గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 25 June 2014

ప్రపంచమునకు మూలం దైవము.

ప్రపంచమునకు మూలం దైవము. ఆరనిజ్యోతి ఆత్మజ్ణానజ్యోతి. జ్ఞానముతో దైవమును తెలుసుకొనవలెను. జ్ణానోపదేశమునకు మూలం గురువు. మానవులకు మూలం గురూపదేశము. దీని నుండి తత్వవిచారము చేసినచో ముక్తికలుగును.
ప్రపంచమంత ధర్మంమీదనే ఆధారపడినది. ప్రపంచాన్ని ధరించేది ధర్మము. ధర్మం నశిస్తే ప్రపంచమంతా పతనమైపోతుంది. ధర్మమునకు మూలం వేదం. ధర్మము ఆద్యంతాలులేనిది. దీనినే ధర్మము అంటారు. ఇదియే హిందూధర్మం. ఇట్టి భారతీయ సంప్రదాయము బహు విశిష్టమయినది.
ఇతర సంస్కృతులకు కర్త ఒకడుంటాడు. మన కర్త అనంతము. సర్వము నిండినవాడు. "ఓం" అను ఓంకారం సమస్త దిక్కులయందు నిండిపోయినది. అంతట దైవము ప్రకాశించుచుండును. జగత్తు అంతా దైవమయం. ఎక్కడ చూసినా అక్కడనే ఏ రూపములో చూసినా ఆ రూపములోనే ప్రత్యక్షమగునని నిరూపించిన మన దేశ ఋషులు గొప్పవారు. మన సంస్కృతికి మించినది లేదనుట అతిశయోక్తికాదు. డబ్బుకు దాసోహం కాకుండా వేదసంహితమైన సంప్రదాయమును మానవత్వంతో ప్రతి ఒక్కరూ గ్రహించవలెను.
పరిశుద్ధమైన మనస్సు, అంకితభావం, ప్రార్థన, ధ్యానం మాత్రమే సత్యాన్వేషణకు తోడ్పడుతాయి. కలియుగంలో నిజం చెప్పడం తపస్సు, సత్యస్వరూపమే భగవంతుడు. నిజం చెప్పేవాళ్ళకు భగవంతుడే దారి చూపిస్తాడు.
మనలోయున్న ఓర్పు, సహనము, క్షమ గుణం మరెక్కడా లభింపవు. దానికి కారణం ప్రపంచంలోనే విశిష్ఠమైన ధర్మము మనకు కలదు. "మనకు బాధ కల్గించుపనులను ఇతరులపైన ప్రయోగించరాదు" అను విశిష్టమైన హిందూధర్మము మన సంస్కృతిలోనే కలదు. ప్రపంచములో ప్రతి మనిషి మన ధర్మము గుర్తెరింగినచో సర్వకాలములందు ఈ ప్రపంచము ప్రశాంతతకు నిలయమని నొక్కి వక్కాణించుటలో సందేహములేదు.
'రా' అని పలుకగానే పాపరాశులన్నియు బహిర్గతమవుతాయి. 'మా' అని పలుకగానే పోయిన పాపము తిరిగి ప్రవేశించకుండ కవాటము బంధింపబడుచున్నది. ఇది సత్యమని బుధజనులు వక్కాణించారు.
మనదేశములో ఉన్న శాంతి మంత్రము మరి ఏ దేశములో కనిపించదు. మనలోని మానవత్వగుణము మరి ఏ దేశములో కనిపించదు. అందుకే మన దేశము సర్వ మతములకు నిలయమైనది.
దురాశ, విషయవాంఛలు, త్యజించడంవలన మనషి తీవ్రమైన ఉద్రేకాల నుండి విముక్తుడవుతాడు. తీవ్రవాదము తొలగి శాంతికల్గుటకు మన ధర్మం మూలం. ధర్మములో, సత్యములోను దైవము కలడు. వాటిని నిర్లక్ష్యము చేసినచో వారికి చేటు కలుగును. సమర్థులైనవారందరు వాటికొరకు కృషిచేయాలి.
'మానవ సేవయే మాధవ సేవ', దీనులపైన సానుభూతి చూపడం "మానవత్వం". ఆదుకొని రక్షించడమే 'దైవత్వం'.
మన దేశములో సద్గురువులు, సన్యాసులు, మొదలగువారి ఆదర్శములను ప్రతి ఒక్కరూ గ్రహించాలి. సత్యాన్వేషణము వల్లనే ప్రపంచములో శాంతి చేకూరును.
"లోకాస్సమస్తా సుఖినోభవంతుః"

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML