభ్యసించాలి. అంటే క్రమం తప్పకుండ కొంతకాలం మనసునొకే విషయంపై (అంటే హృదయంలో జ్యోతి వుందని) నిలిపి ధ్యానం చేయాలి.
నిరంతర ధ్యానం వలన యోగి చిత్తంలో ధ్యేయం తప్ప మిగిలిన వృత్తులు క్షీణించి ఆచిట్ట్టం ఆత్మ లేక పురుషునిలో తాదాత్మ్యం పొందుతుంది.ఈ విధముగ గ్రహీత్రాదులపై నిలిచినా చిత్తము తదాకారము పొందుటయే సమాపత్తి. సమాపత్తి అనగా సాక్షాత్కారము. సాక్షాత్కారము పొందుటయే సంప్రజ్ఞాత సమాధి ఫలము.
స్మృతి పరిశుద్దమగుచు రాగా ధ్యాన భూమిక శబ్ద, అర్ద, జ్ఞానములు పురుషుడు సంపూర్ణముగా తెలిసికోనుచున్నాడు.
పై సూత్రంలోని శబ్ధర్ధజ్ఞాన మిశ్రమ సవితర్కధ్యాన సాధన వలన, ఈ మూడు కలియని నిర్వితర్క సమాధి స్తితి లభిస్తుంది. నిర్వితర్క ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం చేస్తే, సమస్త వృత్తులకు ఆశ్రమమైన స్మృతి పరిశుద్దమౌతుంది. అప్పుడు శబ్దార్ధజ్ఞానా లను వేరు వేరుగా గ్రహింపగలం. దీనినే నిర్వికల్ప సమాధి అంటారు.
నిర్విచార సమాధి వలన ఆధ్యాత్మ ప్రసాదమైన స్టిరా చిత్తం కలుగుతుంది.నిర్విచార సమాధి యందలి ప్రజ్ఞ సత్యపరిపూర్ణమైనది. ఈ స్తితిని అందుకొనిన యోగి పొందెడి ప్రజ్ఞాయే ఋతంభర (kinetic energy) సత్యము (static energy)సృష్టికి మూలము, మరియు అచలము. ఋతము చలింపచేసే శక్తి.
నిర్విచార సమాధి సాధన చిరకాలం కొనసాగిస్తే సమస్త వృత్తులకు ఆశ్రయమైన స్మృతి శుద్దమవుతుంది.ఈ సమాధి వలన కలిగే సంస్కారం అంటే ప్రజ్ఞా విశారదత్వము, ఋతుంభరత్వము ఇతర సంస్కరములు అన్నింటిని నిగ్రహిస్తాయి. చిత్తాన్ని ఏకాగ్రం చేయటాన్ని ప్రయత్నం ప్రారంభించగానే, చిత్త వృత్తులు విజ్రుంభిస్తాయి.ఏకాగ్రతని లభించనీయవు. కానీ పైన చెప్పిన సాధన వలన చిత్త ఏకాగ్రత పెరిగి, తద్వారా కలిగే సంస్కారాలు ఇతర సంస్కారాలను నిరోదించ గల్గేంత ప్రబలంగా ఉంటాయి.
ఋతంభర ప్రగ్నవలన ఇతర ప్రకృతి జన్యములైన సంస్కరములన్ని నిరోదింపబడును. ఇతర సంస్కారాలను నిరోదించే ఈ సంస్కారాన్ని కూడా నిరోదించటం వలన సర్వం నిరోదితమై నిర్బీజ సమాధి ఏర్పడుతుంది.

ఓం నమో పరమాత్మయే నమః
Read More

మనకు తెలియని శ్రీశైల దివ్యక్షేత్ర మహిమలు:

మనకు తెలియని శ్రీశైల దివ్యక్షేత్ర మహిమలు:
ఆగమంలో లేని అమ్మవారు ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం. 
జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారికి కామేశ్వరి అని పేరు ఉంది. 
పరమశివుడు ఎలా ఉంటాడో అమ్మవారు అలాగే ఉంటుంది రూపంలో. 
అలా ఉండే పార్వతీ పరమేశ్వరులలో ఉన్నటువంటి అమ్మవారి తత్త్వానికి కామేశ్వరి అని పేరు. 
కానీ భారతదేశం మొత్తం మీద ఇష్ట కామేశ్వరి అన్న మాట లేదు. ఆ మాటతో మూర్తి లేదు. ఒక్క శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి ఉంది.
ఆవిడను దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో వున్న కొన్ని జీపులు మాత్రం వెళ్తాయి. అది కూడా గుండె దిటవు వున్నవాళ్ళు అయితేనే వెళ్ళగలరు. ఆ ఆలయం ఈరోజు శిథిలమై పోయి చిన్న గుహ ఉన్నట్లుగా ఉంటుంది.
అందులోకి వెళ్ళి అమ్మవారిని చూస్తే చతుర్భుజి.
అమ్మ నాలుగు చేతులతో ఉంటుంది.
రెండు చేతులతో లక్ష్మీ దేవి ఎలా తామరమొగ్గలు పట్టుకుంటుందో అలా తామర మొగ్గలు పట్టుకొని ఉంటుంది.
ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగాన్ని పట్టుకొని యోగినీ స్వరూపంలో ఉంటుంది.
సాధారణంగా కామేశ్వరీ తంత్రంలో అమ్మవారి స్వరూపం ఎలా చెప్తామో అలా లేదు కదా ఇక్కడ!
కామేశ్వరి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఈవిడ అలా లేదు కదా! మరెందుకు వచ్చిందీవిడ?
అంటే ఒకానొకప్పుడు శ్రీశైలంలో ఒక రహస్యం ఉండేది.
ఎంత గొప్ప కోర్కె తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతోంది అనుకున్న వాళ్ళు కూడా ఎందుకంటే శ్రీశైలం ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. ఉత్తరభారతదేశంలో ఉజ్జయినికి ఉంది. కాశీ పట్టణానికి ఉంది. దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒక్కటే. ఎందుకంటేఅక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు. అక్కడ కాపాలికుల దగ్గరనుంచి. ఇప్పటికీ శ్రీశైలం లోపల ఉన్న గుహలలోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చేయగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కాపాలికులు నరబలి కూడా ఇస్తారు. అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రనికి ఉంది. అంతే కాదు. అక్కడ స్పర్శవేది చేత ఒకప్పుడు సిద్ధ నాగార్జునుడు శ్రీశైలం కొండనంతటినీ కూడా బంగారం కొండగా మార్చే ప్రయత్నం చేశాడు. ఆయనే మూలికల మూట తెచ్చి త్రిఫల వృక్షం క్రింద పెట్టాడు. అటువంటి గొప్పగొప్ప ఓషధులన్నీ శ్రీశైల పర్వతం మీద ఉన్నాయి. అటువంటి శ్రీశైలంలో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆ తల్లి తీర్చని కోర్కె అన్నది లేదు. నీకు ఏది ఇష్టమో అది ఇస్తుంది. అందుకు ఇష్ట కామేశ్వరి. భారతదేశం మొత్తం మీద ఇక ఆ రూపం లేదు. ఒక్కశ్రీశైలంలోనే ఉంది. ఇంకొక పెద్ద రహస్యం ఏమిటంటే పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బొట్టు పెడితే మెత్తగా మనిషి నుదురు ఎలా తగులుతుందో అలా తగులుతుంది ఆవిడ నుదురు. విగ్రహమా? మానవకాంతా? అనిపిస్తుంది. ప్రక్కనే శివాలయం ఉండేది. కానీ ధూర్తులు శివలింగాన్ని కూడా పెళ్ళగించేశారు. ఆ ప్రదేశంలో ఇప్పటికీ పెద్ద గొయ్యి ఉంటుంది. అక్కడ ఉండేదంతా చెంచులే. అక్కడికి వెళ్ళి కాసేపు కళ్ళుమూసుకొని కూర్చుంటే సెలయేళ్ళ ప్రవాహం చేత ధ్యానమునకు అత్యంత యోగ్యమైనదిగా ఉంటుంది. కాపాలికుల దగ్గరినుంచి సాక్షాత్తు శ్రీ శంకరుల వరకు ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో శైవంలో అన్ని సంప్రదాయాలు శ్రీశైలానికి చేరి శ్రీశైల మల్లికార్జునుడిని పూజించినవే...Read More

శ్రావణ మాసాన్ని నభో మాసం అని అంటారు

శ్రావణ మాసాన్ని నభో మాసం అని అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి, విశిష్టిథ కలిగినవి... ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల /రాఖి పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థి ,నాగ పంచమి , పుత్రాదా ఏకాదశి ,దామోదర ద్వాదశి ,వరాహ జయన్తి ....ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసంలో చంద్రుడికి విశిష్టథ కలిగిన మాసం కూడా...చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసములో రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపిస్తింది. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకోవటానికి ,మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.

Read More

అష్టాదశ పురాణాలలో శివ పురాణం ఒకటి

అష్టాదశ పురాణాలలో శివ పురాణం ఒకటి. వాయవీయ సంహితలో చెప్పిన ప్రకారం ఇందులో 12 సంహితలు, లక్ష శ్లోకాలు ఉండేవట. కాని వేదవ్యాసుడు పురాణాలను పునర్విభజన చేసిన తరువాత ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుడు దీనిని తన శిష్యుడు రోమహర్షణునికి ఉపదేశించాడు.
శివ పురాణములో 26,000 శ్లోకాలు (మరొక లెక్క) ఉన్నాయి. శివ పురాణాన్ని ఏడు సంహితలుగా విభజించారు.
విద్యేశ్వర సంహిత లో 25 అధ్యాయాలు ఉంటాయి
రుద్ర సంహిత లో సృష్టి ఖండము ,సతీ ఖండము ,పార్వతీ ఖండము ,కుమార ఖండము ,
యుద్ధ ఖండము ,శతరుద్ర సంహిత,కోటి రుద్ర సంహిత ,ఉమా సంహిత ,కైలాస సంహిత
వాయివీత సంహిత .
ప్రతి అధ్యాయములో ను అనేక ఉపాఖ్యానాలు, పూజా విధానాలు చెప్పబడినవి. ఆన్ని పురాణములలోను (మత్స్య పురాణము లో తప్ప) శివ పురాణము గురించి చెప్పబడింది.Read More

శ్రీ సూర్య దివ్య కవచ స్తోత్రమ్ ధ్యానమ్:

శ్రీ సూర్య దివ్య కవచ స్తోత్రమ్
ధ్యానమ్:
శ్లో || త్రిమూర్తి రూపం విశ్వేశం శూల ముద్దర ధారిణమ్ |
హిరణ్యవర్ణం సుముఖం ఛాయా యుక్తం రవిం భజే ||
స్తోత్రమ్
శ్లో || భాస్కరోమే శిరం పాతు లలాటం లోక బాంధవః |
కర్ణౌత్ర యీమయః పాతు నాసికాం విశ్వరూపభ్రత్ ||
నేత్రే చాధోక్షజః పాతు కంటం సప్తాశ్వవాహనః |
మార్తాండో మేభుజౌ పాతు కక్షౌ పాతు దివాకరః ||
పాతుమే హృదయం పూషా వక్షః పాతు తమో హరః
కుక్షిం మేపాతు మిహిరో నాభిం వేదాంత గోచరః ||
ద్యుమణిర్మే కటింపాతు గుహ్యంమే అబ్జబాంధవః|
పాతమే జానునీ సూర్యో ఉరూపాత్యురు విక్రమః ||Read More

హిందూ ధర్మము ఎవరిచేతను ఆరంభింపబడలేదు

హిందూ ధర్మము ఎవరిచేతను ఆరంభింపబడలేదు. ఇది అనాదికాలమునుండి వచ్చుచున్నది.
ఒకనదియొడ్డున ఒక ఆశ్రమము ఉన్నది. ఆ ఆశ్రమమునకు చేరుటకు రెండు మూడు మార్గములున్నవి. వాటిలో ఒకటి ముఖ్యమైన మార్గము రెండవది మధ్యరకము. మూడవది కాలినడకలో పోవుదారి. ఈ మూడవ దారికంటే మొదటి రెండు మార్గములు ఇరుకుగా ఉండడం వలన, మరియు చేరుటకై సమయము ఎక్కువ అవటము వలన అప్పుడప్పుడు కొన్న దుర్ఘటనలు జరిగే ప్రమాదము ఉన్నది. కానీ కాలినడకతో పోయే మార్గము సులభమైనది. ఎటువంటి దుర్ఘటనలు జరగనిది. హిందూ ధర్మము కూడా ఇటువంటిదే. ఈ హిందూ ధర్మమార్గమును అనుసరించినచో ఎటువంటి దుర్ఘటనలు జరుగవు. పైన చెప్పిన మిగతా రెండు మార్గములు ఇరుకుగా వుండుట వలన అప్పుడప్పుడు తొందరగా చెడిపోవును. వానిని బాగుచేయుట అధిక సమయముతో కూడిన పని. కాని కాలినడకతో పోయే మార్గము చెడిపోదు. దానికి వ్యయము అవసరము లేదు. అది నడకవలన ఇమ్కను బాగుపడును. ఈ విధముగా హిమ్దూ ధర్మము కూడా వ్యయముతో కూడినది కాదు. ఎంతవరకు ఆచార వ్యవహారములుండునో అంతే ప్రచారముండును. కావున ఈ ధర్మము ఎవరిచేత ఆరంభించబడలేదు. ఇది అనాదినుండి వచ్చుచున్నది.
Read More

సోమవారం శివునికి ప్రీతికరముగ భావిస్తాము....నిజానికి ప్రతికాలము పరమేశ్వరార్చనకు ప్రాముఖ్యతన్న్నిస్తాయి.

సోమవారం శివునికి ప్రీతికరముగ భావిస్తాము....నిజానికి ప్రతికాలము పరమేశ్వరార్చనకు ప్రాముఖ్యతన్న్నిస్తాయి. అయితే 
"శివ పురాణము " ప్రకారం "ఆదివారం" శివారధనకు చాలా ప్రాధాన్యం. ఆ రోజున రుద్రాభిషేకాలు నిర్వహించడం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం. 
అది అలాగ ఉండగా, సోమవారం " సౌమ్యప్రదోషం" గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని పురాణాది శాస్త్రాల వచనం.
సోమవారమ్నాడు ఉదయాన్నే నిత్య కర్మలు పూర్తిచేసి, ఉపవాసముండి సాయంకాలం శివున్ని ఆరధించి, నక్షత్రోదయ సమయాన్న ఈశ్వర నివేదితమైన వంటని తినడం నక్త వ్రతం అంటారు. ఇది ఐశ్వర్యకరం, సర్వాభీష్ఠప్రదం!
స్కందాది పురాణాలలో సోమవారవ్రతం గురించి విశేషముగ చెప్పారు. పై నియమముతో 16 సోమవారాలు చేస్తే అన్ని గ్రహదోషాలు పోవడమేకాక, అన్ని అభిష్టాలు నెరవేర్తాయి.
ప్రత్యేకించి ఈ సోమవారాలు శ్రావణ మాసంలోనూ, కార్తీకంలోను మరీ విశేషం. నభోవాస ఇందువాసరే - శ్రావణ మాస సోమవారాలలో ఈశ్వరారాధన మహైశ్వర్య ప్రదం
ఆ సాయంకాలార్చనలో, స్వామిని బిల్వాలతో అర్చన చెయ్యడం సంప్త్ప్రదాయకం.
ఇందువాసరే వ్రతంస్థిత్వా
నిరాహారో మహేశ్వరౌ
నక్తం హౌష్యామి......అని శాస్త్ర వచనం.
లక్ష్మి ప్రదమైనది ఇందువాసరం. (సోమవారం)
పార్వతిసహిత పరమేశ్వరున్ని ఆర్ధించాలి.
"సోమ" శబ్దానికి " చంద్రుడు" అనే అర్ధమే కాక, స+ ఉమ = ఉమా సహితుడు అని శివపరమైన అర్ధము చెప్పవచ్చు
రామాద్యవతారాలలో శ్రి మహా విష్ణువు కూడా సదా శివుని అర్చించి, మనకు కారణ మార్గం ఉపదేశించారు.
శ్రీ రాముడు అగస్త్య మహర్షి ద్వారా " విరజా దీక్ష" ను స్వీకరించి, భస్మోద్ధుళితాం గుడై శివధ్యానంలో గడిపాడని "పద్మ పురాణం" చెప్తోంది.
అతడి దీక్షకు ఫలితముగ, సదాశివుడు పార్వతి సహితుడై సాక్షత్కరించి, దేవసభా మధ్యంలో, శ్రీ రామునకు సందర్శాననందాన్నిచ్చాడు.
శివూని సహస్ర నామాలతో సంస్తుతించి, ప్రసన్నుని చేసుకున్నాక తిరిగి, ఏకాంత దర్శనమిచ్చి రామునకు శివుడు చెప్పిన విషియాలే "శివ గీత" గా ప్రసిద్ధమయ్యాయి.
శ్రీ కృష్ణుడు కుడా ఉపమన్యు మహర్షి వలన శివ దీక్షను పొంది, శివారాధన చేసినట్లు, శివధర్మాలను అర్జున ధర్మరాజాదులకు ఉపదేశించినట్లు " మహాభారతం " చెప్తోంది.
శివస్య హృదయం విష్ణుః
విష్ణోశ్చ హృదయం శివః
శివుని హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు.
శివుడు రామ కృష్ణాది విష్ణువు నామ జపం లో ఆనందతుడువుతుంటే, విష్ణువు శివార్చనలో ఆనందిస్తాడు. శివుడు పరమ వైష్ణవుడు. విష్ణువు పరమ శైవుడు.


Read More

Powered By Blogger | Template Created By Lord HTML