గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 21 June 2014

దేవుడి సొమ్మును ఆశగా చూడకూడదు ... ఆ సొమ్మును తాకకూడదు ... కలలో కూడా ఆ సొమ్మును కోరుకోకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది.

దేవుడి సొమ్మును ఆశగా చూడకూడదు
దేవుడి సొమ్మును ఆశగా చూడకూడదు ... ఆ సొమ్మును తాకకూడదు ... కలలో కూడా ఆ సొమ్మును కోరుకోకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది.
ఆశ్చర్యచకితులను చేసే ఓ సంఘటనకు వరంగల్ జిల్లాలోని 'అనంతాద్రి' క్షేత్రం వేదికగా నిలుస్తోంది. ఇక్కడి కొండగుహలో సుభద్ర - బలరాముడు - జగన్నాథుడు ఆవిర్భవించారు. ఇదే సన్నిధిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆవిర్భవించాడు. ఇక ఈ క్షేత్రానికి పాలకుడైన హనుమంతుడు కూడా స్వయంభువు కావడం ఇక్కడి విశేషం. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రం కనుకనే కొండ పాదభాగం నుంచి గుహాలయం వరకూ బహుళ అంతస్తులతో ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణ శైలి ... ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన హనుమంతుడు - గరుత్మంతుడు విగ్రహాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.
పూర్వకాలంలోనే ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఇక్కడి స్వామిని దర్శించుకుని కానుకలు ... మొక్కుబడులు చెల్లించేవారు. అలా చెల్లించిన సొమ్ము గుహలోని ఓ పెట్టెలో భద్రపరచబడేది. ఆ సొమ్ముపై కన్నేసిన కొందరు దొంగలు, ఓ రాత్రివేళ వాటిని కాజేశారు. దాంతో ఓ దివ్యమైన తేజస్సు వారిని వెంటాడటం ... దొంగలు పారిపోతూనే ఎక్కడివాళ్లు అక్కడ బండరాళ్లుగా మారిపోవడం జరిగిపోయాయి.
ఈ దృశ్యం చూసిన కొందరు మిగతా గ్రామస్తులకు చెప్పారు. ఆ బండరాళ్ల పక్కనే స్వామివారికి సంబంధించిన ఆభరణాలు కనిపించడంతో, జరిగిన సంఘటనని అందరూ విశ్వసించారు. ఆ రోజు నుంచి స్వామివారి సొమ్ముకు మరింత భద్రత కల్పించారు. ప్రశాంతమైన వాతావరణంలో పవిత్రత ఉట్టిపడుతూ కనిపించే ఈ ఆలయాన్ని దర్శించడం వలన శుభాలు చేకూరతాయని భక్తులు చెబుతుంటారు. మహిమాన్వితుడైన స్వామికి మనసారా పూజాదికాలు నిర్వహిస్తుంటారు.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML