గమనిక :

మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు . ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
గమనిక : మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు తెలుగుబంధు2, అందుబాటులో ఉంది దానిపై నొక్కి, మరింత సమాచారం పొందకలరు ( తెలుగుబంధు ఎటువంటి విరాళాలు, దాన ధర్మాలు, ఆశించదు) , మరియు స్వీకరించదు. ( ఎటువంటి జాతక సంబంధ విషయాలు పంపవద్దు, జాతక బలము కన్నాను దైవ బలము చాల శక్తివంత మయినది, కావున దేవుని ప్రార్ధించండి, ఆయన కృపకు పాత్రులు కండి). ( మీ యొక్క సందేహాలు, సమస్యలు , సలహాలు మాకు తెలుపుటకు. E-Mail : telugubandhu@gmail.com , kishoreor777@gmail.com . PH:7660049327.)

Tuesday, 17 June 2014

ఒక గ్రామంలో

ఒక గ్రామంలో గోపయ్య అనే ఒక వడ్రంగి వుండేవాడు. చాలారోజుల క్రితమే అతని తల్లి మరణించింది. వృద్ధుడైన తండ్రి రామయ్య ఇతనితోనే కలిసి వుంటూ వుండేవాడు. గోపయ్య సరియైన తిండి పెట్టక రామయ్య నడిచేందుకు కూడా ఓపిక లేక చాలా నీరసంగా వున్నాడు. అతను తన తండ్రికి మట్టితో తయారుచేసిన ప్లేటులో కొంచెం పెట్టి చాలా పెట్టినట్లుగా అనుకుంటూ వుండేవాడు. గోపయ్య చాలా చెడ్డవాడు, వ్యసనపరుడు కూడా. మద్యం సేవించి తండ్రిని దుర్భాషలాడేవాడు.
ఆ గోపయ్యకు ముత్తు అనే పదిసంవత్సరాల కొడుకు వుండేవాడు. చాలా మంచివాడు, తాతయ్య పట్ల ప్రేమతో వుంటూ ఆయనపట్ల గౌరవంగా వుండేవాడు. తన తాతగారి పట్టి తండ్రి గోపయ్య ప్రవర్తన ముత్తుకు అస్సలు నచ్చేది కాదు.
ఒకరోజు రామయ్య మట్టిపాత్రలో తన కొడుకు పెట్టిన ఆహారాన్ని తింటుండగా చెయ్యి జారి క్రిందపడి ప్లేటు ముక్కలయ్యి ఆహారం కూడా నేలపాలైంది. అదే గదిలో పనిచేసుకుంటున్న గోపయ్యకు అది చూసి బాగా కోపంతో పరుషపదాలతో తండ్రిని తిట్టడాం మొదలుపెట్టాడు. రామయ్య జరిగిన తప్పుకు క్షమాపణ కోరాడు. కొడుకు మాటలు అతనిని ఎంతో బాధపెట్టాయి.
గోపయ్య కొడుకు ముత్తు ఇదంతా గమనిస్తూ వున్నాడు. గోపయ్య పద్ధతి ముత్తుకు నచ్చలేదు. తండ్రికి ఎదురుచెప్పడానికి భయపడేవాడు. రామయ్యకు అండగా నిలబడడానికి ధైర్యం చాలేది కాదు.
తరువాతి రోజు ముత్తు ఒక ప్లేట్ తయారు చేయడానికి తన తండ్రి వడ్రంగి సామాను, చెక్క ముక్క తీసుకున్నాడు. గోపయ్య ఇదంతా గమనించాడు.
"ఏం చేస్తున్నావు? అని ముత్తును అడిగాడు.
"చెక్క ప్లేట్ తయారుచేస్తున్నాను" ముత్తు సమాధానమిచ్చాడు.
"చెక్క ప్లేట్! ఎందుకోసం?" గోపయ్య అడిగాడు.
"నీ కోసమే చేస్తున్నాను నాన్నా. నువ్వు తాతగారి లాగా పెద్దయ్యాక తినడానికి నీకూ ఒక ప్లేట్ కావాలి కదా! మట్టితో చేసినది తేలికగా పగిలిపోతుంది. అప్పుడు నేను నిన్ను బాగా తిట్టవలసి వస్తుంది. అందుకని చెక్కప్లేట్ ఇవ్వదలచుకున్నాను. అదైతే తేలికగా పగలదుకదా!"
ఇది విన్న గోపయ్య ఒక్కసారి అదిరిపోయాడు. తన తప్పు తెలుసుకుని అప్పటినుంచి తండ్రిని గౌరవంగా చూసుకోవడం ఆరంభించాడు. తన కొడుకు నుంచి మంచి గుణపాఠాన్ని నేర్చుకున్నాడు గోపయ్య.
తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. అది నీ కర్తవ్యం. అది వారి ఆశీస్సులను మీకు లభించేలా చేస్తుంది.

No comments:

Powered By Blogger | Template Created By Lord HTML