గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 21 June 2014

ప్రతివారిలోనూ చైతన్యం వుంది. చైతన్యం వుంటేనే మనం ఇక్కడున్నాం. ఈ చైతన్యం చేస్తున్న పని ఏమిటి?

రాగ స్వరూప పాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా
మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్ర సాయకా!!
ప్రతివారిలోనూ చైతన్యం వుంది. చైతన్యం వుంటేనే మనం ఇక్కడున్నాం. ఈ చైతన్యం చేస్తున్న పని ఏమిటి? మనం ప్రపంచంతో అయిదింటితో సంబంధం పెట్టుకుంటాం ప్రధానంగా. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు - మన అనుభవాలన్నీ ఇవే. ఈ అయిదింటినీ మనం అనుభవించడం కోసం పంచజ్ఞానేంద్రియాలు, అయిదింటినీ సంపాదించడంకోసం పంచ కర్మేంద్రియాలు, ఉన్నాయి. ఇంద్రియాలెన్నున్నా వీటితో కలియవలసింది ఒకటి వుంది - మనస్సు. మనస్సు కలవకపోతే అనుభూతి లేదు. ఉదాహరణకి ఒక శబ్దం అక్కడ మ్రోగుతూనే వుంటుంది. కానీ చెవిన పడదు. అందుకే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు బాణాలలాంటివి అయితే మనస్సుతో అవి అనుసంధానించాలి. అందుకు మనస్సు ధనుస్సులాంటిది అయింది. అనుభవమంతా మనస్సు ద్వారానే మనం పొందుతాం. ఆ తీపి అనబడే అనుభవ స్వరూపం మనస్సుదే కనుక మనస్సును చెరకు విల్లుతో పోల్చారు. అందుకు ’మనోరూప ఇక్షు కోదండ’. దీనిని మనం అన్వయించుకోవక్కరలేదు. అక్కడే చెప్పారు. మన బ్రతుకంతా ఈ అయిదింటినీ మనస్సుతో అనుభవించడమే. అయితే ఈ అయిదింటిని అనుభవించేటప్పుడు మనలో రెండు రకాల భావాలు కలుగుతాయి. ఇష్టమైనవి పొందేటప్పుడు అనుకూల భావం, ప్రీతిభావం కలుగుతూ వుంటుంది. అనిష్టమైనవి పొందేటప్పుడు ప్రతికూలభావం, జుగుప్సా భావం కలుగుతుంది. ఈ భావాలలో Degrees తేడా వుంటూ వుంటాయి. కొన్నింటిపట్ల ఎక్కువ అనుకూల భావం, కొన్నింటిపట్ల ఆ మాత్రం కొన్నింటిపట్ల మధ్యమస్థాయి; అలాగే ప్రతికూల భావాలు కూడా కొన్నింటిపట్ల ఉదాసీనత, కొన్నింటిపట్ల తీవ్రమైన క్రోధం, కొన్నింటిపట్ల తలంచుకుంటే బెంగపడి Depression అయిపోవడం, ఇవన్నీ కూడా ప్రతికూల భావంయొక్క Shades. అనుకూలమైన వాటిని రాగము అంటాం. ఎందుకంటే అనుకూలమైన వాటిని కట్టి దగ్గర పెట్టుకుంటాం. ప్రతికూల భావం మనల్ని అంకుశంలా పొడుస్తూ వుంటుంది. అందుకని అనుకూల భావమైన రాగము ఆవిడ పాశంలా పట్టుకున్నది, ప్రతికూల భావాన్ని అంకుశంలా పట్టుకుంది. మొత్తం మన బ్రతుకు చైతన్యమంతా ఈ నాలుగు చేతులలో పట్టుకుంది అమ్మవారు. ఈ నాలుగు అందరికీ అనుభవంలో వున్నవే. శాస్త్రమూ ఉపనిషత్తులూ అక్కరలేదు. అనుభవంలో ఉందా? లేదా? శబ్దస్పర్శరూపరసగంధాలు - ఈ మాట వేదాంతశబ్దమే అయినా బ్రతుకులో ఉన్నవే కదా ఇవి! కనుక పంచతన్మాత్రలు మనస్సుతో కలిసి అనుభవించేది రాగద్వేషానుభవం. ఇంత చైతన్యం ఉందని అందరికీ తెలుసు. కానీ ఇంత చైతన్యం పనిచేయడానికి ఉండాల్సింది ఆత్మచైతన్యం. ఇవన్నీ పనిచేయడానికి ఆత్మచైతన్యం లోపల ఒకటుంది అని తెలుసుకోక తన్మయమై తిరుగుతున్నాం. నాలుగింటినే చూస్తూ కూర్చుంటే బహిర్ముఖత్వం, ఈ నాలుగు ఎవరిచేతిలో ఉన్నాయో తెలుసుకొని లోపలికి వెళితే అంతర్ముఖత్వం. "అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా". ఈ నాలుగింటినీ నడిపే చైతన్యం స్వాత్మశక్తి అని తెలిశాక ఇంక నేనెవరు? నేను అనే అహంకారం ఇప్పుడు ఆవిడలో లీనమైపోయింది. అలా అమ్మవారిని ఎవరు ఉపాసన చేస్తారో వాడు ఉత్తమశ్రేణి ఉపాసకుడు అని లలితాసహస్రానికి ముందు చెప్పే ధ్యాన శ్లోకం చెప్పింది.
అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపామ్,. 
అణిమాది భి రావృతాం మయూఖైః అహమి త్యేవ విభావయే భవానీమ్!!
ఆ భవానీదేవిని అహం - అని నేను భావన చేస్తున్నాను అన్నారు. అంటే మనలో ఉన్న నేను అనే చైతన్యం మనస్సుతో, పంచతన్మాత్రలతో కలగలసి రాగద్వేషాలనే భావాలతో కలసి వెళుతూంటుంది. ఇదే జీవితం. కానీ నేను అనే చైతన్యానికి మూలమేది? - ఆత్మశక్తి. ఇది గానీ గ్రహించితే ఒక చిత్రం జరుగుతుందిట. నువ్వు మనస్సు చేతిలోనో పంచతన్మాత్రల చేతిలోనో పడిపోకుండా అవి ఆవిడ చేతిలో వున్నాయి అని తెలుస్తాయి ఇక్కడ. మనం వాటి చేతిలో ఉంటే బంధం. ఆవిడ చేతిలో ఉన్నాయని తెలిస్తే అదే మనకి జ్ఞానహేతువు అవుతున్నది. ఇంత చైతన్యాన్ని నడుపుతూ మన హృదయపీఠంలో ఉన్నటువంటి స్వాత్మ చైతన్యమే లలిత. చైతన్యమే అసలు సౌందర్యం. విశ్వమంతా వ్యాపించిన సౌందర్యం ఏమిటంటే
"సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి
బుద్ధిం యానః ప్రచోదయాత్"
ఏ జగజ్జనని చైతన్యం చేత ఈ మనస్సు, పంచతన్మాత్రలు, ఇంద్రియములు, పనిచేస్తూ మనలో రాగద్వేషాది అనుకూల ప్రతికూల అనుభవములున్నాయో ఇన్నింటికీ హేతువైన మహా చైతన్య స్వరూపిణియైన అమ్మవారిని నేను ఉపాసిస్తున్నాను అని తెలుసుకోవాలి. అలా ఉపాసన చేయగా చేయగా అహం కాస్తా అమ్మలో లీనమవుతున్నది. అదే అసలైన లలితా ఉపాసాన.
No comments:

Powered By Blogger | Template Created By Lord HTML