గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 21 June 2014

ఇవాళ హిందువులంతా గురకలు పెట్టి నిద్రపోతున్నారు. వాళ్లమీద బాణాలు పడుతున్నాయన్న సంగతి కూడా వారికి తెలియట్లేదు.


......
భారత ఉపఖండాన్ని హిందూ ధర్మం ఆరు వేల సంవత్సరాల పాటు ప్రజల జీవితాలను స్పృజించింది. నేడు ఆ ధర్మం ఇబ్బందుల్లో పడ్డది. ఆఫ్గనిస్తాన్ భారతదేశంలో ఒక భాగం. అక్కడ శివపూజలు, విష్ణుపూజలు బ్రహ్మాండంగా జరిగాయి. అన్నీ పోయినయి.. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మనది అన్న సంగతి కూడా మరచిపోయాం. ఒక యాభై ఆరవై ఏళ్ల కిందట లాహోర్, రావల్పిండిలో, కరాచిలో, శివపూజలు జరిగేవి, మన పీఠాధిపతులు అక్కడకు వెళ్లేవారు. పూజలు, పట్ట్భాషేకాలు అన్నీ జరిగాయి. అక్కడా ధర్మం వర్ధిల్లుతోందని, ఎక్కడికీ పోదని లాహోర్, రావల్పిండి, కరాచీలలో పుణ్యాత్ములు, భక్తులు, వేదాంత శిఖామణులు ధర్మాచార్యులు అప్పుడు చెప్పే ఉంటారు. ఏమయింది? దుష్ట రాజకీయ నాయకులు హిందూ ధర్మంపై ఓట్ల దాడి చేస్తుంటే ఒక్క ధర్మాచార్యుడు మాట్లాడలేదు, ఒక్క పీఠాధిపతి మాట్లాడలేదు. మరి ఏమైంది సనాతన ధర్మం? ఈవేళ భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలలో హిందూ మతానికి నిలవనీడలేదు. ఈశాన్య భారతం ఎప్పుడో మనది కాకుండా పోయింది. దక్షిణాదిన పోయింది. ఆంధ్రదేశంలో మనం మెజారిటీలో ఉన్నాము ఇక్కడ అంతా హిందూమతమే ఉన్నదని మనం అనుకోవడానికి, మన ఆత్మానందానికి పనికొస్తుంది కాని, ఆంధ్రదేశంలో హిందువులు మైనారిటీలో ఉన్నారన్న అసలు జ్నానం గ్రహించలేకపోతున్నారు. మనల్ని అణచివేయాలని, తొక్కివేయాలనే అధర్మ యుద్ధం మొదలైంది. దాని ఎదుర్కోవాలంటే ధర్మయుద్ధం జరగాలి. కాని ఇవాళ హిందువులంతా గురకలు పెట్టి నిద్రపోతున్నారు. వాళ్లమీద బాణాలు పడుతున్నాయన్న సంగతి కూడా వారికి తెలియట్లేదు. ఇది ఎంత తొందరా గరిస్తే అంత మంచి..@ జనబంధు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML