గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Wednesday, 25 June 2014

తలమీద కాకి తన్నితే దోషమా?

తలమీద కాకి తన్నితే దోషమా?
కొందరు కాకి తన్నితే భయపడిపోతారు. శని వాహనం కనుక శని పట్టుకోవటానికో, ఏదైనా దోషం జరగటానికో, లేక యముడు రాకకి సంకేతమో అని తెగ భయపడతారు. అలా భయపడాల్సిన అవసరంలేదు.
సాధారణంగా కాకి తన్నటం మనం ఎక్కువగా చూడం. ఏదన్నా తోటలకి వెళ్ళినప్పుడు అక్కడ పళ్ళకోసం తిరుగుతూ తన్నవచ్చు, అలాగే సముద్రతీరాన చేపలు ఆరబెట్టి వుంటాయి వాటికోసం తిరుగుతూ అక్కడకి వచ్చినవారిని తన్నవచ్చు.
కాకి చిన్న పక్షి అయినా బలంగా తన్నుతుంది. చాలా దెబ్బ తగులుతుంది. దానితో తలమీద తన్నినా దాని ప్రభావం శరీరం మొత్తంమీద వుంటుంది. ఒక్కోసారి కంటి చూపుకూడా ఎఫెక్ట్ కావచ్చు. దానితో భయపడతారు. మనకున్న నమ్మకాలవల్లకూడా ఇంకా కొంత భయపడతారు. తన్నింది కాకవటంతో ఇంకేమన్నా దోషం వుందేమోననే భయం. పైగా కాకి శని వాహనం కనుక శని దూతగా వచ్చిందేమోనని, ఏదో చెడు జరుగుతుందేమోనని భయం. శ్రాధ్ధ కర్మల సమయంలో కూడా కాకి పిండం అని పెడతారు. ఆ సమయంలో కాకి తన్నితే యమ సంకేతమని కంగారు పడతారు. నిత్య జీవితంలో ఏదో ఒకటి జరుగుతూనే వుంటాయి. వాటిని నమ్మకాలకి ముడిపెట్టి అనవసరమైన కంగారు పడకూడదు. ఒకవేళ ఇంకా ఏదో అనుమానం అనిపిస్తుంటే ఇంచక్కా శివాలయానికి వెళ్ళి, నువ్వుల నూనెతో దీపారాధన చేసి, అభిషేకం చేయిస్తే దోషం పోతుంది. కాకి తన్నటం వల్ల అనారోగ్యం చేస్తే డాక్టరుకి చూపించుకోవాలి.
ప్రతి సమస్యకీ పరిష్కారముంటుంది కనుక దేనికీ భయపడక్కరలేదు.
భక్తి సమాచారం

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML