గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 25 June 2014

గణపతి బౌద్ధుల దేవుడా?

గణపతి బౌద్ధుల దేవుడా?
అమరకోశంలో బుద్ధుని పర్యాయ నామాలలో వినాయకుడి నామం ఉంది అని అంటారు. గణపతి స్వరూపం, పూజనం బౌద్ధ మత ప్రభావం వలన వైదిక మతంలో ప్రవేశించాయని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. ఇది నిజమేన ?
బౌద్ధ మతం ఈ దేశంలో ఉద్భవించింది. అప్పటివరకు సనాతన భారత ధర్మంలో ఉన్న నైతిక నియమాలను, అహింసా ధర్మాలను బౌద్ధ మతం తమ ధర్మాలుగా వ్యవస్థీ కరించుకుంది. ఆ కారణం చేత హిందూ మతంలో అంతర్భాగమయ్యింది. దానితో పాటు మన తంత్ర శాస్త్ర గ్రంధాలను అధ్యయనం చేసి బౌద్ధుల తంత్రోపాసనలను చేపట్టారు. చారిత్రిక పరిసోధనల్లో ఇవి స్పష్టమౌతున్నాయి. అవలోకితేశ్వరుడు వంటివారు నేపాల్, టిబెట్ సమీప ప్రాంతాలలో తార, మహాకాల వంటి దేవతోపాసనలను విరివిగా చేశారు. ఇప్పటికీ వారి ఆరామాలలో ఆ దేవతల పూజలు జరుగుతాయి. మన దశమహావిద్యలలోని తార( రెండవ విద్య ) వారి సాంప్రదాయంలో చేరింది. వారి జాతక కధలు కూడా హైందవ దేవతలను పేర్కొన్నాయి. ఇదే పద్ధతి జైనులు కూడా అవలంబించారు.
వైదిక మూలాలనుండి తంత్రశాస్త్రాలలోకి విస్తరించిన గణపతి, సరస్వతి,లక్ష్మీ - వంటి వైదిక దేవతలను బౌద్ధ,జైన మతానుయాయులు ఉపాసించారు. అంతేగాని బౌద్ధం నుండి మనలోకి ప్రవేసించిన దేవతలు లేరు. బౌద్ధ మంత్రాలలోని " ఓం మణిపద్మేహుం" వంటి మంత్రాలు మన ఓంకారాన్ని, తంత్రాలలోని " హుం" వంటి బీజాలను ఉపయోగించాయి. గణపతి స్వరూపం, పూజనం వైదిక మతం నుండి బౌద్ధ తంత్రంలోనికి ప్రవేసించినదే కాని - వారి నుండి వైదికంలోనికి రాలేదన్నది సుస్పష్టం!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML