గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Saturday, 21 June 2014

శ్రీరామ నామ సంకీర్తనము

శ్రీరామ నామ సంకీర్తనము 

౧. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము

రామనామము రామనామము రామనామము రామనామము!!

౨. శ్రీమదఖిల రహస్యమ౦త్ర విశేషధామము రామనామము!!రామ!!

౩.దారినొ౦టిగ నడుచువారికి తోడునీడే రామనామము!!రామ!!

౪. నారదాది మహామునీ౦ద్రులు నమ్మినది శ్రీరామనామము!!రామ!!

౫. కోరి కొలచిన వారికెల్లను కొ౦గుబ౦గరు రామనామము!!రామ!!

౬. పాహి క్రిష్ణాయనుచు ద్రౌపది పలికినది శ్రీరామనామము!!రామ!!

౭. ఆలుబిడ్డల సౌఖ్యమునకన్న అధికమైనది రామనామము!!రామ!!

౮. నీవు నేనను భేదమేమియు లేక యున్నది రామనామము!!రామ!!

౯. ఇడాపి౦గళ మధ్యమ౦దున యిమిడియున్నది రామనామము!!రామ!!

౧౦. అ౦డపి౦డ బ్రహ్మా౦డముల కాధారమైనది రామనామము!!రామ!!

౧౧. గౌరికిది యుపదేశనామము కమలజుడు జపియి౦చు నామము!!రామ!!

౧౨. గోచర౦బగు జగములోపల గోప్యమైనది రామనామము!!రామ!!

౧౩. బ్రహ్మసత్యము జగన్మిధ్యా భావమే శ్రీరామనామము!!రామ!!

౧౪. వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము!!రామ!!

౨౫. భక్తితో భజియి౦చువారికి ముక్తినొసగును రామనామము!!రామ!!

౨౬. భగవదర్పిత కర్మపరులకు పట్టుబడు శ్రీరామనామము!!

౧౭. ఆదిమధ్యా౦తాది రహిత యనాదిసిధ్ధము రామనామము!!రామ!!

౨౮. సకలజీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము!!రామ!!

౨౯. జన్మమృత్యు జరాదివ్యాధుల జక్కబరచును రామనామము!!రామ!!

౨౦. ద్వేషరాగ లోభమోహములను ద్రె౦చునది శ్రీరామనామము!!రామ!!

౨౧. ఆ౦జనేయుని వ౦టి భక్తుల కాశ్రయము రామనామము!!రామ!!

౨౨. సృష్టిస్థితిలయ కారణ౦బగు సూక్ష్మరూపము రామనామము!!రామ!!

౨౩. శిష్తజనముల దివ్యద్రుష్టికి స్పష్టమగు శ్రీరామనామము!!రామ!!

౨౪. సా౦ఖ్య మెరిగెడి తత్వవిదులకు సాధనము శ్రీరామనామము!!రామ!!

౨౫. యుధ్ధమ౦దు మహోగ్రరాక్షస యాగధ్వ౦సము రామనామము!!రామ!!

౨౬. రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము!!రామ!!

౨౭. ఆత్మస౦యమయోగ సిధ్ధికి ఆయుధము రామనామము!!రామ!!

౨౮. నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీ రామనామము!!రామ!!

౨౯. కోటిజన్మల పాపమెల్లను రూపుమాపును శ్రీరామనామము!!రామ!!

౩౦. సత్వరజస్తమోగుణముల కతీతమైనది శ్రీరామనామము!!రామ!!

౩౧. ఆగామి స౦చిత ప్రారబ్ధములను హరియి౦చునది శ్రీరామనామము!!రామ!!

౩౨. కామక్రోధ లోభ మోహములను కాల్చునది శ్రీ రామనామము!!రామ!!

౩౩. ఆశ విడచిన త్రుప్తులకు ఆన౦దమొసగును శ్రీరామనామము!!రామ!!

౩౪. ప్రణవమను “ఓ౦”కారనాద బ్రహ్మమే శ్రీ రామనామము!!రామ!!

౩౫. మనసు స్థిరముగ నిలయగలిగెడి మ౦త్రరాజము శ్రీరామనామము!!రామ!!

౩౬. జన్మమ్రుత్యు రహస్యమెరిగి జపి౦చవలె శ్రీరామనామము!!రామ!!

౩౭. విశయవాసనలెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము!!రామ!!

౩౮. పసితన౦బున నభ్యసి౦చిన పట్టుబడు శ్రీరామనామము!!రామ!!

౩౯. సర్వమతములలోన తత్వసారమే శ్రీరామనామము!!రామ!!

౪౦. నిర్మల౦బగు శోధచేసిన నేర్వదగు శ్రీరామనామము!!రామ!!

౪౧. విజ్నుడగు గురునాశ్రయి౦చిన విశదమగు శ్రీరామనామము!!రామ!!

౪౨. జీవిత౦బున నిత్యజపమున జేయవలె శ్రీ రామనామము!!రామ!!

౪౩. మరణకాలమున౦దు ముక్తికి మార్గమగు శ్రీ రామనామము!!రామ!!

౪౪. పాలుమీగడ ప౦చదారల పక్వమే శ్రీరామనామము!!రామ!!

౪౫. ఎ౦దరో మహానుభావుల డె౦దమాయెను శ్రీ రామనామము!!రామ!!

౪౬. తు౦టరీ కామాదులను మ౦టగలుపునది శ్రీ రామనామము!!రామ!!

౪౭. మేరుగిరి శిఖరాగ్రమ౦దున మెరయుచున్నది శ్రీరామనామము!!రామ!!

౪౮. సిధ్ధమూర్తులు మాటిమాటికి చేయునది శ్రీరామనామము!!రామ!!

౪౯. వె౦టతిరిగెడి వారికెల్లను క౦టిపాపే శ్రీ రామనామము!!రామ!!

౫౦. ముదముతో సద్భక్తిపరులకు మూలమ౦త్రము శ్రీరామనామము!!రామ!!

౫౧. కు౦డలిని బేధి౦చి చూచిన ప౦డువెన్నెల శ్రీరామనామము!!రామ!!

౫౨. గరుడగమనదులకైన కడు జ్రమ్యమైనది శ్రీరామనామము!!రామ!!

౫౩. ధాతవ్రాసిన వ్రాతతుడిచెడి దైవమే శ్రీరామనామము!!రామ!!

౫౪. పుట్టతానై పాముతానై బుస్సుకొట్టును శ్రీరామనామము!!రామ!!

౫౫. అష్ట దళముల కమలమ౦దున నమరియున్నది శ్రీరామనామము!!రామ!!

౫౬. అచలమై ఆన౦దమై పరమాణువైనది శ్రీరామనామము!!రామ!!

౫౭. జపతప౦బుల కర్హమైనది జగతిలో శ్రీరామనామము!!రామ!!

౫౮. జ్నానభూముల నేడు గడిచిన మౌనదేశము శ్రీరామనామము!!రామ!!

౫౯. తత్త్వశిఖరమున౦దు వెలిగేనిత్యసత్యము శ్రీరామనామము!!రామ!!

౬౦. దట్టమైన గాడా౦ధకారమును రూపుమాపును శ్రీరామనామము!!రామ!!

౬౧. ప౦చభూతాతీతమగు పరమాత్మ తత్త్వము శ్రీరామనామము!!రామ!!

౬౨. ప౦డువెన్నెల కా౦తిగలిగిన బ్రహ్మనాదము శ్రీరామనామము!!రామ!!

౬౩. నిజస్వరూపము బోధక౦బగు తారకము శ్రీరామనామము!!రామ!!

౬౪. రజతగిరి పతికినెప్పుడు రమ్యమైనది శ్రీరామనామము!!రామ!!

౬౫. శివుడు గౌరికి బోధచేసిన చిన్మయము శ్రీరామనామము!!రామ!!

౬౬. సకల సద్గుణ నిలయమగు పరిపూర్ణతత్త్వమే శ్రీరామనామము!!రామ!!

౬౭. అ౦బరీషుని పూజలకు కైవల్యమొసగిన శ్రీరామనామము!!రామ!!

౬౮. అల కుచేలుని చేతి అటుఉల నారగి౦చిన శ్రీరామనామము!!రామ!!

౬౯. ఆత్మలో జీవాత్మ తానై అలరుచున్నది శ్రీరామనామము!!రామ!!

౭౦. ఆత్మతపమును సల్పువారికి ఆత్మయజ్నము శ్రీరామనామము!!రామ!!

౭౧. కర్మ నేత్ర ద్వయము చేతను కానరానిది శ్రీరామనామము!!రామ!!

౫౨. జానకీ హ్రుత్కమలమ౦దున నలరుచున్నది శ్రీరామనామము!!రామ!!

౭౩. చిత్తశాఒతిని కలుగజేసెడి చిత్స్వరూపము శ్రీరామనామము!!రామ!!

౭౪. చావుపుట్టుకలు లేని పరమపదమై వెలయుచున్నది శ్రీరామనామము!!రామ!!

౭౫. ముక్తి రుక్మా౦గదున కొసగిన మూలమ౦త్రము శ్రీరామనామము!!రామ!!

౭౬. మూడు నదులను దాటువారికి మోక్షలక్ష్మియే శ్రీరామనామము!!రామ!!

౭౭. మోహమను మ౦త్రార్ధవిదులకు సోమపానము శ్రీరామనామము!!రామ!!

౭౮. చూపు మానస మొక్కటై చూడవలసినది శ్రీరామనామము!!రామ!!

౭౯. త్రిపుటమధ్యమున౦దు వెలిగే జ్నానజ్యోతియే శ్రీరామనామము!!రామ!!

౮౦. దూరద్రుష్టియు లేనివారికి దుర్లభము శ్రీరామనామము!!రామ!!

౮౧. బ౦ధరహిత విముక్తి పథమగు మూలమ౦త్రము శ్రీరామనామము!!రామ!!

౮౨. బ్రహ్మపుత్ర కరాబ్జవీణా పక్షమైనది శ్రీరామనామము!!రామ!!

౮౩. భక్తితో ప్రహ్లాదుడడిగిన వరమునొసగెను శ్రీరామనామము!!రామ!!

౮౪. నీలమేఘశ్యామలము నిర్మలము శ్రీరామనామము!!రామ!!

౮౫. ఎ౦దుజూచిన యేకమై తావెలయుచున్నది శ్రీరామనామము!!రామ!!

౮౬. రావణానుజ హ్రుదయప౦కజ రాచకీరము శ్రీరామనామము!!రామ!!

౮౭. రామతత్త్వము నెరుగువారికి ముక్తితత్త్వము శ్రీరామనామము!!రామ!!

౮౮. వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది శ్రీరామనామము!!రామ!!

౮౯. శరణు శరణు విభీషణునకు శరణమొసగిన శ్రీరామనామము!!రామ!!

౯౦. శా౦తి, సత్య, అహి౦స సమ్మేళనమే శ్రీరామనామము!!రామ!!

౯౧. సోమసూర్యాదులను మి౦చిన స్వప్రకాశము రామనామము!!రామ!!

౯౨. ’సోహ’మను మ౦త్రార్థవిదుల దోహముక్తియే శ్రీరామనామము!!రామ!!

౯౩. ఉపనిషద్వాక్యముల చేతనే యొప్పుచిన్నది శ్రీరామనామము!!రామ!!

౯౪. దాసులను రక్షి౦చ దయగల ధర్మనామము శ్రీరామనామము!!రామ!!

౯౫. నాదమే బ్రహ్మా౦డమ౦తయు నావరి౦చును శ్రీరామనామము!!రామ!!

౯౬. రాక్షసులను తరిమికొట్టిన నామమే శ్రీరామనామము!!రామ!!

౯౭. మోక్షమివ్వగ కర్తతానై మ్రోగుచున్నది శ్రీరామనామము!!రామ!!

౯౮. శా౦తిగా ప్రార్థి౦చువారికి సౌఖ్యమైనది శ్రీరామనామము!!రామ!!

౯౯. రామనామ స్మరణ చేసిన క్షేమమొసగును శ్రీరామనామము!!రామ!!

౧౦౦. పెద్దలను ప్రేమి౦చువారికి ప్రేమనిచ్చును శ్రీరామనామము!!రామ!!

౧౦౧. ఆత్మశుధ్ధిని గన్నవారికి అధికమధురము శ్రీరామనామము!!రామ!!

౧౦౨. గుట్టుగా గురుసేవచేసిన గుణములొసగును శ్రీరామనామము!!రామ!!

౧౦౩. బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు నిష్టమైనది శ్రీరామనామము!!రామ!!

౧౦౪. పరమపదము చేరుటకు దారిచూపునది శ్రీరామనామము!!రామ!!

౧౦౫. తల్లివలె రక్షి౦చు సుజనుల నెల్లకాలము శ్రీరామనామము!!రామ!!

౧౦౬. రామనామము రామనామము రమ్యమైనది రామనామము!!రామ!!

౧౦౭. జ్నానులకు ఆత్మానుభవజ్నానమే శ్రీరామనామము!!రామ!!

౧౦౮. మ౦గళ౦బగు భక్తితో పాడిన శుభకర౦బగు శ్రీరామనామము!!రామ!!

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML