గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 25 June 2014

ఆమోద, ప్రమోద, సుముఖ, దుర్లభ, విఘ్న, విఘ్నకర్తా, వీళ్ళు ప్రధానమైన దేవతలుగా చెప్పబడుతున్నారు.

ఆమోద, ప్రమోద, సుముఖ, దుర్లభ, విఘ్న, విఘ్నకర్తా, వీళ్ళు ప్రధానమైన దేవతలుగా చెప్పబడుతున్నారు. ఆమోద, ప్రమోద ఈ రెండూ ఉంటాయి గణపతి దగ్గర. ఆనందముయోక్క రెండు స్వరూపాలు. అంతేకాదు మరొక విశేషం ఉంది. ఏ కార్యాన్నైనా చేసే ముందు ఈ కార్యం తప్పకుండా జరుగుతుంది అని తెలిసిపోతే చేసేముందు ఆనందం ఉంటుంది, చేసేటప్పుడు ఆనందం ఉంటుంది. చేస్తున్నాం కానీ జరుగుతుందో లేదో అని చివరివరకు టెన్షన్ పడుతున్నప్పుడు ఆమోదం లేదు. కార్యారంభం నుంచే మనకు దానిపై ఒక Possitive Attitude పైగా జరుగుతుందని సంపూర్ణమైన విశ్వాసము కానీ కలిగితే ఆకార్యం మరింత తృప్తిగా చేస్తాం. ఆ భావానికి ఆమోదం అని పేరు. కార్యసిద్ధి పొందాక కలిగే ఆనందానికి ప్రమోదం అని పేరు. గణపతిని ఆరాధన చేస్తే రెండూ ఇస్తాడు. అంటే కార్యారంభంనుంచే ఆమోదం ఉంటుంది. కార్యసిద్ధిలో ప్రమోదం ఉంటుంది. అనుగ్రహానికి రూపమిస్తే దేవతలు.
సుముఖ-దుర్ముఖ: సుముఖం అంటే అనుకూలత. దుర్ముఖః అని స్వామికి ఒక పేరున్నది. దుర్ముఖుడు అంటే తేరిపార చూడరాని వాడు. సూర్యుడికి దుర్ముఖుడు అని పేరుంది. అనవచ్చా మహానుభావుడిని. ప్రొద్దున ఉదయించినప్పుడు సుముఖుడే మధ్యాహ్నం దుర్ముఖుడు. ఆయనిచ్చిన ఎండ కావాలి కానీ తలెత్తి చూడలేం. తేజస్స్వరూపుడు. అలా ఆయన మహా తేజస్స్వరూపుడై ప్రకాశించే వాడు కనుక దుర్ముఖుడు అని చెప్పబడుతున్నాడు. అంతేకాదు ఇక్కడ దుష్టశక్తులకు దుర్ముఖుడు, శిష్టశక్తులకు సుముఖుడు. శిక్షా-రక్షా నైపుణ్యాలు రెండింటినీ ఇక్కడ చూపిస్తున్నారు. కనుక సద్భావాలకి సుముఖుడు, దుర్భావాలకి దుర్ముఖుడు.
విఘ్న-విఘ్నకర్తా: విఘ్న కర్తా, విఘ్నహర్తా రెండూ ఆయనే. అవిఘ్న, విఘ్న కర్తా రెండూ ఆయనయొక్క స్వరూపములే.
ఇవి కాకుండా వృద్ధి- సమృద్ధి, కాంతి, మదనావతి- మదద్రవ అనే శక్తులున్నాయట. వృద్ధి సంపూర్ణమైనప్పుడు సమృద్ధి; మనలో ఆనందం వచ్చినప్పుడు brightness వెలిగిపోతూంటుంది. వర్చస్సు - అదీ చూపిస్తున్నాడు. అదేవిధంగా మదద్రవ-మదనావతి- ఈ మాటలు పారవశ్య భావం. దానికి సంకేతం. ఒక ఆనందపు అనుభవ స్థితిని ఇక్కడ చెప్తున్నారు. ఇవన్నీ గణపతి దగ్గర ఉండే పరివార స్వరూపాలు. ఇవి తన భక్తులకి అనుగ్రహిస్తూ ఉంటాడు స్వామి.
ఇలా ఉన్న గణపతిని నిత్యార్చనం కార్యం - నిత్యం అర్చించడం ప్రధానం సుమా! ఇలా ఎవరైతే ఆరాధిస్తున్నారో వారిని గణేశార్చన పరః సర్వ విఘ్నైః ప్రముచ్యతే; సర్వ సిద్ధిర్లభతే ధర్మార్థ కామమోక్ష బ్రహ్మ భూయాని లభతే ఇతి - వారు ధర్మార్థ కామ మోక్షములను పొందుతారు. ఇంకేం కావాలి జీవితానికి? నాలుగే పరమార్థములు. అంటే కాదు ఇప్పటివరకు చెప్పిన వల్లభేశ ఉపనిషత్తుని ఎవరు వింటారో ఎవరు నిత్యం అనుసంధానం చేస్తారో వారి స్థితి ఏమిటంటే "యేహం వల్లభోపనిషత్ అధీతే స సర్వ విఘ్నాత్ ప్రముచ్యతే; సర్వాభీష్టం లభతే; బ్రహ్మ ప్రాప్నోతి ఇతి ఉపనిషత్"; అంటే పరబ్రహ్మమును పొందుతారు.
బీజాపూర గదేక్షు కార్ముకరుజా చక్రాబ్జ పాశోత్పలా
వ్రీహ్యగ్ర స్వవిషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహః
ధ్యేయో వల్లభయా సపద్మకరయా శ్లుష్టోజ్వలద్భూషయా
విశ్వోత్పత్తి సంస్థితి కరో విఘ్నేశ ఇష్టార్ధ దః!!
పదకొండు చేతుల వాడు వల్లభా సమేతుడై చంద్రచూడుడు, త్రినేత్రుడు అయిన అరుణ విగ్రహుడు - ఎర్రని రంగుతో ఉన్నటువంటి ఆ మహాగణపతి యొక్క స్వరూపాన్ని సమస్త జగదాత్మకమై బ్రహ్మాత్మకమైన అభేదాకృతిని స్మరిస్తూ నమస్కరిస్తూ.. ___/\___

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML