గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 25 June 2014

కలియుగ లక్షణములు:

కలియుగ లక్షణములు:
సాలగ్రామాలు, శివశక్తులు జగన్నాథుడు కలియుగంలో 10000 సంవత్సరముల తర్వాత భారత భూమిని విడిచిపెట్టి స్వస్థలం చేరుకుంటారు. సాధువులు పురాణములు శంఖాలు శ్రార్థ తర్పణములు, వేదోక్తకర్మలు, దేవపూజలు, దేవనామదేయాలు, గుణ కీర్తనలు, వేదాంగాలు, సకలశాస్త్రాలు, సత్యధర్మాలు, వేదాలు, గ్రామదేవతలు, వ్రతాలు, తపస్సులు, ఉపవాసాలు ఇత్యాదులన్నీ వారితోపాటే తరలి వెళ్ళిపోతాయి. అటుపైన భూగోళం నిండా వామాచారులు మిగులుతారు. కపటులు, మిథ్యావాదులు మిగులుతారు. తులసి కలికానికైనా కనిపించదు. ఏ పూజలు ఉండవు. పొట్ట పూజతప్ప. అందరూ శఠులు, క్రూరులు, దాంభికులు, అహంకారులు, చోరులు, హింసకులు ఐపోతారు, స్త్రీ పురుష బేధం తప్ప తక్కిన వావివరసలు అంతరిస్తాయి. నిర్భయంగా జరిగే వివాహములు ఉండవు. వస్తువులకు భద్రత ఉండదు. ఎక్కడ చూసినా ఇంటింటా అడపెత్తనమే సాగుతుంది. తర్జన భర్జనలతొ భార్యలు భర్తలను కొడుతూ ఉంటారు.
ఇల్లాలే ఇంటికి అధిపతి. మొగుడు సేవకుడి కంటే అథముడు. అత్తమామలు దాసీదాస సమానులు. ఇళ్ళలో రక్తసంబందులే తప్ప విధ్యాసంబంధులు ఎవ్వరూ కనబడరు. విధ్యా సంబందులతో మాటలే ఉండవు. మనుషులంతా అపరిచితులలా మెలుగుతుంటారు. ఆడవారి అజ్ఞ లేనిదే ఎవ్వరూ ఏపని చేయలేని దుర్భలులై పోతారు.
కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాలు అన్నీ అంతరిస్తాయి. సంధ్యావందన, యజ్ఞాసూత్రాది కర్మలు కనిపించవు. చతుర్వర్ణముల వారు మ్లేచ్యా చారులైపోతారు. మ్లేచ్య విద్యలే నేర్చుకుంటారు. మ్లేచ్య శాస్త్రములే పఠిస్తారు. అగ్రవర్ణములవారు అట్టడుగువారికి సేవకులౌతారు. ప్రజలందరూ సత్యహీనులౌతారు. మేధినీ (భూ)మండలంలో సత్యానికి తావే ఉండదు. తరువులు(వృక్షాలు) ఫలహీనములు అవుతాయి, తరుణులు (స్త్రీలు) సంతానహీనులౌతారు. గోవులు క్షీరహీనమౌతాయి. దంపతులు ప్రీతిహీనులౌతారు. గృహస్థులు సత్యహీనులౌతారు. రాజులు ప్రతాపహీనులౌతారు. ప్రజలు కర (పన్నులు)పీడితులౌతారు. నదీనదా వాపీకూప తటాకాదులు (సరస్సులు, సెలయేర్లు, చెరువులు) జలహీనాలౌతాయి. చతుర్వర్ణములు వారు ధర్మహీనులు, పుణ్యహీనులు అవుతారు. కోటికోక్కడైన పుణ్యాత్ముడు కనిపించడు. బాలబాలికలు కుత్సిత విక్రుతాకారులు అవుతారు. అంతటా కుత్సిత కువార్తలే వినిపిస్తాయి.
కొన్ని నగరాలు, గ్రామాలు నరశూన్యాలు అయిపోతాయి. భయానకంగా మారిపోతాయి. కొన్నిచోట్ల ఒక కుటీరంలో ఒక మనిషి మాత్రమే కనిపిస్తాడు. నగరములలో, గ్రామములలో అరణ్యములు పెరుగుతాయి. అరణ్యవాసులు కూడా కర పీడితులౌతారు. తాటక నదీతీరములలొ మాత్రమే పంటలు పండుతాయి. ఉన్నత వంశములవారు నీచ్యపడతారు. అసత్యవాదులు దూర్తులౌతారు. సారవంతమైన భూములు నిస్సారమైపోతాయి. నీచ్యులు ధనవంతులౌతారు. దైవభక్తులు నాస్తికులౌతారు. పౌరులు దయవిహీనులు, హింసకులు, నరఘాతకులు అవుతారు. స్త్రీ పురుషులందరూ వామనులు(పొట్టివారు), వ్యాదిపీడితులు గానే ఉంటారు. అల్పాయుష్కులు, 20ఏళ్ళకే వృద్దులైపోతారు. యవ్వనమే కనిపించదు. 8ఏళ్ళకే యువతులు రజస్సులై గర్భిణీలౌతారు. సంవత్సరానికి ప్రసవించి 16ఏళ్ళకే ముసలమ్మలౌతారు. పతీ పుత్రవతులు అరుదుగా కనిపిస్తారు. ఎక్కువమంది గోడ్రాళ్ళు గానే మిగిలిపోతారు. చతుర్వర్ణముల వారు నిస్సంకోచంగా కన్యా విక్రయం చేస్తారు. కుటుంబంలో మగవారు జారులపై ఆధారపడిజీవనం సాగిస్తారు. వారు అందించే సొమ్ముతో పోట్ట పోసుకుంటారు. కలియుగంలో ఇంకా దారుణం ఏమిటంటే శ్రీహరి నామం కూడా ఒక వ్యాపార వస్తువు అవుతుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML